Manuma Caste

Manuma Caste బలిజ జాతి, వీర (క్షత్రియ) బలిజలు “మనుమ” కులస్థులు అని చోళ రాజులు వేసిన త్రిపురాంతక శాసనము ఆధారము కలదు.

Manuma Caste

మనుమ కులము

త్రిలింగ దేశము అంటే మూడు (ప్రసిద్ది చెందిన శైవ క్షేత్రాలు) - లింగాలున్న ప్రదేశముగా చెప్పబడింది. అది తెలుగు మాట్లాడే ప్రాంతము వారి భాష తెలుగు భాష తెలంగాణా, కోస్తా, రాయలసీమ ప్రాంతము. దాని విస్తరణ తంజావూరు (తమిళనాడు) బళ్లారి (కర్ణాటక) నాగపూర్ (మహారాష్ట్ర), కళింగ (ఒరిస్సా) ప్రాంతము వరకు విస్తరించింది. బలిజాతి అంటే బలమైన జాతిగా ఉద్భవించింది. అది సైనిక వృత్తిగా గల జాతి, కూర్మిలు 96 తెగలుగా మూడు వందల కుటుంబాలుగా ఏర్పడి క్షత్రియబలిజలుగా పిలవబడ్డారు. వీరి పూర్వ వంశీయుడు మనువు, ఈ పేరులోనే తెలుగుదనము ఉంది.

ఈ మనువు సింహానము ఏర్పాటు చేసినది. సింధూ యుగాంతర దేశమయిన ఈ తెలుగు గడ్డ, ఈనాటి గోదావరి పరివాహక ప్రాంతం. తర్వాత త్రిలింగ దేశ పాలకుడయ్యాడు. ఆయన కుటుంబము నుండి ఎన్ని కులాలు ఏర్పడినా ఆయన ఏర్పాటు చేసిన సింహాసనమధిష్టించి, ఆయన వ్రాసిన మను ధర్మములు తూ.చ. తప్పక అమలు జరిపిన సైనిక జాతి ఈ బలిజాతి. వీరే తెలంగాణా కాపులుగా త్రిలింగదేశ పాలకులు తెలగాలుగా చెప్పారు.

ఈ మనుమ కులస్థుడైన బలి మహారాజు కుమారుడు ఆంధ్రుడు పాలించిన ప్రాంతము గాబట్టి వారిని ఆంధ్రులుగా పిలిచారు. వీరు మున్నూటి సీమ ప్రాంతమైన క్రిష్ణానది, గోదావరి నదీ పరివాహక ప్రాంతము నుండి బయలుదేరి ఉండవచ్చును. ఈ ఆంధ్రుని వంశరాజులు భారతదేశములోని వివిధ ప్రాంతములలో స్థానిక గిరిజన రాజులను జయించుకుంటూ, అక్కడి రాజ్యాలను ఏర్పాటు చేసి వారి బంధువులను పాలకులుగా, సలహాదారులుగా, వ్యాపారులుగా నియమించుకుంటూ, ఏ రాజు పాలిస్తే వారి వంశీయులుగా, ఆ వంశీయుడు వారి మూల పురుషుడుగా చెప్పుకుంటూ ప్రపంచ పాలకులై క్రమేణా అంతర్జాతీయ వ్యాపారులుగా రాజులుగా స్థిరపడ్డారు.

మొదట వారి బంధువులయిన మేధావుల సలహాతో మను ధర్మము తప్పకుండా, వర్ణ వ్యవస్థను కాపాడుకుంటూ వారి వంశీయులే కాలక్రమములో జనాభా పెరుగుతూ ఉంటే వారికి అనుకూలంగా చట్టాలు మార్పు చేసుకుంటూ చేసే వృత్తిని బట్టి, కులములుగా విడిపోతూ ఉంటే వారి వ్యవస్థకు తగిన సూచనలు, రక్షణ ఇస్తూ, విదేశీ దాడులను ఎదుర్కొంటూ బ్రిటీష్ వారి పాలన వచ్చే వరకు నాలుగు యుగాలు వీరి వంశాల పాలన సాగింది. ఈ పాలకులలో మంచి పాలన అందించిన రాజులున్నారు, దుర్మార్గులున్నారు. ఇలాంటివారు అన్ని కులాలలో ఉన్నారు.

ఈ బలిజాతి వారు మనుమ కులస్థులుగా సైనిక వృత్తి స్వీకరించి అటు రాజ్యపాలన, ఇటు వాణిజ్యము చేసిన బలిజాతి (బలమైన జాతి). వీరిని క్షత్రియ బలిజలు అన్నారు. వీరే కూర్మిలు, దీనికి శాసనాలు, పురాణ గ్రంథాలు ఆధారాలున్నాయి. ఈ జాతి ప్రాచీన పురాణాలలో చెప్పిన కృతయుగము నాటిదని శాసనాలున్నాయి. మన భరత జాతిని ముందుండి నడిపించిన జాతి ఆంధ్ర దేశానికి నాయకత్వం వహించి తెలుగు వారి కీర్తి పతాకను, తెలుగు వారి పౌరుషాగ్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన జాతి. భరతజాతికి నాయకత్వం వహించి తాను, తన కుటుంబం బలయిపోతుందని తెలిసినా తనకు భగవంతుని వరంగా ఇచ్చిన సైనిక వృత్తిని మను ధర్మానికి కట్టుబడి నడిపించిన జాతి. బలి చక్రవర్తి, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, తిరుపతి వెంకన్న, గౌతమ బుద్ధుడు, వృషభనాధుడు, బాహుబలి, వర్ధమాన మహావీరుడు. వీరంతా ఈ జాతి రత్నాలే! వీరు సంఘ సంస్కర్తలుగా భరతజాతిని నడిపించారు. శక పురుషులుగా ధర్మరాజు (కలియుగం - యుదిష్టర శకం - ఇది ఈ నాడు కాశ్మీరులో ఈ క్యాలెండరు అమలులో ఉంది) ప్రపంచ ప్రఖ్యాత విక్రమార్క మహారాజు (చాళుక్య విక్రమ శకం) శాలివాహన శకం (ఆంధ్రరాజులు) వీరంతా బలిజాతి వారైన కూర్మ వంశీయులు.

  1. ప్రపంచ విజేతగా పేరుగాంచిన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ పెషావర్ రాజు పురుషోత్తముని చేతిలో ఓడిపోయి మగధ సామ్రాజ్యమును పాలిస్సున్న తెలగ జాతి నాయకత్వములోని ఆంధ్ర సామ్రాజ్యము పేరు ప్రఖ్యాతులు విని "మెసపుటోనియా" రాజు వీరిని జయించడం అసాధ్యమని భయపడి వెనుదిరిగి వారి రాజ్యానికి వెళ్ళాడు. ఆనాటి మగద సామ్రాజ్య పాలకుడు ఆంధ్రరాజు “చంద్రమస్సుడు” అను రాజు పాలకుడిగా ఉన్నాడు.
  2. మహమ్మదీయ రాజు మొగల్ చక్రవర్తి అక్బరును ఎదిరించి మేవాడ్ రాజ్యాన్ని పాలించిన ఆంధ్రరాజ వంశీయులైన రాజపుత్ర సింహం రాణా ప్రతాప్ సింగ్ పౌరుషాన్ని ఈ జాతికి తెలియదా?
  3. బెరంగజేబును ముప్ప తిప్పలు పెట్టి మహారాష్ట్రను పాలించిన మరాఠా యోధుడు. చత్రపతి శివాజీ మహారాజ్ని మరిచారా?
  4. ఛత్రపతి శివాజీ కుమారుడు “రాజారాం” ను ఔరంగజేబు కుమారుడు లక్ష సైన్యముతో వెంటబడగా క్యాలికి సంస్థానాదీశురాలు బలిజ రాణి చెన్నమ దేవి ఔరంగజేబు సైన్యముపై ఆడ పులి వలె తిరగబడి ఆ సైన్నాన్ని తుక్కు తుక్కుగా నరికి “రాజారాం”ను రక్షించిన సంఘటన గుర్తు లేదా? చెన్నమదేవి తుళువ నర్సానాయకుడి బంధువు.
  5. బ్రిటీష్ వారి నెదిరించిన శ్రీలంక బలిజరాజు శ్రీ విజయ సింహ మహారాజు చూపిన సాహసం మరిచారా?
  6. విజయనగర సామ్రాజ్యాదీశుడు దక్షిణ భారతదేశ చక్రవర్తి, రారాజు శ్రీకృష్ణదేవరాయలు బహమనీ సుల్తానులను ఎదిరించి సవాల్ చేసి కట్టడి చేసి హిందూ సామ్రాజ్యమును 400 సంవత్సరాలు దక్షిణ భారతదేశములో నిలిపిన విజయనగర చక్రవర్తుల సాహసము వినబడలేదా!
  7. తంజావూరు నాయకరాజు రఘునాథ రాయలు శ్రీలంకలోని డచ్చివారిని పడవలపై సైన్యాన్ని తరలించి పారద్రోలిన సంఘటన, మధుర రాజులు ఢిల్లీ సుల్తాన్ పంపిన చెప్పుల పల్లకిని తెచ్చిన వారిని చావబాది ఢిల్లీ సుల్తానుకు సవాలు చేస్తూ ఎదిరించి లేఖ వ్రాసిన వైనము, మధురరాజు తిరుమలనాయుడు నిర్మించిన మధుర మీనాక్షి దేవాలయం, రాజప్రాసాదం ఈనాటికి ప్రసిద్ధము.

ఈ జాతిని గురించి, స్వదేశీ, విదేశీ చరిత్రకారులు ఎంతో గొప్పగా వ్రాశారు. అభినవ తిక్కన "కీ॥శే॥ తుమ్మల సీతారామూర్తి గారు తెలుగు జాతి భారతదేశములోని అన్ని ప్రాంతాలను పాలించిన వైష్ణవ (కూర్మి) శక్తి అని ఒక సీస పద్యములో వివరించారు. తెలుగు జాతిని గురించి విదేశీయుడైన "రెవరెండ్. జె. ఫాదర్ ఆంథోని వ్రాసిన “ఆంధ్రుల పుట్టు పూర్వోత్తరాలు-గత వైభవ చరిత్రలో వివరంగా శాసనాధారాలు కూడా ఇచ్చారు. ఆ వైభవం అంతరించినందుకు చాలా దుఃఖించాడు.

బలిజాతి చరిత్ర ఎంత మనోహరమైనదో, ఎంత మహోన్నతమైనదో అన్ని కులముల సహకారముతో, అన్ని కులాలను ఒక త్రాటిపై నడిపించి తెలుగు జాతికి మహెూన్నత ఖ్యాతి తెచ్చిన నాయుడు జాతి, ఈ బలిజ జాతి, వీర (క్షత్రియ) బలిజలు “మనుమ” కులస్థులు అని చోళ రాజులు వేసిన త్రిపురాంతక శాసనము ఆధారము కలదు.

- భట్టరుశెట్టి పద్మారావు రాయలు

Manuma Caste

manuma kulamu | manuma caste | kshatriya balija | musunuri nayakas | araveeti clan | sangama dynasty balija kshatriyas | sammeta family | tuluva dynasty | kapu community