Kapu Vidya Bhavan
Kapu Vidya Bhavan is a free hostel for Kapu caste people, providing education, accommodation, and cultural growth in Kapunadu, focusing on academic excellence.

కాపు విద్యాభవన్
...ఉజ్వల భవిష్యత్తు కోసం
అన్నదానం, విద్యాదానం కంటే గొప్పవి ఏమీ లేవు
కూడు కోసం కూలీలైతే - కులమే కూలిపోతుంది
గూడు లేకుంటే... చెట్ల మీద పక్షుల్లా చెదిరిపోతారు
విద్య లేకుంటే వీధిపాలై పోతారు
మన వారి కోసం మనమే అండగా నిలుద్దాం.. అభివృద్ధికి చేయుతనిద్దాం!!
నిప్పును కనుగొనడంతో ఆరంభమైన ఆధునిక మానవుని జీవితం విద్యాగంధం అబ్బి, నాగరిక ప్రపంచ సృజన వైపు నడిచింది.
తండ్రి వేలు పట్టుకుని బడివరకూ నడిచిన బాలలు, గురువు వేలి కొనలమాటునుంచే లోకాన్ని చూస్తారు.
నీతి, సంస్కృతి, మానవీయ విలువలు, మంచి-చెడు, ఆట-పాట... బడిఒడిలోనే నేర్చుకుంటారు. సమకాలీన సమాజం విజ్ఞాన సమాజం. ఇక్కడ జ్ఞానమే సిరి... చదువే రేపటి సంపద.
అర్థాకలితో అలమటించినా పర్లేదు... అక్షర జ్యోతులు వెలిగించిన కుటుంబాలే జాతికి ఆదర్శం.
పలకపైదిద్దే అ..ఆ..లు... అక్షరాలు కావవి... చిమ్మచీకటిలో దారి చూపే నక్షత్రాల సూచికలు!
రిజర్వేషన్లు లేక, ఆర్థిక స్థోమత లేని ప్రతిభావంతులైన కాపు యువత... పైచదువులు కొనసాగించలేకపోతున్నారు. చదువుకోలేక (కొనలేక) వెనుకబడిపోతున్నారు. అరకొర జ్ఞానంతో పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేకపోతున్నారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కాపు సమాజానికి మార్గనిర్దేశనం చేసే దిక్సూచిగా కాపునాడు శిల్పించే ఆలోచన, ప్రణాళిక కీ॥ శే॥ మిరియాల వెంకట్రావ్ గారిది. వారందించిన స్ఫూర్తితో కాపు విద్యార్థుల వసతి గృహం ఆరంభించాలని సంకల్పించాము.
మనవారిలో నిరుపేదలైన, ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం, నిస్సహాయస్థితిలో చదువు కొనసాగిస్తున్న వారికోసం ప్రతీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉచిత హాస్టలు వసతి, ఉచిత భోజన సౌకర్యం అందించే ఏర్పాటు చేస్తున్నాం.
భోజనం, విద్యతో పాటు కాంపిటీటివ్ పరీక్షలకి కోచింగ్ అందించే ఏర్పాటు చేస్తున్నాం. సివిల్స్కచింగ్కు, గ్రూప్-1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి కొన్ని షరతులతో కూడిన ప్రత్యేక శిక్షణ అందించబోతున్నాం.
మనవారు అనాధలు కారు... అభాగ్యులు అంతకంటే కారు! ఆ ఆలోచన వారి మనసుకు రాకూడదు. వారు విద్యావంతులు కావాలి... వినయంతో మరొకరికి తోడ్పడాలి. కొందరికి తోడ్పాటునిస్తారు. ఒకరికొకరు సహకరించుకుంటే, మనలో ఐక్యత బలపడుతుంది. భావితరాలు విజ్ఞాన సంపదతో ఆదర్శంగా జీవిస్తారు.
మనం బలపడితే మనవారిలో కొందరినైనా ఆదుకుంటాం... అందరూ సౌఖ్యంగా జీవించే సమాజాన్ని తెచ్చుకుంటాం. ఒకే శక్తిగా వుండాలి... పిడికిలి బిగించాలి! సమైక్య కాపు నినాదంతో ముందుకు
సాగాలి.
కాపు యువతీ యువకులు విద్యావైజ్ఞానిక రంగాల్లో పురోగమిస్తూ, కాపునాడు పటిష్టతకు, కాపుజాతి అభివృద్ధికి కృషి చేయాలి. 'నేను చేస్తా - నాతో పాటు పదిమందితో చేయిస్తా (I can do... I will do)’ అని ప్రతిన పూనాలి. అలాగే ఇతర కులాలతో సోదరభావంతో మెలుగుతూ, మనవారి పట్ల వారికికూడా సానుకూలం దృక్పథం కలిగివుండేలా కృషి చేయాలి.
ప్రతీ కుటుంబంలో ముఖ్యమైన రోజులు సంవత్సరానికి కనీసం మూడుంటాయి. అవే కుటుంబ సభ్యుల పుట్టినరోజులు మరియు ఆ దంపతుల పెళ్లిరోజు. వీటిని మన వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల నడుమ జరుపుకోండి! ఆ రోజు వారికి ప్రత్యేక విందు భోజనాన్ని ఏర్పాటు చేయండి. ఆ వేడుకకు మీరు తప్పక హాజరయ్యి, మీ సంతోషాన్ని వారితో పంచుకోండి! వారిచ్చే చల్లటి దీవెనలను పొంది, సుఖశాంతులతో ఆనందంగా జీవించండి!!
Note : గుర్తుంచుకోండి... వసతిగృహ సదుపాయం కేవలం ఇతర ప్రాంతాలనుండి వచ్చేవారికి మాత్రమే! అలాగే విద్యార్థులు తమ వెంట తమ తమ ప్రాంతాల స్థానిక కాపునాడు కమిటీ నుండి అనుమతి పత్రాన్ని తీసుకుని రావాలి.
హాస్టల్ ప్రవేశ విధానం :
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలకు చెందిన, ఆర్థికంగా వెనుకబడిన / తల్లిదండ్రులు లేని కాపు/తెలగ/బలిజ/ఒంటరి తదితర కులాలకు చెందిన విద్యార్థినులతో పాటు, అర్హతను బట్టి ఇతర కులాలలోని కొంతమంది విద్యార్థినులు ప్రవేశానికి అర్హులు. ప్రవేశం కోసం అప్లికేషన్ ఇచ్చిన విద్యార్థినులు వారి స్వభావం ఆధారంగా ఎంపిక చేయబడతారు. ఎంపికలో తుది నిర్ణయం కమిటీ వారిదే. వారిని ‘కాపు విద్యాభవన్' దగ్గరలోని ప్రభుత్వ / ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశాన్ని కల్పిస్తాము. 'కాపు విద్యాభవన్'లో ప్రవేశం పొందిన బాలికలకు వసతి, ఆహారం, స్కూల్ ఫీజు, నిత్యావసరాలు, స్కూల్ యూనీఫారమ్, తదితర సౌకర్యాలన్నీ కాపునాడు ఫౌండేషన్ ఉచితంగా కల్పిస్తుంది.
హాస్టల్ విద్యార్థినుల దినచర్య :
ఉ॥ 5 గంటలకు | నిద్రలేచే సమయం |
ఉ॥ గం|| 5.15 ని॥ నుండి గం॥6.15ని॥ వరకు | ఆటలు/వ్యాయామం/యోగా |
ఉ॥ గం॥6.15 ని॥లకు | పాలు / జావ |
ఉ॥ గం॥6.30 ని॥ నుండి గం॥8 వరకు | చదువుకునే సమయం |
ఉ॥ 8.30ని॥ నుండి గం॥ 9 వరకు | అల్పాహారం |
ఉ॥ గం॥9.15 నుండి మ॥ 1.15 ని॥ వరకు | పాఠశాల |
మ॥ గం॥1.20 ని॥ నుండి గం॥ 1.45ని॥ వరకు | మధ్యాహ్న భోజనం |
మ॥ గం.2 నుండి సాయంత్రం 4 గం.వరకు | పాఠశాల |
సా॥ గం||4.15ని॥ నుండి గం॥5.15 ని॥ వరకు | ఆటలు/వ్యాయామం/యోగా |
సా॥ గం॥ 5.15 ని॥ నుండి గం॥6 వరకు | అల్పాహారం |
సా॥ 6 గం|| నుండి రాత్రి గం॥7.30ని॥ వరకు | ప్రత్యేక అభినందన కార్యక్రమాలు |
రా॥ గం॥7.30ని॥ నుండి 9 గం॥ వరకు | చదువుకునే సమయం |
రా॥ గం॥ 9 నుండి గం॥9.30 ని॥ వరకు | రాత్రి భోజనం |
రాత్రి గం॥ 9.30 ని॥ లకు | నిద్రపోయే సమయం |
ఆహారం : ఉదయం పాలు/జావ. ఉదయం & సాయంత్రం రెండు పూటలా అల్పాహారం. ప్రతిరోజూ తాజా కూరగాయలు, ఉడికించిన కోడిగ్రుడ్డులతో పరిశుభ్రమైన సంపూర్ణ పౌష్టికాహారం. రెండు పూటలా పెరుగు మరియు వారంలో ఒకరోజు మాంసాహారం.
తల్లిదండ్రులు తమ పిల్లల్ని కలిసేందుకు సమయాలు :
- శనివారం సాయంత్రం 4గం.ల నుండి 6గం.ల వరకు
- ఆదివారం మరియు శెలవు రోజుల్లో ఉదయం 9 గం.ల నుండి సాయంత్రం 6 గం.ల వరకు
- ఇతర రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను కలవాలనుకుంటే ముందుగా ఫోన్ చేసి, వార్డెన్ అనుమతి తీసుకుని రావాలి.
వైద్య సౌకర్యం : విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన మందులు ఉచితంగా అందుబాటులో వుంటాయి. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వైద్య సిబ్బందిని అందుబాటులోకి తీసుకోబడుతుంది.
సి.సి. కెమెరాలు : 'కాపు విద్యాభవన్' ఆవరణలో సీ.సీ కెమెరాల ద్వారా విద్యార్థినుల సంరక్షణ, సిబ్బంది మరియు విద్యార్థినుల ప్రవర్తనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సదుపాయం వుంటుంది.
'కాపు విద్యాభవన్'లో విద్యార్థినులు పాటించాల్సిన నియమాలు :
- ఆవరణలోకి సెల్ఫోన్ అనుమతి లేదు.
- కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్లు, టీవీలను విద్యాసంబంధ విషయాలకు మాత్రమే అనుమతించబడును.
- అపరిచిత వ్యక్తులతో పరిచయాలు ఎట్టి పరిస్థితిల్లోనూ పెంచుకోరాదు.
- అనుమతించిన వేళలలో మాత్రమే 'కాపు విద్యాభవన్' ఫోన్ ను వినియోగించుకోవాలి.
- విద్యార్థినులందరూ ఒకరితో ఒకరు స్నేహభావంతో, ప్రేమతో మెలగాలి.
క్రమశిక్షణ : 'కాపు విద్యాభవన్'లో నియమ, నిబంధనలను కఠినంగా అమలు చేయబడతాయి.
ఇక్కడ అందించే ఆహార పదార్థాలుగానీ, పానీయాలుగానీ భోజనశాలకు మాత్రమే పరిమితం. బయటకు తెచ్చుకొని తినడంగానీ, బయటి పదార్థాలుగానీ అనుమతించబడవు. అలాగే నియమ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. నియమ, నిబంధనలను ఎవరైనా అతిక్రమించినచో ఆ విద్యార్థినుల తల్లిదండ్రులను/సంరక్షకులను పిలిపించి 'కాపు విద్యాభవన్ నుండి బయటికి పంపివేయబడతారు. అలాగే ఏదైనా అసాంఘికచర్యలకు పాల్పడితే సంబంధిత ప్రభుత్వశాఖలకు తెలియపరచబడుతుంది. క్రమశిక్షణా చర్యల విషయంలో ఎటువంటి సిఫారసులకు, వాదోపవాదాలకు అవకాశం ఇవ్వబడదు.
స్పోర్ట్స్ & గేమ్స్ : విద్యార్థినులందరూ ఆటల కొరకు కేటాయించిన ఆటస్థలంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా ఆటలు గానీ, వ్యాయామంగానీ, యోగాసనాలుగానీ చేయాలి.
అలాగే దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవడమే కాకుండా, మనస్సును ప్రశాంతంగా వుంచుకునేందుకు అవసరమైన ధ్యానాన్ని కూడా సాధన చేసుకునే సదుపాయం కల్పించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రతీ పార్లమెంటు కేంద్రంగా కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'కాపు విద్యాభవన్'లను ఏర్పాటు చేయబోతున్నాం. ఈ 'కాపు విద్యాభవన్'లో పేద, మధ్యతరగతి విద్యార్థినీ విద్యార్థులకు పౌష్టికాహారంతోపాటు ఉన్నత విద్యాప్రమాణాలకోసం ప్రత్యేక శిక్షణా విధానం, మానసిక దృఢత్వం కోసం ధ్యానం, శరీరదారుఢ్యంకోసం యోగ తదితర వ్యాయామాలతో కూడిన శిక్షణ ఇవ్వబడుతుంది.
ఈ ఎంపిక విధానం ఎలా అంటే... ప్రతీ పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఒక్కొక్క స్థానంనుండి ముగ్గురు చొప్పున 21 మంది కాపు సమాజం నుండి, అలాగే పార్లమెంటు నియోజకవర్గం మొత్తంలో నలుగురు చొప్పున ఇతర ఓసి సామాజిక వర్గాలనుండి మొత్తం 25 మంది విద్యార్థినీ/విద్యార్థులు ఎంపిక చేయబడతారు. ఇలా ప్రతీ సంవత్సరం, 25 మంది కొత్త బ్యాచ్ మొదలవుతుంది.
విద్యార్థినీ విద్యార్థులను 6వ తరగతి నుండి ఎంపిక చేసి, వారి వారి నడవడికను, జిజ్ఞాస మరియు వారు ఎంచుకునే గమ్యాలను బట్టి అవసరమయ్యే ఉన్నత విద్యా ప్రోత్సాహకాలు, సివిల్స్, గ్రూప్ వంటి కాంపిటీటివ్ పరీక్షలు లేదా విదేశాల్లో ఉన్నతవిద్య వంటి దాదాపు అన్నిరకాల చేయుతనూ అర్హతగల విద్యార్థినీ విద్యార్థులకు అందించే మహోన్నత లక్ష్యమే కాపునాడు ఫౌండేషన్ ఆశయం!
మన భవిష్యత్తు తరాల్ని సమాజానికి ఆదర్శవంతమైన పౌరులుగా, బలమైన సమాజపు నిర్ణేతలుగా తీర్చిదిద్దే ఈ బృహత్తర ప్రణాళికలో మీరూ భాగస్వాములు కండి!
“అన్ని దానాలలో కన్నా విద్యాదానం మిన్న"
కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడే 'కాపు విద్యాభవన్' నిర్వహణ కొరకు విరాళాలు ఇచ్చే దాతల పేర్లు శాశ్వతంగా నిలిచే విధంగానూ, ఇతరులకు స్ఫూర్తిదాయకంగానూ ఉండాలన్న సదుద్ధేశంతో అకాడమీలో వారి పేర్లు శిలాఫలకాలపై చెక్కించబడతాయి. ఇందులో మహారాజ పోషకులు, రాజ పోషకులు మరియు పోషకులుగా దాతలను గుర్తించి వివరాలను శాశ్వతంగా పొందుపరచడం జరుగుతుంది.
గడిచిన 50 వసంతాలుగా కాపులుగా పిలువబడుతున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పుకాపు, మున్నూరుకాపు తదితర కులాల మధ్య సమాచారం-సహకారాలందిస్తూ, ‘నా కుటుంబం - నా సమాజం' అనే నినాదంతో స్వర్గీయ మిరియాల వెంకట్రావ్ గారిచే ప్రారంభించబడిన 'కాపునాడు'లో సభ్యులుగా చేరండి!
'కాపునాడు'కు అనుబంధమే కాపునాడు టీవీ, కాపునాడు మాస పత్రిక, కాపునాడు ఫౌండేషన్.
కాపు, బలిజ, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు,, తూర్పుకాపు తదితర కులాల సమగ్ర సమాచార సమాహారం కాపునాడు.
చదవండి! చదివించండి!!
Kapunadu Website: https://kapunaduindia.com/
Kapunadu youtube channel: https://www.youtube.com/@Kapunadutv
2nd Floor, SBI Building, Gundu Kotaiah Street, Service Road, Krishna Lanka, VIJAYAWADA - 520 013. Cell : 9985417777
కీ॥ శే॥ మిరియాల వెంకట్రావ్ స్మారక విద్యార్థినీ విద్యార్థుల వసతి గృహాలు
Reg. No. 64/2024 - KAPUNADU FOUNDATION
కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సుబ్రమణ్యం గారి ఆధ్వర్యంలో... భాషకాని భాష, ప్రాంతంకాని ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కేంద్రాల్లో నిత్య అన్నదాన సేవ మరియు వసతి గృహాల ఏర్పాటు
KAPUNADU FOUNDATION
షిర్డి, కాశీ, అరుణాచలం
Regd. Office: Ganesh Rao Street, Kothapet, Guntur - 522001 Admin Office: #26-2-6, Galla vari Street, Gandhi Nagar, Vijayawada-520 003
Contact: 6281583303, 8008806935