Tangella Uday Srinivas

Tangella Uday Srinivas, founder of 'Tea Time' is a successful entrepreneur now entering politics through Janasena to drive growth and development. uday caste

Tangella Uday Srinivas
Tangella Uday Srinivas

Tangella Uday Srinivas Biography

Name Uday Srinivas Biography
Surname Tangella
Born 13 May 1985
Wife Tangella Bakul
Daughter Aanya Tangella
Parents Tangella Vasantha Rao, Tangella Ratna Kumari
Occupation Founder of Tea Time, and Politician (Janasena Party)
Caste Kapu

తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆయన పూర్తి పేరు. ఆయన స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కడియం. పదో తరగతి వరకు విద్యాభ్యాసం కడియం లోనే పూర్తి చేశారు. అనంతరం ఇంటర్‌మీడియట్‌ను పుదుచ్చేరిలో పూర్తిచేశారు. ఇంజినీరింగ్‌కు హైదరాబాదులోని టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో డిగ్రీ పొందారు.

తరువాత ఉద్యోగ కారణంగా దుబాయ్ వెళ్లి, ప్రముఖ ఐటీ సంస్థల్లో పని చేశారు.అక్కడ లక్షలాది రూపాయల జీతం పొందుతూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సంస్థల్లో అనుభవాన్ని సంపాదించారు. విలాసవంతమైన జీవనశైలిని అనుసరించి, ఖరీదైన జాగ్వార్ కారు, లగ్జరీ విల్లా వంటి సొంత సంపత్తిని కలిగి, అత్యున్నత స్థాయిలో జీవనం గడిపారు.

2015లో ఆకస్మాత్తుగా ఉద్యోగాన్ని రాజీనామా చేసి, స్వంత వ్యాపారం ప్రారంభించేందుకు శ్రీనివాస్ భారత్‌కు తిరిగి వచ్చారు. అయితే, అతని ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు ఎవ్వరూ అంగీకరించలేదు. కానీ, పట్టుదలతో ముందుకు సాగుతూ, వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలని సంకల్పించారు.

అలా 2016లో ‘టీ టైమ్’ అనే పేరుతో తన కొత్త వ్యాపారాన్ని స్థాపించారు. తొలి అవుట్‌లెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో, 150 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఐదు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించారు.

ఎవరూ ఊహించని విధంగా, ప్రారంభించిన ఒక్క ఏడాది లోపే ఈ వ్యాపారం తెలుగు రాష్ట్రాలను మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా విస్తరించింది. అతి తక్కువ కాలంలోనే 100 అవుట్‌లెట్లను స్థాపించాడు.

ప్రస్తుతం, హైదరాబాదులోని బంజారాహిల్స్‌లో ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఉంది. ప్రత్యేకంగా హైదరాబాద్‌లోనే 280 అవుట్‌లెట్లు ప్రారంభమయ్యాయి. అంతేగాక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 3,000 అవుట్‌లెట్లు కొనసాగుతున్నాయి.

గమనించదగ్గ విషయమేమిటంటే, మొదటి అవుట్‌లెట్‌ను మినహా మిగిలిన అన్నీ ఫ్రాంచైజీలే. కేవలం 45 మంది ఉద్యోగులతోనే రూ. 35 కోట్ల టర్నోవర్ సాధించిందంటే, ఇది చిన్న విషయమేమీ కాదు!

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టీ చైన్ వ్యాపారాల్లో ‘టీ టైమ్’ ఒకటిగా నిలిచింది. ఈ వ్యాపార మోడల్ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది పారిశ్రామికవేత్తలను సృష్టించడం శ్రీనివాస్ గొప్ప విజయంగా నిలిచింది.

శ్రీనివాస్ భార్య బాకుల్ ఆయుర్వేద వైద్యురాలు. వీరికి ఒక కుమార్తె అన్యా. భార్య ప్రోత్సాహంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఉదయ్, తన లక్ష్యాన్ని నెరవేర్చడంలో విజయం సాధించారు.

సక్సెస్ పుల్ బిజినెస్ మ్యాన్ కొనసాగుతున్న  ఉదయ్ శ్రీనివాస్.. రాజకీయాలు, ప్రజాసేవపై దృష్టి  సారించాడు. తన ఆలోచనలకు అనువుగా కనిపించిన పార్టీ జనసేన లో చేరారు. అనతికాలంలోనే పవన్ కళ్యాణ్ కు దగ్గరయ్యారు. పవన్ కూడా ఉదయ్ ఆలోచనలను ప్రోత్సహించే క్రమంలో కాకినాడ ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఇంతటి సక్సెస్ఫుల్ పర్సన్ చట్టసభల్లో అడుగుపెడితే మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం ఖాయమని పవన్ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చారని టాక్.

tea time uday srinivas | tea time uday srivivas biography | tangella uday srinivas caste | uday srinivas tangella caste | kapu community