Sri Krishnadevaraya Thalli Vamsamu

Sri Krishnadevaraya Thalli Vamsamu. శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగలాంబ వంశము గురించి పుర్తిగా చదివి తెలుసుకోండి.

Sri Krishnadevaraya Thalli Vamsamu

శ్రీకృష్ణదేవరాయలు తల్లి వంశము

గరికపాటి చెన్న క్రిష్ణమనాయుడు (గాజుల వ్యాపారి) అతని కుమారులు వెంకటరామానాయకుడు, మద్దలగిరి నాయకుడు, వీర రాఘవ నాయకుడు (నాగలాంబ తండ్రి) అళగిరి నాయకుడు అనువారు. వీరిలో వెంకట్రామానాయకుని కుమారుడు కొటికం నాగమనాయకుడు విజయనగర సర్వసైన్యాధిపతి. ఈ తుళువ శ్రీకృష్ణదేవరాయల వారి తల్లిగారగు నాగలాంబగారు వజ్రాల వ్యాపారిగా ప్రసిద్ధిగాంచిన గాజుల అలివేలాంబ వీరరాఘవనాయకుల కుమార్తె ఈతను మధురనేలిన నాగమనాయుడుగారి, పినతండ్రి. ఈతని స్వగ్రామం నాగలాపురంగా పేరు మార్చబడిన చిత్తూరుజిల్లా పిచ్చాటూరు సమీపానగల హరిగండాపురం.

శ్రీకృష్ణదేవరాయలు తమ తల్లిగారి జ్ఞాపకార్థముగా ఈ ప్రాంతానికి నాగలాపురమని పేరుపెట్టి అభివృద్ధిచేసెను. ఈమెను వీరి రాజ బంధువులు తెలుగు చోళవంశీయులగు పొత్తపినాడు పాలకులు మట్లెవంశీయులు పెంచుకున్నారు. కాశ్యపగోత్ర కాంచీపురవరాధీశ్వర, అయ్యావళీ పురవరాధీశ్వర సమయనారాయణ సమయకోలాహల సమయచక్రవర్తి శ్రీమద్ వీరబలిజసమయధర్మ ప్రతిపాలకులై పాండ్యరాజ్య (మధుర) పాలకులై దక్షిణసింహాసనాధిపతి దక్షిణసముద్రాపతి అని ప్రఖ్యాతిగాంచిన ఈ శ్రీ నాగమనాయుడు గారు తొలుత చంద్రగిరి పాలకులైన శ్రీ సాళువ నరసింహరాయలవారి వద్ద తరువాత తుళువ వారివద్ద ప్రధాన ధళవాయిగా నమ్మకస్తుడైయుండెను. వారితో తరువాత విజయనగరం చేరిన వీరింటి పేరు ప్రధమముగా గరికపాటి వారయియుండి వీరు కంచీపురం కేంద్రంగా ఉన్న 56 దేశాలవారి వీరబలిజ వాణిజ్యసమయాలకు చెందినవారనియు వీరు పిలువబడినారు. ఈ నాగమనాయుడుగారు విజయనగర సామ్రాజ్యమునందుడిన 56 దేశాల వీరబలిజ వాణిజ్య సమయాలకు చెందిన 40,000 గుర్రపు దళానికి 4,000 ఎనుగుల దళానికి, 10,000 ఒంటెల దళానికి మరియు అనేక వేల పదాతి దళానికి ప్రధాన దళకర్త. వీరి సొంత సంరక్షణకై 6000 గుర్రపు దళం, 20,000 పదాతి దళం ఉండేది. ఆర్కాటు మొదలు తిరువనంతపురం వరకుగల సామంత రాజుల నుండి వచ్చే కప్పములు వీటి నిర్వహణకు కొనుచుండిరి. ఈతని కుమారుడే మధురనేలిన శ్రీ విశ్వనాథ నాయకుడుగారు (ప్రాచీన ద్రవిడబలిజవంశపురాణము)

ఈ నాగలాంబగారిని గురించి వివరిస్తూ గజపతి కుమార్తెయగు తుక్కాదేవి లేదా వరదాంబిక లేదా అన్నపూర్ణ జీవితకథ ఆధారంగా చేసుకొని 1915 లోను తరువాత 1920 లోనూ శ్రీ వంగూరి సుబ్బారావుగారు కాకినాడ వద్ద 'చిత్రాడ’నందు చెలికాని లచ్చారావుద్వారా ముద్రించిన ప్రభాతము అను చారిత్రక నవలయందు 112 పేజీలో - శ్రీకృష్ణదేవరాయలవారు ఉత్తమ క్షత్రియ కన్యయగు నాగాంబ పుత్రులు, వారు (నాగాంబ) సాగివారికి దగ్గరి బంధువులు, మనమెరిగిన (అనగా గజపతులు) వియ్యమందిన (అనగా గజపతులు) వారి (సాగివారి బంధుగులు - అని ఈ తుక్కాదేవి తన లేఖద్వారా పేర్కొన్న విషయాన్ని వివరించెను. ఇందుతెలియుచున్న విషయం నాగలాంబగారు సాగివారికి దగ్గరి బంధువులనియు అట్టి ఆ సాగివారు గజపతులతో వియ్యమంది ఉండినారనియు తెలియవచ్చుచున్నది. కాని నాగలాంబగారు సాగివారి ఆడపడుచుకాదు కదా ఈ విధముగా చెప్పలేదు కూడానూ కాని తరువాత 1930 జనవరిలో వచ్చిన భారతి, సంపుటి 7 సంచిక 1 పేజి 93 నందు ఇదే నవలను వరదరాజేశ్వరి అను పేరున శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారి చేతను వ్రాయబడినదానిలో ఉత్తమ క్షత్రియగు సాగివారి వంశమునుద్భవించిన నాగమాంబ తనయుడు కులహీనుడెట్లుగును - అని రుచీదేవి తనలేఖల్లో పేర్కొనట్టు రచయిత్రి తెలియజేసెను. సాగివారి బంధువలని ఉన్నదానిని కాస్తా సాగివారి వంశీయులుగా ప్రకటింపచేసెను. ఆ తరువాత 1941 (1967) లో శ్రీ నూతలపాటి పేర్రాజుగారిచే రచియింపబడిన విజయనగర చరిత్రము పేజి 146 నందు నాగాంబ సాగివారి ఆడపడుచని ఈ ఆధారాలతో వ్రాసెను.

శ్రీ కృష్ణదేవరాయలు విజయనగర సింహాసనాధీశులయిన తదుపరి తొలుత దక్షిణాదిన వివిధ రాజ్యాలను స్వాధీనంచేసుకొని తనవద్దనుండు తమ పూర్వ సంబంధులగు కోలా ధర్మానాయునింగారిని కర్నాటక ఖండమునకునూ, నెల్లూరు మొదలు కొల్లడంవరకుగల ప్రాంతానికి తుపాకి కృష్ణప్ప నాయనింగారిని తంజావూరు మొదలు కావేరి వరకు గల ప్రాంతానికి వసుధ విజయరాఘవులు నాయనింగారిని, కావేరి మొదలు దక్షణపు కడవరకు గల ప్రాంతానికి చొక్కపు వెంకటప్పానాయనింగారిని తమకు ప్రతినిధులుగా నియమించుకొనెను.

నాగలాదేవి క్షత్రియ బలిజ కుటుంబము - శాసనం

చిత్తూరుజిల్లా కాళహస్తీశ్వరాలయము మూడవ ప్రాకారము, పడమర వైపు గోడపైగల శాసనము - శక సం॥ 1435 - శ్రీముఖ నామ సంవత్సర ఆషాఢమాస, శుద్ధ విదియ - సోమవారం (1513-5-13) శ్రీ విజయనగరాధీశుడు వీరప్రతాప శ్రీకృష్ణదేవరాయలు తమ తండ్రి నరసానాయకుడు తల్లి నాగాజి అమ్మగారికి ధర్మంగా కాళహస్తీశ్వర దేవునికి సమర్పించిన కానుకలు ఆయన స్వయంగా వేయించిన శాసనం.

శుభమస్తు | నమస్తుంగళిరశ్చుంది | చంద్రచామరచావే | త్రైలోక్య నగరారంభమూల స్తంభాయ శంభవే | కళ్యాణయాస్తు తద్దామ | ప్రత్యూహతిమిరాహహం | యద్గజోవ్యగ జోద్భూతం | హరిణాపి చ పూజ్యతే | అస్థిక్షీరమయా | గ్దేవైమ౯థ్య (మా) నాన్మహాం“బుదే” నవనీతమివోద్భూత | మపనీతతమోమహః | తస్వాసీత్తన యస్తపోబిరతులై | రన్వర్ధనామాబుదః | పుణ్యైరస్యపురూరవా | బుజబలైరాయుద్విF (షాం) నిఘ్నతః | తస్సాయున౯ హుషోస్వ | తస్యపురుషోయుద్ధే | యయాతిః క్షితౌఖ్యాత స్తస్యతు । తువఃసుద౯ సునిభః | శ్రీదేవయానీపతేః | తద్వంశే | దేవకీజా | నిధి౯దీపే | తిమ్మభూపతిః | యశస్వీతుళువేంద్రేఘ | యదోః కృష్ణ యివాన్వయే । తతోభూద్బుక్కమాజాని | రీశ్వరక్షితి పాలకః | అత్రాసమగుణభ్రంశం | మౌళిరత్నం | మహీభుజాం | పద్మాక్షో | బలిజన్నిజెస్తి | భువనాక్రాంతక్రమై | వి౯క్రమైః | శంఖం చక్రమపి శ్రియన్నిజకరే | శ్రీదేవకీనందనః | భూత్వాప్రద్భుత | మీశ్వరోయమితియో | భూయస్తరాంప్రపధే | భూతించాఖిల | పూజ్యతామతి | భృశంభూభృత్సు। తామాశ్రితః | భూవాసైకపరో | పరోరవి (రివప్రాప్తోద) మోహనికా శంయో ॥ మందేహరి పూనహన న్కవి (బు) ధో పేపేతో రణాత్ | అపూర్వపరవారి | రాశినితరా | మాసేతు హేమాచలం | విఖ్యాతోవిహ సంశయో | వితరణై | వి౯ద్యోతతే | ద్యోతరూన్ ॥ నరసాదుద | భూతస్మాన్న | రసావని పాలకః ……………... "తిప్పాజీ నాగలాదేవ్యాః | కౌసల్యా శ్రీ సుమిత్రయో | దేవ్యోరివ | నృసింహేంద్రా స్మార్తం | జ్కిరథాదివ | వీరావినయనౌ । రామలక్ష్మణావివ నందనౌ । జాతౌ వీర నృసింహేంద్ర । కృష్ణరాయమహీపతీ।

పై శాసనములో స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు చంద్రవంశ బుదుడు, పురూరవుడు, ఆయువు, యయాతి, దేవయాని దంపతుల రెండవ కుమారుడు తుర్వసుడు వంశములో తుళువాధీశుడుగా ప్రసిద్ధి చెందిన తిమ్మభూపతి కుమారుడు ఈశ్వరభూపతి భార్య బుక్కమాంబ దంపతులకు, నరసానాయకుడు - భార్య తిప్పమాంబ కుమారుడు వీర నరసింహరాయలు, రెండవ భార్య నాగలాంబ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు అని శాసనం చెబుతుంది.

తిప్పాజి, నాగలాంబ కౌసల్య సుమిత్రలుగా వీరనరసింహ శ్రీకృష్ణదేవరాయ రామలక్ష్మణులు చెప్పారు. నాగలాంబ రామాయణంలో దశరదుని భార్య. సుమిత్రగా పోల్చి శ్రీకృష్ణదేవరాయలు లక్ష్మణుడుగా చెప్పిన శాసనముండగా ఆమె క్షత్రియ కాంత కాదా ? ఆమె దాసి ఎట్లా అవుతుంది ? దాసి పుత్రునికి రాజ్యార్హత ఉంటుందా ? మహా భారతంలో దాసి పుత్రుడైన విదురుడు రాజయ్యాడా ? గుడ్డివాడైన దృతరాష్ట్రుడినే సింహాసన మెక్కించారు గదా ! నాగలాంబ దాసి అనే శాసనం చూపగలరా ? చరిత్రకు శాసనాలే ఆధారం. తుళువ నరసారాయలు అతని భార్య నాగలాంబ, ఇద్దరూ బలిజ క్షత్రియులే.

Sri Krishnadevaraya Thalli Vamsamu

Sri Krishnadevaraya Thalli Vamsamu. శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగలాంబ వంశము గురించి పుర్తిగా చదివి తెలుసుకోండి.

sri krishna devaraya mother caste | sri krishnadevaraya thalli vamsamu | sri krishnadevaraya pattabhishekam | sri krishna devarayala rajya palana | sri krishna devarayalu balija kshatriyudu | sri krishnadevarayala varasulu | sri krishnadevaraya family | kapu community