Sri Krishnadevaraya Kingdom Rule
From 1509 to 1530, the Vijayanagara Empire was ruled by Sri Krishnadevaraya, the son of Tuluva Narasa Raya and his wife Nagalamba.

శ్రీ కృష్ణదేవరాయలు - రాజ్యపాలన
క్రీ॥శ॥ 1509 - 1530 విజయనగర సామ్రాజ్యమును పాలించిన తుళువ నరసరాయులు భార్య నాగలాంబల కుమారుడు శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన విజయనామ సంవత్సర మాఘబహుల అష్టమి జేష్టా నక్షత్రం. కృష్ణాష్టమి రోజు (కీ॥శ॥ 1474 ఫిబ్రవరి 16 తేది) ఆంధ్రసాహిత్యం పేజినెం. 55 లో 5వ ॥ సంపుటి. “మలిరాయలు యుగంలో ఆరుద్రగారు వ్రాశారు. 1956 లో “ఆముక్త మాల్యద" గ్రంధమునకు సంజీవిని వాఖ్య వ్రాసూ కీ॥శే॥ వేదం వెంకటరాయశాస్త్రి గారు శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకము నాటికి 35 సంవత్సరములవాడు అని వ్రాశారు.
రాయలు చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర నాగలాపురం (అరికందాపురం) లో వారి తాతగారు గాజుల వీరరాఘవులు నాయకుడు గారింట జన్మించాడు. చంద్రగిరి లోనూ, పెనుగొండ, హంపిలలో విద్యాబ్యాసము జరిగినది. తన అన్న తుళువ వీరనరసింహరాయలు మరణానంతరము క్రీ॥శ॥ 1509 ఆగష్టు-7 వ॥ తేది హంపి విరూపాక్షదేవాలయ ప్రాంగంణములో విజయనగరసామ్రాజ్య సింహాసనాన్ని అదిష్టించాడు. తర్వాత 9 తేది పాలనా పగ్గాలు చేపట్టాడు. విశాలమైన సామ్రాజ్యము కాబట్టి ఆ నెలంతా పట్టాభిషేక మహోత్సవాలు జరిగినవి.
రాయలు తెలుగువారి ముద్దుబిడ్డ, ఇతడు తెలుగు వారికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు. యుద్ధరంగములో గూడా కవులను, గాయకులను నాట్యగత్తెలను తీసుకెళ్లిన రాజు ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ లేరు. కవులు అక్కడ జరిగిన విశేషాలను వారిగ్రంధములలో వ్రాసెడివారు. ఆయన గొప్ప యుద్ధ వీరుడు, కవి పరిపాలనాధక్షుడు. దక్షిణభారతదేశములో రామేశ్వరం మొదలు సింహాచలం వరకు ఎన్నో దేవాలయాలు నిర్మించాడు. ఎన్నో చెరువులు, బావులు త్రవ్వించాడు. శిల్పాలు చెక్కించి తెలుగువారి కీర్తి ప్రతిష్టలు ఆకాశ సౌదాలు తాకించాడు.
క్రిష్ణరాయలు రాజ్యమునకు వచ్చేటప్పటికి రాజ్యం పరిస్థితులు అస్తవ్యస్థంగా ఉండెను. తిమ్మరుసు, రాయలు, భుజబలము బుద్ధిబలముతో అంతర్గత శత్రువులను, ఎదురు తిరిగిన సామంతరాజులను అణచివేసెను. రాయచూరు ఆదోని, బీజాపూర్, బీదరును జయించి మహమ్మదాను ప్రభువుగా ప్రకటించెను. దానితో ఆయనకు “యవనరాజ్య ప్రతిష్టాస్ధాపనాచార్య” బిరుదులభించెను. తర్వాత పెనుగొండ, ఉమ్మత్తూరు, దక్షిణ కర్ణాటక దండయాత్ర చేసి జయించి తన బంధువులను శ్రేయోభిలాషులను నియమించెను. “సాళువ (కటారి) నరసింహరాయలు శాసనములో ఉదయగిరి, కొండవీడు, ముద్గల్ జయించితేగాని విజయనగర సామ్రాజ్యము సంపూర్ణ రాజ్యం”. అది చదివిన రాయలు ఉదయగిరి గజపతుల రాజ్యముతో మొదలుపెట్టి కొండవీడు నుండి తూర్పు దిగ్విజయయాత్రలో తెలంగాణా ఓరుగల్లు, ఒరిస్సా కటకం మరియు వారి రాజ్య సరిహద్దులు బీహారు, గయ జిల్లా పల్గుణానది వరకు జయించాడు. కటకపురి ప్రతాపరుద్ర గజపతి నోడించి ఆయన కుమార్తె తుక్కాదేవి (కవయిత్రి) కమలాదేవిని వివాహమాడాడు. రాయలును గజపతి క్షత్రియుడు కాడు దాసిపుత్రుడని మొదట సంశయించగా దానికి తిమ్మరుసు తుళునాడు గంగరాజుల భందువర్గంలోని వాడు. తెలుగుచోళ క్షత్రియ బలిజ వంశీయుడని, చాళుక్య కాపుల బందువర్గములోని వాడని వివరించి వివాహంచేశాడు. పట్టమహిషిగా శ్రీరంగపట్నం పాలకుడు మైసూరు గంగరాజు వీరప్ప కుమార్తె తిరుమలదేవిని, రెండవ భార్యగా ఆయన ప్రేయసి సైన్యాధిపతి రాయసంకొండమరుసయ్య దత్తు కుమార్తె అన్నపూర్ణదేవిని (చిన్నా దేవి) వివాహమాడెను అధికారికంగా 12 మంది భార్యలని పోర్చుగీసు యాత్రికులు వ్రాశారు. చిన్నాదేవి (అన్నపూర్ణ, నాగాంబ) పేరు మీదా ఈనాటి హోస్ పేట దగ్గర “నాగమహెళ్లి” గ్రామము నిర్మించారు. ఈనాటి హోస్పేట తిరుమలదేవి పేరు మీద తిరుమలదేవి నగరం నిర్మించారు. హంపిలో కమలాపురం గ్రామం తన మూడవ భార్య గజపతి కుమార్తె కమల (తుక్కాదేవి) పేరు మీద నిర్మించబడింది.
చిత్తూరు జిల్లా హరికందాపురమును తన తల్లి పేరు మీద, నాగలాపురంగా మార్చి ఆయన అక్కడ జన్మించినందుకు గుర్తుగా 12 ఎకరముల స్థలములో వేద నారాయణస్వామి (శ్రీ మహా విష్ణువు పుట్టుక మొదటి అవతారము మత్స్యావతారం) దేవాలయం శిల్పకళాశోభితంగా నిర్మించారు. (నాగులాపురాలు ఎన్ని ఉన్నా) ఆయన స్వయంగా నిర్మించిన కట్టడాలేవు) ఆయన 18 యుద్దాలలో స్వయంగా పాల్గొని ముందుడి నడిపించాడు. రాయచూరు యుద్ధం భయంకరంగా జరిగింది. ఒక దశలో ఆయనకు ఓడిపోతానేమోనని అనుమానం వచ్చింది. కాని విజయలక్ష్మి వరించింది. ఆయన ఏ యుద్దములోనూ ఓడిపోలేదు.
రాయలు తిరుమలదేవి కుమార్తెలను మోహనాంగిని ఆరవీటి రామరాయలుకు, వెంగమాంబను, ఆరవీటి తిరుమల రాయలుకు క్రిష్ణవేణిని పొత్తపినాడు పాలకులు మల్లె వరదరాజుకు ఇచ్చి వివాహం చేశాడు ఎన్నో దిగ్విజయ యాత్రలు చేసిన రాయలు అనారోగ్యంతో బాదపడుతూ చిన్నాదేవి కుమారుడు ఎనిమిది సంవత్సరాల బాలుని సింహాసన మెక్కించి ఆయన, మహామంత్రి తిమ్మరుసు రక్షకులుగా ఉన్నారు. ఆ సమయంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మరణ సమయములో హంపిలో క్రీ॥శ॥ 1526 జూన్ 15 వ తేది పరమపదించాడు. ఆ సమయములో దగ్గరున్న తన కుమారుడు తిరుమలరాయలు “గంగోదకము” నోట్లో పోశాడు.
ఆయన చనిపోయిన తర్వాత చంద్రగిరి పాలకుడిగా ఉన్న అచ్యుత దేవరాయలు అతని బావమర్ధి సలకం తిమ్మరాజు కుట్రచేసి బాలుడైన తిరుమల రాయలును కుట్రతో విష ప్రయోగముతో చంపించి ఆ నేరం రాయలు గురువు ఆత్మబంధువు, అప్పాజి (తండ్రిగారు) అవి సంబోధించే మహామంత్రి తిమ్మరుసు మీద వేసి రాజకుమారుని హత్యానేరంపై న్యాయనిపుణులు "తిమ్మరును కండ్లు పీకి" శిక్షను పెనుగొండ కోటలో అమలు పరిచి వారికి అడ్డులేకుండా చేసుకున్నారు. తర్వాత విజయ నగర సింహాసన వారసత్వానికి అచ్యుత దేవరాయలు, అళియ రామరాయలు పొటీపడ్డారు. దాదాపు నాలుగు సంవత్సరాలు రాజ నిర్ణయం జరిగేదాకా శ్రీకృష్ణ దేవరాయలు పేరు మీదనే పాలన సాగింది. తర్వాత పెనుగొండ సామంతరాజు ఎదురు తిరిగాడు. దానిని అణచడానికి పోయిన అచ్యుత దేవరాయలును అళియరామరాయలు భందించాడు. వారిద్దరి మధ్య జరిగిన ఒప్పందము ప్రకారం. అచ్యుత దేవరాయలు పేరుకు మాత్రం రాజుగా పెత్తనం అళియరామరాయలు చేసేట్లుగా ఒప్పందం కుదిరింది. అచ్యుత దేవరాయలు సింహాసన మెక్కాడు. తరువాత తన బావమర్ధి సలకం తిమ్మయ్య నిదానముగా అంతఃపుర పెత్తనం చెలాయించ సాగాడు.
రాయలు మరణాంతరము రాణులు అగ్ని ప్రవేశం చేశారు. కాని బాలుడైన తిరుమల రాయలుకు రక్షణగా తుక్కాదేవి (కమల) ఉండేది. రాకుమారుని మరణాంతరం, అచ్యుత దేవరాయలు తుక్కా దేవిని వారి తండ్రి గారిచ్చిన ధనకనకవస్తు వాహనాలిచ్చి" కటకం” తన తల్లి గారింటికి పంపారు. ఆమె మధ్యలో ఆధనముతో ప్రకాశం జిల్లా కంభం వద్ద గుండ్ల కమ్మ నదిపై ఆసియాలో కెల్లా పెద్ద చెరువును నిర్మించి అక్కడనే ఆశ్రమ వాసియై వరదరాజమ్మగా పేరుగాంచి పరమపదించింది. ఈ నాటికీ ఆ చెరువు గట్టుమీద వరదరాజమ్మ గుడి వుంది అచ్యుత దేవరాయలు రాజ్యవ్యవహారాలు తన బావమరిది సలకం చిన తిరుమల రాజు పరం చేశాడు. కర్నూలులో ఈనాడు (కొండారెడ్డి బురుజు) ఉన్న కోట అచ్యుత దేవరాయలు నిర్మించినది. ఆయన 1542 లో మరణించాడు అనంతరం ఆయన కుమారుడు వెంకటపతి దేవరాయలు-1 సింహాసన మెక్కాడు. అతను బాలుడైన కారణంగా సలకం చిన్న తిరుమల రాజు అతనిని రక్షణగా ఉండి అతనిని చంపించి సింహాసనమాక్రమించాడు. అకృత్యాన్ని సహించలేక రాజోద్యోగులు అనేకులు అళియరామరాయలు నాశ్రయించారు. అపుడు అళియరాయలు విజయనగరంపై దండెత్తి సకలం చినతిమ్మరాజును చంపి అచ్యుతదేవరాయలు అన్న కుమారుడు తుళువసదా శివరాయలును సింహసనమెక్కించాడు. ఆయన పేరుకే రాజు పెత్తనం అళియరాయలు పాలించసాగాడు. తదనంతరం క్రీ॥శ॥ 1565 జనవరి 23వ తేదీన బహమనీ సుల్తానులు ఐదుగురు ఏకమయి విజయనగర సైన్యముతో "తల్లి కోట" వద్ద జరిగిన యుద్దములో అళియ రామరాయలు మరణించాడు సైన్యము చెల్లాచెదురైంది. రామరాయలు తమ్ముడు ఆరవీటి తిరుమల రాయలు, రాజు సదాశివరాయలును, అంత:పురస్త్రీలను 1500 ఏనుగుల మీద ధన, కనక వజ్ర వైడూర్యాలు వేసుకొని అనంతపురం జల్లా పెనుగొండ రాజధానిగా 100 సం|| లు విజయనగరసామ్రాజ్యం పాలించారు. తర్వాత బహమనీసుల్తానులు హంపి రాజధానిలో ప్రవేశించి గునపములో సమ్మెటతో, ఆరు నెలలపాటు గడ్డి, కట్టెలతో నగరాన్ని తగలబెట్టారు. ప్రజలు చిత్ర హింసలకు గురిచేశారు. దేవాలయాలను, శిల్పకళాఖండాలను పగులగొట్టి సర్వనాశనం చేశారు. ఈనాటి ఆనెగొంది రాజు ఆరవీటి నరసింహదేవరాయలు ప్రకటించిన వంశవృక్ష ప్రకారం తుళు వ కృష్ణరాయలు పినతండ్రి దళవాయి తిమ్మానాయుడు సంతతివారు ఆరవీటి సంస్థానానికి దత్తు వచ్చేసి నారు. వారే ఈ నాటి ఆనెగొంది రాజులు. మరి వీరు బలిజ క్షత్రియులు కారా?
అరవీటి తిరుమల రాయలు (శ్రీ కృష్ణ దేవరాయలు రెండవ కుమార్తె వెంగమాంబ) వంశీయులు పెనుగొండ రాజధానిగా క్రీ.శ 1570 నుండి 1680 వరకు పాలించారు.
– భట్టరుశెట్టి పద్మారావు రాయలు
Sri Krishnadevaraya Kingdom Rule
From 1509 to 1530, the Vijayanagara Empire was ruled by Sri Krishnadevaraya, the son of Tuluva Narasa Raya and his wife Nagalamba.
sri krishna devarayala pattabhishekam | sri krishna devarayala rajya palana | sri krishna devarayalu balija kshatriyudu | tuluva vamsham | sri krishna devaraya mother caste | sri krishna devaraya varasulu | kapu community