Araveeti Clan
Araveeti Clan (అరవీటి వంశము) History. అరవీటి, ఆరవీటి వంశ చరిత్ర గురించి చెలుసుకోండి. Full History in Kapu Community

అరవీటి వంశము
ఆంధ్ర రాజుల వంశీయులు ఉజ్జయినియందు విక్రమార్కుని సంతతి వారు, పశ్చిమ సముద్ర తీరాన కాలచూర్య వంశము, కళ్యాణి నగరమున చాళుక్య సంతతివారు, ఓరుగల్లు నందు కాకతీయ గణపతి రాయసంతతి వారు, కొండవీటియందు గజపతిరాయ సంతతివారు ఆనెగొందియందు నరపతిరాయ సంతతివారు, ఓండ్ర దేశములోని కళింగదేశ, కళింగ రాజవంశము వారున్నూరు. వీరంతా వీరబలిజ వంశీయులు. 56 దేశాలు పాలించిన సంతతివారు. అరవీటివారు బలిజ క్షత్రియులని కడపజిల్లా శాసనములలో కలదు.
యయాతి సంతతిలోని వారు హైహేయ వంశ కాలచూరి వంశీయులు క్రీ.శ.567 సం|| బుద్ధ మహారాజు మహారాష్ట్ర కళ్యాణ దుర్గం (బొంబాయి దగ్గర) రాజధానిగా రాజ్యము పాలించారు. వీరి వంశీయులు శంకరుడు, కానుడు, విజ్జలుడు, వసుంధరాదేవి, గోమఠేశ్వరుడు, సంగమదేవి, ఆవాహ మల్లుడు, శిగణుడు, అనువారు.
కర్ణాటకలోని కళ్యాణపురమునకు రాజధానిగా పాలిస్తున్న వీరి భందువైన చాళు క్య రాజువద్ద విజ్జలుడు సైన్యాధిపతిగా ఉండి రాజును చంపి చాళుక్య రాజ్య సింహాసనమ దిష్టించాడు. తర్వాత విజ్జల రాజు చాళుక్య వంశీయుడిగానే కొనసాగాడు.
దేవనహళ్లి శాసనము :
శ్రీమన్నారాయణునకు బ్రహ్మ, అతని వలన అత్రి మహర్షి, అత్రివలన చంద్రుడు | అతనికి బుధుడు ఇక క్రమముగా పురూరవుడు, ఆయువు నహుషుడు, యయాతి, పురుమహా రాజు మొదలగు వారు జన్మించిరి. పురు వంశీయుడైన పాండవ మధ్యముడు అర్జునుని యొక్క 83వ తరంవారు. నంద మహారాజు అతనియొక్క తొమ్మిదవ తరంవారు | చాళుక్యుడు. అతని సంతతిలో హైహేయ వంశ కాలసూర్య బిజ్జలుడు జన్మించాడు.
నరపతి వంశావళి:
Vide Page 25, E26, and 73A Contribution to the Histories of Southern India - Part I.
Inscriptions by Dr. G. Oppert, Ph.D, Professor of Sanskrit, Presidency College, Madras.
అరవీటివారు :
వీరు హైహేయవంశ కాలచూరి బిజ్జలరాజు వంశమువారు. వీరిది ఆత్రేయ గోత్రము. విజ్జల రాజు కళ్యాణ చాళుక్య రాజ్య సైన్యాధిపతిగా ఉండి, కళ్యాణి రాజ్యము నాక్రమించాడు. అతని కుమారుడు మైలపుడు ఇతని కుమారుడు హైమ్మలరాయుడు లేక బొమ్మరాజు. అతని కుమారుడు తాతాపిన్నమరాజు. ఇతను కాకతీయులవద్ద సైనికాధికారిగా ఉండేవాడు. ఇతను కుమారులు అరవీటి సోమదేవరాజు, కొటిగంటి రాఘవుడు (కొడగంటి కోటపాలకుడు) అనువారు. కాకతీయుల ఆస్థానములో ముఖ్య నాయకులు. ఆ కాలములో కాపయ్య నాయకుని వెంట వెళ్లిన వారంతా గోదావరి పరిసరాల్లో గొరిల్లా యుద్దము నడిపారు. వీరు ప్రకాశంజిల్లా “పెద్దారవీడు" గ్రామస్థులు. ఆరవీటి వారుగా పిలువబడ్డారు.
క్రీ.శ. 1325 సం॥లో వారి ప్రోత్సాహంతోనే "కొండపల్లి” ప్రాంతము నుండి బలిజకుల ప్రముఖుడు హైహేయవంశ సోమదేవరాజు కాకతీయ రాజ్య పతనానంతరం ముస్లిం రాజుల పరిపాలనకు వ్యతిరేకముగా కాపయ్య నాయకుడు నాయకత్వంలో జరిగిన “ఆంధ్ర మహా విప్లవము”లో అరవీటి సోమదేవరాజు నల్గొండ జిల్లా నాగులపాటి క్షేత్రమునుండి విప్లవం మొదలు పెట్టాడు. ఇతను కొండపల్లిలో నివాసముండేవాడు. ఇతని సోదరుడు కొడగంటి రాఘవుడుతో కలిసి ఐదువేల అశ్వికదళంతో ఏడు కోటలను అవలీలగా జయించిన వీరుడు ఇతని పేరు చెబితే తుగ్లక్ ప్రతినిధులు గజ, గజ వణికేవారట. ఇతని చరిత్రను దోనేరు కోనేటి నాదుడు రచించిన ద్విపద భాగవతమునందును, అందుగుల వెంకయ్య రచించిన “రామ రాజీయము" నందును వ్రాసి ఉన్నారు (1542).
అనెగొందిని ఆక్రమించిన "మాలిక్ నబి" ఇతని చేతిలో చిక్కి ఓడి ఆరువేల గుర్రాలతో బందీలుగా చిక్కి సామంతునిగా ఉంటానని నమ్మించి స్వతంత్రం ప్రకటించుకొనెను. కాని ప్రచండుడైన సోమదేవరాజు వెంటనే వెళ్లి అతనిని మట్టి కరిపించెను. మాలిక్ నబి ఢిల్లీకి పారిపోయాడు. సోమదేవరాజు జయించిన కోటలన్నియు రాయలసీమ, కర్ణాటక ప్రాంతములలో కలవు. ఆయన జయించిన కోటలను తమ బంధువులను తన సోదరుని కుమారులను ముఖ్య పాలకులుగా నియమించెను. ఆయా కోటలు పాలించుటచే ఆ పాలకులకు ఆ కోటల పేర్లే ఇంటి పేర్లుగా పిలువబడింది. తర్వాత సోమదేవరాజు అనారోగ్యంతో మరణించాడు.
కోటపేరు | ఇంటిపేరు |
రాయచూరు | రాచూరివారు |
నంద్యాలకోట | నంద్యాలవారు |
కల్వకొలనుకోట | కల్వకొలనువారు |
ఏతగిరి కోట | ఏతంవారు (ఏతగిరి) |
సాతాను కోట (శాతవాహన కోట) | సాతానికోట, సాతానివారు |
గంగినేని కోట | గంగినవారు, గంగినేనివారు |
కందవోలు కోట | కందవోలు వారు |
ఈ ఇండ్ల పేర్లు గలవారు, ఆ కోట ప్రాంతములో బలిజలుగా ఉన్నారు.
నంద్యాల వారు : రాయలసీమ, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాలలో నేడు అధికంగా బలిజలుగా ఉన్నారు.
కల్వకొలనువారు : కర్నూలులోను, నల్గొండజిల్లా అడ్లూరు మండలం “మేళ్ళచెరువు” గ్రామములోనూ కలరు. భీమవరం, విజయవాడ, అమలాపురంలో "కల్వకొలనువారి వీధి" కలదు. కల్వకొలను వారు అను 'తెలగాలు' కలరు. కల్వకొలను తాతాజీ గారు ప్రముఖ నాయకులుగా వున్నారు (అమలాపురం). ఈ వంశ వీరులు ప్రసక్తి ఆంగ్లేయులకు నూజివీడు జమిందారులకు జరిగిన యుద్ధంలో విజయవాడ పరిసర నాయకులుగా, ఆ జమిందారీ మిత్రులుగా ఆంగ్ల సైన్యాన్ని ఎదుర్కొని నష్టపరిచారు. ఈ కల్వకొలను వారు పెత్తందారులు అని ఆనాటి యుద్ధము వలన తెలుస్తుంది.
యాతంవారు : గోదావరి, ప్రకాశం జిల్లాలలో ఉన్నారు. సాతాని, సాతాని కోట వారు, బలిజలు తెలగాలుగా ఉన్నారు. గంగినవారు తెలగాలుగా గోదావరి జిల్లాలో ఉన్నారు. కందవోలు వారు రాయలసీమ జిల్లాలో బలిజలుగా ఉన్నారు. రాచూరి వారు బలిజలుగా ఉన్నారు.
అరవీటి సోమదేవరాజు కష్టపడి సంపాదించిన కోటలు హరిహర బుక్కరాయలకు దారాధత్తము చేసి విజయనగర రాజ్యములో కలిపాడు. ఇది యుద్ధ రీత్యా జరిగినది కాదు కొందరు అరవీటి వంశములో గూడా హరిహర బుక్కరాయ పేర్లనుబట్టి రెండు వంశాల వారు బంధువులు సంగం వంశమువారు, అరవీటి వారి వంశంలో అంతర్భాగమయ్యింది. దానివల్లనే ఎలాంటి ప్రతిఘటన లేకుండా లాభాపేక్ష లేకుండా రాజీపడిపోయారు (అరవీటి సోమదేవరాజు అనారోగ్యముతో చనిపోయాడు).
సోమదేవరాజు ఒకేరోజులో ఐదు వేలమంది గుర్రపు రౌతులతో కలిసి ఏడు కోటలును జయించెను. ఆ జయించిన కోటలకు తమ బంధువులును రాజులుగా నియమించెను. ఈ విషయము రామరాజీయం గ్రంథంలో కలదు.
“దండెత్తి చని మహాద్దడ వృత్తిని
గంగినేని కొండ వలీలగాను గట్టి
కందనవోలును గలువకోలును గోట
రాచూరు నెటువంటి రాజుకైన
సాదింపరాని మొగలి మడుగు మఱియ
తగిరీ నగరము సాతని కోట
వరుసతో సాధించి పరహర్షందత్త
స్మహజన తతులబ్రోచి”
నంద్యాల, గంగినేనికొండ, కల్వకొలను, కందవోలు, రాయచూరు, యాదగిరి, మొగిలి మడుగు అను ఏడు కోటలు ఏక కాలంలో జయించి ఆ కోటలకు వారి బంధువులను నియమించెను వారంతా ఆ కోటల పేర్లతో ఆయింటి పేర్లవారయ్యారు.
యయాతి రాజు కుమారుడు యదువు సంతతిలోని హైహేయవంశము వారు (చాళుక్య). వీరు వంశ మూలాలు. మొదట కోనసీమను పాలించిన కోనవారు, దంగేటివారు, చాగివారు, కొప్పులనాడును పాలించిన “మహిపాల" వారు మొదలగు ఇండ్ల పేర్లతో ఆత్రేయ గోత్రముతో ఉన్నారు. పోతిరెడ్డి తల్లయ్యరెడ్డి వంశీయులున్నారు వీరు కడపజిల్లా పులివెందుల దగ్గర ఇడుపులపాయ, వీరన్నగట్టుపాలెంలో బలిజలుగా ఉన్నారు.
అరవీటి సోమదేవరాజు - బిరుదులు
- మాళవ రాజేంద్ర మస్తకశూల
- ఆకులపాటి వీరక్షత్రమల్ల
- ముదుగంటి భరత్ క్షేత్రమల్ల
- ఆనెగొంది వీరక్షేత్ర భారతమల్ల
- కుంతి వీరక్షేత్ర భారతమల్ల
- ఆకులపాటి, ముదుగంటి, ఆనెగొంది, నార విజయలక్ష్మి సమీక్షీకరణ.
- వీరక్షాత్ర భారతమల్ల - మొదలగునవి కలవు.
ఈ బిరుదులు కొన్ని నేడు, బలిజ తెలగాలలో ఇండ్లపేర్లుగా మారాయి. ఇతడు ఆంధ్ర జాతీయ సమితిలో ముఖ్య నాయకుడు, ఇతనికి కాపయ్య నాయకుడు సహాయం చేసినట్లుగా ముఖ్య ఆధారం. ఇతని అనుచరులు శంభువ రాయలు, వేమారెడ్డి, రాచూరి దుర్గ విభళ, అజేయ మండలీయరగండ, కంపిలి రాజ్యం (ఆనెగొంది) యుద్ధములలో వీరు సహాయము చేసినట్లు తెలుస్తుంది.
ఆరవీటి సోమదేవరాజును గూర్చి రామరాజీయంలో 182వ పద్యము ఆరవీటి పురమును పాలించుట చేత “ఆరవీటి” వారయ్యారని ఇందు చెప్పబడింది.
తే॥ ధరకు దోడపని వినుతింప దగిన యట్టి
యరవీటి పురాద్యక్షుడగుచు దాత
పిన్నన్నప సోమదేవుండె యెన్నదగియె
నఖిల సత్కవి సురభూజ మనుచునెపుడు
ఈ “ఆరవీటి కోట” కర్నూలు జిల్లాలో కలదు (ఈనాటి అనంతపురం జిల్లాలో వుంది). ఆరవీటి బుక్కరాజు కర్నూలును పాలించారు. ఈ బుక్కరాజు సోదరి బుక్కాంబను తుళువ తిమ్మానాయకుడు (తుళువ ప్రాంత పాలకుడు) కుమారుడు ఈశ్వర నాయకుడికిచ్చి వివాహము చేశారు. ఆమె కుమారులు (1) తుళువ నర్సానాయకుడు (శ్రీకృష్ణదేవరాయలు తండ్రి), (2) తుళువ (దళవాయి) తిమ్మానాయకుడు, వీరి కుమారుడు తుళువ క్రిష్ణమ నాయకుడు, పెనుగొండ సంస్థానాధీశుడు, ఇతనిని శ్రీ కృష్ణదేవరాయలు అన్నయ్యగారు అని పిలిచేవారు. అందువలన అతని వంశము అన్నయ్యగారి వంశమయింది. అన్నయ్యగారి (ముగ్గురాళ్ల) శ్రీకృష్ణప్ప గారి కుటుంబము కడపలో ఉంది.
తుళువ తిమ్మానాయకుడు చంద్రగిరి సాళువ వారివద్ద దళవాయిగా ఉండేవాడు. అందువలన అతని వంశీయులు “దళవాయి” వారిగా పిలువబడినారు. ఆ వంశములోని దళవాయి రాఘవరాజు కుమార్తె చెల్లమ్మను ఆరవీటి వారికిచ్చారు. వారి వంశీయులకు సంతానం లేని కారణంగా దళవాయి చినపంపాపతి రాజును దత్తతీసుకున్నారు. ఆ దళవాయి వారే ఈనాటి ప్రస్తుత ఆనెగొందికోటలో ఉన్న సంస్థానాదీశులు వారసులు ఆరవీటి వంశీయులుగా ఉన్నారు. సమ్మెట, తుళువ, దళవాయి, అన్నయగారు కుటుంబాల వారలయ్యారు.
ఆరవీటి బుక్కరాజు భార్యలు ఆబ్బళ్ళదేవి కుమారుడు సింగరాజు (నంద్యాలవారు) రెండవ భార్య భల్లాదేవి కుమారుడు రామరాజు కందనవోలు - (కర్నూలు పాలకుడు) ఆరవీటి రామరాజు పెద్దకుమారుడు తిమ్మరాజు (జౌకు పాలకుడు) ఆ తిమ్మభూపాలునికి దోనేరు కోనేరునాదుడు రచించిన బాల భాగవతము అంకితమివ్వబడినది.
రాయలసీమ ప్రాంతమునకు చెందిన తెలుగు బలిజ వంశముగా ఈ వంశ శాసనాలు తిరుపతిలో ఉన్నాయి. పేజి నెం. 464 తిరుపతి చరిత్ర. వీరు పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యం పాలించారు. ఈ రాజవంశం అనేక కోటలు పాలించి వారికి అనేక కోటలపేర్లు ఇండ్ల పేర్లుగా ఉన్నాయి. వారి ఒక్కొక్క వంశం పరిశీలిద్దాము - ఆరవీటివారు రాయలసీమను దాదాపు 300 సం||లు పాలించారు.
కోనేటి వంశము : “కోనేటి” వారు అనే ఇంటిపేరుగల బలిజలు రాయలసీమలోని, కడప జిల్లాలలో కలరు. ఆరవీటి బుక్కరాయలు కుమారుడు రామరాజు ఈ వంశమునకు మూలపురుషుడు. ఆరవీటి రామరాయలు మనుమడే కోనేటి రామరాయలు. తల్లికోట యుద్ధానంతరం కోనేటి కొండమ రాజు ఆదోని కోటను పాలించెను. తరువాత వీరు పలు సంస్థానములతో “దళవాయి”లు పనిచేసి దళవాయి వారయ్యెను. నేడు దళవాయివారు బలిజలుగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలలో బలిజలుగా ఉన్నారు. వీరు కర్ణాటక, రాయదుర్గం, చిత్రదుర్గం కోటలను చాలా కాలం పాలించారు.
- కోనేటి వెంకట సుబ్బయ్య, మల్లెపల్లి గ్రామం, బ్రహ్మంగారి మఠం (మం).
- కోనేటి హరి, దువ్వూరు గ్రామం, మైదుకూరు మండలం.
- కోనేటి సుబ్బరాయుడు, బద్వేలు గ్రామం, కోనేటి విజయ (బద్వేలు)
- కోనేటి పుల్లయ్య, దర్గాదేవి, బద్వేలు.
- కోనేటి వెంకటేశ్వర్లు, మల్లెపల్లి, బి. మఠం
- కోనేటి రామచంద్ర, వేంపల్లె గ్రామం, కడపజిల్లా.
- కోనేటి పుల్లయ్య, మల్లెపల్లి,
- కోనేటి గురవయ్య, మల్లెపల్లి, బలిజలుగా వున్నారు.
అవుకు వారు : ఇది కర్నూలు జిల్లా కోయిలగుండ్ల తాలూకా అవుకు సంస్థానముండినది.
తిమ్మరాజు అతని వంశస్థుడు ఆరవీటి బుక్కరాజు భార్య బళ్లాదేవి వీరి కుమారుడు రామరాజు అతనికి ముగ్గురు కుమారులు. అందులో తిమ్మరాజు శ్రీరంగరాజు ఆదోని, కందవోలును పాలించారు. శ్రీరంగరాజు కుమారులలో రెండవవాడు తిమ్మరాజు. (మూడవ వాడు అళియ రామరాయలు శ్రీకృష్ణ దేవరాయలు పెద్దల్లుడు). తిమ్మరాజు, జౌకుపురము నిర్మించుటచే వీరికి అవుకువారని పేరు వచ్చింది. క్రిష్ణరాయలు పట్టాభిషేక మహోత్సవ సమయములో మంత్రి, దండనాయకులతో సహా "అవుకు” వారిని రాయవాచకము గ్రంథములో పేర్కొనెను. అళియ రామరాయలు అల్లుడు కాపూరి తిమ్మా నాయకుడు అని కొండవీటి చరిత్ర పేజి నెం.134 లో పేర్కొనబడింది. కావూరివారు బలిజలుగా వున్నారు.
అరవీటి రామరాయలుకు వీరబొమ్మ రాయలు బిరుదు కలదు. ఇది కళ్యాణ రాజ్యం పాలకుడు తెలుగు బిజ్జన బిరుదు ఇతను చోళవంశీయుడు. కట్టా హరిదాసరాజు భార్య కృష్ణమాంబ (అనునామె పోచిరాజు సింగరాజు కుమార్తె). వీరి కుమారుడు రామరాజు, ఇతని కుమారుడు కట్టా వరదరాజు. రామాయణం గ్రంధకర్త వీరందరూ క్షత్రియ బలిజలు.
నంద్యాల వంశమువారు : ఆరవీటి వంశస్థులే నంద్యాలను పాలించుటచే నంద్యాల వారయ్యారు. నంద్యాల పాలకులైనటువంటి నంద్యాల నరసింహరాజు మరియు క్రిష్ణభూపాలుడు ప్రసిద్ధి చెందారు. తల్లికోట యుద్ధానంతరం వీరి వంశీయులు కోనసీమ, గోదావరి నదీపాయల మధ్య, లంక గ్రామాలలోను అనేక ప్రాంతాలలో నంద్యాల వంశస్థులు బలిజలుగా ఉన్నారు. ఆనెగొంది, రాయచూరు, పెనుగొండ, చంద్రగిరి పాలకులుగా 17వ శతాబ్దము వరకు కనిపిస్తారు.
కొటగంటి : తాతాపిన్నమ శౌరి కుమారుడు కొటిగల్లు రాఘవుడు. ఆరవీటి వంశీయుడు. ఇతడు కోటిగల్లు దుర్గము జయించుట చేత కొటగంటి వారయ్యారు. ఇతని బిరుదు “గందరగోళ”. యుద్ధములో సైన్యాన్ని చిందరవందర చేసి గందరగోళం సృష్టిస్తాడు.
సిద్దిరాజు తిమ్మరాజు : ఇతడు శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు మేనల్లుడు. రామరాయ కాలంలో కొండవీటి పాలకుడుగా ఉండెను. మంగళగిరిలో ఇతని శాసనాలు కలవు. ఇతని బంధువులు వల్లభశెట్టి కుమారులు, పాపిశెట్టి, యర్రా తిరుమలదేవయ్య నాయుడు మొదలగు వారు రాజుగారి పుణ్యార్థం దానములు చేసెను ఈ శాసనం మంగళగిరిలో కలదు. బలిజ కులస్థులైన వీరు ఇతని బంధువులని తెలుస్తుంది. ఇతని తండ్రి పేర ఆహోబళపురం నిర్మించాడు.
కట్టా వరదరాజు భూపతి : ఇతడు అళియరామారాయలుకు పినతల్లి కొడుకు శ్రీ రంగమహాత్మ్యం గ్రంథం వ్రాశాడు ఇతని తండ్రి కట్టా హరిదాసురాజు. తెలుగు బిజ్జన వంశమునకు చెందినవాడని ఆ గ్రంథములో పేర్కొనెను. ఈ కట్టావారు రాయలసీమ ప్రాంతములోను బలిజలుగానే వున్నారు. కట్టా నరసింహులు - రచయిత - శాసన పరిశోధకులు బ్రౌన్ గ్రంథాలయ చైర్మన్ యున్నారు.
గొబ్బూరి నరసరాజు : ఇతడు అళియరామ రాయలు మేనల్లుడు, గోత్రం కౌశిక, ఇతడు తెలుగు బలిజ కులస్థుడు. ఇతడు తన పెత్తనం సాగాలని అనేక యుద్దాలు చేసి విజయనగర సామ్రాజ్యం దెబ్బతినడాకి కొంత కారణమయ్యాడు.
తోరగంటివారు : గొబ్బూరి నరసరాజు పినతండ్రి, పెదతండ్రి కుమారులు కావ్య అలంకార
సంగ్రహముల అను సంస్కృత కావ్యము అంకితం పుచ్చుకున్న తోరగల్లు కోటను పాలించుటచే తోరగల్లు వారయినారు. తోరగల్లు నరసరాజు రత్నాల బలిజశాఖకు చెందినవారు. వీరు రత్నాల గోత్రీకులుగా ఉన్నారు. వీరు కోనసీమలో పాశర్లపూడి, పెదపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో వీరున్నారు. ఈ వంశములో కొందరు గడ్డి దుర్గం నిర్మించుటచే “గడ్డి” అనే ఇంటి పేరుగలవారయినారు. ఈ వంశమూల పురుషుడు పోచిరాజు పేరున పోతురాజు ఇంటిపే బలిజలలో కనిపిస్తుంది. పోచిరాజు బార్య లక్కమాంబ. ఇతని బిరుదు "గండరగండ, ఉభయ గండ, దీరోత్తమ గండ”. వీరు బోజరాజు వంశముగా చెప్పుచున్నది. నరస భూపాలీయం గ్రంథములో వీరి వంశము నాయక కులంగానే చెప్పబడింది. గొబ్బూరు యుద్దములో పాల్గొన్న వారు గొబ్బూరి వారయినారు.
“అని యూహించి మాదాయ సంఘటిత కావ్యాలంక్రియా సంగతి
హం। బనిఘంబై వెలగొందకనే రవి వంశాదీశ్వరుండై నృశిం।
హ న్నపాలా గ్రణ కీర్తి వర్ణ నము చే నశాంత
విశ్రాంత పావన మౌ గావున నందు" నాయక వంశ మహావంశంబు వర్ణించెదన్
ఆరవీటివారు చాలా కాలమునుండి సంస్థానాదీశులుగా, సైన్యాధిపతులుగా వున్న కారణంగా, క్షత్రియ ధర్మమునే అనుసరించిన కారణంగా వీరు మేము క్షత్రియులమని చెప్పుకున్నారు. కాని వీరి పూర్వీకులందరూ క్షత్రియ బలిజలతోనే వివాహ సంబంధములు కొనసాగించారు. వీరు చాళుక్య వంశంగా చెప్పుకున్నారు. చాళుక్యులు అయ్యావళీపుర వీరబలిజలుగా చెప్పుకున్నారు - (ఒకనాడు కాపు కులంగా చెప్పుకున్నవారు, ఈనాడు "రెడ్డి" కులంగా మారినట్లు) బ్రిటిష్ వారి పాలన తర్వాత క్షత్రియ బలిజలుగా ఉన్నవారు కొందరు సంస్థానాధీశులు వారిలో వారు వివాహములు చేసుకొని, మేము క్షత్రియులమని, రాజులుమని చెప్పుకుంటున్నారు.
జల్లెళ్లవారు : అరవీటి వారికి వియ్యపువారు. అళియరామరాయలుకు నలుగురు భార్యలలో ఒకరు.
- జిల్లెళ్ల వెంకట్రామయ్య, దమనపల్లె గ్రామం. పోరుమామిళ్ళ (మం) కడప జిల్లా - 10 కుటుంబాలున్నాయి. జిల్లెళ్ల గ్రామము కలదు, మైదుకూరు మండలం వీరంతా బలిజలుగా వున్నారు.
- జిల్లెళ్ల రామయ్య భార్య రాములమ్మ కుమారుడు క్రిష్ణయ్య పి.ఆర్. కాలని, గిద్దలూరు, ప్రకాశం జిల్లా (బలిజ).
అళియ రామరాయలు
12వ శతాబ్ధంలో హైహేయ విజ్జలరాజు కళ్యాణి నగరము రాజధానిగా పాలిస్తున్నప్పుడు వీరశైవలింగ బలిజ సైన్యాలు బసవేశ్వరుని నాయకత్వములో తిరుగుబాటు చేసి విజ్జలరాజును చంపి వేస్తారు. తర్వాత విజ్ఞలరాజు కుమారులు భసవేశ్వరుని చంపివేస్తారు. తర్వాత విజ్ఞలరాజు వంశీయులు తాతాపిన్నమరాజు అతని కుమారుడు సోమదేవరాజు ఆనువారు కాకతీయుల వద్ద సైనికాధికారులుగా చేరుతారు. ఆంధ్ర మహావిప్లవములో అనేక కోటలు వశపరుచుకున్న ఆరవీటి సోమదేవరాజు అతని సోదరుడు కోటిగంటి రాఘవుడు వారి అన్నదమ్ములను బంధువులను ఆయా కోటల పాలకులుగా నియమిస్తారు. వీరి వంశీయులు ప్రకాశం జిల్లా పెద్దారవీడు గ్రామస్తులు - క్షత్రియ బలిజులు అనంతపురం జిల్లా ఆరవీటి కోటను రాజధానిగా అనేక ప్రాంతాలు పాలించుటచే వీరు ఆరవీటి వారయ్యారు. వీరిలో ఆరవీటి బుక్కరాజు కుమారుడు రామరాజు అతని కుమారుడు శ్రీరంగరాజు కుమారులు కోనేటిరామ రాయ, తిమ్మరాయ, అళియరామరాయ, తిరుమలరాయ, వెంకటాద్రిరాయలు అను ఐదుగురు కుమారులు. వీరిది ఆత్రేయగోత్రం. వీరిలో అళియరామ రాయలు మరియు తమ్ముడు తిరుమల రాయలు అనువారు విజయనగర సామ్రాజ్యములో ప్రాముఖ్యతకు రాకముందు అళియరామరాయలు (1490-1565) శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె తిరుమలాంబని, రెండవ కుమార్తె వెంగమాంబను ఆరవీటి తిరుమలరాయలు వివాహమాడక ముందు ఆరవీటి సోదరులిద్దరు గోల్కొండ సుల్తాన్ కులీకుతుబ్ ఉలముల్కు (1518 - 1543) వద్ద ముఖ్య సేనానాయకులుగా ఉండి ప్రఖ్యాతిగాంచెను. ఆనాడు ఎలుగొందుల (కరీంనగర్ జిల్లా) కోట పాలకులు రాణాజగదేవరాయలు విష్ణువర్ధన గోత్రికులు బలిజ కులస్థులు, గోల్కండ సుల్తాన్ వద్ద ప్రధానమంత్రిగా (మీర్ జుమ్లా) ఉండెను. రాణా జగదేవరాయులు అసమాన రాజకీయ ప్రజ్ఞకలవాడు, అత్యంత తెలివి, సామర్ధ్యము కలిగిన గొప్ప యుద్ధ వీరుడు.
ఆరవీటి సోదరులకు రాణాజగదేవరాయలకు గోల్కొండ కోటలో ఏర్పడిన స్నేహం కారణంగా ఆరవీటి తిరుమలరాయలు భార్య వెంగమాంబ (శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె) దంపతుల కుమారుడు పెనుగొండ రాజధానిగా విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న ఆరవీటి శ్రీరంగరాయలు (1572-1585)కు రాణా జగదేవ రాయలు సోదరిని ఇచ్చి వివాహము చేశాడు. రాణా జగదేవరాయులు సాహసంతో అనేక యుద్ధాలలో విజయం సాధించెను. క్రీ.శ.1550 సం॥ జంషీర్, కులీకుతుబ్షా చనిపోయిన తరువాత ఏడు సంవత్సరాల బాలుడు సుభాన్, సింహాసనం అధిష్టించాడు. వారి బంధువుల రాజకీయ పెత్తనముతో ఇమడలేక అక్కడనుండి విజయనగర సామ్రాజ్యాధీశుడు తుళువ సదాశివ రాయలు (1542-1570) వారి మంత్రి తనకు బంధువైన అళియరామరాయలుతో చేరి అనేక విజయాలు సాధించాడు. "బారామహల్ రాజ్యము” (12000 గ్రామాలు) రాజ ప్రతినిధిగా 1564లో అక్కడ పాలకుడిగా స్థిరపడిపోయెను.
ఆరవీటి తిరుమలరాయలు భార్య వెంగమాంబ (రాయలు కుమార్తె) ఈ దంపతుల కుమారుడు శ్రీరంగరాయలుకు రాణాజగదేవ రాయలు సోదరిని ఇచ్చాడు. తర్వాత ఆరవీటి శ్రీరంగరాయలు కుమార్తె గిరియాంబను రాణా జగదేవరాయలు కుమారుడు ఇమ్మడి జగదేవ రాయలు వివాహం చేసుకున్నాడు.
రాణాజగదేవ రాయలు తమ్ముడు అంకుశరాయలు మధురై బలిజరాజు వీరప్ప కుమార్తె లింగమ్మను వివాహమాడాడు. రెండవ భార్య రాణెమ్మ మరియు మూడవ భార్య లక్ష్మమ్మ అనువారు తంజావూరు బలిజరాజు రఘునాధ నాయకుని కుమార్తెలు రాణా జగదేవరాయలు వంశీయులు. కర్ణాటక బెంగుళూరు దగ్గర చెన్నపట్నం కోటను రాజధానిగా పాలించారు. వీరిని ముసుగు బలిజలని, మూత కమ్మల బలిజలని అంటారు. (వారి స్త్రీలు ప్రత్యేక కమ్మలు ధరిస్తారు). వీరి పూర్వులు మధ్యప్రదేశ్లోని బందేల్ ఖండ్ పాకు రాజబంధువులుగా ఉండి తర్వాత తెలంగాణా తర్వాత ఆంధ్ర, కర్ణాటక ప్రాంత పాలకులయ్యారు.
పెనుగొండ పాలకుడు ఆరవీటి శ్రీరంగరాయలు తమ్ముడు ఆరవీటి వెంకటపతి రాయలు కుమార్తె శావమ్మను బలిజ వంశీయుడు రాయదుర్గం పాలకుడు దళవాయి కోనేటి నాయకుడు వివాహమాడాడు. వెంకటపతిరాయలు భార్య నెల్లూరు జిల్లా వెంకటగిరి పాలకుడు గొబ్బూరి జగ్గరాయులు కుమార్తె బయ్యమ్మ (బలిజ). ఆరవీటి అళియ రామరాయలుకు నలుగురు భార్యలు (1) తిరుమలాంబ (శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె), క్షత్రియ బలిజ, (2) అప్పలాంబ తండ్రి జిల్లెల్ల పెదనందిరాజు (బలిజ), (3) కొండమ్మ ఓబాంబ (లక్ష్మమ్మ) తండ్రి పోచిరాజు తిమ్మరాజు (బలిజ) ఇద్దరు కుమార్తెలను వివాహమాడాడు.
రాయల కుమార్తె తిరుమలాంబకు కుమారులు ఇద్దరు. అందులో పెద్దవాడు పెద తిమ్మరాజు రాయచూరు పాలకుడయ్యారు. రెండవ కుమారుడు కృష్ణరాయలు పెనుగొండ కోశాధికారి అయ్యాడు. అప్పలాంబ, కొండమ్మ, ఓబాంబ (లక్ష్మమ్మ) వంశీయులు తల్లికోట యుద్ధములో విజయనగర రాజ్యపతనానంతరము వీరు ఆనెగొంది పాలకులయ్యారు. వీరు ఆరవీటి వంశీయులు వీరి వంశములకు సంతానం లేనికారణంగా వారి భందువులైన దళవాయి వారు పాలకులయ్యారు. దళవాయివారు ఆరవీటివారికి దత్తత పోయిన కారణంగా ఆరవీటి వారయ్యారు. వారే ప్రస్తుత “ఆనెగొంది” సంస్థానాదీశులు.
ఈనాటి ఆరవీటి వంశీయులు - బలిజ క్షత్రియులు
ఆరవీటి సోమదేవరాజు బలిజ క్షత్రియుడని శాసనములు చెబుతున్నాయి.
1. ఆరవీటివారు : అనంతపురం జిల్లాలో అరవీటి కుల్లాయప్ప శెట్టి, అరవీటి వెంకటస్వామి, క్రిష్ణమూర్తి కుటుంబాలున్నాయి. ఉరవకొండలో ఆరవీటి వంశీకృష్ణ, గోవిందప్ప, రామాంజనేయులు, సుదర్శన్, రాజారాం, వెంకటస్వామి, జానకి రాముడు, సురేష్ కుటుంబాలున్నాయి. - ప॥గో॥ జిల్లా భీమవరంలో ఆరేటి ప్రకాష్ (లాయరు) కుందుర్రు సర్పంచ్గాను, నర్సాపురం కౌన్సిలర్, లింగబోయిన చర్ల గ్రామములోనూ, దొడ్డనపూడి (కాళ్ళ మండలం) ఇరగవరం గ్రామంలోనూ, ఆకివీడు, కాళ్ల, దుద్దుకూరు, చింతలపూడి గ్రామములో భూస్వాములుగా, రాజకీయ నాయకులుగాను తుండూరు, ఆరేడు గ్రామాలలో ఆరవీటి వారు, బలిజకాపులుగా యున్నారు.
2. నంధ్యాలవారు : వీరు నంధ్యాలను పాలించిన ఆరవీటి వారి దాయాదులు. నంధ్యాల శ్రీనివాసరావు (ట్రాన్స్పోర్టు) ఒంగోలులో ఐదు కుటుంబాలు బలిజలుగా వున్నారు. నంధ్యాల మనోహర్ (అనంతపురం) నంధ్యాల పోతులూరయ్య, జి. పుల్లల చెరువు - రాచర్ల (మం) ప్రకాశం జిల్లా, నంధ్యాల ఆంజనేయులు, శ్రీనివాసరావు (పేర్నమిట్ట గ్రామం) నంధ్యాల కృష్ణ, శ్రీనివాసరావు, సాయి సందీప్, రాకేష్, నంధ్యాల సునీల్ (ఒంగోలు), బాబు నాగులాపురం - (కంభంమండలం) నంధ్యాలకేమనాథం (డోన్ - కర్నూలు జిల్లా) నంద్యాల శ్రీనివాసరావు, సుబ్బారావు, శివకుమార్, ప్రసన్నకుమార్ (ఒంగోలు) వీరంతా బలిజలుగా వున్నారు.
3. ఔకువారు : ఔకు కోటలో, నంధ్యాల రామకృష్ణరాజు, త్రివిక్రమ వర్మ, వీరు (బందేల్ ఖండ్) క్షత్రియులమని, రాజులమని చెప్పుకుంటారు. సప్త మహాసంగ్రామం (మహాభారత యుద్ధం) తర్వాత క్షత్రియులనేవారు లేరు. భారతదేశంలో అందరూ శూద్ర రాజులే ! వీరు ఆరవీటి వారి దాయాదుల కుటుంబం - ఆరవీటి వారు బలిజలని శాసనముంది (కడపజిల్లా శాసనము) 2. ఔకు రాజ్యలక్ష్మి W/o శ్రీధరరావు గారు, పాండవ వనవాసం, నర్తనశాల, సత్యహరిశ్చంద్ర నిర్మాతలు, రాజ్యం పిక్చర్సు అధినేతలు, ఔకు భాస్కర్ పాలీష్ ఫ్యాక్టరీ - సంజీవనగర్ తాడిపర్తి అనంతపురం జిల్లా వీరంత బలిజలుగా వున్నారు.
4. కోనేటి కొండమరాజు (ఆరవీటి వంశీయుడు) : కర్నూలు జిల్లా ఆథోని పాలకుడు. కడప జిల్లాలో బలిజలుగా వున్నారు.
- కోనేటి వెంకటసుబ్బయ్య - మల్లెపల్లి గ్రామం - బ్రహ్మంగారి మఠం (మం)
- కోనేటి హరి - దువ్వూరి గ్రామం - మైదుకూరు (మం)
- కోనేటి సుబ్బారాయుడు - (బద్వేలు గ్రామం) కోనేటి విజయ ఉన్నారు.
- కోనేటి పుల్లయ్య - దర్గావీధి - బద్వేలు (మం)
- కోనేటి వెంకటేశ్వర్లు - మల్లెపల్లి గ్రామం - బ్రహ్మంగారి మఠం (మం)
- కోనేటి రామచంద్ర - వేంపల్లి గ్రామం - కడప జిల్లా
- కోనేటి పుల్లయ్య - (మల్లెపల్లి గ్రామం) - కోనేటి గురవయ్య వీరంతా బలిజలుగా వున్నారు.
5. జిల్లెళ్ళ వారు : ఆరవీటి వారి వియ్యపువారు - అళియ రామరాయలు నలుగురు భార్యలలో - 1. తిరుమలదేవి శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె (క్షత్రియ బలిజ) 2. అప్పలాంబ - ఆమె జిల్లెళ్ళ పెదనందిరాజు కుమార్తె (బలిజ) 3. కొండమ్మ 4. ఓబాంబ. వీరిద్దరు పోచిరాజు తిమ్మరాజు కుమార్తెలు - క్షత్రియ బలిజలు. పోచిరాజు అనే ఇంటిపేరు పోతరాజుగా క్రమేణా మార్పు చెందినది. పోతరాజు వారు రాయల సీమలో బలిజలుగా అనేక కుటుంబాలవారున్నారు.
- జిల్లెళ్ళ వెంకట్రామయ్య - దమన పల్లె గ్రామం పోరుమామిళ్ళ (మం) ఈ గ్రామంలో - 10 కుటుంబాలున్నాయి కడప జిల్లా
- జిల్లెళ్ళ గ్రామం - మైదుకూరు (మం) 10 కుటుంబాలున్నాయి. బలిజలుగా ఉన్నారు - కడప జిల్లా
- జిల్లెళ్ళ రామయ్య భార్య రాములమ్మ కుమారుడు క్రిష్ణయ్య. పి.ఆర్. కాలనీ గిద్దలూరు ప్రకాశం జిల్లా 5 కుటుంబాలున్నాయి.
Kurnol District Manual - 178 Page : Presidency of Madras :
కర్నూలు జిల్లాలోని ప్యాపిలి డిప్యూటి కలెక్టరుగా పనిచేసిన నరహరి గోపాల కృష్ణమయ్య శెట్టి వ్రాసినది - 1886 బ్రిటిష్ ప్రభుత్వం - (Kurnool) in this District except perhaps the Owk poligars who are relted to the Anegondi Rajas,. The census of 1881, however registered, 2,898 under this class. The greater portion of them profess the Vaishnava religion. They are gener- ally Bondilis who trae their origin to Bandelkund in Northern Hindustan and are generally employed as peons and police constables. There is also a class of people called Rajus who are settered in a few villages throughout the District. These eat and drink with other castes and are therefore not Kshtriyas proper.
కర్నూలు జిల్లాలో అవుకు పాలెగార్లు వీరి బంధుత్వము అనెగొంది రాజులతో వుంది. 1881 సం॥ జనాభా లెక్కల ప్రకారం వీరు 2,898 మంది ఉన్నారు. వైష్ణవ మతస్థులు. వీరిని బొందిలి వారంటారు. వీరు ఉత్తర భారతదేశములోని “బందేలండ్” నుండి వచ్చారు. వీరు పోలీసు కానిస్టేబులు ఉద్యోగాలలో కొందరున్నారు. వీరు మేము రాజులమని చెప్పుకుంటారు. వీరు కొద్ది గ్రామాలలోనే ఉన్నారు. ఇతర అన్ని కులాల వారితో కలిసి భోజనము చేస్తారు. వీరు క్షత్రియులు కారు.
- భట్టరుశెట్టి పద్మారావు రాయలు
araveeti vamsam | araveeti clan | araveeti charitra | araveeti history | araveeti vamsa rajakiya charitra | nandyala clan araveeti family | araveeti bukkaraju | sammeta family