Vijayakanth Biography | విజయకాంత్ బయోగ్రఫీ

Complete biography of Tamil actor and politician Vijayakanth – movies, political journey, awards, and personal life.

Vijayakanth Biography | విజయకాంత్ బయోగ్రఫీ
vijayakanth biography in telugu
Name Vijayakanth (Vijayaraj Alagarswami)
Born 25 August 1952, Madurai
Died 28 December 2023 (age 71 years), Chennai
Wife Premalatha Vijayakanth
Children Shanmuga Pandian, V. Vijaya Prabhakaran
Occupation Politician
Party Desiya Murpokku Dravida Kazhagam

విజయకాంత్‌ గారు 1952 ఆగస్టు 25న తమిళనాడు రాష్ట్రంలోని  మధురైలో ఒక బలిజ కాపు కుటుంబంలో జన్మించాడు. విజయకాంత్‌ గారు ఒక ప్రముఖ తమిళ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు అలాగే రాజకీయ నాయకుడు. విజయకాంత్ సినీ రంగం నుండి రాజకీయ రంగంలోకి ప్రవేశించి తమిళనాడులో ఒక ప్రముఖ నాయకుడిగా ఎదిగాడు. ఆయన 2011 నుండి 2016 వరకు తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK), తమిళ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది.

వ్యక్తిగత జీవితం

విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అలగర్‌స్వామి నాయుడు. ఆయన తండ్రి కె.ఎన్.అలగర్‌స్వామి, తల్లి ఆండాళ్ అలగర్‌స్వామి. ఆయన 1952 ఆగస్టు 25న మధురైలో జన్మించారు. ఆయన 1990 జనవరి 31న ప్రేమలతను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు – విజయ్ ప్రభాకర్ మరియు షణ్ముగ పాండ్యన్. ఆయన రెండవ కుమారుడు షణ్ముగ పాండ్యన్ 2014లో "సగప్తాహం" చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు.

సినీ జీవితం

విజయకాంత్ తమిళ సినిమాలలో 1979లో "ఇనిక్కుం ఇలామై" చిత్రం ద్వారా అడుగుపెట్టారు. ఆ సినిమాలో ఆయన ప్రతినాయకుడిగా నటించారు. మొదట్లో కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ, ఆయన 1980లో "దూరతు ఇడి ముజక్కం" మరియు 1981లో "సత్తం ఓరు ఇరుత్తరై" చిత్రాల ద్వారా ప్రముఖతను సాధించారు.

విజయకాంత్ తన 100వ చిత్రం "కెప్టెన్ ప్రభాకరన్" (1991) తర్వాత "కెప్టెన్" అనే బిరుదును పొందారు. ఆయన దాదాపు 40 సంవత్సరాల పాటు 150కి పైగా చిత్రాలలో నటించారు. ముఖ్యంగా పోలీసు అధికారిగా 20కి పైగా చిత్రాలలో నటించడం ద్వారా ఆయనకు ఖాకీ యూనిఫాం సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

తెలుగులోకి అనువదించబడిన ఆయన చిత్రాలలో కెప్టెన్ ప్రభాకర్, సిటీ పోలీస్ వంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.

రాజకీయ జీవితం

విజయకాంత్ 2005 సెప్టెంబరు 14న దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) అనే రాజకీయ పార్టీను స్థాపించారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలో పోటీచేసి ఒకే ఒక్క సీటును గెలిచారు. అయినప్పటికీ, ఆయన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10% ఓట్లు సాధించింది. 25 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు మార్జిన్ల కంటే ఎక్కువ ఓట్లను అందుకుంది.

ప్రతిపక్ష నాయకుడిగా విజయకాంత్

2011లో ఎఐఎడిఎంకేతో కలిసి 41 నియోజకవర్గాల్లో పోటీ చేసిన DMDK పార్టీ 29 స్థానాలను గెలుచుకుంది. విజయకాంత్ స్వయంగా రిషివాండియం నియోజకవర్గం నుండి విజయం సాధించి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ విజయం తరువాత ఆయన తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు.

అయితే, తర్వాత కాలంలో AIADMK తో విభేదాలు వచ్చి పొత్తు విడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, DMDK అనేక చిన్న పార్టీలతో కలిసి ఒక వేరు కూటమిని ఏర్పాటు చేసి బీజేపీకి మద్దతు ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా విజయకాంత్‌ను తన స్నేహితుడిగా అభివర్ణించారు.

vijayakanth biography

అయితే, పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో విజయకాంత్ ప్రతిపక్ష నేతగా పదవిని కోల్పోయారు.

2016 ఎన్నికలు

విజయకాంత్ 2016లో విలుపురం జిల్లా ఉలుందుర్పెట్టై నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు. ఆయనకు కేవలం 34,447 ఓట్లు మాత్రమే రాగా, ఎఐఎడిఎంకె అభ్యర్థి ఆర్. కుమారగురు 81,973 ఓట్లతో విజయం సాధించారు. ఈ ఓటమి తరువాత ఆయన రాజకీయ ప్రస్థానం పాత రోజుల్లో ఉన్న స్థాయిని కోల్పోయింది.

పౌర పురస్కారం - పద్మ భూషణ్

2024 జనవరి 25న భారత ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఇది ఆయన సినీ రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా అందించిన గౌరవం. ఇది విజయకాంత్ కు లభించిన అత్యున్నత గౌరవాల్లో ఒకటి.

మరణం

విజయకాంత్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని మియోట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 డిసెంబరు 28న తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయన మరణం తమిళ సినీ పరిశ్రమలో మరియు రాజకీయ రంగాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

vijayakanth గారి గురించి ఏదైనా update చెయ్యాలంటే contact అవ్వండి.