Pawan Kalyan Biography | పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ
పవన్ కళ్యాణ్ – సినీ నటుడు, జనసేన నాయకుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి. ఆయని పూర్తి జీవిత చరిత్ర, సినిమాలు, రాజకీయ జీవితం గురించి తెలుసుకోండి.

పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర (Biography of Pawan Kalyan in Telugu)
Name | Konidela Pawan Kalyan |
Date of Birth | September 2, 1968 |
Place of Birth | Bapatla, Andhra Pradesh |
Parents | Konidela Venkata Rao (Father), Anjana Devi (Mother) |
Spouses | Nandini (1997 - september 1999, divorce 2008), Renu Desai (2009 - divorce 2012), Anna Lezhneva (2013) |
Children | Akira Nandan, Aadhya, Mark Shankar Pawanovich, Polena Anjana Pawanova |
Siblings | Chiranjeevi, Nagendra Babu |
Profession | Actor, Director, Producer, Politician |
Political Party | Jana Sena Party |
Caste | Kapu |
Current Position | Deputy Chief Minister of Andhra Pradesh, MLA from Pithapuram Constituency |
Social Media | Facebook | Instagram | Twitter |
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. ఆయన 1968 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లలో జన్మించారు. సినీ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, మరియు రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా కూడా సేవలందిస్తున్నారు.
బాల్యం & కుటుంబం
పవన్ కళ్యాణ్, కొణిదెల వెంకటరావు మరియు అంజనాదేవి గారి మూడవ కుమారుడు. ఆయనకు అన్నయ్యలు చిరంజీవి మరియు నాగేంద్రబాబు ప్రసిద్ధ సినీ నటులు. పవన్ బాల్యంనుంచి కరాటేలో ఆసక్తి కలిగి ఉండి బ్లాక్ బెల్ట్ సాధించారు. మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకు విశేష ప్రావీణ్యం ఉంది. ఆయన నటుడు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్‌కు చిన్నాన్న, అల్లు అర్జున్‌కు మామయ్య.
సినిమా కెరీర్
పవన్ కళ్యాణ్ 1996లో "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1998లో ఆయన నటించిన "తొలిప్రేమ" సినిమా జాతీయ అవార్డు గెలుచుకుంది. ఆయనకు "పవర్ స్టార్" అనే బిరుదు అప్పటినుంచి అభిమానుల ప్రేమను చాటుతుంది.
ప్రముఖ చిత్రాలు:
- తమ్ముడు (1999)
- ఖుషి (2001)
- జల్సా (2008)
- గబ్బర్ సింగ్ (2012)
- అత్తారింటికి దారేది (2013)
- భీమ్లా నాయక్ (2022)
గబ్బర్ సింగ్ సినిమాకు పవన్ కళ్యాణ్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందారు. అలాగే, అత్తారింటికి దారేది కూడా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది.
నిర్మాత & దర్శకత్వం
పవన్ గారు తనే స్వయంగా దర్శకత్వం వహించిన "జానీ" (2003) వంటి చిత్రాలు కూడా చేశాడు. సినిమాల్లో నటించడమే కాదు, తన సొంత బ్యానర్లైన "అంజనా ప్రొడక్షన్స్", "పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్" ద్వారా సినిమాలను నిర్మించాడు. ఆయన తన అభిమానుల మధ్య “పవర్ స్టార్”గా గుర్తింపు పొందారు.
రాజకీయ జీవితం
2008లో రాజకీయాల్లోకి ప్రవేశించిన పవన్ కళ్యాణ్, తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2014లో ఆయన జనసేన పార్టీని స్థాపించి ప్రజల సమస్యలపై చురుకుగా మాట్లాడటం మొదలుపెట్టారు.
- 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించి ప్రచారం చేసారు.
- 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేయగా పవన్ గారు గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుండి ఓడిపోయారు.
- 2024లో టీడీపీ-బీజేపీతో కలిసి పోటీ చేసి, పిఠాపురం నియోజకవర్గం నుండి 72,000 ఓట్లకు పైగా భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2024 జూన్ 12న ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పంచాయతీరాజ్, అటవీ, పర్యాటక, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా శాఖల బాధ్యతలు స్వీకరించారు.
జనసేన పార్టీ లక్ష్యం
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రజా హితాన్ని మించిన ఏ వ్యవస్థనూ సమర్థించదు. ఆయన ఇజం అనే పుస్తకాన్ని రచించి, పార్టీ యొక్క సిద్ధాంతాలను స్పష్టంగా వివరించారు. గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన రాజకీయ నాయకుల జాబితాలో ఆయన స్థానం పొందారు.
సామాజిక సేవ
కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (CMPF) అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద ప్రజల సమస్యలపై పనిచేస్తున్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధులపై ఉద్యమాలు చేయడం, రైతుల కోసం పోరాటాలు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు, దేశం కోసం ధైర్యంగా నిలబడే నాయకుడు. ఆయన అభిప్రాయాలు, ఉద్యమాలు, మరియు ప్రజల కోసం చేసే సేవల వల్లే ఆయనకు మంచి గుర్తింపు లభించింది.
వ్యక్తిగత జీవితం
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం పలు దశలుగా, పలు అనుభవాలతో కొనసాగింది. ఆయన వివాహ జీవితంలో మార్పులు వచ్చినా కూడా, కుటుంబ వ్యవస్థ, తన పిల్లల పట్ల ఆయన చూపిన బంధం, ప్రేమ, బాధ్యతల పట్ల ఆయన నిబద్ధత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
1997లో పవన్ కళ్యాణ్ మొదటి వివాహం నందినితో జరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత, 2001లో సినీ నటి రేణూ దేశాయ్ తో పవన్ సహజీవనం చేసారు. ఈ జంటకు అకీరా నందన్ అనే కుమారుడు 2004లో జన్మించాడు. పలు వివాదాల నేపథ్యంలో 2008లో నందినితో విడాకులు తీసుకున్న పవన్, 2009లో రేణూ దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఆద్య అనే కుమార్తె 2010లో జన్మించింది. 2012లో వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు.
రేణూ దేశాయ్ మీడియా ఇంటర్వ్యూలలో, "విదేశాల్లో పెరిగిన పర్సనాలిటీలు కావడంతో, వారిద్దరూ స్నేహితులుగా ఉండే దృక్పథంతో విడిపోయారు" అని చెప్పింది. తాను స్వతంత్రంగా జీవన విధానాన్ని కొనసాగిస్తున్నానని, పవన్ కళ్యాణ్ మంచి తండ్రిగా తమ పిల్లల కోసం అన్ని విధాలుగా మద్దతిస్తున్నారని తెలిపారు.
తర్వాత, 2013 సెప్టెంబరులో పవన్ కళ్యాణ్ మూడవ వివాహం రష్యన్ నటి అన్నా లెజెనేవాతో జరిగింది. వీరికి ఒక కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ మరియు కుమార్తె పొలెనా అంజనా పవనోవా జన్మించారు. ఈ కుటుంబం ప్రైవేట్ లైఫ్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ మీడియాకు దూరంగా ఉంటోంది.