Saluva Balija Kings Clan

Saluva Balija Kings Clan సాళువ బలిజ రాజుల వంశవృక్షం. మనుమకులం యదువంశ హైహేయ కాపు క్షత్రియుడు దేవమీదుడు (శూరసేనుడు) భార్య మారిష దంపతులుకు 10

Saluva Balija Kings Clan
saluva balija rajula vamsham

సాళువ బలిజ రాజుల వంశవృక్షం

మనుమకులం యదువంశ హైహేయ కాపు క్షత్రియుడు దేవమీదుడు (శూరసేనుడు) భార్య మారిష దంపతులుకు 10మంది కుమారులు. పెద్దవాడు వసుదేవుడు (శ్రీకృష్ణుని తండ్రి) తర్వాత తొమ్మిదవ కుమారుడు వత్సకుడు భార్య మిశ్రకేశి వీరి కుమారుడు ధృకుడు భార్య మార్వాక్షి దంపతులకు తక్షకుడు, పుష్కరుడు, సాళ్వుడు అను కుమారులు - వారిలో ఈ సాళ్వుని వంశీయులు సాళువ రాజులు.

సాళువ వారు - క్రింది ఇండ్ల పేర్లతో విస్తరించారు.

  1. సాళువ వారు : నేడు బలిజలుగా ఉన్నారు. సాళువవారు ఆలూరు సంస్థానాధీశులు నేడు బెంగలూరులో స్తిరపడి బలిజ సంగములో ప్రముకులుగా ఉన్నారు.
  2. కావలిసాళువ వారు : తిరుపతి దర్మకర్త కావలిసాళువ వారు బలిజలలో ఉన్నారు.
  3. డేగల వారు : సాళువము అనగా డేగ వీరు మదురనాయక రాజకుల సభకు విచ్చేసారు . సేవికా వృత్తి రజిక బూషనాలు నిషేధమైన రాచరిక వంశాలలో వీరు ఒకరు.
  4. జగదేవ వారు : బుజబలరాయవారు, జగదేవవారు, అనే ఇండ్లపేర్లతో రాయవంశీయులు బలిజలలో ఉన్నారు.
  5. కావేరీ వారు : బుజబలరాయ వంశీయులే కావేరీవారు (మదరై సభకు వచ్చిన వంశం)
  6. బుజబలరాయ వారు: బలిజ వంశీయులు
  7. కండిరాయల వారు : ఈ వంశం బలిజల్లో ఉన్నారు.
  8. అత్వరాయల గోత్రికులు : గౌనివారు, తమ్మేపల్లివారు ఉన్నారు.
  9. ఇమ్మడి వారు : వీరు ఇమ్మడి నరసింహరాయల వంశీయులు. ఇమ్మడి చినమసలానాయుడు, పెదముసలానాయుడు సోదరులు అస్వసేనాపతులుగా ఉండి జొన్నలగడ్డ గ్రమాన్ని ఆక్రమించి కోమటి బ్రాహ్మణులను జేర్చి, గ్రామాన్ని బాగుచేసుకున్నారు. (మదురు రాజకుల సబకు విచ్చేసారు)
  10. సాపుల వారు: మణిపాకవారు, శాలువ వంశీయుల ఇతర ఇండ్లపేర్లు. (మదుర బలిజ రాజ కుల సబకు విచ్చేసిన వంశాలే)
  11. నరహరి వారు - నరనారు వారు : వీరు మదుర సబకు విచ్చేసారు. నరనారు అన్నా నరహరి అనే అర్థం. వీరు బలిజల్లో ఉన్నారు. రాజుల కులంలోను వీరి దాయాదులు ఉన్నారు.
  12. రాయకులం వారు: వీరు మదుర రాజకుల సభకు విచ్చేసారు వీరికి మణిపాక, కఠారి అను ఇండ్లపేర్లు ఉన్నాయి.
  13. కఠారి వారు: సేవిక వృత్తి నిశేదీంపబడిన రాచ వంశం వారు రాయల, నాయక బందువులు.
  14. గుండరాజు వారు
  15. మణిపాక వారు
  16. అంకంసెట్టి వారు: అంకంసెట్టి అను సాళువ వంశీయుడు బలిజసమయాలకు పృద్వీసెట్టీగా ఉన్నారు. ఆ వంశీయుని పేరుమీద ఏర్పడిన వంశం అంకంసెట్టి వారు. మదురరాజకుల సబకు వచ్చిన రాజ వంశమే.
  17. జివాజి - జివ్వాది వారు : జివ్వాది కోలాహన సంగమ వంశీయుల బిరుదు. మదురై సభకు వచ్చిన రాచ వంశమే ఇది.
  18. దుర్భర్ రాజా వారు : కాశీరాజుల గోత్రీకులు ప్రౌడదేవరాయ వంశీయులు బలిజలు.
  19. ఉడ్డందరాయ (రావు) వారు : బలిజలుగా ఉన్నారు.

(సాళువ) జగదేవ వారి బందువర్గం

గోలుకొండ రాజ్యములో గల అనేక వీరబలిజ తెలగ నాయక వంశాలవారు రాణా, కులీయం, రఘురౌతు, కుప్పాల, బండి, కఠారి, నెల్లంకల, మడికల, ఆకుల, సామిశెట్టి, మేడిశెట్టి, అంకిశెట్టి, చాట్లపుంకాల, శ్రీగిరి, గాజులు, బయ్యపు, బాగారపు, అరిగిరి (అరిగెల) సింగము, కుంపిణి, మంత్రి మొదలగు వంశాలవారు, రాణా వంశ సంబంధీకులై జగదేవరాయలుతో బాటు బారామహల్ వెళ్ళి ఆ రాజ్యములో గొప్ప, గొప్ప పదవులు అనుభవిస్తూ, ప్రసిద్ధికెక్కి స్థిరపడెను.

వీరందరూ హంపి విజయనగర సంస్థానమందును, మధురై తంజావూరు బలిజనాయక రాజ్యాలలోనూ "ముసుగు బలిజవారు" మూతకమ్మ బలిజవారు (వీరిని ఈనాడు తమిళనాడులో కొందరు కమ్మకులస్థులు తమ కులస్థులుగా భావిస్తూ తమ కులములో కలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు) యీ మూత కమ్మలబలిజ వారికి కోస్తా జిల్లాలో కమ్మకులస్థులకు ఎలాంటి సంబంధమునూ లేదు) అని పిలువబడి గౌరవింపబడినారు. వారి స్త్రీలు రాణివాసమందుంటూ బాహ్య ప్రదేశాలకు, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు, వివాహ సమయాలలో ముసుగు ధరించుట (చంద్ర వంశ క్షత్రియ బలిజ సాంప్రదాయం) వలన వీరికి ముసుగు బలిజ వారమనియు, పురుషులు చెవులకు ప్రత్యేకమైన బంగారు కమ్మలు ధరించుట వలన, మూత కమ్మల బలిజవారనియు పేరుబడిసిరి బారామహల్ రాజ్యములో కుడిచేతి వర్గము కులాల వారికి (18 కులాలవారు) నాయకత్వం వహించుచున్న బలిజవారు. వీరు తెలుగు బలిజవారనియు పేరుబడెను.

విజయనగర సామ్రాజ్య స్థాపన ముందునుండి, మదురై నాయక రాజులు బందువర్గం ప్రకటణ వరకు, అంటే కొన్ని వందల ఏళ్ళ తరువాత కూడా ఈ వంశాలన్ని బందుత్వం కలిగే ఉన్నాయి. శ్రీవంశ ప్రకాశిక ఆధారం.

మద్రాసు విశ్వవిద్యాలయంలో 'హిందూ దేశ చరిత్ర' పురావస్తుతత్త్వ శాస్త్ర విభాగంలో ఆచార్యుడైన డా||ఎస్. కృష్ణస్వామి అయ్యంగార్ యం.ఎ.పి.హెచ్.డి వారు ఇచ్చిన వ్రాతప్రతి - “సాళు వాభ్యుదయ కావ్యం" నుండి వివరాలు గ్రహించారు. డా॥ కోరాడ రామకృష్ణ - యం.ఎ.పి.హెచ్.డి. వారి "తిరుమల తిరుపతి దేవస్థాన శానసములు ఆధారములు.

సాళువాభ్యుదయము గ్రంథం :

సంస్కృతములో రచించిన "సాళువాభ్యుదయం" కావ్యం ప్రథమ సర్గలో ఈ విధంగా వర్నింబడింది. సాళువ నరసింహ రాయలు పూర్వీకుడు మొదటి గుండరాజు "కళ్యాణపురం" ముఖ్య పట్టణముగా రాజ్యాన్ని జనరంజకంగా పాలించాడు. తదనంతరం సాళువ మంగదేవ అతని సోదరుడు గౌతయ్య ఆ రాజ్యాన్ని పాలించాడు. రెండవ సర్గలో గౌతయ్య కుమారుడు మూడవ గుండ దేవరాజు పిత్రార్జితమైన రాజ్యాన్ని కొంతకాలం పరిపాలించిన మీదట యుక్తవయస్కుడైన కుమారుడు సాళువ నరసింహరాయలుకు రాజ్యాన్ని అప్పగించి తాను తన భార్య మల్లాంబికతో వాన ప్రస్తము స్వీకరించి శేషజీవితం గడిపాడు. తృతీయ సర్గలో తల్లిదండ్రులు వానప్రస్థం వెళుతూ తనకు రాజ్య భారం అప్పగించినందుకు, ఇంకా కొన్ని రోజులు తనవద్ద తల్లిదండ్రులు లేనందుకు చాలా బాధపడ్డాడు. మంత్రులు, సేనాధిపతులు మాటలు వారి ఓదార్పుతో ధైర్యం తెచ్చుకొని తన దృష్టిని పరిపాలన వైపు మళ్ళించాడు. దైనందిన పాలనా భారాన్ని మంత్రిపై పెట్టి దిగ్విజయ యాత్రకు సన్నాహాలు ప్రారంభించాడు. మంత్రి సలహా ననుసరించి తన రాజధానిని వెంకటాద్రి సమీపాన కొండల నడుమ దుర్బేధ్యమైన చంద్రగిరి కోటకు మార్చారు. తన మూలబలాన్ని అక్కడ నిలిపి కొంత సైన్యముతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు.

సాళువ నరసింహరాయలు చంద్రగిరి నుండి మొదట కళింగరాజ్యం మీదకి దండెత్తాడు. కళింగను జయించి దక్షిణ భారతదేశం వైపుకు వెళ్ళాడు. దానిని సునాయాసంగా పాదాక్రాంతము చేసుకున్నాడు.

పై కదనాన్ని బట్టి సాళువ నరసింహుడు తన పూర్వీకుల నుండి వారసత్వంగా లభించిన రాజ్యమని, దాని ముఖ్య పట్టణం ఈనాటి కర్ణాటకలోని కళ్యాణపురమని, ఆపురము దగ్ధము కాగా నివాసయోగ్యం కాని ఆ పురం వదిలి చంద్రగిరికి మార్చినట్లు తెలుస్తోంది. (సాళువాభ్యుదయం-అశ్వా-3-ప-4) కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థాన శాసనం-శా-శ॥ 1378-No: 3-TT. లో వేయబడిన శాసనం (క్రీ॥శ॥ 1456 సం॥)

సాళువ నరసింహుని ముఖ్య పట్టణము చంద్రగిరికి మార్చినపుడు వేసిన మొదటి శాసనం.

శా॥శ॥ 1378 (క్రీ॥శ॥ 1456) సం॥ పూర్వము సుమారు ఎనిమిది సంవత్సరాలు కళ్యాణపురము నుండే పరిపాలన సాగించాడు. ఈ విధంగా సాళువ నరసింహరాయలు 44 సంవత్సరాలు రాజ్యం పాలించాడు. "న్యూనిజ్" చెప్పిన వార్త సరయినదని తెలస్తుంది. సాళువ నరసింహుని పరిపాలన చివరి సంవత్సరము శా॥శ॥ 1422 (క్రీ॥శ॥ 1500) శాసనం అవుతుందని న్యూనిజ్ తేల్చి చెప్పాడు. (Ār-Sur Rep - 1907-08-Page-254 - Note -13)

సాళువ నరసింహరాయలు - మొదటి శాసనం - క్రీ॥శ॥ 1456సం॥ చివరి శాసనం - క్రీ॥శ॥ 1500 అంతకు ముందు కళ్యాణపురము ఎనిమిది సంవత్సరాలు పాలించాడు. మొత్తం - 44 సం॥ రాలు రాజ్యపాలన చేశాడు.

అరివీర భయంకరుడైన సాళువ నరసింహుడు “ఖడ్గమాత్ర సహాయుడై శత్రువులందరిని జయించి చక్రవర్తి అయినట్లు (దేవులపల్లి శాసనము) ఇతడు విజయనగర సింహాసనాన్ని బలాత్కారంగా గ్రహించాడని తెలుపుతుంది. మహారాజు మొదలయిన బిరుదులను బట్టి చక్రవర్తిత్వం తెలిపే బిరుదావళి శా॥శ॥ 1408 (క్రీ॥శ॥ 1486) Ar ure for 1907 - 1908 - Pages -253-54) సం||లో విజయనగర సింహాసన మాక్రమించినట్లు తెలుస్తోంది. ఈ విషయం దాదాపు T.T.D శాసనాలు 20 దాకా ఉన్నాయి. శా॥శ॥ 1407 సం॥లో శ్రీ నరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భంగా వేయబడిన 270 - G - T శాసనములోని సంస్కృత శ్లోకంలో ఇతనికి “సార్వబౌమ" అనే బిరుదును ప్రయోగించబడింది.

15వ శతాబ్దం ప్రథమ దశకం పూర్తి అయ్యే లోపలే సాళువ నరసింహుడు అన్ని విధాలైన అడ్డంకులనూ అధిగమించి చేపట్టిన కార్యాన్ని సాధించి తిరుగుబాటుదారుల కుట్రలు, నమ్మక ద్రోహులు అనే తుఫానులో చిక్కుకున్న విజయనగర సామ్రాజ్య నౌకను విధ్వంసము కలిగించేందుకు ప్రయత్నిస్తున్న వారి బారి నుండి తప్పించి, నేర్పుగా పయనం సాగించేట్టుగా, తగిన కట్టుదిట్టము చేశాడు. నమ్మకస్తులయిన సేనా నాయకుల, అధికారుల, సహకారంలో ప్రధానమంత్రిత్వం పొంది రాచకార్యాలను చక్కబెట్టాడు. విశాలమైన పెద్ద సంస్థానానికి అధిపతియై పెద్ద సైన్యాన్ని కలిగి ఉన్నందువలన ఆ కాలంలో విజయనగర సామ్రాజ్య రాజ్యాధికారులలో సాళువ నరసింహుడే అధిక శక్తిమంతుడుగా వున్నాడు. సహోద్యోగులతో ఎప్పుడూ మంచి సంబంధాలు కలిగి ఉండేవారు. రాజ్యంలోని పరిస్థితులు చక్కదిద్ది సరిహద్దులను పెంచి, స్థిరపరిచాడు. పాలనా వ్యవహారాలు సవ్యంగా జరిగేటట్లు కట్టుదిట్టం చేశాడు.

దీనినిబట్టి సాళువ నరసింహరాయలు తాతలు, తండ్రులు, తనయులు, మనుమలు ఐకమత్యంగా ఉండి చంద్రగిరి రాజ్యాన్ని బలోపేతం చేశారని శాసనాల ద్వారా తెలుస్తుంది. సాళువ నరసింహరాయలు దాయాదులు, వీరి పూర్వులు సంగమవంశ రెండవ దేవరాయలు, మల్లిఖార్జున రాయలు, విరూపాక్ష రాయలు పరిపాలనా కాలంలో ప్రముఖ స్థానాలలో అధికార పదవులలో వున్నారు. వీరి బంధువులుగా వున్నారు.

సాళువ నరసింహుడు మల్లికార్జున రాయలు పరిపాలనా కాలంలో దక్షిణాదిలో ఒక పాలె యానికి "అధిపతి"గా ఉండేవాడు. (Mad-Ep-Rep-for 1907-Para-58) క్రమేపి బలాన్ని కూడదీసుకొని తన అధికార పరిధిని విస్తరింపచేసుకొని ఆ కాలంనాటి ఉత్తర ఆర్కాటు (చిత్తూరు రాయవేలూరు) చంగల్ పట్టు మరియు దక్షిణ ఆర్కాటు జిల్లాలకు అధిపతి అయ్యాడు. (Mad-Ep-Rep-for 1910-Para-54) తరువాత సాళునరసింహుడు సంగమవంశ కడపటి చక్రవర్తి విరూపాక్ష రాయలుకు ప్రధానమంత్రిగా సేనానాయకుడిగా వ్యవహరించేవారు. ఇ తడే పాలకుడిగా ఉండేవాడు. శా॥శ॥ 1378 నుండి 1411 వరకు గల - 14 శాసనాలలోనూ, ఇతనిని మహా మండలేశ్వర బిరుదులు మాత్రమే వున్నవి. దీనినిబట్టి ఇతడు ఒక మండలానికి అధికారి అని తెలుస్తుంది. ఇతనికి గల మేదినీ మీసరగండ, కఠారి సాళువ బిరుదులు. వారి పూర్వులు సాళువ వంశీయుల కందరికి ఉన్నవి. (No. 197 TT) వారి పూర్వులు ఇతని తండ్రి గుండ దేవమహారాజు. తల్లి మల్లాంబిక. ఇతని అన్న తిమ్మరాజు దేవమహారాజు. (No: 69 - TT) ఇతని రాణి శ్రీరంగదేవి అమ్మాన్ (No : 34 - TT) ఇతనికి ముగ్గురు కుమారులు.

1) కుమార నరసయ్య 2) పెద్ద సంగమదేవ 3) చిన సంగమదేవ అనువారు. సాళువ నరసింహుడు (No: 197- TT) దాన శాసనాన్ని వ్రాయించి అందులో తాను, తన తల్లి, తన ముగ్గురు కుమారులు రాణి పేర్లమీద చేయబడిన దానాలను గుర్తించి ప్రస్తావించాడు. శా॥శ॥1395. (క్రీ॥శ॥ 1473) తిరుమల దేవాలయంలో - పడయివీడు రాజ్యంలోని "కలవైపర్రు” తాలూకా దొమ్మరపట్టి గ్రామాన్ని దానంచేసి శాసనములో వ్రాయించాడు.

ఇందులో 1. కుమార నరసయ్య పేరు- ఇమ్మడి నరసింహరాయలు (విజయనగర సామ్రాజ్యాధీశుడు), కుమార అనునది రాజ కుమారుడు అని అర్ధం. అతనిని యువరాజుగా ప్రకటించాడు.

సాళువ నరసింహరాయలు ఉద్యోగులు:

ఇతని తోటి దిగ్విజయ యాత్రలో పాల్గొన్నవారు 1. ముఖప్పాళం. నాగమనాయకుడు (కొటికం (గెరికపాటి) నాగమ నాయకుడు - మధురై రాజు విశ్వనాథ నాయకుని తండ్రి) ఇతను సాళువ నరసింహుని సేనానాయకుడు (No 243 - TT) శా॥శ॥ 1409 (క్రీ॥శ॥ 1487) తిరుమల వెంకటేశ్వరస్వామికి కానుకలు సమర్పిస్తూ తమ ప్రభువు సాళువ నరసింహరాయలు అభ్యుదయము కోసం ఏర్పాటు చేశాడు అందుకు "కచ్చి పట్టుశీమ" (కంచి)కు చెందిన తిరడం పాడి గ్రామాన్ని దేవాలయానికి దానం చేశాడు. (Ar - Sur - Rep - for 1908 - 1909 - Page - 165) - పదుమలై దేవప్ప కుమారుడు “సిద్ధనయర్” సాళువ నరసింహుని కార్యనిర్వాహకుడు. (No : 160– TT) సాళువ నరసింహరాయలు కంచి సీమపాలకునిగా నాగమ నాయకుని నియమించాడు. పై శాసనం నాగమనాయకుడు వేసినది.

తుళువ నర్సానాయకుడు : క్రీ॥శ॥ 1498 సం|| వరకు విజయ నగరాన్ని పాలించి వున్నా అప్పటి నుండి క్రీ॥శ॥ 1498 సం|| నుండి మంత్రిగాను, సైన్యాధిపతిగాను ఉన్న తుళువ నర్సా నాయకుడు ఐదు సంవత్సరాలు వరకు రాజ్య భారాన్ని వహించినట్లు (పర్గాటన్ ఎంపెయిర్ - Page 110. (No : 197- TT) - శాసనం ప్రకారం.

సాళువ నరసింహరాయలు చివరి సంవత్సరం 1498 సం|| నాటికి తన ముగ్గురు కుమారులతో కనిష్ట కుమారునికి - 25 సం॥ వయస్సుంటుంది. - క్రీ॥శ॥ 1498 సం॥ నాటికి ఆయన పెద్ద కుమారుడు కుమార నరసయ్య (ఇమ్మడి నరసింహ రాయలు) యుక్త వయస్కుడై యున్నాడు. విజయనగర సింహాసనమెక్కే నాటికి, ఇమ్మడి నరసింహ రాయలుకు 35 సం|| వయస్సు ఉండవచ్చును. ఇమ్మడి నరసింహుని శాసనాలు - శా॥శ॥ 1414 సం॥ (క్రీ॥శ॥ 1493) నుండి లభించాయి.

స్వెల్ పండితుడు రచించిన "పర్ణాటన్ ఎంపెయిర్ అనే చరిత్ర గ్రంథం - 110 - పేజీలో, సాళువ నరసింహుడు. తన అవసాన కాలము సమీపించిన తరుణములో తన సైన్యాధిపతి తుళువ నరసా నాయకుని రావించి అల్ప వయస్కులయిన తన కుమారులను అతనికి అప్పగించి వారిని జాగ్రత్తగా కాపాడమని కోరాడు. సాళువ నరసింహుడు చనిపోగానే ఆ ఇద్దరు కుమారులను కడతేర్చాడు అన్నటువంటి "న్యూనిజ్" కదనాన్ని దృష్టాంతంగా ఇవ్వడం జరిగింది. సాళువ నరసింహుని మరణానంతరం ముగ్గురు కుమారులు బ్రతికి ఉన్నారు. రాజకీయాలలో తలపండిన సాళువ నరసింహుడు తనను ఇంత కాలము నమ్మకంగా సేవించి తన అభ్యుదయానికి పాటుపడినట్లే కొత్తగా రాచరికపు పదవిని పొందబోతున్న తన కుమారునికి గూడా మంత్రిత్వం నెరపవలసిందని తన బావమర్ధి తుళువ నరసా నాయకునికి సూచించాడు.

సాళువ నరసింహునికి ముగ్గురు కుమారులని శాసనాలు చెబుతున్నాయి. ఒక కుమారుడు ఇమ్మడి నరసింహరాయలు. కొంతకాలం విజయనగరాన్ని పాలించినట్లు శాసనాలున్నాయి. మిగిలిన ఇద్దరు కుమారులు బ్రతికి ఉన్నట్లు తెలిపే ఎటువంటి శాసనాలు లభ్యం కాలేదు. ఒక కుమారుడు మంత్రి, సర్వ సైన్యాధ్యక్షుడు, బంధువు అయిన తుళువ నర్సానాయకునితో శత్రుత్వాన్ని పెంచుకొని "తిమ్మరస” అనే రక్షక భటునిచే చంపబడ్డాడు. నర్సానాయకుడు పురిగొల్పి రెండవ కుమారుని చంపించాడు. సాళువ నరసింహ రాయలుకు ముగ్గురు కుమారులని (No : 197- TT) శాసనములో వుంది సాళువ నరసింహరాయలు కుమారుడు ఇమ్మడి నరసింహరాయలు. శా॥శ॥ 1427 (క్రీ॥శ॥1505) వరకు విజయనగరాన్ని పాలించాడు. ఇతని సోదరులు శా॥శ॥ 1414 సం॥ (క్రీ॥శ॥ 1492)లో దారుణంగా హత్య చేయబడినారు.

ఇమ్మడి నరసింహరాయలకు ఎట్టి సాధికారమైన హక్కు లేనప్పటికి అటువంటి కార్యం చేయడానికి తండ్రి సాళువ నరసింహరాయలు అధికార గౌరవము, స్థాన బలానికి తోడు రాజ్యమునందు అధిక శక్తివంతుడు. సర్వ సైన్యాధిపతి, బంధువు అయిన తుళువ నర్సానాయకుని అండగా నిలిచాడు. T.T.D. శాసనాలలో ఇతనిని గురించి శాసనం - (No : 271 – TT) ఒకటి లభించింది. పాలన చివరి సంవత్సరం శా॥శ॥ 1426 సం॥ (క్రీ॥శ॥ 1504) అని వేయబడినది.

కోనేరి మరియు ఓళగళంద వేలాన్ శాసనం (No : 59TT)

  1. సాళువ నరసింహరాయలు అన్నగారు మహామండలేశ్వర సాళువ తిమ్మరాజు. దేవ ఉడయార్ (No: 69TT) వీరు రాజరికానికి సంబంధించిన వారు.
  2. మతానికి సంబంధించి ఆచార్య పురుషుడు. దేవాలయ సేవా కైంకర్యం, నిష్టాపరుడు, అటు రాజకీయ వ్యవహారాలలోనూ వైష్ణవ మత వ్యవహారాలలోనూ, చక్రం తిప్పగల పలుకుబడి గలవారు. కందాడై రామానుజయ్య గారు వీరు సాళువ నరసింహరాయలు అన్నగారు. సాళువ చిన మల్లిదేవమహారాజు కుమారుడు సాళువ రామచంద్రరాజు గారు. వీరు "కందాడై రామానుజ అయ్యంగార్" వద్ద వైష్ణవ మత దీక్ష తీసుకున్నారు. అందువలన ఆయనను కందాడై రామానుజయగారుగా, గురువుగా తిరుమల తిరుపతి దేవాలయ హుండి అధ్యక్షులుగా, తిరుమల తిరుపతి అన్నదాన శాలలను స్థాపించి వాటిని సక్రమంగా నడిపించడానికి తగిన ఏర్పాట్లు చేయడంలో తనకు సహకరించినందుకు గుర్తింపుగా రామానుజ కూటాల నిర్వహణ వ్యవహారాల్లో కందాడై రామానుజయ్య గారిని "సాళువ నరసింహరాయలు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చాడు రామానుజ కూటముల నిర్వహణ కోసం కొన్ని గ్రామాలను, భూములను దానం చేశాడు. కందాడై రామానుజయ్య గారు. సాళువ నరసింహరాయలు అభ్యుదయం కోసం కొన్ని కైంకర్యాలు దానధర్మాలు చేశాడు. (శాసనం - No : S. 163 - 494, TT. No : 67.6T).

సాళువవారు

సాళువ (కఠారి) నరసింహరాయలు విజయనగర మహాసామ్రాజ్యమును పాలిస్తున్నపుడు 1490వ సంవత్సరంలో ఆయన మరణిస్తూ తన కుమారులు వయస్సులో చిన్నవారయిన కారణంగా ఆయన బావమర్ధి విజయనగర సర్వ సైన్యాధ్యక్షుడు అయిన తుళువ నర్సానాయకుడుకి రాజ్యభారం అప్పచెప్పాడు. వరాహ పురాణములలో “చాళక్య నారాయణ" బిరుదు నర్సా నాయకునికి ఉంది. అందువలన వీరు చంద్రవంశీయులని తెలుస్తుంది.

తుళువ నర్సానాయకుడు సాళువ నరసింహరాయలు పెద్ద కుమారుని రాజును చేసి ఆయనే రాజ్యము పాలించసాగాడు. అతనిని వారి శత్రువైన “త్యామరసు” అను నతడు రహస్యంగా చంపి ఆ నింద నర్సానాయకునిపై వేశాడు. తుళువ నర్సానాయకునికి ఇమ్మడి నరసింహరాయలకు మధ్య మనస్థాపము విరోధము ఏర్పడినది. ఇమ్మడి నరసింహరాయలు శత్రురాజుల సలహాలు తీసుకుంటూ నర్సానాయకుని మాటలు పెడచెవిని బెట్టసాగెను. ఈ విధానము విజయనగర సామ్రాజ్యానికి క్షేమం కాదని రాజ్యం శత్రురాజుల పరమవుతుందని గ్రహించిన నర్సానాయకుడు వారి రెండవ రాజధానియైన పెనుగొండకు ఇమ్మడి నరసింహరాయలును అతని కుటుంబమును పంపి ఇరవై వేల సైన్యముతో అతనిని రక్షణగా ఉంచి ఆ బాధ్యత తన తమ్ముడు తుళువ (దళవాయి) తిమ్మానాయకుడు అతని కుమారుడు క్రిష్ణప్ప నాయకుడికి అప్పగించాడు. తర్వాత విజయనగర సామ్రాజ్య సంరక్షణా బాధ్యత తుళువ నర్సానాయకుడు తీసుకుని పాలించసాగాడు. 1503 సం॥ తుళువ నర్సాయనాయకుడు మరణించాడు. తర్వాత ఇమ్మడి నరసింహరాయలు పెనుగొండలో అనుమానస్పద స్థితిలో మరణించాడు. అతనిని చంపి నర్సానాయకుని పెద్ద కుమారుడు తుళువ వీరనరసింహ రాయలు రాజ్యానికి వచ్చాడని సామంత రాజులు తిరుగుబాటు చేశారు వీరనరసింహ రాయలు. తన తమ్ములు శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుత దేవరాయలును పంపి తిరుగుబాటుదారులను అణచివేశాడు. తర్వాత తుళువ నర్సానాయకుని పెద్ద కుమారుడు తుళువ వీర నరసింహరాయలు విజయనగర సింహానమదిష్టించాడు. తర్వాత క్రీ.శ. 1509లో తుళువ శ్రీకృష్ణదేవరాయలు తర్వాత 1530 సం||లో తుళువ అచ్యుతదేవరాయలు తర్వాత 1543వ సం||లో తుళువ సదాశివరాయలు, విజయనగర సామ్రాజ్యంను పాలించారు.

  1. కఠారి కనకయ్య నాయుడు. మచిలీపట్నం (సి.కె. నాయుడు) భారత తొలి క్రికెట్ కెప్టెన్. కఠారివారు బలిజలుగా రాయలసీమ కోస్తా జిల్లాలలో ఉన్నారు.
  2. కఠారి నాగనాయకుడు. కొండవీటి అనువేమా రెడ్డిని జయించాడు. కఠారి నాయుడు, రౌతురాయడు బిరుదులు కలవు.

సాళువవారు

చంద్రగిరి సంస్థానము విభజనలో కార్వేటి నగరము పాత ఆరూరు కలదు. అందులో పాత ఆరూరు సంస్థానాదీశుల వారసులు - ఈ సాళువ వారు తిరుమల తిరుపతి దేవస్థానమునకు ఆదినుండి ఆలయ ధర్మకర్తలుగా దేవాలయమునకు కాపలాదారులుగా వున్నందున వీరికి "సాళువ కావలి" వారుగా పిలువబడినారు.

  1. సాళువ చెంగమనాయకుడు భార్య ఆదిశేషమ్మ (రెండవ భార్య) పాత ఆరూరు సంస్థానానికి దొరలు,
  2. సాళువ కావలి దొరస్వామి భార్య కనకమ్మ
  3. సాళువ కావలి అప్పాస్వామి భార్య పరక్క
  4. సాళువ కావలి మునిస్వామి భార్య సుందరమ్మ.
  5. సాళువ కావలి రామచంద్రయ్య భార్య మునెమ్మ.
  6. సాళువ కావలి ముద్దు క్రిష్ణయ్య భార్య గోవిందమ్మ.
  7. సాళువ కావలి స్వామినాయుడు భార్య శేషమ్మ. వీరి సంతానము ఇంద్రాణి, శంకర్, రాధా, పార్వతి, శాంత వేణుగోపాల్, మాలతి, రాజేంద్రప్రసాద్, సురేష్,
  8. సాళువ కావలి రాజేంద్రప్రసాద్ భార్య లక్ష్మి వీరి కుమార్తెలు గగన, మేఘన.

వీరు 1974వ సం|| నుండి బెంగుళూరు వచ్చి స్థిరపడిన కుటుంబం. బెంగుళూరులో గ్రానైట్ క్వారీ ఓనర్, ఇంటీరియర్ డెకరేటర్, ల్యాండ్ డెవలపర్స్ అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి, వ్యాపారవేత్త దక్షిణ భారత బలిజ సంఘంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న వ్యక్తి. వీరికి చంద్రగిరి, పెనుగొండ, బళ్ళారి, అనెగొంది ప్రాంతాలలో సాళువ నరసింహరాయలు (విజయ నగర సామ్రాజ్యాధీశుడు) అన్నగారయిన సాళువ రామరాజు కందాడై స్వాముల వద్ద వైష్ణవ మత దీక్ష తీసుకొని కందాడై రామానుజయ్య స్వాములుగా పిలువబడినారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం హుండి మొదటి అధ్యక్షుడు ఉన్నారు. వారి వారసులు. తిరుమల తిరుపతి దేవస్థానము, వకుళామాత దేవాలయ రక్షకులుగా ఉన్నారు వారి వంశీయులే వీరు. వీరు నేటి బలిజలుగా వున్నారు.

- భట్టరుశెట్టి పద్మారావు రాయలు

Saluva Balija Kings Clan

saluva balija kings clan | savula balija rajula vamsa vruksham | saluva balija history telugu | saluva baalija rajavamsam | Sangama Clan Balija Kshatriyas | Balija Clan Surnames | Araveeti Clan | Sammeta Family | Kapu Telugu Books | Kapu Community