Kandula Durgesh Biography
Kandula Durgesh is a senior Andhra politician and current Minister of Tourism, Culture & Cinematography from JanaSena Party.

Name | Kandula Durgesh |
Date of Birth | 17 September 1962, Rajamahendravaram, East Godavari district, Andhra Pradesh |
Brother | Someswara rao |
Wife | Usha Rani |
Children | Kandula Krishna Teja, Rangapriya |
Caste | Kapu |
Social Media | Facebook | Instagram | X |
కందుల దుర్గేష్ గారు గోదావరి జిల్లాకు చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. వివాదాలకు దూరంగా ఉండే ఆయన ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటాడు. ఏ పార్టీలో ఉన్నా సంపూర్ణ నిబద్ధతతో పనిచేసేవాడు. ప్రజలతో ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండే నాయకుడిగా గుర్తింపు పొందాడు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కందుల దుర్గేష్ గారి పూర్తి పేరు కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్. ఆయన 1962 September 17 న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ఒక కాపు కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు సోమేశ్వరరావు. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తి చేశారు.
రాజకీయ ప్రవేశం
కందుల దుర్గేష్ గారికి చిన్ననాటి నుండే రాజకీయాలపై ఆసక్తి ఉండేది. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. కందుల దుర్గేష్ గారు పార్టీలలో వివిధ హోదాలలో పనిచేశారు. 2007 నుంచి 2013 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన ఎమ్మెల్సీగా పని చేయడంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మురళీమోహన్ గెలుపొందారు. రెండవ స్థానంలో వైసీపీ అభ్యర్థి వెంకటరమణ చౌదరి నిలిచారు. ఇక మూడవ స్థానం కాంగ్రెస్ తరపున కందుల దుర్గేష్ గారు గెలుపొందారు. ఆయనకి కేవలం 21,243 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే రాష్ట్రాన్ని రెండుగా విభజించడంపై కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వచ్చింది. చివరిగా ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీలో చాలా దారుణమైన ఫలితాలను చూసింది. కొద్ది కాలానికి ఆయన కాంగ్రెస్ పార్టీ కు రాజీనామా చేశారు.
ఆ తరువాత 2016 డిసెంబర్ 12న వైసీపీలో చేరారు. కొంతకాలానికి జగన్ అలాగే ఆ పార్టీ నేతల పద్ధతులు ఆ పార్టీ విధానాలు నచ్చక వైసీపీకి కూడా రాజీనామా చేశారు.
జనసేన పార్టీలో చేరిక
కందుల దుర్గేష్ 30 ఆగస్టు 2018 లో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో కందుల దుర్గేష్ గారికి ఎంతో గౌరవం లభించింది. సీనియర్ నాయకుడిగా పార్టీ వాయిస్ ను చాలా బలంగా వినిపించేవాడు. మీడియా డిబేట్లో కూడా పార్టీ వాయిస్ను ఆయన చాలా బలంగా వినిపించేవారు. ఐదు సంవత్సరాలు పాటు పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడ్డారు. 2019 ఎన్నికల సమయంలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది. రాజమహేంద్రవరం న్యూరల్ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా కందల దుర్గేష్ గారు పోటీ చేశారు. 42,685 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. ఒంటరిగా పోటీ చేసి జనసేన పార్టీ నుంచి దుర్గేష్ ఏకంగా 42, 685 ఓట్లు సాధించారంటే అది చాలా గొప్ప విషయం.
ఎందుకంటే 2019లో జగన్ ప్రభంజనం పెద్ద ఎత్తున వేసిన దుర్గేష్ భారీ సంఖ్యలో ఓట్లు గెలిచారంటే అది ఆయన గొప్పతనం. తర్వాత ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఐదు సంవత్సరాలు పాటు వైసిపి జగన్ ప్రభుత్వం తో పోరాటం చేసింది. గ్రౌండ్ లెవెల్ లో కందుల దుర్గేష్ పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. జన సైనికులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు పోరాడారు. ప్రభుత్వాన్ని తప్పు చేసిన ప్రతి అంశాన్ని ప్రశ్నించేవారు. ఐదేళ్లపాటు జనసేన పోరాటంలో భాగమయ్యారు. 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపి కూటమిగా జనసేన టిడిపి బిజెపి కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ కూటమి నిర్ణయం రాజకీయంగా బాగా కలిసి వచ్చింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కందుల దుర్గేష్ రాజమండ్రి న్యూరల్ నుంచి పోటీ చేయాలని ముందుగానే అనుకున్నారు. కానీ అక్కడ టిడిపి సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండగా చంద్రబాబు ఆయనకే టికెట్ ఇచ్చారు. కందుల దుర్గేష్ కి నిడదవుల నుంచి అవకాశం ఇచ్చారు. తక్కువ సమయం ఉన్న కందుల దుర్గేష్ గారు నిడదవోలలో చాలా బాగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. కందుల దుర్గేష్ గారి కుటుంబం కూడా ఆయనకు ఎంతో సపోర్టుగా నిలిచింది. జనసేన టిడిపి బిజెపి మూడు పార్టీల కేడర్ ఆయనకు అండగా నిలిచారు.
2024 ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప పార్టీ వైసీపీ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు ఫై 33,304 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. కూటమిలో ఏపీ అధికారంలోకి వచ్చింది 164 సీట్లు కూటమికి వచ్చాయి 11 సీట్లు వైసీపీకి వచ్చాయి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దూరమైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఏపీ కాపిటల్ లో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ తో సహా మరో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి. సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అలాగే మరో సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్ గారికి మంత్రి పదవులు వచ్చాయి. కందుల దుర్గేష్ గారు జూన్ 12న పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పార్టీల గురించి పక్కన పెడితే కందుల దుర్గేష్ గారు అంటే అందరికీ చాలా అభిమానం. ఆయన రాజకీయంగా పెద్దగా విమర్శలు చేయరు. అవసరమైన కంటెంట్ విషయాలు మాత్రమే మాట్లాడుతారు కందులు దుర్గేష్ గారు. పర్సనల్ గా నాయకులను తిట్టడం అలాంటివి ఎప్పుడూ జరిగేవి కావు రాజకీయంగా పెద్దగా వ్యవహరిస్తారా ఆయన. యూత్ ని చాలా బాగా ప్రోత్సహిస్తారు. అంతేకాకుండా అన్ని కులాల వారిని కలుపుకుపోతారు అన్న మంచి పేరు కందుల దుర్గేష్ గారికి ఉంది. ఆయన చాలా మంచి మనిషి అని అన్ని పార్టీల వారు చెప్పుకునేవారు.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కందుల దుర్గేష్ 1991 లోనే సినిమా నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లో బాను చందర్ శోభన హీరో హీరోయిన్లుగా నటించిన కీచురాళ్ల సినిమా నిర్మాతగా చేశారు. ఆ సినిమాకు గీత కృష్ణ దర్శకులు ఇళయరాజా సంగీతాన్ని ఇచ్చారు. ఇలాగే కీచురాలు సినిమాతో పాటు తరువాత కాలం పలు సినిమాలకు నిర్మాతగా చేశారు. ఆయనకు సినిమా ఇండస్ట్రీపై అవగాహనే కాకుండా అవసరమైన పేర పరిజ్ఞానం కూడా ఉంది అని అంటూ ఉంటారు. అందుకే ఆయనకు సినిమాటోగ్రఫీ మంచి ఎంపిక అని ప్రతి ఒక్కరు అన్నారు.
ఇంకా ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన సతీమణి ఉషారాణి, ఆయన కుమార్తె పేరు రంగ ప్రియా, అల్లుడు ఇలి సత్యేంద్ర. ఆయన కుమారుడు కందుల కృష్ణ తేజ.
ఈ ఎన్నికల్లో కుమారుడు, కుమార్తె, అల్లుడు, ఆయనకు ఎంతగానో అండగా నిలిచారు. కందుల దుర్గేష్ గారు చాలా మంచి మనిషి మృదు స్వభావి అలాగే ఏ కులాలు వారినైనా గాని ఒకే విధంగా చూస్తూ ఉండేవారు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న కానీ ఆయనపై ఎటువంటి విమర్శలు కానీ మాటలు కానీ రాలేదు. ఏ రాజకీయ పార్టీలో పనిచేసిన కానీ ఆయన ఎప్పుడు పద్ధతి గానే పనిచేసేవాడు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారికి ఆయన సీనియారిటీ నచ్చి కందుల దుర్గేష్ గారిని మంత్రిగా ఎంపిక చేసుకున్నారు. కందుల దుర్గేష్ గారికి జనసేన పార్టీలో చాలా గౌరవం ఇచ్చే వాళ్ళు. మంత్రిగా ఆయన అద్భుతమైన పాలన చేస్తూ రాజకీయంగా ఇంకా ఉన్నత స్థాయికి రావాలని కోరుకుందాం.