Sri Krishnadevaraya Pattabhishekam
Explore the history of Sri Krishnadevaraya's Coronation and his impact on the Vijayanagara Empire. Sri Krishnadevarayalu Pattabhishekam

శ్రీ కృష్ణ దేవరాయలు పట్టాభిషేకము
క్రీ॥శ॥ 1503 సం॥లో తుళువ వీరనరసింహరాయలు విజయ నగర సింహాసన మదిష్టించాడు. ఆయన 1509 లో అనారోగ్య కారణంగా మరణించాడు. తర్వాత 1509 ఆగష్టు 7 వ తేది శ్రావణ బహుళ అష్టమి శ్రీ కృష్ణ జయంతినాడు శ్రీ కృష్ణ దేవరాయలు హంపిలో విరూపాక్షస్వామి సన్నిధిలో వైభవోపేతంగా పట్టాభిషేక మహోత్సవాలు జరిగాయి. ఆగష్టు 9వ తేది పాలనా పగ్గాలు చేపట్టాడు.
పరిపాలన: వ్యాసరాయలు గురువుగా, మహామంత్రి తిమ్మరుసు మంత్రాంగముతో ముందుగా రాజధాని పరిస్థితులు చక్కదిద్దినాడు. క్రీ.శ॥ 1510 జనవరి 28 వ తేది బహమనీ సుల్తాన్ యూసప్ అదిల్షాన్తో మహబూబ్ నగర్ జిల్లా కోవెలకొండ వద్ద యుద్ధం జరిగింది అతనిని వధించాడు. తర్వాత పెనుగొండ, ఉమ్మత్తూరు శివసముద్రం, శ్రీరంగ పట్టణము శ్రీలంక కర్నాటక, తమిళనాడు, కేరళ, కొంకణ రాయచూరు, ఉదయగిరి కొండవీడు, కొండపల్లి అద్దంకి ఖమ్మం, భువనగిరి, ఓరుగల్లు, రాజమండ్రి, విశాఖ, సింహాద్రి కటకం జయించాడు. ఆయన 10 లక్షల సైన్యము కలిగి శ్రీలంక మొదలు గయ (బీహర్) వరకు గోవా మొదలు అదిలాబాద్ వరకు దక్షిణ భారతదేశమంతా దండయాత్ర చేశాడు. ఎక్కడా అపజయము లేదు.
ఆయన పరిపాలనలో రత్నాలు రాశులు పోసి కొలత పాత్రలతో అమ్మారు ఆరువేల చెరువులు నిర్మించి వ్యవసాయానికి పెద్ద పీటవేశాడు. తుంగభద్ర నదికి 14 చోట్ల ఆనకట్టలు వేయించి త్రాగునీరు, వ్యవసాయ భూములకు మళ్లించాడు. ఐదువేల దేవాలయములు, మండపములు, బాటసారులకు బావులు నిర్మించి ఆయన కాలము స్వర్ణయుగంగా విదేశీ, స్వదేశీ, చరిత్రకారులు వ్రాశారు. హంపి నగరము శత్రుదుర్భేద్య నగరంగా సకల సంపదలకు నిలయంగా రోమ్నగరం కంటే ఎంతో విశాలమయినదని 73 మైళ్లు విస్తీర్ణము అంతఃపురం చేరుకోవాలంటే ఏడుకోట గోడలు దాటి వెళ్లాలని విదేశీ చరిత్రకారులు వ్రాశారు.
వివాహము: మొదటి భార్య తిరుమలదేవి; గంగరాజు వీరప్ప కుమార్తె గంగరాజుల ఆడపడుచు.
రెండవ భార్య: చిన్నాదేవి: రాయసం కొండమరుసయ్య పెంపుడు కుమార్తె రాయసం వారి ఆడపడుచు.
మూడవ భార్య: తుక్కాదేవి (వరదాంబ) కటకం ప్రతాపరుద్ర గజపతి కుమార్తె. (1) కుమారుడు: తుళువ తిరుమల రాయలు (విజయనగర సామ్రాజ్యాదీశులకు)
కుమార్తెలు: మోహనాంగి, వెంగమాంబ, క్రిష్ణవేణి. క్రిష్ణరాయలు - 1526 - జూన్ 15 వ తేది అనారోగ్యముతో స్వర్గస్తులయ్యారు. ఆయన సమాది ఆనెగొందిలో తుంగభద్రానది గట్టన 64 సంభాలతో నిర్మించారు.
- భట్టరుశెట్టి పద్మారావు రాయలు
Sri Krishnadevaraya Coronation
Explore the history of Sri Krishnadevaraya's coronation and his impact on the Vijayanagara Empire. Sri Krishnadevarayalu Pattabhishekam
sri krishna devarayala pattabhishekam | sri krishna devarayala rajya palana | sri krishna devarayalu balija kshatriyudu | tuluva vamsham | sri krishna devaraya mother caste | sri krishna devaraya varasulu | kapu community