Telaga

How came Telaga caste name? Learn about Trilinga, Telinga, Telanga, Telaga. అసలు తెలగ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోండి. Telaga History.

Telaga

Telaga caste history

త్రిలింగ పదమునుండి తిలింగ, తెలింగ, తెలుంగ, తెలంగాణా, తెలుగ, తెలుగు, తెలగ, తెలగాణ్యులు, తెలిరిగిరి మొదలగు పదాలు ఏర్పడినట్లు తెలుగు పండితులు, చరిత్రకారులు అంగీకరించారు. అలాగే తెలుంగన్, తెలుంగర్, తెలుంగతి పదాలు ఏర్పడ్డాయి. బర్మాలో తైలాంగ్, తలైంగ్ పదాలు ఏర్పడ్డాయి. టాలమి (రచయిత), ట్రెలింగాన్, టివిస్తాన్ అని తెలుగు పదము, తెలుగునాటి బలిజకాపులకు, తెలగాణ్యులు అనే పదము బ్రాహ్మణులకు, తెలగాణ్య నాయక (మెరక వీధి తెలగాలకు) తెలుగులు అంటే తెలుగు ప్రజలందరికి చెందిన జాతి వాచకము.

తెలింగ పదమునుండి ఏర్పడిన తెలుగు పదము బలిజ కాపులకు ఎందుకు వర్తించాలి? అనే సందేహము సహజము. తెలుగు నాట స్థిరపడిన తొలి నాగరికులు కావడం వలన, తొలి వ్యవసాయ నిపుణులు, రాజ్యపాలకులు, వ్యాపారులు కావడం వలన, అధిక జనబాహుళ్యము కలిగియుండుట వలన, తెలుగుదేశాన్ని 'కాపు' కాచి తెలగాలుగా పిలువ బడ్డారు. మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్, బెంగాలి రాష్ట్రాలలో గూడా దేశ పదముతో పిలువబడే మరాఠీలు, ఓండ్రులు, గుజరాతీలు, బెంగాలీలు అనే ప్రత్యేక కులాలున్నాయి. వారు గూడా ఆయా రాష్ట్రములలో ప్రాచీన పాలక కులాలు. తెలింగ పదము 'తెలగా' లకు అన్వయించుట సమంజసమే.

  1. బహుజనపల్లి సీతారామచార్యులు “శబ్ద రత్నాకరం" నిఘంటువు పేజి 1195 ప్రకారం - త్రిలింగ పకృతిపదం కాగా, తెలగ వికృతి పదం. పకృతి, వికృతి సమానార్థాలు కావున త్రిలింగ పదములనుండి తెలింగ, తెలగ అను పదాలు పుట్టాయని గ్రహించాలి. తెలింగ రూపాంతరమే "తెలగ”.
  2. ఏటుకూరి బలరామమూర్తి “ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర" పేజి-5 లో ఇలావుంది. తెలుగు ప్రజల నివాస స్థలం మొదట రాయలసీమ, తర్వాత తెలంగాణా. 'తెనుగు' క్రమంగా తెలుగయ్యింది అందులోనుండి తెలగాలు, తెలంగాణా, తెలగాణ్యులు, తెలిరిగిరి మొదలగు పేర్లు ఏర్పడ్డాయి. దీనిని బట్టి త్రిలింగ, తెలింగ, తెలగ పదాలు సహ సంబంధం కలిగియున్నాయి.
  3. టి. భాస్కరరావు "తెలుగు భాషా చరిత్ర" పేజి 94 ప్రకారం ఇలా ఉంది. క్రీ.శ. 985 సం॥ రాజరాజు శాసనములో అతనికి "తెలింగ కులకాల" అను బిరుదు వున్నట్లు తెలుస్తుంది. ఇచట తెలింగ అనే పదము కులపరంగా ప్రయోగించారని నిర్ధారణ అయ్యింది ఆ తెలింగ పదము అని గ్రహించాలి. (కాబట్టి రాజరాజ చోళు డు తెలగ కులస్థుడని తెలుస్తుంది).
  4. లకంసాని చక్రధరరావు రచించిన "తెలుగు భాషా చరిత" (తెలుగు - ఎం. ఎ మెటీరియల్) పేజి 26 ప్రకారం త్రిలింగ పదమునుండి తెలుగ, తెలగ, తెలుంగ, తెలుగునాడు మున్నగు పదాలు పుట్టాయని తెలుస్తుంది. దీనిని బట్టి త్రిలింగ పదమునుండి తెలింగ పదం ఏర్పడి “తెలగ" గా రూపాంతరం చెందింది అని గ్రహించాలి. “రేప” లోపించి "ఇ" కారం "ఏ" కారంగా మారిందని కనుక త్రిలింగ తెలింగ అయినదని తెలిపారు.
  5. అంబటి వెంకటప్పయ్య 'శ్రీకృష్ణ భారతం' 8వ పేజిలోని పద్యము సంఖ్య-37 ప్రకారము “తుర్వసుని వంశీయులు అన్ని ప్రాంతాలలో వ్యాపించగా తెలుగు ప్రాంతమున నివాసము వున్నవారు మాత్రం ప్రాంతాన్ని బట్టి తెలగాలు అయ్యారని తెలిపారు. ఈ అంశాన్ని ఆ గ్రంథము అభిప్రాయములో కొండవీటి వెంకటకవి గారు అంగీకరించారు.
  6. ఏటుకూరి బలరామ మూర్తి "ఆంద్రుల సంక్షిప్త చరిత్ర" పేజి 91 ప్రకారం "వెలనాటిని పాలించిన వారిని వెలనాటి చోళులని, తదితరులను తెలుగు చోడులని చరిత్రకారులు వ్యవహరిస్తున్నారు. కాని వాస్తవానికి అందరూ ఒకే కుదురు నుండి ప్రారంభమైన చతుర్వర్ణ వంశస్థులే తప్ప వేరుకాదు. వీరందరికీ కాలక్రమేణా తెలగాలు లేక (బలిజ) కాపులు అను పేరు స్థిరపడింది.
  7. జె. దుర్గాప్రసాద్ “ఆంధ్రుల చరిత్ర" ప్రథమ భాగము పేజి 66, ప్రకారం క్రిష్ణానదికి దక్షిణముగా ఉన్న ప్రాంతం వెలనాడు, ఈ వెలనాడును పాలించిన చోడులు తాము ‘దుర్జయ కులజులమని’, చతుర్థాన్వయులమని, చెప్పుకున్నారు. వీరంతా శూద్రులే! కాలక్రమేణా వారంతా కాపు (తెలగ) లయ్యారు. ఇంకా పేజి 69, ప్రకారం తెలుగు భాషకు అధికారిక ప్రతిపత్తిని కల్పించి ప్రోత్సహించినది రేనాటి చోళులే! ఈ రేనాటి చోడ కుటుంబాలలో, పొత్తపికొణి దెన, నెల్లూరు చోళులు ముఖ్యంగా పరిగణించదగిన వారు. తెలుగు చోడులలో నన్నూరు చోడులని మరొక శాఖ కన్పిస్తుంది. (తెలుగు చోడులే తెలగాలు).

దీనినిబట్టి తెలగాలు, స్థానిక ప్రభువులని, తెలగాలు దక్షిణ భారతదేశ క్షత్రియ బలిజలు ఒకే వంశీయులని వీరు తెలుగు భాషా పోషకులని విశదమవుతుంది. కానీ తెలుగు ప్రాంతానికి, తెలగాలకు, తెలుగు భాషకు, ప్రత్యేక సంబంధముంది. వారు తెలుగు భూమిపుత్రులు, తొలి తెలుగు శాసనం “రేనాటి ధనుంజయ చోడునిదే" అని పరిశోదకు లంటారు.

త్రిలింగ పదం నుండి క్రమంగా 'తిలింగ, తెలింగ, తెలంగ తెలగ రూపాలు ఏర్పడినవని గ్రహించాలి. కాపు, తెలగ, బలిజ, ఒంటరి అనువారు తెలగాలలో వేరు వృత్తులు చేస్తూ వివిధ ప్రాంతాల ఆ నామములతో పిలువబడే ఒకే కులస్థులు. ఆనాడు ఈనాడు వీరిమద్య నాడు నేడు వివాహ బంధుత్వాలున్నాయి అని గ్రహించాలి.

ఆంధ్రజ్యోతి దినపత్రిక - ఆర్.వి.ఆర్. నాయుడుగారు.

తెలగాలు :

1927వ సంవత్సరం జూన్ నెల 16,17,18 తేదీలలో శ్రీముఖ లింగమున జరిపిన “కళింగ వర్థంతి” మహాసభా సమావేశమునకు ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీశ్రీ విక్రమదేవ వర్మ జయపుర మహారాజుగారు తమ ఆహ్వాన సంఘాధ్యక్షోపన్యాసము నిట్లునుడివిరి.

కళింగరాజయిన చిత్రాంగదుని కూతురును దుర్యోధనుడు పెండ్లాడినట్లు మహాభారతమున శాంతిపర్వమున నున్నను, మీద ను దాహృతమైన “అంగ, వంగ, కళింగేషు" అను శ్లోకమును బట్టి కళింగదేశము పవిత్రమైనదనియు నందున యాదిమ వాసులు పతితులుగను, మ్లేచ్చులుగా నెన్నబడుచుండిరనియు దోపక మానదు. అట్టి యాదిమ వాసులలో “నోండ్రులు” అను నొక తెగ వారిప్పటికిని గలరు. వారు తెలివి గలిగిన కృషికులును, శూరులునై సర్వవిధముల “తెలగాలను" బోలియుందురు... ఓండ్రులును బట్టి యోండ్ర దేశమేర్పడినట్లే “తెలగాలను” బట్టి తెలగ అనే పేరు వచ్చింది.

- కళింగదేశ చరిత్ర, శ్రీరాళ్లబండి సుబ్బారావుగారు

తెలుగు నాయకులు కోలను, సరసీపుర మాండలీకులు లేదా (సరోనాదులూ)

సరోనాథస్ లేదా కొలను మాండలీకులు మూడు శతాబ్దాల పాటు సరసిపుర అంటే ఆధునిక ఎల్లూరు (పశ్చిమ గోదావరి జిల్లాలో) రాజధానితో కొలను విషయాని పాలించారు. ఈ రాజవంశం విశిష్ట యోధులు మరియు నిర్వాహకులు అయిన పది మందికి పైగా రాజులను కలిగి ఉంది మరియు కోనమండల కోన హైహయ రాజ్యం వలె రాజ్యం సుదీర్ఘ జీవితకాలం కలిగి ఉంది. సాధారణంగా కొలని లేదా కొలని మండలిక అనేది పాలకుల పేర్లకు ఉపసర్ల ఉంటుంది. సరోనాథులు వేంగి చాళుక్యులు, చాళుక్య చోళులు, కళ్యాణి చాళుక్యులు మరియు కాకతీయులకు వేర్వేరు సమయాల్లో విధేయత చూపారు, అయినప్పటికీ అన్ని అంతర్గత ప్రయోజనాల కోసం స్వతంత్రంగా ఉన్నారు. వీరిని తెలుంగునాయకులు లేదా తెలుగు నాయకులు అని కొందరు రచయితలు పిలుస్తారు, బహుశా తెలుగు భీముని తర్వాత . వారి రాజ్యం గణపతి ఆధ్వర్యంలో కాకతీయుల చేతికి చిక్కింది మరియు వారి స్థానంలో రెండవ కొలను రాజవంశం-తెందులూరి కుటుంబం వచ్చింది. కాకతీయులకు విధేయుడైన రెండవ కొలమె రాజ్యం 14వ శతాబ్దం AD లో కాకతీయ రాజ్యం పతనం వరకు కొనసాగింది. మరియు దాని పాలకులు ముఖ్యమైన రాజకీయ విజయాలను పొందారు.

కొలను రాజవంశం యొక్క మొట్టమొదటి సభ్యుడు బాలాదిత్య లేదా చోళాదిత్య లేదా భటాదిత్య. అతను గొప్ప విలుకాడు మరియు రామ మరియు అర్జునుడితో సమానం. అతని కుమారుడు నృపకామ అమ్మ ॥ సేవలో ఉన్నందున, బాలాదిత్యను AD 900 మరియు 945 మధ్య తాత్కాలికంగా ఉంచవచ్చు, బహుశా అతను వేంగి చాళుక్యుల సేవలో ఉండవచ్చు. నృపకామ, గొప్ప ఆర్చర్ మరియు ఫైటర్. అతను తన కత్తితో ఒకేసారి ఐదుగురు హీరోలను చంపాడని చెబుతారు. అతను, చాళుక్యుల రికార్డులలో, సరోనాథ సరస్సు జిల్లా ప్రభువుగా ప్రత్యేకంగా పేర్కొనబడ్డాడు. నృపకామ 10వ శతాబ్దం AD రెండవ భాగంలో నివసించారు మరియు అతని కుమారుడు గండనారాయణ, మరియు కుమార్తె అమ్మ యొక్క రాణి. కావున వీరు చాళుక్యుల వియ్యంకులు కొలను విషయం వీరికి ఎలా వచ్చిందో తెలియలేదు. బహుశా అతను చాళుక్యుల యుద్ధాలలో వారికి చేసిన సేవలకు ప్రతిఫలంగా దానిని పొంది ఉండవచ్చు. నృపకామ మరియు రాణి నయమ్మాంబ కోరికపై, రాజు అమ్మ ॥ బ్రాహ్మణులకు వెంగినాడువిషయంలో గుండుగోళాన్ని మంజూరు చేసింది.

భీముని తిరుగుబాటు అతనిపై చోళులు మరియు వారి అనుచరుల ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది మరియు కొలను రాజ్యానికి వినాశకరమైనదిగా నిరూపించబడింది. భీముడు మరియు అతని పిల్లలు చంపబడ్డారు మరియు కోలను విచ్ఛిన్నమైంది .యాదృచ్ఛికంగా కొలను భీముడు కోట భీముని నుండి వేరుగా ఉన్నాడని మరియు కొంతమంది ఊహించినట్లుగా గుర్తించబడలేదని మనం గమనించవచ్చు.

కాటమ దండనాయకుని శాసనములలో కాని, ఈతని సంతతివారి శాసనములలోని వీరు
ఎవర్ణమునకు చెందిన వారో చెప్పియుండలేదు. కాని, ఈ కొలనినాయకుల పేరులు కేశవ దేవరాజు, సోమయ దేవరాజు, ఎఱగయ దేవరాజు, మంగయ దేవరాజు అని దేవరాజ పదాంతము లగుటచేత ప్రాయికముగా వీరు క్షత్రియులై యుందురని తోచుచున్నది. వీరి శాసనములు పశ్చిమ గోదావరి జిల్లా లోని ఇప్పటి ఏలూరు, తణుకు, అత్తిలి, భీమవరము తాలూకాలలో కానవచ్చుటవలన ఈ ప్రాంత మంతయు కొలని మండలికుల అధికారముక్రింద ఉండినట్లు నిస్సంశయ ముగా చెప్పవచ్చును. వీరి శాసనములు వేనిలోను వీరి వంశానుక్రమము కాని, సంతతి క్రమముకాని, వర్ణితము కాకపోవుటవలన ఈ కొలని నాయకులకు పరస్పరము కల సంబంధము తెలియవచ్చుట లేదు.

కొలని సరొనాదులకు పూర్వచాళుక్య వంశజులకును, కోనమండలాధిపతులైన హైహయ వంశ్యులకును సంబంధ బాంధవ్యములు కలవు. వెరివాటి రెండవ గొంకరాజు మృతినొందుటను, పూర్వ చాళుక్యులు పిఠాపురమున స్వతంత్ర రాజ్యము వెలకొల్పు టను చూచి ధైర్యము వహించి కోన హైహయ భూమీశులు స్వాతంత్ర్య పతాక నెత్తిరి. కోన హైహయ రాజన్యులతో పాటు పరపీపురము రాజధానిగా పరిపాలించుచుండిన కొలని నాయకులును, కోన హైహయులకు బంధువులయి ఉండిపురము రాజధావిగా పాలించుచుండిన క్షత్రియులును కూడ వెలనాటి చోడరాజులపై తిరుగబాటు చేసిరి. కోలని ఇంటిపేరు గల రెడ్డి తాను మనుమ కులస్తుడిగా శాసనం వేయించాడు.

వీరిలో తెలుగు బీయునికి తెలింగ వీమన్ అని పిలవబడేవారు, వీరు చాళుక్య ,కోనవంశీయులతో వివహ బందాలు ఉన్నాయి... వీరు తెలగ నాయకులు.

  1. కోలని కాటమ నాయకుడుగా
  2. కోలని సోమయనాయకుని సానయ అనీ పిలిచేవారు
  3. కోలని సోమయదేవ బార్య ఎరుకమదేవి ఎరుకసాని
  4. కోలని కేసవదేవుడు, కేశవదేవుని కుమారుడు స్వామి నాయకుడు
  5. కేసవదేవుని సోదరి తంటసాని,
  6. కేసవ దేవుని అతని ముగ్గురు కుమారులు పాత, సోమయ, కొమ్మయ
  7. మంగయదేవ (మన్మ), యరగయదేవరాజు తరువాత తరాలవారుతరువాత వీరు రాజ్యం కాకతీయుల చేతిలో కోల్పోయారు
  8. కొలని గండనారాయన కూతురు చాళుక్య అమ్మ 2 ఓక్క బార్య చాళుక్యుల బందువులు

తెలగాల ములం కోలను సరోనాద ఇండ్లపేర్లు

  1. సరసీపురవారు : కాపు తెలగాలలో ఉన్నారు.
  2. కోలనువారు : కాపులలో తెలగాలలో ఉన్నారు.
  3. భీముడువారు : భీమ వారు కాపు తెలగాలలో ఉన్నారు.
  4. సోమనవారు : సోమయ వంశీయులు
  5. కాశిందేవులవారు కేసవదేవుడు వంశీయులు
  6. పోతనవారు: పోతయ వంశీయులు
  7. కొమ్మనవారు కొమ్మన వంశీయులు
  8. మంగినవారు: మంగన వంశీయులు
  9. గరగరాజువారు: యరగదెవరాజు, యరుగరాజు
  10. కొల్లేరువారు: కాపులలో ఉన్నారు.. (చోళవంశము ఉంది)
  11. మాండలిక వారు. కోలను మాండలీకులు నామం
  12. స్వామినీయుడు వారు: స్వామీనీడు వంశం వారు ( చోల వంశ స్వమినీడు ఉన్నారు)

The relationship of Somanayaka to his predecessor Katamanayaka is not known. He was the first Saronatha to bear prasasti. His earliest inscription is from Ganapavaram dated A.D. 1151. The two records at Ganapavaram dated A.D. 1165 and the 20th year of Rajaraja respectively may belong to his reign. Sanaya's next inscription is from Palakal dated A.D. 1192, mentioning Kesavadeva. In the record of A.D. 1194, Erakamahadevi, the queen of mahamandalika Somanayaka, figures as the donor. Sonaya's last record is. from Ganapavaram dated A.D. 1195 mentioning him as Kolani mandalika Somayaraju.

palakol Inscription dated A.D. 1212 mentions him as the ruler of the country from the Himalayas to the Ocean and a destroyer of enemies, and his son Pota, the lord of Varijakarapura. Kesava's record from Nattaramesvaram dated A.D. 1218 mentions his two sons-the eldest Kommayakumara and Somaya kumara, besides Potaya. The next record is from Elurpadu dated A.D. 1228. In one of his record from Palakol dated A.D. 1229, Kesava is mentioned as Dharani valayamkudukesava. His last record is from Palakol dated A.D. 1233.

During the decade from A,D. 1233 to 1243 nothing is known about the Kolanu kingdom or its rulers. It is not possible to see the circumstances that prevented the sons of Kesava from succession to the throne. In A.D. 1243, maha-tnandalesvara Kolanimandalika Mangayadevaraja figures in a record from Ganapavaram. His relationship to Kesava or his sons is not apparent. His rule may have lasted up to A.D. 1260– the earliest date for his successor Yeragayadevaraja.

The Second Kolanu dynasty―The Inulure Family

రెండవ కోలను వంశం ఇందులూరి కుటుంభం

వీరు కాకతీయుల వియ్యంకులు

  1. గౌరయ ఇందులూరి వంశ ఆద్యుడు అతని కుమారులు ఇద్దరు పెదమల్ల, పినమల్ల.
  2. పెదమల్ల కుమారులు సోమ, పేరగన్న, రుద్రమదేవి సేవకులు ఈ సోముని వలనే ఈ వంశం కోలనువీడుని పాలించింది సోముని కుమారుడు మనుమగండ రుద్రమదేవి ఉండనాయకుడు.
  3. మనుమగండ అతనికి ముగ్గురు కుమారులు- రుద్రదేవుడు, ఇరుమోది మరియు ముమ్మడి .
  4. కోలని బొమ్మ సోదరుడు పెదగన్న కుమారుడు రుద్రదేవుడు మరియు అన్నయ ప్రతాపరుద్రుని మంత్రులుగా ఉన్నారు వీరు మోపూరీ చోలులని ఓడించి రాచవుత్తమల్ల బిరుదు పోందారు..

అన్నయ గజపతులను ఓడించి తన బందువులను 72 కోటలలో నియమించాడు.

  1. అతను గన్నయేంద్రుని కొలనివీడు మరియు ఇతర కోటలలో ఉంచాడు;
  2. రాజమండ్రి రేవణ్ణ కోటలో పర్వతమల్లని ఉంచాడు.
  3. నూజెళ్లలో మన్మ గన్నయ్య అల్లుడు మంగిరాజును ఉంచాడు.
  4. అన్నయ్య రుయ్యంబ రుద్రమ (దత్తతు) కుమార్తెను వివాహం చేసుకున్నందున కాకతీయుల రుద్రమదేవికి అల్లుడు.
  5. కోలని గణపతి కుమారులు ముగ్గురు అన్నమరాజు (దేవుడు), ఆదిమూల, రుద్ర, ఇద్దరు కుమార్తెలు మల్లంబిక, గౌరమ
  6. ఆదిగణపతి తన శివయోగేశ్వరుడిని అంకితం చేసిన గురువు ఇందులారి నక్కనారాధ్యదేవుని కుటుంబం నిడదవోలు తూర్పు చాళుక్యుల సేవలో ఉంది మరియు కాకతీయులు మరియు కొలను పాలకులతో వివాహ ఒప్పందాలు చేసుకుంది.
  7. జెబల విశ్వనాద గనపతి సోదరుడు

తెలగాలైన కోలను సరొనాదులను అనిచివేసి, ఇందులురి కుటుంబాన్ని కొలను ప్రాంతం మాండలీకులుగా నియమించారు. అదే రెండవ కోలను వంశం.

ఇందులూరి కోలను వంశ ఇంటిపేర్లు

  1. పెదమల్లవారు : నేడు తెలగ కాపులలో ఉన్నారు పెదమల్లుడు వీరి మూలపురుషుడు
  2. వెలగంవారు: చినమల్ల గోత్రీకులు, పినమల్లుడు పెదమల్లని తమ్ముడు
  3. నాదెండ్లవారు: చినమల్ల గోత్రం ఊంది
  4. బోమ్మవారు : కోలని వంశ బోమ్మ వీరి మూలపురుషుడు
  5. రాచమల్లవారు: రాచవుత్తమల్ల దిరుదు అన్నయకు ఉంది
  6. ఆదిమూలవారు: అదిమూల కొలని గణపతి కొడుకు ఆదీమూలగా పిలువబడేవాడు
  7. మట్టావారు : ఆదిమల్ల గోత్రం ఉంది.
  8. నక్కా (నక్కనవారు) : కాపూ తెలగాలలో ఉన్నారు నక్కనరాద్యదేవుడీ వంశం
  9. రుద్రనవారు : రుద్రుడు వీరి మూలపురుషుడు (లేదా రెచర్ల వంశం)
  10. ఇరుమల్ల: ఇరుముది మనుమగండ కుమారుడు.
  11. విశ్వనాదులవారు : కాపులలో ఉన్నారు. ( రేచర్ల వంశము ఐయి ఉండవచ్చు)

వీరు బ్రంహ వంశీయులని చేబుతున్నా వీరు, కాకతీయులతో వివాహ సంబందాలు కోనసాగించి రేచర్ల రెడ్లకు లోబడి క్షత్రియ కాపులలో చేరారు…

బ్రంహ వంశము అనగా బ్రహ్మణులు అని కాదు క్షత్రియత్వం స్వీకరించి క్షత్రియును వివాహమాడిన బ్రహ్మ వంశ క్షత్రియలు బ్రంహ వంశ శాసనం బలిజలకు ఉంది. ఓకసారి క్షత్రియులతో వివాహ సంబంధాలు మెదలయ్యాక కొంత బందుగనం ఆ కులంలో చేరిపోవడం సాదారనం. బ్రంహనులు అనేకులు క్షత్రియులలో చేరారు. అప్పాపంతులు వారు, బీసబత్తుడు వారు అను కాపు వారు బ్రంహ వంశ క్షత్రియులే!

కాకతీయ స్త్రీ సంతానాలైన కోట, విరియాల,వర్థిచోళ, చాళుక్య వాంశాతో పాటు రెండో కొలను వంశం కూడ కాపులలో ఉంది.

None gaurya, the lord of Indulur had two sons Pedamalla and Pinamalla (?) both in the service of Rudradeva of the Kakatiyas. Pedamalla had two sons-Soma and Prelaganna, of whom Soma was in the service of Rudradeva of the Kakatiyas. Pedamalla had two sons-Soma and Pedaganna, of whom Soma was in the service of Ganapati of the Kakatiyas. The political achievements of Soma were remarkable. At the head of vast armies, Soma conquered the tracts to the east of Warangal, took Gopulanadu and Kolanuvidu fortress, crossed the Gautami coquered the two Modes, twelve manniyas and parts of Kalinga. As he drove off, the lords of Kolanu and made it his own, he came to be known Kolani Soma. This the Induluri ehief who came possession of Kolanu was Soma. From that time Kolanu became the family name instead of Induluru.

Manma ganna, the son of Soma was a general-dandadhinatha in the reign of Rudrama, and had three sons—Rudradeva, Irumodi and Mummadi. Rudradeva and Annaya, the son of Peda Ganna, the brother of Kolani Boma, were the ministers of Prataparudra These two ministers always acted together and their victories were great. They conquered the kings of Mopur and took the title Rachauhattamalla captured many forts-sthala, Jala, giri and vana, Vanquished the Muslims, and protected the fort of Prataparudra The kings of Mopur were probably some Telugu chola princes, who were subdued during the Kakatiya conquest of the Renadu. The victory of Annaya over the
musins was evidently on one of Muslims was evidently on one the many occasions of the Muslim attacks on Warangal in the reign of Prataparudra. During the first Muslim invasion into the Telugu Country as under the lead reign of Prataparudra. During of Malikkapurthe general of Alauddin Khilji.

Annayo rule-Annaya ruled the country from the eastern gate of waranges to Simhadrisima, i.e. the tracts about Simhachalam. His titles were-Gajapatigajasimha, mururayarajagadadiganda, Jagamartyaganda, Sambetangaya, Kaliyugabhima, Mandalika and Rayachauhattamalla. Annaya claims to have Vanquished Gajapati the king of Kalinga, killed the Panchapandyas, and taken Olacherla and Suravaram in Vengi. He kept his relatives as rulers in seventy two forts, He placed Gannayendra in Kolanividu and other forts; Parvatamalla, hras brother-in-law in the fort at Rajahmundry Revana, the son-in-law of Manma Gannaya and Mangiraju in Nujella. Annaya was the son-in-law of Rudramadevi of ther Kakatiyas as he married Ruyyembaner (adopted) daughter.

Rudra bore the epithets-Chauhattamalla. Iruvattuganda, and the conqueror of the Panchapandyas-Vira, Marva, Sundara, Vikramesa and Ballaha. He is mentioned as the lord of the seventy—two forts (Bahattari durgas) of Prataparudra. A record of Rudra is dated A.D. I326. He had two sons-Ganapati and Aubala. Nannayamba, the wife of Ganapati was the daughter of Appayabatya and Grand-daughter of chamaraja Entitled Chauhattamalla; Kolanu Ganapati had three sons Annayadeva. Rudra, Adimula, and two daughters, Mallambika and Gaurama who were married to Bacherla Dochana and Nagaya respectively.

Aubala, the brother of Ganapati married Kommamambika the daughter of Visvanatha. Adimula, the son of Ganapati married the daughters of his uncles and by Elambika had Adiganapatideva. Perhaps Adiganapati was the last rule over Kolanu as no sons and successors of him are heard of.
The family of Guru Indulari Nakkanaradhyadeva to whom Adiganapati dedicated his Sivayogesvara, was in the service of the Eastern Chalukyas of Nidadavole and contracted alliances of marriage with the Kakatiyas and the Kolanu rulers.

కోన సూర్యవంశ హైహయ పసుపుల వంశము కాపు తెలగాల మూలపురుషు వంశాలలో ప్రదాన వంశము

కోనవారు హైహయ వంశీయులు కోనమండలాన్ని పాలించారు. కొల్లేరు చోళ,మల్యాల ,వంశాల వియ్యంకులు, సరోనాదుల పక్షంవారు)

  1. కోనవారు: కోన వంశ జమీందారులు కాపు తెలగాలుగా ఉన్నారు.
  2. గోనవారు: కోనవారే గోనవారు, కాపులు
  3. గోనివారు: పసుపునూళ్ళ గోత్రీకులు
  4. పోతనవారు : కోన పోతన వీరి మూలపురుషుడు (లేదా కొలను పోతన)
  5. భీముడు / బీమ వారు: కోన భీముడు లేదాసరోనాద తెలుగు బీయుడు వీరి మూలపురుషుడు
  6. మహీపతివారు : కోన మహీపతి వంశీ మూలపురుషుడు
  7. మహిపాల వారు: మహీపాలరేడు వీరి మూలపురుషుడు కొప్పుల నాడు పాలించారు
  8. పోతిరెడ్డివారు: పోతరెడ్డి తల్లయరెడ్డి వంశీయులు పోతిరెడ్డిగ్రామం నిర్మించనున్నారు బలిజలు.
  9. మల్లిన వారు: కోనవంశ మల్లిన సోమినాయుడు వంశమువారు మల్లారెడ్డి లేదా మల్లిన వారు కాపులు.
  10. పసుపులవారు వారి వంశం నామాన్నే ఇంటి పేరుగా కలవారు కాపులు
  11. కోటారెడ్డివారు : గోన కోటారెడ్డి తెలగకులస్తునిగా చెప్పుకున్నారు
  12. గుండ్రెడ్డివారు: కోన సోదరులలో ఒకరు కాపు తెలుగువారు
  13. బిరుదువారు: మదురు రాజకులసబకు విచ్చేసారు కాపు తెలగాలు
  14. చాగివారు: అను గ్రుహనామము కొనవంశీయులకు ఉంది
  15. దంగేటివారు: కోనవారి స్త్రీ సంతతువవారు
  16. దాసరి వారు: పసుమల్ల గోత్రీకులు కాపు తెలగాలు పసుపులవంశానికే పసుపుమల వంశం అని పేరు.
  17. జగతవారు: పసుమల్ల గోత్రీకులు
  18. జౌనేపల్లివారు: గోన గోత్రీకులు
  19. పెద్దగోవిందువారు: గోని గోత్రీకులు
  20. జలజలవారు: గోని గోత్రీకులు
  21. పిసెట్టివారు : గోని గోత్రికులు
  22. రాజానాయనివారు: కోనవంశీయులు రాజానాయుని వంశీయులు
  23. నూలువారు : బుద్ధన గోత్రీకులు బద్ధన మూలపురుషుడు
  24. గుండె వారు: పశునోళ్ళ గోత్రీకులు

వీరంతా ఒకే వంశ పరంపరలోని మూలపురుషుల వంశాలు ఇదే వంశాలు కొన్ని రెడ్డి, వెలమలలోను ఉన్నాయి.

Note: పసుపుల పసుపునూల్లగా, డెబ్బదుల దబ్బనూళ్ళగా,పోగునాడు పోగునుళ్లగా, పల్లవల్లగోత్రం పాలవల్లి గోత్రంగా, పెనుగోండల గోత్రం పెనుగునూళ్లగా ఉచ్ఛారణ మారింది గమణించండి.

బలిజ,కాపు, తెలగాలలోని కోనవంశ, పసుమల్ల ,పసుపుల, పసుపులేటి,పసుపునూళ్ళ, గోత్రీకులు వారిఇండ్లపేర్లు.

ఆత్మూరి , బండారు దాసరి, దిండు, గండం గోవిందు, కురిటి, కోత్త పాలెం, సీలం, సింగంసెట్టి తోట, యాదగిరి, యర్ర, యడ్ల, ఆవుల, అబ్బూరి, ఎలుగుల అంబటి, బూపతి, చలంసెట్టి చిన్ను, గోపరాజు, జగత, హరిదాసుల , గవిని, కొచ్చర్ల, కంబంమెట్టు, కొనతం, కుప్పాల మనికోండ , ముత్యాల, నాసం, నాయుడు, రాచమల్ల, సుంకర 5 సోమిసెట్టి , సుసర్ల, తాటివాక తిరుమలసెట్టి, వల్లేటి, యాతంసెట్టి. కోనవారి స్త్రీ సంతానాలకు కూడా పసుపుల గోత్రం వచ్చే అవకాశము ఉంది.

కాపు వంశ గోన పసుపుల వంశము సూర్యవంశముగా ప్పబడిన బూదవాడ శాసనం -1

శ్రీవరాహరహస్సత్వం శ్రీవరాహ జగత్ప్రభో రక్షతాదుద ధరంత రక్షతాక్షి ప్రమంబుతత్ శ్రీమన్ మల్యాలవంశేశశి కరనికరాందోళనోన్మీలన శ్రీ మిశ్రీభూతప్రభూత ప్రకట పటునటత్మీర్తి వల్లీవితానః ఆసీదాశీరలూనావళి మిళితల సత్సంపదున్మేషభూషా వేషశేషాభిరామఃక్షితితల తిలకోగుండ దండాధినాథః. శ్రీసూర్యవంశనిజశేఖర బుద్ధయాఖ్య పుత్రీపవిత్ర చరితాభరితాగుణఘైః శృంగారసారకరణి:కరణీయదక్షాకుప్పాంబికా జనిచతస్యసతీకళత్రం! లక్ష్మీనారాయణాఖ్యం జలశయన మధుశూన్యశయ్యాభిధానం సానంతారుంధతీయ వ్రతమ సితచర ద్వాదశీ సువ్రతంచ కల్పోక్తం తచ్చతచ్చప్రథిత కులవరస్తోమసీమంత భూషా కూపా ఆపాది వాపిసహితవనతడాగ శ్రీముకుంద ప్రతిష్టా భూదానం భూరిదానం రథతురగ సదా దానమన్న ప్రదానం గోదానంగేహదానం వివిధవరపథీ దానమంబు ప్రదానం తద్వద్వృత్త ప్రదానందిశివిదిత మహాదాన మన్యచ్చసర్వం కుప్పాంబాకల్పవల్లీముహురకృతసదాం వర్యశయ్య ప్రదానం శాకట్టేవసునంద శంకరమితే శ్రీధాతృసంవత్సరే మాఘమాసిసితే ధర్మదివసేవారే వాచాంపతేః కుప్పాంబాపతి సంజ్ఞయాకృతముదాలింగాం ప్రతిష్ఠామహత్ క్షేత్రంతుల్య మతుల్య

రత్నపిహితాలంకారమస్మెదదౌ|| శ్రీం శరాసనాధి కరణే కర్ణాటమాన్యోజనః వీరంమన్యసమాజ సేవణపతేస్సం గ్రామరంగ స్వహాం ధాటీలాటవృపాట వీమను దినం గంతుంమతింమాభవే ద్యుద్యద్గుండయదండ నాధవిలసద్దోర్వివ మైర్నిష్క్రమ ॥ శ్రీసూర్యకులదుగ్ధాబ్ధిజాతాసహజ చంద్రికా శ్రీరేవ శ్రీపతేర్యస్యప్రేయసీ కుప్పమాంబకా శాకాబ్దేశశిదంతి శంకరమితే సిద్దాద్రి సంవత్సరే చైత్రేమాసిసిత త్రయోదశతి ధౌవారే గురోశ్శోభనే నిర్మాయోత్తమ బూదపూరినకటే సోయంతటాకంవరం బాచాంబాభిధయాంకితం తమకృత శ్రీగుండ దండాధిపః ||

అర్ధం:

సూర్యవంశజుఁడు బుద్ధరాజనుచు మొదటి శాసనమునందు పేర్కొనబడిన అతడే రంగనాధ రామాయణము రచించినటుల వ్యవహరింపబడు గోనబుద్దారెడ్డి. ఇతని జనకుడగు గోనగన్నారెడ్డి శా.శ ౧౯ ౧౬ అగు సంవత్సర మార్గశిర శుద్ధ 2 నాడు రాయచూరి పట్టణంబున శిలాదుర్గము నిర్మించి శాసనము వ్రాయించినాడు. అందుగోనగన్నారెడ్డి మనుకుల కమలమార్తాండునిగా జెప్పంబడుటచేసేది బూదపూరిశాసనమునకు బలమునిచ్చుచున్నది. వీనినన్నిటిని సమన్వయించి విచారించి చూచినచో బుద్ధారెడ్డి సూర్యవంశజుడనియు గుప్పాంబిక సూర్యవంశ సంజాతుడగు మల్యాల గుండరాజును బెండ్లాడెననియుఁదెలియును. కుప్పాంబ తనపుట్టినింటి వారిది సూర్యవంశమని పై జెప్పుటచే గోనబుద్ధారెడ్డి సూర్యవంశజుడని చెపుకున్నట్లే.

కాపులలోని అతి పెద్ద క్షత్రియ శాక పసుపుల కోన వంశీయులు.

End

Telinga is a Caste

How came Telaga caste name? Learn about Trilinga, Telinga, Telanga, Telaga. అసలు తెలగ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోండి. Telaga History.

telaga caste history | telaga caste name history | telaga history telugu | munnuru kapu history telugu | gajula balija history telugu | kapu history | kapu community