Araveeti Bukkaraju

Araveeti Bukkaraju (ఆరవీటి బుక్కరాజు - కాపులు). ఆరవీటి బుక్కరాజు సుమారుగా క్రీ॥శ॥ 1400 సం॥లో జన్మించి యువకుడుగా 1425 సం||లో

Araveeti Bukkaraju

ఆరవీటి బుక్కరాజు - కాపులు

కర్నూలును రాజధానిగా రాజ్యపాలన చేసిన చాళుక్య వంశ ఆరవీటి బుక్క భూపాలుడు ఆస్థానములో దేవల్రాజు అనే భట్టు రాజుకవి" క్రింది చాటువు చెప్పినట్లు కీ॥శే॥ చిలుకూరి వీరభద్రరావు పంతులు గారు" కాకతీయాంధ్ర రాజయుగ చరిత్ర" గ్రంథములో ఈ విధంగా వ్రాశారు (16వ శతాబ్దం).

“పంటా న్వయము నను పదునాలుగు శాఖలు
జక్కగా వివరింతు సత్యమరసి
మోటాటి, వెల్నాటి, మొరసు, నేరడ యోద్య
పంట పొంగలి నాటి, పాకనాటి
భూమంచి, కుంచేటి, మున్నూటి, గోటేటి
యొనర గండికోట, యోరుగంటి
యనబరుగుచునుందు నాంద్రావనీస్థలి
గౌవవాధిష్టిత కాపుకులము

పంట పదునాల్గు కులము లంచంట జగతి
దరతరంబుల నుండియు వరలెడినుడి
దీని కుపజాతులున్నవి విధిములుగ
భుజబలాటోప పిన్నమ బుక్క భూప !

పెన్నానది నుండి గుండ్లకమ్మ నది వరకు ఇస్తరించి ఉన్న తీర భూమిని పూర్వము పాకనాడు అని పిలిచేవారు. మార్కాపురము, కృష్ణ, తుంగభద్రానది, బళ్ళారి దక్షిణ తీరము నేరడి ప్రాంతము. ఉత్తరాంధ్ర ప్రాంతము పొగలినాడు, కృష్ణానది నుండి గోదావరి నది వరకు గల ప్రాంతము మున్నూటి సీమ, క్రిష్ణగిరి జిల్లా (తమిళనాడు) కోలారు (కర్ణాటక) ఆ ప్రాంతము మొరుసునాడు, గుంటూరు కృష్ణా-పెన్నాల మధ్య వెలనాడు ప్రాంతము. గండికోట (రాయలసీమ), ఓరుగంటి (ఓరుగల్లు అంటే ఇప్పటి వరంగల్ (తెలంగాణ)) వ్యవసాయము చేసి పంటలు పండించే కాపులు ఆంధ్రా ప్రాంతములో 14 తెగల వారున్నారు. వారిలో ఇంకా ఉపకులాలున్నాయి అని భట్టుకవిగారు వ్రాశారు.

ఆరవీటి బుక్కరాజు సుమారుగా క్రీ॥శ॥ 1400 సం॥లో జన్మించి యువకుడుగా 1425 సం||లో తుళునాడు యుద్ధములో సమ్మెట తుళువ తిమ్మానాయకుడు (కృష్ణరాయలు ముత్తాత) తోటిపాల్గొని అతని కుమారుడు ఈశ్వరనాయకుడికి తన సోదరి బుక్కమాంబను ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతుల కుమారులే తుళువ నరసింహ నాయకుడు, తిమ్మా నాయకుడనువారు. నరసింహ నాయకుని కుమారుడే శ్రీకృష్ణదేవరాయలు. ఆరవీటి బుక్కరాజు, క్రీ.శ. 1450లో కర్నూలు ప్రాంతమునకు రాజుగా వుండి, శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేక మహోత్సవాలకు హాజరయినాడని చరిత్రకారులు వ్రాశారు. అనగా సుమారు 110 సంవత్సరాలు సుదీర్ఘ కాలము జీవించాడని తెలుస్తుంది.

  1. మోటాటి, వెలనాటి, నెరాటి, పంట, పాకనాటి, గండికోట, ఓరుగంటి వీరంతా ఈనాడు రెడ్డి కాపులుగా వున్నారు.
  2. పొగలినాటి, మున్నూటి, మొరసునాడు పంట, వీరంతా మున్నూరు రెడ్డి కాపులుగాను, తూర్పు కాపులుగాను మొరసు నాటి బలిజ కాపులుగానూ కొండకాపు (తెలంగాణ) వున్నారు. "రెడ్డి నాయుడు” గారు గాను ఉన్నారు.
  3. భూమంచి = వీరు గిరిజన కాపులు. వీరు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వున్నారు.
    తూ॥గో॥ జిల్లాలోనూ వున్నారు. వీరిని భూమంచి రెడ్లు, రెడ్డి యానాదులుగా పిలుస్తారు.
  4. అయోధ్యా వీరు అయోధ్యా నగరము నుండి వచ్చామని చెప్పుకుంటారు. కాని వీరి ఆచారాలు, నింద్యమైన ఆచారములు కలిగియున్నారు. వీరు బంగారు తాళిబొట్టు ధరించే సాంప్రదాయం లేదు. వీరు రాయలసీమ ప్రాంతములో ఈనాడు రెడ్డి కులముగా పిలువబడుతున్న కాపు వారు కాదు - వీరు గిరిజన తెగవారని తెలుస్తుంది. బ్రిటీష్ వారు 1901 వ్రాసిన జనాభా లెక్కలలోనూ, కర్నూలు మాన్యువల్స్లోనూ చూడవచ్చును. ఈ అయోద్య కాపులు (రెడ్లు), తమిళనాడు ప్రాంతములో వున్నారు (తెలుగువారు)
  5. కుందేటి, గోటేటి - పూర్తిగా తెలియదు కాని ఆదిలాబాద్ జిల్లా తెలంగాణా ప్రాంతములో కొండరెడ్లు గాని, సముద్రతీర ప్రాంత వన్నె కాపులుగాని అయి ఉండవచ్చునని నా అభిప్రాయము.
  6. ఇందులో పాకనాడు - మున్నూటి నాడు - కాపుల గురించి ప్రస్తావించాడు కాని కమ్మనాటి కాపుల ప్రస్తావన లేదు. (పూర్వకాలము నుండి కమ్మ నాటి ప్రాంతము ఉంది) దీనిని బట్టి సుమారు 1450 ప్రాంతానికి “కమ్మనాటి కాపులు" అని ప్రత్యేక కులం లేదని తెలుస్తుంది. ప్రధాన కులమైన కాపుల నుండి విడిపోలేదని తెలుస్తుంది. పంట కాపులు అనగా పంటను కాపు కాచేవారు అని అర్థం. అది ఒక కులము కాదు.

రెండవ దేవరాయలు కాలము (1423-1446) లో విజయనగరములో గౌడ డిండిమభట్టుకు మహాకవి శ్రీనాథుడు గారికి జరిగిన సాహిత్య సమరంలో గెలిచిన శ్రీనాథుడికి కనకాభిషేకము జరిగింది. ఆ కవి వ్రాసిన భీమేశ్వర పురాణము (అంటే సుమారు 1450 ప్రాంతము) పీఠికలో పద్మనాయకులన, వెలమలన, కమ్మల, ఒంటరులన, సరిసర్లు అని వ్రాశారు. సరిసర్లు కాదు ఇది. సంసార్లు అయి ఉండవచ్చును. అనగా కాపు, తెలగ, బలిజ వారు అయి వ్యవసాయ కుటుంబాలుగా ఉండు వారిని రాయలసీమ జిల్లాలలో సంసారులు అంటారు (సరిసరులు అనగా సమామైన కులమువారు). కొండవీటి రెడ్డి రాజుల వద్ద విద్యాధికారిగా ఉన్న శ్రీనాథ మహాకవి “రెడ్డికాపు" కులము గురించి ప్రస్తావించలేదు. ఆనాటికి రెడ్డి కాపులు ప్రత్యేక కులంగా ఏర్పడలేదా? వెలమలన, కమ్మలన, ఒంటరిలన అని వ్రాశారు. ఇది ఆయన చివరి గ్రంథం, దీనినిబట్టి, కమ్మకులము ఉంది కాని ప్రముఖులు లేరు. రాయవాచకములో తెలిపిన అమర నాయకులు కృష్ణరాయలు కాలం నాటివారు కాదని శాసనాలను బట్టి తుళువ సదాశివరాయలు కాలం (క్రీ॥శ॥1543-76) నాటివారని తెలుస్తుంది.

మద్రాస్ ప్రసిడెన్సీలో కర్నూలు జిల్లా మాన్యువల్, 1886 బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కర్నూలు జిల్లా ప్యాపిలి డిప్యూటి కలెక్టర్ గా పనిచేసిన నరహరి గోపాల కృష్ణమయ్య శెట్టిగారు వ్రాసినది.

Kapus are the principal cultivators. They are divided into to several subdivisions:

Pakanati (from the east) kapus, Motall kapus, Velnati Kapus, Pedakanti kapus, Nanugonda kapus and others. Each subdivision is again divided into tegas or clans. All the kapus eat thogether and from each other's cups, and donot care for the pollution which the higher classes so much observe, but they donot intermarry except in their own tegas. The Pakanadus of Pattikonda and Ramallakota Taluks allow a widow to take a second husband from among the caste men. She can wear no signs of marriage. Such as the tall, glass bangles and also like, but she as well as her new husband is allowed to associate with the other castemen or equal terms. Then progrecy inherit their father's property equally with children same as regular wedlock, but they generally intermarry with person simi- larly circumstanced. Their marriage with a issue of a regularly mar- ried couple is, however not allowed. it is a matter for regret that this previlage of remarrying is much abused, as among the Lingabalijas. Not unfrequently it extends to pregnant widows also and so widows live in adultery with a caste man without fear of excommunication. Encouraged by teh hop of getting herself united to him or some other case man in the event of prgenancy. In many castes caste men are hired for the purpose of going throught the forms of marriage simples to relieve such widows from the penality of excommunica- tion from caste. The man so hired plays the part of a husband for a few days, and the kapus donot wear tali or a petticoat (ravika) to cover breasts.

పైన చెప్పబడిన పాకనాటి కాపులు, పెటకంటి కాపులు వారి ఆచార వ్యవహారాలు వేరుగా ఉన్నవి.

ఇందులో పంట కాపు (నెల్లూరు), వన్నె కాపులు, మోటాడి కాపులు. వీరు బలిజ కాపులనుండి విడిపోయినవారుగా తెలుస్తుంది. వీరు చరిత్రలో ఏదో ఒక దశలో బలిజ కాపులనుండి విడిపోయి ప్రత్యేక కులాలుగా ఏర్పడి ఉండవచ్చును.

Balija Clan Surnames | Araveeti Clan | Nandyala Vamsam Araveeti Varu | Araveeti Vamsa Rajakiya Charitra | Saluva Balija Rajula Vamsham