Name | Vangaveeti Mohana Ranga Rao |
Born | 4 July 1947 Katuru, Vuyyuru, Krishna district |
Died | 26 December 1988 (aged 41) Vijayawada, Andhra Pradesh |
Cause of death | Murder |
Nick name | Ranga |
Profession | Politician |
Position | Member of the Legislative Assembly |
Term | 1985 to 1988 |
Parents | Vangaveeti Seetharamayya, Vangaveeti Savithramma |
Siblings | Koteswara rao, Venkata Narayana Rao, Shobana Chalapathi Rao, Radha Krishna Rao |
Wife | Chennupati Ratnakumari |
Political party name | Indian National Congress |
Children’s | Son: Vangaveeti Radha Krishna Daughter: Vangaveeti Asha Kiran |
రంగా గారి తండ్రి పేరు, వంగవీటి సీతారామయ్య గారు. తల్లి పేరు వంగవీటి సావిత్రమ్మ వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు.
- మొదటి సంతానం: వంగవీటి కోటేశ్వరరావు గారు. ఈయనకి సంతానం లేదు.
- రెండవ సంతానం: వంగవీటి నారాయణరావు గారు. ఆయనకి ఒక్క వారసుడు వంగవీటి నరేంద్ర గారు.
- మూడవ సంతానం: వంగవీటి శోభనచలపతిరావు గారు. ఈయనకి ముగ్గురు వారసులు: వంగవీటి శాంతన్ గారు, వంగవీటి మేఘనాధ్ గారు, వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ గారు.
- నాలుగవ సంతానం: వంగవీటి రాధాకృష్ణ మూర్తి గారు. ఈయనకి పెళ్లి కాలేదు.
- చివరి సంతానం: వంగవీటి మోహన రంగా గారు. ఆయనకి ఒక్క వారసుడు వంగవీటి రాధ గారు.
Personal Life
వంగవీటి మోహనరంగా గారు 1947, జూలై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యూరు మండలం లోని కాటూరులో జన్మించాడు. ఇతనికి వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణరావు (సీనియర్) అనే నలుగురు అన్నలు ఉన్నారు. వంగవీటి రంగా, అన్న రాధాకృష్ణరావుకు, కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అయిన చలసాని వెంకటరత్నంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అప్పట్లో చలసాని గారి అనుచరుడైన దత్తి కనకారావు విజయవాడ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం మీద ఆధిపత్యం చలాయించేవాడు. ఈ వ్యాపారం మీద పట్టుకోసం వెంకటరత్నానికి, రాధాకృష్ణ మధ్య గొడవలు వచ్చాయి. 1972లో, వెంకటరత్నం మరియు అతని అనుచరుడైన కనకారావు ఇద్దరూ హత్య చేయబడ్డారు. రాధాకృష్ణ అనుచరులే ఈ హత్యను చేయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన తరువాత 1974లో ప్రత్యర్థులు వంగవీటి రాధాకృష్ణను హత్య చేశారు. రాధాకృష్ణ మరణం తరువాత, అతని తమ్ముడు మోహనరంగ కూడా విద్యార్థి నాయకులైన దేవినేని చంద్రశేఖర్ (గాంధీ) మరియు దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర ఐక్యవేదికను ఏర్పాటుచేసి, దానికి నాయకత్వం వహించాడు.
రాజకీయంగా పలుకుబడి కలిగిన వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య ఆధిపత్య పోరాటం కారణంగా ఈ ఐక్యవేదిక విడిపోయింది. 1979 లో దేవినేని చంద్రశేఖర్ అలాగే 1988లో మరో సోదరుడు దేవినేని మురళి హత్యకు గురయ్యారు.
విజయవాడ గిరిపురంలోని పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తున్న వంగవీటి రంగను 1988 డిసెంబరు 26 తెల్లవారుజామున ప్రత్యర్థులు హత్య చేశారు. ఆ సమయంలో ఆయనను కాపలాగా చూస్తున్న ఇద్దరు అంగరక్షులు ఈ హత్యను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. దేవినేని రాజశేఖర్, అతని అనుచరులే ఈ హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. రంగా హత్యతో కోస్తాలోని చాల జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు జాగిగాయి. ఒక్కసారిగా విజయవాడ మొత్తం రంగా హత్యతో అతలా కుతలం అయిపోయింది. రంగ అనుచరులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులను, వారి ఆస్తులను ద్వాంసం చేశారు, అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు.
రంగ గారు , చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం. రాధాకృష్ణ, ఆషా.
Political Life
తన అన్న రాధాకృష్ణ మరణంతో రంగా 1981 లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ అతనిమీద పోటీకి నిలబెట్టలేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం అతని ప్రత్యర్థి అయిన దేవినేని నెహ్రూని పోటీకి నిలబెట్టింది. 1983 నుంచే రెండు పార్టీ కార్యకర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 1985 లో రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున MLA అయ్యాడు. 1979 లో దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని రాజశేఖర్ (గాంధీ) హత్య కేసులోనే రంగా జైలుశిక్ష అనుభవించి అనంతరం విడదలయ్యాడు. 1988 మార్చి 10వ తేదీన దేవినేని సోదరుల్లో మరొకడైన మురళి హత్యకు గురయ్యాడు. మల్లి రంగా అనుచరులే దీనికి కారణమని ఆరోపణలు వచ్చాయి. రంగా పోలీసుల అధికారాన్ని వ్యతిరేకించాడు. 1988 జులై 10వ తేదీన జరిగిన కాపునాడు సభలో రంగాను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అప్పటికి రంగా జైల్లోనే ఉన్నాడు. జైలు నుండి విడుదలైన తరువాత, జనచైతన్య యాత్రను చేపట్టి, ఎన్. టి. రామారావు తన పాలన నియంత్రణ రహితమైనదిగా ప్రజలకు చెప్పాడు. అప్పుడే రామారావు కూడా వ్యాను మీద రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు.
Vangaveeti Mohana Ranga గారి గురించి అభిమాని మాటల్లో!
1970 వ సంవత్సరం ముందు వరకూ విజయవాడ లో జనాన్ని దోచుకునే వారు దోపిడీదారులు.
పాల వ్యాపారం చేసుకుంటూ సిటీకి వచ్చి, గ్రూపులు తయారు చేసుకుని, జనాన్ని దోచుకుంటూ ఆటోరిక్షా వాల్లని తన్నుతూ, పేదల గుడిసెలు పీకేసి వాళ్లను సిటీకి దూరంగా తరిమికొట్టి , వారి స్థలాలు ఆక్రమించుకుంటూ అరాచకంగా విజయవాడను పీడిస్తున్న రోజులవి.
ధర్మం చట్టం న్యాయాలకు తావివ్వకుండా అవినీతి ధౌర్జన్యాలు అరాచకాలు చేస్తూ, కొంత మంది దుర్మార్గులు తెలుగువారి గుండెల్ని రక్తసిక్తం చేసారు.
పోలీసులు కూడా వారికే మద్దతు ఇచ్చి, కొమ్ము కాచే పరిస్థితి, పోలీసులను కూడా అరేయ్ ఓరేయ్ అని పిలిచే పరిస్థితి అది.
ఇంక యెవరూ రారు, ఈ అన్యాయాలను దోపీడీలను అడ్డుకునే వాడే రాడు – రాలేడు అని ప్రజలందరూ ప్రతిరోజూ వారికి భయపడుతూ చచ్చి బతుకుతున్న రోజులవి.
కానీ సమాజంపై పేరుకు పోయిన అన్యాయాన్ని రూపు మాపడానికి – అవినీతి అక్రమ దోపిడీ గూండాలను తరిమి కొట్టడానికి ఓ బెబ్బులి లా వచ్చాడు,,, ప్రజా శ్రేయస్సు కోసం కదం తొక్కిన సింహంలా గర్జిస్తూ ముందుకు దూసుకు వచ్చాడు…
ఆయనే జనంలో వకడిలా – జనంకోసం వొక్కడిలా ఉవ్వెత్తున యెగసిపడ్డ ధృవతార… వంగవీటి మోహనరంగా రావు.
నీతికీజాతికీ కట్టుబడి, సామాన్యుడి ఆవేదనని తీర్చిన ప్రజానాయకుడిగా ముందుకు సాగాడు.
ఆయన మాటే వేదం.. ఆయన చూపే ధైర్యం!
ఆయన వేసిన అడుగులు నేటి యువతకు ఆదర్శం గా నిలిచాయి.
సామాన్య కుటుంబంలో పుట్టి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి, లక్షలాది యువతరాన్ని కదిలించిన మహోద్యమ నాయకుడు వంగవీటి మోహనరంగా రావు గారు.
UI (United Independence) ని స్థాపించి యువతను చైతన్యం చేసిన దార్శనీకుడు మన రంగా గారు.
MLA గా చేసింది మూడేళ్లే ఐనా – అంత తక్కువ సమయంలో ఆయనకు వచ్చిన పేరు ప్రతిష్ఠలు ఈ ప్రపంచంలో ఇంకెవరికీ రాలేదు.
మహానాడు 50 వేల మందితో జరిగితే – అదే సంవత్సరం కాపునాడు 20 లక్షల మందితో జరిగింది.
ఆ జనాన్ని చూసి ఓర్చుకోలేక, రంగా గారు ఉంటే నెక్స్ట్ CM అవుతాడని, వారి దోపీడీని అడ్డుకుంటాడని, ఓ పధకం ప్రకారం కుట్ర పన్ని, పిరికి పందలు 5 రోజులు నిరాహారధీక్షలో ఉండి ఆహారం లేక శుష్కించి – నిద్రపోయే మనిషిని 1988 డిసెంబరు 26 తెల్లవారు ఝామున పొగ బాంబులతో దాడి చేసి నరికి చంపేశారు.
ఇందిరాగాంధి, రాజీవ్ గాంధీ లవి కూడా మర్డర్లే.
ప్రధానమంత్రుల మర్డర్లకు కూడా రాని వ్యతిరేకత – ఓ MLA మర్డర్ జరిగితే వచ్చింది..
భారతదేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 48 రోజులపాటు కర్ఫ్యూ విధించారు.
700 ఆర్టీసీ బస్సులను – 150 పోలీసు జీబులను బూడిద చేశారు రంగా గారి అభిమానులు.
కోస్తా జిల్లాలకు బస్సులు రైల్లు విమాన రాకపోకలు నిలిచిపోయాయి.
కోస్తా జిల్లాల్లో అల్లకల్లోలం జరిగింది.
ఆ గొడవలలో పోలీసులు కాల్చి చంపినోళ్ల లెక్కే అధికారికంగా 42 మంది.
ఇక రంగా గారి అభిమానులైతే ఎంతమంది పచ్చోళ్లను తన్ని తరిమి తరిమి కొట్టినారో లెక్క తేలలేదు.
విజయవాడ గుంటూరు సిటీలు తగలపడిపోయాయి.
ఆ రెండు నగరాల్లోని పచ్చ షోరూంలు మాడి మసయ్యాయ్ రంగా గారి అభిమానుల ఆవేశానికి.
(ఆ కాలంలో వరిజినల్ కాపులు ఉండేవారు. ఎందుకంటే అది బెబ్బులి రంగా కాలం, అందుకే ఆ కాలపు కాపులలో నీతి, జాతి, మానం, అభిమానం ఉండేవి. కాపులతో పాటు రంగా గారిని ఆరాధించే SC, ST, BC లు కలగాలిసారు, ఫలితంగా వారి దేవున్ని చంపినోళ్ల మీద ఆవేశంతో అలా చేశారు.)
BBC రేడియో లో వచ్చిన మొట్ట మొదటి తెలుగు వార్త “రంగా గారి హత్య” .
పసుపు కత్తులు రంగన్న గుండెను తాకినా – ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ నిలిచి పోతాడనే వాస్తవాన్ని మరిచిపోయి ఉంటారు.
తనను చంపేస్తారని రంగా గారికి 1974 నుండే తెలుసు, అంతెందుకు చచ్చిపోడానికి గంట ముందుకూడా తెలుసు.
కానీ పిరికి వాడిలా పారిపోలేదు,,, జనంకోసం చచ్చిపోవడానికే నిర్ణయించుకున్నాడు.
ధైర్యం అనే పదానికి అర్ధం వంగవీటి మోహనరంగా రావు గారు.
మృత్యువు సైతం కంటతడి పెట్టింది, రంగన్న వీరమరణాన్ని చూసి.
ఓ మహిళ ను అన్యాయంగా శిరోముండనం (గుండు గీయడం) చేసిన పోలీసులను యెదిరించినందుకు, ఖాకీలకు ప్రజాప్రతినిధి కి మద్య జరిగిన వివాదమే రంగా గారి ఆమరణ నిరాహారధీక్షకు దారి తీసింది.
అప్పటి CM – తన అల్లుడి మాటలు విని, అప్పటి హోంమంత్రి, నెహ్రూ ల మాటలు విని రంగా గారికి సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు అప్పటి CM.
(చంపాలనే ఉద్దేశం ఉండబట్టేగా సెక్యూరిటీ ఇవ్వనిది??? పైకి మాత్రం మామ మంచోడు అల్లుడే చంపించాడు అంటారు, అందరూ ముద్దాయిలే అని మరువకండి అమాయకులారా)
రంగా గారిని చంపుతారని అందరికీ తెలుసు, తెలిసే అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి పుంజాల శివశంకర్ నాయుడు గారు 6 గురు కమేండోలోను స్టెన్ గన్స్ తో సెక్యూరిటీ గా కేంద్రం తరపునుంచి పంపిస్తానని ఆ దుర్మార్గ CM కు కు సిఫార్సు చేశాడు. కానీ ఆ దుష్టుడు తిరస్కరించాడు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి – సిరీస్ రాజులు డబ్బులు సిద్ధం చేశారు, దేవినేని నెహ్రూ గూండాలను ఎరేంజ్ చేశాడు, CM సెక్యూరిటీ ఇవ్వకుండా లైన్ క్లియర్ చేశాడు, CM అల్లుడు డైరెక్షన్ చేశాడు.
అందరూ కలిసి చంపేశారు,, వెలగపూడి రామకృష్ణ ని బాబు నిర్ధోషి అని కోర్టు తీర్పు ఇచ్చింది.
అందరూ కలిసి ప్రజా హృదయ నేతను నడిరోడ్డు మీద గొడ్డల్లతో కత్తులతో నరికి చంపేశారు..
రంగన్న శరీరం మీద 40 కు పైగా కత్తిపోట్లు దిగాయి…
రంగా గారి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు, జనం లక్షలాదిగా తరలి వచ్చారు.
ఓ పక్క రంగన్న డెడ్ బాడీ, ఇంకోపక్క రంగన్న ను చివరిసారిగా చూసేందుకు వచ్చిన లక్షలాది జనం. ఇవే అప్పటి వారికి కళ్లముందు కనిపించిన దృశ్యాలు… ఇప్పటికీ వారు గుర్తు చేసే విషయాలు.
రంగా అమర్ రహే! రంగా అమర్ రహే! అంటూ, భోరున ఏడుస్తున్న అభిమానుల విషణ్ణ వదనాలతో కృష్ణా నదీ తీరాన స్వర్గపురిలో రంగన్న అంతిమ యాత్ర ముగిసింది…
రంగన్న శకం ఆ విధంగా అంతం ఐంది..
ఆయనతోనే నీతీజాతీ కూడా కాలగర్భం లో కలిసి పోయింది!
రాష్ట్ర చరిత్రలో పచ్చోళ్లకు భయం అంటే ఏంటో చూపించి, వారి అరాచకాలను దోపీడీలను యెదిరించి, వారికి ఉచ్చ పోయించిన ఏకైక మగాడు రంగా గారు ఒక్కడే.
జనం కోసమే పుట్టాడు. జనం కోసమే బతికాడు. జనం కోసమే చచ్చిపోయాడు.
SC, ST, BC, కాపు, బ్రాహ్మణుల కోసం యెన్నో పోరాటాలు ఉద్యమాలు చేశాడు…
బడుగు వర్గాలను బెజవాడ సిటీకి మేయర్ చేశాడు, కార్పోరేషన్ ఎన్నికల్లో వారికి సీట్లన్నీ ఇచ్చి సామాజిక న్యాయం ను అమలు చేసిన ఏకైక వ్యక్తి.
Explore the Vangaveeti Mohana Ranga real story in telugu, his family legacy, and his impact on the Kapu community.
Leave a Reply