Rayala varu Golla Kulasthula? Asalu Gollalu Evaru?

Rayala varu Golla Kulasthula? Asalu Gollalu Evaru? రాయల వారు గొల్ల కులస్తులా? అసలు గొల్లలు ఎవరు? పూర్తి వివరాలు ఆధారాలతో సహా తెలుసుకోండి.

Jan 18, 2025 - 07:17
Updated: 1 year ago
0 69
Rayala varu Golla Kulasthula? Asalu Gollalu Evaru?

రాయల వారు గొల్ల కులస్తులా? అసలు గొల్లలు ఎవరు?

ఆముక్త మాల్యద చతుర్థాశ్వాసము 206వ పద్యము, యమునాచార్యుడు తన కుమారునికి రాజనీతి బోధించే సందర్భంలోనిది.

ఆజ్ఞవలయునృపతి కాభీరభిల్లాది
కంపకోల నూల నాజ్ఞ చెల్లు
నంట ; సార్వభౌముడైన భూపతియాజ్ఞ
కెల్లవారు తల్లడిల్ల వలదె ?

ఈ పద్యానికి పండితులు చెప్పిన అర్ధం ఛందోబద్దంగా తీసుకుంటే

అడవులలో నివసించే అబీర, బిల్ల జాతులు అనగా గొల్లలు, బోయలకు రాజు ఆజ్ఞగా ఒక బాణాన్ని కానీ, ఒక నూలు పోగును కానీ ఇచ్చినట్లయితే వారు రాజాజ్ఞకు కట్టుబడి ఉంటారు… సార్వభౌముడైన రాజు ఆజ్ఞకు ఎల్లవేళలా వారు తల్లడిల్లాలి అని అర్ధం.

నేటితరం రాయల వంశీయులైన అన్నయ్యగారి వారు కూడా తమను గొల్ల, బోయలు అనడం తీవ్రంగా వ్యతిరేకించారు. వారు క్షత్రియ బలిజలమని స్పష్టం చేసారు.

పద్యము: 223

విల్లుందానును భిల్లుడొక్కడరుగన్విందింట దుగ్గాన్నమున్
భిల్లుండన్యుడుపెట్ట, నారయుడుకన్ వీక్షించి దొబ్బంచువా
డెల్లన్వమ్ముగజేసి తన్నను పరా, నెందేతెగం జూడగా
ఉల్లంబైచననంపు నారచెడు నానూహించి పోనం పడే

ఇక పద్యము 209 ని పరిశీలిద్దాం!

అనభిజాతు కీకటాలయు నశ్రుతు
నలుకుమాని బొంకు పలుకువాని
నాతతాయి, గడుసు, నన్యదేశ్యు - నధర్ము
విడువు విప్రునేలవేడితేని

బోయ పల్లెలో నివసించే బ్రాహ్మణుడికి సైతం రాజస్థానంలో నివసించే అర్హత లేదని… రాజెదురుగా బోయలను వణుకుతూ నిలబెట్టాలని … అతి చిన్న విషయానికి కూడా తీవ్రంగా స్పందించే బోయలు ప్రమాదకారులని చెప్పిన శ్రీకృష్ణదేవరాయలు బోయ కులస్తుడు ఎలా అవుతాడు ?

ఆభీరుడు అనే పదానికి అన్ని నిఘంటువులు గొల్లవాడు అనే అర్థాన్నే ఇచ్చాయి. అంటే గొల్ల వారిని,.. ఎక్కడా కూడా వారు రాచరికులు అనే అభిప్రాయాన్ని ఆయన వెల్లడించలేదు. రాయలు నిజంగా గొల్ల కులానికి చెందిన వాడయితే పశుపాలకులైన గొల్ల బోయ కులస్తులతో సమానంగా ప్రస్తావిస్తాడా… వారు రాజాజ్ఞకు తల్లడిల్లాలంటాడా…

చరిత్రలో ఇప్పటి వరకు ఏ కులం వారైనా సరే తన కులాన్ని తక్కువ చేసి చూపడం జరిగిందా??? ఇక్కడ రాయలు గొల్ల కులస్తుడైతే గొల్లలను బిల్లజాతులతో సరి సమానంగా చూస్తాడా… పారిజాతాపహరణంలో నందితిమ్మన చెప్పినట్లు కృష్ణదేవరాయలు తన కులస్తులకు పెద్దపీట వేశాడు. మరి గొల్ల కులస్తులను…???

- దూపం అభిమన్యుడు

గొల్లలు అమృత గోవిందుని సంతానం - శాసనం

నెల్లూరు జిల్లా శాసనాలలోని ఈ శాసనం నేటి ప్రకాశం జిల్లా లోని గుండ్లపాలెం లో బ్రహ్మ మహేశ్వర దేవాలయం వద్ద నాలుగువైపులా శాసనం ఉంది… ఎర్రగొల్ల కులానికి చెందిన కాటను రాజుకు సంబంధించిన శాసనం గా దీన్ని పరిగణిస్తారు. - కానీ కాటమరాజు ఈ శాసనాన్ని వేయలేదు.

ఇది రెండవవైపు శాసనం

  1. అజుFనుండ్డు ద్వారావతికి వచ్చి
  2. వసుదేవునింగని శ్రీకృష్ణు పరమ
  3. మూత్తిFం. గలసె. ఆధవులు, దేవగణానం
  4. గలసిరి ద్వారావతివ నది ముంచ్చునని
  5. ఆక్షణమే బాలవ్రిద్దులాను, అక్షురాంగ్గన
  6. లాను; గోపాంగ్గన లాను, గొంచు
  7. అజుFనుండు యింద్ర ప్రస్థకుండె
  8. చ్చెను. || అ(యా)ధవ కుల కరుండైన వజ్రధరునిం
  9. బట్టంబు గట్టెను || యాదవ గోపికా పౌతృని
  10. నేమించ్చి గోవులకు గోరక్ష పాలకునిం
  11. జేసి గోవులంగా పాడుమని ఘనవీర పురంబున
  12. అమృత గోవింద్దుని అభిషిక్తుని జేసెను.
  13. యాదవుల అందరిని అక్కడక్కడ నిలిపి
  14. అజు౯ నుండు అస్తినాపురికి బోయి దమ౯జుకు
  15. యెరింగించ్చెను. యాదవులు పాండవులు స్వగా౯ని
  16. బోగానకుబోయిన వెనుక నన్నూరు యేండ్లకు
  17. కలియుగము జొచ్చెను । వజ్రధరుని పుత్రుండు
  18. దదినంగ్గు(డనంగ), గోపికల పౌత్రకులవంశకరులు
  19. బృందావనమునంబ్రది వించెం పొద్ది 'నంద
  20. ప్రజంబ్బుకు నలినొప్పుచుండ్డు ॥ ఆవుల మేపు తనలరి
  21. గోపకులురైవతాచలమున రంజిల్లుచున్న

పై శాసనము అర్థం:

అర్జునుడు ద్వారావతి వద్దకు వచ్చి, వసుదేవ, శ్రీకృష్ణులను కలిసి యాదవులను, దేవగణాలను కలిసి, ద్వారావతి నది ముందుకొస్తుందని ఈ క్షణమే! పిల్లలను, వృద్ధులను, స్త్రీలను, రాజసంతతివారిని గోపికల సంతతివారిని తీసుకొని అర్జునుడు ఇంద్రప్రస్థ పురమునకు వచ్చి యాదవకుల క్షత్రియుడైన వజ్రదరునికి ఇంద్రప్రస్థ రాజ్యంలో కొంతభాగమునకు రాజ్యపట్టాభిషిక్తుని చేశాడు. గోపికల సంతతివారిని పిలిచి గోవులకు, గోరక్షపాలకులను చేసి, గోవులను కాపాడుమని “ఘనవీరపురము” ప్రాంతము అమృత గోవిందునకు అప్పచెప్పెను. యదువంశక్షత్రియులను గోపాలురను అక్కడక్కడ నిలిపి అర్జునుడు హస్తినాపురికి పోయి ధర్మరాజుకు విషయం వివరించాడు. పాండవులు స్వర్గానికి పోయిన 400 సం||రాలకు కలియుగం వచ్చింది. పై శాసనంలో యదువు కులస్థుడైన వజ్రధారుడు రాజ్య పాలకుడైనాడు. యాదవ గోపిక సంతతివాడైన అమృత గోవిందుడు గోరక్షకుడైనాడు. యదువంశ క్షత్రియుడైన శ్రీకృష్ణుడికి 16 వేలమంది గోపికలలో పేరు తెలియని ఒక గోపిక, అమృత గోవిందుని సంతతివారు మాత్రమే యాదవ గొల్లలుగా పిలువ బడినాడు. గొల్లలందరూ యాదవులు కారు (శ్రీ కృష్ణుడి కంటే ముందే గొల్లకులముంది).

యదువంశ క్షత్రియుడు వజ్రధరుని సంతతివాడు దదినాగుడు అనువాడు రాజ్యపాలకులుగా ఉండెను. తర్వాత శ్రీకృష్ణుడు అతని భార్యల సంతతిలో పురుష వంశం అంతరించి ఉండవచ్చును (కుమార్తెల సంతతి ఉందేమో తెలియదు) గోపికల సంతతివారు గోవులను రక్షించుకుంటూ, బృందావనం పోయి దానికి “నందవ్రజపురం”గా పేరుపెట్టుకొని ఆవుల మేతకు గోపాలురు “రైవతాచల” పర్వత ప్రాంతమున స్థిరపడిరి.

పై శాసనము వలన యదువంశ క్షత్రియులు అయిన శ్రీకృష్ణుడు రాజకుమార్తెలు తన ఎనిమిది మంది భార్యలు సంతతివారు రాజ్యపాలకులయినారు. - శ్రీకృష్ణుడు గోపికల సంతానము గోరక్షకులు, గోపాలురు, గొల్లలు అయినారని శాసనం చెబుతుంది. మరియు యదువంశ చరిత్ర చెబుతుంది. చరిత్రకు శాసనాలు, పురాతన గ్రంథాలు, ఇతిహాస సాహిత్యం ఆధారం.

కృతయుగం నాటి, యదువు, తుర్వసుడు అన్నదమ్ములు ఒకే కులంవారు - వీరు యదు వంశ క్షత్రియులుకాని, క్షాత్ర ధర్మమే లేకుండా గొల్ల కులస్థులు, యదువంశ క్షత్రియులెలా అవుతారు?
ద్వాపరయుగాంతములో వ్యవసాయం (కాపులు), వాణిజ్యం (క్షత్రియ బలిజ) పశు పోషణ ఇవి వైశ్య ధర్మం - ఇందునుండి పశుపోషకులు - ఆవులు మేపుకుంటూ గొల్ల కులస్థులు అను ప్రత్యేక కులమేర్పడి ఉండవచ్చునని నా అభిప్రాయం.

వర్మ, శర్మ, రెడ్డి, నాయుడు, శెట్టి, చౌదరి, యాదవ, గౌడ, పటేల్, రాయలు, రాజు, పాత్రుడు, శాస్త్రి మొదలగునవి అధికార బిరుదులు. కృతయుగ కాలము నాటి నుండి 56 దేశాలు పాలించి 96 తెగలు కలిగి, 56 దేశాలలో వాణిజ్యం చేసి 56 దేశాలకు దేశాయి, దేశాయిశెట్టి (18 నుండి 60 కులాలకు పెద్దలుగా (తీర్పులు, శిక్ష, పన్నులు వసూలు) చేయు పెద్దలుగా ఉండి ఆ బిరుదులు ధరించి తర్వాత కాలాలలో ఈ బలిజ కాపుల నుండి అనేక కారణాలతో విడిపోయినవారు ప్రత్యేక గుర్తింపు కోసం పెట్టుకున్న గౌరవ బిరుదులు మాత్రమే. ఇవి కులాలు కాదు. ఇపుడు, రెడ్డి రాజులు, బలిజ కాపు, రాజులు, కమ్మరాజులు, వెలమరాజులు అని చెప్పుకుంటున్నారు గదా! అట్లాగే గొల్లరాజులని చెప్పవచ్చు. (యాదవ రాజులు గొల్లలెట్లా అవుతారు) ఎప్పుడు కులమేర్పడుతుందో ఆనాటి నుండి ఈనాటి వరకు గొల్లకుల చరిత్ర ఉంటుంది. మనం ఆది మానవులనుండి వచ్చామని మరలా వెనక్కుపోలేము గదా!

యదువు తుర్వసులు అన్నదమ్ములు ఒకే కులం వారు. యదువు సంతతివాడైన శ్రీకృష్ణుడు (యదువు, శ్రీకృష్ణుడు ఇద్దరూ బలిజ క్షత్రియులని శాసనముంది) యదువు తమ్ముడు తుర్వసుడి సంతతివారమని తుళువవారికి శాసనముంది. తుర్వసుడి వంశ తుళు వ శ్రీకృష్ణదేవరాయలు బలిజ క్షత్రియుడు. యదువు సంతతి వాడు శ్రీకృష్ణుడు. తుర్వసుడి సంతతి వాడు శ్రీకృష్ణ దేవరాయలు - ఇద్దరూ క్షత్రియ బలిజలు. చరిత్రకు శాసనాలే ఆధారం - యదువు, తుర్వసుడు అన్నదమ్ములు ఒకే కుటుంబంవారు.

వంశము వేరు - కులం వేరు : అత్రి భార్య అనసూయ దంపతుల కుమారుడు చంద్రుడు. ఇతని కుమారుడు బుధుడు కుమారుడు పురూరవుడు. సంతతివాడు యయాతి మహారాజు. ఇతని కుమారుడు యదువు, తుర్వసుడు అనువారు - ఇది యదువు మహారాజు కులము - వీరు కాపు క్షత్రియులు యదువంశం అనగా యదువు తర్వాత కాలం. యదువు వంశములోనివాడు వృష్టి. ఇతని సంతతివాడు శూరసేనుడు. మహిష్మతి రాజు ఇతని కుమారుడు వసుదేవుడు (యువరాజు) ఇతని కుమారుడు శ్రీకృష్ణుడు (యదువంశ కాపు క్షత్రియుడు) గొల్ల కులస్థుల ఇంట పెరిగాడు. తర్వాత తన కన్నతల్లిదండ్రుల వద్దకెళ్ళాడు. తర్వాత మధురానగరం నుండి ద్వారకా చేరి అక్కడ వివాహం చేసుకున్న ఎనిమిది భార్యలైన రాజకుమార్తెలు, 16 వేల మంది రాచకన్యలు, 16 వేల మంది గొల్ల భామలతో జీవించాడు. వారిలో క్షత్రియ కన్య అయిన రుక్మిణీదేవి కుమారుడు ప్రద్యుమ్నుడు కుమారుడు అనిరుద్ధుడు భార్య ఉషాదేవి (బలిజ క్షత్రియరాజు బాణరాజు కుమార్తె) వీరి కుమారుడు వజ్రధరుడు కుమారుడు దిదినాగుడు. ఇంతటితో శ్రీకృష్ణుడి మగసంతతివారు లేరు. వీరు బలిజ కాపు క్షత్రియులు - యదువంశ కాపు క్షత్రియుడైన శ్రీకృష్ణుడికి 16 వేల మంది గోపికలలో పేరు తెలియని గోపకాంత సంతతివాడు. అమృత గోవిందుడు (పశువుల కాపరి అతని సంతతివారు ఎర్రగొల్లలు) సంతతివాడే. కాటమరాజు - వీరు యదువంశీయుమని యాదవ గొల్లలమని చెప్పుకున్నారు. ఈనాటికి రిజర్వేషన్-B-2- లో యాదవ గొల్ల అని వుంది. కృతయుగము కాలము నాటి యదువంశములో ఎన్నో కులాలు ఏర్పడినవి. ఎవరు చేయు వృత్తిని బట్టి కులంగా పిలిచారు. యాదవ గొల్లలు యాదవ మత్స్యకారులు కూడా వున్నారు. కులం అనగా యదువుకు ముందుకాలము వంశ మనగా యదువు తర్వాత కాలము.

– భట్టరుశెట్టి పద్మారావు రాయలు

Rayala varu Golla Kulasthula? Asalu Gollalu Evaru?

Rayala varu Golla Kulasthula? Asalu Gollalu Evaru? రాయల వారు గొల్ల కులస్తులా? అసలు గొల్లలు ఎవరు? పూర్తి వివరాలు ఆధారాలతో సహా తెలుసుకోండి.

tuluva dynasty | sri krishnadevaraya thalli vamsamu | sri krishna devarayalu balija kshatriyudu | sri krishna devarayala varasulu | sri krishnadevaraya family | kapu community

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User