Kapu Jathi Kavithalu

Kapu Jathi Kavithalu కొప్పుల ప్రసాద్ గారు కాపుల గురించి, కాపు జాతి గురించి రాసిన కాపు కవితలను (kapu Poems) చదవండి.

Kapu Jathi Kavithalu

కాపు జాతిదే పెద్దన్న పాత్ర..!!

వ్యవసాయ దేశాన రైతన్నలం
ఏండ్ల చరిత్రలో పెద్దన్నలం
అన్నం పెట్టే అన్నపూర్ణ మనమే
దానగుణం మెండుగా ఉన్నోళ్ళం..

అద్భుతమైన ద్వీపకల్పంలో
అమర జ్యోతుల్లా వెలుగుతున్న జాతి
ఆది నుంచి ఉంది అమృతత్వం పొంది
బండాంతరాలు దాటి కనకమై మెరుస్తుంది..

రాయలోరి పౌరుషం పుణికి పుచ్చుకొని
గ్రామాలలో స్థిరపడ్డాం
గ్రామాధికారులమై నిలబడ్డం
గ్రామ సమస్యకు పరిష్కారాలుగా నిలిచాం..

ఊరికి కంచెలా నిలిచిరి కాపులు
పేదలకు సహాయపడే సేవకులు
దాతృత్వములో అపర దానకర్ణులు
అభిమానించడంలో ఆత్మబంధువులు..

ప్రాంతం ఏదైనా జాతంతా ఒక్కటే
పేర్లు వేరైనా మనమంతా ఒక్కటే
కాపు, బలిజ,మున్నూరు, ఒంటరి తెలగ
ఏదైతేనేం ఎక్కడైతేనేం మనం మనమే..

నాయుడు అయినా రాయలైనా
మీసంలోనే పౌరుషం నిండుగా కనిపించే
రతనాల సీమలో రాజసం ఉట్టిపడే
తెలంగాణలో తేజోమయంగా ప్రకాశించే…

కోస్తా ఆంధ్రాలో బంగారు సింహాసనం మనదే
జాతి శాసిస్తే ఫలితమే దేశాన్ని నడిపించే
జాతి ఏకమై రాజ్యాలే పాలించే
కళ్ళముందు పవనమై కదలాడ సాగెను..

వ్యాపార రంగాన ఆరితేరిన వ్యక్తులు
సినిమా రంగాన చిందులేసిన కథానాయకులు
సాహిత్యములో సరసులైన కవులు
రంగమేదైనా ఆణిముత్యాలు జాతి బిడ్డలే..

అన్ని రంగాలలో ఖ్యాతిగాంచిన ఘనులు
దేశాభివృద్ధికి వెన్నెముకగా నిలిచారు.
ప్రతి పనిలో ఉనికిని చాటుతూ
భరతమాత ముద్దుబిడ్డలుగా సాగుతున్నారు..

కాపు జాతి కోసం పోరాటం చేద్దాం…

మన అందరిదీ ఒకే మాట
మన జాతికి అదే బాట
మాటమీద నిలబడుదాం
కాపు జాతి కోసం పోరాటం చేద్దాం…

సమయం ఆసన్నమైంది సోదరా
జనంలోకి వెళ్దాం
జన సైనికులై నిలుద్దాం
పిడికిలి బిగించి జాతిని నడిపిద్దాం..

ఒకే మాట ఒకే బాట జాతికదే శ్రేయస్సు
కాపాడుకుందాం కాపు జాతి యశస్సు
కల్లబొల్లి మాటలన్నీ పక్కన పెట్టి
జాతి గొప్పతనం చాటుకుందాం రండి…

కృష్ణ రాయలకు వారసులమంటూ
గొప్ప లెన్నో చెప్పుకుంటూ
ఇంకెన్నాళ్లు తిరుగుదాం
పాలె గాళ్ళ పౌరుషాలనింకెపుడు చూపుదాం.

మంచితనానికి మనమే రాజసం
ప్రజాస్వామ్యంలో నిలబడితే రాయలం
ఐక్యమై పోరాడితే రాజకీయంగా నిలబడుతాం
పోరాడి హక్కులను పొందగలుగుతాం…

ఇకనైనా మొద్దు నిద్ర నుండి లేవండి
అంతా ఒక్కటై ప్రభంజనం సృష్టించండి
కాపు జాతి మేలు కోసం తపిస్తూ
రాజ్యాధికార దిశగా పోరాటం సాగిద్దాం..

మనల్ని విడదీసే నాయకులకు బుద్ధి చెప్పుతూ
ఐక్యతారాగాన్ని ఆలపించుదాం
కాపు చైతన్య గీతాన్ని ఆలపిస్తూ
చెయ్యి చెయ్యి కలిపి తిరుగుదాం రారండి…

అవకాశం వచ్చింది సోదరా
జాతి అభివృద్ధికి బీజాలు వేద్దాం
కచ్చితమైన విజయాన్ని సాధిద్దాం
పోరాటాలు సలిపి విజయబావుటాన్నె గనేద్దాం…

అధిక భాగం మనం ఉన్నాము
పిడికిలళ్ళు బిగించి పోరాటం సాగిద్దాం
వోటు అనే ఆయుధాన్ని ప్రయోగించి
జయకేతనమెగరేద్దాం రండి రండి సోదరా…

ఇంకెన్నాళ్లు బానిసలుగా బ్రతుకుతాం
భవితకు బాటలేసేందుకు కదులుదాం
మన పిల్లలకు కాపు కాసేందుకు నిలుద్దాం
రాజ్యాధికారాన్ని సాధించేందుకు కృషి చేద్దాం…..

భరతమాత నుదిటి తిలకం ఈ కాపు జాతి..!!!

కాపు జాతి సోదరుడా
బలమైన గ్రామ నాయకుడా
పురాతన పురుషుడా
పుణ్యభూమిలో వెలసిన ధీరోదాత్తుడా ..

భరతమాతకు నుదుటి తిలకమై ప్రకాశిస్తూ
వ్యవసాయ దేశాన రైతుగా వెలుగొందుతూ
అన్నపూర్ణకు ఆయుష్షునందిస్తూ
ప్రజల ఆకలి తీర్చే అన్నదాతవు నీవే నీవే..

వేల సంవత్సరాల నుండి వెలుగొందు జాతి
నేలపై నడయాడిన మహోన్నత జాతి
ఆంధ్రదేశంలో అజరామరమై నిలిచింది
పౌరుషాన్ని రూపంగా ధరించిన గొప్ప జాతి.

అన్నదానము చేసిన మహాదాతలు మనవారు
గ్రామ పెద్దలై వెలగొందిన వీరాధి వీరులు
యుద్ధ రంగంలో వెన్ను చూపని పోరాట యోధులు
జాతిని ముందుకు నడిపిన మహారథులు ఎందరో…

చరిత్రలో మహామహులు కాపు జాతి బిడ్డలు
రాయల రాజసంతో వెలుగొందిన నాయకులు
అనేక రంగాలలో ఆరితేరిన మహోన్నతులు
జాతికి ముద్దుబిడ్డలై వెలుగొందుతున్నారెందరో..

తెలుగునాట మన వెలుగు కాంతిపుంజములా ఉంది
దేశ చరిత్రలోన సూర్యబింబములా వెలుగుతుంది
జాతి కిరణాలతో భూమి సస్యశ్యామలం అవుతుంటే
నాగలి పట్టిన మన భుజాలు దేశాన్నంతా మోస్తున్నాయి..

ప్రజాస్వామ్య చరిత్రలో మనకంటూ ఒక అధ్యాయం
తెలుగు నేలపై “పవన” మై నేడు వీస్తుంది
జన సేనాని నాయకత్వంలో చరిత్ర లిఖిస్తూ
కాపు జాతికొక పరిపూర్ణత ప్రసాదిస్తుంది..

ఐక్యంగా ఉన్నామంటే అద్భుతాలు సాధిస్తాం
చెయ్యి చెయ్యి కలిపితే చరిత్ర సృష్టిస్తాం
నాయకులుగా ఎదిగి మన బలం నిరూపిద్దాం
కాపు జాతి చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖిదాం..

జయ్ కాపు జాతి జయ్ జయ్ కాపు జాతి
జయ్ భరతమాత జయ్ జయ్ భరతమాత

బలిజలం బలమైన నాయకులం ..

బలిజలం మేము బలమైన బంధం మాది
చేసేది వ్యవసాయం అందరికీ చేస్తాం సాయం
గ్రామాల్లో పెద్దలం గౌరవానికి ప్రతినిధులం
ఊరికి సమస్య ఉంటే ముందే ఉంటాం మేము…

దేశమంతా విస్తరించాం
తెలుగు రాష్ట్రాల్లో ముందడుగులో ఉన్నాం
వ్యవసాయ దేశాన కాపులమై నిలిచాం
భరతమాత నుదిటితిలకమై ప్రకాశిస్తున్నాం…

అగ్రవర్ణములో అధములై
అటు ఇటు కాక ఇబ్బందులు పడుతూ
పేరు గొప్ప ఊరు దిబ్బల బ్రతుకు బ్రతుకుతూ
సమాజములో సంఘర్షణలకు లోనవుతున్నాం…

కాపు, బలిజ, ఒంటరి, తెలగ. మున్నూరు
పేరు ఏదైనా ఐక్యతే మన బలం
ఆంధ్ర అయినా తెలంగాణ అయినా
రాష్ట్రమేదైనా సంఘంలో మనమంతా ఒక్కటే..

చరిత్రలో మహామహులు మన జాతిఘనులు
రాయలే మనకు ఆదర్శముగా నిలిచే
కత్తి పట్టిన వీరులు కాపు నేతలై ఏలినారు
సామ్రాజ్యాలు విస్తరించి దేశాన్ని సుసంపన్నం చేశారు..

ఏ రంగమైనా ఏ సంఘమైన కాపులదే అగ్రస్థానం
చరిత్రపుటల్లో చెరుగని చిరునామాలు మనవేజి
మన వీరుల పౌరుషాలు స్మరిస్తూ సాగుదాం
మన జాతిని జాగృతం చేస్తూ ముందడుగు వేద్దాం..

రాజకీయ చదరంగంలో ఎన్నాళ్ళు ఉంటాం పావులుగా
ఎంతకాలం కొమ్ము కాస్తాం? రెండు కులాల వారికి
కదులుదాం ఇకనైనా కదులుదాం మనమందరం
కాపు జెండా రెపరెపలాడేలా గద్దెనెక్కి కూర్చుందాం….

మేమే కాపులం బలిజలం..!!

మేము కాపులం మేమే బలిజలం
రాష్ట్రములో ప్రధమ స్థానం మా జాతి
అధికారంలో ద్వితీయులం
రాజకీయ చదరంగంలో పావులం…

రాయల్ వారసులం మేమే
ఏమాత్రం రాజసం చూపడం లేదు
అధికారాన్ని చేపట్టాలనే
ఆలోచన మనకెందుకు కలుగదోయ్…

జాతి ఐక్యతలో రాజకీయ ముసలం
వాడికి వీడికి ఊడిగం చెయ్యడం
చీమలా ఏకమైతే విజయం దక్కుతుంది
గడ్డి పూచలమై కలిస్తే బలం పెరుగుతుంది..

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కదిలితే
సంఘీయులంతా సంకటితం మై అరిస్తే
పదవులన్నీ దాసోహమై నిలుస్తాయి
బానిసత్వపు సంకెళ్లు తొలగుతాయి…

అల్పసంతోషులమంటూ ఎన్నాళ్లు బ్రతుకుదాం
రెండు కులాల కింద బానిసై నలుగుదాం
మనకంటూ ఇప్పుడు ఆశలు చిగురిస్తుంటే
మనలో మనం ఈర్ష్యా ద్వేషంతో తిరుగుతున్నాం..

చరిత్రలో సువర్ణపు అధ్యాయనం మాన జాతి చరిత్ర
రాజకీయ రాట్నం లో తెగిన నూలు పోగులం
ఖద్దరు చొక్కా పై ఉన్న శ్రద్ధ గద్య పై కనిపించదు
తెల్ల వస్త్రపు ఆనందం ముఖాల్లో వికసించదు..

ఇకనైనా ఆలోచనలు పదును పెట్టండి
సంఘాన్ని సంఘటితం చేసి విజృంభించండి
పోరాడితే పోయేది బానిస సంకెళ్లు
శ్రమిస్తే వచ్చేది అధికారపు ఆనందపు పరువల్లు…

మహనీయునికి అక్షర జోహార్లు..!!

ఆ రూపం కాపు జాతికి అపురూపం
నాయకుడిగా వచ్చిన మహా మనిషి
పీడిత వర్గాల పిడికిలిగా
అడుగున పడ్డ జాతులకు ఆయుధంగా నిలిచే…

కష్టమొస్తే నేనున్నానంటూ
ఓదార్చినటువంటి మహానేత
బడుగు వర్గాలకు బాసటగా ఉంటూ
వారి అభివృద్ధికి నిరంతరం కృషి సల్పినాడు…

కాపు జాతి ముద్దుబిడ్డగా విరాజిల్లుతూ
మనకు మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ
జాతీ వేసే అడుగుల్లో స్పష్టంగా కనిపిస్తూ
మన వెన్నుండి నడిపించే నిజమైన నాయకుడు…

తరతరాల నిరంకుశత్వాన్ని ఎదిరించేందుకు
నిద్రావస్థలో ఉన్న జాతి నీ మేలుకొల్పే
సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ
జాతి జనుల కోసం ప్రాణాలే కోల్పోయి..

ఆ మహావీరునికి అక్షర జోహార్లు అర్పిస్తూ
ఆయన స్ఫూర్తితో సాగుదాం మనమందరం
జాతి గుండెల్లో నిలువైన స్వరూపం
ఆయన ఆశయాలకు వారదులుగా నిలుద్దాం…

జన సునామీ….!!.

జన సునామీ సృష్టించే ఒకే ఒక్కడు
ప్రజల్లో చైతన్యం గీతం అతడే
హృదయాల్లో కలువైన నిండు రూపం
జన సైనికులే ఆయన రథం…

వారాహి మీద కనిపించే కోహినూర్
కోట్ల జనాల మధ్య మెరుస్తుంది
పాలకుల గుండెల్లో గుబులు రేపుతోంది
సామాన్యుడికి బ్రతుకు పై ఆశలు కలిగిస్తుంది..

పవన్ పట్టాభిషేకం కోసం జన మహెూత్సవం
అడుగుపెట్టిన చోటల్లా మహా వైభవంగా
జనసముద్రపు మధ్యలో జనసేన చిద్విలాసం
ఆణిముత్యమై జనాన్ని ఆకర్షించే…

అడుగంటిన ఆశల్లో ఆశాద్వీపం
పది సంవత్సరాలుగా పోరాడుతూ
జనం కోసమే జీవనం సాగిస్తూ
ఏ పదవి లేని ప్రజాస్వామ్య నాయకుడు…

కదులుతున్నది మహా అభయ చక్రము
ఎందరికో నీడగా తోడుగా నిలిచేందుకు
దుష్ట సంహారమే ఇక మిగిలిపోయింది
శిష్ట రక్షనే తన కర్తవ్యం గా సాగుతున్నది…

వంగవీటి మోహన రంగా గారి వర్థంతి సందర్భంగా….

మహనీయునికి అక్షర జోహార్లు….

ఆ రూపం కాపు జాతికి అపురూపం
నాయకుడిగా వచ్చిన మహా మనిషి
పీడిత వర్గాల పిడికిలిగా
అడుగున పడ్డ జాతులకు ఆయుధంగా నిలిచే…

కష్టమొస్తే నేనున్నానంటూ
ఓదార్చినటువంటి మహానేత
బడుగు వర్గాలకు బాసటగా ఉంటూ
వారి అభివృద్ధికి నిరంతరం కృషి సల్పినాడు…

కాపు జాతి ముద్దుబిడ్డగా విరాజిల్లుతూ
మనకు మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ
జాతీ వేసే అడుగుల్లో స్పష్టంగా కనిపిస్తూ
మన వెన్నుండి నడిపించే నిజమైన నాయకుడు…

తరతరాల నిరంకుశత్వాన్ని ఎదిరించేందుకు
నిద్రావస్థలో ఉన్న జాతి నీ మేలుకొల్పే
సమాన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ
జాతి జనుల కోసం ప్రాణాలే కోల్పోయి..

ఆ మహావీరునికి అక్షర జోహార్లు అర్పిస్తూ
ఆయన స్ఫూర్తితో సాగుదాం మనమందరం
జాతి గుండెల్లో నిలువైన స్వరూపం
ఆయన ఆశయాలకు వారదులుగా నిలుద్దాం…

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలతో..

నిజాయితీకి రూపమే అతను..!!

తానొక నిప్పు కణమై కదులుతూ
సినీ జగత్తులో పవన మై సాగుతూ
పేదల పాలిట పెన్నిధి గా తిరుగుతూ
నడిచొచ్చే ధైర్యంగా సాగుతున్నాడు..

అతని మాటలే జన సైనికులకు మంత్రమై
ప్రత్యర్థి గుండెల్లో స్వప్నం నీరుగాడ్చే
అన్యాయానికి ఎదురొడ్డి నడిరోడ్డుపై నిలిచే
అక్కడికక్కడే నిలదీసే తత్త్వం ఇతను..

ఉన్నది పంచడమే తెలిసిన మహా మనిషి
అక్రమ సంపాదన ఎరుగని నిజాయితీ
అవినీతికి ఆమడ దూరంలో సత్యాగ్రహి
నిజాయితీకి నిలువెత్తు స్వరూపం అతను..

ఆపదలో ఉన్న వాడికి అభయ హస్తం
కన్నీరు తుడిచే జాలి హృదయం
నేను ఉన్నానని చెప్పే కొండంత ధైర్యం
అభిమానులకు అతని మాటే శిరోధార్యం..

సినిమాలో రికార్డులు సృష్టించేందుకు రాలేదు
ప్రజా అభిమానంతో చూరగొనేందుకు వచ్చే
ప్రజాసేవయే పరమార్థంగా ముందు సాగుతూ
ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే..

మచ్చలేని మహోన్నత మానవతా మూర్తి
ప్రజా సేవకు పరితపించే స్వచ్ఛమైన నిగర్వి
సేవ చేయడమే తెలిసిన నిజమైన సేవకుడు.
ఏ ఫలితం ఆశించని మానవోతమ్ముడు..

ప్రజాస్వామ్యంలో నిత్యం యుద్ధము చేసే సేనాని
అన్యాయాన్ని అక్రమార్జన ఎదిరించే ధీరోదాత్తుడు
సింహంలా నడిచొచ్చి మనోధైర్యం గా నిలబడే
కష్టాన్ని చూసి కన్నీరు కార్చే సహృదయుడు..

కళ్ళలో కనిపిస్తుంది మానవత్వం పరిమళం
కుల మతాలు లేని సమానత్వం సౌందర్యం
ఎంతని వర్ణించను వ్యక్తిత్వం మహోన్నత శిఖరం
పేద వాళ్ళని ఆదుకోవడం అతని తత్త్వము..

మన వంతు కృషి చేద్దాం…!!

నా ఆయుధం అక్షరమే
జన సైనికునికి తోడుగా నిలుస్తూ
నా కంఠముతో జై కొడుతూ
జనాలకు సందేశం పంపుతా…

పవనానికి మేఘమై నడుస్తూ
జనసేనకు ఓట్ల వర్షం కురిపిస్తా
నాయకుడిని గద్య పై కూర్చోబెట్టేందుకు
నా అక్షరాలను నిత్యం ధారపోస్తా…

అక్షరమై గర్జిస్తా
పదిమందికి ఆలోచన కలిగిస్తా
మంచి మనిషికి చేదోడుగా నిలుస్తూ
చైతన్య గీతాలు ఆలపిస్తా…

కష్టము తెలిసిన మహామనిషి
మానవత్వానికి నిలువెత్తు రూపం
కష్టాన్ని చూసి కన్నీళ్లు కారుస్తూ
ఉన్నదంతా ధారపోసి రంతిదేవుడు…

నా కావ్య నాయకుడు అతను
లోక కళ్యాణాన్ని కాంక్షించేవాడు
వసుదైక కుటుంబం కోసం పరితపిస్తూ
అన్ని మతాలను సమానంగా చూస్తున్నాడు…

పేదవాడికి పిడికెడు అన్నములాంటోడు
మనిషి బాధపడితే సహాయం చేస్తూ
కన్నీళ్లకు కరిగిపోయే కల్మషం లేనోడు
మంచి చేయాలన్న ఆలోచన బలంగా ఉన్నోడు..

సుఖమైన జీవితాన్ని తేజించినాడు
ప్రజాస్వామ్యాన్ని నిలిపేందుకు పరితపిస్తూ
వారాహిపై విజయ ధ్వజముతో బయలుదేరాడు
మన వంతుగా కృషి మనం చేద్దాం.. రండి రారండి..

పిడికిలి బిగిస్తుంది జన ప్రవాహిని…..

పిడికిలి బిగిస్తుంది జన ప్రవాహిని
రెపరెపలాడుతుంది జనసేన జెండా
బడుగు జీవుల ఆకలి కేకలతో పుట్టింది
పవనం లా నేడు నేలపైన కదులుతుంది…

రుధిర మరకలు తుడిచేందుకు
జీవం కోల్పోతున్న మనుషులను రక్షించేందుకు
ఆకలి బాధలు తెలిసిన మనిషి
జనం బాధలు మోసేందుకు కదులుతుండు..

జనక్షేత్రములో పవనసుతుడు తిరుగుతుంటే
జనమే మేఘముగా కలిసి కదులుతుంటే
నేలపై వసంతమే వర్షించడానికి సిద్ధమయ్యే
లోక కళ్యాణము కోసం జనసేన కదులుతుంది…

అరాచక శక్తుల అంతమొందించేందుకు
పిడికిన పట్టిన పతాకము నింగిలో ఎగురుతుంటే
జన సమస్యలే తన సమస్యలు గా భావించి
కన్నీళ్లు తుడిచేందుకు మంచి మనిషి కదులుతుండు…

ఆడపిల్లలు హారతులిచ్చి ఆహ్వానమే పలకగా
గుమ్మడికాయల్లా దుష్టుల తలలు బద్దలవుతుంటే
నుదిటి వీర కుంకుమ విజయోత్సవం చూపుతుంటే
అడుగుపెట్టిన స్థలమంతా దండై కదులుతుంది…

వీర సైనికులు ప్రజాస్వామ్య విజయానికై
ధర్మబద్ధమైన పరిపాలన స్థాపించేందుకు
భుజం భుజం కలిపి రణక్షేత్రములో తిరుగుతూ
సత్యాన్ని గద్దె పై కూర్చోబెట్టేందుకు కదులుతుండ్రు..

ప్రజాసేవలో పెద్దోడిగా నిలిచే…..

అన్నప్రాసన నాడే కత్తి పట్టి
లోకోద్దరన కావించేందుకు వచ్చే
అంజనమ్మ చిన్న పుత్రుడుగా
ప్రజాసేవలో పెద్దోడిగా నిలిచే..

ఆకలి తెలిసినా అభాగ్యులు
నడిరోడ్డుపై నిద్రించిన సామాన్యులు
కష్టాలను చూసి తల్లడిల్లే
మృదుస్వభావం గల మహాముని….

మానవత్వంతో ముందుకు సాగుతూ
ప్రజాసేవ పరమావధిగా భావించే
కన్నీళ్లను తుడుచుకుంటూ బయలుదేరి
వరాహి యాత్రలో విజయాన్ని చేకూర్చే…

కణకణ మండే నిప్పు కణం
వెన్ను చూపని నిండైన గుండె ధైర్యం
ప్రజా పక్షంలో జైత్రయాత్ర కొనసాగించే
ప్రజల్లోనే చైతన్య శక్తిగా నిలిచే…

బడుగు జీవికి కవచంలా తోడుగా
కష్టాలను కన్నీళ్లను తుడిచే
పిడికిలి బిగించి ప్రజాక్షేత్రంలో సాగుతూ
అవరోధాలు ఎన్నో అధిగమించే…

సేవ నిర్వహణలో కల్మషం లేని హృదయం
స్వచ్ఛమైన మనసుతో స్పందిస్తూ
నేనున్నానంటూ భరోసా ఇస్తూ
బడుగు జీవులకు బంగారంలా మెరిసే..

గాయం విలువ తెలిసినోడు
తాను ఒక ఔషధములా తోడుంటే
ఎందరికో కన్నీళ్లు తుడిచినోడు
ప్రజాస్వామ్యంలో పెదాలకు నీడలా సాగిపోయే..

కోట్ల సంపద తృణప్రాయంగా వదిలి
ప్రజాసేవలో నిత్యం ప్రజల్లో తిరుగుతూ
రాజకీయాల్లో తులసి మొక్కలా ఎదుగుతూ
ఎందరికో ఆదర్శంగా అడుగులు వేస్తున్నారు..

పవనం వస్తుంది గాలి వీస్తోంది..!!

పవనం వస్తుంది.. గాలి వీస్తోంది
ఆంధ్ర నేలను పండించేందుకు
ప్రజాస్వామ్య విలువలు పెంచేందుకు
వారాహి రథముపై … పవనం వస్తుంది…

బడుగు జీవుల కన్నీళ్లు తుడిచేందుకు
అనార్తుల ఆకలి వేదన తొలగించేందుకు
చల్లని కబుర్లు నేలపై పంచేందుకు
విజయ బాగుట ఎగిరేసేటందుకు….

జనమే సైన్యంగా కదులుతుంటే
జననాయకుడు కోసం జనం చూస్తుంటే
ఊరు వాడ ఏకమవుతుంటే
ఎటు చూసినా నేలపై ప్రభంజనం కనిపిస్తుంది..

అవినీతిని అరికట్టేందుకు
స్వచ్ఛమైన పాలన అందించేందుకు
పేదవాడికి బాసటగా ఉండేందుకు
ఆంధ్రాలో పవనాలు చల్లగా కదులుతున్నాయి.

ఆకాశములో పవనం పిడికిలి పట్టి గర్జిస్తూ
లోక కళ్యాణము కోసం చినుకులు రాలుస్తూ
అన్యాయముపై పిడుగుల నిప్పుల కురిపిస్తూ
నిప్పులో కాలిన బంగారముల వస్తున్నాడు…

నిప్పుకు వాయువుల తోడవుదాం మనం
దోపిడీ రాజ్యాన్ని భూస్థాపితం చేద్దాం అందరం
ఊట నీరే నదిగా మారుతుంది
జనమంతా కలిస్తే తెలుగు నేల వికసిస్తుంది..

రండి రండి సోదరులారా.. కదలండి.. కదలిరండి
సమయం లేదు మిత్రులారా.. కదులుదాం రండి
అవకాశం వదులుకుంటే.. మరలా పాతాళమే
అవినీతికి కొమ్ము కాస్తే.. నరకపు రాజ్యమే వస్తుంది..

రోషం ఎందుకు కలగదు..!!

రాజసం మన సొంతము అయితే
రాజకీయం ఎందుకు చెయ్యలేం
ఊడిగం చెయ్యనీకే పుట్టామా??
మనం ఉజ్వల భవితను ఎందుకు చూడలేం…

జనాభాలో సగం బలం మనమే
రోషము ఎందుకు కలగడం లేదు
మీసాలు తిప్పుతూ ఎగురేద్దాం జెండా
ఇప్పుడు మనల్ని ఆపేది ఎవరు …

జాతి కళ్ళల్లో ఆనందం చూద్దాం
కులపోడికి తోడుగా నడుద్దాం
కలగడం లేదా జాతి మీద అభిమానం
సంఘం చొక్కాలో గౌరవంగా బ్రతుకుదాం..

రెండు వర్గాలదేనా ఎప్పుడు పెత్తనం
సన్యాసుల్లా మాట్లాడుతూ వైరాగ్యం బోధిస్తూ
ఇష్టం వచ్చినట్టు పాలక పక్షం తిడుతుంటే
జీవచ్ఛవంలా ఎన్నాళ్లు బ్రతుకుతాం మనం…

మనలో మనకే ఈర్ష్యా ద్వేషాలు
మన మధ్య చిచ్చుపెట్టే వెధవలెందరో
చెట్టు వేర్ల సహాయముతో ఎదుగుతుంది
మనందరి సహాయం “పవన”మై వీస్తుంది….

ఎన్నాళ్లు చెప్పుకుంటాం పాత గొప్పలు
కొత్త చరిత్ర లిఖించే రోజులు వస్తుంటే
అవకాశం కలిసి మన వెంట నడుస్తుంటే
చెయ్యికి చెయ్యి ఇచ్చి” సైనికుల”మై నిలబడుదాం…

సువర్ణ అవకాశం కళ్ళముందు కదులుతుంది
బలం, బలగం ,బంధు వర్గం నీడగా నడిస్తే
రాజకీయ పతాకం రెపరెపలాడుతుంది
గద్యపైన కూర్చుంటే లోక" కళ్యాణం" జరుగుతుంది..

“జనసేన సేనాని” రథముపై వస్తుంటే
దారిలో జనమంతా జేజేలు పలుకుతుంటే
సుభాన్ని ఇచ్చే వృత్తిని వదిలి తిరుగుతుంటే
మన వంతు సహాయం చెయ్యాలి కదా…

నిజాయితీ పరిపాలన రాష్ట్రానికి కానుకిద్దాం
బడుగు జీవులకు ఆత్మగౌరవం కల్పిద్దాం
రాష్ట్ర ప్రజల ఆశలను సజీవంగా ఉంచి
దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలుపుదాం…

కలిసి నడుద్దాం రండి రారండి…!!

కలుద్దాము రండి కాపులమంతా
గెలుద్దాం రండి రాజకీయంగా
అవకాశం వచ్చింది అందరం ఒకటవుదాం
నిర్మిద్దాం మన జాతి భవితకు సోపానాలు..!!

ఏకమవుదాం రండి రండి
నాయకుడొచ్చాడు కలిసి తిరుగుదాం
రాజకీయ యుద్ధ క్షేత్రములో నిలుద్దాం
జయకేతనం తొలి సారి ఎగురవేదం రండి….!!

ఎన్నాళ్లు బానిసల్ల బతుకుదాం
రాజుల పల్లకీలు మోసి మోసి అలిసిపోయాం
ప్రభువులమై ఇంకా మనం పాలిద్దాం
రాజకీయ చక్రములో చక్రవర్తులమవుదాం…!!

జన సైనికుడి అండ మనకుంది
రాష్ట్రాన్ని ఏలే శక్తి మనకు ఇప్పుడు వచ్చింది
సైనికుల్లా పోరాడుదాం
సంగ్రామములో సారధుల మై నిలుద్దాం…!!

రథము పైన నాయకుడు నిలబడ్డాడు
చెయ్యి చెయ్యి కలిపి వెంట నడుద్దాం
కాపు ఐక్యతను చూపించి కదం తొక్కుదాం
అవకాశం వచ్చింది మన శక్తి నిరూపిద్దాం..!!

రెండు జాతుల ఊడియం ఇక మానుకుందాం
మనల్ని మనమే పరిపాలించుకుందాం
కదలిరండి ఇకనైనా కదలి రండి కాపు జాతి పెద్దలు
ప్రతి వీరుడు ఒక సైనికుడై గెలిపిద్దాం గెలిపిద్దాం…!!

జన సేనకు జన్మదిన శుభాకాంక్షలు…

జన సునామీ సృష్టించిన అధినాయకుడు
ప్రజల్లో చైతన్య గీతంగా నిలిచాడు
ప్రజల హృదయాల్లో కొలువైన నిండు రూపం
శ్వాసలో ప్రజాసేవ నే ఆశగా కదులుతున్నాడు..

వారాహి మీద కనిపించే కోహినూరు లా మెరిసే
కోట్ల జనాల మధ్య తిరుగుతూ నిలిచే
ప్రజాసేవ నే పరమ దైవ సేవగా భావించి
సామాన్యుడికి బ్రతుకు పై ఆశలు కల్పించాడు..

జనసేన ఆవిర్భావానికి నాంది పలికిన ధీశాలి
నేడు గెలిచి చూపించిన చైతన్య దీప్తి
జనసముద్రపు మధ్యలో జనసేన చిద్విలాసంగా
ఆణిముత్యమై జనాన్ని ఆకర్షించిన రత్నం అతను..

అడుగంటిన బ్రతుకులకు ఆశాద్వీపం
పది సంవత్సరాలుగా పోరాటాలను సాగిస్తూ
జనం కోసమే జీవనం సాగిస్తూ
ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజాస్వామ్య నాయకుడు…

కూటమి విజయంలో ముఖ్య భూమిక
రాజకీయ చతురతతో ఆంధ్రాలో విజయం చేకూర్చే
వందశాతం విజయ దుందుభి మోగించి
ఆంధ్ర రాజకీయాలలో ఆణిముత్యం గా వెలుగొందే..

ఉపముఖ్యమంత్రి స్థానం అలంకరించి
బడుగు జీవులకు ఆసరాగా నిలబడే
పరిపాలనలో నూతన ఒరవడి సృష్టించేందుకు
ఆంధ్ర నేలపైన విరిసిన కాంతి పుంజం ఇతను….

గ్రామాలను స్వర్గసీమ లుగా మార్చేందుకు
అడవుల్లో పచ్చదనం నిలిపేందుకు
అవినీతి పరుల ఆటలు కట్టించేందుకు
ప్రజాస్వామ్యంలో ఒక ముత్యంలా మెరుస్తున్నాడు.

కలలు కన్న కాళ్ళకు వెలుగు పుంజంగా
జనాల గుండెల్లో జన సైనికుడివై వెలుగొందుతూ
ప్రజాస్వామ్య క్షేత్రంలో ప్రజల పక్షం నిలుస్తూ
రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న కృషివలుడు..

నీ రాకతో ఈ రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి జరగాలని
పరిపూర్ణ ఆయుష్షుతో జీవనం కొనసాగిస్తూ
హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలని ఆశిస్తూ
పవన్ కళ్యాణ్ గారికి శతకోటి జన్మదిన శుభాకాంక్షలు

మానవత్వం తెలిసిన పవన్ కళ్యాణ్

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం
సహాయం చేయడంలో నీవే ఆదర్శం
దానిలో వితరణ చెయ్యడం గొప్పతనం
ఇతరుల కోసం జీవించడం అత్యద్భుతం..

పేదల గుండె చప్పుడు విన్నటువంటి హృదయం
ఉన్నదంతా ధారపోసే స్వభావం
ఆకలి తెలిసినా అరణ్య రోదన నీకు తెలుసు
అభయ హస్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చావు..

ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు
పదిమందికి ఎంత చేస్తామన్నది సత్యం
ఉన్నదాన్ని పంచిపెట్టడం మహాత్ముల లక్షణం
సుగుణాల మానవత్వం నీకే సొంతం…

తన సంపాదన తాను అనుభవిస్తే భోగం
ఇతరులకు సహాయం చేయడమే నిజమైన త్యాగం
బడుగు జీవులకు ఆసరాగా ఉంటూ
భవిష్యత్తుపై ఆశలు కల్పించడమే విజయం..

లోక కళ్యాణమే మీకు మహాభాగ్యం
అందరి సౌభాగ్యం కోరే మహోన్నతులు
వరదల్లో బురద రాజకీయం చేయకుండా
కన్నీళ్లు తుడిచేందుకు సహాయం అందించావు..

చిన్న సహాయమే చిద్విలాసం
బుక్కెడు వెతుకులే అమృతతుల్యం
అందించే చేతులే ఆపత్కాలం కళ్యాణం
నీ సేవలే భవిష్యత్ తరాలకు ఆదర్శం…

పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

సంకల్ప బలమే ఆయుధంగా..

అతను ఒక నిప్పు కణాల పరిమాణం
ప్రశాంతంగా వీచే చల్లని మారుత పవనం
రాజకీయ ప్రత్యర్థులకు సింహ స్వప్నం
ఆంధ్ర రాష్ట్ర నేడు పవన్ కళ్యాణ్ శుభప్రదం..

నేటి ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గదర్శకులుగా
జనోద్ధరణ గావించేందుకు వచ్చిన పవనం
సంకల్ప బలమే ఆయుధంగా
ప్రజాసేవ చేయడానికి నడుస్తున్న క్రాంతి దర్శి..

త్రికరణ శుద్ధిగా నమ్మిన సిద్ధాంతాన్ని
స్థిర సంకల్పముతో పూర్తి చేసుకుంటూ
వ్యక్తిత్వమే ఆభరణంగా ధరించి
ఆసమాన్య కృషి సలుపుతున్న ధీరుడు..

ఉషోదయపు కాంతిలా వెలుగుతూ
సమాజసేవే జీవ లక్షణముగా సాగుతూ
తన ఆదర్శాలను ముందు తీసుకపోతూ
బడుగు జీవుల కోసం పోరాడే ధీరోదాత్తుడు…

నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండి
చైతన్య ప్రబోధిగా ముందుకు నడుస్తూ
నగ్నసత్యాలను ప్రజల ముందు ఉంచుతూ
అసలు సిసలైన వాస్తవ రాజకీయవాది..

ప్రజాక్షేత్రంలో పోరాటాల ఘనుడు
మైనపు వత్తిలా కరిగిపోయే జీవితంలో
ప్రజలకు సర్వస్వాన్ని అర్పించిన మహోన్నతుడు
కష్టాల్లో నేనున్నానంటూ పరిగెత్తే మహా త్యాగి..

ప్రజాసేవకు విరామమెరుగని ధన్య జీవి
జనపక్షపాతిగా కదిలే మహా మనిషి
పేదల కోసం ఆయన కృషి అనల్పం
ఆదర్శాలకు నిలువెత్తు నిఘంటువు అతను..

మహా నిరాడంబర జీవన ప్రయాణం
ఉన్నదంతా ధారపోసే వితరణ శీలి
విశాల భావాలు నిండుగా ఉన్న గని
ప్రజారక్షణ ముందుకు సాగే ధైర్యశాలి…

ప్రజాస్వామ్య క్షేత్రంలో ఒక ప్రమిదల
సంపూర్ణ జీవితాన్ని ఆరోగ్యంగా గడుపుతూ
శత వసంతాలను పూర్తి చేసుకోవాలని
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..

రికార్డులకు రారాజు చిరంజీవి..

చలనచిత్ర రంగం రికార్డుల రారాజు
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సృష్టికర్త
డాన్సుల్లో అరుదైన గౌరవం
తెలుగు సినీ పరిశ్రమకు అద్భుత వరం…

ఊహించని గౌరవం
ఊహకందని అరుదైన విజయం
నృత్య రీతుల్లో విశేషమైన కృషికి
దొరికినటువంటి ఘనమైన బహుమానం..

అత్యధిక సినిమా డాన్స్ స్టెప్పులతో
ప్రపంచంలోనే మేటి నృత్య ప్రదర్శనలు
అలరించే అద్భుతమైన స్టెప్పులు
ప్రపంచ రికార్డు నెలకొల్పిన కథానాయకుడు..

ఎక్కడైనా మెగా స్టార్
సినిమా రంగములో తిరుగులేని స్టార్
కష్టపడి సాధించి ఎన్నో రికార్డ్స్
తనకు తానే సాటిగా నిలిచే…..

అతని సినిమాలే నృత్యానికి నిదర్శనం
అవలీలగా అలరించే నృత్యాలు
తిరుగులేని డాన్సర్ గా ప్రఖ్యాతి గాంచే
వెండితెరపై స్టెప్పు లెన్నో ప్రదర్శించే..

పురస్కారాలకే గౌరవం తెచ్చిపెట్టే
నటనలో నవరసాలు పండించే
తన జీవితంలో రికార్డ్స్ ఎన్నో సృష్టించే
తిరుగులేని సినిమా హీరోగా నిలిచే…

నిత్య సాధన విజయచంద్రిక
గెలుపోటములే ఆయనకు ప్రతీక
నటనలో మేటి దీటైన నాయకులు
అందరి గుండెల్లో మెగాస్టార్ చిరంజీవి.

అభినందన చందన మాల
అందుకోవయ్యా అందరివాడా
అరుదైన గౌరవం దక్కింది
అందుకో ఆనందపు వేళ శుభాకాంక్షల సందేశం.

సినీ రంగానికి ఆపద్బాంధవుడు…!!.

స్వయంకృషికి చిరునామాగా
ఎన్నో ఛాలెజింగ్ రోల్స్ తో విరాజిల్లుతూ
అభిమానుల్నీ గెలుచుకున్న విజేతగా
అభిమానుల గుండె చప్పట్లతో నిలబడే..

ప్రతిభకు హిమశిఖరంలాగా నిలిచే
ప్రతిసారీ ప్రయత్నలోపం విరబూసిన పద్మం
దశాబ్ధాలుగా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి
వెండితెర ఇంద్రుడిని నిలిచిన మహేంద్రుడు..

మెగాస్టార్ ఆ పదమే ఒక బ్రాండ్ గా
కోట్ల మంది అభిమానుల గుండెల్లో దేవుడిగా
ఆ ప్రస్థానమే అనన్యసామాన్య విజయం
ఆంధ్రదేశంలో చెరగని ముద్రలా నిలిచే…

చినుకులా మొదలైంది జీవితం
చివరికి అది ఓ మహానదిగా మారింది
స్థిర ప్రజ్ఞతతో ముందుకు సాగుతూ
ఎందరికో జీవనాధారంగా నిలుస్తుంది..

చలనచిత్ర రంగంలో చిరంజీవి
స్వయంకృషితో ఎదిగిన హీరో
ఆపద్భాంధవుడిగా ఆదుకుంటూ
సినిమా రంగానికి వెన్నెముకలా నిలిచే..

నటనలో నవరసాలను పండించే
తిరుగులేని నటుడిగా ఖ్యాతి గడించే
అద్భుత నాట్యముతో మురిపించే
తెలుగులో మహా మహారాజుగా వెలుగొందే…

నటననే ప్రాణంగా సాగిపోతూ
సినిమా రంగానికే తన జీవితాన్ని ధారపోసి
ఎందరికో ఆదర్శంగా జీవిస్తూ
పెద్దన్న పాత్రలను పోషించిన ఘనుడు…

నటులకు కష్టమొస్తే నేనున్నానంటూ
వారి చెంత చేరి చేయూతనిచ్చే
కొండంత అండతో వారిని ఆశీర్వదించి
మానవత్వాన్ని చాటుకుంటున్న మహనీయుడు..

రక్త నిధిని సేకరించి ఎందరికో ప్రాణాలు పోసే
సాటి మనిషికి చేయగలిగిన సేవ చేస్తూ
సేవ చెయ్యడంలో ఆనందాన్ని అనుభవించే
తోటి వారికి అండగా ముందడుగు వేసేను…

అవార్డులను రివార్డులను స్వీకరించి
అత్యున్నత పురస్కారాలతో అలరించి
పద్మ విభూషణుడిగా విరాజిల్లుతూ
తెలుగు వారి ప్రత్యేకతను చాటుకున్నారు..

నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని
సేవా తత్వము నిరంతరం కొనసాగించాలని
భగవంతుడు దీర్ఘాయుష్ ప్రసాదించాలని
కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు..

సినీ కళామతల్లి ముద్దుబిడ్డ అందుకో అభినందనలు…!!!

నటనలో తాను మెగాస్టార్
అభిమానుల గుండెల్లో ఆరాధ్యుడు
సినిమా జగత్తులో మకుటంలేని మహారాజు
కళామతల్లికి ముద్దుబిడ్డ ఆయనే…

నాట్యములో నటరాజు నే మెప్పించే
నవరసాలను సునాయాసంగా పండించే
నటనలో తాను ఒక ట్రెండు సృష్టించే
చలనచిత్ర రంగములో ప్రత్యేకత చాటే…

పద్మ భూషణ్ మెడలో అరుదైన గౌరవం
కేంద్ర ప్రభుత్వం అభిమానంగా గౌరవించే
తెలుగు సినిమా పరిశ్రమకు దివిటీగా వెలుగొంది
మెగా అభిమానులకు సుప్రీం హీరోగా నిలిచే..

ఎందరో ప్రాణాలు నిలిపిన రక్తదాత
సినీ కార్మికులకు అతను ఒక ఆపద్బాంధవుడు
కష్టమొస్తే ఎందరికో కన్నీళ్లు తుడిచి
తానున్నానంటూ ఓదార్చిన గొప్ప మనిషి…

కళ, సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం
అందిస్తున్న అభినందనల మాల
పద్మ విభూషణ్ రాష్ట్రపతి చేతుల మీదుగా
శుభసంందర్భంగా అందుకో అభినందనలు..

జన సైనికులు ప్రమధగణాలై కదిలితే..!!

మనల్ని ఎవరు ఆపేది
దండుల జనసేన కదిలితే
పవనిజం మే పంచాక్షరి మంత్రమైతే
యువశక్తి సంజీవినిగా మారుతుంది..

ప్రభుత్వ ప్రతనం ప్రారంభం
అన్ని వర్గాలలో అసంతృప్తి
అకాల మాయా జలం ఎంత చల్లినా
సామాన్యుడికి సమస్యలే నిరంతరం..

రాజధానుల రగడలు సృష్టించి
ప్రజల మధ్య ప్రాంతీయత రెచ్చగొట్టి
అభివృద్ధిని ఆమడ దూరం ఉంచి
త్రిశంకు రాజధానులను కల్పిస్తే ఎలా..

అవకాశం ఒక్కటని నిలువునా ముంచే
మరో అవకాశం కావాలంటూ కొంగ జపం
పథకాలంటూ జనాలను ముంచుతూ
జగన్నాటకం నిత్యం ప్రదర్శిస్తుంటే..

కదిలింది యువశక్తి జనశక్తిగా
సామాన్యుడి కలలు నెరవేర్చేందుకు
జెండా మోస్తూ భుజం భుజం కలుపుతూ
ప్రజల స్వప్నం సాకారము చేసేందుకు..

ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు
సుస్థిర పాలన అందించేందుకు
జన సైనికులు ప్రమధగణాలై కదిలితే
విజయం వైపు పయనం సాగుతుంది..

యువ భేరీ కదిలింది..

ఎటు చూసినా జనసంద్రం
పవనన్నకు నీడగా
యువశక్తి కదిలింది
వివేకానందుని సాక్షిగా..

జనసేన తోడుగా
యువ శక్తి కదిలితే
రాజకీయ రంగంలో
ప్రకంపనలు సృష్టించే..

యువతే భవిత
రాజ్యాన్ని మార్చే ఘనత
స్వశక్తితో ఎదిగే ధైర్యం
కల్పించే జనసేన..

పవనిజం మే మంత్రంగా
పవన్ కళ్యాణ్ ముందుంటే
యువత అంతా తోడుంటే
ప్రభుత్వానికి గుబులొచ్చే…

నిరుద్యోగమే వేధిస్తే
ఉద్యోగమే రాకపోతే
యువత భవిత ఎటు
ప్రభుత్వమే విఫలమైతే..

అద్భుతాలు సృష్టించే యువత
ఆధరణ లేక పోతుంటే
నేనున్నానంటూ వచ్చే పవన్
అవకాశం ఇస్తే ఆశలు నెరవేరుస్తానంటూ..

వారాహికి అంజన్న ఆశీస్సులు….

కొండగట్టు అంజన్న ఆశీస్సులు
వారాహి రథానికి కపిరాజు అభయహస్తం
ప్రజాస్వామ్యంలో విజయం చేకూర్చేందుకు
సైన్యాధ్యక్షుడికి విజయం అందించేందుకు..

వారాహి పూజ ముగిసింది
త్వరలో జైత్రయాత్ర మొదలు అవుతుంది
జన సైనికులారా సిద్ధంగా ఉండండి
అవినీతి పై పోరాటం సాగిద్దాం…

నరసింహుని క్షేత్రాలకు ప్రయాణాలు
ధర్మపురిలో దర్శన కోసం ఎదురుచూపులు
ఉగ్ర నరసింహ స్వామి దివ్య రూపంతో
లోక కళ్యాణము కోసం వారాహి ధర్మరథం కదిలే..

పవనిజం ప్రయాణం మొదలైంది
సామాన్యుడికి చేతి కర్ర సిద్ధమయ్యింది
రాజకీయ రణరంగంలో యుద్ధానికి సిద్ధం
పేదవాడి అభ్యున్నతే జనసేన జండా అజెండా..

మధ్యతరగతికి అండగా నిలిచేందుకు
మహా యాగం తలపెట్టెను సేనాని
సైనికునిగా మన వంతు కృషి చేస్తూ
నిర్విఘ్నంగా విజయం వైపు నడుద్దాం.

బడుగుల ఆశలకు ప్రాణం పోసేందుకు
కష్టజీవి చేతికి మెతుకులు అందించేందుకు
పారిశ్రామిక ప్రగతికి సోపానాలు నిర్మించేందుకు
యువతకు ఉద్యోగ కల్పన చేసేందుకు…

చెయ్యి చెయ్యి కలిపి పోరాడుదాం
చేత పట్టిన జెండా ఊపిరి ఉన్నంతవరకు మోద్దాం
కర్షకుడి కన్నీరు తుడిచేందుకు నిలుద్దాం
జన సైనికులుగా కర్తవ్యాన్ని నిర్వహిద్దాం..

మరో శివాజీ లా నిలబడే..

ధర్మరక్షణకు ధరిత్రి లో వెలసి
మరో శివాజీలా నిలబడే
హైందవ రక్షణకు కవచంగా నిలిచి
దేశ సేవలో జన్మ సార్ధకం చేసుకొనే..

శివాజీ లోని ధీరత్వం
దేశం పట్ల అన్యోన్య మైన వీరత్వం
జాతి గర్వించదగ్గ మానవత్వంతో
హైందవ జాతికి నినాదంగా కనబడే..

సనాతన వైదిక ధర్మం కోసం
జాతిని జాగృతం చేసేందుకు
పిచ్చి కూతలు కోస్తే సహించని
సమర శంఖమే పూరించారు…

వారాహి లో తిరుగుతూ
హిందూ ధర్మం కోసం శ్రమించే
త్యాగధనుల గొప్ప స్ఫూర్తితో
జాతిని ఏకము చేసేందుకు ప్రయత్నించే..

కోట్ల గొంతు లకు ధైర్యంగా
ధర్మం నిత్య జ్యోతిలా వెలిగేందుకు
విశ్వమంతా యజ్ఞంలా ప్రకాశించాలని
కంకణం కట్టిన మహోన్నత తపస్వి…

ఒక వ్యక్తి ఒక శక్తిగా మారుతూ
సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా
యావద్దేశానికి ఆదర్శంగా నిలుస్తూ
జాతి జనుల కోసం తపించే ధర్మ రక్షకులు…

భరతమాత ధర్మ ఖడ్గాన్ని ధరించి
దుష్ట రాక్షస మూకలును చెండాడేందుకు
వేల సంస్కృతి ప్రతినిధిగా వచ్చే
జాతి పునర్నిర్మాణంలో నిర్మాతగా నిలిచే..

కాపు జాతి బిడ్డలారా..!!

ఓ కాపు జాతి బిడ్డలారా
తెలుసుకోండి జాతి గొప్పతనం
గ్రామాల్లో మనమే మనమే పెద్దలం
కాపు కాసే నిజమైన నాయకులం..

వ్యవసాయ దేశాన రైతన్నలం
పాడి పంటల పసిడి కుండలం
ఖండాలన్ని వ్యాపించి
జాతి గొప్పతనం నిరూపించాం..

కాపు జాతి రత్నాలు ఎందరో
చరిత్రలో ముత్యాల్లా మెరిశారు
రత్నగర్భ లో రాశులుగా నిలిచి
కోట్ల హృదయంలో మిగిలారు..

రాయలే మనకు ఆదర్శం
కాపు జాతి దొరికిన రత్నం
సాహిత్య సార్వభౌముడై వెలుగొందుతూ
విజయనగరం సామ్రాజ్యమే విస్తరించే..

కూర్మా వెంకటరెడ్డి నాయుడు
మద్రాస్ ముఖ్యమంత్రిగా పాలించే
కన్నెగంటి హనుమంతు స్వాతంత్య్ర వీరుడు
కోడి రామ్మూర్తి నాయుడు మల్లయోధుడు..

సినీ చరిత్రకు తొలి గురువు
రఘుపతి వెంకయ్య నాయుడు
విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు
అభినయ నేత్రి మన సావిత్రి…

నటనలో చిరంజీవి రికార్డుల రారాజు
డాన్సుల్లో వరల్డ్ రికార్డ్ సృష్టించే
పద్మ విభూషణు డై వెలుగొందే
మహా వృక్షంగా నేడు ప్రకాశించే..

సంగీతంలో ద్వారం వెంకటస్వామి నాయుడు
కూచిపూడిలో సాటిలేని శోభా నాయుడు
సినీ గీత రచనల్లో అనంత శ్రీరామ్
కాపు జాతిలో వికసించిన ఆణిముత్యాలు..

దర్శకరత్న దాసరి నారాయణరావు
హాస్య రసంలో అల్లు రామలింగయ్య
జర్నలిజంలో పద్మభూషణ్ చలపతిరావు
రసాయన శాస్త్రంలో నిధి ఏవి రామారావు..

సి కె నాయుడు క్రికెట్ కెప్టెన్
అంబటి రాయుడే ఆటగాడు
తాపీ ధర్మారావే ప్రముఖ రచయిత
మాటలల్లిన మాంత్రికులెందరో ఈజాతి బిడ్డలే..

రాజకీయాలను శాసించిన వంగవీటి
తనదైన ముద్ర వేసినా ముద్రగడ
అమాత్యులైన జక్కంపూడి
పదవులకు వన్నెతెచ్చిన ఉమా వెంకటేశ్వర్లు..

నేడు పవనమై వీస్తుంది ఆంధ్రదేశం
ఢిల్లీలో వికసించే కమల పుష్పం
శాసించే స్థాయిలో గుర్తింపు
రాజకీయంలో పవన్ కళ్యాణ్ విజయోత్సవం..

విద్యాసంస్థల్లో దిగ్విజయంగా నారాయణ
శాంతి రామ్ కళాశాలల వైభవం
కాపు జాతిలో ఘనమైన వ్యాపారస్తులు
అవని అంత విస్తరించిన దిగ్గజాలు…

ఇంకా ఎందరెందరో ప్రముఖులు
జాతికి జీవం తెచ్చినా మహనీయులు
అన్ని రంగాలలో ఖ్యాతిగాంచిన జాతి బిడ్డలు
నేలంతా ఎంత వ్యాపించిన మహోన్నతులు..

రచయిత : కొప్పుల ప్రసాద్

Kapu Jathi Kavithalu

Kapu Jathi Kavithalu కొప్పుల ప్రసాద్ గారు కాపుల గురించి, కాపు జాతి గురించి రాసిన కాపు కవితలను (kapu Poems) చదవండి.