Balija Clan Surnames
Balija Clan Surnames. బలిజవంశ ఇంటిపేర్ల వివరణ. శ్రీ చంద్రవంశ క్షత్రియులైన దేశ బలిజవారనియెడు గౌరవులయందు, రాజబంధు, మహాబంధు, గోష్ఠిబంధు

బలిజవంశ ఇంటిపేర్ల వివరణ.
శ్రీ చంద్రవంశ క్షత్రియులైన దేశ బలిజవారనియెడు గౌరవులయందు, రాజబంధు, మహాబంధు, గోష్ఠిబంధు, బహుబంధువులని యెడి చతుర్వర్గముల వివరణముల దెలిపెడు శ్రీ వంశ ప్రకాశికయనెడు గ్రంథయొక్క సారాంశము:-
శ్రీ చంద్రవంశ క్షత్రియులయిన గౌరవులనియెడి బలిజవారిలో కోటబలిజ వారు, పేట బలిజ వారు అనే రెండు తెగలు గలవు. కోటయనగ, విజయనగరపు కోటయని తెలియవలయును. ఈ కోటవారికే దేశ బలిజవారను నామముగలదు. వీరిలో రాజబంధు, మహాబంధు, గోష్ఠి బంధు, బహు బంధువులని నాలుగు తెగలు గలవు. వీరందఱును నాయనివారు, సెట్టివారు, రౌతువారు, రాజువారు, రావువారు, వజీరువారు అను షడ్విధాంక నామధేయములతో వ్యవహరింపబడుదురు.
ఈ చతుర్బంధువులయందు రాజబంధుజన కూటస్థుల ఇంటిపేర్ల వివరణము.
శ్రీకరంబగుచంద్రమాకుల క్షత్రియులందు నాలుగు తెగలవనిగలదు అవిరాజబంధువు నరయమహాబంధు బలగోపి బంధువు బాగుగాను బహుబంధువనబడు పరికింపవీరితో భాసిలును గరికపాటివారు వర నెడుంగుండ్ర పువారును నమ్మకుమారులని యెడియల్లూరి వారు వసుధ చింతలపురి వారును మఱి బండ్ల పేటవారును పాలపాటివారు పట్టపువారును పగడాలవారును సెట్టివారును ధన సెట్టివారు వెలికోట్ల వారని నెలయు తుపాకులవారును మఱి కత్తివారు పిదప జగదేవవారును సవరమువారును కరివేటివారును కంచివారు గంధపురమువారు కడియాల వారును నాసూరివారును నవనియందు శ్రీపతివారును చెంజివారును మఱి వజ్రాల వారును వరుసగాను నిమ్మడివారును నీలకంఠమువారు స్థిరను డేగలవారు బిరుదువారు రాయకులమువారు రాజిలు విజయము వారు నారావారు ధోరణిగను వరలుభండారమువారు మంచాపాత్రనామంబువారు మునగలపేట వారును నంజేటివారును మఱిడళవావారు తియ్యారివారు తిరుగస్థిర చంద్రగిరివారు పురమువారును పర్వతమువారు నదయాద్రి స్థలము వారు గుఱుతుగా మఱి బంతికుట్టువారనియెడి యీ నామములు గల ఇండ్ల వారు పరికింప శ్రీ రాజబంధుకూటస్థులై విలసిల్లుచుందురు విభవముగను భువియందు ననువీరి పూర్వసంబంధులై యుండువారలతోడ నొక్కటిగను
గీ. రాజబంధువు లనిముందు తేజవిజయ
రంగచొక్కనా థేంద్రుఁడు రాజు లెఱుగ
రంగనాథునిముంగల రమ్యముగను
ఘోషణము జేసె బంధువుల్ గూడివినగ.
తాత్పర్యము. శుభకరులగు చంద్ర వంశ క్షత్రియులయిన కోట బలిజవారియందు నాలుగు తెగలవారు గలరనియు, వారు రాజబంధువు లనియును, మహాబంధువులనియును, గోష్ఠి బంధువులనియును, బహు బంధువులనియును చెప్పబడుదురు.
వీరిలో రాజబంధుజనకూటస్థులు ఎవరనగా :
- గరిగపాటివారు అను పాండ్య మండలాధీశ్వరుండైన విజయరంగ చొక్కనాథనాయని వారు.
- నెడుంగుండ్రమువారు.
- అమ్మకుమారు లనెడి అల్లూరి వారను తంజావూరు అధిపతి విజయరాఘవనాయనివారు.
- చింతలపురివారు అనగా ఖండిమహారాజు గారు.
- బండ్ల పేటవారు.
- పాలపాటివారు.
- పట్టపువారు.
- పగడాలవారు.
- సెట్టివారు.
- ధన సెట్టివారు.
- వెలికోటవారు, లేక తుపాకుల వారు
- కత్తివారు.
- జగదేవవారు.
- సవరమువారు.
- కరివేటివారు.
- కంచివారు.
- గంధపురమువారు.
- కడియాల వారు.
- ఆసూరివారు.
- శ్రీపతివారు.
- చెంజివారు.
- వజ్రాల వారు.
- నిమ్మడివారు.
- నీలకంఠమువారు.
- డేగలవారు.
- బిరుదువారు.
- రాయకులము వారు.
- విజయము వారు.
- నరానారు.
- భండారము వారు.
- మంచా పాత్రము వారు.
- మునగలపేట వారు
- అంజేటివారు.
- దళవాయి వారు.
- తియ్యారి వారు, లేక చిత్రాల వారు.
- చంద్రగిరి వారు.
- పురమువారు.
- పర్వతము వారు.
- ఉదయగిరి వారు.
- బంతికుట్టువారు.
అనే 40 ఇండ్ల వారును, వీరి పూర్వులును రాజబంధువులని ముందు విజయరంగ చొక్కనాగేంద్రుడు రాజకులమువా రెఱుఁగ, శ్రీరంగనాయకుల సన్నిధానంబున బంధువులందఱు వినగ వక్కాణించిరి. వీరికి రాజబంధువులనియును, రాజశ్రేష్ఠులనియును, ఏలిన వారనియును, చోళ పాండ్య దేశాధిపతులనియును, ఖండివారనియును వ్యవహారనామంబులుగలవు. వీరికి సేవకావృత్తియును, రజతభూషణ ధారణమును లేదు.
వీరి సంఘ వాసస్థలములు: బాగలూరు, నారికల్లు, రాయ వేలూరు, వెళ్లి కురిచి, విరాచ్చిల, పనయూరు, అని తెలియవలయును.
మహాబంధుజన కూటస్థుల ఇంటిపేర్ల వివరణము.
శ్రీలక్ష్మీకరమగు శ్రీ పైడియావులవారును మరల నీ వసుధయందు కనగొనబంగారు కత్తివారనియెడి పచ్చనిసుగరికెపాటివారు వరమెండుగుట్టల వారును మఱి బ్రహ్మముడివారు ఘనవాడిమొనలవారు సామువారును మఱి జవ్వాజివారును నాదివారును మఱి దూదిపారు! నిండుకులమువారు నిర్మల సంపంగివారును మఱి భారీవారు మఱియు చిఱుతపువారును బెట్టివారును మఱి బట్టేటివారును బండపల్లె వారును మఱియందెవారు నాలం బాగువారును జనకలవారు విడెము వారును గంధాలవారు నరసవారు పులిగుచ్చువారును భువినియిండ్ల వారు కొన్కావారు వనుమతిలో గోపి పెట్టివారును మేడిసెట్టివారు. మఱి యేనుగులవారు మంచికుంచావారు వరుసగా మఱివల్లెవాట్లవారు దండిగానుండు రథాలవారును జూడధర కత్తివారు ముత్యాలవారు సాయనవారును జగతికాలాపురివారు లాయమువారు వరుసగాను పావాడవారును బరగ వంగావారు పోగులవారును పొడవుమండి వారును శోధింప వనధిమధ్యను పూసపాటివారని 41 సంఖ్యతో నొప్పిన చంద్రవంశోద్భవులైనట్టివారిలో నధికులైన ఈ నామధేయపు ఇండ్ల వారును వీరి యాదిసంబంధులై యమరియున్న
గీ. వారలునుమహా బంధువుల్ వరలువిజయ
రంగ చొక్క నా థేంద్రుఁడు రాజులెఱుఁగ
రంగనాథుని ముంగల రమ్యముగను
ఘోషణముజేసె బంధువుల్ గూడి వినగ
- పైడియావులవారు..
- బంగారు కత్తి వారు నెడు గరికెపాటివారు
- మెండుగుట్టల వారు.
- బ్రహ్మముడివారు.
- మొనలవారు.
- సామువారు,
- జవ్వాజివారు.
- ఆదివారు.
- దూదివారు
- నిండుకులమువారు.
- సంపంగివారు.
- భారీవారు.
- చిరుత వారు.
- జెట్టివారు
- పట్టేటివారు.
- బండపల్లె వారు.
- అందెవారు.
- ఆలంబాకు వారు,
- జనకలవారు.
- విడెమువారు.
- గంధాలవారు.
- అరసవారు.
- పులిగుచ్చువారు.
- ఇండ్లవారు,
- కొనకా వారు
- గోపి పెట్టి వారు
- మేడి సెట్టివారు.
- ఏనుగులవారు.
- కుంచావారు.
- వల్లెవాట్లవారు
- రథాలవారు.
- కత్తి వారు.
- ముత్యాల వారు
- సాయన వారు
- కాలాపురి వారు
- లాయరి వారు
- పావాడ వారు.
- వంగా వారు.
- పోగులవారు.
- మండి వారు
- పూసపాటివారు
అనే నీ 41 ఇండ్ల వారును వీరల ఆది సంబంధులును మహాబంధువులని విజయరంగ చొక్కనాథేంద్రుడు రాజకులము వారెఱుఁగ శ్రీ రంగంబున శ్రీరంగనాయకుల సన్నిధానంబున బంధువులందరు వివఁగ వక్కాణించిరని తాత్పర్యము. వీరలకు మహాబంధువులనియును, రాజరాజేంద్రులనియును, పాండ్యరాజశేఖరులనియును, కుల శ్రేష్ఠులనియును వ్యహారనామంబులు కలవు. వీరికి చతుర్బంధువులయందును మొదటిమర్యాద కలిగియుండును. వీరిలోని స్త్రీలకు మెట్టెలనెడి భూషణంబులు లేవు.
వీరల నివాసస్థలము: శ్రీ జగన్నాథము, విజయనగరము, రాజమహేంద్రవరము, సింహాచలము, దక్షిణమధుర, కొత్తకోట, పెరియకుళం, శ్రీ హనుమత్పురియను హనుమన్దన్పట్టివాడి, అరుందాణి, అని తెలియవలయును.
గోష్ఠి బంధు జన కూటస్థుల ఇంటిపేర్ల వివరణము.
సీసమాలిక
శ్రీరమాకృపగల స్థిరమతులగు పైడిపాటివారును మఱి తోటవారు గట్లవారును గుడిమెట్లవారును గవనాలవారును మఱి గాలివారు అయిలివారును మఱి యాసూరివారును నంద్యాలవారును నందెవారు కుప్పాలవారను గొప్పులవారును శీలాలవారును స్థిరను గీర్తివారను సాధనవారును పగడాలవారును పోగులవారు నిండ్ల వారును ముత్యాల వారును మతంబువారును సుంకరవారు మంకు వారును నరుగులవారు నొయ్యూరపువారును కొలుకులవారు ఛత్రివారును గటకంబువారును గనికాలవారును మన్నెంపువారు నొంటి వారును బీగాలవారును గరివారు భోగినివారును పోలురాజు వారును శ్రీచందువారు భీసాపత్రివారును గానాలవారు మరల రామాయణమువారు రాజునాయనివారు కొట్టవారును మఱి కోలవారు స్థిరయుందుననుమాఱు సెట్టివారును మఱి యెఱమచ్చువారును యెఱమసెట్టి వారు చిన్నమ సెట్టివారును మరి బాలుసెట్టివారును జూడనిడెమువారు బొబ్బూరివారును భువిదళవావారు రౌతులవారు చంద్రోతువారు అరయచల్లావారు నాకులవాడను నర్రవారను శ్రీధనాలవారు మహియందునను తిరుమలసెట్టివారును మానంబువారును మంచియల్లి వారును భండారివారును శ్రీ పాండురంగంబువారును రమ్యపురము వారును తేకూరివారును మేడూరి వారును మోసూరివారు మొలక వారును మఱి నేతివారు సొములవారు పృధ్విలోపల కొత్తపేటవారు బాలునాయనివారు పరగవున్నావారు కనుగొనంగను బండికాటివారు అననిలోపలజూడ నాలవారు పసుపులేటి వారనెడు నీయిండ్ల పేరు గలవీరలును బూర్వకాల సంబంధుల గోష్ఠి బంధువులని గురుతెఱుంగ.
గీ. తొల్లి కాలంబునందున దొడ్డవిజయ
రంగ చొక్కనా థేంద్రుఁడు రాజు లెఱుఁగ
రంగనాథుని ముంగల రమ్యముగను
ఘోషణముజేసి బంధువుల్ గూడి వినఁగ.
- పైడిపాటివారు.
- తోటవారు
- గట్టువారు.
- గుడిమెట్టవారు.
- గవనాలవారు.
- గాలివారు,
- అయిలివారు.
- ఆసూరివారు.
- నంద్యాల వారు
- అందెవారు.
- కుప్పాలవారు అనే కొప్పుల వారు
- శీలాలవారు
- కీర్తి వారు.
- సాధనవారు.
- పడాల వారు.
- పోగులవారు.
- ఇండ్ల వారు.
- ముత్యాలవారు.
- కమతంబువారు.
- సుంకరవారు.
- మంకువారు.
- అరుగుల వారు.
- ఒయ్యారపు వారు.
- కొలుకులవారు.
- ఛత్రి వారు.
- కటకమువారు.
- కనకాలవారు
- మన్నెంపువారు.
- ఒంటివారు.
- బీగాల వారు
- కరివారు.
- భోగిని వారు.
- పోలురాజు వారు.
- చందువారు.
- బీసాపత్రి వారు.
- గానాల వారు.
- రామాయణము వారు.
- రాజునాయని వారు.
- కొట్టేవారు.
- కోల వారు
- మారిశెట్టి వారు
- ఎరమచ్చ వారు
- ఎరమశెట్టి వారు.
- చిన్నమ సెట్టివారు.
- బాలు సెట్టివారు.
- నిడెమువారు.
- బొబ్బూరివారు.
- దళవాయివారు
- రౌతుల వారు
- చంద్రౌతు వారు
- చల్లావారు.
- ఆకులవారు,
- వర్రావారు.
- ధనాలవారు.
- తిరుమలసెట్టి వారు
- మౌనమువారు
- అల్లి వారు
- భండారి వారు
- పాండురంగము వారు.
- రమ్యపురము వారు.
- తేకూరివారు.
- మేడూరివారు.
- మోసూరివారు.
- మొలకవారు.
- నేతివారు.
- సొమ్ముల వారు
- కొత్తపేట వారు.
- బాలునాయుని వారు.
- పున్నా వారు
- బండికాటి వారు.
- ఆలవారు.
- పసుపులేటి వారు
అనియెడు ఈ 72 ఇండ్ల వారును వీరి, తొలినాటి సంబంధులును, గోష్ఠి బంధువులని విజయరంగ చొక్కనాథేంద్రుడు రాజ కులమువారెఱుఁగ. శ్రీరంగంబున శ్రీ రంగనాయకుల సన్నిధానంబున బంధువులందఱు వినఁగ వక్కాణించిరని తాత్పర్యము. వీరికి గోష్ఠి బంధువులనియును, భక్త శ్రేష్ఠులనియును వ్యవహార నామంబులు కలవు.
వీరల సంఘనివాస స్థలములు: తిరుపతి, చెంగారెడ్డిపల్లె, ధర్మపురి, శ్రీసత్యదర్శనపురము, శ్రీదివ్యజ్ఞానపురము, శ్రీ దివ్యతటాకపురము, అయ్యూరు, మొదలగు గ్రామములనియును తెలియవలయును.
బహు బంధుజన కూటస్థుల ఇంటిపేర్ల వివరణము.
శ్రీరమావరసుకావేరివారును మఱి గునిసెట్టివారును గోవువారు అల్లంపువారును నాకులవారును మహిపతివారును మఱి నిజపతి వారును మానంబువారు సింగమసెట్టివారు లక్ష్మీసెట్టివారు బిరుదు వారును సుక్కడివారును పెనుకొండవారు జబ్బావారు వరుసగాను గాడివారును మఱి కాలకంఠమువారు పాండురంగమువారు భానుపెట్టి వారు గంగమసెట్టి వారు పోలముసెట్టివారును గుఱ్ఱాలవారు తూము వారును తిరుపతీవారును సింగాణివారును నారణివారు గాజు వారును నగులూరివాడును శ్రీ రామవారును నావుల వారు నవల అత్తిలివారును నాచలిపందిటివారును శోధింప పాయసంబు వారు జక్కా వారు వసుధబాలేరావువారు తోటా వారు నవలుచుండ్రు పోసంబు వారును భువిదళవా వారు నిమ్మల వారును నిశ్చయముగ మేడిద వారను మేదినిలో కుమ్మవారు సాయనవారు మీఱు భుజన వారును వగసాల వారును ముత్యాల వారును బోయనవారు మఱియు అయ్యల వారును నాంభీర వారును ముప్పత్తివారును ముదముమీఱ 48 కుల భేదములు గలవారును నియిండ్ల వారు వీరి
గీ. బంధువులు బహుబంధని భోగవిజయ
రంగచొక్కనాథేంద్రుడు రాజు లెఱుగ
రంగనాథుని ముంగల రమ్యముగను
ఘోషణము జేసె బంధువుల్ గూడి వినఁగ.
- కావేరి వారు లేక జగదేవభుజ బలరాయలు వారు.
- గునిసెట్టి వారు.
- గోవు వారు.
- అల్లం వారు.
- ఆకుల వారు
- మహిపతి వారు.
- నిజపతి వారు.
- మానం వారు.
- సింగముసెట్టి వారు.
- లక్కసెట్టి వారు.
- బిరుదు వారు.
- సుక్కడి వారు.
- పెనుకొండ వారు
- జబ్బా వారు
- గాడి వారు
- కాలకంఠము వారు.
- పాండురంగము వారు.
- భానుసెట్టి వారు.
- గంగమసెట్టి వారు.
- పోలముసెట్టి వారు.
- గుఱ్ఱాల వారు.
- తూము వారు.
- తిరుపతీ వారు.
- సింగాణి వారు.
- ఆరణి వారు.
- గాజు వారు.
- నగులూరి వారు.
- శ్రీ రామ వారు.
- ఆవుల వారు.
- అత్తిలి వారు.
- చలిపందలి వారు.
- పాయసం వారు.
- జక్కా వారు.
- బాలేరావు వారు.
- తోట వారు.
- పోసం వారు.
- దళవాయి వారు.
- నిమ్మల వారు.
- మేడిద వారు.
- కుమ్మ వారు.
- సాయన వారు.
- భుజన వారు.
- వగసాల వారు.
- ముత్యాల వారు.
- బోయన వారు.
- అయ్యల వారు.
- అంబీర వారు.
- ముప్పత్తి వారు.
అనియెడు 48 యిండ్ల వారును వీరి పూర్వ సంబంధులును బహుబంధువులని విజయరంగ చొక్కనాథేంద్రుఁడు రాజ కులమువారెఱుఁగ వక్కాణించారని తాత్పర్యము. వీరలకు బహు బంధువులనియును రౌతులనియును వీరభటులనియును హస్తినాపురము వారనియును వ్యవహార నామంబులు కలవు.
వీరుల సంఘనివాసస్థలములు: వెంకటగిరి, జలకంఠపురి, మన్నారుగుడి, విళక్కుడి, వెంబలకు, కోయంబత్తూరు, ముసిరి, శీలం, అని తెలియవలయు.
సదరు రాజబంధువులు మహాబంధువులు బహుబంధువులు పరస్పరమును గోష్ఠి బంధువులు ఏక దేశంబునను సంబంధ ప్రతిసంబంధములు చేసికొనుచున్నారు. ఇతర బలిజవారు అన్యబంధువులనియును పేట బలిజవారనియును చెప్పబడుదురు.
ఇదిగాక మరికొందరు వేరు పేరులు గల బలిజవారున్నారు. వారిలో ఎవరెవరు ఏయే ప్రాంతములలో నున్నారో ఆ విషయము వ్రాయబడుచున్నది.
దక్షిణఆర్కాడుజిల్లా ప్రాంతములోని వారిని గూర్చి తిరుపాపులి యూరిలోనుండు, మ - రా - శ్రీ రంగస్వామినాయడు వారు వ్రాసిపంపిరి. ఆ పట్టిక లో ఎలా ఉందంటే:-
దాసరికిచ్చి వారు, దొడ్లవారు, తిరుమలవారు, వీసూరివారు, ముప్పాలవారు, విరూపాక్షి వారు, నేలమువారు, వెంకటగిరినాయనివారు, ఆది సెట్టివారు, మొయిలా పేటవారు, గజ్జల వారు, బంగాళమువారు, సకలాపురమువారు, నాజరువారు, భువనగిరివారు, చెంగల్పట్టువారు, నల్ల వాండివారు, పుష్పాలవారు, తిరుచినాపల్లి వారు, చిత్రాల వారు, పోర్తి గీసువారు, ఆత్తూరివారు, వృద్ధాచలమువారు, సున్నపువారు, సాగోల వారు, పీసును వారు, పుదుచ్చేరివారు, నడుకుప్పమువారు, తిరుమలనాయ నివారు, మిట్టపాళెమువారు, చెంబేటివారు, దూసివారు, ఒళుక్కై వారు, కర్పూరివారు, జల్లి వారు, గంధపొడివారు, దేవనాయక శెట్టివారు, గొల్ల పాళెమువారు, చంద్రాల వారు, ముద్దురంగంవారు, చిత్తూరివారు, కలశ పాకమువారు, కోనేటివారు, పిళ్లారిగుడివారు, ఒడలపట్టువారు, బిచ్చము వారు, ఆలపాక్కమువారు, కుట్టియాం కుప్పమువారు, అమ్మా పేటవారు, సంకువారు, ఆళ్ల వారు, పుట్టావారు, తిమ్మవారు, ఊరుగాయల వారు, ఆరణివారు, కస్తూరివారు, కొండప్పావారు, జడలూరివారు, నందివారు, చేమకోటవారు, అళకాద్రి వారు, అన్నదాన పేటవారు, మేడ పాక్కం వారు, కార లెవారు, నాగపట్టణమువారు, తొలసింగంవారు, గూడ లూరివారు, తొండమాన తంవారు, కొండివారు, పాయసమువారు, పగడాలవారు, ఉప్పు వారు, పట్టణమువారు, వేంబువారు, బాలగురు వారు, లోకయ్యవారు, ఎరువూరువారు, ఏవూరు వారు, వేంకటసుబ్బు వారు, ఎడకనాటివారు, కోవిల్నూరువారు, ఎళుమేటివారు, నరదయ్య వారు, కొల్లిరుసువారు, బాలముద్దువారు, కుప్పచ్చి వారు, సిపాయివారు, వెంగల్పట్టువారు, కందం బాళయం వారు, నామాలవారు, చిదంబరము వారు, పుదుక్కడవారు, ముద్దువారు, వరవాడివారు, మామిడిమాకు వారు, తిరువాదివారు.
ఈ చెప్పబడిన యిండ్ల వారు జనకల, (ముద్గల) ముదుగుల, పుష్పాల, పైడిపాల, విష్ణు, (కాశ్యప, కాశి అక్షింతల, గంధమువారి, యోరసగల గోత్రస్థులుగా నున్నారు.
మద్రాసు ప్రాంతములలోనుండు బలిజవారి గృహనామముల పట్టికను మద్రాసు గనర్నమెంటు టెలిగ్రాఫ్ ఆఫీసు క్యాషియర్ గా నుండు, మ - రా - రా - - శ్రీ కేతు విజయరాఘవనాయడుగారు పంపించిరి. ఆ పట్టిక యందెట్లున్న దనగా :-
కేతువారు, సానావారు, కుప్పముసానా వారు, గొడుగులసానా వారు, గువ్వల సానావారు, నరహరివారు, నాయరువారు, రావూరి వారు, తొందావూరివారు, నీలకంఠమువారు, ఇరుప్పూరి వారు, భూపతి వారు, నీలివారు, ఆవుల వారు, తొందులవారు, చిలముత్తూరివారు, నెల్లూరివారు, రాజమల్లి వారు, కోడంబాకంవారు, తెప్పలవారు, మిర్యాల వారు, తలి సెట్టివారు, గరడివారు, మాచివారు, దాంట్లవారు, ముత్యాలవారు, దొండపట్టివారు, ఆరణివారు, గాదెలవారు, శతకం బేటివారు, మారి సెట్టివారు, పగడాలవారు, పోకల వారు, తోటవారు, పొన్నేరివారు, చిగివేళ్ల వారు, పొన్నగంటి వారు, సనగావారు, కత్తుల వారు, ఉడతవారు, అరసావారు, సాదనవారు, మెట్టువారు, తూము వారు, నాగలాపురమువారు, కలిజమువారు, పెను కావూరివారు, హేరం బసెట్టివారు, పలకూరివారు, గడ్డమువారు, అల్లమువారు, గంగిపట్టి వారు. వీరందఱును రత్నాలు బలిజవారికుటుంబముతో జేరినవారు.
ఈ యిండ్లవారు జనకల గోత్ర ము, కాశి గోత్రము, సెట్ల గోత్రము, మల్లెల గోత్రము, అక్షింతల గోత్రము, పైడిపాల గోత్రములలో జేరినవారు.
మద్రాసుతో జేరిన రాయపేటయందుండు, మ-రా-రా-శ్రీ లాల్పేట వేంకటవరదరాజులునాయని వారు పంపించిన పట్టిక ప్రకారముగా బలిజవారి గృహనామములు:-
లాల్పేటవారు, మల్ల జట్టివారు, పుట్టావారు, పరుత్తిపట్టువారు, సూరనరమువారు, చూరువారు, రౌతువారు, వేంగవాసివారు, పుట్టము వారు, నీలకంఠమువారు.
మద్రాసులో నుండు మూతకమల బలిజవారి గృహనామములు:-
మోడరపువారు, జగ్గావారు, పంటలవారు, గ్రంధివారు, పురమువారు, కోటావారు, పోతులవారు, ఎనుములవారు, సాధువారు, గడుదాసువారు, జమ్మివారు, దాడివారు, పసుపులేటివారు.
పెరిక బలిజవారి గృహనామములు
నూతనపాటివారు, మన్నూరి పేటవారు, కడియమువారు, ముత్తం వారు, పంటలవారు, గోడేవారు, గొట్టేవారు, గొద్దేవారు, దాసరి వారు, పోతమువారు, భేరివారు, తంజావూరి వారు, వైరివారు, కఠారి వారు, రామధేనువారు, చండికంటి వారు, కత్తిక వారు, రాజమహేంద్రవరము వారు, సంగం వారు, మెడతము వారు, పట్టేవారు, భానువారు మొదలగువారు.
పెరిక బలిజవారిలో అనేకులు విశాఖపట్టణము, రాజమండ్రి, బందరు, చిత్తూరుజిల్లాలో సోమలం, చంద్రగిరి మొదలగు కొన్ని ప్రదేశములయందు మాత్రము వసించుచున్నారు.
ఈ పెరిక బలిజవారికి తెలుగు జిల్లాలలో రాజుగారు, రావుగారు, వజీరుగారు, బాబుగారు అని బిరుద నామములుకలవు.
మధుర, తిరునెల్వేలి, శ్రీవిల్లిపుత్తూరు, మొదలగు ప్రాంతముల యందుండు బలిజవారిగృహనామములను తిరునెల్వేలి కలెక్టరాఫీసులో నుండు మ - రా-రా శ్రీ యతిరాజులు నాయుడుగారు వ్రాసిపంపించిరి. ఆపట్టికయందెట్లున్న దనగా:-
మెండుకుండలవారు, పసుపులేటివారు, తొండేటివారు, పెద్దిరెడ్డివారు, ముళ్ళనవారు, మన్నవారు, కోలవారు, శ్రీపాదము వారు, సాయన వారు, పడవేటివారు.
వీరు కాశ్యపగోత్రము, జనకులగోత్రము, దశరథగోత్రములలో జేరినవారు. వీరందఱును 420 ఏండ్లకుముండు విజయనగరమునుండి నాయడుగారి సంస్థానము ప్రబలముగానున్న కాలమునందువచ్చి చేరిన వారు. వీరికి బంధువులందఱును ఈ ప్రాంతములలోనే యున్నారు.
మధుర, తిరునెల్వేలి, శ్రీ వైకుంఠము, వీర రాఘవపురము, పాళయంకోట, కల్లడకురుచ్చి, మొదలగు ప్రాంతములయందుండు బలిజవారి గృహనామములు:-
గంభీరమువారు, మల్లేనివారు, నెడుంగొండ మువారు, కోట వారు, గున్న వారు, సురభివారు, శీతమువారు, కత్తి వారు, సత్రమువారు, నక్కవారు, పెరుగు వారు, తోటవారు, పసుపులేటి వారు, పట్టాల వారు, కొండాడువారు, పసుపు తెక్కలవారు, కొండ వారు, పిండి వారు, పసుపు వారు, మందల వారు.
వీరియొక్క గోత్ర నామము లెవ్వియనగా: దశరథ గోత్రము, జడపాల గోత్రము, పాలగోత్రము, మత్స్య గోత్రము, జనకల గోత్రము, కూర్మ గోత్రము, వరాహ గోత్రము, నారసింహ గోత్రము, వామన గోత్రము.
ప్రతిస్థలమునందును నీవసించు బలిజవారి గృహనామాదులను వివరించుటవలన చదవరులకు ప్రయాసమనియెంచి వారియొక్క గృహ నామాదులనుమాత్రము వ్రాయబడుచున్నయది.
అద్రి వారు, అచ్యుత వారు, అశ్విని వారు, అమరపాల వారు, అరుణ వారు, అంగుళీ వారు, అంబారి వారు, అష్టాక్షరము వారు, అనూ రాధ వారు, అశ్వకల్ప వారు, అంశ వారు, అంజన వారు, హరిదాసు వారు, అంజేటి వారు, ఆంబూరి వారు, ఆడు వారు, ఆకుల వారు, ఆరభి వారు, ఆలూరి వారు, ఆఱుగుంటల వారు, రాజపాల వారు, రంభా వారు, రాజ శేఖర వారు, రంగరాయ వారు, ఈను వారు, ఈరు వారు, ఎఱమచ్చ వారు, ఎలుగుల వారు, ఎయ్యారి వారు, ఏనుగుల వారు, ఏనాది వారు, అయ్యారి వారు, ఐదిండ్ల వారు, ఒప్పారి వారు, ఒరపు వారు, గండభేరుండ వారు, గంధము వారు, గిర్దా వారు, కొప్పము వారు, గరుడ వారు, కాశి వారు, గంభీర వారు, ఖర్జూర వారు, కిరీటము వారు, కోరు వారు, గోపాల వారు, కంబులి వారు, “కాళహస్తి వారు, గర్జన వారు, గోష్టి వారు, గోకుల వారు, గూని వారు, కంభము వారు, గొబ్బి వారు, గోరస వారు, కుండ దేవ వారు, కాతాల వారు, కటకమువారు, కుప్పమువారు, కాకివారు, కట్టువారు, కొంగువారు, కేశిమతమువారు, గుడిచుట్టు వారు, గంగమ్మ వారు, చక్కి వారు, సింగము వారు, సుందర వారు, చోడపాల వారు, సుకుమార వారు, చేది వారు, స్వయ సేనివారు, సుగంధ వారు, చతురంగము వారు, సంపన్న వారు, సంతతి వారు, సగోత్ర వారు, సుమంతు వారు, చిల్లా వారు, సాంబ్రాణి వారు, సోము వారు, సంపు వారు, సంకుల వారు, శిలా వారు, చక్రము వారు, సారధి వారు, నంకు వారు, సురభి వారు, సొజ్జి వారు, చల్లా వారు, సామి శెట్టి వారు, సున్నము వారు, సవరము వారు, చల్లని వారు, సరము వారు, చౌదరి వారు, చెంబేటి వారు, చాంది వారు, జమ్మలమడుగు వారు, జీని వారు, జంగమయ వారు, జుట్టు వారు, జొన్నల వారు, జోగివా రు, జగన్నాథము వారు, జల్లి వారు, ఢబేదారు వారు, డమార వారు, దాడి వారు, తిత్తి వారు, దీపము వారు, దేవదాస వారు, ధన్వంత్రి వారు, దాసు వారు, దండు వారు, తిలము వారు, తిరుపతి వారు, తంగేటి వారు, తంబూరి వారు, తీర్థము వారు, తులసి వారు, దామర్ల వారు, దేవరాయల వారు, దాది వారు, తూముల వారు, ధూపము వారు, దవన మువారు, తాటితోపు వారు, తెనాలి వారు, నాయుడుపేట వారు, నగుస చారు, నామాల వారు, నోటిబీగము వారు, పత్తి వారు, పాలు వారు, పూసపాటి వారు, పట్టనామము వారు, భోజరాజు వారు, పులోమర్షి వారు, పజ్జలవారు, భోగిరాజవారు, భజనవారు, భద్రాచలమువారు, పసుపు వారు, పాల వారు, బసన వారు, పండరిపురము వారు, బెల్లము వారు, మరకతము వారు, ముడుకులవారు, మేరువారు, మల్లిఖార్జున నారు, మల్లేని వారు, మన్నెము వారు, మంగి వారు, మిరపకాయ వారు, మురికి నాటి వారు, మున్నూటి వారు, రథాల వారు, రాయదుర్గము వారు, వజ్రాల వారు, విజ్ఞప వారు, మొదలగువారు.
ఆదిలో బలిజవారు వెయ్యియిండ్ల వారుండిరనియు, ఆమీద చాలాయిండ్ల వారు నశించిపోయినందున మున్నూరిండ్లవారే నిల్చిరని యును కొందఱు చెప్పెదరు.
1831 సం॥ జనగణన గ్రంథమునందు మిస్టర్ స్టూనన్డు దొరగారు బలిజ వారు 650 ఇండ్లవారు ఉన్నారని వ్రాసారు కానీ, ఆ లెక్క ప్రకారముగా ఇప్పుడు కనబడలేదు.
సాధారణముగా బలిజవారి యిండ్ల పేర్లవలన దెలియవచ్చుట యేమనగా :-
ఆయాకుటుంబస్థులయొక్క గౌరవము, వారిఉద్యోగము, వారున్న స్థలము, వారివ్యాపారము, మొదలైనవి తెలియడానికేనని అర్ధమవుతుంది.
కొందరు ఇండ్ల పేర్లను తెలుసుకోలేకపోతున్నారు. అందువలన చాలాకీడు సంభవించుచున్నది. అప్పుడప్పుడు వ్రాయునట్టి పత్రములు, దస్తావేజులు మొదలగువానియందు స్పష్టముగా తమ తమ యింటిపేరు, కులము, గోత్రము, సూత్రములను స్పష్టముగా వ్రాసియుంచవలయును. ఇది గాక ప్రతి కుటుంబము వారును తమ తమయొక్క ముత్తాతల నాటినుండి యైనను వంశావళిని అవశ్యముగా వ్రాసియుంచవలయును. ఇట్లు చేయనందున చాలా బలిజకులస్థులకు తమ తమ గృహనాములే తెలియక పోవుచున్నవి. ఇందుచేత శుభాశుభ కాలములయందు పురోహితుడు కర్తనుజూచి మీ గృహనామమును జెప్పుమనియడిగినపుడు ముందు వెనుక తోచక మిణకరించుచుండగా, అపురోహితుడే నోటికివచ్చినట్లుగా తనకంటిముందాసమయమునందు కనబడు వస్తువులనుజూచి కర్పూరమువారు, సాంబ్రాణీవారు, పుష్పాలవారు, అక్షింతలవారని చెప్పుచున్నాడు. కనుక ఇకపైనను ఇట్టిలోపములను తొలగించుకొనవలయును.
బలిజవారి గోత్ర వివరణము
ఆదిలో బలిజవారికి కాశ్యప, భారద్వాజ గోత్రములుండెను. ఆ మీద అత్రి, ఆంగీరస, మరీచి మొదలగు గోత్రములు కలిగెను. దక్షిణ దేశమునందుండు బలిజవారికి కాశ్యప, చలమ, జనకల, దశరథ, ఓడ పాల, కాశి, సెట్ల, మల్లెల, అక్షంతల, పైడిపాల, ముదుగుల (ముద్దల) పుష్పాల, గంధము, యోరసాల, జడపాల, మత్స్య, కూర్మ, వారాహ నారసింహ, మహిపతి మొదలగు గోత్రములుకల్గియున్నవి
బలిజవారి సూత్ర వివరణము.
బలిజవారిలో చాలమంది బోధాయన, ఆశ్వలాయన, ఆపస్తంబ, కాత్యాయనసూత్రములు గలవారైయున్నారు.
బలిజవారి మత వివరణము.
బలిజవారు ఆదియందు బౌద్ధమతస్థులై యుండిరి. ఆవల" శైవ వైష్ణవ మతస్థులై అనేక శివాలయములను విష్ణ్వాలయములను నిర్మించిరి. ఆ శివ కేశవాలయములు నేటికిని ప్రసిద్ధములై యున్నవి. అయినను ప్రకృతమునందు బలిజవారిలో నూటికి తొంభైతొమ్మిది మంది వైష్ణవమతస్థులుగను ఒక్కడు శైవమతస్థుడుగను కానంబడుచున్నాడు. ఇదిగాక విద్యాధికులు కాని బలిజవారు తమకు తోచిన దేవతల నారాధించుచున్నారు. సాధారణముగా కొందరు చాత్తాదవైష్ణవులయొక్కయు, మరికొందరు చాతిననైష్ణవుల యొక్క ఆచార వ్యవహారముల చొప్పున వర్తించుచున్నారు.
- పగడాల నరసింహులు నాయుడు
Balija Clan Surnames
balija vamsa intiperlu | balija clan surnames | balija surnames and gotralu | balija surnames and gotras | kapu surnames and gotralu