Koppula Prasad

Koppula Prasad was born on September 12, 1977, to the couple Subbalakshmamma and Ramakrishnudu at Gudipati Gadda in the Nandyal area.

Koppula Prasad
Name Koppula Prasad
Born 12 September 1977, Bhupanapadu, Panyam
Parents Subbalakshmamma, Late: Ramakrishnudu
Wife Swapna
Children Sai Dharani, Chandra Harini
Occupation Telugu Lecturer, Poetry Writer

కొప్పుల ప్రసాద్ గారు 1977 సెప్టెంబర్ 12 తేదీన నంద్యాల‌ ప్రాంతంలోని గుడిపాటి గడ్డ నందు సుబ్బలక్ష్మమ్మ, రామకృష్ణుడు అనే దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం ప్రాథమిక విద్య స్వస్థలం భూపనపాడు , హైస్కూల్ విద్య నందివర్గం , ఇంటర్ నేషనల్ కాలేజీ, డిగ్రీ అంబేద్కర్ విశ్వవిద్యాలయం , పీజీ (తెలుగు) శ్రీకృష్ణ దేవరాయల‌ విశ్వవిద్యాలయం కర్నూల్ పీజీ సెంటర్లో విద్య పూర్తి చేయడం జరిగింది. 2008 స్వప్న గారితో వీరికి వివాహం జరిగింది. సాయి ధరణి ,చంద్ర హరిణి ఇద్దరు అమ్మాయిలు వీరి సంతానం. వీరు ప్రస్తుతం ఇంటర్ ప్రైవేట్ కాలేజీలలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు. శ్రీమతి స్వప్న గారు కస్తూరిబా స్కూల్లో కాంట్రాక్ట్ టీచరుగా పనిచేస్తున్నారు.

సాహితీ ప్రస్థానం

చిన్నప్పటినుంచి పెద్దవాళ్ల దగ్గర విన్న కథలు, చూసిన నాటకాలు, చందమామ, బొమ్మరిల్లు చదివిన పుస్తకాల అనుభవంతో ఇంటర్ లోనే చిన్న చిన్న కవితలు రాయడం ప్రారంభమైనది. శ్రీ బాలాజీ విద్యా మందిర్ అనే ప్రైవేట్ స్కూల్లో టీచరుగా ఉద్యోగ జీవితం ప్రారంభమైనది. అక్కడ పిల్లల కోసం ఆగస్టు 15, జనవరి 26 కవితలు, పాటలు, గేయాలు రాయడంలో పిల్లలకు సాహిత్యం అవగాహన కల్పించడం జరిగేది. అలా చాలా గేయాలు, పాటలు కవితలు రాసేవారు.
మొట్టమొదటిసారిగా 10/11/2018 పుట్టపర్తిలో రాయలసీమ మహాకవి సమ్మేళనంలో మొట్టమొదటిసారి పాల్గొనడం జరిగింది. దాదాపు ఇప్పటికీ 100కు పైగా కవి సమ్మేళనాలు, సాహితీ సభల్లో ‌ పాల్గొన్నారు. వందకు పైగా రెండు తెలుగు రాష్ట్రాలలో సన్మానాలు కూడా జరిగాయి. తనకొచ్చే చిన్నపాటి ఆదాయం తోనే వందల కొలది సాహితీ పుస్తకాలు కొని నిరంతరం చదువుకునేవాడు. తన నిరంతర సాహితీ పిపాసి అతనొక రచయితగా నిలబెట్టినాయి.

చూచిన ప్రతి వస్తువును వర్ణించడం అతని తత్వం. బాధనైనా సుఖాన్ని అయినా కవిత్వంలో పంచుకుంటూ నలుగురు ముందు ఉంచుతాడు. ఇప్పటివరకు ఐదు పుస్తకాలను దాతల సహాయముతో ముద్రించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన డాక్టర్ వి.డి రాజగోపాల్ గారు "చిరునవ్వు పలకరిస్తే", "శూన్యపు మనసులో చిగుళ్ళు" పుస్తకానికి ఆర్థిక సహాయం, అలాగే రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారు "ప్రేమ పూల పరిమళాలు", "పసి నవ్వుల అలలు" అనే పుస్తకాలకు ఆర్థిక సహాయం అందించారు. అలాగే ఆర్ల చిన్న తిరుపాల్ గారు "అక్షర నేత్రం" పుస్తకాన్ని ఆర్థిక సహకారం అందించారు. దాతలు ముందుకు వస్తే ఇంకా మరికొన్ని పుస్తకాలు ముద్రించడం జరుగుతుంది.

ఇప్పటివరకు ప్రచురించిన పుస్తకాలు

  1. చిరుగాలి పలకరిస్తే,
  2. శూన్యపు మనసులో చిగుళ్ళు
  3. అక్షర నేత్రం
  4. ప్రేమ పూల పరిమళాలు
  5. పసి నవ్వుల అలలు

2500 పైగా కవితలు, వ్యాసాలు, సమీక్షలు ,నాటికలు, కథలు పాటలు, పిల్లల గేయాలు, కొప్పుల వారి కబుర్లు పేరిట నవ తెలుగుతేజ మాస పత్రికలు ఆధ్యాత్మిక విషయాలు . వందల కవితలు అన్ని ప్రముఖ దినపత్రికలలో, ఆదివారం పుస్తకాలలో, మాస పత్రికలలో ప్రచురించడం జరిగింది.

ఇప్పటివరకు అందుకున్న బిరుదులు

కవి చక్ర, మధుర కవి చంద్ర, సాహిత్య మిత్ర, దేశభక్తి సాహిత్య భాస్కర, కవన సకిన వల్లభ,కవి మిత్ర, బిరుదులందుకున్నారు.

ఇతర పురస్కారాలు జాషువా పురస్కారం, జాతీయ గిడుగు రామ్మూర్తి పురస్కారం, బోయ భీమన్న పురస్కారం,జాతీయ ఉగాది పురస్కారం, ప్రతిలిపి వారి గోల్డెన్ బ్యాడ్జ్ పురస్కారం, అనేక కవితల పోటీల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల నగదు పురస్కారాలు. తెలుగు ఇజం పురస్కారం, లైన్స్ క్లబ్ సాహితీ సేవ పురస్కారం, లోటరీ క్లబ్ ఉత్తమ కవి పురస్కారం

విద్యాపరంగా అందుకున్న పురస్కారాలు:
ఎస్ వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ వారి నుండి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం,నంద్యాల లైన్స్ క్లబ్ వారి నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, గురు బ్రహ్మ నేషనల్ అవార్డు వే ఫౌండేషన్ వారి గురు స్పందన అవార్డు, స్పందన ఈదా ఇంటర్నేషనల్ వారి.

కొప్పుల ప్రసాద్,రచయిత ఇంటి నెంబర్ 19/ 88 గుడిపాటి గడ్డ, నంద్యాల, నంద్యాల జిల్లా ఆంద్రప్రదేశ్. Contact: +91 9885066235

Koppula Prasad

Koppula Prasad was born on September 12, 1977, to the couple Subbalakshmamma and Ramakrishnudu at Gudipati Gadda in the Nandyal area.