Nandyala Clan Araveeti

Nandyala Clan Araveeti నంద్యాల వంశం (ఆరవీటివారు). ఆరవీటి వంశ స్థాపకుడు ఆరవీటి బుక్కరాజు. క్రీ.శ. 1463 -1472) ఈయన అరవీటి పాలకుడు.

Nandyala Clan Araveeti

నంద్యాల వంశం (ఆరవీటివారు)

అరవీటి వంశీయులలో మొదటివాడు విజ్జలరాజు, మైలపుడు హెమ్మలరాయుడు, తాతా పిన్నమరాజు, సోమదేవరాజు. ఇతడు కాకతీయ సామ్రాజ్య పతనానంతరం జరిగిన మహమ్మదీయ దాడులను తిప్పికొట్టి అతని తమ్ముడు కొడకంటి దుర్గంపాలకుడు రాఘవరాజు (ఇతడు కర్నూలు విష్ణుపాద క్షేత్రంలో శత్రువులు విష ప్రయోగం చేసినా బ్రతికాడు) ఇతని కుమారుడే రెండవ పిన్నమరాజు. ఇతని భార్య అవుబలదేవి. వీరి కుమారుడే ఆరవీటి వంశ స్థాపకుడు ఆరవీటి బుక్కరాజు. క్రీ.శ. 1463 -1472) ఈయన అరవీటి పాలకుడుగా వుంటూ విజయనగర చక్రవర్తికి అండగా ఉన్నాడు (ఆయన బావగారు తుళువ ఈశ్వర నాయకుడు భార్య బుక్కమాంబ) ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య బల్లాంబికా దేవి, రెండవ భార్య అబ్బలాదేవి గారు. బల్లాంబిక ద్వారా రామరాజు (క్రీ.శ.1482–1508) జన్మించాడు. ఈ రామరాజుకు ముగ్గురు కుమారులు. మొదటివాడు అవుకు రాజ్యస్థాపకుడు తిమ్మరాజు (క్రీ.శ.1509-1536) రెండవ కుమారుడు కొండరాజు. ఆదోని దుర్గపాలకుడు, మూడవ కుమారుడు శ్రీరంగరాజు. కర్నూలును పాలించాడు. ఈ శ్రీ రంగరాజుకు ఐదుగురు కుమారులు కాగా వారిలో మూడవ వాడే శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియ రామరాయలు. జౌకు తిమ్మరాజు అవుకులో తమ ఇంటి దేవత మూలమ్మ ఆలయాన్ని నిర్మించాడు.

బుక్కరాజు రెండవ భార్య అబ్బలదేవి కి సింగరాజు, రామరాజు ఆహోబలరాజు, అను ముగ్గురు కుమారులు జన్మించారు. సింగరాజు ముది మనుమడు నరసింగరాజు, తిమ్మరాజు, తిరుమల వెంకటేశ్వరస్వామి తిరుపతిలోని గోవిందరాజస్వామి తిరుచానూరు వరదరాజస్వామి సన్నిధిలో వెంకటాచల మహత్యాన్ని చదివే ఏర్పాటు చేశారు. సుప్రబాత సేవలో నిర్విఘ్నంగా జరిగేందుకు తిరుపతిలోని పెరియరాజు వీధిలో వాణిజ్య సముదాయాన్ని నిర్మించి తద్వారా వచ్చే రాబడితో పండితులకు జీతభత్యాలను ఏర్పాటు చేశారు నంద్యాల కృష్ణమరాజు. దోనూరు కోనేరు నాదుడనే కవిని పోషించారు. క్రిష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవములో పాల్గొన్నారని క్రీ.శ.1505 నుండి 1542 వరకు జరిగిన కర్నాటక యుద్దములలో విజయనగర రాజుల పక్షాన పోరాడారని డా॥ నేలటూరి వెంకట రమణయ్య భారతి పక్ష పత్రికలో వ్రాసిన ఆరవీటి వంశ చరిత్రలో చెప్పారు.

ఆరవీటి వంశ స్థాపకుడు ఆరవీటి బుక్కరాజు క్రిష్ణరాయలు పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నాడని కుమార దూర్జటి రచించిన క్రిష్ణరాయ విజయంలో చెప్పబడింది.

అరవీటి అళియ రామరాయలు సోదరుడు తిమ్మరాజుకు నలుగురు భార్యలు. నెట్టెమ్మ, లక్ష్మమ్మ, గోపమాంబ, తిరుమలమ్మ. వీరిలో గోపమాంబకు నలుగురు కుమారులు నల తిమ్మరాజు (1537 1556), విఠలరాజు, చిన తిమ్మరాజు, పాపతిమ్మరాజు అనువారు. నల తిమ్మరాజు అవుకును క్రీ.శ. 1537లో పెద్ద చెరువుని నిర్మించాడు. ఈయన నిర్మించిన అవుకు చెరువు గాలేరు-నగరి నీటిపారుదల ప్రాజెక్టుగా అత్యంత ప్రధానమైన అవుకు రిజర్వాయరుగా ఆవిర్భవించింది. ఇతడు బ్రాహ్మణుల కోసం ఈ చెరువుకు ప్రత్యేక తూమును ఏర్పాటు చేశారు. అవుకు చెరువు నిర్మాణ సమయములో పనిచేసే గర్భిణిలకు అరకూలి అదనంగా ఇచ్చాడు. రాజ్యములో భిక్షాటన చేసివారికి పిడికెడు వడ్లు, పిడికెడు కొర్రలు తప్పకుండా భిక్షం వేయాలని ధర్మశాసనాలను వేయించాడు.

నలతిమ్మరాజు కుమారుడు రఘునాధరాజు (1556-1558). ఈయనకు నలక్రిష్ణమ రాజు (1559-1588) చిన్న క్రిష్ణమరాజు (1589-1619) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న క్రిష్ణమరాజు కుమారుడు ఓబులపతి రాజు (1619-1646). ఇతడు అవుకు పాలకుడిగా ఉన్న సమయమంలో గోల్కొండ కుతుబ్షా ఇతని జాగీరును 24 గ్రామాలకు పరిమితం చేశాడు.

ఓబులపతిరాజు కుమారుడు నరసింహరాజు (1647-1668). నరసింహరాజు కుమారుడు రాఘవరాజు (1670–1691). రాఘవరాజుకు పెద్ద కుమార రాఘవరాజు (1692-1735) దాసమరాజు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. కుమార రాఘవరాజు అవుకు కోటగోడలను పటిష్టపరిచాడు. ఇతనికి సంతానం లేదు తమ్ముడు. దాసమరాజ కుమారుడు అప్పా నరసింహరాజు (1736 - 1737) అవుకు పాలకుడయ్యాడు. ఇతని భార్య చెల్లమ్మ వీరికి పిల్లలు లేకపోతే ఆరవీటి వంశ స్థాపకుడు బుక్కరాజు రెండవ భార్య - అబ్బళదేవి సంతానానికి వారసుడైన నంద్యాల ఓబులుపతి రాజు మనుమడైన నరసింహరాజు మనుమడు నంద్యాల నారాయణ రాజును (1740-1743) దత్తత తీసుకున్నాడు. ఇక్కడ నుండి అవుకువారు నంద్యాలవారుగా పిలువబడుతున్నారు.

ఇతని తర్వాత ఇతని అన్న కిచ్చమరాజు (1744-1751) అవుకు పాలకుడై అవుకు చెరువుకు తాపలు కట్టించాడు. కోటను పటిష్టం చేశాడు. ఇతని తర్వాత ఇతని అన్న ఓబులపతి రాజు (1752-1759) అధికారం చేపట్టాడు. వీరి చివరి తమ్ముడు కుమార రాఘవరాజు (1760-1767) నిజాం ఆలీఖాన్ తరఫున సర్వర్ ఖాన్ అనే శత్రువుతో పోరాడి మరణించాడు. 1792 మైసూరు పాలకుడు టిప్పుసుల్తాన్ దండయాత్ర కారణంగా అవుకు పాలెగాడుగా ఉండిన నంద్యాల రామకృష్ణరాజు షోలాపూర్ వెళ్లిపోయి తర్వాత తిరిగి వచ్చి ఒక ఒప్పందంపై అవుకు జాగీరు తీసుకున్నట్లు కర్నూలు మాన్యువల్ (1886) లో పేర్కొనబడినది.

బ్రిటిష్ పాలనలో అవుకు రాజవంశీయులు పాలెగాళ్లుగా చెలామణి అయ్యారు. మొదటి నారాయణ రాజు కుమారుడు నంద్యాల వెంకట నరసింహరాజు కుమారుడు ఓబుల పతిరాజు ఈయన కుమారుడు రెండవ నారాయణరాజు.

నంద్యాల నారాయణరాజు స్వాతంత్ర పోరాట యోధుడైన నొస్సం సంస్థానీకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి (చెంచు కులస్థుడు) సమకాలీకుడు. అతను బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి కోయలగుంట్ల తహస్సీల్దారు హత్యకేసులో ఆ తిరుగుబాటులో నరసింహారెడ్డికి సహకరించారని అభియోగంపై అవుకురాజు నంద్యాల నారాయణరాజును వారి బంధువైన చిట్వేలి సంస్థానీకుడు వెంకటరామరాజును 1845 లో కారాగారంలో బంధించాడు. అయితే నేరం రుజువు కాకపోవడంతో తర్వాత వారిద్దరిని విడుదల చేశాడు. నారాయణ రాజు కుమారుడు వెంకట నరసింహరాజు. ఆయన కుమారుడు వీరరాఘవరాజు నారాయణ రాజు వారసులు, కిచ్చమరాజు, వీరరాఘవరాజు అవుకు సంస్థానీకులుగా ఉన్నారు. నామమాత్రం తవర్జీలు (భరణాలు) పొందుతూ వచ్చారు. వీరరాఘవరాజు 1922 అవుకు గ్రామ బెస్తవారిని చెరువులో చేపలు పట్టుకునే హక్కు కల్పించారు. వారు అవుకు చెన్నకేశవ స్వామి ఉత్సవాలలో బెస్తవారు గ్రామోత్సవంలో స్వామివారు పల్లకీని మోస్తారు.

అవుకు పాలకుడు నలతిమ్మరాజు దోనూరు కోనేటి నాధ కవిని పోషించాడు. ఇతని తండ్రిపేరు నాగమమంత్రి అతడు అహోబిల నరసింహస్వామి భక్తులు - ఎనిమిది భాషల్లో నిష్ణాతుడు - కోనేరునాధ కవి ఆరవీటి వంశావళిని ఆరవీటి వారి పరాక్రమాలను 1542 ద్విపద బాలబాగవతం పద్యరూపంలో రచించి నలతిమ్మరాజు తండ్రికి అంకితమిచ్చాడు. అలాగే 1547లో ద్విపద బాలభాగవతం రచించి నలతిమ్మరాజు తమ్ముడు చినతిమ్మరాజుకు అంకితమిచ్చాడు.

కడప జిల్లా కమలాపురం పరిదిలో ఎర్రగుంట్లను కోనేరునాధ కవికి నంద్యాల నారసింహరాజు అగ్రహారంగా ఇచ్చాడని లోకల్ రికార్డు (33. సంపుటి 244 పేజి) ద్వారా తెలుస్తోంది. బాలబాగవతంనకు సంబంధించిన తాళపత్ర ప్రతులు తిరుపతిలో ప్రాచ్య పరిశోధనా సంస్థ (OKI)లో ఉన్నాయి. అష్టదిగ్గజ కవులైన పింగళి సూరనను నంద్యాల క్రిష్ణమరాజు పోషించాడు - నంద్యాల సమీపంలోని కొనాల గ్రామస్థుడు.

అళియరామరాయలు అరవీటి రాజులు గురించి అందుగుల వెంకయ్య “నరపతి విజయం” (రామరాజీయం) కావ్యాన్ని రచించాడు అళియరామరాయలు మనుమడు చిన
వెంకటరాజు కాగా చినవెంకటరాజు మనుమడు కోదండరామరాజు ఈ కావ్యానికి కృతిభర్త.

అవుకులో నివసిస్తున్న నంద్యాల వంశీయులు

క్రీ.శ.1922 తర్వాత కాలంనాటి వీరరాఘవ రాజకుమారుడు తిమ్మరాజుకు నంద్యాల రామకృష్ణరాజు, నంద్యాల త్రివిక్రమవర్మ అనే ఇద్దరి కుమారులు - రామకృష్ణరాజు, త్రివిక్రమ వర్మ, అతని కుమారుడు నంద్యాల అబినాష్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం అవుకులో ఉంటున్నారు.

అవుకులో కోట 200 ఎకరాలలో ఉండేది. ఎనిమిది బురుజులుండేవి. ప్రస్తుతం
కోట ప్రదేశంలో ప్రజల నివాసగృహాలు వెలిశాయి. అవుకు నగరిలో దసరా పండుగ సందర్భంగా ఆయుదపూజ వంశాచారంగా నిర్వహిస్తూ వస్తున్నామని పీర్ల పండుగ, రంజాన్, బక్రీదు ప్రజలు ఆనవాయితీగా నగరిని సందర్శిస్తారని తమతో కలిసి పండుగలు జరుపు కుంటారని రామకృష్ణరాజు వివరించారు. ఆనెగొంది ఆరవీటి వంశీయులతో, మట్లవారితో, చిట్వేలు నగరిపాడు సంస్థానీకులతో ఇప్పటికి బంధుత్వాలున్నాయి.

వీరి పూర్వీకులు మధ్యప్రదేశ్లో బందేలాండ్ పాలకులుగా ఉన్నందున బాందెల్ రాజులమని చెప్పుకుంటారు. తెలుగు ప్రాంత పాలకులను, తెలగాలని, మహారాష్ట్ర పాలకులను మరాటాలని, ఒరిస్సా పాలకులను ఒడియరాజులని ఎలా పిలుస్తారో అలాగే బందేల్ ఖండ్ పాలకులుగా ఉన్న ఆరవీటి వారిని అవుకువారని “బొందిలి" వారని పిలుస్తారు. వీరు మేము రాజలమని చెప్పుకుంటారు. వీరు క్షత్రియులు కారు.

- గండికోట గ్రంథకర్త : తవ్వా ఓబులురెడ్డి

araveeti nandyala clan | nandyala clan araveeti | araveeti nandyala vamsam | manuma kulamu | sangama clan balija kshatriyas | saluva balija rajula vamsham | sammeta clan telugu | tuluva dynasty telugu