The Real Story of Kapunadu Founder Miryala Venkata Rao

The real story of Kapunadu founder Miryala Venkata Rao, a visionary who fought for Kapu community rights and social justice in Andhra Pradesh.

The Real Story of Kapunadu Founder Miryala Venkata Rao
The Real Story of Kapunadu Founder Miryala Venkata Rao

కాపునాడు సారథి మిరియాల వెంకట్రావు పూర్వాపరాలలోకి వెళ్ళేముందు తప్పనిసరిగా ఈ రాజకీయ చరిత్ర - సామాజిక విశ్లేషణ చదివితే గాని తతిమా విషయాలు ఒకపట్టాన అంతుచిక్కవు.

సామాజికోద్యమ సూరీడు
మిరియాల వెంకటరావు

‘కాపునాడు'.. జూలై 10, 1988 వ సం॥లో ఊపిరి పోసుకున్న ఉద్యమకెరటం, అప్పటివరకూ తెలగ మహాసభగా, తెలగా అభ్యుదయ సంఘంగా, కాపు తెలగ బలిజ సంక్షేమ సంఘంగా మాత్రమే తెలుగునాట వ్యాప్తిలో ఉన్న సంఘాలన్నింటి మేలు కలయికగా, ఒకే శీర్షికన 'కాపునాడు'గా రూపు సంతరించుకుని కృష్ణాతీరాన విజయవాడలో ఆవిర్భవించింది. తొలుత కాపునాడు పేరుని మిరియాల వెంకటరావు ఆమోదించలేదు. తెలగ, బలిజ, ఒంటరి, కాపు మహాసభగానే వేదిక ఉండాలని భావించినా మాజీ మంత్రివర్యులు పేర్ని కృష్ణమూర్తి (బందరు), తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఈలి సత్యనారాయణ మరియు ముఖ్య నాయకులు చిలంకుర్తి వీరాస్వామి (అంబులు) గార్లు కాపునాడు పేరుని బలపర్చడం జరిగింది. అంతక్రితం అదే సంవత్సరం మే నెలలో కృష్ణా నదీతీరాన తెలుగుదేశం ప్రభుత్వం మహానాడు ఘనంగా నిర్వహించి ఉండటం మహానాడు నాలుగక్షరాలు కావడంతో కాపునాడు కూడా నాలుగక్షరాలు కావడంతో వారు కాపునాడు పేరును బలపరచి ఆనాటి మహాసభకి కాపునాడు పేరును స్థిరపరచారు. గత మూడు దశాబ్దాలుగా కాపునాడు పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు నిర్వహించటం అందరికీ విదితమే. అయితే, ఆవిర్భవించిన నాటి నుండీ ఎన్నో ఆటుపోట్లను ఢీకొంది. కాలం కరిగే కొద్దీ నాయకత్వం ఎన్నో రంగులు మారిందికానీ ఉద్యమ స్వరూప స్వభావాలు మారలేదు, మాసిపోవు. పునాది బలంగా ఉంటే బీటలు వారినా భవంతిని మరమ్మతు చేసుకోవచ్చు, మహాభాగ్యంగా నిలబెట్టుకోవచ్చు, ఆ పునాది పేరు 'మిరియాల వెంకటరావు'. పూర్వాపరాల్లోకి పయనిస్తే.. 80వ దశకంలో ఈ పేరు ఎక్కడ ఎప్పుడు వినిపించినా కులస్తులు పూనకం వచ్చిన వాళ్ళల్లా ఊగిపోయేవారు, ఆయన రాకకోసం నిద్రాహారాలు మాని ఎదురు చూసేవారు, కులస్తుల్లో అంతకు ముందు ఇంతటి చైతన్యాన్ని రగిల్చిన నాయకుడు మరొకడు లేడు, కానరాడు.

ఆయాప్రాంతాల్లో సంఘాలు ఏర్పరచుకొని పండక్కో పబ్బానికో కలసి కబుర్లు చెప్పుకోవడమో, శుభానికో అశుభానికో పరామర్శలు, పలకరింపుల్లా గానో కుల సంఘాలు వర్ధిల్లుతున్న కాలం అది. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక చైతన్యం కాగడా పెట్టి వెతికినా కులస్తులలో కన్పించని ఒక నిర్జీవస్థితి అది.. ఆ స్థితగతులలో నుండే మిరియాల వెంకటరావు పయనం మొదలైంది, జనాభా దామాషా ప్రకారం ఎన్నికల్లో సీట్లు పొందలేని దుస్థితి, రాజకీయంగా ఒకానొక అనామక అనిశ్చితి, వెనకబడిన తరగతుల జాబితా నుండి తొలగించబడటం వలన అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో కాపులు మగ్గుతున్న తీరు మిరియాల వెంకటరావు ధర్మాగ్రహానికి కారణమైంది, పాలకుల నిర్లక్ష్యవైఖరి, కులస్తుల నిర్లిప్తత రెండింటిపై ఒకేసారి అస్త్రాల్ని సంధించిన అనితర సాధ్యుడు మిరియాల వెంకటరావు.. మొదట కులస్తులలో చైతన్యం తీసుకురావడానికి బయలుదేరారు మిరియాల వెంకటరావు, అప్పటికే ఆర్థికంగా ఎంతో ఉన్నతస్థితిలో ఉన్నందున స్వయంగా వ్యయప్రయాసలన్నీ తానే వ్యక్తిగతంగా భరిస్తూ యాత్ర సాగించారు మిరియాల వెంకటరావు.

శ్రీకాకుళం జిల్లాతో ప్రారంభించి చిత్తూరు వరకూ సాగిన యాత్ర (ఈ వివరాల్ని, విషయాల్ని ముందు పేజీలలో వారి మాటల్లోనే చదవగలరు రచయిత) కులస్తులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది, ఆత్మ గౌరవంతో జీవించే స్వతంత్ర్య వ్యక్తిత్వాన్ని కల్పించింది, అప్పటి వరకూ భావదాస్యంతో మగ్గిపోతున్న కులస్తుల కళ్ళు తెరుచుకోవడం ఆరంభమైన దశ అది.

మిరియాల వెంకటరావు పూర్వీకులు ప్రకాశం జిల్లా గోనుగుంట్లకు చెందిన బలిజలు, గోనుగుంట్లలో ఉన్న శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వీరి వంశీకుల నిర్మాణమే, కాలక్రమంలో ఈ గోనుగుంట్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన జీర్ణోద్ధరణకు స్వయంగా మిరియాల వెంకటరావు నడుం బిగించి విజయవంతం గావించడం విశేషం. గోనుగుంట్ల బలిజలు ముత్యాల వ్యాపారస్తులు, 400 సం||ల ప్రాచీన చారిత్రక శాసనం ఈ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఉన్నది. దేశాయ్, శెట్టి అనేవి వీరి బిరుదులు, కృషితో వ్యాపారాన్ని అభివృద్ధి చేసే మనస్తత్వం కలవారు గోనుగుంట్ల బలిజలు. వీరి కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. వీరి ఆదాయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కైంకర్యం ఇవ్వనిదే నిద్రపోరు, గోనుగుంట్ల బలిజ శాఖకు చెందిన 'మిరియాల వెంకటరావు' గృహనామం 'మిరియాల' ఎలా ఏర్పడిందంటే వీరివంశస్తులు 14వ శతాబ్దానికి చెందిన మిరియాల వర్తకులు కావడం వల్లే. ఇప్పటికీ కాపు కులస్తులలో అత్యంత ప్రాచీనమైన ఇంటిపేర్లుగా నున్నవాటిలో 'మిరియాల' మొదటి వరుసలో ఉంది, బలిజల ఇళ్ళ పేర్లలో ప్రధానంగా వాళ్ళు వ్యాపారం చేసిన దినుసులు, వస్తువుల పేర్లు కూడా కలగలసిపోయి ఉండడాన్ని పరిశీలించిన సుప్రసిద్ధ చరిత్రకారుడు నూూ.తీ ఈ క్రింది ఇంటి పేర్లను ఉదహరించాడు.

1. మిరియాల 2. ముత్యాల 3. పగడాల 4. రత్నాల 5.ఉంగరాలు 6. యనుములు 7. ఆవుల 8.గాజుల 9.గుండ (సుగంధ ద్రవ్యాలు).

ఇంటి పేరు మిరియాల అయినా వెంకటరావు పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా (అప్పటి గుంటూరు జిల్లా, ఆ మాట కొస్తే 'కృష్ణా మండలం'). వారైనప్పటికీ వ్యాపారరీత్యా కృష్ణాజిల్లా 'బందరు'కి, బందరు నుండి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి వెళ్ళి స్థిరపడ్డారు 'మిరియాల కుటుంబీకులు'. మిరియాల వెంకటరావు, మిరియాల శేషయ్య, లక్ష్మమ్మ దంపతులకు 1939 డిసెంబరు 25వ తేదీన రాజమండ్రిలోనే జన్మించారు, అక్కడే విద్యాభ్యాసం సాగింది, తల్లిగారు 'కోటపోతుల' వారింటి ఆడపడుచు.

విద్యార్థి దశలో సోషలిస్టు పార్టీ ప్రభావానికి మిరియాల వెంకటరావు లోనయ్యారు. మిరియాల వెంకటరావు, రావుగోపాలరావు, కొండపల్లి భాస్కరరావు బాగా కలిసిమెలిసి తిరిగేవారు, నాటకాలు ప్రదర్శించేవారు, నాటక పరిషత్తులు ఏర్పాటు చేసేవారు, చాలా వైభవంగా ఉండేవా నాటక ప్రదర్శనలు.. పద్యనాటకాలంటే విపరీతమైన ఇష్టం గల వెంకటరావు పద్యనాటక ప్రదర్శనలను ఏర్పాటు చేసి కళామతల్లిని స్మరించుకునేవారు. రంగస్థల రారాజు అభినవసు యోధన ఆచంట వెంకటరత్నం నాయుడు, రంగస్థల కృష్ణుడు గుమ్మడి గోపాలకృష్ణ మరియు కూచిపూడి నాట్యాచార్యులు కీ॥శే॥కోరాడ నరసింహారావు గార్లు అత్యంత ఇష్టులు. యుక్త వయస్సులోకి వచ్చాక తండ్రి అప్పజెప్పిన వ్యాపార బాధ్యతల్ని స్వీకరించి ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు, ముత్యాలు, పగడాల వ్యాపారం అనువంశికంగా అంది వచ్చిన వారసత్వ సంపదగా భావించి ఎంతో నేర్పుతో వ్యాపారంలోని మెళకువల్ని ఆకళింపు చేసుకుని మెలిగేవారు, వ్యాపారంలో భాగంగా చిన్న వయస్సులోనే కలకత్తా వంటి మహానగరాలకు కూడా వెళ్ళి వస్తూండేవారు, వివాహం నెల్లూరు జిల్లా గూడూరుకి చెందిన పసుపులేటి సుబ్బరామయ్య, పసుపులేటి శ్రీదేవమ్మ దంపతుల కుమార్తె ప్రమీలతో 1969 ఆగస్టు 27వ తేదీన తిరుపతిలో సాయంత్రం గం.7.27 నిమిషాలకి వివాహం జరిగింది. మిరియాల వెంకటరావుకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు ఎమ్. వెంకట శేషగిరిబాబు, కోడలు డాక్టర్ ఎమ్.సుజన. ఈ దంపతులకి సంయుక్త, శ్రీయుక్త, శరత్ చంద్ర సంతానం. కుమార్తె స్వాతిలక్ష్మి అల్లుడు హరికుమార్ ఈ దంపతులకి శ్రీగుణ సాహితి సంతానం.

ముత్యాలు, పగడాల వ్యాపారంతోపాటు వెంకటరావు ఫారెస్టు కాంట్రాక్టులు కూడా చేయనారంభించారు, రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్టు ఏరియాలలో ఎక్కువగా కాంట్రాక్టులు చేశారు, ఆ సమయంలో ఆత్మరక్షణ నిమిత్తం ఎప్పుడూ రివాల్వరో, రైఫిలో వెంట ఉండేది, ఆర్థికంగా వెసులుబాటు కలగడంతో పాటు రాజకీయాల పట్ల ఆసక్తి హెచ్చింది, ఆ ఆసక్తి కులం ఎదుర్కొంటున్న అనేకానేక అవమానాల్ని, ఛీత్కారాల్ని పరిచయం చేసింది, వాటి ఫలితమే కులస్తుల్ని ఉద్యమం చేపట్టేలా వెంకటరావు ముందుండి నడిపే నాయకత్వ బాధ్యతలు స్వీకరించేలా చేసింది, కనిపించిన పుస్తకాన్నల్లా చదవడం, అర్థం చేసుకోవడంతో పాటు సామాజిక కోణాన్ని దర్శించే సావకాశం వెంకటరావు స్వంతం చేసుకున్నారు.

అప్పటి వరకూ కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అన్నా, మహాకవి శ్రీశ్రీ అన్నా (ఇద్దరూ బ్రాహ్మణులే) ఎంతో అభిమానించిన మిరియాల వెంకటరావు సామాజిక కోణాన్ని దర్శించడంతో స్వంత కులస్తులలో అంతటి మహా రచయితలు, కవులు ఎవరున్నారని పరిశోధించే స్థాయికి ఆలోచనా విధానం పెంపొందింది, తత్ఫలితమే తాపీధర్మారావు నాయుడు, త్రిపురాన వేంకటసూర్య ప్రసాదరావు దొర, త్రిపురాన తమ్మయ్యదొర, పినిశెట్టి శ్రీరామమూర్తి, అనిసెట్టి సుబ్బారావు గార్లవంటి అప్పటికింకా జీవించి ఉన్న సాహితీకారులతో పాటు నన్నెచోడుడు, రామరాజ భూషణుడు, మచ్చా వెంకటరాయకవి, తూము రామదాసకవి, చందాల కేశవదాసు, చేకూరి సిద్ధయ్యకవి, గుడారు వెంకటదాస కవి, తుపాకుల అనంత భూపాలుడు వంటి పూర్వకాలపు మహాకవుల గురించి వివరాలు సేకరించే సామాజిక బాధ్యత 'వెంకటరావు' భుజాలకెత్తుకున్నారు, ఎన్నో వేదికలపై ఈ మహాకవుల గురించి ఎలుగెత్తి వెంకటరావు వివరించేవారు.

అంతేకాదు ఆదికవి నన్నయ్య కాదు, నన్నయ్య కంటే ముందు తరంవాడు నన్నెచోడుడు, నన్నెచోడుడు బ్రాహ్మణుడు కాదు తెలగా కులస్తుడని తెలియపరిచిన వివరాలు తెలుగునాట సాహితీ ప్రపంచంలో పెను విప్లవానికి నాంది పలికింది, నిత్యం యాత్రలు... తంజావూరు సరస్వతీ మహలు, ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రంథాలయం, ఇక రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయం సరేసరి, కులానికి సంబంధించిన, కులస్తులకు సంబంధించిన ఏ సమాచారం దొరికినా తన మెదడులో నిక్షిప్తం చేసుకునేవారు.

విజయ రామరాజుని బొబ్బిలియుద్ధంలో హతమార్చినవాడు 'మిరియాల సీతన్న' అనే వీరసైనికుడని అయితే, కుహానా చరిత్రకారులు ఆ నిజాన్ని కప్పిపుచ్చారని, ఫ్రెంచ్ చరిత్రకారుడు
బొబ్బిలియుద్ధం గురించి గ్రంథస్తం చేసిన చారిత్రక ఆధారాల్ని మిరియాల వెంకటరావుగారు పరిశోధించి ప్రపంచానికి తెలియజేసే వరకూ ఆ నిజం వెలుగులోకి రాలేదు, పాలకొల్లు క్షీరారామలింగేశ్వరాలయంలోని అతి పురాతనమైన శాసనంలో (11వ శతాబ్ది) తెలగ, బలిజల ప్రస్తావన కూడా మిరియాల వెంకటరావు గారు తెలిపే వరకూ బాహ్యప్రపంచానికి తెలియలేదు, ఆ మాటకొస్తే కంచికామకోటి పీఠం 11వ శతాబ్దిలో అప్పటి విక్రమ సింహపురి (ఇప్పటి నెల్లూరు)ని పాలించిన బలిజ పాలకులు శ్రీ దండగోపాల ప్రభువు దయాభిక్షేనని, వారు దానం చేసిన భూదానంతో, అగ్రహారికసంపదలతోనేకంచికామకోటి పీఠం ఆవిర్భవించిందనేచారిత్రక సత్యాన్ని మిరియాల వెంకటరావుగారు 1986వ సం||లో తాను సంపాదకత్వం వహించి ప్రచురించిన 'తెలగ కాపు బలిజ సంక్షేమం' మాసపత్రికలో స్వయంగా ప్రచురించి సంచలనం సృష్టించారు...

'మిరియాల” అన్న ఇంటి పేరు ఎలా ఏర్పడిందన్న అంశం. 14వ శతాబ్దికి చెందిన ముత్యాల వర్తకులే మిరియాల వ్యాపారం చేశారని, అప్పటికి మన ఆహారపుటల వాట్లలో ముఖ్యమైన వంట దినుసుగా 'మిరియాల'నే వినియోగించేవారు వాస్తవానికి తెలుగునేలపై మిరియాలు, ఉల్లి, వెల్లుల్లి, ధనియాలు వంటల్లో ప్రధానపాత్ర పోషించాయి, అప్పటికి 'మిరపకాయలు' ఎలా ఉంటాయో కూడా మన వారికి తెలియదు, మిరపకాయల్ని విదేశాల నుండి తీసుకుని వచ్చి మిరియాలని వారి దేశానికి తీసుకుపోవాలనే వ్యాపారంతో దక్షిణానికి వచ్చినవాడు 'వాస్కోడిగామా'. మొదట 'కేరళ'లో నాణ్యమైన దినుసులు, సుగంధ ద్రవ్యాలు వంటి వాటి కోసం సాగించిన వ్యాపార ఒప్పందాలు సాగక తెలుగునేల మీద అడుగుపెట్టి ఇక్కడి వ్యాపారులతో చెలిమి చేసుకుని వ్యాపారాన్ని సాగించినవాడు వాస్కోడిగామా, ముత్యాలు పగడాలు వర్తకం చేసే గోనుగుంట్ల బలిజలు మిరియాలు కూడా ఎగుమతి చేయనారంభించడంతో కాలక్రమేణా ఈ వర్తకం చేసే బలిజల ఇంటిపేరు 'మిరియాలు'గా స్థిరపడింది, ముత్యాల, పగడాల, మిరియాల ఇంటిపేరున్న బలిజలందరూ ఒకే కుదురు నుండీ వచ్చినవారే, కాపు సామాజిక సముదాయంలో వీరు గోనుగుంట్ల బలిజలుగా సుప్రసిద్ధులు, బలిజ శబ్దం వాణిజ్యపరంగా 'వణిజ' అన్న పదం నుండే వ్యావహారంలోకి వచ్చిన శబ్దం, అప్పటి వర్తక వాణిజ్యమంతా తెలుగు, తమిళ, కన్నడ సీమలలో అధిక భాగం, ఒడిశా, మహారాష్ట్రలలో కొంతభాగంతో పాటు రంగూన్, శ్రీలంక ఆఫ్రికావంటి చోట్ల సైతం బలిజల ఆధీనంలోనే ఉంది.

బలిజసెట్లు, శెట్టి బలిజలు అన్న ఉపకులాలు కాపు, తెలగ, బలిజల నుండి శాఖోపశాఖలుగా విస్తరించడానికి వర్తక వాణిజ్యం మొత్తం బలిజలే సాగించడం వల్ల ఏర్పడ్డాయనేది కాదనలేని చారిత్రక సత్యం. 'మిరియాల' అన్న ఇంటిపేరు పుట్టుక వెనుక ఇంత చరిత్ర ఉంది. ఇక ప్రస్తుతానికొస్తే 80వ దశకంలో తెలగా అభ్యుదయ సంఘంగా, తెలగ, కాపు, బలిజ మహాసభగా రూపాంతరం చెందుతూ చైతన్యవంతమౌతూ ఉద్యమం ఒక రూపం సంతరించుకోవడంలో మిరియాల వెంకటరావు కీలకపాత్ర పోషించారు, 82 మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి, దిహిందూ దినపత్రికలు విజయవాడలో లక్షలాది మందితో జరిగిన మహాసభల తాలూకు వార్తా కథనాల్ని విశేష రీతిలో ప్రచురించాయి, 1978 అసెంబ్లీ ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి వరుసగా నలుగురు రెడ్లను ముఖ్యమంత్రులుగా నియమించడంతో రాష్ట్రవ్యాప్తంగా నాయకత్వ మార్పుని, ప్రభుత్వ మార్పుని ప్రజలు బలంగా కోరుకుంటున్న తరుణమది, కాపు సామాజిక వర్గానికి చెందిన జి.రాజారామ్ (నిజామాబాద్), మండలి వెంకటకృష్ణారావు (కృష్ణా), బండారు రత్న సభాపతి (కడప) వంటి కాంగ్రెస్ దిగ్గజాలు, 'కమ్మ' వర్గం నుండి కొత్త రఘురామయ్య, నాదెండ్ల భాస్కరరావు వంటి వారు 'ముఖ్యమంత్రి' పదవి ఆశించి భంగపడ్డారు, ఇక్కడ ఒకటికి పది అడుగులు ముందుకు వేసి నాదెండ్ల భాస్కరరావు రాజకీయపార్టీ ఆలోచన చేసి అందుకు ఎన్టీఆర్ని స్వాగతించి, పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి రామోజీరావు ఈనాడు దినపత్రికని తీర్చిదిద్ది రంగం సిద్ధం చేశారు....

సరిగ్గా ఈ సమయంలోనే తెలగ, కాపు, బలిజ మహాసభ తెలుగునాట మిరియాల వెంకటరావు సారధ్యంలో ప్రభంజనం సృష్టిస్తోంది... సహజంగానే ఆ ఊపులో రాజకీయ, సామాజిక చైతన్యాన్ని సంతరించుకున్న కాపు సామాజిక సముదాయం ఎన్టీఆర్ గ్లామర్ కి, తెలుగుదేశం పార్టీ విధానాలకు ఆకర్షితులై బలీయమైన శక్తిగా రూపొంది బాసటగా నిలిచారు, కాపులు, కమ్మలు, వెనుకబడిన తరగతులు, క్షత్రియ, వెలమలు, మాదిగలు, కొన్ని ప్రాంతాల్లో రెడ్లు 'తెదేపా' ఘన విజయానికి స్వాగత ద్వారాలు తెరిచారు.

తెలగ కాపు బలిజ మహాసభతో కాపుల్లో వెల్లివిరిసిన చైతన్యం, నూత్నంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో చేగొండి వెంకటహర రామజోగయ్య, కిమిడి కళావెంకటరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ముద్రగడ పద్మనాభం, ప్రత్తిమణెమ్మ, బండారు రత్న సభాపతి, సుగవాసి పాలకొండ్రాయుడు, పతివాడ నారాయణస్వామి నాయుడు, పప్పల చలపతి రావు, వెన్నా నాగేశ్వరరావు, చిక్కాల రామచంద్రరావు, డా॥మెట్ల సత్యనారాయణరావు, తోట సుబ్బారావు, వడ్డి వీరభద్రరావు, జ్యోతుల నెహ్రూ, సి. రామచంద్రయ్య, అల్లాడిరాజ్ కుమార్, శ్రీపతి రాజేశ్వర్, అల్లు వెంకట సత్యనారాయణ, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈలి వరలక్ష్మి, పసలకనక సుందరరావు, ఎర్రా నారాయణ స్వామి, వడ్డెరంగారావు, అంబటి బ్రాహ్మణయ్య, సింహాద్రి సత్యనారాయణ, కొండపల్లి పైడితల్లి నాయుడు, నారపుశెట్టి శ్రీరాములు, నిశ్శంకర రావు వెంకటరత్నం వంటి నేతలు తెలుగుదేశం పక్షాన ఆయా ప్రాంతాల్లో గెలిచి ఒక వెలుగు వెలిగారు. తెలగ, కాపు, బలిజ మహాసభ సమావేశాల తీవ్రత ఎంతలా ఉందేదంటే 1983లో తిరుపతి, గుడివాడల నుండి ఎన్టీఆర్ పోటీ చేసి గెలిస్తే చిత్తూరు జిల్లాలో ఒక్కస్థానం కూడా బలిజలకు కేటాయించకపోవడాన్ని, అందునా తిరుపతిలో అసంఖ్యాకంగా బలిజలున్నా తిరుపతి కేటాయించకపోవడాన్ని మిరియాల వెంకట రావు పత్రికా సమావేశం పెట్టి మరీ ప్రస్తావించడంతో (చిత్తూరు జిల్లా 'మదనపల్లి' అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఎన్టీఆర్ సాంస్కృతిక సంఘం అధ్యక్షులు, సీనియర్ అభిమాని, బలిజ కులస్తుడైన చిల్లగట్టు సుదర్శనంకు కేటాయిస్తారని అందరూ భావించినా 'కమ్మ' కులస్తునికే ఈ స్థానం కేటాయించడం, 1983 జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే 22వ తేదీన బలిజ యువజన సంఘం పేరిట సి. సుదర్శనం సమావేశాన్ని నిర్వహించడం, ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కర రావు, ఉపేంద్ర సి. సుదర్శనంను పిలిపించుకుని మాట్లాడడం, ఈ లోపు తిరుపతిలో మిరియాల వెంకటరావు పత్రికా సమావేశం జరగడం వంటి వరుస సంఘటనలు) ఎన్టీఆర్ 'తిరుపతి' స్థానానికి రాజీనామా చేసి తిరుపతిని బలిజ కులస్తురాలైన డా॥కత్తుల శ్యామలకు కేటాయించడం, ఆవిడ ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది.

అంతేకాదు నెల్లూరు జిల్లా కావలి నుండి 1985 ఎన్నికల్లో ఎం. వెంకట నారాయణకు పోటీ చేసే అవకాశాన్ని తెదేపా కల్పించింది, కావలితో పాటు శ్రీకాళహస్తి, చిత్తూరు, తిరుపతి స్థానాల్ని కూడా ఆ తర్వాత ఎన్నికల్లో కొండుగారి శ్రీరామమూర్తి, ఎ.ఎస్. మనోహర్, కోలారాము వంటి వారికి కేటాయించడం జరిగింది, జయాపజయాలు దైవాధీనాలు..

అయితే 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన వంగవీటి మోహనరంగా రావు కాపు కులస్తుడు కావడంతో, అక్కడ ప్రాంతీయంగా ఉన్న ఆధిపత్యపోరులో రంగా, కమ్మ కులస్తుడైన తెదేపా శాసనసభ్యుడు దేవినేని నెహ్రూతో తలపడుతూ వస్తూండడంతో క్రమంగా తెదేపా శ్రేణులు, నాయకులు కాపుల్ని రకరకాల ఇబ్బందులకు గురి చేయనారంభించారు, ఎన్నో రకాల కుట్రలు, ఇంకెన్నో దొంగ కేసుల్లో కాపుల్ని ఇరికించడం మొదలుపెట్టారు, వంగవీటి మోహనరంగాని జైల్లో పెట్టి మరీ వేదనకు గురి చేశారు, ఇక్కడే తెలగ, కాపు, బలిజ మహాసభ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని లక్షలాది ప్రజల నడుమ కృష్ణా నదీ తీరాన 1988వ సం||లో జూలై 10వ తేదీన మహాసభను నిర్వహించింది, మోహనరంగా అప్పటికి జైలులోనే ఉన్నారు, (రంగా భానుచందర్ హీరోగా ధవళసత్యం దర్శకత్వంలో రాధా మిత్రమండలి పతాకంపై 'చైతన్యరథం' చిత్రాన్ని నిర్మించారు, సూపర్ హిట్ అయ్యింది కూడా) రంగాని రక్షించుకోవడానికి, కాపులపై జరుగుతున్న వివక్షని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన మహాసభ 15 లక్షల మంది సాక్షిగా బ్రహ్మాండం బద్దలయ్యేలా కాపు జన సంగ్రామ భేరి మ్రోగించింది. తెలగ కాపు బలిజ మహాసభగా వున్న రాష్ట్రస్థాయి సంఘం ఈ వేదిక మీది నుండే “కాపు నాడు”గా ఆవిర్భవించింది...

వంగవీటి మోహనరంగాను జైలు నుండి విడుదల చేసినా అది 'కాపునాడు'కు తాత్కాలిక విజయమే, ఎందుకంటే తన ప్రాణాలకు హాని ఉందని తెలిసీ నడిరోడ్డుపై నిరాహారదీక్ష చేస్తున్న సత్యాగ్రహి 'రంగా' ను అత్యంత పాశవికంగా ముష్కరులు అంత మొందించి కాపుల మనోభావాల్ని రక్తసిక్తం చేశారు, మానని గాయాల్ని మిగిల్చారు.. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారింది, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి, ఒక్క వంగవీటి మోహనరంగాను అంతమొందించడమే కాక కాంగ్రెస్పార్టీలో యువనేతలుగా రూపుదిద్దుకున్న జక్కంపూడి రామ్మోహనరావు, కన్నా లక్ష్మీనారాయణ, పుంజాల సుధీర్ కుమార్, అంబటి రాంబాబు వంటి వారిపై కూడా కుట్రలు, కేసులు నిత్యకృత్యమై పోయాయి, తెదేపా ప్రభుత్వాన్ని కూల్చడానికి కాపులంతా ఏకమయ్యారు, ఏకతాటిపైకి వచ్చారు, తెదేపా నుండి చేగొండి హరరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం రాజీనామాలు సమర్పించి వెలుపలికి రావడంతో కాపులు సంఘటితం అయ్యారన్న సంకేతాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళాయి.

వాడవాడలా మిరియాల వెంకటరావు ప్రసంగాలు, యాత్రలు ప్రతిరోజూ కొన్ని ముఖ్యకేంద్రాల్ని ఎంచుకుని సాగాయి, వెంకటరావు తమప్రాంతం వస్తున్నారంటే నేతలు ఎదురెళ్ళి స్వాగతం పలికి వారి సేవల్ని, విలువైన ప్రసంగాల్ని వినియోగించుకునే క్రమంలో విశేషకృషి చేస్తూండేవారు, పి.శివశంకర్, కె. కేశవరావు, వి. హనుమంతరావు, చేగొండి హర రామజోగయ్య, ముద్రగడ పద్మనాభం, అనంతపురంకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బుట్నా గోపాల కృష్ణయ్య, కడపకు చెందిన డా॥ఎస్. వెంకటేశ్వర రావు తదితరులతో కూడిన కులస్తులు మిరియాలు వెంకటరావు నాయకత్వంలో దండులా కదిలి ఆయా ప్రాంతాల్ని ప్రభావితం చేసే సభలతో సమావేశాలతో క్రొత్త ఉత్సాహాన్ని రేకెత్తించారు, కాపులకి కాంగ్రెస్పార్టీకి అనుసంధానంగా తెదేపాకి వ్యతిరేకంగా సాగిన ఈ యాత్రల్ని ఎప్పటికప్పుడు డా॥ దాసరి నారాయణరావు సంపాదకత్వంలోని 'ఉదయం' దినపత్రికలో ప్రచారం చేయడంతో 1989 ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం మట్టికరుచుకు పోవడానికి ప్రధాన భూమిక వహించింది, కాపునాడు సారథి, వారధి మిరియాల వెంకటరావు.

కాపునాడు ఆవిర్భావం వల్ల, 1988-89 పోరాటపటిమ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమేకాక స్వర్గీయ వంగవీటి మోహనరంగారావు కుటుంబం నుండి శ్రీమతి రత్నకుమారి, రంగాసోదరులు వంగవీటి శోభనా చలపతి రావులు శాసనసభలో అడుగు పెట్టడం జరిగింది, అంతేకాదు మొట్టమొదటిసారి కన్నా లక్ష్మీనారాయణ (పెదకూరపాడు), జక్కంపూడి రామమోహన రావు (కడియం), అంబటి రాంబాబు (రేపల్లె), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), పుంజాల సుధీర్ కుమార్ (మలక్పేట్, డి.శ్రీనివాస్ (నిజామాబాద్), బలిరెడ్డి సత్యారావు (చోడవరం), ఈటి విజయలక్ష్మి (విశాఖపట్టణం), గుడివాడ గురునాధరావు (పెందుర్తి), మంగెన గంగయ్య (రాజోలు), బదిరెడ్డి అప్పన్నదొర (బూరుగుపూడి), జవ్వాది శ్రీరంగనాయకులు (పెనుగొండ), బూరగడ్డ వేదవ్యాస్ (మల్లేశ్వరం), పేర్ని కృష్ణమూర్తి (బందరు), ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి గెలుపొందితే, మొట్టమొదటి సారిగా ఎ.సాయిప్రతాప్ (రాజంపేట), సింగం బసవపున్నయ్య (తెనాలి) ఎం.ఎం.పళ్ళంరాజు (కాకినాడ)లు లోక్సభలో అడుగుపెట్టడం జరిగింది, 1991వ సం॥లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో 'ఖమ్మం' నుండి రిటైర్డ్ ఐ.పి.ఎస్. అధికారి పి. వి. రంగయ్యనాయుడు కాంగ్రెస్పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి అనూహ్యరీతిన పి.వి.నరసింహారావు ప్రధానిగానున్న మంత్రిమండలిలో చోటుదక్కించుకుని కేంద్రమంత్రిగా ఒక వెలుగు వెలిగారు. 

రాష్ట్రమంత్రులు సంగీత వెంకటరెడ్డి, వి. హనుమంతరావు, కె. కేశవరావు, ముద్రగడ పద్మనాభం, కన్నా లక్ష్మీనారాయణ, డి.శ్రీనివాస్, బలిరెడ్డి సత్యారావు, గుడివాడ గురునాథరావు, పేర్ని కృష్ణమూర్తి ఆయా మంత్రివర్గాల్లో రాణించారు, బూరగడ్డ వేదవ్యాస్ డిప్యూటీ స్పీకర్ కాగలిగారు. మిరియాల వెంకటరావు నాయకత్వంలో కాపునాడు నాయకులు సచివాలయానికో, ముఖ్యమంత్రి, మంత్రుల నివాస ప్రాంగణానికో కదిలి వస్తున్నారంటే నేతలు రాచమర్యాదలతో ఎదురెళ్ళి స్వాగతించేవారు, 1989 ఎన్నికల్లో అవనిగడ్డ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ నాయకులు, మాజీమంత్రి మండలి వెంకట కృష్ణారావు 167 ఓట్ల తేడాతో ఓటమి చెందడం కాపుల నుండి వివాదరహితుడిగా పెద్దమనిషి తరహాగా ముఖ్యమంత్రి కాదగిన అర్హతలన్నీ ఉన్నా ఆ మహత్తర అవకాశాన్ని కోల్పోవడం జరిగింది, పి.శివశంకర్, వి. హనుమంతరావులు ఇరువురూ తెలంగాణా ప్రాంతం నుండీ వెనుకబడిన తరగతుల కోటాలో 'ముఖ్యమంత్రి' కావడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.

అందుకు ప్రధానంగా రాజీవ్ గాంధీ దారుణహత్య ఒక కారణం, రంగామరణం, ఎన్నికల్లో కాపునాడు క్రియాశీలక పాత్ర, కాంగ్రెస్ ఘన విజయంతో తెలుగునాట కాపు సామాజిక సముదాయానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని రాజీవ్ గాంధీ భావించారు, అయితే మర్రి చెన్నారెడ్డి పి.సి.సి. అధ్యక్షుడిగా జరిగిన ఎన్నికలు కావడంతో సహజంగానే చెన్నారెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సి వచ్చింది, కానీ కాపుల నుండి వి. హనుమంతరావుని ముఖ్యమంత్రి చేయడానికి రాజీవ్ గాంధీ సుముఖంగా ఉన్న తరుణం, 1991 లోక్సభ ఉప ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ దారుణహత్య గావించబడడంతో ఆ అవకాశం కూడా లేకుండాపోయింది, వరుసగా నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రులు కాగలిగారు, డా॥ మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రి ఎవరున్నా కాపునాడు ఛైర్మన్ గా మిరియాల వెంకటరావు మాటంటే వారికి వేదవాక్కు.

కాపులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే క్రమంలో భాగంగా ఎం.వి.భాస్కరరావు ఐ.పి.ఎస్ని డిజిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, మిరియాల వెంకటరావుని వరుసగా రాష్ట్ర మైనింగ్ కార్పోరేషను, ఆం.ప్ర. రాష్ట్ర హస్తకళల సంఘానికి ఛేర్మన్గా నామినేటెడ్ పోస్ట్లల్లో నియమించారు, ఆ సమయంలో కాపునాడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి మిరియాల వెంకటరావు తతిమ్మా ప్రభుత్వ నామినేటెడ్ పదవులకి మరింత వన్నె తీసుకువచ్చారు, మైనింగ్ కార్పోరేషన్లో ఒకసారి 49 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వచ్చింది, 49 ఉద్యోగాల్నీ కాపు సామాజిక సముదాయానికే కేటాయించి సంచలనం సృష్టించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్. జనార్ధనరెడ్డి “అన్ని ఉద్యోగాలూ మీ వారికేనా?” అని ప్రశ్నిస్తే “ఇప్పటిక్కూడా మావారికి న్యాయం చేసుకోకపోతే ఇంకెప్పటికి చేసుకుంటాం” అని జవాబు విసిరిన చతురులు మిరియాల వెంకటరావు.

కొన్ని ఎన్నికల ప్రచార సభల్లో, రాజకీయ సమావేశాల్లో, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో మిరియాల వెంకటరావు ప్రసంగాలు, వాగ్దాటి ప్రధాన ఆకర్షణగా మారి ఆ కార్యక్రమాలు విజయవంతం అయ్యేవి, ఇటువంటి సభలు, సమావేశాల్లో పాల్గొనే ముఖ్యమంత్రి, రాష్ట్రమంత్రులు వగైరాలకు మాట్లాడ్డానికి “విషయం” లేక మిరియాల వెంకటరావు వాక్రవాహం ముందు వెలవెలబోయి లోలోన ఉడుక్కున్న సందర్భాలు కోకొల్లలు.

రెవెన్యూ సెక్రటరీగా చేసిన కనమలూరు వెంకట శివయ్య విరచిత 'శివామోదం' కావ్యావిష్కరణ సభ, కడపకు చెందిన గుర్రం కొండ ప్రభాకర్ కడపజిల్లా బలిజల ఇంటిపేర్లు దిశగా నిరసన ప్రాచీనతపై చేసిన పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథ ఆవిష్కరణ సభ ఇలా ఎన్నో ఎన్నెన్నో మిరియాల వెంకటరావు సభాధ్యక్షతతో అలరారాయి, వెలుగు చూశాయి.

ఇక ఈ సమయంలోనే కాపు, తెలగ, బలిజల్ని వెనకబడిన తరగతులలో చేర్చే అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు కొందరు నాయకులు, మిరియాల వెంకటరావు రగిల్చిన చైతన్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో ఉన్న కులస్తులు సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకునే పూర్తి స్థాయిలో మానసికంగా, సామాజికంగా సిద్ధమౌతున్న దశ అది. తెలంగాణా ప్రాంతం లోని మున్నూరు కాపులు, ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తూర్పుకాపులు బి.సి. గ్రూప్ 'డి'లో ఉండగా మిగిలిన కోస్తాకాపు, బలిజ, తెలగ, ఒంటరులు ఒ.సి. జాబితాలో ఉండడంతో వీరందర్నీ కూడా వెనకబడిన తరగతులలో చేర్చాలనే డిమాండ్ బలంగా వినిపించింది 'కాపునాడు'.

ఈ డిమాండ్ని నెరవేర్చాలని రావులపాలెంలో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి పాల్గొన్న సభలో ఉద్యమకారులు బలంగా నినదించడం లాఠీ ఛార్జి జరగడం, ముద్రగడ పద్మనాభం తెలియజేస్తూ నిరాహారదీక్ష చేయడం, ఏడు రోజుల పాటు రాష్ట్రమంతా ఇదే అంశం చర్చనీయాంశమయ్యింది, కోట్ల విజయ భాస్కరరెడ్డి, కాపుల్ని వెనుకబడిన తరగుతులలో చేర్చాలా వద్దా’ అనే అంశంపై సాధ్యాసాధ్యాల్ని తేల్చడానికి జస్టిస్ పుట్టస్వామి సారథ్యంలో కమిషన్ ను ఏర్పాటు చేసి అప్పటికి పరిస్థితిని కొంత అదుపులోకి తెచ్చారు (ఇప్పటికీ ఈ కమీషన్ నివేదిక ఏమయ్యిందో ఆ దేవదేవుడికే ఎరుక). రావులపాలెం ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితులైన నాయకులు ముద్రగడ పద్మనాభం, సలాది స్వామి నాయుడు, నిమ్మకాయల వీరరాఘవనాయుడు, నల్లా సూర్య చంద్రరావు, సలాది గంగాధర రామారావు తదితరులు... ఇంకా యువనాయకుడిగా ఉన్న తోట త్రిమూర్తులు తూర్పు గోదావరి జిల్లా నుండి రాజకీయంగా ఎదిగి రావడానికి ఈ నేపథ్యం కొంత ఉపకరించింది.

కాపునాడు స్ఫూర్తితో అప్పటికి తెలుగునాట కులసంఘాల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది, సామాజిక విప్లవం కనిపిస్తోంది, మాల మహానాడు, మాదిగ దండోరా, బి.సి.ల చైతన్య సదస్సు ఇత్యాదివన్నీ బలంగా వేళ్ళూను కోవడానికి 'కాపునాడు' నాంది పలికిందంటే అతిశయోక్తి లేదు, వీరందరితో కలిసిన ఒక సామూహిక రాజకీయ శక్తిగా వేదిక ఏర్పాటుకు మిరియాల వెంకటరావు మేధోమథనం చేశారు, ఈ ప్రయత్నాల్లో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని కాపునాడు నాయకులతో కలసి వెళ్ళి 'ముఠామేస్త్రి' షూటింగ్ సమయంలో అన్నపూర్ణా 7 ఎకరాల్లో సమాలోచనలు చేశారు, దీనికి ప్రత్యక్ష సాక్షి కాపునాడు కన్వీనర్ డా॥ ఎస్. వెంకటేశ్వర రావు.

అంతేకాదు డా॥ దాసరి నారాయణరావు సంపాదకత్వంలోని 'ఉదయం' దినపత్రిక ద్వారా విస్తృతస్థాయిలో 'సర్వే' నిర్వహించగా చిరంజీవి స్వంతంగా అప్పటికప్పుడు పార్టీ ఏర్పాటు చేయాలని, చేస్తే గెలుపు తథ్యమని రాష్ట్రంలోని 72% మంది ప్రజల మనోగతంగా తేలింది, అయితే చిరంజీవి స్పందించలేదు, ఆ ఆహ్వానాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించడంతో 'కాపునాడు' అడుగులు ముందుకు పడలేదు, సరిగ్గా ఈ సమయంలోనే కాంగ్రెస్ లోని రెడ్లతో, తెదేపాలోని కమ్మలు రాజకీయంగా ఢీకొనే శక్తియుక్తుల్ని సమీకరించుకునే దిశగా పావులు కదుపుకుంటూ ముందుకు రావడం జరిగింది, కాపులకు, వెనుకబడిన తరగతులకు, దళితులకు కాంగ్రెస్పార్టీ ‘ముఖ్యమంత్రి’ పీఠంపై ఆసీనులయ్యే అవకాశం లేకుండా చేయడం, వరుసగా రెడ్లనే ముఖ్యమంత్రులుగా మార్చుకుంటూరావడంతో ఓటర్లలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షణ తగ్గింది, ఎన్నికల సమయంలోనైతే భారత ప్రధానిగానున్న తెలుగువారు పి.వి.నరసింహారావు 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్రాహ్మణ కులస్తుల్ని కాంగ్రెస్ అభ్యర్థులుగా ఖరారుచేసి (ఈ నిర్ణయం వెనుక ప్రధాని ఆంతరంగిక కార్యదర్శి పి.వి.ఆర్.కె.ప్రసాద్ మంత్రాంగం ఉందని అంటారు). కులాభిమానాన్ని చాటుకోవడం పరాకాష్ట. రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియుల సమాహారంగా కాంగ్రెస్ పార్టీ 1994 ఎన్నికలనాటికి అవతరించడంతో కాపులకు ఆసక్తి సన్నగిల్లి నిర్లిప్తతలో ఉన్న తరుణమది. మిరియాల వెంకటరావు సారధ్యంలోని 'కాపునాడు', దాని అనుబంధ సంఘాలు రాజకీయంగా ఎటూ నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో 'ఎన్నికలు' ముంచుకొచ్చాయి.

తెదేపా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు కాపుల్ని ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని స్థానాల్లో ప్రయోగాలు చేసింది, వాటి ఫలితంగా ఎలకోటి ఎల్లారెడ్డి (మక్తల్), దాస్యం ప్రణయ్ భాస్కర్ (వరంగల్ పశ్చిమం), కలమట మోహనరావు (పాతపట్నం) పడాల అరుణ (గజపతి నగరం), పొట్నూరు సూర్య నారాయణ (సతివాడ), పతివాడ నారాయణస్వామి నాయుడు (భోగాపురం), పప్పల చలపతిరావు (యలమంచిలి), పర్వత సుబ్బారావు (పుత్తిపాడు), వెన్నా నాగేశ్వరరావు (పిఠాపురం), చిక్కాల రామచంద్రరావు (తాళ్ళరేవు), డా॥మెట్ల సత్య నారాయణరావు (అమలాపురం), బండారు సత్యానందరావు (కొత్తపేట), వడ్డి వీరభద్రరావు (కడియం), జ్యోతుల నెహ్రు (జగ్గంపేట), అల్లు వెంకటసత్యనారాయణ (పాలకొల్లు), కొత్తపల్లి సుబ్బారాయుడు (నరసాపురం), పసల కనకసుందరరావు (తాడేపల్లి గూడెం), అంబటి బ్రాహ్మణయ్య (బందరు), సింహాద్రి సత్యనారాయణ (అవనిగడ్డ), నారపుశెట్టి శ్రీరాములు (దర్శి), పసుపులేటి బ్రహ్మయ్య (రాజంపేట), బండి హుళికుంటప్ప (రాయదుర్గం) అంతరాజి మోహన్ (తిరుపతి) తెదేపా పక్షాన 'కాపుబలిజ తెలగ తూర్పు కాపు మున్నూరు కాపు' సముదాయం నుండి భారీ ఆధిక్యతతో గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు, వీరిలో దాస్యం ప్రణయ్ భాస్కర్, పడాల అరుణ, పసుపులేటి బ్రహ్మయ్య, చిక్కాల రామచంద్రరావు, డా॥మెట్ల సత్యనారాయణరావు, సింహాద్రి సత్యనారాయణలు వరుసగా ఎన్.టి. రామారావు, ఎన్.చంద్రబాబుల మంత్రివర్గాల్లో మంత్రులుగా పదవులు పొందగా అల్లాడి రాజ్కుమార్ ( రెండు పర్యాయాలు ), వంగాగీత (రెండు పర్యాయాలు), సి. రామచంద్రయ్య (రెండు పర్యాయాలు), ఎర్రా నారాయణస్వామి, మెంటి పద్మనాభంలు రాజ్యసభకు ఎంపిక కాగా బాపట్ల నుండి లోక్సభకు ఎంపికైన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కేంద్రమంత్రి కాగలిగారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు 96 లోక్సభ ఎన్నికల్లో కొత్తపల్లి సుబ్బారాయుడు (నరసాపురం), కొండపల్లి పైడితల్లి నాయుడు (బొబ్బిలి), కైకాల సత్యనారాయణ (బందరు), తోట గోపాలకృష్ణ (కాకినాడ)లు లోక్సభ సభ్యులుగా ఎంపికయ్యారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా నున్న ఈ సమయంలోనే జస్టిస్ పుట్టస్వామి కమీషన్ కాపు బలిజ తెలగల్నిబి. సి. లలోచేర్చేఅంశం పైనివేదికల్నితయారుచేసేక్రమంలో పలుమార్లు మిరియాల వెంకటరావు, చిలంకుర్తి అంబులు, ఆకుల శివయ్య నాయుడు, బుట్నా గోపాల కృష్ణ, డా||ఎస్.వెంకటేశ్వర రావుల బృందంతో పుట్టస్వామి కమీషన్ ఎదుట హాజరై ఎన్నో చారిత్రక ఆధారాల్ని, సాధ్యాసాధ్యాల్ని, పరిస్థితుల ప్రభావాన్ని ఏకరువు పెట్టడం జరిగింది, ఏళ్ళకు ఏళ్ళు, పూళ్ళకు పూళ్ళు కరిగిపోతున్నా ఈ అంశం ఒక కొలిక్కి రాలేదు, సరిగ్గా ఇక్కడే రెండు ముఖ్యమైన సంగతుల్ని ప్రస్తావించాలి. తెలుగుదేశం పక్షాన గెలిచిన శాసనసభ్యులు, లోక్సభ, రాజ్యసభసభ్యులు అధినేత చంద్రబాబు కనుసన్నలలో మెలగడం, కాపు బలిజ తెలగల్ని బి.సి. జాబితాలో చేర్చే అంశం లేవనెత్తితే ఎక్కడ చంద్రబాబుకు ఆగ్రహం వస్తుందో, తోటి శాసనసభ్యుల్లో అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న కమ్మ, రెడ్డి, వెలమ, క్షత్రియులతో వైరం కొని తెచ్చుకోవలసి వస్తుందేమోనన్న సంశయంతో నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించేవారు, పైగా తాము అత్యధికులు తెదేపాలో ఉండడం మూలాన తెదేపాలో తమకు దక్కుతున్న గౌరవమర్యాదలకు లోటు జరగకుండా కొనసాగించబడడం అనే స్వార్థం బి.సి.జాబితాలో కాపు బలిజ తెలగల్ని చేర్చే అంశం ప్రాధాన్యత కోల్పోతూ వచ్చింది, కాపునాడు ఎన్ని సార్లు పుట్టస్వామి కమీషన్ విచారణ ఎంతవరకూ వచ్చిందని విజ్ఞప్తులు పాలకవర్గానికి సమర్పించినా సమాధానం వచ్చేది కాదు, ఇదిలా ఉండగా 89-94 మధ్యకాలంలో మిరియాల వెంకటరావు ఉద్యమస్ఫూర్తిని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీలోని రెడ్లు 'కాపునాడు' ఉద్యమసారథుల్లో చీలికలు తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేసి విజయం సాధించారు.

94 వరకూ దాదాపు ఒకే గొంతుకగా నినదించిన 'కాపువాడు' ఆ తర్వాత 'కోటిగొంతులు ఒక్కటేమైకు' చందంగా తయారైంది, రోజుకో కాపునాయకుడు పుట్టుకురావడం జరిగింది, సచివాలయంలో, ఎమ్.ఎల్.ఏ. క్వార్టర్స్ దగ్గర కాపునాడు విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్లతో పైరవీలు సాగించే అత్యుత్సాహవంతులు ఆవిర్భవించిన సమయమిదే, ఈ అత్యుత్సాహవంతులు ఒక రోజు ఎన్టిఆర్ జిందాబాద్ అనీ, వీరిలో కొందరు చంద్రబాబుకీ జై అనీ, ఎన్టీఆర్ మరణించాక లక్ష్మీపార్వతి జై అనీ, 96 ఉప ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం ఓటమిపాలుకాగానే చంద్రబాబు వైఖరితో విసిగివేసారిన మరికొందరు అత్యుత్సాహవంతులు వైఎస్. రాజశేఖరెడ్డి పంచన చేరారు.

పుట్టస్వామి కమీషన్ పూర్వాపరాల సంగతి కాస్సేపు పక్కన బెడితే 1989వ సంవత్సరంలో ముద్రగడ పద్మనాభం తెలుగునాడు పార్టీని స్థాపించి తిరుపతి గుంటూరులో భారీ బహిరంగసభలు నిర్వహించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. 92-94 సం||ల మధ్యకాలంలో 'కొబ్బరి చెట్టు' చిహ్నంగా కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన సారథి ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత ఎస్.వి.పార్ధసారథి రావు ‘రాష్ట్రీయ ప్రజాపరిషత్' పేరిట రాజకీయ పార్టీని ప్రకటించారుగానీ ఎన్నికలకు సమాయత్తం కాలేదు, 94-99 సం||ల మధ్యకాలంలో మాజీ డి.జి.పి. ఎమ్.వి. భాస్కరరావు 'ఆంధ్రనాడు' పేరిట పార్టీని ప్రకటించారు కానీ కాంగ్రెస్పార్టీలో చేరిపోయారు, సరిగ్గా దాదాపుగా ఈ సమయంలోనే దర్శకరత్న డా॥దాసరి నారాయణరావు సైతం తెలుగుతల్లి పార్టీని ప్రకటించారు కానీ ఎందుకనో మనసు మార్చుకుని కాంగ్రెస్పార్టీలో చేరిపోయారు, కాపు తెలగ బలిజల్ని వెనుకబడిన తరగతులలో చేర్చే అంశం బలంగా మళ్ళీ వినిపించింది సరిగ్గా ఈ సమయంలోనే.... మిరియాల వెంకటరావు, డా||దాసరి నారాయణరావు, చేగొండి హరిరామ జోగయ్య, చిలంకుర్తి అంబులు వంటి ప్రముఖులంతా కాంగ్రెస్పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డారు, 99 ఎన్నికలు ముంచుకొచ్చాయి, డా||వై.ఎస్.రాజశేఖర్రెడ్డి రెండోపర్యాయం పి.సి.సి. అధ్యక్షుడిగా పగ్గాలు చేతబట్టారు, ఇక్కడ ఎవరూ ఊహించని మలుపు ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ముద్రగడ పద్మనాభం వెళ్ళి తెలుగుదేశంలో చేరడమే కాక తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పడం మొదలుపెట్టారు, భాజపా, తెదేపా పొత్తుతో ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీతో తలపడ్డమే కాక డి.కె.ఆదికేశవులు, చదలవాడ కృష్ణమూర్తి వంటి కాంగ్రెస్ దిగ్గజాల్ని తెదేపాలోకి సాదరంగా స్వాగతించి సమీకరణల్లో కాంగ్రెస్ని ఖంగుతినిపించింది.

ఇక్కడ జులై 4వ తేదీన 99వ సం॥లో కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ లో జరిగిన వంగవీటిరంగా జయంతి రోజున రాష్ట్ర కాపునాడు వ్యవస్థాపక ఛేర్మన్ మిరియాల వెంకటరావు, కాంగ్రెస్ నాయకులు కె.కేశవరావు, వంగవీటి శోభనాచలపతి రావు, రామచంద్రాపురం నుండి 94 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచివచ్చిన తోట త్రిమూర్తులు, కాపునాయకులు వంగవీటి శంతన్ కుమార్, పిళ్ళా వెంకటేశ్వరరావు, దుట్టారామచంద్రరావు, చింతా శేషగిరి రావు, ఆచంట వెంకటరత్నం నాయుడు, బొండా శ్రీనివాసరావు, గాళ్ళసుబ్రహ్మణ్యం, నిమ్మకాయలు వీరరాఘవనాయుడు, సలాది స్వామినాయుడు, వడ్లమాని మాధవరావు పాల్గొనగా భారీఎత్తున వేలాది మందితో మహాసభ నిర్వహించబడింది, అదేరోజు వేదిక మీద 'రాష్ట్ర యువకాపునాడు' మొట్టమొదటి అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన 'చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్' పేరుని ప్రకటించారు, సభికుల హర్షధ్వానాల నడుమ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ ప్రసంగిస్తూ తెదేపా నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థులు దేవినేని రాజశేఖర్, పర్వతనేని ఉపేంద్రలతో పాటు 'బందరు' స్థానం నుండి పోటీ చేస్తున్న కావూరి సాంబశివరావుల్ని ఓడించాలని పిలుపు నివ్వడం జరిగింది, పార్టీ ఏదైనా సరే బందరు ఎమ్.పి.గా కాపు కులస్తుడు గెలిచే సంప్రదాయం కొనసాగాలని శ్రీకాంత్ కుమార్ ఇచ్చిన పిలుపుకి సభికుల నుండి ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన రావడమేగాక ఆ ముగ్గురూ 99 ఎన్నికల్లో పరాజితులవ్వడం జరిగింది, ఇది తాత్కాలిక విజయం మాత్రమే.

సరే 99 ఎన్నికల సమయానికి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో తొందరగా అభ్యర్థుల్ని ఖరారు చేయకుండా, చేసినా అర్హతయోగ్యత లేని అభ్యర్థులకు బి-ఫారాలు ఇస్తూ ఒకవైపు 'కాపునాడు' నాయకులు చెబుతున్నా ఏ సూచననీ సలహానీ స్వీకరించకుండా ఏక పక్షంగా వ్యవహరించడంతో కాపునాడు నాయకులు విసిగిపోయారు.. మిరియాల వెంకటరావు, డా॥ దాసరి నారాయణరావులు ఎక్కడికైనా ప్రచారానికి వెళుతున్నారంటే వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఎంతో ఇబ్బంది పడిపోవడమే గాక తన అక్కసుని బాహాటంగానే వెళ్ళగక్కిన సందర్భాలు కోకొల్లలు... సరే కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో వనమా వెంకటేశ్వర రావు (కొత్తగూడెం), కొండాసురేఖా మురళి (తొలిసారి 'శాయంపేట' నుండి), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), దానం నాగేందర్ (అసిఫ్ నగర్), బొమ్మా వెంకటేశ్వర్ (ధర్మపురి) డి.శ్రీనివాస్ (నిజామాబాద్), బాజిరెడ్డి గోవర్ధన్ (ఆర్మూరు), గొర్లె హరిబాబు నాయుడు (పాతపట్నం), పాలవలస రాజశేఖరం (ఉణుకూరు), మీసాల నీలకంఠం నాయుడు (చీపురుపల్లి), టి.ఎస్.ఏ. నాయుడు (గజపతినగరం), పూడి మంగపతిరావు (ఉత్తరాపల్లి), కొమ్మూరి అప్పలస్వామి (భోగాపురం), బలిరెడ్డి సత్యారావు (చోడవరం), వరుపుల సుబ్బారావు (ప్రత్తిపాడు), పంతం గాంధీ మోహన్ (పెద్దాపురం), ఎం.ఎం. పళ్ళంరాజు (కాకినాడ), బదిరెడ్డి అప్పన్న దొర(బూరుగుపూడి), జక్కంపూడి రామ్మోహన్ రావు (కడియం), తోటవెంకటా చలం (జగ్గంపేట), కామిశెట్టి సత్యబాల (తాళ్ళరేవు), గడ్డం సూర్యచంద్రరావు (కొవ్వూరు), కె. నాగతులసీరావు (నరసాపురం), మెంటే పద్మనాభం (పాలకొల్లు), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లి గూడెం), ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (ఏలూరు), బూరగడ్డ వేదవ్యాస్ (మల్లేశ్వరం), పేర్ని వెంకట్రామ్ (బందరు), మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ), వంగవీటి శోభనా చలపతి రావు (ఉయ్యూరు), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), కన్నా లక్ష్మీనారాయణ (పెదకూరపాడు), కె. ఈశ్వర వెంకటభారతి (గుంటూరు-2), పగడాల రామయ్య (గిద్దలూరు), ఎం.వెంకటరమణ (తిరుపతి), శాసన సభ్యులు కావడానికి 'తెదేపా భాజపా' అభ్యర్థులతో తలపడగా బాజిరెడ్డి గోవర్ధన్, డి.శ్రీనివాస్, బొమ్మా వెంకటేశ్వర్, దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖామురళి, వనమా వెంకటేశ్వర రావు, టి.ఎస్.ఏ.నాయుడు, జక్కంపూడి రామ్మోహన్రావు, గడ్డిం సూర్యచంద్ర రావు, మండలి బుద్ధప్రసాద్, సామినేని ఉదయభాను, కన్నాలక్ష్మీనారాయణలు మాత్రమే కాంగ్రెస్ పక్షాన శాసనసభ్యులుగాను, బొత్స సత్యనారాయణ (బొబ్బిలి) లోక్సభ సభుయిగాను గెలుపొందితే తెదేపా నుండి లోక్సభసభ్యులుగా గునిపాటిరామయ్య (రాజంపేట), అంబటి బ్రాహ్మణయ్య (బందరు), ముద్రగడ పద్మనాభం (కాకినాడ), గంటా శ్రీనివాసరావు (అనకాపల్లి), ఉమారెడ్డి వెంకటేశ్వర్లు (తెనాలి), శాసన సభ్యులుగా పడాల భూమన్న (అదిలాబాద్), నేరెళ్ళ ఆంజనేయులు (ఎల్లారెడ్డి), శ్రీపతి రాజేశ్వర్ (సనత్నగర్), ఎలకోటి ఎల్లా రెడ్డి (మక్తల్), కలమట మోహనరావు (పాతపట్నం), కిమిడి గణపతిరావు (ఉణుకూరు), పతివాడ నారాయణస్వామి నాయుడు (భోగాపురం), పప్పల చలపతి రావు (యలమంచిలి), పర్వత బాపనమ్మ (ప్రత్తిపాడు), చిక్కాల రామచంద్రరావు (తాళ్ళరేవు), తోట త్రిమూర్తులు (రామచంద్రాపురం), డా||మెట్ల సత్యనారాయణరావు (అమలాపురం), బండారు సత్యానందరావు (కొత్తపేట), జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట), అల్లు వెంకట సత్యనారాయణ (పాలకొల్లు) కొత్తపల్లి సుబ్బారాయుడు (నరసాపురం), ఎర్రా నారాయణ స్వామి (తాడేపల్లి గూడెం), డా॥శనక్కాయల అరుణ (గుంటూరు-2), పసుపులేటి బ్రహ్మయ్య (రాజంపేట), సుగవాసి పాలకొండ్రాయుడు (రాయచోటి), చదలవాడ కృష్ణమూర్తి (తిరుపతి) ఇలా అధిక సంఖ్యలో తెదేపా పక్షాన గెలిచారు, వీరిలో డా॥ శనక్కాయల అరుణ, పడాల భూమన్న, సింహాద్రి సత్యనారాయణ, డా॥మెట్ల సత్యనారాయణరావు, పతివాడ నారాయణ స్వామి నాయుడు, కొత్తపల్లి సుబ్బారాయుడు, చిక్కాల రామచంద్రరావులు (మంత్రి వర్గాల మార్పులతో) మంత్రులు కాగలిగారు.

అయితే వీరంతా తెదేపా అధినేత రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల విధేయత కనబరిచిన వారే కానీ కాపుల సమస్యల గురించి, బి.సి. జాబితాలో చేర్చే అంశం గురించీ, అసలు జస్టిస్ పుట్టస్వామి కమీషన్ నివేదిక ఏమయ్యిందో ప్రశ్నించే ప్రయత్నమైనా చేశారో లేదో వారికే తెలియాలి. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ అధిష్టానం కాపుల్ని, కాపునాయకుల్ని గుర్తిస్తున్నామనే సంకేతాలు పంపుతూ డా॥ దాసరి నారాయణరావుని రాజ్యసభకు నామినేట్ చేశారు, ఇంతకు పూర్వమే డా||దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన 'చిన్నా' చిత్రంలో 'మిరియాల వెంకటరావు'ని ముఖ్యమంత్రి పాత్రలో నటింపజేశారు దాసరి నారాయణరావు.

కాపులు, కాపునాడు డా॥ దాసరి నారాయణ రావుకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సందర్భమది, కాపునాడు నేపధ్యమే డా॥ దాసరి నారాయణరావుని రాజ్యసభ సభ్యుణ్ణి చేసిందనడం అతిశయోక్తి కానేకాదు, సరే తెదేపా హయాంలో విజేతలుగా నిలిచిన కాపు సామాజిక సముదాయానికి చెందిన నాయకులు మినహా తతిమ్మా సామాజిక వర్గమంతా కష్టాల కడలిలో కూరుకుపోయిన కాలం కూడా
99-2004 మధ్యలోనే...

బి.సి.జాబితాలో లేకపోవడం అనే ఒకే ఒక్క అంశంతోపాటు, పేద బలిజ కాపు విద్యార్థులకు ఎటువంటి ఉపకార వేతనాలు లేకపోవడం విద్యావకాశల్ని ఉన్నతంగా అందుకునే దిశగా సామాజిక వర్గం ముందుకు చొచ్చుకుపోలేక పోయిందన్నది నిర్వివాదాంశం, ఇక్కడ ఆశాకిరణం ఒక్కటే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన కొన్ని కుటుంబాలు తమ బిడ్డల్ని బాగా చదివించాలనే సదాశయంతో వ్యయప్రయాసల కోర్చి దున్నుకునేపొలం, తలదాచుకుంటున్న ఇల్లువంటివి, ఒంటిమీదున్న నగానట్రా వంటివి తాకట్టుపెట్టి చదివించడంతో 'సాఫ్ట్వేర్' బూమ్లో కొత్త ఉద్యోగాల వెల్లువలో కొంతమంది మాత్రమే ఉన్నతస్థితి కెదిగారు కానీ మరీ ఉచ్ఛస్థితి అయితే కాదు, ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగం కూడా మంచి ఊపు మీద ఉండడంతో కొంతమంది ఈ రంగంలో సంచలన విజయాలు సాధించారు. వీరే తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి అన్నిపార్టీల ద్వారాల గుండా వచ్చారు, వీరిలో కొందరు సంచలనాలు సృష్టించారు, మరి కొందరు ఒకసారి గెలుపు, రెండోసారి ఓటమితో వెనుతిరిగి వెళ్ళిపోయారు.

ఓడినా, గెలిచినా రాజకీయాల్లో కొనసాగ గలిగే వృత్తికోణం కాపులకి ఇంకా వంట బట్టలేదనడానికి ఇది సాక్ష్యం... ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మిరియాల వెంకటరావు మడమ తిప్పలేదు, రాజీలేని పోరాటమే చేశారు, ఎప్పటికప్పుడు పత్రికా సమావేశాలతో సభలతో, సదస్సులతో రాష్ట్ర, రాష్టేతర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు, శారీరకంగా ఆరోగ్యం సహకరించకున్నా లెక్క చేయక మొక్కవోని దీక్షతో మొండిపట్టుదలతో తిరిగారు, 1987వ సం||లో చిత్తూరుజిల్లా మదనపల్లెలో మా తండ్రిగారు కీ॥శే॥ చిల్లగట్టు సుదర్శనం గారి ఆధ్వర్యంలో బలిజసేవా సమితి, బలిజ యువజన సంఘం నిర్వహించిన సామూహిక వివాహాలకు పెద్దదిక్కుగా విచ్చేసిన మిరియాల వారిలో ఏ ఉత్సాహమైతే తొణికిసలాడేదో (అప్పటికి నా వయసు పన్నెండేళ్ళు, రాష్ట్రంలోనే మొట్టమొదటగా నిర్వహించబడిన బలిజ కులస్తుల సామూహిక వివాహాలు ఇవే). 2012వ సం॥ శ్రీరామనవమి పర్వదినాన నాచే విరచించబడిన కాపుల చరిత్ర (ప్రథమ ప్రచురణ) గ్రంథావిష్కరణ రోజు కూడా అదే సమరోత్సాహాన్ని దర్శించాను.

1987-1999 మధ్య కాలంలో మదనపల్లెకు తిరిగి వారిని ఆహ్వానించే సదవకాశం కూడా నాకూ, మా నాన్నగారికే లభించడం ఓ అపురూప జ్ఞాపకం, 1998వ సం||లో అప్పటికీ రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు పర్యాయాలు గెలుపొందిన అన్నయ్య గారి సాయిప్రతాప్ గారికి పౌరసన్మానం తలపెట్టి సభాధ్యక్ష స్థానాన్ని మిరియాల వెంకటరావు గారిని అలంకరించాల్సిందిగా ఆహ్వానించగానే విచ్చేసారు, ఆ రోజు మధ్యాహ్నం పట్టణ కులప్రముఖుల సమక్షంలో పంచాయతిరాజ్ అతిథి గృహంలో మేం మిరియాల వారిని ఘనంగా సన్మానించుకున్నాం, సాయంత్రం సాయిప్రతాప్ గారికి పట్టణ నడిబొడ్డున ఘన సన్మానం, మున్సిపల్ ఛేర్పర్సన్ జి.ముజీబ్ హుస్సేన్ నిర్వహణలో వైభవోపేతంగా రాయలసీమలోని కాంగ్రెస్ దిగ్గజాలందరూ పాల్గొనగా మిరియాల వెంకటరావుగారి అధ్యక్షతన జరిగింది, సాయిప్రతాప్ గారికి పౌరసన్మానం తలపెట్టడానికి గల కారణం అప్పటికి పోతురాజు పార్థసారథి ఒక్కరే రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుండి నాలుగు పర్యాయాలు ఎంపికయ్యారు, కాపు బలిజ సామాజిక వర్గం నుండి మొట్టమొదటి కేంద్రమంత్రి కూడా కీ॥శే॥ పోతురాజు పార్థసారథి గారే. పార్థసారథి గారి తరువాత నాలుగు పర్యాయాలు లోక్సభకు ఎంపికై సాయిప్రతాప్ ఆ రికార్డును సమం చేశారు కాబట్టి పౌరసన్మానం (తరువాత మరో రెండుసార్లు లోక్సభకు ఎంపికై మొత్తం ఆరు పర్యాయాలు రాజంపేట నుండి గెలిచిన ఏకైక అభ్యర్థిగా, కేంద్రమంత్రిగా కూడా సాయిప్రతాప్ రికార్డు సృష్టించారు).

2002, 2003 సం॥లలో వరుసగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర, ఠాగూర్ ఘనవిజయాలు సాధించడంతో తిరిగీ చిరంజీవి రాజకీయ ప్రవేశం, కాపులు రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలనే అంశం తెరమీదకు వచ్చింది, ఈ సందర్భంగా 'కాపునాడు' నాయకుల వైఖరిపట్ల ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూడసాగారు, కాపునాడు ఆచితూచి వ్యవహరించ సాగింది, ఆ సరికే చంద్రబాబు ముఖ్యమంత్రిగా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, తెదేపా వైఖరి పట్ల కాపులు తీవ్ర నిరసనతో రగిలిపోసాగారు, 'పథకం ప్రకారం సాగుతున్న కాపుల అణచివేత' అంటూ మిరియాల వెంకటరావు పత్రికా ముఖంగా ధ్వజమెత్తడంతో కొంతమంది కాపు మేధావులతో పాటు బ్రాహ్మణుడైన తుర్లపాటి సత్యనారాయణ వంటి సోషలిస్టు భావాలు కలిగిన మేధావులు సైతం ఆంధ్రరాష్ట్రంలో కాపులకు జరుగుతున్న అన్యాయాలపై పత్రికాముఖంగా పెక్కు కథనాలు వెలువరించడం జరిగింది, వాస్తవానికి చిరంజీవిరాకకు సరియైన సమయమది, అయితే రాష్ట్రంలో చంద్రబాబు, కేంద్రంలో ముప్పవరపు వెంకయ్య వంటివారి ప్రభ 'కమ్మ'గా వెలిగిపోతూ ఇతరుల్ని ఒకానొక అయోమయస్థితిలోకి నెట్టివేసిన నైరాశ్య తరుణమది, ఆ అయోమయ స్థితి చిరంజీవిని సైతం వెన్నాడింది.

ఈ లోపు డా॥వై.ఎస్.రాజశేఖర రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడం, కాంగ్రెస్ అధిష్టానం పి.సి.సి.పీఠంపై డి.శ్రీనివాస్, ఆసీనున్జి గావించడంతో రెడ్డి, కాపు, మాల, ముస్లిం మైనార్టీలు నాలుగు కాళ్ళు గా కాంగ్రెస్ కుర్చీ తయారు అయ్యింది, డా॥ దాసరి నారాయణ రావుకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ బస్సుయాత్రల్ని నిర్వహించడం వంటివి కాపులు, కాపునాడు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు కావడానికి తగిన వాతావరణం ఏర్పడింది, 'కాపునాడు' బాహాటంగానే కాంగ్రెస్పార్టీకి మద్దతు ప్రకటించింది, మద్దతు ప్రకటించడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాపుల్ని బి.సి.లలో చేర్చే అంశాన్ని చేర్చడం... 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, తెరాస, సిపిఐ, సిపిఎమ్ పొత్తుతో తెదేపా భాజపా కూటిమితో తలపడగా కాంగ్రెస్ పక్షాన బాజిరెడ్డి గోవర్ధన్ (బాన్సువాడ), డి.శ్రీనివాస్ (నిజామాబాద్), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), కొండా సురేఖామురళి (శాయంపేట), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), పూడి మంగపతి రావు (ఉత్తరాపల్లి), కర్రిసీతారామ్ (భీమిలి), కరణం ధర్మశ్రీ (మాడుగుల), వరుపుల సుబ్బారావు (ప్రత్తిపాడు) తోట గోపాలకృష్ణ (పెద్దాపురం), రౌతు సూర్య ప్రకాశరావు (రాజమండ్రి), జక్కంపూడి రామ్మోహన్ రావు (కడియం), తోట నరసింహం (జగ్గంపేట), గ్రంథి శ్రీనివాస్ (భీమవరం), కొట్టు సత్యనారాయణ (తాడేపల్లిగూడెం), వట్టి వసంతకుమార్ (ఉంగుటూరు), ఆళ్ళనాని (ఏలూరు), బూరగడ్డ వేదవ్యాస్ (మల్లేశ్వరం), పేర్నినాని (బందరు), మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ), సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట), వంగవీటి రాధాకృష్ణ (విజయవాడ తూర్పు), కన్నా లక్ష్మీనారాయణ (వెదకూరపాడు), సోమరౌతు సతీష్ పాల్రాజ్ (వేమూరు), పగడాల రామయ్య (గిద్దలూరు), ఎమ్. వెంకటరమణ (తిరుపతి)లు శాసనసభ్యులు కాగా తెదేపా పక్షాన కలమట మోహనరావు (పాతపట్నం), కిమిడి కళావెంకటరావు (ఉణుకూరు), పడాల అరుణ (గజపతి నగరం), పతివాడ నారాయణ స్వామినాయుడు (భోగాపురం), గంటా శ్రీనివాసరావు (చోడవరం), కొత్తపల్లి సుబ్బారాయుడు (నరసాపురం), డా॥ చౌటుపల్లి సత్య నారాయణమూర్తి (పాలకొల్లు), ఎ.ఎస్.మనోహర్ (చిత్తూరు), సుగవాసి పాలకొండ్రాయుడు (రాయచోటి), సానామారుతి (చొప్పదండి)లు శాసనసభ్యులుగా ఎంపిక కాగా భాజపా వల్లభనేని తరపున పెండెం దొరబాబు (పిఠాపురం), 'జనతా' తరపున కొమ్మిరెడ్డి రాములు (మెట్పల్లి ) శాసనసభకు ఎన్నికయ్యారు. లోక్సభకు కాంగ్రెస్ పక్షాన ఎమ్. ఎమ్. పళ్ళంరాజు (కాకినాడ), చేగొండి వెంకట హరరామ జోగయ్య (నరసాపురం), బాడిగ రామకృష్ణారావు (బందరు), (తెనాలి), అన్నయ్యగారి సాయిప్రతాప్ (రాజంపేట)లు ఎన్నిక కాగా తెదేపా పక్షాన కొండపల్లి పైడితల్లి నాయుడు (బొబ్బిలి), పప్పల చలపతిరావు (అనకాపల్లి), డి.కె.ఆదికేశవులు నాయుడు (చిత్తూరు)లు ఎన్నికయ్యారు. 2007లో ఉప ఎన్నిక జరిగి బొబ్బిలి లోక్సభ నుండి బొత్సఝాన్సీరాణి కాంగ్రెస్ పక్షానగెలిచి మొత్తమ్మీద ఎనిమిది మంది లోక్సభ సభ్యులు కాగలిగితే డా ॥ దాసరి నారాయణరావు, ఎమ్.ఎమ్. పళ్ళం రాజులు ఎకాఎకిన కేంద్రమంత్రి వర్గంలో స్థానం సంపాదించారు.

రాజ్యసభలో డా||దాసరి నారాయణ రావుతో పాటు రాజ్యసభ సభ్యులుగా వి. హనుమంతరావు, కె.కేశవరావులు కాంగ్రెస్ పక్షాన, తెదేపా పక్షాన అల్లాడి రాజ్కుమార్, సి. రామచంద్రయ్య శ్రీమతి వంగాగీతలు ఉండేవారు, అంటే లోక్సభ, రాజ్యసభ కలిపి 'పధ్నాలుగు మంది' సభ్యులు ఉండడం సాధారణ విషయంకాదు... డా॥ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తొలుత కాపు విద్యార్థులకు 3 కోట్ల రూ॥ల ఉపకార వేతనాల్ని మంజూరు చేసింది, అయితే కాపుల్ని వెనుకబడిన తరగతులలో చేర్చే అంశం మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఈ అంశంపై నాయకులు తమ అభిప్రాయాల్ని సందర్భానుగుణంగా వెలిబుచ్చినా డా॥రాజశేఖరరెడ్డి హయాంలో తగినస్పందన రాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్ల తర్వాత రాజశేఖరరెడ్డి కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టే వ్యవహరించ సాగారు, అయితే ఈ ప్రాధాన్యత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా బలిజలకు ఉండేది కాదు, కేవలం కోస్తాకాపు, తెలగ, తూర్పు, మున్నూరు కాపులకే అగ్రాసనాలు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వేశారు, బొత్స సత్యనారాయణ, జక్కంపూడి రామ్మోహన రావు, మండలి బుద్ధ ప్రసాద్, వట్టి వసంత్ కుమార్, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, వనమా వెంకటేశ్వరరావులు రాష్ట్రమంత్రులుగా అలరారారు, ఈ సమయంలో కాపునాడు ఛేర్మన్ హెూదాలో మిరియాల వెంకటరావు తొలుత విజేతలుగా నిలిచిన శాసన సభ్యుల్ని, లోక్ సభ, రాజ్యసభసభ్యుల్ని, శాసనమండలిసభ్యుల్నిదాదాపుగా అందర్నీఘనంగాసన్మానించి వారినెంతో గౌరవించారు, చట్టసభల్లో కాపుల ఔన్నత్యాన్ని చాటుతారని ఎంతగానో విశ్వసించారు, అంతేకాదు ఎప్పటికప్పుడు వారికి వెన్నుదన్నుగా నిలిచే పత్రికా ప్రకటనలు విడుదల చేసేవారు, సభలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ప్రసంగాలు చేసే వారు. ప్రజాప్రతినిధులైన కాపు తెలగ బలిజల్ని అవమానపరిచేలా ఇతర సామాజిక వర్గాలేవైనా ప్రవర్తిస్తే మిరియాల వెంకటరావు ఏనాడూ మిన్నకుండి పోలేదు, కొన్ని సామాజిక వర్గాల వారితో ఎదురొడ్డి ఎడతెగని పోరాటం చేసే కానీ మడమతిప్పేవారు కాదు...

2007-08 మధ్య కాలంలో చిరంజీవి 'రాజకీయ రంగప్రవేశం' బలంగా ప్రజలు, అభిమానుల పక్షాన వినిపించింది, అయితే 2002, 2003 సం॥ల కాలంలో చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించినట్టైతేతప్పనిసరిగాముఖ్యమంత్రిఅయ్యేవారు,లేదా 2014సరైనసమయం.. ఎటూ కాకుండా 2009 ఎన్నికలకు చిరంజీవి సర్వసన్నద్ధులౌతున్నారని తెలిసి మేధావి వర్గం ఒకింత విస్మయాన్ని వ్యక్తపరచారు, అందుకు కారణాలు లేకపోలేదు, 2004లో అధికారం చేజిక్కించుకున్న ఆం.ప్ర. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలరారుతున్న డా॥ వై. ఎస్. రాజశేఖరరెడ్డి బలీయమైన శక్తిగా అవతరించి అన్ని వర్గాల ఆదరణనూ పొందుతున్న సమయమది, ఒకవైపు అత్యధిక కాలం రాష్ట్రాన్ని పరిపాలించి అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మంచి అదునుకోసం మరోసారి ఎదురు చూస్తున్న తరుణమది, ఇంకోవైపు తెలంగాణా ఉద్యమనేపథ్యంతో భావోద్వేగాల వెల్లువలో బలీయంగా ఎదిగిన తెరాస అధ్యక్షులు కె.చంద్రశేఖరరావు హెూరా హెూరీగా తలపడ్డానికి సిద్ధమౌతున్న వేళ... కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలకు అనుగుణంగా డా|| రాజశేఖర రెడ్డి రాష్ట్రంలోని శాసనసభా నియోజకవర్గాల పునర్విభజన అనే అంకానికి తెరతీశారు..

ఎంతటి కాకలు తీరిన రాజకీయ మేధావులైనా, తలపండితులైనా రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికలకు సిద్ధం కాని సమయంలో మెగాస్టార్ చిరంజీవి 'ప్రజారాజ్యం' పేరిట రాజకీయపార్టీని నెలకొల్పారు, ఆయన పార్టీ స్థాపించడానికి అటువంటి వరిస్థితులు కొన్ని ప్రేరేపించాయి...

ఇటువంటి సంకటస్థితిలో ఎన్నికలు రానే వచ్చాయి, తెదేపా, కాంగ్రెస్ ఈ ఎన్నికలకు గాను కాపు సామాజిక వర్గానికి తక్కువ స్థానాల్ని కేటాయించింది, ప్రరాపా సైతం తక్కువ స్థానాల్నే కేటాయించింది, ప్రరాపా పక్షాన గంటా శ్రీనివాసరావు (అనకాపల్లి), ముత్తంశెట్టి శ్రీనివాసరావు (భీమిలి), పంచకర్ల రమేష్ బాబు (పెందుర్తి), చింతలపూడి వెంకటరామయ్య (గాజువాక), డా॥కె. చిరంజీవి (తిరుపతి), వంగాగీత (పిఠాపురం), కురసాల కన్నబాబు (కాకినాడ రూరల్), పంతం గాంధీమోహన్ (పెద్దాపురం), బండారు సత్యానందరావు (కొత్తపేట), ఈలినాని (తాడేపల్లి గూడెం), శాసనసభకు ఎన్నిక కాగా కాంగ్రెస్ పక్షాన మీసాల నీలకంఠం నాయుడు (ఎచ్చెర్ల), బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి), బొత్స అప్పల నరసయ్య (గజపతి నగరం), బడికొండ అప్పలనాయుడు (నెల్లిమర్ల), రౌతుసూర్య ప్రకాశరావు (రాజమండ్రి సిటీ), తోట వెంకట నరసింహం (జగ్గంపేట), పి. రామాంజనేయులు (భీమవరం), వట్టివసంత్ కుమార్ (ఉంగుటూరు), ఆళ్ళనాని (ఏలూరు), పేర్ని నాని (బందరు), కన్నా లక్ష్మీనారాయణ (గుంటూరుసౌత్), ఆమంచి కృష్ణమోహన్ (చీరాల), దానం నాగేందర్ (ఖైరతాబాద్), పొన్నాల లక్ష్మయ్య (జనగామ)లు ఎన్నికకాగా తెలంగాణా రాష్ట్రసమితి పక్షాన కావేటి సమ్మయ్య (సిర్పూర్), దాస్యం వినయ్ భాస్కర్ (వరంగల్ వెస్ట్)లు శాసనసభలో అడుగుపెట్టారు, తెదేపా నుండి జోగురామన్న (ఆదిలాబాద్), గంగుల కమలాకర్ (కరీంనగర్), సోమారపు సత్యనారాయణ (తెదేపా రెబల్, రామగుండం), ఎలకోటి ఎల్లారెడ్డి (నారాయణ్్పట్), పర్వత సత్యనారాయణ మూర్తి (ప్రత్తిపాడు), అంబటి బ్రాహ్మణయ్య (అవనిగడ్డ),లు ఎంపిక కాగా, భాజపా పక్షాన యెండల లక్ష్మీనారాయణ (నిజామాబాద్ అర్బన్) ఎన్నికయ్యారు. ఎమ్. ఎమ్. పళ్ళం రాజు (కాకినాడ), అన్నయ్యగారి సాయిప్రతాప్ (రాజంపేట), బొత్సఝాన్సీరాణి (విజయనగరం)లు లోక్సభకు ఎన్నికయ్యారు. డా||వై.ఎస్.రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, ఎన్. కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా వరుసగా పదవీ బాధ్యతలు నెరవేర్చిన మంత్రిమండలులలో మార్పులతో సహా బొత్స సత్యనారాయణ, తోట వెంకట నరసింహం, వట్టి వసంతకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య,లు రాష్ట్రమంత్రులు కాగా, ఎమ్.ఎమ్. పళ్ళంరాజు, అన్నయ్యగారి సాయిప్రతాప్ కేంద్రమంత్రులు అయ్యారు, డా॥కె. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభ సభ్యులై కేంద్రమంత్రి కాగలిగారు, ప్రరాపా తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్.ఎల్.ఏ గంటాశ్రీనివాసరావు, ఎమ్.ఎల్.సి (నామినేటెడ్) సి.రామచంద్రయ్యలు తర్వాత రాష్ట్రమంత్రులయ్యారు.

చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడం కోసం ఇదే సామాజిక వర్గానికి చెందిన అన్నయ్యగారి సాయిప్రతాపిని కేంద్రమంత్రి వర్గం నుండి తొలగించారు. 2009-14 మధ్యకాలంలో ఎంతో మంది ఆశావహులు 'కాపునాయకులు'గా అవతరించారు, గల్లీ నుండి ఢిల్లీ వరకూ కూడా రాకపోకలు సాగించారు, అధికశాతం కాపు, తెలగ, బలిజల్ని వెనుకబడిన తరగతులలో చేర్చండని జాతీయ నాయకులకు, రాష్ట్రనాయకులకు 'వినతిపత్రాలు' అందించడంలో పోటీపడ్డారు, పత్రికల్లో పేరుకోసమో ఫోటో కోసమో ప్రాకులాడే వారి సంఖ్యా పెరిగింది, తద్వారా జాతికి జరగాల్సిన మేలు కంటే కీడు ఎక్కువ జరిగింది, చులకన భావం ఏర్పడింది...

వంగవీటిరంగా గారి హత్యోదంతం తర్వాత కాపులు సంఘటితం కావడానికి బలమైన వేదికగా తయారు కావడానికి అంతకు దశాబ్దకాలంగా మిరియాల వారి కృషిదాగి ఉంది. పాలకుల్ని నిలదీసి శాసనసభ, లోక్సభ స్థానాలు అడిగే దమ్ము 1982కు ముందెక్కడిది? లేనేలేదు 82 తర్వాతే ప్రశ్నించే సాహసం చేశారు... ఎందరో ఉత్సాహవంతులు, మరెందరో యువతరంగాలు రాజకీయాల్లో ప్రవేశించారు, కాపులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి కావాల్సిన ఆలోచనా దృక్పథం అలవడింది... అయితే ఇప్పటికీ 'రాజ్యాధికారానికి' పూర్తిగా చేరువ కాలేకపోవడానికి ప్రధానకారణం ఒక వేదిక గుండా మొదలైన ఉద్యమం, ఒక గొంతుక ద్వారా నినదించిన సిద్ధాంతం కొంతమంది స్వార్ధపూరిత కుట్రలకు నిశ్శబ్దాన్ని ఆశ్రయించాల్సి రావడం వల్లే... ఒక మేధావి మౌనం దేశానికే నష్టం అన్నట్టు మిరియాల వెంకటరావు సిద్ధాంతాల్ని, ఆశయాల్ని ఆచరించే తరం తయారుగా లేకపోవడం, ఎవరు నాయకులుగా అవతారం ఎత్తినా 'వ్యక్తిగత ఎజెండా'తో తయారు కావడం, చరిత్రపట్ల, కాపుల సమస్యలపట్ల, ఉద్యమంపట్ల కనీస అవగాహన లేకపోవడం ఇత్యాది కారణాలతో పాటు 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులు 18 మందికి మించి గెలవలేకపోవడానికి, స్వయంగా చిరంజీవి పాలకొల్లులో ఓటమి చెందడానికి కారణం రాష్ట్రవ్యాప్తంగా కాపు తెలగ బలిజలు 'ఆర్థికంగా', సామాజికంగా', 'మానసికంగా' రాజ్యాధికారాన్ని స్వంతం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే..

2003వ సం॥ నుండి 2012వ సం॥ వరకూ హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎన్నో పర్యాయాలు, విశాఖ, రాజమండ్రిల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తరపున మిరియాల వెంకటరావు సారధ్యంలో ఉగాది, శ్రీరామ నవమి సందర్భాల్లో వరుసగా పది సంవత్సరాలకుపైగా ఆయా రంగాలలో విశేషకృషి చేసిన విశిష్ట కాపుల్ని సత్కరించే సత్సంప్రదాయం కొనసాగింది. ఎందరో మట్టిలో దాగి ఉన్న మాణిక్యాల వంటి తెలగ కాపు బలిజలు ఈ వేదిక ద్వారా సమాజానికి చేరువయ్యారు, 2012వ సం||లో చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ పరిశోధనాత్మక గ్రంథం 'కాపుల చరిత్ర' ( ప్రథమ ముద్రణ ) వెలుగు చూసింది మిరియాల వెంకటరావు సౌహార్ద్ర సౌమనస్యంతో ఇదే వేదిక పైన.. దీనికి డా॥ ఎస్. వెంకటేశ్వరరావు అస్మదాప్త సౌజన్యం కూడా తోడయ్యింది. మిరియాల వెంకటరావు నాయకత్వంలోని కాపునాడు దాని అనుబంధ సంఘాల ప్రభ ఎంత వరకూ వెలిగిందంటే రెండో మాటకు తావు లేకుండా ఇతర సామాజిక వర్గాలు పూర్తిగా చైతన్యవంతమయ్యాయి, గొంతులు సవరించుకుని జ్ఞానాన్ని సముపార్జించుకుని లక్ష్యసాధనలో ముందుకు సాగాయి..

మాలమహానాడు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, బి.సి. సంక్షేమ సమాఖ్య ఇవన్నీ ఉద్యమస్ఫూర్తిని రగుల్చుకుంది 'కాపునాడు'ని చూసే అని నిస్సందేహంగా చెప్పొచ్చు.. కాపుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన ప్రతి సందర్భంలోనూ అగ్రకుల శూద్రులైన రెడ్డి, కమ్మ కులాల వారు పైనుదహరించిన సంఘాల వారిని ఉసిగొల్పేవారు, వారిలో మరీ ముఖ్యంగా 2014 ఎన్నికల్లో ఎల్.బి.నగర్ నుండి తెదేపా పక్షాన శాసనసభకు ఎన్నికైన ఆర్. కృష్ణయ్య ముందుండేవారు.. అయినా కాపు బలిజ తెలగల్ని బి.సి. గ్రూప్ ఎఫ్ గానే కదా గుర్తించమని కాపునాడు కోరుతూంది. డా॥ రాజశేఖర రెడ్డి 2004-09 మధ్యకాలంలో ముస్లింలను బి.సి. గ్రూప్ -ఇ చేశాక కాపు బలిజ తెలగలకి మిగిలింది ఆ 'ఆల్ఫాబెట్' ఎఫ్ కాక మరేమిటి? 2014 రాష్ట్రవిభజన అనంతరం తెలంగాణాలోని మున్నూరు కాపులంతా ఎప్పటి నుండో బి.సి. గ్రూప్ 'డి'లో ఉన్నారు సరే, ఇక్కడే స్థిరపడిపోయిన కాపు బలిజ తెలగల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలోని తూర్పుకాపులు బి.సి. గ్రూప్ డిలోనే ఉన్నారు, చిత్తూరు నుండి తూర్పు గోదావరి జిల్లా వరకూ పది జిల్లాల్లో ఉన్న కాపు బలిజ తెలగల స్థితిగతులు ఏమిటి?

2014 ఎన్నికల నేపథ్యంలో తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీలు కాపులపట్ల తలా ఒక విధంగా స్పందించాయి, వైకాపా అత్యధికంగా లోక్సభ స్థానాలు కేటాయిస్తే, కాంగ్రెస్ బి. సి. జాబితాలో చేర్చే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది, తెదేపా ఒక్కడుగు ముందుకు వేసి ఆరు నెలల్లో నివేదిక తెప్పించుకుని వెనకబడిన తరగతులలో చేరుస్తాం అనడంతో పాటు భాజపా, జనసేనలతో జట్టు కట్టింది, డా॥కె. చిరంజీవి కాంగ్రెస్లో ఉండగానే ఆయన సోదరుడు, తెలుగునాట మరో సుప్రసిద్ధ సినీ కథానాయకుడు పవన్ కళ్యాణ్ మార్చి 12, 2014న జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికలకు అభ్యర్థుల్ని నుంచో బెట్టకుండా భాజపా తెదేపాతో కలసి ప్రచారపర్వాన్ని పరాకాష్టకు తీసుకువెళ్ళారు, తెదేపా అతితక్కువ అసెంబ్లీ, రెండంటే రెండు లోక్సభ స్థానాలు కాపు తెలగ బలిజలకు కేటాయించింది, అయినా ఎన్నికలకు రెండ్రోజులు ముందు కాపులకు ఉపముఖ్యమంత్రి పదవిని ప్రకటించింది, దీనికి తోటు అప్పటికే చేరువైన పవన్ కళ్యాణ్ ప్రసంగాలతో ఓటర్లు తెదేపాకు మద్దతు పలకడం జరిగింది.

తెదేపా పక్షాన డి.కె. సత్యప్రభమ్మ (చిత్తూరు), ఎమ్.వెంకటరమణ (తిరుపతి), కదిరి బాబూరావు (కనిగిరి), మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ), బొండా ఉమామహేశ్వర రావు (విజయవాడ సెంట్రల్), బడేటి కోటరామారావ్ (ఏలూరు), పి. రామాంజనేయులు (భీమవరం) నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), బండారు మాధవనాయుడు (నరసాపురం), నిమ్మకాయల చినరాజప్ప (పెద్దాపురం), తోట త్రిమూర్తులు (రామచంద్రాపురం), కిమిడి కళావెంకట్రావ్ (ఎచ్చెర్ల), కిమిడి మృణాళిని (చీపురుపల్లి) మీసాలగీత (విజయనగరం), పతివాడ నారాయణస్వామి నాయుడు (నెల్లిమర్ల), కె.అప్పలనాయుడు (గజపతినగరం), గంటా శ్రీనివాసరావు (భీమిలి), పంచకర్ల రమేష్బాబు (యలమంచిలి) విజేతలుగా నిలవగా భాజపా నుండి పి.మాణిక్యాలరావు (తాడేపల్లిగూడెం), ఆకుల సత్యనారాయణ (రాజమండ్రి సిటీ) గెలవగా నవోదయం పార్టీ తరపున ఆమంచి కృష్ణమోహన్ (చీరాల), వైకాపా పక్షాన కలమట వెంకటరమణ (పాతపట్నం), వరుపుల సుబ్బారావు (ప్రత్తిపాడు), దాడి శెట్టిరాజా (తుని), జ్యోతుల నెహ్రు (జగ్గంపేట) గెలిగారు, తెలంగాణాలో తెరాస పక్షాన జోగురామన్న (అదిలాబాద్), గంగుల కమలాకర్ (కరీంనగర్), సోమారపు సత్యనారాయణ (రామగుండం), పుట్టామధు (మంథని), బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్ అర్బన్), కొండాసురేఖామురళి (వరంగల్ ఈస్ట్), దాస్యం వినయ్ భాస్కర్ (వరంగల్ వెస్ట్)లు గెలవగా భాజపా పక్షాన డా॥ కోవా లక్ష్మణ్ (ముషీరాబాద్) గెలిచారు. తెలంగాణా రాష్ట్ర తొలి మంత్రి మండలిలో జోగురామన్నకు స్థానం లభించింది. అధికారంలో ఉంటేనే ఏ సామాజిక వర్గమైనా పురోభివృద్ధి సాధించగలిగేది. అనకాపల్లి లోక్సభనుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కాకినాడ లోక్సభనుండి తోట వెంకట నరసింహం తెదేపా పక్షాన గెలిచారు. 80వ దశకంలో పురుడు పోసుకున్న కాపు ఉద్యమం మిరియాల వెంకటరావు పోరాటపటిమ 2014 వరకూ కూడా ఎడతెగకుండా కాపు, తెలగ, బలిజ, తూర్పుకాపు, మున్నూరు కాపుల్ని విశేషంగా ప్రభావితం చేస్తూనే ఉంది, ఎందరినో ఆ ద్వారం గుండా ఉన్నత శిఖరాల్ని అధిరోహింపజేస్తూనే ఉంది...

ఎందరో శాసనసభ్యులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, మంత్రులు, ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్ ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు మిరియాల వెంకటరావు ద్వారా స్ఫూర్తిని పొంది విజయాలు అందిపుచ్చుకున్నా రన్నది చరిత్ర మరవని సత్యం, కాపుల చరిత్రకోసం సుమారు రెండు సంవత్సరాలు వీలు చిక్కినప్పుడల్లా మిరియాల వారితో భేటీ కావడం జ ప్రథమముద్రణలో ఎన్నో విషయాలు పొందుపరచడం, చిన్నిచిన్ని మార్పులు చేయడం, సంపూర్ణంగా ఉందా లేదా అని ఒకటికి రెండుసార్లు పునశ్చరణ చేసుకోవడం జీవిత పర్యంతం గుర్తుంచుకోదగ్గ గొప్ప జ్ఞాపకాలు.. కొనసాగింపుగా ద్వితీయ ముద్రణ కోసం తిరిగీ అంతకంటే ఎక్కువ కృషి మళ్ళీ రెండేళ్ళకాలం జరిగింది.. మిరియాల వారు హైదరాబాద్ నుండి విశాఖకు మకాం మార్చాక ద్వితీయ ముద్రణకు సంబంధించి ఎప్పుడు ఫోన్ చేసినా సందేహనివృత్తి చేశారు.

'కాపునాడు' అన్న నామకరణం చేసిన ఘన చరిత స్వర్గీయ చిలంకుర్తి అంబులు, ఈలి సత్యనారాయణ గార్లకు చెందుతుందని పలుమార్లు మిరియాల వెంకటరావుగారు ప్రస్తుతించిన నేపథ్యంలో స్వర్గీయ చిలంకుర్తి అంబులు, ఈలి సత్యనారాయణ గార్లను స్మరించుకోవడం కనీస ధర్మంగా భావిస్తున్నాను. చాలా మందికి తెలిసినట్టు మిరియాల వెంకటరావుగారు కాపు ఉద్యమనేత మాత్రమేకాదు, తొలినాళ్ళలో కార్మిక నాయకుడు కూడా, రాజమండ్రిలో విద్యాభ్యాసానంతరం అనేక కార్మిక సంఘాలకు నాయకత్వం వహించారు, కాంగ్రెస్ పార్టీలో చేరి కార్మికోద్యమాలను నిర్మించారు, వారి హక్కుల సాధనకై ఉద్యమించారు అటు తర్వాతనే కాపు ఉద్యమంలోకి వచ్చి కీలకనేతగా ఎదిగారు, తానే కేంద్రంగా ఎన్నిసార్లు పడ్డా తిరిగి లేచి పయనాన్ని, పోరాటాన్ని ఓం ప్రథమంగా ఆరంభించి ఈ జాతిని జాగృతపరచాలన్న మహా సంకల్పంతో ముందుకే మున్ముందుకే సాగి, ఆగక అలాగే కొనసాగింది శిఖరసమానులు మిరియాల వెంకటరావు... కులసంక్షేమం కోసం ఎవరు ఏ మంచి కార్యం తలపెట్టినా శుభాశీస్సులు ఆర్థికంగా, హార్ధికంగా అందించిన నిష్పాక్షిక వ్యక్తిత్వం వారిది, అడిగిన వారికీ అడగని వారికీ కూడా లేదనకుండా చేసిన గుప్తదానాలు ఎన్నో... 2013లో వైజాగ్ సంకల్ప సేవాసమితికి ఒక లక్ష రూపాయలు, గాజువాకలో కాపు కల్యాణ మండపానికి రెండు లక్షల రూపాయలు, 2014లో కాపు ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి 5 లక్షల రూపాయలు విరాళాలు అందించారు. రాసుకుంటూ పోతే పేజీలు కాదు, పుస్తకాలు సరిపోవు. చివరిగా కాపు బలిజ తెలగ ఒంటరి తూర్పు కాపు, మున్నూరు కాపులు సంఘటితం కావడానికి, సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడానికి, శాఖోపశాఖలుగా విస్తరించిన కులం ఒక ఉనికిని కలిగి అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి జీవితాన్నే ఆయుధంగా మలచుకుని మహాసంగ్రామం చేసిన ఉద్యమవీరుడు మిరియాల వెంకటరావు...

రాష్ట్ర కాపునాడు ఉద్యమంలో సువర్ణ అధ్యాయం

‘కాపునాడు' వ్యవస్థాపక నాయకులు శ్రీ మిరియాల వెంకట్రావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ...
(ఆయన కులతత్వవాది కాదు.. సోషలిస్టువాది. కులాభిమానం వుంది కాని కుల దురభిమానం లేదు. ఆయనే 'కాపునాడు'కు పురుడుపోసిన మిరియాల వెంకటరావు.)
'కాపునాడు' ఉద్యమం గురించి వెంకట్రావు సమగ్రవిశేషాలు తెలిపారు. వాటిని యధాతధంగా కాపు సోదరుల ముందుంచుతున్నాము.

వెంకటరావు 1958లో ప్రజాసోషలిస్ట్ పార్టీలో వుంటూ, సోషలిస్టు సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. రాష్ట్ర పి.ఎస్.పి. ప్రధాన కార్యదర్శిగా కాతా జనార్ధనరావు వుండేవారు. కమ్మవాళ్ళు కలిసి జి.సి. కొండయ్య (నెల్లూరుజిల్లా) మాజీ కమ్యూనిస్టు (కాంగ్రెస్) కమ్మనాయకుల్ని ప్రధాన కార్యదర్శిని చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆ పార్టీకి చెందిన కమ్మవారు ఇతర పార్టీలకు చెందిన కమ్మవారు కూడా రాజమండ్రిలో జరిగిన పి.ఎస్.పి. రాష్ట్ర మహాసభలలో జి.సి. కొండయ్యను ప్రధాన కార్యదర్శిగా చేయటానికి ముఖ్యపాత్ర వహించారు. నామన సత్యం లాంటి పెద్ద మనుషులు 'కులం' ప్రధానపాత్ర వహించిందన్న విషయాన్ని తెలియజెప్పారు. అప్పటికే కాపు, తెలగ, బలిజ సంఘాలున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రెడ్డి వెంకట్రావు అధ్యక్షుడుగా, మేడిశెట్టి వెంకట్రావు ప్రధాన కార్యదర్శిగా సంఘం వుండేది. అంతకుముందు జరిగిన కాకినాడ అసెంబ్లీ ఎన్నికల్లో మల్లిపూడి పళ్ళంరాజు అభ్యర్థిగా శాసనసభకు పోటీ చేశారు. కులమంతా ఏకత్రాటిపై కాపు అయిన మల్లిపూడి పళ్లంరాజును గెలిపించడానికి తీవ్రంగా కృషి చేసింది. దాంతో వెంకట్రావులో కులమంటే కొత్త శక్తి, ఉత్సాహం ఎక్కువైంది. కులం పట్ల అభిమానం ప్రగాఢంగా నాటుకుపోయింది. ప్రజా సోషలిస్టు పార్టీ క్షీణదశకు వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఆ మహాసభ ప్రజాస్వామ్య సిద్ధాంతాలు ప్రతిపాదించటంలో ఆవడి కాంగ్రెస్ డెమోక్రటిక్ సోషలిజం ప్రతిపాదించటంతో సామాజిక న్యాయం కావాలనుకునే వెంకట్రావుకు ఒక ఆశాకిరణంగా కనిపించి 1960 తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

(ఇక్కడో విషయం: ఆనాడున్న అంతరాలు కంటే ఈనాడు పదిరెట్లు అంతరం కన్పిస్తోందని వెంకటరావుగారు మథనపడ్డారు) ఆ తరువాత ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన 1975 ప్రాంతాన కాపు కులంపై జరుగుతున్న వివక్షతతోపాటు కమ్మ, రెడ్లు ఆధిపత్యం వహించడం, రెడ్లు పెత్తందారీశక్తిగా, కమ్మవారు పెట్టుబడిదారీ శక్తిగా ఎదుగుతూ బిసి, ఎస్సీలు రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతూ... ఈ కులాలన్నీ ప్రయోజనాలు పొందుతున్నప్పుడు కాపుకులం ఎటూ కాకుండా అయిపోతున్నదన్న ఆవేదనతో 1975 నుంచి కులానికి ఏదో మంచి చెయ్యాలనే ఆరాటం ఆయనలో వుండేది. 1978లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో కాపులకు న్యాయం జరగడం లేదన్న అంశం బలపడడంతో కాపు ఉద్యమానికి శ్రీకారం వెంకటరావు చుట్టారు. అప్పటికి కాపు, తెలగ సంఘాలన్నీ సంక్షేమ సంఘాలుగానే వుండిపోయాయి. హైదరాబాద్లో కూడా కాపు, తెలగ, బలిజ సంక్షేమ సంఘం వుండేది. 1982లో కాకినాడలో జరిగిన తెలగ సంఘ సమావేశం తరువాత (కాపుల్ని) దీనిని ఒక ఉద్యమంగా రూపొందించాలన్న లక్ష్యం వెంకటరావులో బలపడింది. అయితే అప్పటికి రాయలసీమలో బలిజలు, కోస్తాలో కాపులు, తెలగాలు, ఒంటరులు ఎవరికి వారుగా వుంటున్నారు. అప్పట్లో పత్రికారంగానికి విజయవాడ కేంద్రంగా వున్న కారణాన విజయవాడలో తెలగ సంఘం కార్యదర్శి దానయ్యతో సంప్రదించి అక్కడే పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. విజయవాడ తెలగ సంఘం పెద్దలు గాజుల నారాయణరావు, తోట పార్వతీశ్వరరావు, దానయ్య, జక్కాపాపారావు, జక్కా వెంకట స్వామి, గాళ్ల వెంకయ్య నాయుడు మున్నగువారు విజయవాడలో మహాసభ ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఆనాటి పత్రికా సమావేశంలోనే కాపు ఉద్యమ విశేషాలు చెప్పారు. విజయవాడ ప్రజాసంఘం ఆధ్వర్యంలోనే కాపు మహాసభలు జరిగాయి. స్వర్గీయ వంగవీటి మోహనరంగా ఉద్యమానికి ఎంతో సహకారాన్ని ప్రోత్సాహానిచ్చారు.

కాపు ఉద్యమం రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం కోసం ఉద్భవించింది. విభిన్న ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్న ఈ కులాలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకురావటమే ధ్యేయంగా, ఒక శక్తిగా ఏర్పరచటమే లక్ష్యంగా ఏర్పడింది. స్తబ్ధతగా వున్న ఈ కులంలో చైతన్యాన్ని, ఆలోచనను తీసుకు రావాలన్న దృఢ సంకల్పంతో కాపు ఉద్యమాన్ని వెంకటరావు పలువురు పెద్దలతో ప్రారంభించారు. కాపునాడు ఆవిర్భావ కమిటీ ఏర్పాటైంది. 1982నాటి కాపు మహాసభ ఏర్పాటుకు ప్రస్తుత తెరాస సెక్రటరీ జనరల్, రాజ్యసభ ఎం.పి. కేశవరావు. సంగీత వెంకటరెడ్డి, మచిలీపట్నం మాజీ ఎం.పి. బాడిగ రామకృష్ణారావు ఎంతో స్ఫూర్తిని ఇవ్వడమే కాకుండా తమ సహాయసహకారాల్ని అందించారు. దీంతో కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో కాపుజనం వివిధ ప్రాంతాలనుంచి సుమారు మూడు లక్షల మంది విజయవాడ పి.డబ్ల్యు.డి. గ్రౌండ్స్ లో సమావేశం అయ్యారు. ఆనాటి మహాసభలో పెద్దలు తలారి అనంతబాబు, మదన్మోహన్, ఎల్వీరామయ్య, పి.కె.రామయ్య, మరెందరో పెద్దలు పేరుపేరునా అందర్నీ స్మరించలేకపోయినందుకు వెంకటరావుగారు విచారించారు) పాల్గొన్నారు. కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. మిరియాల వెంకటరావు కన్వీనర్, జాయింట్ కన్వీనర్ గా జి.ఎస్. రావు, పసుపులేటి సాంబశివరావు(కడప), 27మంది (తెలగ, కాపు, బలిజ, ఒంటరి) కార్యాచరణ సంఘం ఆవిర్భవించింది. మహాసభల తర్వాత కార్యాచరణ కమిటీ అన్ని జిల్లాలను పర్యటించింది. అన్ని జిల్లాల్లోనూ జిల్లా సంఘాలను, గ్రామాల్లోను గ్రామ సంఘాలను ఏర్పాటు చేశారు. (శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వున్న కాపుల్ని చైతన్యపరుస్తూ సమావేశాలు ఏర్పాటు చేశారు) కాపుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.

1962లో సి.ఎం. సంజీవయ్య గారి హయాంలోనే కాపుల్ని వెనుకబడ్డ వర్గాల్లో చేర్చారు. 1963లో (సంజీవరెడ్డి హయాంలో) తీసివేసిన బిసి హెూదాను కాపులకు కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని వెంకటరావు డిమాండ్ చేశారు. 1982లో ముఖ్యమంత్రిగా వున్న విజయభాస్కరరెడ్డికి, తలారి అనంతబాబు నాయకత్వంలో వెంకటరావు వినతిపత్రాన్ని అందజేశారు.

జిల్లాల పర్యటనలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి కులస్తుల్ని ఉత్తేజ పరిచారు. తిరుపతిలో 60 శాతం బలిజలున్నా అక్కడ ఏనాడూ ఏ బలిజా ఎమ్మేల్యే కాలేదు. తిరుపతిలో మహాసభ ఏర్పాటు ఎంతో కష్టపడితే గాని జరుగలేదు. విచిత్రమేమంటే అక్కడ అంతమంది బలిజలున్న సంగతి అక్కడి బలిజలకే తెలియకపోవడం. తిరుపతి బలిజసభ తర్వాత కొద్ది రోజులకే బలిజశక్తిని గుర్తించి కత్తుల శ్యామల అనే బలిజ మహిళకు టిక్కెట్టు ఇవ్వడం, ఆమె ఎమ్మేల్యేగా గెలవడం (1983) జరిగాయి. ఆనాటి పరంపర ఇప్పుడూ కొనసాగుతూనే వుంది. జిల్లా మహాసభలు యధావిధిగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, గిద్దలూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు,.. ఇలా ఎన్నో ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి.

1988 ప్రాంతంలో విజయవాడలో స్వర్గీయ వంగవీటి మోహనరంగా పై టిడిపి ప్రభుత్వం వేధింపు చర్యల కారణంగా, అంతేకాక సుమారు వందమంది కాపు పోలీసు అధికారులను విజయవాడ నుంచి ఒక్కసారే ట్రాన్స్ఫర్ చెయ్యడం వెంకటరావులో ఆగ్రహాన్ని కలిగించడంతో స్వర్గీయ రంగా వంటి పెద్దల ప్రోద్భలంతో విజయవాడ తెలగ సంఘం విజయవాడ మహాసభను నిర్వహించింది. చరిత్రలో కనీ వినని రీతిలో హెూరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయక రంగాపై వున్న వీరాభిమానం, కులాభిమానంతో 15 లక్షల మంది కాపు సోదరులు ఆనాటి సభకు హాజరయ్యారు. నభూతో న భవిష్యతి అన్నట్టుగా సాగిన ఈ సభకు వెంకటరావే అధ్యక్షత వహించారు. ఈ మహాసభ కేవలం కాపు కులాల్లోనే కాకుండా అణచివేతకు గురవుతున్న ఇతర వర్గాల్లో కూడా ఆలోచననూ, వుత్సాహాన్ని ఇచ్చింది. ఈ సభల తర్వాత కాపులు రాజకీయ పార్టీ పెట్టాలన్న ప్రతిపాదన కొన్ని వర్గాల నుంచి వచ్చింది. సుదీర్ఘ రాజకీయానుభవంతో కులంమీద అవగాహన వున్న వెంకటరావు రాజకీయ పార్టీ పెట్టటం కులం చులకనయ్యేందుకు అవకాశం కల్పిస్తుందన్న అనుమానంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చనీయలేదు. ఎందుకంటే కులంలోని వ్యక్తులు అనేక రాజకీయ పార్టీలతో మమేకమై వుండటం, రాజకీయ అధికారం తనకు కావాలన్న కసి వెంకటరావులో లేకపోవడం, పార్టీ పెట్టినా పలు అనర్థాలకు దారితీస్తుందన్న అనుమానం ఆనాటి ఆలోచన. మంచీ చెడూ విజ్ఞతతో నిమ్మకుండిపోయారు వెంకటరావు. అయితే టి.డి.పి. ప్రభుత్వం ఆయన్ని అనేక విధాలుగా వేధించింది. అంతే కాకుండా విజయవాడలోవంగవీటిమోహనరంగాను పాశవికంగానడిరోడ్డుపై హత్యచేయించింది. దీంతో రాష్ట్రమంతటా ఆందోళన జరిగింది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఆవేదనతో, ఆవేశంతో కాపు జనావళి తెలుగుదేశాన్ని ఓడించింది. కాపునాడు విజయోత్సవ మహాసభను జరిపింది. ఈ మహాసభ నుంచే 'కాపునాడు' ఉద్యమంగా ఆవిర్భవించింది. కాపునాడు ఒక సంఘంగా కాక, ఒక శక్తిగా, ఉద్యమంగా బలపడింది. రాష్ట్ర 'కాపునాడు' సంఘం ఆకుల శివయ్య నాయుడు అధ్యక్షుడుగా, మిరియాల వెంకట్రావు ప్రధాన కార్యదర్శిగా, ఇతర పెద్దలతో కమిటీ ఏర్పాటైంది.

కాపునాడు మహాసభ విజయం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కొన్ని అనర్థాలకు దారి తీసింది. దానికి కారణం ఎక్కువమంది కాపునాయకులు కాపునాడు వుండటమే. దాంతోపాటు గుర్తింపు కోసమో, కాపునాడుతో గుర్తింపు వస్తుందనో, రాజకీయ ప్రయోజనాల కోసమో కాపునాడు పేరును ఉపయోగించుకోవడం మొదలైంది. రాజకీయాల్లో చాలామంది కంటే సీనియర్లయిన వెంకటరావుకు ఏదో ఒకటి చెయ్యాలని తపన తప్ప పదవి మీద వ్యామోహం లేదు. అయినప్పటికీ చెన్నారెడ్డి హయాంలో కార్పొరేషన్ పదవి వెంకటరావుకు కట్టబెట్టారు. కుల సంఘంలో నుంచి పదవిలోకి వెళ్లటం ఆయనకి ఇష్టంలేక పత్రికా ప్రకటన ద్వారా కార్పొరేషన్ పదవిని తిరస్కరించారు.

కాపునాడులో ఈర్ష్యాద్వేషాలతో స్వార్థప్రయోజనాల కోసం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు సమస్యలు సృష్టించటం మొదలుపెట్టారు. అవలీలగా రాష్ట్రంలో 15 జిల్లాల్లో గ్రామ గ్రామాన తిరిగి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన వెంకటరావుకు నిత్యం ప్రతిక్షణం అడ్డంకులు కల్పించసాగారు. ఎన్నోరకాల బాధలు అనుభవించారు, చికాకులు పడ్డారు. చెన్నారెడ్డి తర్వాత సి.ఎం. అయిన జనార్థనరెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటికే వెంకటరావుతో పరిచయం వుండడంతో తిరిగి ఛైర్మన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కావాల్సిన మిత్రులు, శ్రేయోభిలాషులు, పెద్దలు, కాపునాడు ఒక ప్రాముఖ్యతను సంతరించుకొన్నది కాబట్టి అందరూ కాపునాడును ఆక్రమించుకోవాలని చూస్తున్నప్పుడు వాళ్ళకి అడ్డుగోడగా వెంకటరావు వున్నారన్న ద్వేషం ఎక్కువైంది. అందుకని కాపునాడుకి రాజీనామా చేసి ఈ పదవి (ఛైర్మన్) తీసుకుంటే కులానికి సేవ చేయొచ్చని భావించారు. మూడేళ్ళు కార్పొరేషన్ ఆఫీసు కాపునాడు ఆఫీసుగానే నడిపించారు. రాష్ట్రంలో ఏ అవసరమొచ్చి ఏ కాపువాడు వచ్చినా వారికి కావాల్సిన సహాయం చెయ్యడానికే ఛైర్మన్ పదవి ఉపయోగపడింది. ఇలా వెంకటరావు ద్వారా సహాయాన్ని పొందిన విషయం అందరికీ తెలిసిందే. 1994లో కాంగ్రెస్పార్టీకి, పదవికి రాజీనామా చేసి కాపునాడు కార్యక్రమాల మీద వెంకటరావు నిమగ్నమయ్యారు. టి.డి.పి. హయాంలో ఏ నాయకులు కాపునాడు పేరుతో బయటకు రాలేదు. తిరిగి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే అందరూ కాపునాడు కార్డు వేసుకోవడం మొదలుపెట్టారు. 1982లో బిసీ స్లోగన్ మొదలు పెట్టిన ఉద్యమం ఎప్పటికప్పుడు మలుపులు తిరుగుతూ వచ్చింది. 1993లో సుప్రీంకోర్టు ఆదేశానుసారం 1994లో విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా జస్టిస్ పుట్టుస్వామి అధ్యక్షతన రాష్ట్ర బిసీ సంఘం ఏర్పాటైంది. ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష ఫలితంగా విజయభాస్కరరెడ్డి జి.వో. ను విడుదల చేశారు.

ఈ ఉద్యమంలో, అంతకు ముందు కాపుల్ని బీసిల్లో చేర్చుతామంటే పట్టించుకోని బిసీలు ఒక్కసారిగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఈ వ్యతిరేకతను ఎదుర్కోవలసివస్తుందనో, మరే కారణంచేతనోటి.డి.పి.హయాంలో ఎన్ని విజ్ఞాపనలు చేసినాబీసికమీషన్ పదిసంవత్సరాల కాలంపాటు ఏ చర్యా తీసుకోలేదు. తిరిగి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సి.ఎం. అయిన తర్వాత రాష్ట్ర బీసి సంఘం ఏర్పాటైంది. ఆ బీసి కమీషన్ కూడా ఇప్పటివరకు ఏ చర్యా తీసుకోకపోవడం గమనార్హం. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఎన్నో విజ్ఞప్తులు చేశారు. చేస్తూనే వున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసుతో నెల్లూరు, చిత్తూరు, ఇతర రాయలసీమలో వున్న గాజుల బలిజలను కేంద్ర బీసి లిస్ట్ లో చేర్చారు.

గతంలో పుట్టుస్వామి కమీషన్ పది సంవత్సరాల కాలంలో నివేదిక సమర్పించింది. లేనిది కూడా స్పష్టంగా తెలియదు. గత ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కేవలం నినాదంగా మిగిలిపోకుండా దీనిపై స్పష్టమైన ఒక అవగాహన కావాలి. బీసిలుగా గుర్తించబడిన వారికొచ్చే ప్రయోజనాల్లో ఏ విధమైన భాగాన్ని కాపులు అడగలేదు. కాని, ఈ విషయంలో బీసిల్లో విశ్వాసాన్ని కల్పించలేకపోయారు. దీనిపై బీసి నాయకులతో కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం ఒక విస్తృతమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా కాపు, బలిజ, ఒంటరి కులానికి అంతటికీ కాకుండా కులంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ బీసి ప్రయోజనాలు కల్పిస్తే చాలని కూడా వెంకటరావుగారు చెప్పారు. ప్రభుత్వానికి కూడా దీనిపై ఎన్నో వినతులు, విజ్ఞాపనలు సమర్పించారు. ముస్లింల కోటా విషయంలో కోర్టు చెప్పిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించాల్సివుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో డి. శ్రీనివాస్ అధ్యక్షతన ప్రకటించిన ప్రణాళికలో కాపులను బీసిల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. కాపులంతా ఏకత్రాటిపై దీనికి ఉద్యమిస్తేనే గాని ఇది సాధించలేము. పలు సంఘాల పేర్లు, కమిటీలపేర్లతో భ్రష్టుపడుతున్న ఈ జాడ్యం జిల్లాల్లో కూడా ఒక కట్టడి లేకుండా సాగిన కారణంగా అస్తవ్యస్తంగా అయిపోయింది. ధ్యేయం లేకుండా కుల ప్రయోజనాల్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న అరాచక విధానాన్ని కట్టడి చేయాల్సిన అవసరం వుంది. కాపు ఉద్యమం ఏ ఒక్కరి సొత్తు కాదు. నాయకులమని చెప్పుకుంటున్న మనం కాపులంతా ఎన్నుకొని పట్టంకట్టిన వాళ్లం కాదు. కులానికి మనం ఏదైనా చేయగలిగితే చేయాలి తప్ప కులానికి నష్టం కలిగించే విధానాన్ని వదిలిపెట్టాలి. ఇతర కులాలు ఆర్థికంగా, రాజకీయంగా ఎలా బలపడుతున్నాయో చూసిన తర్వాతనైనా మనల్ని మనం చక్కదిద్దుకోవాల్సిన అవసరం వుంది. కులం బాగుంటేనే మనం బాగుంటాం. కులానికి గౌరవం వల్ల మనకి గౌరవం వస్తుంది అనే భావన పుట్టకపోతే ఏ జాతి అభివృద్ధి సాధించలేదు. ఏ వ్యక్తీ గౌరవింపబడలేడు. మనలో వున్న లోపాలవల్ల ఇప్పటికే ప్రభుత్వంలోనూ, ఇతర కులాల్లోనూ పలచనయ్యాము. కులానికి ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా నిలదీయగల శక్తి వుండి కూడా ఏమీ చేయలేని దౌర్భాగ్యస్థితికి చేరుకున్నాం. ఈ లోపానికి కారణం ఎవ్వరూ అనే దానికంటే ఈ లోపాన్ని చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మనందరి మీదా వుంది. ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగుల్లో, అధికారుల్లో గాని, ఇతర వర్గాల్లో గాని అన్యాయం జరిగిందంటే చెప్పుకోవడానికి మనకి ఆలంబన లేకుండాపోయింది. ప్రభుత్వంలో ఈ కులానికి న్యాయం చేయండి అని డిమాండ్ చేసే పరిస్థితి లేకుండాపోయింది. ఇది ఏ ఒక్కరి సమస్యా కాదు, కులంలో ప్రతి ఒక్కరి సమస్యిది.

విశాఖ జిల్లాలో కాపునాడు ఉద్యమచైతన్యం

1982లో ఆంధ్రప్రదేశ్ తెలగ, కాపు, బలిజ కార్యాచరణ కమిటీ ఏర్పడిన తరువాత నేను కన్వీనర్ అయి జిల్లాల్లో పర్యటించడం ప్రారంభించాను. విశాఖ జిల్లాలో కాపునాడు మహాసభల నిర్వహణ కోసం యత్నించాను. అప్పటికే అక్కడ విశాఖ కాపు, తెలగ, బలిజ సంఘం వుండేది. దానికి ఈటి సీతయ్య నాయుడు అధ్యక్షులు, ద్వారకానగర్ లోని మిత్రులు బల్లా రాఘవేంద్ర ఇంట్లో కొందరూ సమావేశం అవుతున్నారు. నేను సీతయ్యనాయుడిని కలిసి కాపు ఉద్యమం గురించి చెప్పి, జిల్లా మహాసభను ఏర్పాటు చేద్దామని సూచించాను. దీనికి నిధులు లేవని, తాము నిర్వహించలేమని సీతయ్యనాయుడు చెప్పారు. కాపుమహాసభఏర్పాటుకు విశాఖలోని కాపులంతా ఎంతో ఉత్సాహం చూపారు. మొదటి జిల్లా మహాసభ విశాఖపట్నం రైల్వేగేట్లో ఏర్పాటు చేశారు. మిత్రుడు, ఆంధ్రాయూనివర్సిటీలో పనిచేస్తోన్న రామమోహనరావు కన్వీనర్గా ఏర్పాటైంది. రాష్ట్ర కమిటీ తరుపున సభకు అయ్యే ఖర్చుల నిమిత్తం 5వేల రూపాయలు ఇచ్చి సన్నాహాలు చేశాను. మిత్రుడు సత్యం గౌతందేవ్, బల్లా రాఘవేంద్రరావు ఇతర మిత్రులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. అప్పటికే విశాఖపట్నం పోర్టు కాపు, తెలగ, బలిజ సంఘం వుండేది. మిత్రుడు ధర్మారావు కాపుల కోసం ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో టిబి విద్యార్థులతో సభలు, సమావేశాలు జరిగాయి. అంతేకాకుండా టీచింగ్, నాన్ టీచింగ్ సంఘాలు ఆర్గనైజ్ చేశాము. యూనివర్సిటీలో మిత్రులు గాజుల దశరథ రామారావు, తాతాజీ, అల్లం అప్పారావు, ఆర్వీ రామారావు, ఎందరో పెద్దలు ఈ మహాసభలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖపట్నంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా షిప్ యార్డ్ కెటిబి సంఘం, బిహెచ్పి సంఘం, స్టీల్ ప్లాంట్ కేటిబి నుంచి ఉత్సాహంగా ఉద్యమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. తరువాత ఎమ్మేల్యేగా ఎన్నికైన ఈటి విజయలక్ష్మీ కాపు కులపు యువనేత, రాష్ట్ర మంత్రిగా చేసిన గుడివాడ గుర్నాథరావు, మంత్రిగా చేసిన బలిరెడ్డి సత్యారావు, సమితి అధ్యక్షులుగా చేసిన సాలాపు చిన్నప్పల్నాయుడు, సమితి అధ్యక్షుడిగా చేసిన ముమ్మన సూర్యనారాయణ వీళ్ళందరి సహకారాన్ని మర్చిపోలేను. అప్పట్లో అనకాపల్లిలో వున్న స్వర్గీయ బొండా త్రినాధరావు సేవలు ఏనాడూ మర్చిపోలేదు. విశాఖలో ప్రతి మారుమూల గ్రామానికి తిరిగి, నన్ను గ్రామ గ్రామాన తిప్పి కాపులను ఉత్తేజపరచటంలో అప్పట్లో ఎంత శ్రమపడ్డా ఆనందంగానే వుండేది. అనకాపల్లి, చోడవరం, మాడుగుల, ఎలమంచిలి, నర్సిపట్నంలోనే కాకుండా గ్రామ గ్రామాన సభలు-సమావేశాలు ఏర్పాటు చేశాను. చోడవరంలో సన్యాసిరావు కూడా ఎంతో కృషి చేశారు.

ఈ ఉద్యమం ఫలితంగా విశాఖపట్నంలో కాపుకులంలో ఎంతో ఉత్సాహం పుట్టుకొచ్చింది. జిల్లాలో ఎక్కడ సభపెట్టినా అసంఖ్యాకంగా కులస్తులు హాజరయ్యేవారు. అయితే అప్పట్లో సంఘానికి విశాఖ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ప్రభుత్వం కేటాయించిన పది ఎకరాల స్థలాన్ని వినియోగించుకోలేకపోయాను. స్వర్గీయ ధర్మారావు, ఈటి విజయలక్ష్మీ, ప్రొఫెసర్ అప్పారావు, ఎన్ని విధాలు ప్రయత్నించినా స్థలాన్ని నిలుపుకోలేకపోయాను. విశాఖపట్నంలో కళ్యాణమండపం గాని, హాస్టలు గాని కట్టాలన్న కోర్కె ఇప్పటిదాకా తీరకపోవడం దురదృష్టకరం. అయితే అప్పట్లో సంఘానికి విశాఖ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రభుత్వం కేటాయించిన వది ఎకరాల స్థలాన్ని వినియోగించుకోలేకపోయాము. స్వర్గీయ ధర్మారావు, ఈటి విజయలక్ష్మీ, ప్రొఫెసర్ అప్పారావు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా దాన్ని నిలుపుకోలేకపోయాము. విశాఖపట్నంలో కళ్యాణమండపంగాని, హాస్టలు గాని కట్టాలన్న కోర్కె ఇప్పటిదాకా తీరకపోవడం దురదృష్టకరం. అయితే గాజువాకలో ఒక కళ్యాణమండపాన్ని మాత్రం మనవాళ్లందరూ కలిసి నిర్మించుకోవడం జరిగింది. విశాఖపట్నంలో కొమ్మురు అప్పలస్వామి తరువాత పార్లమెంటు సభ్యులుగా ఎవరూ ఎన్నిక కాలేదు. అయితే ఎన్నో సంవత్సరాలుగా 50% జనాభా వున్న కాపులకు దక్కని అనకాపల్లి పార్లమెంటరీ స్థానం మొదటిసారిగా గుడివాడ గురునాథరావుకి దక్కింది. తర్వాత గంటా శ్రీనివాసరావు, పప్పల చలపతిరావు, ప్రస్తుతం ముత్తంశెట్టి శ్రీనివాసరావు కాపు కులస్థులనుండి పార్లమెంటు సభ్యులుగా వున్నారు. జిల్లాల్లో బలమైన శాసనసభా నియోజకవర్గాలైన ఎలమంచలిలో పప్పల చలపతిరావు ఎక్కువకాలం శాసనసభ్యులుగా కొనసాగారు. అలాగే చోడవరం బలిరెడ్డి సత్యారావు ఎమ్మేల్యేగా గతంలో వుండేవారు. చోడవరం ఎమ్మేల్యేగా, ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు, మొదటిసారిగా మాడుగుల నియోజకవర్గంలో కరణం ధర్మశ్రీ కాపు ఎమ్మేల్యేలుగా గెలవడం జరిగింది. అలాగే భీమునిపట్నం నియోజకవర్గంలో ఎమ్మేల్యేలుగా కర్రి సీతారామ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావులు ఎన్నికయ్యారు. పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాలకు వరసగా పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గాజువాకకి చింతలపూడి వెంకటరామయ్య ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నాయకత్వంలో కానివ్వండి, ఆర్ధికంగా వెనుకబడడంలో కానివ్వండి.. విశాఖజిల్లాలో కాపు జనాభా, దామాషాకు తగ్గట్టుగా ప్రాతినిధ్యం లభించటం లేదు. పోర్టు, స్టీల్ ప్లాంట్ బిఎచ్వీపి, షిప్ యార్డ్, యూనివర్సిటీ, ఇతర విభాగాలన్నింటినీ తిరిగి ఉత్సాహపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గత మూడేళ్ళుగా కాపు వనభోజనాలు పేరుతో సుమారు 15,20 వేల మంది హాజరవుతూ వుండటం కాపుల్లో ఉత్సాహం తగ్గలేదనడానికి నిదర్శనం. మిత్రుడు గుంటూరు నర్సింహారావు, ఇతర మిత్రులు ఏర్పాటు చేసే సమావేశాలు దిగ్విజయంగా జరిగాయి. ఐటిసి చిరంజీవిరావు, ఎడ్వకేట్ నర్సింగరావు, యువనాయకుడు నట్టిని వెంకట్రావు, పసుపులేటి శేఖర్, గాజువాక కెటిబి సంఘం వారు ఉత్సాహంగానే పనిచేస్తున్నారు. ఇంకా మొలబంటి రాఘవరావు, తోట రాజీవ్ వంటివారు కూడా ఉత్సాహంగానే పని చేస్తున్నారు. ఎవరిమటుకు వారు కాకుండా సమిష్టిగా, కులాన్ని ఒక శక్తిగా తయారుచేయడానికి, నిస్వార్థంగా కులం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉద్యమ చైతన్యం

రాష్ట్రంలో కాపు కులానికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో విచిత్రమైన పరిస్థితి. ఈ జిల్లాలో వున్న వాస్తవ చారిత్రక పరిస్థితిని కొంత వివరించాలి. ఈ రెండు జిల్లాలలోనే కాకుండా ఒరిస్సాలోని బరంపురం, కటక్, ఛత్రపూర్, మొదలైన ప్రాంతాల్లో తెలగాలు వ్యాపించివున్నారు. తెలగాలు కాకుండా స్థానికంగా వున్న కాపులు బీసిల్లో కలిసివున్నారు. నిజానికి ఈ తెలగాలు శ్రీ కృష్ణదేవరాయల కళింగ యుద్ధ సమయంలో రాయలసీమ ప్రాంతం నుంచి సైనికులుగా రావడం విశేషం. యుద్ధానంతరం ఈ ప్రాంతంలో స్థిరపడ్డ వీరంతా తెలుగు నాయకులుగా, తెలగాలుగా, తెలుగుదొరలుగా నామాంతరం చెందారు. అప్పట్లో సింహాచలం వరకు కళింగదేశంగానే పిలువబడేది. వీరంతా కాలక్రమేణా రాయలసీమ బలిజలు అని కాకుండా తెలగాలుగా పిలవబడ్డారు. శ్రీకాకుళం జిల్లాలోని బలిజపేట కూడా వీరి మూలానే ఏర్పడింది. తర్వాత కాలంలో వీళ్లలో ఎక్కువమంది బొబ్బిలి రాజ్యంలోనూ, విజయనగరం రాజ్యంలోనూ సైనికులుగా చేరారు. బ్రిటీష్ వారి హయాంలో వీరు అప్పటికి కొత్తగా ఏర్పాటైన పోలీస్ శాఖలో ఉద్యోగాలు చేశారు.

అప్పటికే వ్యవసాయం వృత్తిగా వున్న కాపులు సాంఘికంగా వెనుకబడివున్న కారణంగా వివాహ బాంధవ్యాలు అంతగా వుండేవి కావు. కాపుల్లో సామాజిక వెనుకబాటు కలిగిన వారిని బీసిల్లో చేర్చారు. ఇప్పుడిప్పుడే వివాహ సంబంధాలు చేసుకుంటున్నప్పటికీ వెనుకటితరం వారిని ఒప్పించటం కష్టమైంది. ఆ పరిస్థితుల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో నా ప్రస్థానం సాగింది.

శ్రీకాకుళం జిల్లా తెలగ సంఘం అధ్యక్షుడు గట్టి ఉమామహేశ్వరరావు. రాజాం మండలం సంతకవిటికి చెందిన వ్యక్తి సంఘాధ్యక్షుడిగా గట్టి ఉమా మహేశ్వరరావు, నేను ప్రతి సంవత్సరం వారి మహాసభలకు హాజరవుతున్నాను. గోనెల నర్సింగరావు నాయుడు (తెలగార్ణవం పత్రిక సంపాదకులు), తంగేటి జగ్గారావు, రొక్కం రామనాధం, తంగిటి సూర్యారావు, త్రిపురాన రాఘవదాసు, తదితర పెద్దలంతా ఈ మహాసభలో పాల్గొన్నారు. గోనెల నర్సింగరావు నాయుడు 'తెలగార్ణవం' పేరుతో పత్రిక కూడా నడిపారు. కులపరంగా విషయపరిజ్ఞానం వున్న గొప్ప వ్యక్తి. వీరంతా కాపులతో కలిసి ఉద్యమించడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. నేను మొదట్లోనే గొర్లె హరిబాబు నాయుడు, పాలవలస రుక్మిణమ్మ మొదలైన కాపు కులస్థులను కమిటీలోకి తీసుకున్నాను. చిన్న చిన్న విబేధాలతో కులాన్ని బలహీనపరచకూడదని నా అభిప్రాయం. ఈ వివాదం చాలాకాలం పాటు సాగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందినంతవరకు ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసిన రొక్కం లక్ష్మీనర్సింహం దొర, ప్రముఖ కవి త్రిపురాన సూర్యప్రసాదరావు బహదూర్, మహాబలుడు కోడి రామ్మూర్తి (వీరఘట్టం) కూడా ఈ జిల్లా నుంచి కీర్తిగాంచినవారే. కిమిడి కళావెంకటరావు రాష్ట్ర మంత్రిగా, టి.టి.డి. దేవస్థానం ఛైర్మన్ గా చేశారు. కిమిడి మృణాళిని (డాక్టర్) జెడ్పి ఛైర్పర్సన్ చేసారు. రాష్ట్రమంత్రిగా జిల్లాపరిషత్ ఛైర్మన్ శ్రీరాములు నాయుడు, సీనియర్ ఎమ్మేల్యే పాలవలస రాజశేఖరం, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా గొర్లె హరిబాబు నాయుడు కాపులే.

విజయనగరం జిల్లాలో కూడా కాపు, తెలగ వివాదం నడుస్తూ వస్తోన్నదే. కీ.శే. మాజీ రాష్ట్రమంత్రి స్వర్గీయులు కొమ్మూరి అప్పలస్వామి కారణంగా వారి సోదరుడు మాజీ ఎం.పి. కొమ్మూరి అప్పడుదొర కారణంగా సభలూ, సమావేశాలు కలిపి పెట్టుకునేవారు. విజయనగరం జిల్లా కాపు సంఘానికి జుత్తాడ సత్యన్నారాయణ విజయనగరం జిల్లా తెలగ సంఘానికి తణుకు సత్తయ్య అధ్యక్షులుగా వుండేవారు. ఈ జిల్లాలో కూడా ఎన్నో సభలు- సమావేశాలు ఏర్పాటయ్యాయి. కాపులు అత్యధిక జనాభా వున్నప్పటికీ గతంలో ఈ జిల్లా రాజుల ఆధిపత్యంలో వుండేది. లుకలాపు లక్ష్మణదాసు, బొత్స సత్యన్నారాయణ, బొత్స ఝాన్సీలక్ష్మీ కాపు కులస్థులే. కొమ్మూరిఅప్పడుదొర,పడాలఅరుణ,పతివాడ నారాయణస్వామి నాయుడు, సీనియర్ ఎమ్మేల్యే సన్యాసినాయుడు, కలమట మోహనరావు, కలమట వెంకటరమణలు కాపులే. ఆధునిక జర్నలిజానికి ఆద్యుడు తాపీ ధర్మారావు నాయుడు విజయనగరం జిల్లా వారే. నిజానికి ధర్మారావు ఇంటిపేరు 'తాపీ 'కాదు బండారు. వారి తాతగారు అప్పన్న తాపీపని చేసుకోవడంతో తాపి ఇంటిపేర స్థిరపడిపోయింది. బొబ్బిలి పార్లమెంట్ సభ్యుడు కొండపల్లి పైడితల్లినాయుడు, బొబ్బిలి మునిసిపల్
ఛైర్మన్ ఇంటి గోపాలరావు ఈ జిల్లా కాపులే. కీ.శే. ప్రముఖులు, ప్రాతఃస్మరణీయుడు ద్వారం వెంకటస్వామినాయుడు కాపు కులానికి గర్వకారణం. వారూ ఈ జిల్లా కాపులే.

బొబ్బిలి యుద్ధంలో ఫ్రెంచివారి చేత సెహభాష్ అనిపించుకున్న యోధులు తెలగాలి. ఫ్రెంచిచరిత్రలో మిరియాల సీతయ్య వంటి యోధుల పేర్లు కీర్తి, చరిత్రలుగా ఇప్పటికి చిరస్థాయిగా
వున్నాయి.

విజయనగరం జిల్లాలో కులానికి ఎంతో గౌరవం తెచ్చిన కొమ్మూరి అప్పుడు దొర పేరుతో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. అవగాహనతో కృషి చేస్తే మరిన్ని ఎమ్మేల్యే స్థానాలు ఈ జిల్లాలో సాధించటం సాధ్యం అవుతుంది. ప్రస్తుత రాజకీయాల్లో బొత్స కుటుంబీకులు అప్పల నర్సయ్య, అప్పల్నాయుడులతో పాటు కెంబూరి రామమోహనరావు కుటుంబం, గురాన సాధూరావు కుమార్తె మీసాల గీత, కె. అప్పల్నాయుడు, యడ్ల రమణమూర్తి వంటివారు రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కాపులు, తెలగాలు సమైక్యంగా కృషి చేస్తే ఈ జిల్లాలో కులానికి మంచి భవిష్యత్ వుంటుంది. ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నప్పటికీ వీళ్ల సమైక్యతను సాధించలేకపోయాను. ఇది నా ఫెయిల్యూర్గా భావిస్తున్నాను.

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 'కాపునాడు' ఉద్యమం

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉద్యమం గురించి కొన్ని విషయాలు ముచ్చటించు కుందాం...

ఉద్యమం ప్రారంభం నాటికే ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లా తెలగ సంఘం, ఒంగోలు పట్టణ తెలగ సంఘం రెండూ వున్నాయి. పసుపులేటి మాలకొండయ్య నాయుడు, కూనపరెడ్డి నర్సయ్య, మిరియాల వెంకటేశ్వర్లు, కోలా వేంకటేశ్వరరావు మరి కొందరు పెద్దలు పనిచేసేవారు. ఒంగోలు పట్టణంలో జిల్లా తెలగ సంఘం, రంగారాయుడు చెరువు ప్రాంతాన సంఘం పేరుతో ప్రభుత్వ స్థలాన్ని సంపాదించుకొంది. మొదట హాస్టల్ నిర్మాణానికి ఒక షెడ్డు మాత్రమే వేసినప్పటికీ కాలక్రమేణా ఒక పెద్ద కళ్యాణ మండపాన్ని నిర్మించుకుంది. ఇందులో గాదె శివయ్యనాయుడు కృషి ఎంతైనా వుంది. ఉద్యమప్రస్థానంలో ఒంగోలు 1983 ప్రాంతంలో వెళ్లాను. పసుపులేటి మాలకొండయ్యనాయుడు, కోలా వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి నర్సయ్య ప్రభృతులు ఉత్సాహంగా రైల్వేస్టేషన్లోనే నన్ను ఆహ్వానించారు.

ఆ తరువాత తొలి సమావేశం మాలకొండయ్య నాయుడికి చెందిన జ్యోతి బిల్డింగ్స్లో జరిగింది. తదనంతరం జిల్లా మహాసభలు ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది. అవే కాకుండా గిద్దలూరుతో సహా జిల్లాలోని అన్ని ప్రాంతాలలోనూ సభలూ-సమావేశాలు జరిగాయి. జిల్లాలో మన కులానికి కామ్రేడ్ పూలసుబ్బయ్య, నరహరశెట్టి వెంకటస్వామి, నారపుశెట్టి శ్రీరాములు, పగడాల రామయ్యల తర్వాత ఆమంచి కృష్ణమోహన్, కదిరి బాబూరావు శాసనసభ్యులు కాగలిగారు. వరదా శ్రీరాములు నాయుడు ఒంగోలు పట్టణ తొలి మునిసిపల్ ఛైర్మన్ గా దశాదిశా నిర్దేశించారు.

ఒంగోలు పట్టణంలో అందరికంటే మన జనాభా ఎక్కువైనప్పటికీ (సుమారు 55వేల ఓట్లు) ఒంగోలు శాసనసభా స్థానం మనకు కేటాయించకపోవడం దురదృష్టకరం. కులం జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ప్రకాశం జిల్లాలో కనీసం నాలుగు స్థానాలు మనకే కేటాయించాలి. పట్టణ మునిసిపల్ ఛైర్మన్లుగా మంత్రి శ్రీనివాసరావు, అంతకుముందు మాల్యాద్రినాయుడు పనిచేశారు. ఎప్పటినుండో మన కులం ఆధిపత్యంలో వున్నా టౌన్ బ్యాంక్ను కూడా చేయిజార్చుకున్నాము. తెలుగుదేశం ప్రభుత్వహయాంలో దర్శి నియోజకవర్గ శాసనసభ్యుడిగా నారపుశెట్టి శ్రీరాములు రెండుసార్లు ఎన్నికయ్యారు. శ్రీరాములు మరణానంతరం ఆయన కొడుకు పాపారావు సైతం ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత అది కూడా చేయిజారిపోయింది.

జిల్లాలో మనవారి చైతన్యం బాగున్నప్పటికీ ఐకమత్యం లేకపోవడం, సరైన నాయకత్వం లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు. కేవలం జిల్లాలో సమావేశాలు సభలు గత 25 సంవత్సరాలుగా చాలా పెట్టడం జరిగింది. కానీ సమన్వయం లేకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతూ వుంది. వివిధ రాజకీయ పక్షాలలోనూ, ఉదాహరణకు తెలుగుదేశంలో నాగిశెట్టి బ్రహ్మయ్య, మంత్రి శ్రీనివాసరావు, కదిరి బాబూరావు, వేమా సుబ్బారావు, బిజెపిలో గోగి నాగేశ్వరరావు, కాంగ్రెస్లో గొర్రెపాటి శ్రీనివాసరావు, పసుపులేటి మాలకొండయ్య నాయుడు, విన్నకోట శ్రీనివాసరావు, గాదె శివయ్యనాయుడు, పర్వతరెడ్డి ఆనంద్, కోటపోతుల జ్వాలారావు, సుంకరి మధుసూదనరావు లాంటి ప్రముఖులంతా వున్నప్పటికీ ఏ పార్టీ కూడా ఈ కులానికి తగిన ప్రాముఖ్యం ఇవ్వకపోవడం చింతించదగ్గ విషయం.

ఇక నెల్లూరుజిల్లా విషయానికొస్తే మనం అడుగుపెట్టేనాటికి నీలకంఠం మునికుమారనాయుడు అధ్యక్షుడిగా బలిజ సంఘం వుండేది. అది కాకుండా ఎంప్లాయీస్ సంఘం ఒకటి ఏర్పడింది. యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా వున్న ఎన్.జి.కె.మూర్తి ప్రోత్సాహంతో కొంత స్థలాన్ని కూడా సంపాదించాము. ఆ పరిస్థితుల్లో జిల్లా మహాసభ ఏర్పాటుకు ప్రయత్నించాము. కానీ దానికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. బాలకోటయ్య, కత్తుల సుబ్బరామయ్య మరి కొందరు పెద్దలు మునికుమారనాయుడితో కలిపి సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేశాము. జిల్లా మహాసభను నిర్వహించాము. ఎన్.వి. రామయ్యను ముఖ్య అతిధిగా ఆహ్వానించాము. జిల్లాలో అన్ని ప్రాంతాల నుండి కులస్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. జిల్లాలో మన కులస్తుల్లో రాజకీయ చైతన్యం లేదు అనడానికి ఎప్పుడో నలభై సంవత్సరాలనాడు పసుపులేటి సిద్ధయ్యనాయుడులతో సహా ఇప్పటివరకు జిల్లా మొత్తమ్మీద ఒక ఎమ్మేల్యే కూడా లేకపోవడమే ప్రత్యక్ష ఉదాహరణ.

అలాగే నెల్లూరు పట్టణంలో దాదాపు నలభైశాతం మన కులస్తులే వున్నప్పటికీ మున్సిపల్ ఛైర్మన్ గా కూడా మనం ఎన్నిక కాకపోవడం, తదనంతరం పసుపులేటి విజయకుమార్ ఆధ్వర్యంలో జిల్లా సంఘాన్ని ఏర్పాటు చేయడం, కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. విజయకుమార్ ఆధ్వర్యంలో జిల్లాలో ఎన్నో సభలు-సమావేశాలు ఏర్పాటయ్యాయి. దురదృష్టవశాత్తు విజయకుమార్ ఆకస్మిక మరణంతో ఒక వెలితి ఏర్పడింది. ఆ తర్వాత విజయకుమార్ సోదరుడు పసుపులేటి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా మొదటి నుంచి ఉద్యమంలో ఉత్సాహంగా పనిచేస్తూ వున్న గిరి ప్రధాన కార్యదర్శిగా సంఘం ఏర్పాటయ్యింది.

ఈ జిల్లా వారైన చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. జిల్లాలో నెల్లూరు, కోవూరు, ఆత్మకూరు, గూడూరు నియోజకవర్గాల్లో మన కులస్తులు గణనీయంగా వున్నప్పటికీ గుర్తింపునకు నోచుకోకపోవడం దురదృష్టకరం. ఈ జిల్లాలోని బలిజలు ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. స్వాతంత్య్రం సిద్ధించిన 66 సంవత్సరాలకు కూడా మనం ద్వితీయ శ్రేణిలో వున్నామో ఆలోచించుకోవలసిన విషయం. దానికి కావాల్సిన భావచైతన్యాన్ని, భావ సమైక్యతను సాధించుకోవడానికి నిస్వార్థమైన బానిస భావాలు లేని నాయకత్వం అవసరం ఎంతైనా వుంది. ప్రస్తుతం ఎవరిమటుకు వాళ్లు సంఘాలను విడదీసుకోవడం కాకుండా ఐకమత్యంతో బలిజలు ఒక శక్తి అని నిరూపించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే ఇది బలిజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం.

రంగా గొప్ప నాయకత్వ లక్షణాలు గల వ్యక్తి.... 'రంగా'తో నేను....

కులం ఏమి చేసింది కాదు... కులానికి నీవేమి చేస్తున్నావు?
మనవారి గురించి మంచిమాట చెప్పు..
ఇష్టంలేకపోతే ఊరుకో.. పనిగట్టుకుని వెధవలని వాళ్లని అనకు.
మనవారి అభివృద్ధి నీకు ఆనందం కావాలి.
గొప్పతనంతో సహించకపోవడం మీ జబ్బే అవుతుంది.
ఐకమత్యం అంటే పదిమంది కలుసు కోవడం కాదు..
పది మంది భావనలు కలవడమే... అదే భావసమైక్యత.
చైతన్యం అంటే ఆవేశపడడం కాదు.. భావ చైతన్యంతో కులాన్ని అభివృద్ధి చెందడానికి దోహదపడేది.
నాయకుడంటే ప్రతివాడూ నాయకుడు కాదు. గొప్ప నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న నాయకుడు కొద్దిమందిలో ఒక్కడే.
ఆ ఒక్కడు వంగవీటి మోహనరంగా.

కాపు ఉద్యమంలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఉద్యమాల్లో మొదటినుంచి సంబంధించిన వ్యక్తి రంగా. రంగా అభిమానుల్లో అన్ని కులాలవారు ముఖ్యంగా వెనుకబడిన అణగారిన వర్గాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కాపులు సంఘటితం కావడానికి 1988 నాటి కాపునాడు అంతే మహత్తర విజయం సాధించడానికి రంగా స్మృతి మాత్రమే కారణం.

1982వ సంవత్సరంలో విజయవాడ పి.డబ్ల్యు.డి. మైదానంలో కాపు మహాసభ జరిగినప్పుడు కొన్ని దుష్టశక్తులు ఆ సభను భగ్నం చేయాలని తీవ్రంగా ప్రయత్నించాయి. నేను ఈ విషయం రంగాతో చర్చించాను. సభలో కొందరు గందరగోళం సృష్టించడానికి జరిపిన ప్రయత్నాల్ని తిప్పికొడుతూ రంగా తన మనుషులను సభకు అన్నివైపులా ఏర్పాటు చేసి ఆ మహాసభను విజయవంతం చేయడానికి కృషి చేశాడు.

1988 కాపునాడు మహాసభలు కూడా రంగా స్ఫూర్తితోనే విజయవంత మయ్యాయి. కాపు కులంలో రంగామీద ఉన్న అభిమానం, కాపు కులానికి రంగాతో ఏ ప్రయోజనం పొందిందో చెప్పలేకపోవచ్చును గానీ రంగాలాంటి గొప్ప నాయకుడున్నందుకు కాపు కులస్థులు మాత్రం గర్వించాలి. రంగా కాపుకులానికే గర్వకారణం. రంగా హత్యానంతరం రాష్ట్రం అట్టుడికింది. ముఖ్యంగా కాపు కులమంతా తమ ప్రియతమ నాయకుడిని కోల్పోయామన్న ఆవేదనతో రగిలిపోయారు.

ఒక పత్రికా దిగ్గజం ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్హెూదాతో విజయవాడకు తీసుకువచ్చి కాపులపై ద్వేషం రగుల్కొల్పడానికి పత్రికల ద్వారా ప్రయత్నించాడు. అయితే ఈ ప్రయత్నాన్ని కాపుజాతి తిప్పికొట్టింది. రంగా మరణానంతరం జరిగిన అల్లర్లలో కాపులు చేసిన మారణ హెూమమని ప్రచారం చేయడానికి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నించాయి. ఆ ప్రయత్నం కూడా నెరవేరలేదు. ఇప్పటికీనూ ఆ సంఘటనలను మర్చిపోనీకుండా కాపులను అణగద్రొక్కే ప్రయత్నంలో ఒక బలమైన సామాజిక వర్గం పనికట్టుకుని ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలు సాగబోవు. రాజ్యాధికారంలో కాపులు తమవంతు వాటాను సాధించుకొని తీరుతారు.

మిరియాల వెంకటరావుగారి ప్రత్యేక ఇంటర్వ్యూ అనంతరం పాఠకుల సౌకర్యార్థం తెలగ, కాపు, బలిజ సంక్షేమం మాసపత్రికలోని కొన్ని విలువైన భాగాలను యధాతథంగా అందిస్తున్నాము.

తూర్పు గోదావరి జిల్లా 'తెలగ' అభ్యుదయ సంఘ చరిత్ర

తూర్పు గోదావరి జిల్లా తెలగా అభ్యుదయ సంఘం పునఃప్రతిష్ట 1.9.75వ తేదీన కాకినాడలో జరుపబడెను.

స్వర్గీయ శ్రీ చిక్కం వెంకటరెడ్డినాయుడుగారు అధ్యక్షులుగా యున్నారు.

శ్రీ ఆకుల శివయ్యనాయుడు గారు శ్రీ యర్రా వెంకట హరనాథ్ గారలు వీరు యిరువురు ఉపాధ్యక్షులుగా నుండిరి. శ్రీ పసుపులేటి సూర్యారావు గారు (కాకినాడ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు మేనేజరుగా ప్రస్తుతం యున్నారు) కార్యదర్శిగా యుండిరి. సదరు కార్యవర్గ సభ్యులు, సంఘ అభివృద్ధినిమిత్తం ది. 13.01.1976వ తేదీ నుండి గ్రామాలలో పర్యటించి సంఘాభివృద్ధి గురించి ప్రచారం చేయ మొదలైనది.

1976 మే నెలలో సుమారు ఆరుగురు పేద తెలగా విద్యార్థులకు స్కాలర్షిప్లు దాతల సహాయంతో ఇవ్వబడినవి.

1976 జూన్ నెలలో కాకినాడ తాలుకా తెలగా సంఘీయుల సర్వసభ్య సమావేశం, శ్రీ వట్టికూటి పట్టాభి రామన్న గారి అధ్యక్షతన జరుపబడెను.

1976వ సంవత్సరములో తూర్పుగోదావరి జిల్లా తెలగా అభ్యుదయ సంఘము యొక్క ప్రధమ సర్వసభ్య సమావేశము శ్రీ తోట రామస్వామి గారి అధ్యక్షతన జరుపబడెను.

అప్పటికి మంత్రిగా యున్న శ్రీ యర్రా నారాయణస్వామి గార్కి, సదరు సర్వ సభ్య సమావేశంలో సన్మానము జరుపబడెను. సదరు సర్వసభ్య సమావేశములో శ్రీ పోతుల సీతారామయ్య గార్ని, ఈ జిల్లా అభ్యుదయ సంఘ కార్యదర్శిగాను, శ్రీ ధూళిపూడి సత్యన్నారాయణ గార్ని కోశాధికారిగాను ఏకగ్రీవముగా ఎన్నుకోవడమైనది.

రెండవ తెలగ సర్వసభ్య సమావేశము 1978 ఆగస్ట్లో కాకినాడలో శ్రీమతి ఎనుములు సావిత్రీదేవి గారి అధ్యక్షతను జరుపబడెను. సదరు సర్వసభ్య సమావేశములో ఆనాటి మన సంఘ మంత్రివర్యులకు శ్రీ పళ్ళ వెంకట్రావు, శ్రీ కొమ్మూరు అప్పుడు దొరగార్లకు సన్మానము జరుపబడెను.

1981వ సంవత్సరం, సెప్టెంబరులో శ్రీ చిక్కం వెంకటరెడ్డి నాయుడుగారు పరమపదించినారు. శ్రీ ఆకుల శివయ్యనాయుడు గారిని తూర్పుగోదావరి జిల్లా తెలగ అభ్యుదయ సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోవడమైనది.

1981 జూలై నెలలో తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని తెలగ కులస్తునకు ఇవ్వవలెనని అధ్యక్షులగు శ్రీ చిక్కం వెంకటరెడ్డి గారి అధ్యక్షతన సమావేశమై రాష్ట్ర ముఖ్యమంత్రికి మన సంఘం తరుపున ప్రతిపాదించి శ్రీ పంతం పద్మనాభంగార్నిసదరు జిల్లా పరిషత్ ఛైర్మన్పదవికి ముఖ్యమంత్రిగారు ఆమోదించినట్లుగాకృషి చేయడమైనది.

22.11.1984వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కాకినాడ సూర్యకళామందిరంలో జరుపబడిన తూర్పుగోదావరి జిల్లా తెలగ, కాపు, బలిజ, ఒంటరి సభ్యుల సమావేశమునకు సమర్పించిన కార్యదర్శి నివేదికలోని ముఖ్యాంశాలు.

కాకినాడ జగన్నాథపురంలో ఈ జిల్లా సంఘభవనము సుమారు రెండు లక్షల రూపాయలు విలువచేయునది నిర్మింపబడినది. ఈ భవన నిర్మాణమునకు దాతలు యిచ్చిన ధనము కాక కొదువ ధనమంతయు అధ్యక్షులగు శ్రీ ఆకుల శివయ్యనాయుడు గారి ఆర్థిక సహకారముతో పూర్తికాబడెను. యీ భవనమునకు ముందు నిర్మింపబడ్డ హాలు కాక, ఆరు గదులు నిర్మింపబడి, సదరు గదులు కాకినాడలోని విద్యాసంస్థలలో చదువుకొనుచున్న మన కులస్తులలోని పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరము వారి నివాసము నిమిత్తము ఉచితముగా ఇవ్వబడుచున్నవి. ఈ భవన నిర్మాణమునకు అయిదువేల రూపాయలు పైగా ఇచ్చిన దాతలు 1. శ్రీ రోళ్ళ సీతారామస్వామి గారి తరుపున శ్రీ ఆకుల శివయ్య నాయుడుగారు 2. శ్రీ గులగాబత్తుల రాఘవులు గారి కుమారులు 3. శ్రీ మట్టి అయ్యన్న గారి కుమారులు. 4. డాక్టర్ ఎనుముల ప్రభాకరరావుగారు. 5. గాలిదేవర సత్యన్నారాయణ గారు, వెంకటాయపాలెం 6. శ్రీ రెడ్డి వెంకట్రావు గారు, కాకినాడ మొదలయిన యీ దాతలు ఒక్కొక్కరు అయిదువేల రూపాయలు పైగా యిచ్చినందున వారి పేర్లు యీ భవనగదుల పై ఒక్కొక్కరి పేరు ఒక్కొక్క గదిపై వ్రాయించుటకు ఏర్పాట్లు చేయబడెను.

యీ భవనమునకు చెల్లింపవలసిన మున్సిపల్ పన్నులు, విద్యుత్ సరఫరా పన్నులు, సాలువారీ మరమ్మత్తులు, పెయింటింగ్లు మొదలగు ఖర్చులకు అధ్యక్షులగు శ్రీ ఆకుల శివయ్యనాయుడుగారు వారి స్వంతధనము ఎనిమిదివేల రూపాయలు చెల్లించి. 1982వ సంవత్సరము నుండి నేటివరకు సదరు భవనపు మంచి చెడ్డలను తగురీతిగా నిర్వహించుచున్నారు. 1975వ సం॥ నుండి 1982 వరకు యీ సంఘ అధ్యక్షులుగా యుండిన శ్రీ చిక్కం వెంకటరెడ్డి నాయుడి గారి పేరు యీ భవనముపై పెయింట్ చేయబడును.

శ్రీ జయమాలినీ ఎంటర్ప్రైజెస్ యజమానులగు శ్రీ మెండుగుదిటి వెంకటేశ్వరరావుగారు మొదటి అంతస్తులోని ఒక గది నిర్మాణము నిమిత్తం అయిదువేల నూట పదహార్లు ఉదారముగా యిచ్చుటకు నిశ్చయించిరి. వారి కోరికననుసరించి ఒక గదికి వారు నిర్ణయించిన ప్రకారం నామకరణం చేయబడును.

మన సంఘీయులలో పేద విద్యార్థుల సహాయముగా 1983-84 విద్యాసంవత్సరములో రామచంద్రాపురం తాలుకాలోని శ్రీ ముద్రగడ వెంకటస్వామి నాయుడు, శ్రీ ఆకుల శివయ్యనాయుడు గారు మరి కొందరు దాతలు సుమారు ఏబదిమంది తెలగ విద్యార్థులకు పుస్తకములు, ఫీజులు వగైరాలకు సరిపడు ధనము యిచ్చియున్నారు. అదే విధముగా 1984-85 విద్యాసంవత్సరములో కూడా యేబదిమంది పేద విద్యార్థులకు గత సాలులో వలెనే ఆర్థిక సహాయము శ్రీ ముద్రగత వెంకటస్వామి గారి యాజమాన్యమున సమకూర్చబడినది.

యీ జిల్లాలోని పెద్దాపురం పట్టణంలో సోదరులు డాక్టర్ బచ్చు సూర్యనారాయణ గారు తాలుకాలో మన సంఘీయులను కల్సుకొని వారి ప్రోత్సాహముతోను, తమ స్వంత ధనుము కూడా కలిపి వెచ్చించి రెండు లక్షల రూపాయలు విలువగల తెలగా సంఘ భవనము నిర్మించిరి. యీ భవనములో తెలగా సంఘ కార్యక్రమములు జరుపుటయే గాక మనలో ఎవరైనా వివాహములు చేసుకొనుటకు గాను వలయు వసతి ఏర్పాట్లు కావించిరి.

యీ జిల్లాలోని జార్జిపేట కాపురస్తులు ఉదారులు అయిన శ్రీ కోలా తాతబ్బాయి అనే కామేశ్వరరావు గారు రెండు లక్షల రూపాయలు విలువ చేయు భవనము, యానాంలో కాలేజీ ప్రక్కన నిర్మించి, ఆ భవనమందు ఇరువదిమంది పేద విద్యార్థులకు వసతి సౌకర్యము ఏర్పాటు చేసిరి.

ఇదేవిధంగా ద్వారపూడి, కోరుకొండ, తుని, అమలాపురం గ్రామాలలో ఈ సంఘ అభ్యుదయ కార్యక్రమములు చేపట్టు నిమిత్తం ఉదారులగు మన సంఘీయుల యొద్ద నుండి విరాళములు సేకరించి భవన నిర్మాణ కార్యక్రమములను జరిపించుచున్నారు. ఈ జిల్లాలో మన సంఘ అభ్యుదయమునకై ఎచ్చటైనా భవన నిర్మాణ కార్యక్రమములు జరిగిన యెడల అట్టి ప్రతి భవనమునకు అగు ఖర్చులో భవనము ఒక్కింటికి పదివేల రూపాయల చొప్పున తమవంతు విరాళముగా యిచ్చెదమని మన సంఘ అధ్యక్షులగు శ్రీ ఆకుల శివయ్యనాయుడుగారు బహిరంగముగా తెలియజేసినారు. ఈ సదవకాశమును మన సోదర సంఘీయులు సద్వినియోగ పర్చుకొని నిర్మాణ కార్యక్రమం చేపట్టి, మన సంఘ భవనములను నిర్మించవలసినదిగా కోరుచున్నారు.

ఈ జిల్లాలోని కార్యవర్గ సభ్యులు ముఖ్య కేంద్రాలలోను, గ్రామాలలోను పర్యటించి ఆయా కేంద్రములలో సభలు జరిపి, మన సంఘీయులలో ఐకమత్యము, ఉత్సాహం
నెలకొల్పినారు.

1982 సెప్టెంబర్ నెలలో కొత్తపేట తాలుకా వాడపాలెం గ్రామంలో సంఘ అధ్యక్షులు, ఆనాటి జిల్లా పరిషత్ ఛైర్మన్ గారగు శ్రీ పంతం పద్మనాభం గారు, మాజీ మంత్రులు శ్రీ సంగీత వెంకటరెడ్డి గారు, వాడపాలెం గ్రామమందు సభలను నిర్వహించుచున్నారు.

చుట్టుప్రక్కల గ్రామములయందు గల మన సంఘీయులందరూ సదరు సభలకు హాజరయి జయప్రదం కావించినారు. శ్రీ బండారు సత్యనారాయణ గారు, సుమారు యాబది గ్రామాలలో గ్రామాలలో గ్రామ కమిటీలను ఏర్పరచి, కమిటీ సభ్యులను సభవార్కి పరిచయం చేసినారు.

అదే విధముగా ది. 5.12.82వ తేదీన కొత్తపేట తాలుకా రావులపాలెం గ్రామంలో, తాలుకాలోని మన సంఘీయులందరికీ యేర్పాటు చేయబడినది. మన అధ్యక్షుల వారి ఆధ్వర్యమున, ఈ తాలుకా సభ జయప్రదం చేయబడెను. వేలాది మన సంఘీయులు యీ సభకు హాజరయినారు. గ్రామకమిటీలు కూడా ఏర్పాటు చేయబడెను. మన సంఘీయులు అనేకులు జీవిత సభ్యులుగా చేరిరి.

7.12.84వ తేదీన రామచంద్రాపురం తాలుకా తెలగ అభ్యుదయ సంఘ సభ ద్రాక్షారామంలో ఏర్పాటు చేయబడెను. మన సంఘీయులు వేలకు వేలుగా యీ సభలకు హాజరైరి. యీ సభకు అధ్యక్షత వహించిన శ్రీ ఆకుల శివయ్య నాయుడు గారు, మనలో ఐకమత్యం పెంపొందించుకొనెడి ఆవశ్యకతలను గూర్చి వారి అభిప్రాయములను వివరణముగ సభ్యులు యావన్మందికి తెలియపరచుట జరిగినది.

ఇదే విధముగా, రాజోలు తాలుకా భట్టేలంక గ్రామంలో తాలూకా అభ్యుదయ సంఘ సభ ఏర్పాటు చేయబడినది. మన అధ్యక్షుల వారి అధ్యక్షతన సదరు సంఘ సభ జయప్రదంగా జరిగెను. గ్రామములందు గ్రామ కమిటీలు పటిష్టం చేసి మనలో ఐకమత్యము పెంపొందించుకొనవలెనని అధ్యక్షులు విశదపరచిరి.

తుని తాలుకా తెలగ అభ్యుదయ సంఘ సభ్యసమావేశములు పాయకరావుపేటలో జిల్లా అభ్యుదయ సంఘ అధ్యక్షుల ఆధ్వర్యమున జరుపబడినది. తాలూకా నలు చెఱగుల నుండి మన సోదరులు వేలాదిమంది హాజరైరి. తుని తాలూకాలోని తొండంగి గ్రామంలో మరియొక సభ యేర్పాటు చేయబడినది. రాష్ట్ర తెలగ అభ్యుదయ సంఘ కన్వీనర్ గారు శ్రీ మిరియాల వెంకట్రావు గారు తన గంభీరోపన్యాసంలో సంఘీయులను ఉత్తేజపరచి, ప్రతీ గ్రామమునందు గ్రామ కమిటీల ఏర్పాటును గూర్చి, వాటి ఆవశ్యకతను గూర్చి మరీ మరీ నొక్కి వక్కాణించినారు.

విశాఖ జిల్లాలోని నక్కపల్లి తాలుకాలోని గ్రామాలలోయున్న మన సోదర కులస్తులందఱకు తుని తాలుకాలోని అనేక విధములుగ కలిసి ఉన్నందున నక్కపల్లి తాలుకాలోని అభ్యుదయ కార్యక్రమములు, తూర్పుగోదావరి జిల్లా తెలగ అభ్యుదయ సంఘములో ఒక భాగముగా తీసుకొనవలసినదిగా కోరినందున, మన అధ్యక్షులు నక్కపల్లి తాలుకా కార్యక్రమములను కూడా ఈ జిల్లాలో కలుపబడినవి.

సదరు కారణముగా ఈ కార్యవర్గ సభ్యులు, నక్కపల్లి తాలుకాలోని పాయకరావుపేట, గుంటుపల్లి, దొడ్డిగల్లు, గొడిచెర్ల గ్రామాలలో పర్యటించి ఆయా గ్రామాలలో సభలు ఏర్పాటు చేసి మన సంఘీయులందరినీ ఉత్తేజపరచుచు, మన రాష్ట్ర సంఘ కన్వీనరు గారైనటువంటి శ్రీ మిరియాల వెంకట్రావు గారు, మరియు మన సంఘ అధ్యక్షులున్నూ ఉపన్యసించినారు.

1983వ సం||లో విజయవాడలో యేర్పాటు చేయబడ్డ రాష్ట్ర తెలగ, కాపు, బలిజ, ఒంటరి సభ్యుల సమావేశమునకు ఈ జిల్లా నుండి మన సంఘీయులు సుమారు యిరువదివేల మంది హాజరైనారు. ఈ విజయవాడ సభను జయప్రదం కావించుటకు మన అధ్యక్షులు తమ వంతుగా ఆనాడు కూడా ఆర్థిక సహాయము చేసినారు. ఈ రాష్ట్ర సర్వసభ్య సమావేశములో మన సంఘీయులు యావన్మంది ఏక కంఠముతో మన కులస్తులు ఆర్థికముగాను, విద్యావిషయకముగను వెనుకబడిన వారగుటచే మన సంఘీయులుయగు తెలగ, కాపు, బలిజ ఒంటరి కులస్తులను, వెనుకబడిన తరగతులలో చేర్చవలసినదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమును కోరుతూ యేకగ్రీవంగా తీర్మానించిరి.

మన సంఘీయులలో నూటికి 90 మంది ఆర్థికముగ ప్రభుత్వం వారిచే తయారుకాబడిన దారిద్య్ర రేఖకు క్రిందకు ఉన్నవారే అగుటచే మన కులస్తులను వెనుకబడిన తరగతులుగా గుర్తించుట ఎంతయో అవసరము. యిది అతిశయోక్తి మాత్రం కాదు. మన కులస్తులందర్నీ వెనుకబడిన తరగతులలో చేర్చిన నాడు, మనకు విద్యారంగమునందు, ఉద్యోగ రంగముల యందు ఉచిత రీతిన ప్రభుత్వ పరంగా ఎంతైనా సహాయ సహకారములు చేకూరగలవు.

నేటి ఈ జిల్లా అభ్యుదయ సంఘ సర్వసభ్య సమావేశంలో కూడా మన కులస్తులందరునూ వెనుకబడిన తరగతులలో చేర్చవలసినదిగా తీర్మానము చేయబడును.

అనకాపల్లిలో జరుపబడి తెలగ, కాపు, బలిజ, ఒంటరి సభ్యుల సమావేశమునకు మన జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరయి సభను జయప్రదం చేసియున్నారు.

9.9.84వ తేదీని మన అధ్యక్షులు విశాఖ జిల్లా సర్వసభ్య సమావేశమునకు ముఖ్య అతిధిగా హాజరయినారు.
మన సంఘీయులందర్నీ మనందరి పురోభివృద్ధికై ఐకమత్యమునకు సాధనగ, ప్రతి సంవత్సరము, కాకినాడలో “కార్తీక వన భోజనములు” యేర్పాటు గావించబడుచున్నవి. 1982, 1983, 1984 సంవత్సరములలో యీ కార్తీక వన భోజనములు మన జిల్లా సంఘ కార్యనిర్వాహకులచే జయప్రదముగా నిర్వహించబడినవి. మన సంఘీయులు ఒకరినొకరు కల్పుకొని, పరస్పరాదరాభిమానములతో అభిభాషించుకొనిరి.

ఇదేవిధముగా మన సంఘములో వివాహ సంబంధ సమాచారములు నెలకొల్పలేదు. యీ విషయమును ఈ జిల్లా సంఘం గుర్తించి ఈ సంఘములో, ఒక వివాహ సమాచార విభాగము ఏర్పాటు చేసినది. మన కులస్తులలో వివాహ సమాచార సేకరణలో ప్రావీణ్యం గల శ్రీ పెద్దిశెట్టి ప్రసాదరావుగారి యాజమాన్యములో వివాహ సంబంధ సమాచార విభాగము యేర్పాటు చేయబడినది.

యీ విభాగమునుంచి వివాహ సంబంధమగు సమాచారములు కావలసినవారు శ్రీ పెద్దిశెట్టి ప్రసాదరావుగార్ని కలిసికొని గాని, ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా గాని వలయు సమాచారము సేకరించవలసినదిగా కోరుచున్నాము.

వారి చిరునామా:
శ్రీ పెద్దిశెట్టి ప్రసాదరావుగారు
ఇ.నెం. 8-11-8,
నండూరివారి వీధి, (మార్కెట్ ఎదురుగా) గాంధీనగరం, కాకినాడ-4.

మహిళా విభాగం

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటిన్నరకోట్లు మన కులస్తులు ఉన్నారు. యిందులో సగం మహిళలే కదా! ఆ విధముగా మన తూర్పుగోదావరి జిల్లాలో యున్న సుమారు పదిహేను లక్షల మంది మన కులస్తులలో సగం మహిళలే! అందుకే మహిళల కోసం ఓ అభ్యుదయ కార్యక్రమం చేపట్టుట ఎంతేనా ఆవశ్యకమని మన జిల్లా సంఘము గుర్తించి, సదరు కార్యక్రమాలను నిర్వహించుటకై నిశ్చయించినది కూడా! ఈ మహిళల ప్రోత్సాహము, వారి ఐకమత్యము మన జిల్లా అభ్యుదయ సంఘము పొందగలిగినచో జిల్లా సంఘ పురోభివృద్ధి మరింత వేగముగాను, మరింత ద్విగుణీకృతముగ అభివృద్ధిచెందును.

కావున మహిళా విభాగము కూడా ఈ జిల్లా సంఘమునకు అనుబంధముగా యేర్పాటు చేయబడినది. ఈ జిల్లా సంఘమునందు ఉపాధ్యక్షులు, మరియు మాజీ ఎం.ఎల్.సి. గారున్నూ, అనేక మహిళా సంఘాలయందు తగు ప్రాతినిధ్యము వహించిన వారును అగు, శ్రీ ఎనుముల సావిత్రీదేవి గారిని యీ అనుబంధ మహిళా విభాగమునకు ఛైర్మన్ గా నియమించుట జరిగినది. ది. 25.11.84వ తేదిన జరుపబడిన సభ్య సమావేశమునందు నిర్ణయించిన ప్రకారము ఆరుగురు దాతలు ముందుకు వచ్చి ఒక్కొక్కరు అయిదువేల రూపాయలు చొప్పున విరాళములనందించినారు.

వారి కోరిక ప్రకారము ఆయా దాతలు యిచ్చిన పేర్లను ఒక్కొక్క గదిమీద స్థాపించబడినవి.
యిచ్చిన దాతలు:

  1. శ్రీ ఆకుల శివయ్యనాయుడు గారు వారి తండ్రి గారగు శ్రీ ఆకుల నారాయణస్వామి గారి జ్ఞాపకార్థం.
  2. డాక్టర్ తాడి వెంకటస్వామి నాయుడు గారు.
  3. శ్రీ సూరపురెడ్డి దొరయ్య గారు (కడియం, రాజమండ్రి తాలుకా)
  4. తమ్మిరెడ్డి శ్రీరాములు గారు (రిటైర్డ్ మునిసిపల్ కమీషనర్, రాజేశ్వరీ నగర్, కాకినాడ -4, )వారి తండ్రి జ్ఞాపకార్ధం
  5. శ్రీ మెండకుదిటి వెంకటేశ్వరరావు గారు (మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ జయమాలిని ఎంటర్ప్రైజెస్, కాకినాడ) వారి కుటుంబీకుల తరుపున.
  6. శ్రీ మంచం వీరభద్రరావుగారు, తమ తండ్రి గారగు (లేటు) శ్రీ మంచం గంగరాజు (సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్) వారి జ్ఞాపకార్ధం.

సదరు ఆరు గదులు ది. 19.8.1985వ తేదీన ప్రారంభించబడి 18,19 మంది పేద తెలగ విద్యార్థులకు ఉచితముగా వసతి సౌకర్యములు ఆయా గదులలోను యిచ్చియున్నారు.

సదరు ఆరుగదుల నిర్మాణమునకు, దాతలు యిచ్చిన విరాళములు కాక, రను. 17,000లు సంఘ నిధుల నుండి తీసి యిచ్చుటయే గాక, అధ్యక్షులగు శ్రీ ఆకుల శివయ్యనాయుడు గారు తమ స్వంత ధన సహాయముతో సదరు ఆరు గదులకు పూర్తి అధునాతన సౌకర్యములను యేర్పాటు చేయబడెను.

మిరియాల వెంకటరావుగారి సంపాదకీయం తెలగ, కాపు, బలిజ సంక్షేమం

తెలగ, కాపు, బలిజ యువసేన విషయంలో యువకులంతా ఎంతో ఉత్సాహంతో ఉత్తరాలు వ్రాస్తున్నారు. అదేవిధంగా వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చవలసినదిగా జరుపుతున్న ఉద్యమం గురించి కూడా వ్రాస్తున్నారు. మరికొందరైతే కొత్తపార్టీని మన కులం వారు పెట్టుకోవాలిన వ్రాస్తున్నారు. దానికి వారు చెప్పే కారణాలు ఏమంటే ప్రస్తుతం అధికార పదవుల్లో ఉన్న మనవారు కులం గురించి ఏమాత్రం ఆలోచించడంలేదని కేవలం వాళ్ళ పదవుల కోసం మనవారికెంతెంత అన్యాయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని అందుచేత మన పార్టీ పెడితే కులం తరుపున పాడుపడేవారిని ఎన్నుకోవచ్చుననీ వ్రాస్తున్నారు. అయితే వారు వ్రాసింది సమంజసమే అయినా ఆలోచింపదగినదైనా ఆచరణ సాధ్యమా అన్నది ప్రశ్న. ప్రస్తుతం స్వార్థం కోసమే కులాన్ని ఉపయోగించుకోవాలనుకునే రాజకీయవేత్తలు పదవిలో ఉన్నంతసేపూ కులం గురించి మాట్లాడకుండా ఉన్నవారు ఉన్నప్పటికీ కులంలో చైతన్యం వచ్చిననాడు కులం రాజకీయంగానూ, ఉద్యోగాలూ, విద్యలోనూ ఎంత వెనుకబడిపోయిందో అవగాహన చేసుకున్ననాడు తాము బాగుంటే చాలనీ, తమకు పదవులుంటే చాలనీ అనుకోకుండా కులం అభివృద్ధి అందరి అభివృద్ధి, కులం యొక్క గౌరవమే అందరి గౌరవము అని భావించిననాడు మంచి ఫలితాలు ఆశించవచ్చు.

ఏది ఏమైనా నాయకుల్లో కదలిక లేకపోయినా సామాన్యుల్లో చైతన్యం రావాలి. యువకుల్లో ఉత్తేజం కలగాలి. అందులో మీ అభిప్రాయాలు వ్రాయండి. ఆచరణయోగ్యమైన ఒక పథకాన్ని రూపొందించుకోవలసిన సమయం ఆసన్నమైంది. కుల సోదరులారా ఆలోచించండి!

వార్తా లహరి

3.1.88వ తేదిన విజయవాడ లబ్బీపేటలోని కాపు కళ్యాణమండపంలో విజయవాడ తెలగ మహాజన సంఘంచే ఏర్పాటుచేయబడిన సమావేశములో విజయవాడ తెలగ సంఘమునకు సంబంధించిన స్థలములను స్వాధీనపర్చుకొనుటకు ఏర్పాటుచేయబడిన కార్యాచరణ సంఘం కన్వీనర్గా, శ్రీ పిళ్ళా వెంకటేశ్వరరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమైనది.

ది. 16.8.87వ తేదిన నంద్యాల (కర్నూలు జిల్లా) పట్టణంలో మన సంఘీయులు శ్రీ రాజారాం, శ్రీ పాణ్యం రామయ్య గారు, శ్రీ అప్పాకొండయ్య గారు, శ్రీ నాగరాజు గారు ఇతర కులపెద్దలు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ చెన్నంశెట్టి రామచంద్రయ్య గారిని సత్కరించారు. మన సంఘీయులు అనేకులు ఈ సభలో ప్రసంగిస్తూ మన కులాన్ని వెనుకబడిన తరగతులలో చేర్పించుటకు కృషి చేయవలసినదిగా కోయున్నారు. మంత్రి శ్రీ రామచంద్రయ్య గారు తప్పకుండా కృషి చేస్తామని వాగ్దానం చేసియున్నారు. యీ సమావేశంలో చక్కెరశాఖ మంత్రి శ్రీ ఫరూకి కూడా పాల్గొన్నారు.

కడపజిల్లా తెలగ, కాపు, బలిజ సంఘ అధ్యక్షులు శ్రీ సుధామల్లిఖార్జున రావు, శ్రీ ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్యగార్లు వేదికనలంకరించారు.

తూర్పుగోదావరి జిల్లా తెలగ అభ్యుదయ సంఘం వారిచే కార్తీక వనభోజనాలు ది. 15.11.87 ఆదివారం నాడు కాకినాడ విద్యుత్నగర్ కాలనీ వద్ద తోటలో జరుపబడెను. సుమారు 2వేల మంది పాల్గొన్న ఈ సామూహిక విందుకు స్త్రీలు, యువకులు హెచ్చు సంఖ్యలో హాజరుకావడం విశేషం. ఎంతో ఉత్సాహవంతంగా జరిగిన వనభోజనాలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఆకుల శివయ్యనాయుడుగారి నాయకత్వంలో, శ్రీ పోతుల సీతారామయ్య గారి సారధ్యంలో, కార్యదర్శి శ్రీ బడేటి గోపాలరావుగారు శ్రీ గొల్లపాలెం కృష్ణ (తోట), శ్రీ యెరుబండి భూలోకరాయుడు, శ్రీమతి సావిత్రీదేవి తదితర ముఖ్యులు నిర్వహించారు. రాష్ట్ర కన్వీనరు శ్రీ మిరియాల వెంకటరావు గారు బహుమతి ప్రదానం చేశారు.

ప॥గో॥ జిల్లా జంగారెడ్డి గూడెం మండల అధ్యక్షులుగా మన కుల ప్రముఖులు శ్రీ కరాటం కృష్ణమూర్తి గారు ఎన్నికయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో వారిని తెలియనివారు లేరు. రాష్ట్రంలో కూడా ప్రముఖులు. మంచి వ్యక్తిగా పేరుపొందినవారు.

శ్రీయుతులు తలారి అనంతబాబు గారు రాష్ట్ర బలిజ, తెలగ, కాపు సంఘాధ్యక్షులు అధ్యక్షత వహించిరి. అఖిలభారత నాయుడు ఫెడరేషన్ ఛైర్మన్ శ్రీ ఆర్. శ్రీహరినాయుడు గారు, శ్రీ డి.కె. ఆదికేశవులు నాయుడు గారు, రాష్ట్ర, బలిజ, తెలగ, కాపు కన్వీనరు శ్రీ మిరియాల వెంకట్రావు గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ కె.వి. పతి గారు సభకు ముఖ్య అతిధులుగా విచ్చేసిరి.

కీర్తిశేషులు ఢాకవరం బుజ్జయ్య ఆకస్మిక మరణానికి సంతాపం ప్రకటించారు. సంఘ కోశాధికారి శ్రీ డి. మునిరత్నం నాయుడు మృతి చెందిన వార్త అందగానే సంతాప సూచకంగా కార్యక్రమము
వాయిదావేశారు.

19.4.1987 తిరుపతి సంఘము, తిరుపతి పురపాలక సంఘ అధ్యక్షులు శ్రీ వి. మునిరత్నం గారిని, ఉపాధ్యక్షులు శ్రీ ఎం. వెంకటరమణ గారిని, మండలాధ్యక్షులుగా ఎన్నికైన శ్రీయుతులు చదలవాడ కృష్ణమూర్తి గారిని, మొరుసు వెంకట్రామయ్య గారిని, శ్రీ ఎం.వి. కృష్ణారెడ్డి గారిని, శ్రీ ఎం. కృష్ణమూర్తి గారిని, శ్రీ ఎన్. సిద్ధయ్య గారిని, శ్రీ ఎస్. రామచంద్రయ్య గారిని, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఆరణి వరదయ్య గారు సన్మానించిరి. ఈ సమావేశమునకు శ్రీమతి బేబమ్మ గారు మన సోదరీమణులతో కలిసి పాల్గొనడం విశేషం. శ్రీరామమూర్తి వందన సమర్పణ గావించిరి.

సంఘ కార్యక్రమములలో జిల్లా సంఘ అధ్యక్షులు శ్రీ ఉయ్యాల లక్ష్మయ్యనాయుడు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ ఆరణి వరదయ్యనాయుడు గారు, జిల్లా కన్వీనరు శ్రీ బొడ్డు సోమశేఖర్ గారు, శ్రీ పి.కె. పార్థసారధి నాయుడు గారి సేవలు అనన్యసామాన్యములు! అనితర సాధ్యములు.

చిత్తూరు జిల్లా బలిజ సంఘం

  1. జిల్లా బలిజ సంఘము 1946న ప్రారంభించబడినది. ముఖ్యపట్టణములు, గ్రామముల నుండి సభ్యులు స్వీకరింపబడిరి. శ్రీయుతులు ఇంటిమున స్వామినాయుడు గారు బి. దొరస్వామిశెట్టి గారు, ఉయ్యాల లక్ష్మయ్యనాయుడు గారు వరుసగా ఈ సంఘమునకు అధ్యక్షపదవిని నిర్వహించిరి.
  2. 1982వ సం|| నవంబరు మాసమునందు విజయవాడ మహాసభలకు ఈ సంఘము తరుపున 2 బస్సులతో చేరిన కార్యకర్తలు పాల్గొనిరి.
  3. 1984 జూన్ నెలలో నంద్యాలలో జరిగిన రాయలసీమ తెలగ, కాపు, బలిజ మహాసభలలో అదేవిధముగా పాల్గొనడము జరిగినది.
  4. ఈ సంఘము పట్టణస్థాయికే పరిమితము చెంది పనిచేయుచుండెను. ఈ సంఘమునకు పాత మార్కెట్టు వీధిలో 3,100 చదరపు అడుగుల స్థలము కలదు. అందు విద్యార్థుల వసతి గృహము, సమావేశ మందిరము నిర్మించుటకు సన్నాహములు జరుగుచున్నవి.
  5. చిత్తూరు శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయమునందు జరుగు ఉత్సవములందు గుఱ్ఱపువాహన ఉభయము సంఘీయులు ప్రతి సంవత్సరము సర్వాంగసుందరముగా నిర్వహించుచున్నారు.
  6. పరిస్థితుల ప్రాబల్యముచే ప్రభావితులైన శ్రీయుతుల బొడ్డు సోమశేఖర్, పోలంపురి నరసింహరాయులు, నడివీధి గంగయ్య, దుబాశి రామమూర్తి, తదితరులు చంద్రగిరి, తిరుపతి సంఘములను స్థాపించిరి.
  7. నియోజకవర్గము ప్రాతిపదికపై పీలేరు, వేపంజేరి, పుత్తూరు ఇత్యాదిగా గల 15 నియోజకవర్గములందంతటను సంఘ సంస్థాపనము జరిగినది. ప్రతి నియోజకవర్గ సంఘము, నియోజకవర్గ జనాభా సేకరించుచూ, వారి విద్యా వివాహవసరములను గూడ సేకరించి నిర్దుష్టమగు కార్యక్రమమునవ లంభించిరి. ఖఅశీష్ ము ఎష్ట శిష్టవతీ, ప్రతిశీబస్త్రష్ట ణ శీతో శీ ణశీశీతీ ూతీశీస్త్రతీఎఎమ అను సందేశముతో సంఘ పటిష్టతను సాధించిరి.
  8. ఈ కార్యక్రమమునకు చేయూతనిచ్చుచు 1.12.85 చిత్తూరునందు జరిగిన జల్లా కార్యకర్తల సమావేశమునకు ముఖ్య అతిధిగా శ్రీ మిరియాల వెంకట్రావు గారు పాల్గొని భవిష్యత్తు కార్యక్రమములను రూపొందించిరి.
  9. చంద్రగిరి నియోజకవర్గ బలిజ సంఘ ప్రధమ వార్షికోత్సవమునకు ప్రముఖ సినీ దర్శకులు, ఉదయం దినపత్రిక సంస్థాపకులు శ్రీ దాసరి నారాయణరావు గారు పాల్గొని సంఘ సమున్నతికి తన అమూల్య సలహాలనందించి జాతికి జాగృతినందించిరి.
  10. మదనపల్లె నియోజకవర్గ బలిజ సంఘము విద్యార్థులకు ఉచిత వసతి గృమము నడుపుచున్నారు. 11.6.86న జరిగిన సామూహిక వివాహములు రాష్ట్రము నందే మొట్టమొదటవి మరియు ఈ సంఘము ఒక కళ్యాణ మండపమును నిర్మించుటకు స్థలము సేకరించినది.
  11. మదనపల్లె నియోజకవర్గ బలిజ సంఘము విద్యార్థులకు ఉచిత వసతి గృమము నడుపుచున్నారు. 11.6.86న జరిగిన సామూహిక వివాహములు రాష్ట్రము నందే మొట్టమొదటివి. మరియు ఈ సంఘము ఒక కళ్యాణ మండపమును నిర్మించుటకు స్థలము సేకరించినది.
  12. ఈ సంఘ ముఖ్యోద్దేశ్యములు సంఘీయుల సంక్షేమము, విద్యా, ఆర్థిక, సాంస్కృతిక రంగములందు అభివృద్ధి.
  13. చిరంజీవి కుమారి విజయలక్ష్మి రాష్ట్ర బలిజ, తెలగ, కాపు సంఘ సామాజిక పరిస్థితులపై చిత్తూరు జిల్లా స్థాయిలో పరిశోధన గావించుటకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయమున సోషియాలజీ డిపార్టుమెంట్ నందు రిజిష్టర్ చేసుకొనుటకు సంఘ స్థాయికి చాలా సంతోషకరమైన విషయము.
  14. 19.10.86 జిల్లా సంఘముతో, నియోజకవర్గముల అనుసంధాన కార్యక్రమము, వెలుగు జిలుగుల మధ్య థియోసాఫికల్ సొసైటీ ప్రాంగణమున కనులపండువగా జరిగినది.

భావచైతన్యాన్ని, భావ సమైక్యతను సాధించుకోవడానికి నిస్వార్థమైన బానిస భావాలు లేని నాయకత్వం అవసరం ఎంతైనా వుంది. ప్రస్తుతం ఎవరిమటుకు వాళ్లు సంఘాలను విడదీసుకోవడం కాకుండా ఐకమత్యంతో బలిజలు ఒక శక్తి అని నిరూపించుకోవలసిన అవసరం ఎంతైనా వుంది.

తెలగ మహాజన సంఘం విజయవాడ మన సంఘం స్థలం సంక్షిప్త చరిత్ర

విజయవాడ1వ టౌనులో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానమునకు విజయవాడ, సత్యన్నారాయణపురం రైల్వేస్టేషన్ ఎదురుగా యన్.టి.యస్.నెం. 713, 714లో నిరుపయోగముగా ఉండి దేవస్థానమునకు ఏ విధమైన ఆదాయము రానందున దానిని విక్రయించిన తద్వారా లభ్యపడు క్రయ ధనముతో ఆలయమును అభివృద్ధి పరచుకొనుటకు దేవస్థాన అధికారులు ఎండోమెంట్ డిపార్టుమెంట్ అనుమతి పొంది అమ్ముటకు బేరమునకు పెట్టగా విజయవాడ తెలగ మహాజన సంఘం ఆ స్థలములో ఎకరా 87 సెంట్లు భూమిని కళ్యాణమంటపము పేద విద్యార్థుల వసతి గృమాలు, విద్యాసంస్థలు నెలకొల్పుటకు ప్రభుత్వము నిర్ణయించిన క్రయ ధనము చెల్లించి 1980వ సంవత్సరములో సంఘం పేర ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గారిచే విక్రయ దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయించుకొనుట జరిగినది.

ఆ స్థలం సంఘం పేర రిజిస్ట్రేషన్ చేయించుకొనుటకు పూర్వము అందులో అక్కడక్కడ చెదురుమదురుగా పాకలు ఉన్నవి. ఆ పాకలను తొలగించుటకు ఎండోమెంటు డిపార్టుమెంటువారు విజయవాడ 5వ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయదా కోర్టువారు అందులో పాకలు వేసినవారు అక్రమ ఆక్రమణదారులనియు వారు స్థలములో నుండి తొలగిపోవలయున ఆర్డరుని మంజూరు చేయగా ఆ ఆర్డరు చెల్లదని సవాలు చేయుచూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయగా హైకోర్టువారు క్రింది కోర్టు తీర్పును ఖాయపర్చుచూ రిట్ పిటీషన్ కొట్టివేసిరి. తదుపరి క్రింది కోర్టువారి తీర్పు ప్రకారము అందులో వున్న 41 మంది పాకవాసులను తొలగించిరి. ప్రస్తుతం ఆ స్థలములో ఆ పాకవాసులు ఎవరునూ లేరు.

మన సంఘం పేర పై దస్తావేజు రిజిస్ట్రేషన్ చేయించుకొనునాటికి ఆ స్థలములో ఎట్టి పాకలునూ లేవు. కాని అక్కడున్న స్థానిక రాజకీయ నాయకుల ప్రోద్బలముతో వేరే కొంతమంది తిరిగి అందులో క్రొత్తగా పాకలు నిర్మించిరి. వారిని అందుండి తొలగించుటకు మన సంఘం తరుపున చేసిన సామరస్య ప్రయత్నములన్నియు వృధాకాగా మరొక మార్గము లేనందున ఆ ఆక్రమణదారులపై అక్రమ భూ ఆక్రమణ చట్టము క్రింద కృష్ణాజిల్లా అదనపు జడ్జి కోర్టులో పిటీషన్ దాఖలు చేయడమైనది. ఆ పిటీషన్ ప్రస్తుతం కోర్టు విచారణలో ఉన్నది.

రికార్డు పూర్వకముగా సాక్ష్యం అన్ని రీతులా సంఘమునకు అనుకూలముగా ఉన్నందున కోర్టులో నెగ్గలేమనే భయముతో ఆ డివిజన్ కార్పొరేటర్ 1983వ సంవత్సరములో ఆ స్థలమును మురికివాడ అభివృద్ధి మరియు భూసేకరణ చట్టము క్రింద దానిని మురికివాడగా చిత్రించి ఆ స్థలమును అక్వెరీ చేసి అక్కడున్న పాకవాసులకే పట్టాలు యిప్పించవలసినదిగా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశములో తీర్మానము ప్రవేశపెట్టగా అది పాస్ కాబడినది. ఆ తీర్మానము పురస్కరించుకొని మునిసిపల్ కమీషనర్గా ఆంధ్రప్రదేశ్ గజెట్లో మన సంఘ స్థలం మురికివాడగా పరిగణిస్తూ నోటిఫై చేసినారు. ఆ నోటిఫికేషన్ చెల్లదని మనం సంఘం తరుపున హైకోర్టులో రిటిపిటీషన్ దాఖలు చేసి స్టే ఆర్డరు పొందినాము. పై ఆర్డరు ప్రస్తుతం అమలులో ఉన్నది. అయితే అదే నోటిఫికేషన్లో శ్రీ కె. వెంకటేశ్వర రావు అనే ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన 585 గజములు కూడా మురికివాడగా పేర్కొనబడినది. సదరు వెంకటేశ్వరరావుగారు తనకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వమునకు తెలుపుచూ దరఖాస్తు పెట్టుకొనగా విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ గారి రిపోర్టు ప్రకారము అది మురికివాడ కాదనియు కాబట్టి కె. వెంకటేశ్వరరావుగారి స్థలమును నోటిఫికేషన్ నుండి ఉపసంహరింపచేయుచూ జి.వో. ప్రభుత్వమువారు మంజూరు చేసినారు.

ఆ జి.ఓ.ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ వారు ఒకే యన్.టి.యస్. నంబరులోని కొంతభాగము మురికివాడ కాదని ప్రభుత్వము పరిగణించనపుడు ఆ యన్.టి.యస్. నంబరులో నున్న మిగిలిన స్థలము కూడా మురికివాడ కాదని అది అన్ని విధములా అభివృద్ధి చెందిన ప్రదేశమని పేర్కొంటూ లోగడ తీర్మానము రద్దు చేయుచూ మరొక తీర్మానమును 2008. 87వ తేదీన పాస్ చేసినారు. ఈ తీర్మానం పాస్ అయిన వెంటనే పాకవాసులు మరికొంతమంది రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగారిని కలుసుకొని ఆ స్థలం గవర్నమెంటు పోరంబోకు అనియు దానిని విజయవాడ తెలగ సంఘమువారు దురాక్రమణ చేయుటకు ప్రయత్నిస్తున్నారనియు దానిపై ఆ స్థలు అక్వెరీ చేయుటకు ముఖ్యమంత్రిగారు ఆర్డరు వేసినారనియు తెలియుచున్నది. గత నాలుగు మాసముల నుండి సంఘ కార్యవర్గ సభ్యులు, తదితర మన సంఘ పెద్దలు ఈ సందర్భంలో సామరస్యపూర్వకముగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందువలన ఈ జటిల సమస్యను సభకు విచ్చేసిన మేధావులైన పెద్దల దృష్టికి తీసుకొని వచ్చుచున్నాను.

కాబట్టి సోదరులారా ఈ జటిల సమస్యను పరిష్కరించుటకు మీరు దీర్ఘంగా ఆలోచించి తగు సూచనలతో కార్యక్రమం రూపొందించి ఆ కార్యక్రమం అమలుజరుపుటకు మీరు అందరు కార్యవర్గమునకు అండగా నిలబడి ఈ విపత్కర పరిస్థితుల నుండి సంఘమును రక్షింపవలసినదిగా హృదయపూర్వకముగా సభ్యులందరినీ కోరుచున్నాను.

1981వ సం||లో శ్రీ కొమ్మూరి సంజీవరావుగారి సహాయముతో శ్రీ సుంకర ఆదినారాయణ గారు సంస్థకు సుమారు 10 ఎకరముల భూమి సదుపాయము ఎండాడ గ్రామమునందు ఏర్పరచియున్నారు. ఇది విశాఖ మన సంఘీయులకు ఎంతో ఆనందమయిన విషయం. ఇది ఈ జిల్లా వారికి మరపురాని చరిత్ర.

1984వ సం|| తరువాతను, మరియు శ్రీ రొక్కం రామనాధం గారు కీర్తిశేషులయిన పిమ్మట ఈ సంఘ కార్యనిర్వాహక బాధ్యతలు శ్రీ భీమనాధం ధర్మారావు గారు నిర్వర్తించిరి. వారి ఆధ్వర్యములో శ్రీ ప్రొఫెసర్: ఆర్.వి. రామారావుగారు అధ్యక్షులుగాను శ్రీ ఎమ్. ఎచ్. రావు గారు, శ్రీ సుంకర ఆదినారాయణ రావు గారు, శ్రీ పినిశెట్టి రామదాసు గారు, శ్రీ మునగాల రవిగార్ల ఇత్యాదులతో
కార్యనిర్వాహక వర్గం చేపట్టి, ఈ సంఘ అభివృద్ధికి పాటుపడిరి.

  1. 1987వ సం|| సెప్టెంబర్, 12వ తేది మన సంఘ నాయకులు, విఇటిఎస్ కార్యదర్శులయిన శ్రీ భీమనాథం గారు అకాల మరణం పొందుట, మన సంఘానికి తీరని లోటుగా మారినది.
  2. శ్రీ మిరియాల వారు పురప్రముఖులను పిలిచి, విశాఖ ఎడ్యుకేషనల్ సొసైటీని తిరిగి క్రాంతిపథంలో వుంచవలసినదిగా పిలుపినిచ్చియున్నారు శ్రీ మునగాల రవిగారు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చి ఒక చక్కని కార్యనిర్వాహక వర్గమును తయారుచేసి, సంఘాన్ని నడుపుటకై వాగ్ధానం చేసియున్నారు.
  3.  బి.హెచ్.పి.వి. పబ్లిక్ సెక్టార్ నందలి మన సంఘీయులు ఒక సంఘముగా ఏర్పడి కె.టి.బి. వెల్ఫేర్ సొసైటీగా రిజిస్టర్ చేసియున్నారు. శ్రీ పద్మశేఖర్ గారు దీనికి కార్యదర్శులుగా ఎన్నికైనారు.
  4. ఇచటి పబ్లిక్ సెక్టార్ ఓడల నిర్మాణ సంస్థని 1000 మంది మన సంఘీయులు ఒక సంఘముగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేసియున్నారు. డా॥ కె. మురళీధర్ గారు ఈ సంఘమునకు అధ్యక్షులుగా
    ఉన్నారు.
  5. వి.పి.టి. తెలగ కాపు వెల్ఫేర్ సంఘం: శ్రీ పుటా ఈశ్వరరావు గారు అధ్యక్షులుగాను, శ్రీ దాసరి సుదర్శనరావు గారు కార్యదర్శులుగాను ఈ సంఘము నడుపబడుచున్నది.
  6. శ్రీకృష్ణదేవరాయ సొసైటీ: విశాఖలోని నావల్ విభాగమయిన యన్.ఏ.డి.లోని మన సంఘీయులు కలిసి ఈ సంఘమును ఏర్పరచిరి.
  7. టి. ఇ.డి.ఏ: ఆంధ్రా యూనివర్సిటీ ఏరియా వారు తెలగా డెవలప్మెంట్ అసోసియేషన్గా ఏర్పడి, మన సంఘీయులలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ నొసంగి ఎనలేని సేవ చేయుచున్నారు. ఆచార్య కొల్లపాటివారి మార్గదర్శకముగా ఈ సంఘము నడుపబడుచున్నది.
  8. ఇచటి హిందూస్తాన్ జింకు లిమిటెడ్ నందలి మన సంఘీయులు ఒక సంఘమును రిజిస్టర్ చేసియున్నారు.
  9. విశాఖ స్టీలు ప్రాజెక్టునందలి మన సంఘీయులు ఒక సంఘమును ఏర్పరచియున్నారు. డా॥ శ్రీనాథ్ గారు, శ్రీ ప్రసాదు గారు మరియు శ్రీ ఎరబోలు మోహన్ గోపాల్ ఇత్యాదులు సంఘమును రిజిస్ట్రేషన్ చేయుటకు సహకరించిరి.
  10. గోపాలపట్నంనందు మన సంఘీయులంతా కలిసి అచటి ప్రాంతీయులు కలిసి ఒక సంఘముగా ఏర్పడి సంఘ సేవ చేయుచున్నారు. శ్రీ తుమ్మల నర్సింహం గారు వీరికి మార్గదర్శకులు. శ్రీ ముమ్మన సూర్యనారాయణ గారు అచటి పురప్రముఖులు.

విశాఖలో తెలగా సంఘాల ఆవిర్భావం

1980వ సంవత్సరం విశాఖపట్నంలో తెలగ, కాపు, బలిజ సంఘీయులకు స్వర్ణయుగం లాంటిది. ఎందుకంటే అదే సంవత్సరంలో రెండు ముఖ్యమయిన మన జాతి సంఘాలు పట్టణంలో ఏర్పడి ప్రతిఫలించి, అనేకమంది సభ్యులను సహితము కూడబెట్టుకొని రిజిస్ట్రేషన్తో సహా కార్యక్రమాలను చేసియున్నది.

లలిత కళాసమితి: మన సంఘీయుల యొక్క ఉనికి బయటపడకుండా, ఏదేని ఫండైజింగ్ కార్యక్రమములను చేయుటకు వీలుగా, మన ఈ సంఘమునకు ఈ మారుపేరు పెట్టడము జరిగియున్నది. ఉన్నత ఆదర్శములు గల ఇందరు యువకులు శ్రీమహాదశ ఫణీందుడు, మరియు శ్రీ చవ్వాకుల రామారావు గార్ల ఆచార్య శ్రీ కొర్లపాటి శ్రీరామమూర్తి గారి ఆశీస్సులతో ఈ సంఘం పురుడు పోసుకున్నది.

ఈ సంఘమునకు ప్రథమ అధ్యక్షులుగా శ్రీ యీటి సీతయనాయుడు గారు చేపట్టిరి. వారి సలహా మేరకు శ్రీ గౌతముగారు, శ్రీ రాఘవేంద్రరావుగారు, శ్రీ ఫణేంద్రుడు గారు, శ్రీ సి.హెచ్. రామారావు గారు, శ్రీ వ్యాసం హరిప్రసాద్ గారు, శ్రీ ఆళ్ళ వెంకటేశ్వరరావు గారు, శ్రీ సి.వి. సూర్యనారాయణగారు మొదలగు కార్యకర్తలతో కార్యనిర్వాహక వర్గం ఏర్పరచబడినది.

ఈ సంఘము ప్రతి బుధవారం నాడు కార్యవర్గ సమావేశం ఏర్పరచి, జాతి యొక్క ఔన్నత్యమునకై అనేక మార్గదర్శక కార్యక్రమములను చేపట్టియున్నది. మరియు ఏడాదికి ఒకమారు కార్తీక సమావేశములు ఏర్పరచి వనభోజనములు వారి సభ్యులతో ఏర్పాటు చేయుచుండెడిది. ఆ సమావేశములో రాష్ట్ర అన్ని భాగములనుండి ప్రముఖులు వచ్చి సందేశములిచ్చి వెళ్ళుచుండిరి. శ్రీ నున్న సుబ్రహ్మణ్యం గారు, శ్రీ యల్.వి. రామయ్య గారు, శ్రీ అనంతబాబుగారు మొదలగువారు అనేక పర్యాయములు ఈ సమావేశమునకు హాజరు అయి వున్నారు. లలితకళా సమితి అనేక పేద విద్యార్థి సభ్యులకు స్కాలర్షిప్స్ ఇచ్చియున్నది. మరియు పేద విద్యాధికులకు ఉన్నత స్థానములలో వున్నవారి సహాయములతో ఉద్యోగావకాశములకు పాటుపడియున్నది.

1984వ సంవత్సరములో శ్రీ యీటి సీతయ్యనాయుడు గారు కీర్తిశేషులయిన పిమ్మట శ్రీ కొర్లపాటి వారి అధ్యక్ష ఆధ్వర్యంలో ఈ సంఘము నడుచుట ప్రారంభించెను. అటుపిమ్మట 1986వ సంవత్సరములో చిరుమార్పులతో సంఘ కార్యనిర్వాహక వర్గము పనిచేయుట ఆరంభించెను.

ప్రస్తుత కాలములో ముగ్గురి పురప్రముఖులతో అడహక్ కమిటీగా ఏర్పడి, ఈ సంఘము ప్రగతిపథంలోకి పరుగుతీయనారంభించింది. వారలు సర్వశ్రీ మెండు సుబ్బారావుగారు, సర్వశ్రీ అందే భక్తవత్సలం గారు మరియు సర్వశ్రీ ఈటి ప్రకాశరావుగారలు.

ఈ సంఘము ఇంతకుమించి అనేక సంఘ పురోభివృద్ధి కార్యక్రమములను చేపట్ట, ధనబలము పుంజుకొని, నగరములో ఒక ప్రముఖ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఆశిస్తాము.

విశాఖ ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసెటి

1980వ సంవత్సరము సెప్టెంబరు నెలనందు డా॥ శ్రీ సుంకర ఆదినారాయణ గారు నాయకత్వములో విత్తనము నాటింపబడి వారి ఆధ్వర్యములో అనేక సంఘీయులు జిల్లా నలుమూలల నుండి విచ్చేయింపబడి అన్ని ప్రాంతముల ప్రాతినిధ్యముతో మన జాతీయులతో ఈ సంఘము రిజిస్ట్రేషన్ గావించబడినది.

ఈ సంఘమునందు కార్యనిర్వాహక వర్గముగా ఈ వీరలు చోటు చేసుకొనియున్నారు. శ్రీ రొక్కం రామనాథం గారు, శ్రీ కె.వి. ఆర్. నాయుడు గారు, శ్రీ సి.హెచ్. పాపారావు గారు, శ్రీ మునగాల రవిగారు, శ్రీ సుంకరి దుర్గాదాసుగారు, శ్రీ ముమ్మన సూర్యనారాయణ గారలు మరియు విశాఖలోని ఇతర సంఘముల ప్రతినిధులను కమిటీగా ఏర్పరచి సంఘము దినదినాభివృద్ధి చెందినది.

విశాఖపట్నం జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు

విశాఖ జిల్లా తెలగ, కాపు, బలిజ సంక్షేమ సంఘం 1984 సెప్టెంబర్ నెల నందు రిజిస్టర్ చేయబడినది. ఇప్పుడు తన రెండవ వార్షిక మహాసభ జరుపుటకు సిద్ధముగానున్నది. తన మొదటి వార్షిక సభకు సుమారుగా 4,500 మంది సభ్యులు హాజరయి ఈ సంఘమునకు ఎంతో నైతిక బలమును చేకూర్చిరి. అదే సభనందు శ్రీ మిరియాల వారి సలహాననుసరించి ఈ సంఘమును పట్టణపు లేదా అర్బన్-వింగ్ మరియు రూరల్-వింగ్ (అనగా విశాఖపట్నం సిటీ మినహా మిగిలిన ప్రాంతమునకు) లుగా రెండు భాగములుగా పనిచేయుట ప్రారంభించినది. అయితే ప్రస్తుత కమిటీ అర్బన్-వింగ్ విభాగముగా పనిచేయుట మొదలిడినది.

ఈ సంఘ ముఖ్యోద్దేశములు ఏమి అనగా?

  1. కులస్తులను సమన్వయపరచడం.
  2. పేద సభ్యులకు విద్య మరియు ఉద్యోగ అవకాశము కల్పించుట కొరకు అధికారములోనున్న సభ్యుల దృష్టికి తీసుకొనివచ్చి వారి వారి సంక్షేమములను చూచుట.
  3. సంఘ సభ్యులు వారి వారి కుటుంబ సభ్యులను కలిసికొని ఒకరినొకరు తెలుసుకొనుటకు గాను వింటర్-ఫెటో వన భోజనములు ఏర్పాటుచేయుట, అటులనే సాంస్కృతిక కార్యక్రమములను ఏర్పాటుచేయుట.
  4. క్రొత్త సభ్యులను చేర్చుకొని, సంఘమును పటిష్టపరచుటకై ఇతర కార్యక్రమములు మరియు చందాల ద్వారా సంఘము నడుపుటకు గాను ధనము సేకరించుట.

(1986వ సంవత్సరమునకు గాను నిర్ణయించబడిన కార్యనిర్వాహక వర్గము పేర్లను జత పరచడమైనది)

మన సంఘము 1986నందు సాధించిన అతి ముఖ్యమైనది ఏమనగా! విద్య మరియు వాణిజ్య సంస్థలను స్థాపించుటకై సుమారు 30 గదులు గల ఒక బిల్డింగు సంఘము పేరుపై తీసుకొనబడినది. ఈ భవనము శ్రీ రెడ్నం సూర్యారావు మరియు శ్రీ రెడ్నం ధర్మారావుగార్ల ఛారిటీస్ నందుండి మనకు ఈయబడినది. (శ్రీపోతుల రామకృష్ణగారు మరియు శ్రీ పోలిశెట్టి శ్రీనివాసుల గారి సౌజన్యంతో ఈ భవంతి మనకీయబడినది)

ఈ భవంతి నందు ఒక ఇంజనీరింగు కళాశాల, ఒక కంప్యూటర్ సెంటర్, ఒక పబ్లిక్ స్కూలు మరియు ఒక ట్యుటోరియల్ కాలేజీ వారికి పెట్టుటకు తీర్మానించడమైనది. ఇందుకుగాను మనవారు శ్రీకృష్ణదేవరాయ ఎకాడమీని ఏర్పాటు చేసియున్నారు.
ఇదిగాక మన ప్రెసిడెంటు గారయిన గౌరవనీయులైన శ్రీ హనుమంతరావుగారు సుమారు 150 మంది పేద గ్రాడ్యుయేట్స్కు ఉద్యోగ అవకాశములు కల్పించిరి.
అటులనే విశాఖపట్నంనందు నివసించుచున్న శ్రీ మిరియాల వారు కూడా పేదవారయిన
విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు అనేకమందికి విద్య, ఉద్యోగ అవకాశములిప్పించి ఈ సంఘమును వెన్నుతట్టి పనిచేయించుచుండిరి.

మిరియాల వెంకటరావు సంపాదకీయం - తెలగ, కాపు, బలిజ సంక్షేమం

ఆత్మీయ బాంధవులారా.. కుల సోదరులారా...
కులాభిమానులు.. కులపెద్దలు.. కుల గురువులకు నమస్సుమాంజలులు.

పత్రికను ప్రారంభింస్తున్నామని తెలిసిన తరువాత మన కులస్తుల దగ్గరనుండి అసంఖ్యాకముగా ఉత్తరాలు వస్తున్నాయి. అందరికీ జవాబు ఇవ్వడం సాధ్యం గారు. గాని వారిచ్చిన సలహాలు తూ.చ. తప్పకుండా పాటిస్తాం. అందుకే అందరికీ అందిస్తూయున్నాను. నా కులాభివందనములు.

“కలసిఉంటేకలదుసుఖం" అనునానుడిమీకుతెలియనిదిగాదు. ఈసువిశాలతెలుగు రాష్ట్రములో మనము మూడవ వంతుండి రాష్ట్రం నలుమూలల వ్యాపించియున్నాము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుచున్నాము. పేర్లు ఏమైనా జాతి ఒక్కటే. మనమంతా ఒకే కులానికి చెందినవారము. ఈ వాస్తవాన్ని గమనించక ఎవరికివారే యమునాతీరే అన్న చందాన
అనైక్యతతో జీవిస్తున్నాం. ఈ అనైక్యతే మన దుస్థితికి కారణమయ్యింది. ఫలితంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాలలో సముచిత స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నాము. అందుకే అన్నారు కులము లేనివాడు, కులబలము లేనివాడు ఎందుకూ పనికిరాడు అని. మన జాతిని మనము సంస్కరించుకోవాలి. జాతిలో క్రొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చి సాధిద్దాము. ఐక్యతతో ఏమైనా, ఏదైనా సాధించగలము.

ఆ ఐక్యతను సాధించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని జిల్లాలలోనూ ఎన్నో కార్యక్రమాలు జరిగాయి గాని ఎంతో ఉత్సాహవంతముగా జరుగుతున్న ఈ కార్యక్రమాల వివరాలు ఎవ్వరికీ సకాలములో తెలియడం లేదు. దీనికి కారణం వివిధ సంఘాల మధ్య వారధిలా ఉండే పటిష్టమయిన పత్రిక లేకపోవడమే. అదే ఐక్యతతో మరిన్ని విజయాలు సాధించాలన్నా పత్రిక ఆవశ్యకత ఎంతో ఉంది. అందుకే సాహసమే అయినా ఈ పత్రికను ప్రారంభిస్తున్నాము.

యిది మీ పత్రిక, మన పత్రిక, మనందరి పత్రిక. దీని అభివృద్ధికి మనమందరము బాధ్యులము. ఈ పత్రికను ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించవలసిన బాధ్యత మీ అందరిపై ఉంది. మీతోనే పరిమితము కాకుండా మీ పరిధిలోని వీలున్నంత ఎక్కువమందిని ఈ పత్రికకు చందాదారులుగా చేర్పించండి. విరాళములు యిచ్చి శాశ్వత నిధిని పత్రికకు చేకూర్చండి. నడిపేందుకు ఆర్థిక సహాయాన్ని అందించండి. మీరంతా పత్రిక దినదినాభివృద్ధికి కృషి చేయాలనే నా కోర్కెను మన్నిస్తారని ఆశిస్తూయున్నాను.

ఉన్నవారు మహారాజ పోషకులుగానూ, రాజపోషకులుగానూ, పోషకులుగానూ ఈ మీ పత్రికకు విరాళాలివ్వండి. వ్యాపార ప్రకటనల్విండి. ప్రోత్సహించండి.

భవదీయుడు
మిరియాల వెంకటరావు

ఈ విభాగంలో ప్రత్యేకించి మిరియాల వెంకటరావుగారి రెండు ప్రధాన సంపాదకీయాలను యధాతథంగా అందించడం జరిగింది. ఎందుకంటే కొన్ని ఇవ్వాళ చూసుకొంటే ఎంతో ముచ్చట.

1999వ సంవత్సరంలో వార్త తెలుగు జాతీయ దినపత్రికనందు సామాజికాంశం శీర్షికన మిరియాల వెంకటరావు సంధించిన వాగ్బాణాలు

పథకం ప్రకారం సాగుతున్న కాపుల అణచివేత

రాజకీయ పార్టీలు కూడా కుల ప్రభావంతో కొన్ని కులాలకు మాత్రమే పరిమితమైనప్పుడు, కాంగ్రెస్ పార్టీ వస్తే రెడ్డి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వస్తే కమ్మ ముఖ్యమంత్రి ఆకుండా ఈ రాజకీయ పార్టీలు బలహీన వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రిని చేస్తాయని ప్రకటిస్తాయా? ఆర్థిక రంగంలో కేవలం ఒకటి రెండు వర్గాలు మాత్రమే పరిశ్రమలు, హెూటల్స్, రియల్ ఎస్టేట్స్, ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్, సినిమాలు, ఇతర వ్యాపార విధానాలు ద్వారా తక్కువ సమయంలో అపర కుబేరులవుతుంటే దానికి ప్రభుత్వం రాయితీలు ఇతర సహాయాలూ ఇస్తూ ఉంది. దీన్ని ఇలాగే సాగనిస్తే ఈ వర్గాల వారు ప్రభువులుగా ఇతర అన్ని వర్గాల వారు సేవకులుగా మారే ప్రమాదం సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర వెనుకబడిన కులాల వారు పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకోవాలనుకుంటున్నారు.

రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపు, బలిజ, తెలగ కులం ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో మొదటిగా కులాల ఉద్యమాన్ని 1982లో ప్రారంభించింది. తాము అత్యధిక జనాభా కలిగిన కులమైనా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడినప్పటికీ అణచివేతకు గురవుతున్నామనీ, తమకు రాజకీయ, సామాజిక న్యాయం కావాలని ఉద్యమం ప్రారంభించాయి. అయితే ఇది కులతత్వ ఉద్యమం కాదనీ, తమకు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో చెప్పబడిన 'సమానత్వం' ప్రాతిపదికగా తమకు న్యాయం జరగాలని మాత్రమే కోరుతున్నామనీ ఆనాడు ప్రకటించాయి. తదుపరి 1988లో విజయవాడలో 15 లక్షల మందితో రాష్ట్రంలో ఏనాడూ జరగని రీతిలో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. అప్పటినుండి కొన్ని వర్గాలు ఈ కులం రాష్ట్రంలో మహాశక్తి అవుతుందన్న భయంలో ఒక పథకం ప్రకారం ఈ కులాన్ని అణచివేయడానికి పూనుకున్నాయి.

సమానత్వం సాధించడానికి ఇప్పుడు ఈ కులాలన్నీ పరస్పర అనుమానాలు విడిచిపెట్టి ఒక వేదిక మీదకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మార్పు రానంతవరకు సరిపెట్టుకుని బతికే ప్రస్తుత మనస్తత్వం పోనంతవరకు మనది సమసమాజ ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు.

స్వాతంత్ర్యం సిద్ధించి 50 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రాష్ట్రంలో కేవలం రెండు వర్గాల చేతుల్లోనే రాజకీయ, ఆర్థిక అధికారాలు కేంద్రీకృతం కావడం గమనార్హం. రాజకీయ అధికారంతో ఆర్థిక రంగాన్ని, ఆర్థిక బలంతో రాజకీయ రంగాన్ని విపరీతంగా పెంచుకోవడంలో ఈ వర్గాలు విజయవంతమయ్యాయి. తక్కిన బలహీన వర్గాలని, వెనుకబడిన వర్గాల్ని అణచివేతకు గురయిన వర్గాన్ని ఏకం కాకుండా చూడడంలో ఈ పెత్తందారీ, పెట్టుబడిదారీ వర్గాలు పథకం ప్రకారం రాజకీయం చేస్తున్నాయి. అయితే 40 సంవత్సరాలకు పూర్వమే ప్రముఖ సోషలిస్ట్ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన రామ్ మనోహర్ లోహియా ఈ ప్రమాదాన్ని ఊహించి హెచ్చరించారు. వెనుకబడిన వర్గాల్ని, అణచివేతకు గురవుతున్న వర్గాల్ని సమీకరించడంలో అత్యధిక జనాభా కలిగిన కాపు కులం, ముఖ్యపాత్ర పోషించాలని కూడా ఆయన సూచించారు. దురదృష్టవశాత్తూ అణగారిపోతున్న కులాలలో సరయిన అవగాహన లేకపోవడంలోనూ, పరస్పర విశ్వాసం లోపించడంతోనూ 1988 తర్వాత ఆ దిశగా జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆర్థిక రంగం, రాజకీయ రంగం, జనాభాలో కేవలం 5 లేక 6 శాతం ఉన్నవారికి మాత్రమే ధారాదత్తమయ్యాయి. మేధావి వర్గాలు కూడా ఈ విషయంలో నిర్లిప్తత వహించడం దురదృష్టకరం. విచిత్రమేమంటే అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న బ్రాహ్మణ, వైశ్యకులాలు కూడా దిక్కులేనివిగా అయిపోయాయి.

సమానత్వం సాధించడానికి ఇప్పుడు ఈ కులాలన్నీ పరస్పర అనుమానాలు విడిచిపెట్టి ఒక వేదిక మీదకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మార్పు రానంతవరకు సరిపెట్టుకుని బతికే ప్రస్తుత మనస్తత్వం పోనంతవరకు మనది సమసమాజ ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు.

ఒక కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులం విషయానికొస్తే ప్రాంతీయంగా వివిధ పేర్లతో పిలువబడుతున్నప్పటికీ ఇదంతా ఒకటే కులం. శ్రీకాకుళం నుండి అనంతపురం, చిత్తూరు వరకు విస్తరించిన ఈ కులం 1913 ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం 43 లక్షలున్నది. 1962వ సంవత్సరంలో వెనుకబడిన తరగతులలో చేర్చబడిన ఈ కులం రాజకీయ కుతంత్రాల కారణంగా ఆ వసతిని పోగొట్టుకున్నది. అన్ని రంగాలలోనూ వెనుకబడి ఉన్నప్పటికీ రాజకీయంగా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డ ఈ కులం 1982వ సంవత్సరంలో ఉద్యమాన్ని ప్రారంభించింది. వెనుకబడిన తరగతులలో చేర్చాలని, రాజకీయ న్యాయం తమ జనాభా ప్రాతిపదికగా కావాలని పోరాటం ప్రారంభించింది.

తదుపరి ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష తరువాత విజయ భాస్కర్ రెడ్డి ఒక జి.వో. విడుదల చేశారు. అయితే ఆ జి.వో. అమలు గురించి ప్రస్తుత ముఖ్యమంత్రికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఉలుకు, పలుకు లేదు. వెనుకబడిన తరగతుల కమీషను నియమించి ఇప్పటికి 5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకూ ఏ రిపోర్టు లేదు. ప్రభుత్వం రిపోర్టు విషయంలో కమీషనును అడిగిందా? లేదు. ఇందుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించకతప్పదు.

ఇక ఈ కులానికి చెందిన ఉద్యోగుల విషయానికొస్తే ఈ కులంలో పుట్టిన పాపానికి వాళ్ల ఎన్నో వేధింపులకు గురి కావలసివస్తోంది.ఎవరికిచెప్పుకోవాలో తెలియక ఈకులానికిచెందినవుద్యోగులుదిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ల గురించి ఇదేమని అడిగే నాధుడు లేకండా పోయారు. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్.,ల నుండి కింది స్థాయి వరకు చెత్త పోస్టుల్లో వేస్తున్నారు. ఎక్కడో ఒకటి, రెండు చూపించి ఇవి మీకు ఇచ్చాం కదా అని అంటున్నారు.

ఇక రాజకీయ రంగానికొస్తే రాష్ట్ర మంత్రివర్గంలో ఈ కులానికి కూడా మంత్రి పదవులిచ్చాం అన్నారు. అందులో ఒకటి దేవాదాయ శాఖ, మరొకటి సహకారశాఖ. బి.సి. కోటాలో ఒకరికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఈ కులం ఇంతకుమించి పనికిరాదేమో తెలియదు కానీ రాష్ట్రంలోని కోటి 70 లక్షల మంది కులస్తులు ఈ పరిస్తితుల్ని నిశితంగా,ఆగ్రహావేశాలతోగమనిస్తున్నారని గుర్తించాలి. ఇకనామినేటెడ్ పదవుల విషయానికొస్తే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ కులస్తుడు లేడు. ఎ.పి.ఎస్.ఇ.బి., సభ్యుల్లో కానీ, సర్వీస్ కమీషన్లో కాని ఒక్క సభ్యుడు కూడా లేడు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అన్ని పదవులై ఒకే వర్గానికిచ్చేటప్పుడు ఆ జిల్లాల్లోని కాపు, బలిజ కులస్తులు నోరుమూసుకుని ఉన్నారని అనుకుంటే అంతకుమించిన పొరపాటు మరొకటి లేదు. రాష్ట్ర హైకోర్టులోని 40 మంది జడ్జిల్లో ఒక్కరు కూడా ఈ కులానికి చెందినవారు లేరు. జడ్జిలను కుల ప్రాతిపదికన వేయాలని నేనడంలేదు గాని, ఈ కులాన్ని ఎవరూ పట్టించు కోవడం లేదని మాత్రమే నేను చెప్పదలచుకున్నాను. అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్, పి.పి.లు, అడిషనల్ పి.పి.ల నియామకాల్లో ఈ కులాన్ని విస్మరించడం జరుగుతోంది.

పోనీ కాంగ్రెస్ పార్టీ వారు గుర్తిస్తున్నారా అంటే మొన్నటి పి.సి.సి. కార్యవర్గంలో ఈ కులానికిచ్చిన ప్రాతినిధ్యం కళ్లు తుడవడానికి తప్ప గుర్తించి మాత్రం కాదు. మాజీమంత్రి హరిరామజోగయ్య ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. రాయలసీమ జిల్లాల నుండి గాని, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుండి ఈ కులం వారెవరూ లేకపోవడం చింతించదగన విషయం. ఈ కులం వారు ఎవరినైనా నెగ్గించలేకపోవచ్చునేమో గాని, ఎవరినైనా ఓడించగల నిర్ణయాత్మక శక్తి అన్న విషయాన్ని ఈ పార్టీలు, ప్రభుత్వాలు గుర్తించడం
మంచిది. రాష్ట్రంలో కుల ప్రాతిపదికన, సామాజికీ, ఆర్థిక సర్వే జరిపితేనే తప్ప జరుగుతున్న అన్యాయాలు వెలుగులోనికి రావు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వమూ, ముఖ్యమంత్రి నిజాయితీగా అన్ని వర్గాలకూ న్యాయం చేసే ఉద్దేశ్యం ఉంటే ప్రస్తుతం ముఖ్యమైన పదవుల్లో ఏ కులానికి చెందిన అధికారుల్ని ఎక్కడ ఎందుకు వేస్తున్నారో, వేధింపులకు గురవుతున్న అధికారుల విషయం ఏం పట్టించుకున్నారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఏ కులం వారు అధికారంలో ఉంటే ఆ కులం వారికే రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పూర్తిగా దాఖలు పడతాయని రోదిస్తున్న ఇతర కులాలకు జవాబు చెప్పండి.

ఈ మధ్య హైదరాబాద్లో ఒక సమావేశం జరిగింది. దాని నిర్వాహకులు ఉత్సాహవంతులైన యువకులు కావడంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కాపులు, వెనుకబడిన తరగతులకు చెందినవారు, బ్రాహ్మణులు, మాల, మాదిగ, వర్గాలకు చెందిన వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సంఖ్య తక్కువైనప్పటికీ వారిలో అవగాహన, పట్టుదల సంగా కనిపించింది. వారు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు కాకపోవడం విశేషం. వారి చర్చల్లో ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. రాజకీయ పార్టీలు కూడా కుల ప్రభావంతో కొన్ని కులాలకు మాత్రమే పరిమితమైనప్పుడు, కాంగ్రెస్ పార్టీ వస్తే రెడ్డి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వస్తే కమ్మ ముఖ్యమంత్రి కాకుండా ఈ రాజకీయ పార్టీలు బలహీన వర్గాలకు చెందిన వారిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటిస్తాయా అన్నది వీరి ప్రశ్న. ఆర్థిక రంగంలో కేవలం ఒకటి, రెండు వర్గాలు మాత్రమే పరిశ్రమలు, హెూటల్స్, రియల్ ఎస్టేట్స్, ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ హాస్పిటల్స్, సినిమాలు ఇతర వ్యాపార విధానాల ద్వారా తక్కువ సమయంలో కుబేరులవుతుంటే దానికి ప్రభుత్వం రాయితీలు, ఇతర సహాయాలు చేస్తూ ఉంది. వారికి సహాయపడడానికి కీలకమైన స్థానాల్లో తమ వారిని మాత్రమే నియమించుకుంటుంటే ఇతర రాజకీయ పక్షాల్లోని కుల ప్రముఖులు కూడా దీనికి అన్ని విధాలా సహాయపడుతున్నారు. దీన్ని ఇలాగే సాగనిస్తే ఈ వర్గాల వారు ప్రభువులుగా ఇతర అన్ని వర్గాల వారు సేవకులుగా మారే ప్రమాదం సమీపిస్తుందని వారి వాదన. ఆ పని జరక్కముందే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులం వారు తమ విబేధాలు మరచి సంఘటిత పోరాటం చేసి తమ జనాభా ప్రాతిపదికగా తమకు అన్ని రంగాల్లోనూ న్యాయం సాధించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు గారికి, అభివాదములు.

ఆంధ్రప్రదేశ్లో అత్యధిక జనాభా కలిగిన కాపు, బలిజ, తెలగ కులానికి జరుగుతున్న అన్యాయాల విషయంలో కొన్ని వివరాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను.

  1. రాష్ట్రంలోని యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ల విషయంలో ఈ కులానికి తగిన ప్రాతినిధ్యం లభించడం లేదు. ఏ యూనివర్సిటీకి కాపులు వైస్ ఛాన్సలర్గా నియమించబడలేదు. ఆంధ్రా యూనివర్సిటీ 60 సంవత్సరాల చరిత్రలో ఈ కులానికి చెందిన ఏ ఒక్కరినైనా వైస్ ఛాన్సలర్గా నియమించటం జరుగలేదు. ఆంధ్రాయూనివర్సిటీ పరిధిలోని అన్ని జిల్లాలలో ఈ కులం వారు అత్యధికంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఈ కులం వారిని నియమించకపోవడం విచారకరమైన విషయం. శ్రీ ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలలో ఈ కులం వారికి జరుగుతున్న అన్యాయాలు ఎన్నో ఉన్నప్పటికీ వారికి న్యాయం చేసే నాధుడు లేకుండాపోయారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ వి.సి. గారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కాపు కులస్తులను అణచివేస్తున్న విషయమై కొన్ని వివరాలు ఇందులో జతపరుస్తున్నాను. అంతే కాకుండా అనంతపురం కృష్ణదేవరాయ, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలలో కూడా ఈ కులం వారికి న్యాయం జరగటం లేదు.
    పై విషయాలను దృష్టిలో వుంచుకుని ఆంధ్రాయూనివర్సిటీ, వెంకటేశ్వరా యూనివర్సిటీలలో ఒకదానికి, తక్కిన యూనివర్సిటీలలో ఇద్దరినీ ఈ కులం వారిని వి.సి. లుగా నియమించవలసినదిగా కోరుచున్నాము.
  2. కాపు, బలిజ, తెలగ కులాన్ని వెనుకబడిన తరగతుల్లో చేరుస్తూ గత ప్రభుత్వం జి.వో. ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అది అమలు జరుగలేదు. రాష్ట్రంలోని కాపు, బలిజ కులస్తులు ఈ విషయమై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్న విషయం దయచేసి గమనించవలసిదిగా కోరుచున్నాను. ఈ విషయమై మీరు మీ విధానాన్ని ప్రకటించకపోవడం, అసలు పట్టించుకోకపోవడం, ఈ కులసుతలపై మీరు నిర్లిప్త వైఖరి ప్రదర్శించడం చాలా బాధాకరమైన విషయమని మనవి చేస్తున్నాను. అంతే కాకుండా బి.సి. కమీషన్ మూడు సంవత్సరాలైనా నివేదిక సమర్పించకపోవడం ప్రభుత్వం కావాలని చేస్తున్న అన్యాయంగా ఈ కులస్తులు భావిస్తున్నారు.
  3. రాజకీయ నియామకాల్లో వివక్ష చూపుతున్నారన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. మంత్రి పదవుల్లో, కార్పొరేషన్ తదితర నియామకాల్లో కానీ ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించడం కన్నీటి తుడుపుగా ఒకటి, రెండు ఇచ్చామనడం తప్ప ఏ మాత్రమూ న్యాయం చేయటం లేదు. న్యాయశాఖలో జి.పి.లూ, ఎ.జి.పి.ల నియామకాల్లో న్యాయమైన ప్రాతినిధ్యం లభించడం లేదు. హైకోర్టు జడ్జీల నియామకంలో కాపులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందన్న విషయం కూడా మీ దృష్టికి తీసుకువస్తున్నాను.

అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా కాపు కులానికి చెందిన వ్యక్తిని నియమించవలసినదిగా కోరుచున్నాను. ఇక ఉద్యోగాలలో కాపు కులానికి చెందినవారిని ఎన్నో వేధింపులకు గురిచేస్తున్నారు. అన్ని శాఖలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆర్టీసీ మరియు ఎ.పి.ఎస్.ఇ.బి. మొదలైన చోట్ల పథకం ప్రకారం అణగద్రొక్కుతున్నారు. పోలీసు శాఖలో ఎవరెవరిని ఏ స్థానంలో ఉంచుతున్నారో గమనిస్తే కాపులకు జరుగుతున్న అన్యాయం అర్ధమవుతున్నది. దయయుంచి పై విషయాలను పరిశీలించండి.

కాపులపై కక్ష సాధింపు చర్యలు జరుగకుండా చూడండి.

అన్ని రంగాల్లోనూ కేవలం ఒక వర్గం వారికే అన్ని ప్రయోజనాలూ సమకూరుస్తున్నారన్న భావం ప్రజలలో మరింత బలపడకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ అత్యధిక జనాభా గల కాపులకు సరైన న్యాయం జరిగే విధంగా వెంటనే చర్యలు తీసుకుంటారనీ, కాపులపై ఈ ప్రభుత్వానికి ద్వేషభావం లేదనీ ప్రకటిస్తారనీ ఆశిస్తున్నాను. కాపులను అణగద్రొక్కుతున్న విధానానికి స్వస్తి చెప్పి ఇకనైనా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోండి.

అంతకుమించిన ఆత్మవంచన ఏమైనా వుంటుందా? అధినాయకత్వం ఆగ్రహిస్తే మరుక్షణంలోనే మీ పదవులు, అధికారాలు అంతమైపోవా? రాజకీయ నాయకత్వం విషయంలో ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని పెంచడానికి మీరు ఏమి కృషి చేశారు? విద్యావిషయకంగా మనవాళ్ళ అభివృద్ధికి మీ కృషి ఎంత? సామాజిక న్యాయం కోసం మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

గతంలో రాజకీయ నాయకత్వంలో వున్న వారంతా కులాతీతంగా వ్యవహరిస్తున్నామనుకొని రాజకీయ నాయకత్వాన్ని పెరగకుండా చేసిన కారణంగానే ఈనాటికీ రాష్ట్రంలో కాపుల్లో ప్రధమశ్రేణి రాజకీయ నాయకత్వంలేకుండా పోవడం వాస్తవం కాదా?

హైకోర్టు న్యాయమూర్తులుగా వున్న ఇతర కులాల వారు తమ వారికి సహకరించుకొనడం తప్పుకాదని భావిస్తున్న ఈ కాలంలో కులమంటే అంటీముట్టనట్టుండే మన కులం అధికార్లంతా మన వాళ్లతో నవ్వుతూ మాట్లాడితేనే ఏం ప్రమాదం ముంచుకొస్తుందనే భయంతో బతకడం వాస్తవం కాదా?

ఆంధ్రదేశంలో అధికారం మార్చి మార్చి పంచుకొంటున్న రెండు కులాలు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి అర్హతలూ లేకపోయినా తమ కులం వారికే అన్ని పదవులు కట్టబెడుతున్నారు. ఈ వాస్తవాన్ని మీరు ఎలా జీర్ణించుకోగలుగుతున్నారు?

తెలుగుదేశం హయాంలో నెల్లూరు, ప్రకాశం రెండు జిల్లాలకు కలిపి ఒకే ఒక శాసనసభాస్థానాన్ని ముష్టి విదిలించినట్టు విదిలిస్తే ఆ పార్టీలోని కాపు నాయకులు కనీసం పెదవి కదిపేరా? అధినాయకత్వానికి “ఆడియేన్ దాసోహం” అంటూ కాల్మెక్కి ఆ విదిలించిన ఒక్క స్థానాన్ని కూడా కోల్పోలేదా? ఆ పార్టీ ఎక్కడైనా కాపు కులస్తులకు ఒక స్థానం విదిలిస్తే ఆ పార్టీ అధినాయకుడి కులానికి చెందినవారంతా కట్టగట్టుకొనిమనకులంఅభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసిఓడించిన సందర్భాల్లో కనీసం మీ నిరసననైనా తెలపగలిగారా? తెలుగుదేశం హయాంలో కాపు జనాభా అత్యధికంగా గల జిల్లాలో సైతం అన్ని పదవులు కమ్మవారికే కట్టబెట్టినప్పుడు మీరేం జేశారు?

ఇక కాంగ్రెస్ హయాంలో ప్రతి చిన్న పదవి రెడ్లకే కేటాయించడం పట్ల మీరు ఏమని ఆలోచిస్తున్నారు? గుంటూరు జిల్లాలో ఆ పార్టీలోని కమ్మ ఎం.పి. తన కుమారుడికి పదవి రాలేదన్న కారణంతో తన మొత్తం కులానికే అన్యాయం జరిగిపోయిందంటూ గోలపెట్టి అధిష్టానం దగ్గర పంచాయితీ జరిపించి తన కుమారుడికి పదవీకాలంలో సగం వంతు సాధించుకోలేదా? ఆ జిల్లాలో అధిక సంఖ్యాకులుగా వున్న కాపు కులం ఈ విషయం ఏమి చేసింది?

మన పొరుగున వున్న తమిళనాడులో కమ్మవారు "వడుగన్" అని కులం రాసుకొని బిసి ప్రతిపత్తి అందుకొనడం వాస్తవం కాదా? ఆ రాష్ట్రంలో కమ్మవారందరూ ఆర్థికంగా, సామాజికంగా అగ్రహసనాధిపత్యం వహిస్తున్నందున ఆ "వడుగన్" కులాన్ని బిసిల నుండి తొలగించడానికి ప్రయత్నిస్తే ఆ రాష్ట్రంలోని కమ్మవారంతా ఏకమై అదే జరిగితే

కులం పట్ల మీ బాధ్యతెంత?

కాపు మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎం.పీలు, అధికార్లపై రాష్ట్ర కాపునాడు ఛైర్మన్ మిరియాల వెంకట్రావు శరసంధానం

జిల్లాల నుండి తమ సమస్యలను విన్నవించుకోవడానికొచ్చే కాపు కులస్థుల పట్ల కాపు మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎలా స్పందిస్తున్నారు?
ఎలాంటి బాధ్యత వహిస్తున్నారు?
కులానికి న్యాయం జరిగే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కులం దిక్కుమాలిపోయిందన్న భావన సామాన్య కాపుల్లో పుట్టడానికి కారణమేమిటి? కులంలో పుట్టినందుకు మీ వంతుగా మీరేం చేస్తున్నారు?

అధికారంలోకి వచ్చిన మంత్రులు, ఎమ్మేల్యేలు, పార్లమెంటు సభ్యులు, అధికార్లు కులం ప్రమేయం లేకుండానే తమకీ పదవులు వచ్చాయని భావిస్తున్నారా? ఆ కులానికి మీ వంతుగా మీరేమి చేస్తున్నారో ఎన్నడైనా ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా? ఇతర కులాలలో వున్న అధికారులు తమ కులం కోసం, కులం వారి కోసం ఎన్నో విధాల సహకరిస్తూ వుంటూనే ఆ కులాలు అభివృద్ధి సాధిస్తున్నాయన్న సత్యాన్ని మీరెన్నడైనా గమనంలోకి తీసుకుంటున్నారా?

కాపు కులస్తులు ఏమైనా సమస్యలతో సతమతమవుతూ మీ వద్దకు వస్తే వారి పట్ల మీరు వుదాశీనంగా వ్యవహరిస్తున్నారనే భావం కాపు కులస్తుల్లో నెలకొనివుండడానికి మీ ప్రవర్తన కారణం కాదా? అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికార్లు కూడా మన కులస్తులు వారి గుమ్మం ఎక్కితేనే వారికేదో ప్రమాదం ముంచుకొస్తుందని భయపడుతున్న మాట వాస్తవం కాదా?

మీకు టిక్కెట్టు రాకపోయినా, పదవి రాకపోయినా కులానికి అన్యాయం జరిగిందన గగ్గోలుపెట్టే మీరు పదవులు అందిపుచ్చుకొన్న తర్వాత కులం సంగతి పట్టించుకొనకపోవడం ఎంతవరకు న్యాయం? కాపు కులాన్ని బిసీల్లో చేర్చడం విషయంలో మీరు ఎంతవరకు కృషి చేశారు? కాపు విద్యార్థుల స్కాలర్షిప్ విషయాల్లో జరుగుతున్న అన్యాయానికి మీరు ఏవిధంగా స్పందిస్తూ వున్నారు? దామాషా ప్రకారం కాపులకు రావాల్సిన వాటా విషయంలో మీరు ఏ విధంగా పోరాడుతున్నారు?

ఆంధ్రరాష్ట్ర జనాభాలో అత్యధిక సంఖ్యాకులుగా వున్న కాపు కులం కనీసం నోరెత్తలేకపోవడానికి కారణమేంటి? ఇక ముందు కూడా పరిస్థితులు ఇలాగే వుంటే కాపు కులం ఏమీ చేయలేదనుకోవడం పొరపాటు అవగాహన కాదా?

కాపు జనాభా ప్రాతిపదికపై మీరు సంపాదించిన పదవులు, అధికారాలు, శాశ్వతమని మీరు భావిస్తే ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ఆందోళన జరిపితే ప్రభుత్వం దిగిరాలేదా? ఆర్థికంగా, సామాజికంగా, విద్యావిషయకంగా అగ్రస్థానంలో వున్న ఆ కులం జనాభాలో అల్ప సంఖ్యాకులైనప్పటికీ సమైక్యంగా పట్టుపట్టి తమ

శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతితిష్టతి:

మాన్య మహెూదయులు, మానవతామూర్తులు, మార్గదర్శకులు కాపునాడు వ్యవస్థాపక మహా మహానుభావులు కాపుకుల బ్రహ్మ, గౌరవనీయులు శ్రీ మిరియాల వెంకట్రావు
గారికి సహృదయ సమ్మోహన సలలితరాగ సుధారసభరిత సుగంధాక్షతలతో సగర్వంగా సమర్పించు...

అక్షర కుసుమాంజలి.

మీ నిరంతరోద్యమం, అది నిక్షిప్తమైన బలిజ నిజ ఖనిజాల స్వరూపం...
మీ అనంతమైన పయనం... ఆర్తిగొన్న ఒంటరుల పాలిట ఒక వరం...
మీ పోరాటం... తెలుగునాడులో తెలగల ప్రాతినాధ్యానికై ఆరాటం...
కదం తొక్కుతూ కదిలిన మీ పాదాలు- పదం పల్కుతూ చేసిన మీ వాదాలు
అవే అశేషాంధ్ర కాపు కంఠీరవుల కంఠనాళాల్లో నిబిడీకృతమైన వేదాలు...
అందుకే మిమ్మల్ని “కాపుకుల బ్రహ్మ” అని నుతిస్తున్నాం.

"బలిజ నిజ కంఠీరవుడిగా" వినుతిస్తున్నాం.. రేపటితరాలు వల్లె వేసుకొనే తెలగల పితామహుడిగా ప్రస్తుతిస్తున్నాం... ఒక్కడై, ఒంటరై సాగి ఆగిన మీ పోరాటస్ఫూర్తి మీవారిగా, మీ వారసులుగా మేం నిత్యం స్ఫురణకు తెచ్చుకొనే కీర్తి... వాన చినుకు ఒక్కటే... అది జల్లులు పడి జడివానయై ఉధృతవరదగోదారై ఎంతటి తాండవం సృష్టిస్తుందో మీ వాగ్ధాటి, వాక్రవాహఝురీ, వాగ్ధారణీ మిమ్మల్ని ఉపన్యాసలయ బ్రహ్మని కూడా చేశాయి...

బహుశా ప్రకాశం, గుంటూరు, కృష్ణా, గోదావరుల మీదుగా ప్రస్తుతం విశాఖతీరంలో విడిది చేసినవారు కావడంతో మీరు కూడా ఆ సాగరమంత సరసగంభీరంగా కన్పిస్తారు కాబోలు. ఒక తరం నిరంతరంగా నిశ్శబ్దంగా నడిచి వెళ్ళిపోయినా, నదీపాయలాగా మీరు మాత్రం మళ్ళీ క్రొత్త ఉద్యమానికై మొగ్గ తొడుగుతారు, పోరాటానికి సరిక్రొత్త ద్వారాలు తెరుస్తారు. ఎన్ని దెబ్బలు తింటే శిల శిల్పమౌతుందో అన్ని దెబ్బలూ తింటారు. మళ్ళీ ఉలిని చేతబట్టి బండరాయిలో సైతం బలిజల ఆవేశపు అగ్నికణాన్ని వెదికి చూపుతారు. అందుకే మీ ఆలోచన మాక్కావాలి, మీ ఆవేశం మాదవ్వాలి, మీ ఆశయం మేమవ్వాలి. వెరసి మీరే దారీ తెన్నూ సృష్టించాలి.

ఆ బాట మీద బండి కట్టాలి బండిచక్రాలుగా మేం సిద్ధం!!!
నాగమనాయకుడిలోని ధీరత్వం.... విశ్వనాథ నాయకుడిలోని స్వామి భక్తి, కైవారం నారాయణుని అమరత్వం,
ద్వారం వెంకటస్వామినాయుడు వాయులీన వైదుష్యం, కఠారి కనకయ్య నాయుడు క్రికెట్బ్యాట్ వేగం,
కోడి రామ్మూర్తి నాయుడి కలియుగ భీమత్వం, తోట నర్సయ్యనాయుడి దేశభక్తి,
కన్నెగంటి హనుమంతు ధీయుక్తి, రఘుపతి వెంకటరత్నం నాయుడి సిద్ధాంతం, ఎస్వీరంగారావు కనుబొమ్మల నవరస నటనా విశ్వరూపం,
తాపీ ధర్మారావు సాహితీ సందేశం...
ఈలపాట రఘురామయ్య సంగీతరస ఝరీ.. అల్లురామలింగయ్యలోని హాస్యప్రియత్వం... మీలో మూర్తీభవించుకొన్న వెంకట్రాయమూర్తి, మిర్యాలవంశకీర్తి, కాపు, బలిజ, తెలగలకు నీవే స్ఫూర్తి...
వెలిగించవయ్య కొంగొత్త దీప్తి!!!!

ఇది ఆశీస్సు కాదు, రేపటి మన మహా యజ్ఞానికి హవిస్సు. నా కలం చేసిన నాదంలో మట్టి గుండెల చప్పుళ్ళూ వున్నాయి. మణిమయ మకుటాల దగదగలూ వున్నాయి.. రక్తాశ్రువులూ వున్నాయి, రాగరంజితాలూ వున్నాయి... కలం తొక్కే అదును, కత్తి అంచు పదునూ వున్నాయి... మేఘగర్జనా, ప్రసవవేదనా కూడా వున్నాయి.... ఆవేశంతో ఆశయంవైపు సిద్ధిస్తే, ఆలోచన మొలకెత్తితే అది మానైతే, మన కళ్ళముందే మహావృక్షమైతే మనం కాకున్నా మన భావితరాలవారైనా ఆ ఫలాల్ని నాల్గు దశాబ్దాలనాడే ఆరంభించి, అంకురించిన విత్తనమే మిరియాల!!!
ఈనాటి సభలో మిమ్మల్ని స్తుతించడంతో ఆనందమే విరియాల!!!!!
మా కోసం ఇంత చేసిన మీకు ఏమివ్వగలం?

కాపుల్ బలిజల్ తెలగల్
ఎల్లశుభంబుల్ నొసంగి ఎప్పుడు బ్రోవన్
మిర్యాల్ వెంకట్రాయా
చల్లగ వర్ధిల్లుమయ్యా సరసవిధేయా
అని అనడం తప్పు...

కళాభివందనములతో...
చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్
ఎం.ఎ తెలుగు, డిప్లొమా ఇన్ జర్నలిజం S/O ధర్మనిరత సి. సుదర్శనం
ఎగ్జిక్యూటివ్ ఎడిటర్: 'పెద్దమనుషులు' తెలుగు జాతీయ పక్షపత్రిక మదనపల్లె, చిత్తూరు జిల్లా.

మిరియాల వెంకట్రావు నాయకత్వంలో 80వ దశకంలో ఊపిరి పోసుకున్న తెలగ, బలిజ, ఒంటరి కాపు మహాసభ పోరాట పటిమతో ఉద్యమస్ఫూర్తిని నింపుకుని మడమ తిప్పని విధంగా రాజీలేని పోరాటం చేస్తూనే ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో అనేకానేక కార్యక్రమాల్ని రూపొందించి, జాతిని జాగృతపరచి ఉద్యమరూపాన్ని కలిగించిన వ్యక్తి, మహోన్నత శక్తి, వెనుకబడిన తరగతులలో మనల్ని చేర్చాలని దశాబ్దాలుగా పోరాటం చేసారు, ఈ పయనంలో కీ॥శే॥ ఆకుల శివయ్య నాయుడు, కీ॥శే॥ ఎం.ఎం.ఆర్. మాధవరావు నాయుడు, కీ॥శే॥ చిలంకుర్తి వీరాస్వామి (అంబులు), కీ॥శే॥ సంగీత వెంకటరెడ్డి, కీ॥శే॥ జక్కా వెంకటస్వామి, కీ॥శే॥ బుట్నా గోపాలకృష్ణయ్య, కీ॥శే॥ జక్కా పాపారావు, కీ॥శే॥ పుంజాల శివశంకర్, కీ॥శే॥ గాజుల నారాయణరావు, కీ॥శే॥ అనంతుల మదన్ మోహన్, కీ॥శే॥ నల్లగట్ల నరసింహులు, కీ॥శే॥ నాగలాపురం మునిశంకర్, కీ॥శే॥ బొమ్మదేవర బాబూరావు, బాడిగ రామకృష్ణా రావు, గడ్డం సూర్యచంద్రరావు, కంచర్ల కేశవరావు,తోటపార్వతీశ్వరరావు, కీ॥శే॥ ఆరణివరదయ్యనాయుడు, కీ॥శే॥ ఇంటిమునిస్వామి నాయుడు, కీ॥శే॥ దేపూరి సుబ్బరాయులు ఐఎఎస్ రిటైర్డ్, కీ॥శే॥ యాగంటి గారు ఐఎఎస్ రిటైర్డ్, కీ॥శే॥ ఉయ్యాల లక్ష్మయ్య నాయుడు, కీ॥శే॥ ఆకుల సుబ్రహ్మణ్యం, పి.వి.ఎస్. మూర్తి, మిద్దె శాంతిరాముడు, వర్ధంశెట్టి రాజారాం, డా. నాగరాజు, కంచి ప్రకాష్, ఎం. వెంకటరమణ, వి. మునిరత్నం, శాంతమ్మ, కంచి ప్రకాష్, బొడ్డు సోమశేఖర్, పూల రామస్వామినాయుడు, రాయల చంద్రమౌళి, సిరిగిరి రామాంజులు, కాసారం ఆదినారాయణ, కీ॥శే॥॥ పిళ్ళా వెంకటేశ్వరరావు, కీ॥శే॥ డా. ఎస్. వెంకటేశ్వరరావు, కీ॥శే॥ పసుపులేటి మాలకొండయ్య నాయుడు, కీ॥శే॥ నీరుకట్టు మాల్యాద్రినాయుడు, కీ॥శే॥ నీలకంఠ మునికుమార్ నాయుడు, కీ॥శే॥ పసుపులేటి విజయ కుమార్ నాయుడు, కీ॥శే॥ చిల్లగట్టు సుదర్శనం, యడ్ల నరసింహారావు, కఠారి అప్పారావు ఇలా ఇంకా ఎందరో ఎడతెగని కృషి చేశారు, నాటికీ నేటికీ ఏనాటికీ మిరియాల వెంకట్రావుగారి స్థానం చరిత్రలో శాశ్వతమైనది, సంచలనాత్మకమైనదీను. వేలకొలది సభలను నిర్వహించి లక్షలాది మందిని చైతన్యపరిచిన ఒకే ఒక్కడు "మిరియాల వెంకటరావుగారు" ఆంధ్రప్రదేశ్ హస్తకళల సంఘం అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహించి ఆ పదవులకే వన్నె తెచ్చారు, కాపుదనంతో, నాయుడు దర్జాతో దేదీప్యమానంగా వెలుగొందారు, ఈ పదవులు నిర్వర్తిస్తున్న సమయంలో 'కాపునాడు' ఛేర్మన్ హోదాకు రాజీనామా చేసి తన పారదర్శకతను తెలియజేసిన నిస్వార్థపరులు!

- చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్