అన్నయ్యగారి వంశ చరిత్ర
చంద్రవంశ క్షత్రియులు తుర్వసువంశపరంపరానుగత తుళువాన్వయులు శ్రీ పెనుగొండ రాజవంశీయులైన శ్రీ అన్నయ్యగారి వారి వంశ చరిత్ర సంపెట (తుళువ) తిమ్మానాయక – (తుళువ అన్నయగారి వంశీయుల మూలపురుషుడు)
చరిత్రకు అందినంతవరకు తుళువ వంశీయులమగు మా వంశ మూలపురుషుడు తిమ్మానాయకుడు. వీరి పూర్వ గృహనామం సంపెటవారు. వీరు చంద్రవంశములోని యయాతి మహారాజు కుమారులలో తుర్వసు మహారాజు వంశీయులు 13వ శతాబ్దములో హెూయసల రాకుమార్తె దేవకీదేవిని, తుర్వసు వంశపరంపరలోనివారూ భారద్వాజస గోత్రీకులునగు సంపెట తిమ్మానాయకుడు (1350-1465) వివాహమాడెను. వీరు 13వ శతాబ్దములో పెనుగొండ నుండి గూటిబయలు గంగరాజ వంశీయులతో చేరి అక్కడ కొంత కాలము నివసించేవారని, వాటికి గంగరాజువారు, పెదరాచవారు, చెన్నకవారు, ఎద్దులవారు వంటి క్షత్రియ వంశాలవారికి దగ్గరి బంధువులుగా ఉండేవారనీ, యీ గూటిబయలులో వీరి ఆనవాళ్ళుగా మిగిలిన సంపెటవారి భావి అనునది నేటికీ గలదని, యీ సంపెటవారి కుటుంబానికి ఆనవాలుగానున్న ఆభావి తరువాత ఎలుకుంట్లవారి భావిగా పేరు మార్చబడినదని, కృష్ణదేవరాయలవారి కుటుంబాల వారికి పారంపర్య కులగురువులుగా ఉన్న తాతాచార్య వంశీకులైన శ్రీ పుట్టపర్తి నారాయణా చార్యులు గారు, వీరి మేనమామగారైన శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు, శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు, శ్రీ ఎద్దుల రామానందరెడ్డి గారు వంటి పరిశోధకులు మరియు అహోబిలంలోని తాతాచార్య వంశములోవారైన శ్రీ వైష్ణవ కులగురువులు, రాయలవారి పూర్వీకులు పెనుగొండ ప్రాంతీయులచే తాము వంశ పారంపర్యమంగా తెలుసుకున్నవి యీ తిమ్మానాయనింగారి వంశ పరంపరలోని వారమైన అన్నయగారి వంశీయులమైన మాకు తెలియబరచుచూ ఉండేవారు.ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోన ఉన్న పెనుగొండ పురాతన కాలం నుంచి దక్షిణాదిన రాజకీయంగా వాణిజ్యపరంగా చాలా ప్రాముఖ్యత కలిగిన దుర్గాలలో ఒకటిగా పేరుగాంచినది. అనాదిగా తెలుగువారి శౌర్యప్రతాపాలకు సజీవసాక్ష్యం యీ పెనుగొండ. తొలుత మహాబలి కులోద్భవులగు బాణవంశీయులు దీనిని రాజధానిగా చేసుకొని పరిపాలించెను.
క్రీ.శ. 13వ శతాబ్దమున హోయసల పాలకుల చేతిలో పెనుగొండ ఉండెను. అప్పుడు దీనిని హోయసల ప్రతినిధిగా 3వ బళ్ళాలదేవుని ప్రధానమంత్రి అళియ మాచెయ దండనాయక సుమారు క్రీ.శ. 1320 నుండి 1333 వరకు పరిపాలించెను. యీతనికి గంగిదేవ దండనాయక, ఈశ్వర దండనాయక అని ఇరువురు కుమారులు ఉండేవారు. వీరిలో గంగిదేవ దండనాయకుడు క్రీ.శ. 1333 నుండి పాలించుచున్న సమయంలో హంపి కేంద్రముగా నున్న హరిహర బుక్కరాయల వంశీయులు క్రీ.శ. 1342లో హెూయసలరాజుల ద్వారసముద్రాన్ని జయించెను. క్రీ.శ. 1349లో పెనుగొండను హరిహర బుక్కరాయల వంశీయులు యీ గంగరాజు అనే గంగిదేవ దండనాయకను జయించెను. మునుపు విద్యారణ్య స్వాములు చిన్నతనములో పెనుగొండలోనే ఉండేవాడని యీతనికి ఆళియ మాచెయ దండనాయక పెనుగొండలో దాచి ఉంచిన అపార ధన నిక్షేపాలగురించి తెలుసునని అతను ఇక్కడినుండే ఆ సంపదనంతా వెలికితీయించి విజయనగరానికి తరలించినాడని నేటికీ స్థానికులు కథలు కథలుగా చెప్పుకోవడం వంటి ఎన్నో గాధలను శ్రీ జానమజ్జి హనుమచ్చాస్త్రి గారు, శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వంటివారు సేకరించి వాటిని ఆశక్తి కలిగినవారికి వివరిస్తూ ఉండేవారు. సంగమ బుక్కరాయల వంశీయులు హంపీ, విజయనగరంలోని కోట చుట్టూ నిర్మించినట్లు యీ పెనుగొండ యందు కూడా 7 ప్రాకారలు నిర్మించెను. అంతకుపూర్వం యీ సంగమ బుక్కరాయల వంశీకులు కొలువుండిన ఓరుగల్లునందు కూడా కోటచుట్టూ 7 ప్రాకారాలుండేవని చరిత్ర ద్వారా తెలుస్తుంది.
ఈ విధముగా సంగమ బుక్కరాయల కుటుంబీకుల మూలంగా పెనుగొండ రాజ్యము పోగొట్టుకున్న గంగిదేవి దండనాయకుడు అను గంగరాజు సోదరులు (వీరిని స్థానికులందరూ గంగరాజువారు అని పిలిస్తుండేవారు అందుకు వీరు గంగరాజువారు అని పేరుకెక్కెను) పెనుగొండనుండి తమకు మిగిలిన బోయ సైన్యాలతో అనంతపురంజిల్లాలోని ఈశ్వరమల పర్వత ప్రాంతాలకు చేరి అక్కడ గూటిబయలు ప్రాంతంలో తలదాచుకొని అక్కడ కొండపై కోటను నిర్మించుకొని ఉండెను. తనుతోబాటు వచ్చిన బోయ సైన్యాలకు ఇండ్లు కట్టుకోవడానికి ఇవ్వబడిన ప్రాంతాన్ని స్థానికులు నేటికి బోయగడ్డ అని పిలుస్తారు. వీళ్లు వ్యవసాయాలు, దూరప్రాంతాలతో వ్యాపారాలు అభివృద్ధి చేసెను. యీ గంగరాజు వంశీయులు అప్పటికి వీరి శైవ మతస్తులుగా ఉండేవారు. యీ గంగరాజుగారికి, రంగయ్యరాజు, రామయ్యరాజు, కృష్ణయ్య రాజు అని ముగ్గురు కొడుకులు.
వీరిలో గంగరాజు రామయ్యరాజు గారి భార్య బుక్కపట్నం పాలకులగు శ్రీవైష్ణవులు శెట్టి బలిజ వంశీయులు ఆగర్భశ్రీమంతులు అగు చెన్నకవారి ఆడపడుచూ చెన్నక వెంకటప్ప రాజు గారి కుమార్తె లక్ష్మమ్మ గారు.
(యీ చండ్రక లేదా చెన్నక వంశీయులు పూర్వం అహిచ్ఛత్రపురానికి (ఉత్తరప్రదేశ్) చెందిన నాగవంశ క్షత్రియ పరంపరకు చెందినవారై సెండ్రక లేదా చెండ్రక అను పేర్లతో బాదామీ చాళుక్య రాజవంశీయులకు రాజబంధువులుగా బనవాసీరాజ్యములో (కర్నాటక) నాగరఖండ, సెండ్రక విషయములను పరిపాలిస్తూ ఉండేవారనియు వీరిలో భానుశక్తి, వాసశక్తి అరస వంటివారు కాదంబరాజగు హరివర్మన్ క్రిందనూ, సెండ్రక విజయాశక్తి కుమారుడు కుందా శక్తి యీతని కుమారుడు దుర్గాశక్తి వంటివారు చాళుక్య 2వ పులకేశి మహారాజు క్రిందను, దేవాశక్తి వంటివారు చాళుక్య విక్రమాదిత్య మహారాజు క్రిందనూ, మహారాజు పొగిలి, జయశక్తి, నాగశక్తి వంటివారు ఆ తరువాత చాళుక్య వినయాదిత్య, చాళుక్య కీర్తివర్మ వంటి బాదామీ చాళుక్య రాజవంశీయులకు సామంతులుగా ఉండేవారనియు ఆ వంశ పరంపరలోని వారిలో తరువాత కాలంలో తుర్వసు వంశ పరంపరలోనివారగు కోలారు గంగరాజుల బంధువులుగా ఉంటూ కార్యక్రమములో రాచరికానికి అవకాశం కలగకపోవు సందర్భాలలో వీర బలిజ సమయములయందు చేరి సెండ్రక లేదా చెండక లేదా సెంణ్ణక వారని పిలువబడుచూ తరువాత ప్రస్తుత రూపంమైన సెన్నక లేగా చెన్నకగా వీరింటి పేరు మారి క్షత్రియ బలిజలుగా, శెట్టి బలిజలుగా యీ పెనుకొండరాజ్యము చేరారనియు వీరు పూర్వము నుండి చాళుక్య మరియు గంగవంశీయులకు రాజబంధువులనియు శ్రీ పుట్టపర్తి వారి ద్వారా తెలిసిన విషయం. వీరికి గంగరాజుల బాలవీరయ్య నాయకుడు పుట్టెను. వీరి కాలంలో కొక్కంటిపాళెం పాళెగారుగానున్న కుమార మల్లప్పనాయుడు అనే పట్రకులజుడు యీ గంగరాజు వంశీయులకు మిత్రులుగా ఉండి తమ సహాయ సహకారాలందించు చుండేవారని తెలియుచున్నది.)
బుక్కపట్నం పాలకునిగా విజయనగరం బుక్కరాయల కుటుంబీకులచే నియమించబడిన రాజబంధువు, రాజవంశీయుడు అయిన పెదరాచ వీరయ్య రాజు గారు పెనుగొండ పాలకులగు యీశ్వర దండనాయకుని తోడియల్లుడు యీ పెదరాచ వీరయ్య గారి భార్య లింగమ్మ గారికి పెదరాచ మల్లయ్యరాజు, మంగమ్మ అని సంతానం. వీరిలో పెదరాచ మల్లయ్యరాజు గారికి చెన్నక వెంకటప్పరాజు గారి పెదతండ్రి కూతురు చెన్నక నరసమ్మను, యీ పెదరాచ మంగమ్మ గారిని చెన్నక వెంకటప్పరాజుగారికీ ఇచ్చి వివాహము జరిపించెను. యీ పెదరాచ మల్లయ్య రాజు గారి కుమార్తె పుట్టమ్మను చెన్నక వెంటకప్పరాజు గారి కుమారుడు చెన్నక నారాయుడికి ఇచ్చెను. యీ చెన్నక వెంకటప్పరాజు గారి పెదనాన్నగారి మరో కుమార్తె లక్ష్మమ్మ గారిని గూటిబయలులోనున్న గంగరాజుల రామయ్యరాజుగారికిచ్చి వివాహం చేసెను.
గంగరాజుల రామయ్యరాజు గారికి గంగరాజుల బాలవీరయ్య నాయుకుడను పుత్రుడు కలగగా ఇతనికి చెన్నక వెంకటప్పరాజు గారి కుమార్తె అయిన చెన్నక తిమ్మమాంబగారిని ఇచ్చి క్రీ.శ.1414లో వివాహము జరిపించెను.
యీమే క్రీ.శ.1434లో భర్త చనిపోయిన తరువాత సతీసహగమనము చేసుకొని సతీతిమ్మమాంబగా ప్రఖ్యాతికెక్కెను. యీమె జ్ఞాపకార్ధముగా అప్పుడు నాటిన మర్రి మొక్క ఈనాడు శాఖోపశాఖలుగా 8 యకరాలలో విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద మర్రి వృక్షముగా ప్రఖ్యాతిగాంచి గిన్నీసుబుక్కు రికార్డులోనికి ఎక్కినది. నాటి సతీ తిమ్మమాంబ బంధువర్గీయులుగా ఎద్దులవారి కోటలో ఉంటూ నానాదేశాలలోనూ వ్యాపారాలు చేయుచూ తిమ్మమాంబ గారి కాలమున గూటిబయలు చేరిన ఎద్దులవారి వంశీయులు నేటికీ గూటిబయలు గ్రామంలో తరతరాలుగా వ్యాపారం వ్యవసాయం చేస్తూ భూస్వాములుగా ఉండి తిమ్మమాంబ గారి చరిత్రము భద్రపరచుకొని ఉన్నారు.
తుళువ యీశ్వరనాయకుని 2వ కుమారుడు తుళువ తిమ్మానాయకుని వంశావళి
యీ తుళువ యీశ్వరనాయకుని ద్వితీయకుమారుడూ గొప్ప వీరుడైన తుళువ తిమ్మానాయకుణ్ణి వీరి వంశీయులను యీతని అన్నగారైన తుళువ నరసానాయకుడు తన తరువాత పెనుగొండ పాలకులుగా చేసెను. వీరు తుళువదొరలు అని విజయనగర సంస్థానమున, పెనుగొండ సంస్థానమున పిలువబడేవారు. యీతనికి మొదటి భార్య లక్ష్మమాంబ గారి ద్వారా తుళువ కృష్ణప్ప రాజ నాయనింగారు, ద్వితీయ భార్య తిరుమలాంబగారిద్వారా తుళువ యెల్లప్పరాజనాయనింగారు, తుళువ రంగప్పరాజు నాయనింగారు, తుళువ నరసప్పరాజు నాయనంగారు అని నలుగురు కుమారులు కలిగి విజయనగరాన గొప్పగొప్ప దళనాయకులుగా ప్రసిద్ధులైనారు.
యీ తుళువ తిమ్మనాయనిగారి పెద్దకుమారుడు తుళువ కృష్ణప్పరాజనయంగారు (అన్నయ గారు) వంశవృక్షం
యీ తుళువ తిమ్మానాయనింగారి పెద్దకుమారుడు తుళువ కృష్ణప్పరాజనాయనింగారు గొప్ప వీరుడూ. పినతండ్రి కుమారుడూ తనకన్నా వయసులో పెద్దవాడు. వరుసకు అన్నగారూ కుటుంబమరియాదలు బాగా తెలిసినవాడూ. కుటుంబ వ్యవహారాలను సమర్థవంతంగా చక్కదిద్దుటలో నేర్పుగలవాడు అయి ఉండుటతో యీతనిని శ్రీకృష్ణదేవరాయల వారు గౌరవంతో అన్నయ గారు అని పిలుస్తూ కుటుంబ వ్యవహారాలయందు అతని సలహాలు, సంప్రదింపులు పొందుచుండేవారు. కృష్ణరాయలకు ఆప్తుడుగా అతని పట్టాభిషేక సమయమున రాయలతోపాటు ఉండెను. యీతను కూడా రాయలువారి కాలంలో పెనుగొండరాజ్యానికి పాలకునిగా ఉండెను. అప్పటినుండి తుళు వ వంశీయులగు యీ కృష్ణప్పరాజనాయనింగారి వంశీయులు అన్నయగారి వంశీయులవి విజయనగర సామ్రాజ్యమున ప్రసిద్ధులైనారు. యీ వంశములో యెందరో ప్రసిద్ధులు క్షత్రియులుగా, బలిజలుగా వర్ధిల్లెను. రాచరికము అనుభవించెను. వాణిజ్యమూ చేసెను. (యీ విషయాలన్నీ సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు, అహోబిలంలో నుండే శ్రీవైష్ణవ గురు పరంపరలలోనివారు వంటి రాజగురు వంశ పరంపరలలోనివారికి పారంపర్యంగా తెలిసిన విషయాలు. వీరిలో తాతాచార్యుల వంశీయులయిన పుట్టపర్తివారు తుళువ అన్నయగారి వంశీకులమైన మాతో ఉన్న సాన్నిహిత్యంతో కలిసిన సందర్భాలలో పెనుగొండ వైభవం, విజయనగర వైభవం, పతనం, రాయలవారి వైభవం తలచుకొని కళ్ళనీళ్ళు పెట్టుకొనుచుండేవారు).
అన్నయగారు యీ తుళువ కృష్ణప్పరాజగారికి భార్య కొండమాంబ. శ్రీరంగపట్నం రాజుగంగరాజు వీరయ్య సోదరి వీరికి అన్నయ గారి రంగప్పరాయలు, అన్నయగారి తిమ్మరాయనాయక అని పిలువబడు ఇరువురు కుమారులు కలిగెను. వీరు విజయనగర సామ్రాజ్య సేనానాయకులుగా ఉంటూ క్రీ.శ. 1565 నాటి తళ్ళికోట యుద్ధములో సామ్రాజ్య రక్షణలో వీరోచితముగా పోరాడి వీరమరణంపొందెను.
వీరిలో ఈ అన్నయగారి తిమ్మరాయనాయక గారి భార్య వెంగళాంబ. వీరికి కృష్ణరాయ నాయక అని కుమారుడు కలిగెను. యీ కృష్ణరాయనాయక భార్య బయ్యమాంబ గారు వీరికి తిమ్మప్పరాయలు అని కుమారుడు కలిగెను. వీరందరూ వంశపారంపర్యాయంగా పెనుగొండ నందు దళపతులుగా, సేనానాయకులుగా తుళువ, ఆరవీటి వంశీయుల వద్ద రాజరిక గౌరవాలతో ఉండేవారు. యీ తిమ్మప్పరాయలు గారికి ఓబమాంబ, వెంగమాంబ అని ఇద్దరు భార్యలు. వీరిలో మొదటి భార్య ఓబమాంబ గారికి రంగప్ప రాయలు, కృష్ణరాయలు, 2వ భార్య వెంగమాంబ గారికి తిరుమలరాయలు, వేంకటపతిరాయలు గారలను నలుగురు కుమారులు కలిగెను. వీరిలో రెండవవాడైన కృష్ణరాయలుగారి భార్య తిమ్మమాంబ గారు. వీరికి తిమ్మప్పరాయలు అని కుమారుడు కలిగెను.
యీ తిమ్మప్పరాయలు గారికి కృష్ణమాంబ, వెంగళాంబ, అచ్చమాంబ అని ముగ్గురు భార్యలు. వీరిలో మొదటి భార్య కృష్ణమాంబ గారికి నరసింహరాయలు, రంగరాయలు, 2వ భార్య వెంగళాంబగారికి కృష్ణప్పరాయలు, 3వ భార్య అచ్చమాంబ గారికి నరసప్పారాయలు
గారలను నలుగురు కుమారులు కలిగెను.
వీరిలో కడగొట్టువాడైన నరసప్పారాయలు గారి భార్య గౌరమాంబ గారు. వీరికి తిమ్మప్పారాయలు అని కుమారుడు కలిగెను.
యీ తిమ్మప్పారాయలు గారికి వెంగళాంబ, లక్ష్మమాంబ అని ఇరువురు భార్యలు. వీరిలో 1వ భార్య వెంగళాంబ గారికి పురుష సంతానం లేదు. 2వ భార్య లక్ష్మమాంబ గారికి నరసప్ప గారు అని కుమారుడు గలిగెను. వీరి వంశీయులు తరువాత కాల క్రమములో పరంపరగా బీజపూరు, గోలుకొండ నవాబులకాడ సేనాధిపత్యము వహించి పెనుగొండలో జాగరీలు అనుభవించుచూ ఉండేవారు.
అన్నయ్య గారి వంశం ఆదునిక చరిత్ర
కడప జిల్లాలో ప్రఖ్యాతికెక్కిన అన్నయ్యగారి వంశీయులు పూర్వం తుళువ ఈశ్వర పెనాయకుని సంతతి వారు. గొండపాలకవర్గానికి చెందినవారి. వీరి పూర్వీకుడు శ్రీ కృష్ణదేవరాయలువారికి వరసకు అన్నయ్య అవ్వడంతో ఈతనిని రాయలవారు అన్నయ్యగారు అని గౌరవంగా పిలిచేవారు అప్పటినుండి వీరివంశీయులుగా అన్నయ్యగారి వంశీయులని విజయనగర సంస్థానమున ప్రసిద్ధులైనారు. ఈ వంశములో యెందరో ప్రసిద్ధులు వీరబలిజ క్షత్రియులుగా వర్ధిల్లినారు.
శాసనము : శా.శ. 1528 (కీ.శ. 1606) నాటి శాసనమున శ్రీ వీరవెంటపతి దేవరాయలు పెనుగొండ పాలకులగానున్నప్పుడు విజయనగరం వద్ద మల్లియవనంకు చెందిన కవరై (బలిజ) కులజులగు లాలగనాయకుని కుమారుడుగు అన్నయ్యగారి అనుమయ్యగారు కాంజీవరంలోని దేవునకు (వరదరాజస్వామి) 365 బంగారు హుణలు సంవత్సరములోని 365 రోజులకు 9 మరియు పెద్ద పుట్టెడు బియ్యము దేవుని నైవేద్యాలకు మరియు దేవాలయ సేవకులకు ఖర్చులు దానంచేసెను. (ఇన్స్క్రిప్షన్సు ఎట్ కాంజీవరం పేజి 71, ఎకానమినేషన్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ మెంకంజీ మాన్యుస్క్రిప్ట్సు విలియం టేలర్ 1838) లో వ్రాశారు.
అన్నయ్య గారి వంశీయులు అనంతపురం జిల్లా పెనుగొండ సంస్థానాదీశులు రాజబంధువులు బలిజ క్షత్రియవంశం. వారి రాజబంధువుల వారసుడే మన అన్నయ్య గారి ముగ్గురాళ్ల క్రిష్ణప్ప గారు, వీరి తండ్రి పేరు నరసప్ప రాయలు (వీరిది గోరంట్ల గ్రామం) పెనుగొండలో జరిగిన కొన్ని సంఘటనలలో కిష్టప్ప గారి తల్లిదండ్రులు చిన్న తనములోనే చనిపోయిన కారణంగా వారి “దాసి” పెంచింది. వారు విరగంరాజుపల్లె గ్రామం (పెనుగొండ దగ్గర) చేరారు క్రిష్ణప్ప గారు చదువుకొనే రోజులలో బ్రిటీష్ తెల్లదొరలతో పరిచయము కలగడం వలన ఆయన ఇంగ్లీషులో అనర్ఘళంగా మాట్లాడటం అలవాటయింది. ఆ పరిచయము వలననే రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ వారికెంతో సహాయం చేశారు. ప్రతిఫలంగా క్రిష్ణప్ప గారిని పెనుగొండ ప్రాంత ఇరిగేషన్ డైరెక్టరుగా నియమించారు.
క్రీ॥శ॥ 1890 సం||లో కిష్టప్ప గారు మూడువేల ఎకరాలలో కలబందను పెంచి లండన్ నుండి యంత్రాలు దిగుమతి చేసుకొని కలబందనార ఉత్పత్తి చేసి కలబంద ఎక్స్పోర్ట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. అప్పట్లో ఆయనను ‘మిషన్’ కిష్టప్పగా పిలిచారు.
1881లో కడప జిల్లాలోని బైరటీస్ గనులు దేశములోనే గాక ప్రపంచములోనే ప్రసిద్ధి పొందాయి. అటువంటి ప్రసిద్ధి చెందిన గనుల త్రవ్వకానికి 1918లో శ్రీకారము చుట్టి ఆస్బెస్టాస్ మినిరల్ పౌడర్ను విదేశాలకు ఎగుమతి చేసి గనుల రారాజుగా ఖ్యాతి వహించిన మహానీయుడు, మన ముగ్గురాళ్ల క్రిష్టప్పగారు బైరటీస్ గనులలో ముగ్గురాళ్లను త్రవ్వించి వాటిని యంత్రాలతో పౌడరు (ముగ్గుగా మార్చి) కడప జిల్లా గనుల పరిశ్రమ కేంద్రంగా వెలుగొందేలా చేసినందు వలననే క్రిష్టప్పగారి పేరు ముందు ముగ్గు రాళ్లు వచ్చి చేరింది. ఆనాటి ఆనాటి నుండే ఆయన ముగ్గురాళ్ల క్రిష్టప్పగా చిరకీర్తినిపొందారు. తర్వాత అనంతపురం, కడప జిల్లాలో దాదాపు పదివేల ఎకరముల వరకు స్వంత భూములుండేవి. రెండు టన్నులు బంగారము ఉండి గవర్నమెంటు ఆరు లక్షల పన్ను చెల్లించేవారు.
అప్పట్లో ఈస్టిండియా కంపెనీ “అస్బెస్టాస్ మినిరల్” వ్యాపారము చేసేవారు. అయితే మినరల్ తయారి వారికి అంతుపట్టేది కాదు. ఒక యిల్లాలు ఇంటిముందు ముగ్గువేస్తుంటే కిష్టప్ప చూడడం తటస్థించింది. ఆ ముగ్గు పౌడర్ ఎలా వచ్చిందో ఆలోచించారు. అటు తర్వాత అప్పటి కలెక్టర్ “పిళ్ళే” ను కలసి ముగ్గురాళ్ల త్రవ్వకానికి అనుమతి కోరారు. ఈస్టిండియా కంపెనీ చేయలేనిపని మీరు చెయగలరా అని అడిగి అతనికి లీజుకిచ్చారు. బాలారిష్టలను ఆధిగమిస్తూ బైరటీస్ గనుల త్రవ్వకం శీఘ్రతరం చేసి పదేళ్ళలో ముగ్గురాళ్ల వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చేశాడు. క్రిష్ణప్పగారి విజయాన్ని డాక్టర్ కింగ్ లండన్ తన “జియాలాజికల్ సర్వే ఆఫ్ మెమోరీస్ ఆఫ్ ఇండియా” గ్రంధములో “క్రిస్టోటైన్ గ్రేడ్ ఆస్ బెస్టాస్ బెస్ట్ ఇన్ వరల్డ్” అని అభివర్ణించారు.
అలాగే ఆస్బెస్టాస్ మినరల్ను విదేశాలకు ఎగుమతి చేసిన ప్రధమ వ్యక్తిగా బ్రిటీష్ ప్రభుత్వము గుర్తించి “పయనీర్ ఆఫ్ మైనింగ్ ఫీల్డ్” (గనుల రంగంలో రారాజు) అనే పతకాన్ని బహూకరించి గౌరవించింది. 1926 సం॥ పశ్చిమ బెంగాల్ (కలకత్తా) లో (ఎ. కిష్టప్ప పౌండర్ ఆఫ్ దిస్ మినరల్స్) అవార్డు పత్రికలలో ప్రసంశించారు. అనంతపురం, పులివెందుల ప్రాంతములో 1400 ఎకరాలు అటు తర్వాత వెయ్యి ఎకరాలు కొని బైరటీస్ గనులలో ముగ్గుపొడి రూపంలో తెల్ల బంగారాన్ని పండించారు. ముగ్గురాయి పౌడరును “బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, తదితర దేశాలకు ఎగుమతి చేసి అంతర్జాతీయ ఖ్యాతి నార్జించారు.
కడపలో ఆయన భవంతి చుట్టూ కాంపౌండ్ దాదాపు ఇరవై ఎకరాలు ఆయన గుర్రపు స్వారి, కర్రసాము, చేసేవారు ఆయన వద్ద జాతి గుర్రాలుండేవి వాటి ఆలనా పాలనా చూడడానికి ‘టిప్పు సుల్తాన్’ అనే వ్యక్తి చూస్తూ, ఆయన ప్రయాణానికి గుర్రపు బండి సిద్ధం చేసేవాడు. ఒక రోజు కిష్టప్ప గారు లేని సమయములో కిర్రు చెప్పులేసుకొని టిప్పు సాహెబ్ వెలుతుండగా ఆ చెప్పుల శబ్దము సహించలేని కలెక్టర్ ‘టిప్పు’ను అరెస్టు చేసి పులివెందుల జైలులో వేశాడు తర్వాత విషయం తెలిసిన కిష్టప్ప గారు కలెక్టరును సంప్రదించి విడుదల చేయించాడు. దీనిని బట్టి బ్రిటీష్ వారి వద్ద ఎంత పలుకుబడి ఉoదో అర్థంచేసుకోవచ్చు. క్రిష్టప్ప గొప్ప హంటర్ కూడా, ఆయన మన జంతువును మాత్రమే వేటాడేవాడు, అంటే అతని పౌరుషం ఎంత గొప్పదో అర్థమౌతుంది.
ఆయన షిర్డిసాయి భక్తుడు దక్షణ భారతదేశములోనే మొట్టమొదట సాయిబాబా దేవాలయము నిర్మించి ధన్యులయ్యారు. 1000 సంవత్సరముల చరిత్ర గల “గుడిపల్లి” లో సజ్జగుంట రంగనాథ స్వామి దేవాలయానికి 150 ఎకరాల భూమి కేటాయించి పునరుద్ధరణ చేశారు. పేద విద్యార్థులనెందరినో చదివించారు. అలా చదివిన వారిలో నేడు ఏ.ఎ.ఎస్. ఐ.పి.ఎస్. హెూదాగల వారు కూడా ఉన్నారు. ఆయన వద్ద పనిచేసిన కుటుంబాలు, వ్యాపార, రాజకీయ రంగాలలో చాలా ఉన్నతస్థాయికెదిగారు ఒంటిమిట్ట దేవాలయాలకు, సత్రములకు దానమిచ్చారు.
అన్నయ్య గారి ముగ్గురాళ్ళ కిష్టప్ప గారి కాంపౌండులో ఆనాడు, విదేశీకార్లు, ఫోర్డ్, ఆస్టిన్, ప్లేమత్, డార్డ్ క్రిష్ణర్ మరియు జింకలు, దుప్పులు, నెమళ్లు, పావురాళు, జాతి కోళ్లు, ముర్రాజాతి గేదెలు, మేలు జాతి పందెపు ఎద్దులు, గోవులు, కళకళలాడుతూ స్వర్గములా తెలుగు దనము ఉట్టిపడేలా ఉండేది. మొత్తం పనివారు పదివేల మంది ఉ Oడేవారు. ఈ నాటికి వారి కుటుంబములలో క్షత్రియ సాంప్రదాయములైన యజ్ఞోపవీతము (జంద్యము) ధరిస్తారు. రాజరాజేశ్వరి పూజ (గాయత్రి మంత్రం) ఉ పనయనం అఖండజ్యోతి, శ్రీచక్రం, వివాహ సమయములో బంగారము, వెండి, నూలు, జంద్యములు, ధరిస్తారు.
ప్రతి మాసము, ప్రతి సంవత్సరము పితృదేవతలకు సంతర్పణ జరుపుతూనే ఉంది. అన్నయ్యగారి (ముగ్గురాళ్ల) క్రిష్టప్ప గారు 1975 ఆగష్టు 18వ తేదీన స్వర్గస్తులయ్యారు. వీరు మోటుకాళ్లు శైవమతం, జనకుల గోత్రం, ఇప్పటికి ఇద్దరు బ్రాహ్మణులు సాయిబాబా గుడిలోనూ వారి కుటుంబాలలో పూజలు నిర్వహిస్తూ ఉ న్నారు.
ఆనాడు వీరి సంస్థలలో పని చేసిన ఉద్యోగులు లీజుదారులు వారసులు ఈనాడు కొందరు మాజీ ముఖ్యమంత్రిగా యం.పి.లుగా జిల్లా పరిషత్ ఛైర్మెన్లుగా రాష్ట్ర మంత్రులుగా ప్రముఖ వ్యాపారులుగా అభివృద్ధి చెందారు.
End
Annayyagari Family History in Telugu
Explore the rich history and heritage of the Balija Kshatriya Annayyagari family in Telugu, detailing their origins, traditions.
Leave a Reply