Kodi Rammurthy Naidu

కోడి రామ్మూర్తి నాయుడు గారు 4 April 1882 న వీరఘట్టంలో జన్మించారు. ప్రఖ్యాతి గాంచిన తెలగ వీర యోధుల వంశాలలో కోడి వారి వంశం ఒకటి.

Kodi Rammurthy Naidu

Kodi Rammurthy Naidu Garu

Name Kodi Rammurthy Naidu
Born 4 April 1882, Veeraghattam, Parvathipuram Manyam (d.t)
Died 16 January 1942, Balangir
Parents Kodi Venkanna Naidu, Appala Kondamma
Height 5 feet 6.5 inches (169 Centimeters)

కోడి రామ్మూర్తి నాయుడు గారు April 1882 న శ్రీకాకుళం జిల్లా, ( ఇప్పటి పార్వతీపురం మన్యం జిల్లా) పాలకొండ సమీపంలోని వీరఘట్టంలో జన్మించారు.

తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి గాంచిన తెలగ వీర యోధుల వంశాలలో కోడి వారి వంశం ఒకటి. ఈ వంశ వారసత్వంలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు గారే వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లి అప్పల కొండమ్మ చనిపోయింది. తండ్రి చెప్పడంతో విజయనగరంలో Circle Inspector గా పనిచేస్తున్న తన తండ్రిగారి తమ్ముడైన (బాబాయి) కోడి నారాయణస్వామి పెంపకంలో పెరిగాడు. చిన్నతనం నుండి రామ్మూర్తి నాయుడు గారు బస్కీలు, కాసరత్తు రోమన్ రింగ్స్ వాటిపై ఆసక్తి చూపేవాడు. ఒకసారి ఊబిలో పడిన ఎద్దుని ఎవరి సహాయం లేకుండా ఒక్కడే కాపాడి రక్షించి, విజయనగర ప్రజల ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి తన దేహ దృడాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నాడు. 21 సంవత్సరాల వయసులోనే ఇతని ఛాతి పైన 1 1/2 టన్నుల బరువుని మోసేవాడు. తరువాత 3 టన్నుల బరువుని కూడా మోయగలిగేవాడు. విజయనగరంలో సర్కస్ కంపెనీ వాళ్ళు నిర్వహించిన కుస్తీ పోటీలలో నాయుడుగారు తనకంటే పెద్దవారైనా బలవంతులపై గెలిచి, అందరిని ఆశ్చర్యపరిచాడు. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామ ఉపాధ్యాయుడిగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.

విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహాయంతో సర్కస్ కంపెనీ పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన ప్రతిభను గుర్తించిన తుని మహారాణి గారు ఆర్ధిక సహాయం అందించి ప్రోత్సహించారు. రామమూర్తి సర్కస్ కంపెనీ చాలాచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకుంది. తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు వెళ్ళాడు. పులులు, ఏనుగులు, గుర్రాలు, చైనా, జపాన్ కళాకారుల సహాయ సహకారాలు ఆయనకు లభించాయి. రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి ఆకర్షించాయి. శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని గట్టిగ బిగబట్టి ముక్కలుగా తెంపేవాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని, కార్లను వేగంగా నడపమనేవాడు. అప్పుడు ఆ కార్లు కదలకుండా ఆపేవాడు. ఛాతీ పై పెద్ద ఏనుగును ఎక్కించుకుని 5 నిమిషాల పాటు, రొమ్ముపై అలాగే ఉంచుకునేవాడు. భారీసంఖ్యలో జనాలు వారి ప్రదర్శనలు చూడడానికి వెళ్లేవారు.

పొందిన బిరుదులు

పూణే లో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ గారు రామమూర్తి నాయుడు గారికి మల్లమార్తాండ, మల్లరాజ అనే బిరుదులిచ్చారు. అలాగే విదేశాలలో కూడా ప్రదర్శించి భారత ప్రతిభను చూపించమని ప్రోత్సహించాడు.

హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర అనే బిరుదునిచ్చారు.

రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని అప్పటి వైస్రాయి లార్డ్ మింటో వచ్చాడు. రామమూర్తి గారు అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు మాత్రమే చేసాడు. రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యి, తానే పరీక్షించాలనుకుని తన కారును కూడా కట్టుకోమని కోరాడు. రామమూర్తి నాయుడు త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. కారులో కూర్చున్న లార్డ్ మింటో తన కారును వేగంగా నడపడానికి ప్రయత్నించాడు. అంతే, కారు ఒక సెంటీమీటర్ కూడా కదలలేక పోయింది. ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలతో, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు.

అలహాబాదులో అఖిల భారత కాంగ్రెస్ సభ జరుగుతుంటే అక్కడ కూడా రామమూర్తి నాయుడు గారు సర్కస్ ప్రదర్శనలిచ్చారు. జాతీయ నాయకులు ఎందరో చూసి ఆనందించారు. బాలగంగాధర్ తిలక్ గారు, పండిత మదనమోహన మాలవ్యా గారు ఎంతగానో మెచ్చుకుని, విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు.

విక్టోరియా మహారాణి కలియుగ భీమా బిరుదునిచ్చి సన్మానించారు.

రావణుడి తరువాత చాల సమయం పాటు జలస్థంభన చేయగలిగే ఏకైక వ్యతి మన కోడి రామ్మూర్తి నాయుడు గారు.

విదేశాలలో ప్రదర్శన

రామ్మూర్తి నాయుడు గారి సర్కస్ కంపెనీ బాగా పెరిగింది. తన 1600 మంది బృందంతో లండన్ వెళ్ళి ప్రదర్శనలిచ్చారు. సుప్రసిద్ధ మల్లుడైన గామా పహిల్వాన్ సోదరుడు (తమ్ముడు) ఇమామ్‌ బక్షీ ఆ బృందంలో వుండేవాడు.

లండన్‌లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తి నాయుడు గారి ప్రదర్శనలను చూచి ఆశ్చర్యపోయారు. రామమూర్తి నాయుడు గారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనంలో విందుకి ఆహ్వానించి, ఇండియన్ హెర్కులస్ బిరుదుతో సత్కరించారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచేత, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు గారు. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో కూడా కొన్ని ప్రదర్శనలిచ్చారు.

స్పెయిన్ దేశంలో 'కోడె పోరాటం' (బుల్ ఫైట్) చాలా ప్రతేయకమైనది. ఈ పోరాటం చాల ప్రమాదకరంగా ఉంటుంది. రామమూర్తి నాయుడు గారిని ఆ పోటీలో పాల్గొనమన్నారు. అలాంటి పోరాటంలో ఎలాంటి అనుభవంలేని రామమూర్తి గారు ' సరే ' అన్నారు. రామమూర్తి నాయుడు గారు రంగంలోకి దిగారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో మట్టికరిపించాడు. కోడె చిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల ఆనందాల అరుపులతో స్టేడియం దద్దరిల్లింది.

జపాన్, చైనా, బర్మాలలో రామమూర్తి నాయుడు గారి ప్రదర్శనలు ఎంతో వైభవంగా జరిగాయి.

బర్మాలో ఉన్నపుడు రంగూన్‌లో ప్రదర్శనలిచ్చారు. అసూయపడే కొంతమంది వెధవలు రామమూర్తి నాయుడు గారిని చంపాలనుకున్నారు. ఎలాగో ఈ విషయం గ్రహించిన రామమూర్తి నాయుడు గారు చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇంకొకసారి రష్యా ప్రదర్శనలో ఆహారంలో విషం కలుపగా అది గ్రహించిన నాయుడు గారు ప్రాణాయామం చేసి విషాన్ని సైతం జీర్ణించుకున్న కలియుగ భీముడు మన కోడి రామ్మూర్తి నాయుడు గారు. పోకనాడు (పాకనాడు) లో పెద్ద తుఫానుకి ధాటికి తన సర్కస్ గుడారాలు కుప్పకూలిపోగా, గొలుసులు తెంపుకున్న మద మెక్కిన ఏనుగు నాయుడు గారి ఛాతీపై కాలుతో తొక్కింది. ఆ దృశ్యం చూసిన జనమంతా ఆయన చనిపోయారని భావించారు. కానీ ఏనుగు కాళ్ళకింద నలిగిన ఆయన చెక్కుచెదరలేదు. అప్పటినుండి ఏనుగుని ఆయన ఛాతీపై ఒక చెక్కనివేసి దానిపై ఎక్కించుకోవడం ప్రారంభించాడు. వారి సర్కస్ ప్రదర్శనలో అది ముఖ్య ఆకర్షణగా నిలిచింది. పశ్చిమ దేశాలలో పర్యటించిన మొట్టమొదటి వస్తాదు నాయుడు గారే. రామమూర్తి గారు కోట్లు సంపాదించారు. అంతకంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు పెట్టారు. నాయుడుగారి బల ప్రదర్శన విషయం తెలిసినంతగా ప్రజలకి అతను చేసిన దాన ధర్మాలు తెలియకపోవచ్చు. దానికి కారణం ఆయన గుప్తా దానాలు చేయడమే. జమీందార్లు, సంస్థానాధీశులను మించిన దానం చేసారు. ఆ రోజుల్లోనే 2 కోట్లువరకు దానం చేసారు.

భారతదేశం మొత్తం రామమూర్తి నాయుడు గారి పేరు మోత మోగిపోయింది. అమెరికా వెళ్లాలని అనుకున్నారు. కాని వెళ్ళలేదు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తి నాయుడు గారి గురించి పొగడ్తలు ఉండేవి. రామమూర్తి నాయుడు గారు పండిత మదన మోహన మాలవ్యాగారి అతిథిగా సంవత్సరంపాటు బెనారస్ లో ఉన్నారు. ఆయన శాకాహారి. భారతదేశంలో అతి పెద్ద వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించ లేదు.

ఆయనకు 55 సంవత్సరాల వయసులో డబ్బులు లేక చాల ఇబ్బందులు పడ్డారు. అదే సమయంలో సర్కస్ కంపనీకి నష్టం రావడం, కంపెనీ మూసివేయడం, ఒక ప్రదర్శనలో ఏనుగుని ఛాతీపై ఎక్కించుకునేటప్పుడు పలచని చెక్క వేయడంవలన చెక్క విరిగి ఏనుగు కాలు ఆయన ఛాతీపై పడి ఒక ప్రక్కటి వేముక విరిగింది. వైద్యం చెయ్యగా కొన్నాళ్లకి నయం అయ్యింది. కానీ మరల ఆ ప్రదర్శన చేయడానికి వీలుపడలేదు. అదే సమయంలో ఆయన ఎడమ కాలు మడిమపై రాచకురుపు లేచి అది పెద్ద సెప్టిక్ అయ్యి డాక్టర్లు కాలు కాలుతీసివేయవలసి వచ్చింది. సంపాదించిన ధనం మొత్తం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరుగుతున్నపుడు ఎటువంటి మత్తుమందును (Chloroform) తీసుకోకుండా ప్రాణాయామం చేసి నొప్పిని ఓర్చుకున్నాడు.

వరవిక్రయం, మధుసేవ వంటి గొప్ప సాంఘిక నాటకాలను రచించిన, విఖ్యాత నాటక కర్త కాళ్ళకూరి నారాయణరావు గారు, కోడి రామమూర్తి గారి ప్రాణ మిత్రులు. నాయుడు గారిని ప్రశంసిస్తూ "సాధుపథవర్తి సన్మిత్రచక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి" అన్నారు. మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ పదాలు అయినట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు, బలానికి పర్యాయపదంగా మారింది.

రామమూర్తి నాయుడు గారు చివరిరోజులు బలంఘర్, పాట్నాలో కలవాండి (ఒరిస్సా) పరగణా ప్రభువు దగ్గర వుండి 16 జనవరి 1942 కనుమ రోజున కన్ను మూశారు. అప్పటికి ఆయన వయసు 59 సంవత్సరాలు. తెలుగువారే కాక భారతీయులు అందరు గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, కలియుగ భీముడు కోడి రామమూర్తి నాయుడు గారు.

Kapu Caste Zamindars | Kapu Caste Sports Players | Kapu Caste Freedom Fighters | Kapu Community