Musunuri Kapaya Nayaka
Musunuri Kapaya Nayaka. యుద్ధరంగములో ముస్లిం మూకలను తెలుగునేల మీద తరిమి తరిమి కొట్టిన మృగేంద్రుడు మన కాపయనాయకుడు.

ముసునూరు కాపయ్య నాయకుడు
కాకతీయ ప్రతాపరుద్రుడు స్వర్గమునకేగిన పిమ్మట "త్రిలింగ దేశము” ముస్లింపాలకులచే నాక్రమింపబడియుండ సముద్రములో మునిగియున్న భూమండలమును ఆదివరాహావతారుడగు నారాయణుడుద్దరించినట్లు యవనోదర స్థమగు ఆంధ్రదేశమును ప్రోలయ నాయకుడు అతని అనంతరం వారి సోదరుడు. కాపయ్య నాయకుడు రాజ్యమునకు వచ్చిరి.
పోతి నాయకుడు, దేవానాయకుడు, కామానాయకుడు, రాజానాయకుడు అనే నలుగురు అన్నదమ్ములు తెలగ కులస్థులు, కాకతీయుల వద్ద సైనికాధికారులు కట్టు అధికారులుగా ఉండేవారు. వారు “కట్టుకాపు” కులస్థులని, విద్యారణ్య స్వామి “విద్యారణ్యశిక్ష” అనే గ్రంథములో వ్రాశారు. ఆయన ఓరుగల్లు నివాసి. దేవానాయకుని కుమారుడు కాపయ్య నాయకుడు వీరే ముసునూరు. సోదరులు ఓరుగల్లు పాలకులు. ఓరుగల్లు పతనం తర్వాత ఏర్పడిన ముస్లీముల దుష్పరిపాలన వలన ప్రజలలో ఏర్పడిన అసంతృప్తిని అవకాశంగా తీసుకొని ప్రోలయ నాయకుడు మన్యం అటవీ ప్రాంతములో భయంకరమైన. కీకారణ్యంలో గోదావరి చెంతనున్న మాల్య వంత పర్వతముపై దుర్గం ఉంది. ఇది భద్రాచలం డివిజన్లో ఉంది. మొదట దీనిని తెలుగు చోళ బలిజ రాజులు పాలించారు. (కట్టు అనగా ఒక అధికారి).
భద్రాచలం ప్రాంతములోని రేకపల్లి కేంద్రంగా చేసుకొని తురుష్కులతో పోరాడాడు. ఈ పోరాటంలో ప్రోలయ నాయకునికి అతని పిన తండ్రి కుమారుడైన కాపయ్య నాయకుడు కుడి భుజమై సహకరించాడు అంతేగాక ప్రోలయ నాయకునికి రుద్రదేవుడు, అన్నయ మంత్రి, అద్దంకి వేమారెడ్డి, తాతాపిన్నమ రాజు, మొదలయిన వారు సహకరించారు. ప్రోలయ నాయకుడు తన మిత్రుల సహాయంతో తురుష్కుల పై యుద్ధాలు చేసి వారిని పారద్రోలి. గోదావరి ప్రాంతములోని మాల్యవంత పర్వతం సమీపంలోని “రేకపల్లి” రాజధానిగా స్వతంత్ర రాజ్యం స్థాపించారు. నేటి భద్రాచలం తాలూకా రేకపల్లియే.
ఆనాటి రేకపల్లి ప్రోలయ నాయకుని ఘన కార్యములు "విలస తామ్ర శాసనము” (అమలాపురం దగ్గర) విలస గ్రామములో ఉన్నది దానిలో ఈ క్రింది విధంగా ఉన్నది.
"ప్రతాపరుద్ర తా గ్మాంశా లోకాంతర తిరొహితే |
తురుష్కాంధ తమిస్రేణ సమాక్రాంతం మహితలం ॥
ద్విజాతీయః త్యా జత కర్మ బందాః
భగ్నాశ్చ దేన ప్రతిమాః సమస్తా ।
విద్యాద్చి రిప్లైః చిరకాల భుక్తాః
సర్వే ప్యపా హారిష త్యా గ్రహారాః ॥
అత్రై కర్షణ లాభే
పాపైః యవనైః యవనైః బలాత్కారాత్
దినాదిన కుటుంబాః
కృషివలా నాశమాపనాః
ధన దారాధి కే నృణాం
కస్మింశ్చిదపి వస్తుని
స్వాయత్తతా మతి ర్మా భూత్
భు వితస్యాం మహానది ॥
వేయా సురా గోపి శ తంచ బోజ్యం
లీలా విహారో ద్విజ ఘానంచ।
అశ్రాంత మాసీత్ యవనాధ మానాం
కథం సుజీవెత్ భువి జినలోకః ॥
ఇత్థం తైర్యవనంటైః ప్రబాద్యమానం
త్రై లింగం ధరణీ తతం సురారి. కల్పైః ||
తాత్పర్యము: ప్రతాపరుద్రుడను సూర్యుడు అస్తమించగా భూతలమును తురకలు అనే కటిక చీకటులు అవతరించినవి. బ్రాహ్మణులు కర్మ హీనులుగా చేయబడిరి దేవతా విగ్రహములన్నియు ముక్కలయినవి పండితులు చాలా కాలము నుండి అనుభవిస్తున్న అగ్రహారాలు అన్ని అపహరించబడినవి. పండించిన పంటలను పాపులైన తురకలు లాగుకొనగా దరిద్రులు, ధనికులు అను బేధము లేకుండా రైతు కుటుంబములన్నియు నాశనమయినవి ఆ మహా విపత్తులో ప్రజలకు ధనము "భార్య" మొదలైన ఏ వస్తువు మీద కూడా తమది అను బుద్ది లేకుండా పోయెను. నీచులైన తురకలు, కల్లుత్రాగులు, గోమాంసము తినుట బ్రాహ్మణులను చంపుట అనునవి నిరంతర వినోద విహారములు కాగా భూమి మీద ప్రాణ కోటి ఏ విధంగా బ్రతుకును ఈ విధంగా రాక్షసులతో సమానులైన తురక సేనలచే తెలుగు నేల ఘోరంగా భాదింపబడినది. ఆ సమయములో విష్ణు అంశతో కాపు కులములో పుట్టిన ప్రోలయ నాయకుడు పాలనాధికారమునకు వచ్చాడు అని ఆ శాసనములో ఉంది. క్రీ॥శ॥ 1325 నాటికి ముస్లీం పాలకులకు వ్యతిరేకంగా ప్రోలయ నాయకుడు అతని సమాఖ్య తిరుగుబాటు చేసి విదేశీ ముస్లీముల ప్రాబల్యము నుండి తీరాంధ్ర మరియు తెలుగు దేశమునకు స్వేచ్ఛ ప్రసాదించారని ఆ ప్రాంతపు కాకతీయ రాజ్యములో సర్దారులందరు విశ్వసనీయంగా ప్రోలయ నాయకుడి ఆదేశాలను పాటించారు. అతడు హిందూ ధర్మాన్ని పునఃస్థాపించాడు. వేద పాండిత్యానికి ప్రాపకం కల్గించాడు. తన ప్రాంతములో వైదిక యజ్ఞయాగాదులను సమురుద్దరించాడు. ముస్లీముల ఆక్రమణకు ముందు అగ్రహారాలు ఎవరికి చెందినవో వారికి పునర్వానం చేశాడు. అన్యాయ పూరితమైన పన్నులను రద్దు చేశాడు. ప్రోలయ నాయకుడు దేశంలో శాంతి భద్రతలను పునరుద్దరించాడు తమ పాలనాకాలంలో ముస్లీముపాలకులు భ్రష్టు పట్టించిన అన్నింటిని తిరిగి యదాస్థితికి చేర్చారు.
తీరాంధ్రలోని నాయకులు సాధించిన విజయంతో ప్రోత్సాహం పొందిన పశ్చిమాంధ్ర (రాయలసీమ) నాయకులు కూడా మహామ్మద్ బీన్ తుగ్లక్ కంపిలిలో నియమించిన రాజప్రతినిధి “మాలిక్నబె” పై తిరుగు బాటు లేవనెత్తిన ఆరవీటి వంశస్థుడైన చంద్ర వంశ బలిజ క్షత్రియుడు సోమదేవరాజు నాయకత్వములో రాజ ప్రతినిధిగా పరిపాలనను అసాధ్యం చేసారు. దిక్కుదోచని ముస్లీం రాజ ప్రతినిధి కాలికి బుద్ధి చెప్పాడు. ఆరవీటివారు మొసలి మడుగు, సాతానికోట, కందన వోలు (కర్నూలు) కల్వకొలను, రాచూరు (రాయచూరు) ఏతగిరి (పన్గిరి) గంగినేని కొండ కోటలను పట్టుకున్నారు అనెగొంది, ముదుగలు (ముద్గల్) తదితర ప్రాంతాలలో ఎన్నో విజయవంతమైన యుద్ధారంగాలు, కోటల పేర్లు, తిరుగుబాటు సమయములో ఆరవీటి సోమదేవరాజు కార్యరంగాన్ని మనకు చూచిస్తాయి. తను పట్టుకున్న కోటలు అతడు విజయం సాధించిన యుద్ధాల నుండి ప్రస్తుతం హైద్రాబాద్ సంస్థానం దక్షిణ ప్రాంతములోని చాలా బాగము అతని ఆదేశంలోనికి వచ్చినట్లు తెలియుచున్నది. ఈ కోటకు రాజ ప్రతినిదులుగా తన బంధువులను అధికారులను నియమించాడు. వారు వాటిని చాలా కాలం పాటు తమ ఆదీనంలో ఉంచుకున్నారు. అలా పశ్చిమాంధ్ర తీరం ముస్లీం అధికారులు ఆదీనము నుండి క్రీ॥శ॥ 1328-29 సం||లో బయటపడిపోయింది. ప్రోలయ నాయకుడు అమలాపురంలోని విలసగ్రామాన్ని భరద్వాజ గోత్రీకుడైన అన్నయ కుమారుడు. వెన్నయకు చంద్ర గ్రహణ కాలములో దానం చేస్తూ “విలస" తామ్ర శాసనమును ఇచ్చాడు. ఈ శాసనం క్రీ॥శ॥ 1330 ప్రాంతం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం.
రేకపల్లి కోటను పాలించుటచే వారి వంశీయులు రేక పల్లి వారయినారు. ఆయింటి పేరుగల తెలగాలు నేటికి కోనసీమ ఇరుసు మండలం గ్రామములోనూ అమలాపురం నల్లావారి వీధిలోనూ, రాజోలులో హ॥ గో॥జిల్లా భీమవరం, పాలకొల్లులోనూ, ఈ వంశస్థులు తెలగాలుగాయున్నారు. వీరి పూర్వీకులు రేకపల్లి నుండి వచ్చినట్లు, గానే చెబుతున్నారు. రచయిత:డా|| పోలవరపు హైమావతి గారు (కాకతీయ వైభవ తోరణాలు, గ్రంథంలో పోలయ్య నాయకుడు కాపు కులస్థుడని వ్రాశారు).
ముసునూరి (గంట్రౌతువారు) కాపయ్య నాయకుడు : 1336 - 1368
ప్రోలయ నాయకునికి సంతానం లేదు అందువలన అతని అనంతరం రాజ్య భారాన్ని అతని పినతండ్రి కుమారుడు దేవానాయకుని కుమారుడు కాపయ్య నాయకుడికి అప్పగించాడు.
ప్రోలయ నాయకుని మరణానంతరం రాజయిన కాపయ్య నాయకుడు. తురుష్కల పై స్వాతంత్ర్యం సంగ్రామం కొనసాగించి, ముస్లీం పాలన నుండి దేశాన్ని విముక్తి చేయడమే. ఉమ్మడి లక్ష్యంతో వరంగల్లు హిందువులు, ద్వారసముద్రం పాలకుడు మూడవ బల్లాలుడు వంటి పొరుగు హిందూ రాజులతో రహస్య సమాలోచనలు జరిపాడు. అతని పదకాలు విజయవంతమయ్యాయి. అతని నాయకత్వము క్రింద వరంగల్లు హిందువుల క్రీ॥శ॥ 1336-37లో తెలంగాణా ముస్లిం రాజు ప్రతినిధులకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవనెత్తారు. యుద్ధంలో వారిని ఓడించి పారద్రోలి వరంగల్లు కోటను పట్టుకున్నాడు. అలా మళ్లీ తెలంగాణాలో హిందువుల స్వాతంత్ర్యం పునరుద్ధరించబడింది.
వరంగల్లు తిరుగు బాటు నాయకుడిగా “ఇసామి" చెప్పిన' కాపానీడు" బరనీ చెప్పిన కన్యా నాయకుడు, అజీజుల్లా తబాతబా పేర్కొన్న కాబా నాయండ్, ఫెరిస్థా చెప్పిన కంహానాయక్, కృష్ణ నాయక్ లు మరెవరో కాదు. కాపయ్య నాయకుడే !
తెలంగాణా నుండి ముస్లిములను పారద్రోలాక వరంగల్లు రాజధానిగా మొత్తం ఆంధ్రదేశము ఎన్నుకున్న మకుటుంలేని మహారాజు “మన తెలగ బిడ్డ” కాపయ నాయకుడు, ఆంధ్ర దేశాదీశ్వర, ఆంధ్ర సురత్రాణ అన్న బిరుదు వహించాడు. ప్రతాపరుద్రుడిని సేవించిన డెబ్బయి ఐదుగురు నాయకులవారసులు అతనికి బాసటగా నిలిశారు. వారు లాంఛనంగా అతడిని తమ ప్రభువుగా గుర్తిస్తూనే తమ వారసత్వ ఉద్యోగాలు లేక ప్రాంతాలను అంతకు ముందులాగేనే స్వతంత్రంగా పరిపాలించారు. అని “అని తల్లి కలువ చేరు” శాసనం చెబుతుంది.
కాపయ్య నాయకుడు తన రాజ్యాన్ని పదిలపరుచుకుంటున్న సమయములో దక్షిణ భారత దేశములో ఢిల్లీ సుల్తాన్ పై మరో తిరుగు బాటు జరిగింది. ఢిల్లీ సుల్తాన్ సైన్యాలను ఓడించి జాఫర్ ఖాన్ అనే బిరుదుతో క్రీ॥శ॥ 1347లో గుల్బర్గా రాజధానిగా బహుమ నీరాజ్యాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తాన్ పై తిరుగుబాటుకు జాఫర్ ఖాన్కు కాపయ నాయకుడు సహకరించాడు అని ఫెరిప్టా వ్రాశాడు. కొత్త ముస్లీం రాజ్యం ఢిల్లీ సామ్రాజ్యం నుండి తనకు రక్షణగా ఉంటుందని కాపయ నాయకుడు. అశించి ఉండవచ్చును కాని ఆశను వమ్ము చేస్తూ చేసిన మేలును మరచి కృతఘ్నతతో కొత్త ముస్లీం రాజ్యం కాపయ్య నాయకుడికి ప్రక్కలో బల్లెంలా తయారయింది. చివరకు దక్షిణ భారత దేశములోని అన్నీ హిందూరాజ్యాలకు తలనొప్పిగా తయారయింది.
కాపయ్య నాయకుని పట్ల కృతఘ్నుడైన హసన్ గంగూ క్రీ॥శ॥ 1350 లో వరంగల్లును జయించడానికి. సికిందర్ ఖాన్ నాయకత్వంలో గొప్ప సేనను పంపాడు. కాపయ్య నాయకుడు ఓడిపోయి కైలాస దుర్గాన్ని (నిజామాబాద్ జిల్లా) అపార ధనరాశు లు ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఆంధ్ర దేశపు పశ్చిమోత్తర ప్రాంతాలు బహుమనీ రాజ్యంలో చేరిపోయాయి.
విదేశీ పాలన నుండి ఆంధ్రదేశాన్ని విముక్తము చేయడం దేశములోని వివిధ భాగాలలోని హిందూసర్దారులు వైఖరులలో, దృష్టి కోణంలో మార్పులు తీసుకొచ్చింది. వారి ఊహలను ఉత్తేజ పరచిన భావనలు వారిని ఏకం చేసిన ఉమ్మడి లక్ష్యం స్వాతంత్య్రం సిద్ధించగానే ఇంక తాము కలసి పని చేయవలసి ఉంటుందన్న భావనను జాగృతం చేయడంలో విఫలమయ్యంది తాము సాధించిన విజయం వారిలో ఓ ప్రమాదకరమయిన ప్రతిష్టా భావనను తప్పుడు భావనను కలిగించింది. సహజంగానే వారిలో అంతః కలహానికి దారి తీసింది ఏ ఆదర్శం కోసమైతే వారు ఏకమయ్యారో, పోరాడారో అది కొంతకాలానికే స్థిరపరుచు ఇతరులకు హాని కలిగిస్తూ విస్తరించు కొన ప్రయత్నించారు. ఫలితంగా ఈ చిన్న చిన్న నాయక రాజ్యాలు అంతరించింది నాయకులందరూ తమ స్వతంత్ర రాజ్యాలుగా ఎదిగాయి. అందువలన ఒరిగింది ఏమీ లేకపోయినా వారి మధ్య ఐక్యత అనేది అసాధ్యమయ్యింది. క్రీ॥శ॥ 1356 హసన్ గంగూ మరలా దండెత్తాడు. కాపయ్య నాయకుడు ఓడిపోయి భువనగిరి దుర్గాన్ని ఇచ్చి సంధి చేసుకున్నాడు. అల్లా ఉ ద్దీన్ హసన్ గంగూ. మరణం తర్వాత కాపయనాయకుడు విజయ నగర రాజులతో మైత్రి చేసుకొని తాను పోగొట్టుకున్న రాజ్యాలు తిరిగి గెలుచుకోడానికి ప్రయత్నించాడు. తన కుమారుడైన వినాయకదేవుని బహమనీ రాజ్యం పైకి దండయాత్రకు పంపాడు. వినాయకదేవుడు భువనగిరిని ఆక్రమించాడు. కౌలస్ను గూడా పట్టుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న మొదటి మహామ్మద్ “వెలంపట్టం” కోటను ముట్టడించి ఓడిపోయిపారిపోతున్న వినాయక దేవుని పట్టుకొని చిత్రవధ చేసి చంపాడు.
కాపయ్య నాయకుడు గోల్కొండ కోటను బహమనీలకు శాశ్వితంగా సమర్పించి సంది చేసుకున్నాడు. కాపయ్య నాయకుడి ఓటమిని చవి చూస్తున్న తరుణములో ఇతర తెలుగు నాయకులు అతనికి సహాయము చేయకపోగా అతని రాజ్యాన్ని కబళించాలని ప్రయత్నించారు. అట్టివారిలో రేచర్ల సింగమ నాయకుడు ప్రధముడు. ఇతడు కాపయ్య నాయకుడి సార్వభౌమత్వాన్ని ఎదిరించి, రాచకొండ రాజ్య విస్తరణకు పూనుకున్నాడు. తర్వాత సింగమ నాయకుని కుమారుడు అనపోతా నాయకుడు. వరంగల్లు పై దండెత్తాడు.
క్రీ॥శ॥ 1368 లో జరిగిన యుద్ధంలో సింగమ నాయుడు కొడుకు అను పోతానాయకుడు తన తమ్ముడు మాదా నాయకుడు, అతని కొడుకు పెద వేదగిరి నాయకుడు వెంటరాగా తెంగాణాలో ఆధిపత్యానికి కాపయ నాయకుడితో పోటీపడ్డాడు. వరంగల్లు జిల్లా భీమవరం వద్ద జరిగిన యుద్ధంలో కాపయ్య నాయకుడు మృత్యువాత పడ్డాడు. అలా తెలంగాణాలో రాజకొండ వరంగల్లు భువనగిరి కోటలను స్వాధీనం చేసుకొని అనుపోతా నాయకుడు (వెలమ) పాలించాడు. కాపయ్య నాయకునికి వ్యతిరేకంగా బహమనీ సుల్తానుతో రాజుకొండ నాయకులు మైత్రి నెరిపిన కారణంగా నేమో బహుశా భీమవరం యుద్ధంలో కాపయ్య నాయుడు మరణించాక అతడితో చేసుకున్న ఒప్పందం ప్రకారము వరంగల్లు రాజ్య విజయాన్ని బహ్మనీ సుల్తాన్ ఆమోదించి ఉండవచ్చును రేచర్ల పాలకుల పట్ల బహ్మనీ సుల్తానులు మైత్రీ పూర్వకంగా వ్యవహరించడానికి అదేకారణమయి. ఉండవచ్చును. కాపయ్య నాయకుడు చనిపోయి. రేచర్ల నాయకుల చేతిలోకి తెలంగాణా వెళ్లిన తర్వాత ఒక్క సారిగూడా బహమనీ సుల్తానులు దాడి చేయలేదు.
తర్వాత ఆంధ్రదేశము ఆకాలములో నాయకులెంత మంది ఉన్నారో అన్ని రాజ్యాలు. నాయకరాజ్యాలుగా దేశం విభాజితమయింది. వాటిలో ముఖ్యమైనది ముసునూరు తెలగు నాయకుల వరంగల్లు రాజ్యం, పద్మవెలమల, రాచకొండ రాజ్యం, యాదవ బలిజ క్షత్రియులు విజయ నగర రాజ్యం, పంట దేశటి వంశ. రెడ్డి నాయకులు కొండవీడు రాజ్యం, వాటితో పాటు చిన్నవయిన మంచి కొండ. కాపు నాయకుల కోరుకొండ రాజ్యం కొప్పుల తెలగ నాయకుల ఫిఠాపురం రాజ్యం కూడా ఉన్నాయి. వీరేగాక కళింగ తూర్పు గంగుల రాజ్యం వారి సామంత రాజ్యాలున్నాయి.
18 వ॥ శతాబ్దానికి చెందిన తెలుగు కవి మంగళగిరి ఆనందకవి. విజయానంద విలాసములో ఈ విషయం పేర్కోన్నాడు. ఈ కావ్యాన్ని దాట్ల రాజులు కంపితమిచ్చాడు. వీరు మందపాడు గ్రామ పాలకులు, కాకతీయ వంశీయులు వరంగల్ కాకతీయుల వారసులు సూర్యవంశానికి కాశ్యప గోత్రానికి చెందినవారు. విజయనగరానికి చెందిన సూర్యవంశ రాజులైన పూసపాటి వంశీకులు, వశిష్ట గోత్రీకులైన పరిచ్చేదుల వారసులు. ఈనాటి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుల వంశం.
చంద్ర వంశానికి చెందిన హరిసీమ కృష్ణుని వారసుడైన కోటకేతరాజు దాట్ల రాజుల మూలపురుషుడు (బలిజరాజులు)
తెలంగాణాకు చెందిన కట్టు (లేదాకన్ను) అనే వ్యక్తి ఉదంతాన్ని షంసిసిరాజ్ అఫీస్, తన తారీకీ ఫిరూజ్ షాహిలో క్లుప్తంగా వివరించాడు. కాకతీయ రాజుల్లో చివరివాడయిన ప్రతాపరుద్రుని వద్ద “కట్టు” అధికారిగా పని చేసేవాడు. తుగ్లక్ దండయాత్రలో పట్టుబడి ఇస్లాం మతం స్వీకరించి తన పేరు మాలిక్ మగ్బుల్గా మార్చుకొని ముస్లీం పాలకుల విశ్వాసాన్ని చూరగొని ఉపవజీరు స్థాయికి ఎదిగాడు నాగయ గన్నయ (తెలగ).
ఆర్యావట శాసనము - ఇది ద్రాక్షారామ చెంతనున్న ఆర్యా వటంలో ఉన్న శాసనం.
"స్వర్గదితే ప్రోలయ భూమిపాలే
విశ్వేశ్వరాజ్ఞ | మదిగయ్య గత్యా
అపాలయ తాపయ్య నాయకేంద్ర
ఆకాశ భారతి 3 వ॥ సంపుటి పేజీ నెం 243
సర్మెకంజి పత్రములు నెం : 19-1-14 పుట 43. కాపయనాయకుడు తెలగు కులస్థుడని, ఓరుగల్లు ప్రతాపరుద్రుడి బంధువని, విజయ నగరాదీశుడు. హరిహర బుక్కరాయలకు బంధువని తెలుస్తుంది.
కాపయ్య నాయకుని సామంతరాజులు
- ఇందలూరి రుద్రదేవుడు - సింహాచలం నుండి ఏలూరు వరకు
- కొప్పుల తెలుంగ రాయుడు (తెలగ) పిఠాపురం నుండి కొట్టాయం వరకు
- ముమ్మడి నాయకుడు (తెలగ) కోరుకొండ (కోనసీమ) కాపయ్య నాయకుని మేనకోడలు భర్త.
- ముసునూరి అనపోతా నాయకుడు (తెలగ) తొయ్యేరు.
- ముసునూరి ప్రోలయ నాయకుడు (రేకపల్లి) తెలగ
- ముసునూరి కాపయ్య నాయకుడు (వరంగల్లు) తెలగ.
- చెరకు వంశీ రెడ్డి (కమ్మనాడు ప్రాంతపాలకుడు)
- దేవగిరి నాయకుడు (తెలగ) పలనాడు.
- శ్రీగిరి నాయకుడు (తెలగ) తంగేడు.
- సోమయాజులు రుద్రసేనాని - (వెలనాడు)
- గోనవంశీయులు (మున్నూరు కాపులు) వర్ధమానపురం.
- ముప్పురి నాయకుడు - పాకనాడు.
- జుట్లలంక - ములికినాడు రేనాడు (తెలగ) జుట్ల ఎల్లాయలంక.
- రేచర్ల సింగమనాయకుడు రాచకొండ (వెలమ).
- గణపతి నాయకుడు (రెడ్డినాయుడు - తెలగ).
- ప్రోలయ వేమారెడ్డి - అద్దంకి (దేశాయిశెట్టి).
ప్రోలయనాయకుడు బ్రాహ్మణ రక్షణ కొరకు తన భందువులైన తెలగాలను "విలస” గ్రామములో రక్షణగా ఉంచెను నేటికిని గోదావరి తీరములో కాపవరం, పోలవరం. అను గ్రామములు కలవు నేటికి “విలస”. జమీన్ గానే చెబుతారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతమదే. విలస గ్రామములో గల శివాలయ చరిత్ర పరిశీలించినపుడు దాని శాసనములో ప్రోలయనాయకుని బంధువులుగా తెలగ కాపుల చరిత్ర కనిపిస్తుంది. కాపయ్య నాయకుని, కాపానీడు, కొప్పులనీడు, కొప్పురెడ్డి, కలినీడు, కలిగినీడు, అను పేర్లు ఈ వంశానికి చెందినవే. నేటికిని "పోలమ్మ" పేరున పోలాల అమావాస్య చేస్తున్నారు.
కాపయ నాయకుని 72 మంది సైన్యాధి పతులలో తెలగ బలిజలు.
- అల్లు రుద్రదేవుడు
- మురారి మలిదేవుడు
- నాగ దేవర (దాది) సమాదేవుడు
- మహాదేవ నాయుడి సమాదేవుడు
- కొవ్వూరి నాభి దేవుడు
- గండయ్య నాయడు
- నట్లవారి బాలయ్య
- ఎర్రాసాహసి (సైన్యాధిపతి)
- మచ్చా రుద్రదేవుడు
- చోడదేవుడు
- కర్రి దేవుడు
- అభంగరౌతురాయుడు
మొదలగువారున్నారు. విలస గ్రామములో 13వ శతాబ్దపు శివాలయ పెత్తనం. విషయంలో కోర్టులో జరిగిన వివాదంలో ఈ గ్రామము విషయము కంచి పీఠాధి పతుల రికార్డులలో నమోదు చేయబడినట్లు వారు. తెలగ నాయకులుగా పేర్కొనబడెను. కాపయ్య నాయకుని బంధువు మంచి కొండ గణపతినాయకుడు. వారి శాసనాల్లో తెలగ నాయకుడిగా ముమ్మిడివరం శివాలయ శాసనములో చెప్పుకున్నాడు.
Musunuri Kapaya Nayaka
musunuru kapaya nayakudu kapu kulasthudu | musunuri kapaya naidu | musunuri nayakulu | kapu community