Sri Krishna Devaraya was a Balija Kshatriya

Sri Krishna Devaraya was a Balija Kshatriya - Sasanam. శ్రీ కృష్ణదేవరాయలు బలిజ క్షత్రియుడు అని నిరూపించే శాసనము.

Sri Krishna Devaraya was a Balija Kshatriya

శ్రీ కృష్ణదేవరాయలు బలిజ క్షత్రియుడు - శాసనము

శ్రీవీర (క్షత్రియ) బలిజ శాసనము - కడప జిల్లా, చిట్వేలి తాలూకా శాసనము

కూర్మవంశ కాపు క్షత్రియుడైన చంద్రవంశ యయాతి రాజు రెండవ కుమారుడు తుర్వసుడి సంతతిలోని తుళువ వంశ బలిజ క్షత్రియుడు శ్రీకృష్ణ దేవరాయలు.

ఒక రాజు కులాన్ని నిర్ణయించాలంటే ఆ రాజు చేసిన ఘనకార్యములు, బిరుదులు నీ కులశాసనములో ఉన్నట్లయితే ఆ రాజు నీ కులస్థుడవుతాడు.

మవుజే రోళ్లమడుగు గ్రామాన లోగడ యీ గ్రామం అనుభవిస్తూయున్న సామాన్యమైన పాళెగార్లు అనుపించుకొనేవారి వంశీకులయిన బసినాయుడు, యెద్దులనాయడు వోబళనాయుడు, వీరివద్దనున్న తమ్ర తెన్లు శాసన రేకులు 3 వాటి నకలు.

అవిఘ్నమస్తు శుభమస్తు స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 1443 (క్రీ॥శ॥ 1521) అగునేటి విజయ సంవత్సర జ్యేష్ఠ శు॥ 6 లు ఆ దినమైన దివసమందు స్వస్తిసమస్తకోటి కోట్యర్కబింబ ప్రకాశ రత్నవేది మధ్య బహువర్ణవర్ణిత చర్మనిర్మిత బ్రహ్మపీఠంబునను సభాసీనుండైన పార్వతీయకుచ కుంభపరిరంభ బ్రాహ్మణ మహారాధకులయిన కైలాస విలాస.. మూడు మూర్తులకున్ను యేకమూర్తులయిన గణేశ్వరగౌరీశ్వర దేవర కరుణగలిగిన మేటి గౌరవగాంభీర్యులున్ను వీరబలంజధర్మ పరి పాలకులున్నూ సమయనారాయణ చక్రవర్తులున్ను, ప్రతిజ్ఞాపరశురాములున్ను, వీరాది వీరులున్ను వీరపరివారములున్ను, ఒంటికంభం మేడ సాధించిన అసాధారణ శూరులున్ను అవగళరాయమానమర్ధనులున్ను, పరసమయవేశ్యా భుజంగులున్ను, పరమశివార్చన పరులున్ను, పరవాదుల భర్జించేటి వారున్ను పరదైవంబులకు మ్రొక్కేవారలున్ను, పరమపుణ్యులగు వారలున్ను, చలమునకు పాతాళము భేదించేటివారలున్ను, సప్తసాగరములు సాధించేటివారలున్ను, కులగిరులు రెండున్ను గాలించేటి వార్తలున్ను, మరికుంభిని దాటించేటివారలున్ను, బ్రహ్మాండమును గాలించేటివారలున్నూ నలినాక్షుల అరచేతుముయ్యడువారలున్ను, నర శరణాగతులగు వారలున్నూ, ముత్తుగనైన ముత్తయిదువుచేయువారలున్నూ, మిగుల గుండయ్య బ్రహ్మయ్య మనములున్ను సత్యమైపాటించు వీరులున్ను, సకల విద్యా విశారదులగువారలున్ను దేసింగరాయని నిష్టాగణచారులున్ను, భళ్లాణరాయని శిరఖండనులున్ను, నీతిమంతులున్ను, గుణవంతులున్ను, బుద్ధిమంతులున్నూ, ఆచారమంతులున్నూ, దేవబ్రాహ్మణ విశ్వాసపరులున్ను, సింహాగ్ర కొదమలున్ను, వీరపుంగవులున్ను, మెండిలకు మిండగురులున్ను నాడు నాలికలున్నూ అడనభిరులున్నూ, పరనారీస హెూదరలున్నూ, అష్టదిక్కులరాయ మనోభయంకరుల్ను, పంతంబులాడిన భల్లాలని తలకోసిన బల్మివారలున్ను, దేసింగరాయడని దేశాల పేరుబెట్టి దేశంబు తెలించువారలున్ను, సరిలేని తెగువ గలవారలున్ను, కటకంబు నేలినగజపతిచేత కప్పంబులుకొన్న వారున్ను శ్రీవారులున్ను, పండ్రెడులక్షల గణంబులు గల ఢిల్లీ సుల్తానుల నెదురుకొను వారలున్ను, మంచుకుంచంబుల కొలిచేటివారలున్ను చట్రాత దామనారతీయు వారలున్ను, వచ్చినవారిని ఎదురుకుని రానివారిని రమ్మని పిలుపించుకొనువారలున్ను, లక్షజగడమంటే లక్షలాభమనువారలున్ను కోటిజగడం అంటే కోటి లాభం అనువారలున్ను, కోటికి పడగెత్తి గోసహస్రపదపంకము నేలువారలున్ను, అకాశమే మేలుకట్ల కట్టెడువారలున్ను, చుక్కలు మకరతోరణముగ గట్టు వారలున్ను, రొంపి చిచ్చు పెట్టి కాలకుంటే కడుపడుచుకొను వారలున్నూ, మొయిలువలె గూడి మంచువలె విచ్చి పొయ్యేటి వారలున్ను, పరసమయ వేశ్యాభుజంగులున్ను, స్వస్తిసమస్త నిజగుణాంకమాళికా ప్రశస్త సహితులయిన శ్రీమద్గణేశ్వర గౌరేశ్వర దేవరదివ్య శ్రీపాదపద్మారాధకు లయిన అయ్యావాళి ముఖ్యమైన చాలు మూల సమస్తమైన అంగ, వంగ, కంగ, కళింగ, మరాట, మాళవ, నేపాళ, మళయాల, సింహళ, ద్రవిడ, కర్నాట, కుకుర, బర్బర, కైకేయ, కోసల, కిరాత, మత్స్య టెంకణ, కొంకణ, సౌరాష్ట్ర, పాండ్య, కురుష, విదేహ, ఘార్జర, కాంభోజ, అవంతి, మహారాష్ట్ర, హోయ్సల; యవ్వణ, మగధ, సింధు కుకురుకా అవంతి, వరాట, గౌళ, కాశ్మీర, సమాజత, సంజాత కావంతి, ఆర్యావర్త జనని… మచ్ఛహ, మకురకాహళ అచల, హేమంత, సుపర్వ సుమనిస, దివిష, బర్హి, స్పణ రాజత, మోగళ, నిక్షేత్ర కుంజరసౌరెద, సుంకధ, మొదలయిన ఛపన్న దేశాధిపతులున్ను, కాశీరామేశ్వర సేతుమధ్య మొదలుగా గల సమస్త దేశాధి పతులున్ను, వీరపరివారములున్ను, యాభైఆరు దేశాధి సెట్టి పెక్కండ్రులున్ను, వీరపరివారములున్ను ధ॥ ఆర్యజంగుళిహన్నబ్బరు లున్ను, ధరణికి దోడయిన శ్రీరాచవేటి ఈశ్వరుని ముఖమండపాన, వజ్ర సింహాసనారూఢులయి కూడికూర్చుండి, సెట్టిపెక్కండ్రులున్ను రోళ్ల మడుగు పెద్ద చిన్నమనాయునికి గారికి యిచ్చిన మఘమసాధకం. పాలకొండ బొమ్మదేవుడు, కూటాలగంగమ్మ, రోళ్లమడుగు అమ్మగారు, సూర్య చంద్రాదుల సాక్షిగాను యిచ్చిన మఘమపటం. రోళ్లమడుగు కనమలు రెడ్లున్ను అధిమార్గ పదలింగాను, కాపాడగాను బలిజవారికి చచ్చి అవాంత్రాలబోయిన సొమ్ములు యిచ్చి దేశం వారిపట్ల విశ్వాసం కలిగి పాటుపడగాను దేశంవారి చిత్తా నకువచ్చి, సంతోషాన 56 దేశాలు మెచ్చి యిచ్చిన మఘపట్ట. పెరికె ఒకొకటికి రసవర్గాల కెల్లానుక్ 110 110 లెక్కను, యెద్దుపెనకుల్ 1 లెక్కను, దూదినగకు ల్ 1 లెక్కను, యీ సమశ్యను నడిపించగలవారం, ఈ మార్గాల పెరికె బేడిగ సొమ్ముసమందాలు అవాంత్రాలచేతనైన కారణాలచేతను పోయనయినా, పోయిన సొమ్ముకు ప్రమాణముగాను వ్రాయించి యిచ్చిన సొమ్ములోను అర్ధం తీసుకోగల వారు. ఈ సొమ్ముహరకత్తుచేసి తీసుకోక రాకళ్లచేత తీసుకోగలవారు, ఈ వ్రాసిన సమశ్యను దేశంవారు నడపగలవారు ఇందుకు పాలువగదెంచిన వివరము. రోళ్లమడుగు చిన్న మనాయుని గారికి పాలుంమ్మ పాతికె. కడమ రెండుపాళ్ల వారికి చెరొకపాలు అనుభవించుక సుఖాననుండేది. ఏ దేశాలు అయినాను వీరితరతరం నానాదేశములు మొదలుగాను, యేపరాకులునైనాను పరాకుచేసినాను, శివాచారానకున్ను కులాచారానకున్ను వెలి;గంగ కర్తకలపిలం జంపిన పాపాన బోవువారు; తనపెద్ద కొడుకు కపాలాన కాటుకబెట్టిన పాపంబొందు వారు; స్త్రీ హత్య బ్రహ్మహత్య మొదలైన పంచమహాపాతకములు చేసిన పాపాన బోవువారు. ఈ సమస్యను చెల్లించువారు ఆయురారోగ్యులై వర్లిల్దుదురు.

శ్రీ మంగళమహా శ్రీశ్రీశ్రీ జేయును.
స్వదత్తాద్ద్విగుణంపుణ్యం పరదత్తానుపాలనం।
పరదత్తాపహారేణ స్వదత్తం నిష్ఫలం భవేత్ ॥

ఇందుకు మరి (?) సాక్షి భూ దేవర ఆకాశవాణి, సూర్యచంద్రాదులు, కూటాల గంగమ్మ, రోళ్లమడుగు అమ్మవారు సాక్షిగాను యీ పట్టలో ప్రకారం ఒప్పచెప్పక తృణీకరించి పోయినవారు యముని చేతికిచిక్కి యమభాధపడి యనేక వేల యేండ్లు నరకకూపన బడుదురు. ఈ సమస్యనున వారు పుత్రులు పౌత్రులు దాములు బహు దేవగణములు వర్ధిల్లుదురు.

మంగళమహా శ్రీశ్రీం జేయును.

రాయవరం కరణాలు యీ రోళ్లమడుగు గ్రామానికిన్ని కరణీకం బాధ్యస్తు గనుక రాయవరం కరణం చలమన్న వారివద్ద నాగరం అక్షరాల తామ్ర శాసం రేకులు నాల్గును అందుకు కడియంవేసి అందుపైన వరాహం ముద్రవున్నది.

శ్రీ విరూపాక్ష ప్రవస

హరేర్లీలా వరాహష్య దంష్ట్రాదండ స్సపాతువః॥
హేమాద్రి కలశాయత్ర ధాత్రీచ్ఛత్రశ్రియందధౌ ||

పై శాసనమునకు అర్థం

  1. వీరబలిజ ధర్మపరిపాలకులు :- వీర అనగా క్షత్రియ ధర్మము. బలిజ అనగా వాణిజ్య ధర్మము. రెండు సమదృష్టితో పరిపాలన గావించిన క్షత్రియ బలిజలు.
  2. మేటి గౌరవగాంభీర్యులున్నూ : గౌరవములో అన్ని కులముల కంటే మేటిగా గల గొప్పవారు బలిజ క్షత్రియులు.
  3. సమయ నారాయణ చక్రవర్తులు :- ప్రపంచములోని వాణిజ్య సమయాలకు, రాజ్యపాలక సమూహాలకు క్షత్రియ బలిజలే చక్రవర్తులు.
  4. ప్రతిజ్ఞా పరుశురాములున్నూ :- ఒక ప్రతిజ్ఞ చేస్తే 21 సార్లు భూమండలమంతా తిరిగి క్షత్రియులన్నవారందరిని సంహరించిన పరశురాముడులాంటి పట్టుదల గలవారు వీరబలిజలు.
  5. వీరాధివీరులున్నూ :- స్వయంగా వీరాధివీరులు ఈ వీరబలిజలు.
  6. వీరపరివారములున్నూ :- వీరులైన సైనిక సమూహములు గలవారు ఈ వీరబలిజలు.
  7. ఒంటి కంభం మేడ సాధించిన అసాధారణ శూరులున్ను :- ఏడు కోటలు జయించి చివరి కోటలోని ఒంటి స్తంభం మేడ సాధించి జయించినవారు. కళ్యాణి చాళుక్యులు - వారు క్షత్రియ బలిజలు.
  8. అవగళరాయ మానమర్థునులున్నూ :- 13వ శతాబ్దములో అవగళరాయుడు అనే పల్లవ రాజును జయించిన వీరబలిజలు.
  9. పరసమయ వేశ్యాభుజంగులు :- ఇతర వాణిజ్య సమూహాలకు, మరియ రాజ్యపాలక సమూహాలకు పెద్ద సర్పములాంటివారు.
  10. పరమ శివార్చనాపరులు :- వీరశైవులు (పరమేశ్వరుడే దేవుడు ఇంకొకరు లేరు అనేంత మూఢభక్తులు) ఈ వీరబలిజలు.
  11. పరవాదుల భర్జించేటివారున్నూ :- వాదోపవాదములలో ఇతరుల వాదాలను బేధించి గెలిచెడివారు.
  12. పరదైవములకు మ్రొక్కేటివారు దేవుడొక్కడేనని, కులమత భేదము లేకుండా ఇతర దేవతలకు గూడా మొక్కేటివారు ఈ వీరబలిజలు.
  13. పరమపూజ్యులగువారు :- ఎక్కువగా పుణ్యకార్యములు చేసెడివారు వీరబలిజలు.
  14. చలమునకు పాతాళము బేధించేవారున్నూ - మహాభారత యుద్ధములో కురుక్షేత్రములో భీష్ముడు యుద్ధరంగములో అంపశయ్య మీదుండగా అర్జునుడు నీటికొరకు భూమిని బాణముతో చేధించి పాతాళగంగను భీష్మునికి అందించిన వీరార్జునిడి వంశీయులు ఈ క్షత్రియ బలిజలు.
  15. మరి కుంబిని దాటించేటివారున్నూ :- భూమిని దాటి సప్తసముద్రాలలో సంపద కైవశము చేసుకున్న చోళచక్రవర్తులు ఈ క్షత్రియబలిజలు.
  16. బ్రహ్మాండమును గాలించేటివారున్ను :- ప్రపంచమును పాలించి, వాణిజ్యముచేసిన తొలి నాగరికులైనవారు ఈ క్షత్రియ బలిజలు.
  17. నరచరణాగతులగువారలున్నూ :- వ్యవసాయం, రాజ్యపాలన, వాణిజ్యముచేసి ప్రపంచ సంపదను కైవశము చేసుకొని తొలి నాగరికులుగా మానవులందరికి వీరబలిజలే నిర్దేశకులు.
  18. ముత్తుగనైనా ముత్తయిదువును చేయువారు:- ముత్తయిదువుకానివారినైన ముత్తయిదువు చేయువారు గాజుల బలిజలు.
  19. మిగుల "గుండయ్య బ్రహ్మయ్య మనుమలున్ను :- వీరశైవులైన గుండయ్య, బ్రహ్మయ్య అనువారు 'బావా బావమర్ధులు". ఇద్దరిది ఒకే ప్రాణంగా ఒకే ఆశయంతో ఉ ండేవారు. వీరు క్షత్రియ బలిజలు వీరు కాకతీయ గణపతి దేవుని కాలములో సైనికాధికారులుగా ఓరుగల్లులో వుండేవారు. కాకతీయ రాజ్య పతనానంతరం విజయ నగర సామ్రాజ్యంలో చేరారు. వీరి మునిమనుమలు లక్కిశెట్టి మాణిక్యశెట్టి (కృష్ణరాయలు కాలం) కుమారుడు లక్కిశెట్టి నంది (సైనికాధికారి) భార్య ముద్దమ్మ వీరు హంపి - విజయనగరములో ఉండేవారు. వీరి కుమారుడు విరూపన్న నాయకుడు తలారిగా (అచ్యుతదేవరాయలు కాలం) చిన్న కుమారుడు వీరన్న నాయకుడు. సైనికాధికారిగా వుండేవారు. వీరు వీరశైవులు. లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయ నిర్మాతలు - వీరు క్షత్రియ బలిజలు. ఈనాటికి లేపాక్షి దేవాలయంలో గుండ బ్రహ్మయ్యల విగ్రహాలున్నాయి.
  20. సత్యమై పాటించు వీరులున్నూ : ఎల్లప్పుడు సత్యమునే పాటించిన వీరాధివీరులు ఈ క్షత్రియబలిజలు. సత్యహరిశ్చంద్రుని వారసులు.
  21. సకల విద్యావిశారదులున్ను :- సకల విద్యాలలో మేటిగా వుండి పరిపూర్ణులు ఈ వీరబలిజలు.
  22. దేసింగరాయని నిష్టాగణచారులున్ను :- చాళుక్య వంశ దేసింగరాజు వారసులుగా నిష్టతో ఆచారాలను పాటించినవారు ఈ వీరబలిజలు.
  23. బళ్లాలరాయుని శర:ఖండనులు :- కటక బళ్లాలరాయుడు యుద్ధములో కాకతీయ సోమదేవరాజును సంహరించెను. అతని భార్య శిరియాలాదేవి గర్భవతి. ఆమె మాధవశర్మ అను బ్రాహ్మణుడి ఆశ్రయములో వుండి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అతనికి మాధవవర్మ అని పేరుపెట్టి పెరిగి పెద్దవాడై కటక బల్లాలరాయునిపై యుద్ధముచేసి అతని తలనరికాడు. 17వ శతాబ్దములో “కూచిమంచి జగ్గకవి” వ్రాసిన సోమరాజీయము గ్రంథము ఆధారము. ఆ కాకతీయ మాధవవర్మ బలిజ క్షత్రియుడు. ఇతని వంశీయులే కాకతీయులు, పొలాసరాజులు, వినుకొండ (విష్ణుకుండినులు) బెజవాడ పాలకులు, వీరు మణినాగపురాధీశ్వరులమని చెప్పుకున్నారు. పందనల్లూరు పాలకులు సవరంవారు, బాలం పాలకులు. తుపాకులవారు (చెంజి), బేలూరు పాలకులు, ఉదయగిరి పాలకులు, మధుర రాజులు. ఒకే కుటుంబీకులు చెన్నపాళ్యెం జమీందారులు, శంకరయ్య నాయకుడు గూడా వీరి సంతతివారే వీరి పూర్వులు ఉత్తరప్రదేశ్లోని మానెకాపుర (మణినాగపురం) పాలకులు వంశమువారు.
  24. నీతిమంతులున్నూ, గుణవంతులున్నూ :- మంచి నీతి, గుణముగలవారు ఈ వీరబలిజలు
  25. ఆచారవంతులు, దేవబ్రాహ్మణ విశ్వాసపరులున్నూ :- ఆనాటి ఆచారాలు నిష్టతో ఆచరించినవారు, ఆనాటి బ్రహ్మజ్ఞానులైన ఋషులు. బ్రహ్మజ్ఞానముగల సన్యాసులు ప్రబోధించిన ఆచారాలను తప్పక పాటించారు. దేవతలు, బ్రాహ్మణుల మీద విశ్వాసము కలిగినవారు ఈ వీరబలిజలు.
  26. సింహాగ్రకొదములున్నూ :- సింహబలులైన కొదమసింహాల్లాంటి వీరత్వము గలిగినవారు ఈ వీరబలిజలు.
  27. వీరపుంగవులున్నూ :- వీరాధివీరులు క్షత్రియ బలిజలు.
  28. మొండిలకు మిండగురులున్ను :- మొండివారికి తగిన గుణపాఠము చెప్పగలిగిన (మొనగాళ్లకు మొనగాళ్లు) వీరులు ఈ వీరబలిజలు.
  29. పండ్రెండు లక్షల గణంబులు గల డిల్లి సులతానుల నెదుర్కొన్న వారలున్నూ:- పండ్రెండు లక్షల సైన్యము గల డిల్లీ సుల్తాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ ఆనెగొంది నాక్రమించగా వారి సైన్యాధిపతి “మాలిక్కపూర్”ను ఆరవీటి సోమదేవరాజు అతనిని ఎదుర్కొనగా అతని చేతిలో చిక్కిన మాలిక కపూర్ అతని ఆరువేల గుర్రాల సైనిక దళముతో బందీలుగా చిక్కి అతని సామంతునిగా ఉంటానని, నన్ను వదిలేయమని, ప్రాధేయపడి, నమ్మించి స్వతంత్రం ప్రకటించుకున్నాడు. నమ్మించి మోసం చేసినందుకు ప్రచండుడైన ఆరవేటి సోమదేవరాజు వెంటనే వెళ్లి అతనిని మట్టి కరిపించాడు. చావు దప్పి కన్నులొట్టపోయి డిల్లీకి పారిపోయాడు. ఆనెగొంది “నరపతి రాజుల వద్ద నున్న మంత్రి కుమారుడు దోనూరు కోనేటి నాదుడు వ్రాసిన బాలభాగవతము (ద్విపద కావ్యం) అందుగుల వెంకయ్య వ్రాసిన "రామ రాజీయము" గ్రంధములు ఆధారము. (1554 సం||) దీనిని బట్టి ఆరవేటి రాజులు క్షత్రియ బలిజలని శాసనము చెబుతుంది. ఆరవీటి వారు పూర్వులు - బుందేల్ ఖండ్ ప్రాంతము నుండి వచ్చారు కాబట్టి వారిని బొందిలి వారని కూడా పిలుస్తారు.
  30. నాడు నాలికలున్నూ, అడన భీరులున్నూ:- నాడు ప్రాంతాలకు నాలికల లాంటివారు, అడవి ప్రాంతాలకు సింహాలాంటివారు వీరబలిజలు.
  31. పరనారీ సహోదరులున్నూ:- పరులు ఇష్టపడిన స్త్రీలు లేదా పరుల భార్యలను తన సొంత తోబుట్టువులుగా చూచుకొనెడివారు. (ముక్కు తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణం గ్రంధం 17వ సం॥ పద్యములో శ్రీ కృష్ణదేవరాయలు మరియు శివాజీ మహారాజు సైనికులచేతిలో చిక్కిన ముస్లింవని తలను శివాజీ తోబుట్టువు లాంచనాలతో వారి స్వగృహములకు చేర్చాడు. వీరు క్షత్రియ బలిజలని శాసనము చెబుతుంది.
  32. అష్టదిక్కుల రాయమనోభయంకరులున్నూ:- ఎనిమిది దిక్కుల నుండే రాజుల మనస్సులలో దడపుట్టించే వీరాధివీరులు క్షత్రియబలిజలు.
  33. పంతంబులాడిన బల్లాలుని తలకోసిన బల్మి వారలున్నూ:- 14వ॥ శతాబ్దములో సింధూర కటకం బల్లాలరాజు దుర్బుద్ధిని మానుకోమని హెచ్చరించినా వినక తన మంత్రి మల్లప్ప వడయారు చంపించి అతని భార్య ముమ్మక్కమ్మను చెరబట్టబోయినాడు. ఆమె తప్పించుకొని వారి స్వగ్రామమైన ఈనాటి ప్రకాశంజిల్లా చీమకుర్తి మండలం గోనుగుంట గ్రామం చేరి తన సోదరులు, కులస్థుల సాయంతో యుక్తితో బల్లాలరాయుని తల కోసి గోనుగుంట గ్రామపురవీధులలో ఊరేగించి వినోదించారు. వారు గోనుగుంట క్షత్రియబలిజలు.
  34. సాటిలేని తెగువగల వారలున్నూ: - మహాపరాక్రమవంతులు కావుననే 56దేశాలు జయించి పాలించారు. ఈ క్షత్రియ బలిజలు.
  35. కటకంబునేలిన గజపతి చేత కప్పంబులు గైకొన్నవారు ఉదయగిరి నుండి కొండవీడు, ఓరుగల్లు నుండి కటక్ (ఒరిస్సా) వరకు గల గజపతుల రాజ్యం జయించి వారి కుమార్తెను వివాహము చేసుకొని క్రిష్ణానది వరకు గల రాజ్యమును విజయనగర సామ్రాజ్యములో వుంచుకొని మిగిలిన రాజ్యమును గజపతులకిచ్చి వారిచేత కప్పములు కట్టించుకొన్నవారు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన బలిజక్షత్రియుడని శాసనము చెబుతుంది.
  36. మంచు కుంచంబులు కొలి చేటివారున్నూ, చట్రాత దామనారతీయువారలున్నూ: మంచును కుంచము (కొలత పాత్ర)తో కొలవడం అసాధ్యం, రాతి నుండి నార తీయడం అసాధ్యం. అనగా అసాధ్యమైన కార్యములు, సుసాధ్యం చేయగల వీరాధివీరులు ఈ వీరబలిజలు.
  37. వచ్చిన వారిని ఎదుర్కొని వారిని రమ్మని పిలుపించుకొనువారలున్నూ: అనగా యుద్ధాని వచ్చిన వారిని యెదుర్కొని యుద్దానికిరాని రాజులను గూడా మీరు గూడా యుద్ధానికి వచ్చే పనయితే రాండి చూచుకుందాం అని చెప్పి గుర్రాన్ని వదలి అశ్వమేధయాగము చేసిన వీరాధివీరులు క్షత్రియబలిజలు. శ్రీకృష్ణదేవరాయలు గూడా విజయనగరం మీదికి యుద్ధానికి వస్తారని ముందుగా “వేగుల ద్వారా” తెలిసిన వెంటనే వారిపై మెరుపుదాడి చేసి వారి రాజ్యమును జయించేవారు.
  38. లక్ష జగడమంటే లక్షలాభమనకొనువారలున్నూ, కోటి జగడమంటే కోటిలాభం అనువారలున్నూ: యుద్దమునకు రమ్మని ఏ రాజు కవ్వించినా మనకే లాభమని అనుకొని ఎదిరించే వీరాగ్రేసరులు, ఏనాడు ఓటమి ఎరుగని వీరాదివీరులు క్షత్రియబలిజలు.
  39. కోటికి పడగలెత్తి “గో” సహస్రపద పంకము” నేలువారలున్నూ: కోట్లకు పడగలెత్తి ప్రపంచము నేలిన వారు ఈ వీరబలిజలు.
  40. ఆకాశమే మేలుకట్ల కట్టెడు వారలున్నూ, చుక్కలు మకరతోరణంగా గట్టెడు. వారలున్నూ: ఆకాశానికి నిచ్చెనవేసి అమరావతి నుండి ఇంద్రుని ఐరావతము తీసుకువచ్చిన బీమసేనుని అంతటి బలాడ్యులు ఈ వీరబలిజలు.
  41. రొంపి చిచ్చుపెట్టి కాలకుంటే కడపడుచుకొనువారలున్నూ: చెడ్డవారికి చిచ్చుపెట్టి వినకపోతే స్వాధీనము చేసుకొనువారు వీరబలిజలు.
  42. మొయిలువలె గూడి మంచువలె విచ్చిపోయేటి వారలున్నూ: మేఘములాగా గర్జించి మంచువలె నెమ్మదిగా కరిగిపోయే మనస్సు గలవారు కోపంగా మాట్లాడినా తర్వాత
    వారి మంచితనం అర్ధం చేసుకొని మెల్లగా సమాధానపడేవారు (రాజులకు మాట కఠినం - మనస్సు వెన్న) వీరబలిజలు.
  43. శ్రీమద్గణేశ్వర, గౌరీశ్వర, దేవర దివ్యశ్రీపాద పద్మారాధకులయిన: విఘ్నేశ్వరుడు, శివుడు, గౌరీదేవిని పూజించేపరమ భక్తులు గౌరి పుత్రులుగా పేరుగాంచి, చరిత్రకెక్కినవారు వీరబలిజలు.
  44. అయ్యావళి ముఖ్యమైన సాలు, మూల, సమస్తమైన ఈనాటి కర్ణాటకలోని అయ్యావళీపురం (ఐహోలు) రాజధానిగా చేసుకొన్న పశ్చిమ చాళుక్యులు, వారి రాజబంధువులు ఇటు రాజ్యపాలన, వాణిజ్యము చేసినారు. అయ్యావళివర్తక సంఘం స్థాపించి ప్రసిద్ధి గాంచారు. ఈ క్షత్రియ బలిజలు అని శాసనము చెబుతుంది.
  45. అంగ, వంగ, కళింగ, కాశ్మీర, సౌరాష్ట్ర, మరాటా అను చెప్పన్న దేశాధిపతులు: ఈ ఏబయి ఆరు దేశాలు పాలించిన దేశాధిపతులు అనగా ప్రపంచదేశాలన్నింటిని పాలించారు. వారే క్షత్రియబలిజలు.
  46. కాశీ, రామేశ్వరము సేతు మధ్య మొదలుగా గల సమస్త దేశాధిపతులున్నూ: కాశీ (ఉత్తర భారతము) నుండి రామేశ్వరం సేతు (దక్షిణ భారతం) వరకు గల రాజులందరూ వీరబలిజలని శాసనం చెబుతుంది.
  47. వీరపరివారమున్ను, ఏబయి ఆరు దేశాధిపెట్టి పెక్కుండ్రున్ను: అనగా 56 దేశాల వీర సైనికాధికారులున్నూ, మరియు 56దేశాల వాణిజ్య సముదాయాల పృద్విశెట్టిగార్లందరూ వీరబలిజలు.
  48. వీర పరివారమున్నూ: పైవారిని రక్షణగా నున్న సైనికులుగూడా వీరబలిజలే!
  49. ఆర్య జంగుళి హన్నబ్బరులున్నూ
  50. నలినాక్షుల అరచేతుముయ్యుడువారలున్నూ: నళిని అనగా గౌరిదేవి కనులు అరచేతముయ్యుడువారు గౌరిపుత్రులైన వీరబలిజలు.
  51. సింగరాయడని దేశాల పేరుబెట్టి దేశంబు తెలించువారలున్నూ: ఒక్కొక్క దేశానికి
    ఒక్కొక్క దేశాధినేత పేరు పెట్టి అన్నీ దేశాలకు తెలియజేసినవారు క్షత్రియబలిజల.

పైన చెప్పిన "వీరబలిజలు శాసనములో" కాకతీయులు, కాకతీయ మాధవవర్మ వంశీయులు చేసిన ఘనకార్యములు ఆనెగొంది రాజులు ఆరవీటి సోమదేవరాజు చేసిన ఘనకార్యములు, తుళువ శ్రీకృష్ణదేవరాయలు చేసిన ఘనకార్యములు, మరియు పెనుగొండ సామంతుడు, లేపాక్షి వీరభద్రదేవాలయ నిర్మాత లక్కిశెట్టి విరూపన్న నాయకుడు చేసిన ఘనకార్యములు. వీరబలిజశాసనములో వున్నందున వీరంతా "క్షత్రియబలిజలని” స్పష్టంగా శాసనపరంగా ఆధారములున్నాయి.

తుళువ శ్రీకృష్ణదేవరాయలు ముత్తాత ఇంటిపేరు సమ్మెట తిమ్మానాయుడు తుళువ ప్రాంత పాలకులై అతని వంశీయులు. తుళువ వారిగా పిలవబడ్డాడు. రాయలు పినతండ్రి తుళువ తిమ్మానాయుడు కుమారుడు క్రిష్ణమనాయుడు (పెనుగొండ పాలకుడు) అతనిని శ్రీకృష్ణదేవరాయలు తనకంటే పెద్దవాడయిన కారణంగా “అన్నయగారు” అని పిలిచేవారు. అందువలన వారు కుటుంబం అన్నయగారు అనే యింటిపేరుగా ఏర్పడింది. వారు కడపలో వున్నారు. వారి కుటుంబీకులు ఈనాటికి క్షత్రియధర్మాలు పాటిస్తూ "క్షత్రియ” సర్టిఫికేటే కలిగిన క్షత్రియబలిజలుగా వున్నారు. తర్వాత రాయలు పినతండ్రి వంశీయులు “దళవాయి”లుగా పని చేసిన కారణంగా దళవాయి అనే యింటిపేరుగా ఏర్పడినది. ఈనాడు ఆనెగొందిలో వున్న దళవాయి కుమార రాఘవరాజు భార్య చెల్లెమ్మ (ఆరవీటి వారి ఆడపడుచు) వంశీయులు దళవాయి పంపాపతి రాజు ఆరవీటి వారికి సంతానంలేని కారణంగా దత్తతపోయిన కారణంగా వారు ఆనె గొంది ఆరవీటి సంస్థానానికి వారసులయ్యారు. వారు ఈనాడు అనేగొందిలో ఉండి క్షత్రియధర్మాలు పాటిస్తూ క్షత్రియులమని చెప్పుకుంటున్నారు. ఈవిధంగా సమ్మెటవారు, తుళువవారు, అన్నయ్యగారు, దళవాయివారు, ఒకే కుటుంబీకులు ఒకే బలిజ కులక్షత్రియులు శాసనాలు ఆధారంగా ఉన్నాయి. ఈనాడు ఆనెగొందిలో వున్న ఆరవీటి శ్రీకృష్ణ దేవరాయలు కుటుంబానికి వున్నది. కడపలో అన్నయగారి కుటుంబానికి ఉన్న "క్షత్రియ” సర్టిఫికేట్లాంటిదే వారికి కలదు. కానివారు ఆనెగొంది కోటలో వున్నారు కాబట్టి రాజుగా గౌరవించబడుతున్నారు. అంతే తప్ప వేరే ప్రత్యేకతేమియునులేదు. వీరి పూర్వులు మధ్యప్రదేశ్లోని బొందేల్ ఖండ్ పాలకులు కావున వీరిని బొందేలి వారుగా పిలుస్తారు.

ఏరాజు వేసిన శాసనాలలో గూడా తన వంశమును గురించి వ్రాస్తారు. ఎందువలననగా ఆయన ఒక కులానికి ప్రతినిధి కాదు గనుక, ఈనాటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ప్రజలంతానావారే, కులమత బేధములేదని చెపుతారు. కాని వారి “కులదృవీకరణపత్రము”లోనూ, వారు వారి కులము వారి అభివృద్ధి కోసం చేసే పనులలోను కనిపిస్తుంది. అలాంటిదే ! ఇది.

- భట్టరుశెట్టి పద్మారావు రాయలు

End

Sri Krishna Devaraya was a Balija Kshatriya

Sri Krishna Devaraya was a Balija Kshatriya - Sasanam. శ్రీ కృష్ణదేవరాయలు బలిజ క్షత్రియుడు అని నిరూపించే శాసనము.

sri krishna devaraya rajya palana | sri krishna devarayala pattabhishekam | tuluva vamsham | kapu community