Sangama Clan Balija Kshatriyas
Sangama Clan Balija Kshatriyas. శ్రీ విజయనగర మహాసామ్రాజ్య స్థాపకులైన సంగమ వంశీయులగు హరిహర రాయలు, బుక్కరాయలు యదువంశ బలిజక్షత్రియులు

సంగమ వంశ బలిజ క్షత్రియులు
శ్రీ విజయనగర మహాసామ్రాజ్య స్థాపకులైన సంగమ వంశీయులగు హరిహర రాయలు, బుక్కరాయలు యదువంశ బలిజ క్షత్రియులు, వీరి పూర్వులు బుక్కరాజు, భార్య మంగాంబ వీరి కుమారుడు సంగమ రాజు భార్య మల్లాంబ (శారద) వీరి కుమారులు హరిహర, బుక్కరాయలు వీరిపూర్వులు తూర్పు చాళుక్యుల సేనాధిపతులుగా వుండి గుంటూరు జిల్లా మంగళగిరికి సామంతరాజులుగా యదువంశ బలిజ క్షత్రియుడైన అలుగురాజును నియమించెను. తరువాత వారు నెల్లూరు మనుమసిద్ధి దగ్గర ఉన్నారు. వారి సంతతివారే వీరు. శ్రీమద్వీరబలిజ సమయంవారు, వీరశైవ లింగాయతులు, అటు క్షాత్రధర్మమును ఇటు వాణిజ్య ధర్మమును సమపాళ్ళలో అనుభవిస్తూ విజయనగర సామ్రాజ్య వైభవానికి ఎనలేని కృషి చేశారు.
అలుగురాజు (మంగళగిరి సంస్థానాధిపతి) వంశము
⬇️
ఈ సంగమరాజు కుమారులైన మొదటి హరిహరరాయలు, కంపరాయలు, మొదటి బుక్కరాయలు, మారప్ప, ముద్దప్పలు గొప్ప యుద్ధయోధులుగా ప్రఖ్యాతిగాంచినారు వీరిలో మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యధీశులవ్వగా వారి తమ్ముళ్ళు గొప్ప సేనానాయకులుగా ప్రధాన మంత్రులుగా వర్థిల్లెను. వీరిలో ముద్దప్ప దండనాయకుడు మొదటి బుక్కరాయలకు, మొదటి హరిహరరాయలకు ప్రధానమంత్రిగా వుండెను. కీ॥శ॥ 1382 నందు మొదటి బుక్కరాయలు కుమారుడగు రెండవ హరిహరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు శ్రీమద్ వీర బలిజ సమయాలవారు ఈ ముద్దప్ప దండనాయకుడిని బలిజ సమయాలవారికి పృద్విసెట్టిగా నియమించుకొనెను. (బేలూరు కేశవ దేవాలయం శాసనము, ఎపిగ్రాఫియా కర్నాటికా 5 హస్సన్ 1 శాసనం నెం.75) ఈ రెండవ హరిహరరాయలు తమ్ముడైన మల్లినాథుడుని, మల్లప్ప వడయారు అల్లుడు నాగప్ప వడయారు కుమారుడగు మల్లప్ప వడయారు రెండవ దేవరాయలకు మహాప్రధాని.
ఈ మల్లప్పవడయారు మరియు రెండవదేవరాయల అక్కగారైన దేవాంబిక భర్తయును పెద్దినాయక మారమాంబికల కుమారుడునగు అంకతెలుంగరిసెట్టిగారు వీరబలిజ నమయాలవారికి పృధ్విసెట్టిగారైయుండి హంపి విజయనగరం, పెనుగొండ, చంద్రగిరి రాజ్యాలలోని పోలిసెట్టివారి, పగడాలవారి, పట్టపువారి, కంచివారి లాంటి సమస్త వీరబలిజ సమయాలతో రాజమహేంద్రవర పాలకులగు వీరభద్రా రెడ్డి గారికి సహాయముగా గజపతుల దాడులకు రక్షణగా వెళ్ళెను. ఈ వీరభద్రారెడ్డి పూర్వీకుల బంధువగు కొండవీటి సేనాని రాజమహేంద్రవర పాలకుడగు కాటయవేమారెడ్డి గారి భార్య హరిహరాంబ రెండవహరిహరరాయల కుమార్తెయే (ద్రాక్షరామ శాసనాలు). ఈ రెండవదేవరాయలు కుమారులలో ఒకరు మూరురాయబసవశంకరసెట్టి నాయక, (తిమ్మనహల్లి శాసనము, ఎపిగ్రాఫియా కర్నాటికా 15 అరసకెరె తాలూకా, హస్సన్ జిల్లా, (పేజి 39 శాసనం నెం. 239) మరియు రెండవదేవరాయల అల్లుడూ విరూపాక్షరాయలు ప్రధానమంత్రియగు అల్లప్పసెట్టి ఆ తరువాత రెండవ దేవరాయల వంశీయుడు శ్రీమన్మహామండలేశ్వర జవ్వాది కోలాహల పేసలిహనుమ గజబెటెకార హోయసల దేశాధిపతి ఉమ్మత్తూరు పాలకుడగు సంజరాజవడయరుకు మహాప్రధానిగానున్న యీ అల్లప్ప సెట్టిగారు కుమారుడు దేవరాయ వడయరూ యితని కుమారుడు పర్వతయ్యగారూ వీరందరూ ఈ సంగమవంశపు రెండవ దేవరాయలవారి సంతతి వారిగా వీరబలిజ సమయంవారిగా అటు క్షాత్రధర్మమును యిటు వాణిజ్యధర్మమును పాటించి బలిజవారిగా దేవరాయల వంశీయులుగా ఉన్నారు.
ఈ రెండవదేవరాయల సంతతివారగు వీరి శాసనాలు (సోమహల్లి శాసనము ఎఫిగ్రాఫియా కర్నాటికా 3 పేజి 37 శాసనం నెం. 133, ఎపిగ్రాఫియా కర్నాటికా 4 పేజి 39 శాసనం నెం.23. ఎపిగ్రాఫియా కర్నాటికా 4 పేజి 35 శాసనం నెం. 2) నందు వివరింపబడెను. శ్రీకంటెనారాయణదేశాయిగారిచేతను 1950 లలో ముద్రితమైన బలిజకుల చరిత్రనందు ఈ దేవరాయల వంశీయులు నేటికీ బలిజలుగానే 'దేవరాయలవారు' వంటి ఇండ్ల పేరున ఉన్నట్టు తెలుపబడెను. ఈ విధముగా వీరు యదువంశ క్షత్రియులయిన్నప్పటికి వారి బంధువులు వాణిజ్యధర్మముచేత బలిజలుగానూ పేర్కొనబడుచూ వస్తున్నారు.
బుచానన్ మైసూరు సంపుటి 3 నందు ఈ విధముగా పేర్కొన బడింది.
“ఏ తస్మిన్నంత రెకాలే కురువంశ ప్రసూతయమ్
కోశాగార ప్రతిహారే వీరరుద్ర మహీపతిం:
సురత్రాణేన నిర్జిత్య వీరరుద్రేతదా
రామనాధం శిషేవాతె రాజనాం కోశపాలనే
తస్మిన్న వివాహతే పశ్చాత్ బ్రాతరౌతు యదాస్థితున్
జ్యేష్టో హరిహర, హరిహరోనామ కనిష్టో బుక్క సౌజ్ఞాకం
పైన పేర్కొన్న సంగమవంశ ప్రస్తావనలో వారి వంశము కురువంశముగా చెప్పబడినది. ఈ విషయాన్ని మూలం చక్కగా పరిశీలిస్తే అనేక విషయాలు బయటకు వస్తాయి. రాష్ట్రములో పలుశాసనాల్లో బలిజ కాపులు కురువంశాలుగా చెప్పుకున్నారు. ఈ విషయాన్ని తరస్టన్, క్యాస్ట్ & ట్రైబ్స్ లోనూ పేర్కొన్నాడు.
తూముకూరు శాసనము
Epic Carnatica : Vol. V in the regin of Bukka 1 the andras ran into eaxes, the andras ran into holes the andhras ran into cares in the direction of "Udayagiri" as Bukkas's sword danced about on the battle field a defeat of telugu people by bukka & Harihararaya 11, 1401 A.D. the Pillagramage of telugu's to Vijayanagara in inscription Tumukuru (Dist) Epi. Carnataka XII Page 82 = 1419 another telugu pilligramage.
తెలుగు అర్థం :
బుక్కరాయలు మొదలైన ఆంధ్రులు పారిపోయి గృహల్లో బొక్కల్లోనికి దాక్కున్నారని ఉదయగిరి నాయకుడు బుక్కరాయలు కత్తిపట్టుకొని యుద్ధరంగమున నాట్యం చేశారని,
ఆ విధముగా తెలుగువారు హరిహర, బుక్కరాయల సారథ్యములో విజయనగర ప్రభువులుగా తెలుగువారయ్యారని తెస్తున్నది.
సంగమ వంశ ఇంటిపేర్లు
- రాయల వారు : రాయ వంశీయులే రాయల వారుగా బలిజలు గా ఉన్నారు.
- రాయకులం వారు : వీరు రాయసంతతులవారే మదుర నాయక రాజకుల సభకు విచ్చేసిన వంశీయులు బలిజలు.
- దేవరాయల వారు : దేవరాయల అనే ఇంటి పేరుతో బలిజ సంగమ వంశీయులు ఉన్నారు.
- బుక్కా వారు : బుక్కరాయ వంశీయులు మదుర సబకు విచ్చేసారు బలిజలు.
- పెదరాస వారు : తిమ్మానాయకుని భార్య వంశం ( సంగమ వంశీయులు, తాము బుక్కడు వంశీయులమని నేటికి చెప్పుకుంటారు వీరు సంపెట వారి ఆది బందుగనం వారు, బక్కపట్నంలో ఉన్నారు సంగమ వంశ బలిజలు)
- జివ్వాది వారు - జివ్వాజి వారు : జివ్వాది కోలాహల అనునది రెండవదేవరాయల వంశీయుడు. శ్రీమన్మహామండలేశ్వర జవ్వాది కోలాహల పేసలిహనుమ గజబేటకార హోయసల దేశాధిపతి ఉమ్మత్తూరు పాలకుడగు సంజరాజవడయరు బిరదు. ఈ వంశము మదుర రాజ కుల సబకు వచ్చిన మహాబందు కూటస్తులు, నేడు వీరికి సెట్టిపాల గోత్రం, సుమనస గోత్రం ఉంది.
Sangama Clan Balija Kshatriyas
sangamavamsa balija kshatriyulu | balija kshatriyas | sangama clan | sangama vamsha balija kshtriyas | sangama vamsha balija kshatriyulu | sangama clan balija kshatriyas | Saluva Balija Kings Clan | araveeti clan | balija clan surnames | nandyala clan araveeti | sameeta clan