Gajula Balija

Gajula Balija (గాజుల బలిజలు). అసలు గాజుల బలిజలు ఎవరు? ఆ పేరు ఎలా వచ్చింది. గాజుల బలిజ చరిత్ర చదివి తెలుసుకోండి.

Gajula Balija

గాజుల బలిజలు

గాజుల బలిజలు అని పిలువబడుటకు కారణం గాజుల వ్యాపారమే. జీవితము నడుపుటకు అనేక వృత్తుల నాశ్రయంపవలసివచ్చి బలిజలు గాజుల వ్యాపారము చేయుటవలన ఈ నామము గలిగినది. గాజుల వృత్తి చేయుటకు మరోగాధ కూడ గలదు.

భూలోకమున సుమంగళులగు స్త్రీలను మంగళ ప్రదమైన రూపలావణ్యముల గలిగించుటకై పూర్వ మొకప్పుడు గౌరీదేవి శివుడిని కోరెను. అందులకు శంకరుడు హర్షించి కైలాసమున యజ్ఞము చేయ, ఆ యజ్ఞ గుండము నుండి ఒక మహాపురుషుడు గాజుల మల్లారములతో జనించి పార్వతీ పరమేశ్వరుల సన్నిధికి వచ్చెను. అంతట పార్వతీ దేవి పుత్ర వాత్సల్యమున నాదరించి భూలోకమున గల సుమంగళులకు హస్తభూషణముల నేర్పరుచు మనియు, ఏ స్త్రీ, యైనను గాజులు తొడిగించు కొనుటకు స్పృశింపబడినను ఆమె పాతి వ్రత్య భంగమును బొందజాలదనియు, లోకమాతయగుతానే స్త్రీ స్వరూపధారిణిననియు, తనసుతుడు తన కర్తము స్పృశించిన దోషముండదనియు వరముల ప్రసాదించి పంపెను. ఆ సంతతివారే గాజుల వ్యాపారులైరి. ఈ గాధ వలన బలజలు గాజుల వ్యాపారము చేసి తాము గౌరీ పుత్రులమని చెప్పుకొనడము ఆచారమైనది. మధుర పాండ్య రాజు లనంబరగిన నాయక రాజన్యులును గాజుల బలిజలని తెలియుచున్నది.

గాజుల బలిజలు ఆంధ్రదేశము అన్ని జిల్లాలలో నున్నారు. వీరిప్పుడు చాలామంది రాను రాను ఈ వృత్తివదిలి భూజీవనము వలనను, ఉద్యోగమువలనను, యితర వ్యాపారము వలనను కాలము గడుపుచున్నారు. నేడు గాజుల వ్యాపారము' తదితర కులమువారు కూడ చేయుట ప్రారంభించారు. నేటి వృత్తి పోటీలో తట్టుకొని మొదటివృత్తికే కట్టుపడి జీవించుట కష్టం. గాజుల బలిజలు నామాంతమును శెట్టి, నాయుడు అను బిదరుములు పెట్టుకొని పిలవబడుచున్నారు.

- దుమ్ము గురుమూర్తి నాయుడు

Gajula Balija History Telugu

gajulabalija history telugu | balija clan surnames | kapu history telugu | kapu community