Rani Ambakka

Rani Ambakka భయమంటే ఏమిటో తెలియని గొప్ప వీరనారి, ఈ రాణి గురించి చాలామందికి తెలియదు. రాణి అంబక్క గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

Jan 18, 2025 - 09:55
Updated: 1 year ago
0 99
Rani Ambakka

రాణి అంబక్క (జైనబలిజ రాణి)

Name Rani Ambakka
Born 1525
Death 1570 (age 45 years)
Village Ullal, dakshina kannada (d.t), Karnataka
House Chowta
Husband Lakshmappa

భయమంటే ఏమిటో తెలియని గొప్ప వీరనారి, ఈ రాణి గురించి చాలామందికి తెలియదు. ప్రపంచములో ఏ దేశములో గూడా ఒక యుద్ధనౌకకు ఒక మహిళారాణి పేరు పెట్టలేదు. కాని ఒక్క మన భారతదేశ నౌకలు మాత్రమే అదృష్టం చేసుకున్నాయి. బాధాకరమైన విషయమేమిటంటే ఈ గొప్ప వీర వనితను గురించి మన చరిత్ర పుటలలో ఏ పుస్తకములోనూ వ్రాయలేదు. ఏ పాఠ్యపుస్తకం చెప్పలేని రాణి అంబక్క గారి చరిత్ర.

16 శతాబ్ధములో దక్షిణ కన్నడ “బంట్వాల్ఫ లక్” అనే ప్రాంతములో "తుకారాం పూజారి" అనే చరిత్రకారుడు ఒక మ్యూజియంను మొదలుపెట్టాలని అనుకున్నాడు. ఆ మ్యూజియం పేరు “తులుబడుకు" అనే పేరుబెట్టాడు. అది "రాణి అంబక్క" చరిత్ర జ్ఞాపకార్థం భారతీయ చరిత్రలో ఒకే ఒక ధీరవనిత పలుమార్లు పోర్చుగీసువాళ్లను ఓడించిన మహారాణి అంబక్క ఆమె ధైర్యములో వీరత్వంలో రాణిరుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి దుర్గావతిలతో సరిసమానమైన వ్యక్తి.

క్రీ॥శ॥ 7వ శతాబ్ధం నుండి మన భారతదేశానికి మరియు అరేబియన్ దేశాలకు మధ్య వాణిజ్య సంబంధాలుండేవి. (యుద్ధ గుర్రాలు, మసాల దినుసులు, బట్టల వ్యాపారం జరిగేది) చాలా యూరోపియన్ దేశాలు, మన భారతదేశానికి సముద్రమార్గం కనిపెట్టాలని, ఆ పనిలో నిమగ్నమైనారు. అప్పటికి క్రీ॥శ॥ 1498 సం||లో మొదటిసారి వాస్కోడిగామా మనదేశములోని కలకత్తా ప్రాంతానికి సముద్రమార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్నాడు. యూరోపియన్ దేశాల నుండి మొదట భారత్కు వచ్చింది పోర్చుగీసువారు. 5 సం॥ తర్వాత పోర్చుగీసువారు మొదట ఓడరేవును నిర్మించారు. దాని తర్వాత వారు వివిధ నౌకాశ్రయాలు కట్టారు. మనదేశంతో సహా “మస్కట్", మోజాంబిక్ శ్రీలంక, ఇండోనేషియాతో పాటు ఎక్కడో దూరంలో ఉన్న చైనాలో వున్న “మకావు”ని కలుపుతూ సముద్రమార్గం నిర్మించారు. 20 సం॥రాలలో పోర్చుగీసువారు. ఈ మార్గాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

భారతీయులకు, అరబ్బులకు, పర్షియన్ మరియు ఆఫ్రికన్ ఓడలకు హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం అనుకూలంగా ఉండేది. 16 శ॥ నాటికి పోర్చుగీసు వారి యొక్క ఆధిపత్యాన్ని ఏ ఒక్క యూరోపియన్ దేశమూ అడ్డుకోలేకపోయింది. డచ్, ఫ్రెంచ్, బ్రిటీష్ వారు. 17 వ॥ శతాబ్దం మొదట్లో భారత్లోకి వ్యాపార నిమిత్తం వచ్చారు. ఎప్పటినుండి అయితే సముద్ర మార్గంలో పోర్చుగీసు ఆధిపత్యం పెరిగిందో అప్పటి నుండి వారు రుసుములు విధించడం మొదలుపెట్టారు. పోర్చుగీసు వారికి స్థానిక రాజులు ఎదురు తిరిగారు. కాని వారి నోడించి ఆ మార్గాన్ని వారు వశం చేసుకున్నారు. క్రీ॥శ॥ 1526 సం||లో పోర్చుగీసువారు మంగుళూరు పోర్టును ఆక్రమించిన తర్వాత వారి తదుపరి లక్ష్యం “ఉల్లాలపోర్టు” పైన పెట్టారు.

ఉల్లాల అనేది చౌతరాజు 3వ తిరుమలరాయలు రాజధాని అది. విజయనగర సామ్రాజ్యంలోనికి కట్టుబడి ఉండేది. చౌతలు (బంట్లు - జైన బలిజలు) మొదట జైన వణిజరాజులు 2వ శతాబ్దములో గుజరాత్ నుండి వలసవచ్చారు. ఉల్లాల రాజ్యం ఈనాటి దక్షిణ కన్నడ జిల్లాలోని ఉడిపి మరియు కేరళలోని కాసర్డ్ జిల్లా వరకుంది. చౌతలు మాతృస్వామ్య రాజవంశీకులు (శాతవాహనుల సంతతివారయి ఉండవచ్చు) ఆ చౌతరాజు యొక్క మేనకోడలు రాణి అంబక్క ఆరాజు అంబక్కను దత్తత తీసుకొని కత్తియుద్ధం, విలువిద్య, గుర్రపుస్వారి, సైనిక వ్యూహం దౌత్యపరమైన అన్నీ విద్యలలో చిన్నప్పటి నుండి నేర్పించి, తనకు సంతానం లేని కారణంగా తమ రాజ్యానికి మహారాణిగా ప్రకటించాడు. ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఆమె సింహాసనమధిష్టించిన నాటి నుండి రాజ్యానికి పోర్చుగీసువారి నుండి ఏనాటికైనా ముప్పని తెలుసుకుంది. మూడవ తిరుమల రాయలు చనిపోయే ముందు రాణి అంబక్కను, మంగుళూరు రాజు, లక్ష్మప్ప బంగ తో వివాహము జరిపించాడు. అంబక్క తనకు పెళ్లి అయి ముగ్గురు పిల్లలతో తన సొంత కోటలోనే ఉల్లాల పట్టణములోనే ఉండసాగింది. కొన్ని రోజులకు తన భర్త పోర్చుగీసు వారితో చేతులు కలిపినందుకు ఆమె వ్యతిరేకించింది. వారి వివాహ బంధం చెడిపోయింది. మంగుళూరు రాజు బంగ లక్ష్మప్పతో పోర్చుగీసువారు సంధి చేసుకోవడంతో రాణి అంబక్క నాయకత్వంలో వెలిగిపోతున్న “ఉల్లాల” రాజ్యంపై పోర్చుగీసువారు ఒక కన్ను వేసి ఉంచారు. ఆమె నుండి అధిక పన్నులు వసూలు చేయడమే గాక ఆమెపై మితిమీరిన ఆంక్షలు పెట్టారు. ఆమె అరబ్బులతో వ్యాపారం చేయడం మానుకోలేదు. ఆమె వెంటనే పోర్చుగీసు వారికి అడ్డం తిరిగింది. నా రాజ్యంలో మీరెవరు పన్ను వసూలు చేయడం, ఈ ఆంక్షలు ఏమిటని
ధిక్కరించింది.

పోర్చుగీసువారు తన ఓడపైన దాడిచేసినా గూడా ఆమె అరబ్బులతో వ్యాపారం చేయడం మానలేదు. మగవారు, బిల్లులు వారు, విలువిద్యలు వారునుండి మప్పిల, తెడ్డులు నడిపే అన్నీ కులాలవారిని మరియు మతాలకతీతంగా తన సైన్యములో మరియు నౌకాదళంలో మగవారుండేవారు. ఆమె మొండిపట్టును చూసి పోర్చుగీసువారు పలుమార్లు “ఉల్లాల” పోర్టుపై దాడి చేశారు.

క్రీ॥శ॥ 1556 సం॥ మొదటిసారిగా పోర్చుగీసు అడ్మిరల్ డాన్ అల్వోరోడిసివేరియా
ఆధ్వర్యంలో యుద్ధం జరిగింది. కాని అది అనుకూల సంధి జరిగింది. మరలా రెండు సంవత్సరాల తర్వాత పోర్చుగీసు వారు అతిపెద్ద సైన్యంతో ఉల్లాల నగరం పైకి యుద్ధానికి వచ్చారు. అపుడు రాణి అంబక్క మాస్టర్ యుద్ధ వ్యూహాలతో అరబ్బులు, కోజికోడ్, జెమోవియా వారితో చేతులు కలిపి పోర్చుగీసువారి నోడించి వెనుకకు త్రిప్పి కొట్టింది.

మరలా "General Joao Pexixoto" ఆధ్వర్యంలో పెద్ద సైన్యంతో మరోసారి ఉల్లాల కోటపై దాడిచేసి కోట నాక్రమించుకున్నారు. కానీ అప్పటికే వారి దాడిని ముందుగా పసికట్టిన రాణి అంబక్క కోట నుండి తన పిల్లలు అనుచరులతో తప్పించుకొని పోయింది. మరుసటి రాత్రి ఆమెకు నమ్మకమైన 200 మంది సైనికులతో పోర్చుగీసు స్థావరాలపై మెరుపుదాడి చేసి మహంకాళిలా రౌద్రరూపం దాల్చి విరుచుకుపడింది. 70 మంది సైనికులతో బాటు కోటలో ప్రవేశించింది. కోట నాక్రమించి జనరల్ను నరికి చంపింది. దొరికినవారిని దొరికనట్లు నరకసాగింది. ఆమె రౌద్రానికి భయపడిన మిగతా పోర్చుగీసు సైన్యము పడవలలో పారిపోయారు.

మరలా ఉల్లాలకోటపై జెండా ఎగురవేసింది. రాణి అంబక్క దైర్యాన్ని మరియు మనో నిబ్బరాన్నికి మిగతారాజులకు స్ఫూర్తినిస్తున్న విషయం పోర్చుగీసువారికి తెలిసి జీర్ణించుకోలేకపోయారు. వేరే రాజులతో ఆమెను బెదిరించాలని ప్రయత్నించాలని చూశారు. అంతేగాకుండా స్వయానా తన భర్త చేతనే మేమంతా కలిసియుద్ధానికి వస్తాము ఉల్లాలా రాజ్యాన్ని తగులబెడతామని బెదిరించినా ఆమె బెదరలేదు. ఎవరెన్ని హెచ్చరికలు చేసినా అదరని మరియు బెదరని రాణి అంబక్కను చూసి పోర్చుగీసువారు ఖంగు తిన్నారు.

ఈసారి Anthony D. Norenha (Portugeese Victory of Goa) అడ్మిరల్ జనరలు రంగంలోకి దించారు. క్రీ॥శ॥1577 సం॥లో మూడువేల మంది పోర్చుగీసు సైన్యంతో “ఆర్దామా” అనే యుద్ధ నౌక సహాయంతో ఉల్లాల కోటపై మెరుపు దాడి చేశారు. రాణి అంబక్క తన కులదైవాన్ని దర్శించుకొని కోట బయటకు వస్తుంటే మార్గమధ్యంలో కోట కాపలాదారుడు వచ్చి జరిగిన ఉదంతం చెప్పగానే వెంటనే గుర్రాన్ని యుద్ధరంగం వైపు మళ్లించింది. ఒక మెరుపులా, చండీదేవిలా, యుద్ధభూమిలో దూకింది. భరతమాత కోసం - మనదేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయవద్దని సైనికులకు ప్రజలను హెచ్చరిస్తూ, బిగ్గరగా అరుస్తూ యుద్ధభూమిలో దూకి అటు నేలపైన ఇటు సముద్ర తీరములో యుద్ధం భీకరంగా సాగింది. మెల్లగా ఒడ్డుపైన వున్న పూర్తి పోర్చుగీసు సైన్యాన్ని సముద్రంలోకి దింపుతూ వారి పడవలలో వారినే పారిపోయాలా చేసింది. తర్వాత ఒడ్డుపైన వున్న తన సైన్యాన్ని అగ్నిబాణాలు వేయసాగింది. నేలపై నుండి కొన్ని వేల బాణాలు సముద్రంలో వున్న పోర్చుగీసు వారిపై వేయించి వారిని సముద్రంలోనే మట్టుబెట్టి వారి పడవలను కాల్చి వేసింది. కాని యుద్ధంలో గాయపడిన రాణిని ఎలాగైనా చంపాలని సామంతులకు డబ్బు ఆశచూపి ఆమె పైకి పోర్చుగీసువారి సైన్యము ఇతర రాజులు ఆమెపై యుద్ధం చేశారు. భయమంటే ఏమిటో ఎరుగని రాణి అంబక్క తను గాయలపాలైనా యుద్ధం చేస్తూనే కదనరంగంలో గుర్రంపైనే కన్ను మూసింది.

ఒక గొప్ప వీరవనిత, మాతృదేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. రాణి అంబక్క పోర్చుగీసు వారి చరిత్రలో మరచిపోలేని ఘట్టం - భారతదేశము ఉన్నన్ని రోజులు భారతీయులందరూ మీకు రుణపడి ఉంటాము. ఆమె వీరత్వానికి ప్రతీకగా భయమంటూ ఎరుగని తన ధైర్యాన్ని దాసోహమంటూ, 2015 సం॥లో మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు (బి.జె.పి. ప్రభుత్వం) భారత నౌకాదళములోని ఒక నౌకకు “రాణి అంబక్క" పేరుబెట్టి ఆమె ఋణం తీర్చుకుంది.

భారతదేశ చరిత్రలో మన హిందూ రాజులు, రాణులు, మొగలాయి మహ్మదీయ, బ్రిటీష్ వారి చేతుల్లో ఓడిపోలేదు. వారి చేతిలో చనిపోలేదు. మన భారతీయ రాజుల వెన్నుపోటు వలననే చనిపోయారు. దేశభక్తి లేని లంచగొండి అధికారులు ఇతర దేశస్థుల ప్రలోభాలకు లొంగిన ఇరుగుపొరుగు రాజుల మూలంగా మనం ఓడిపోతూ వచ్చాం - జయహెూ |॥ రాణి అంబక్క:

గుజరాత్లోని జైన క్షత్రియ వణిజులయిన చౌతరాజ కుటుంబీకులు హరియాణాను | పాలించారు. స్వాతంత్ర్యం వచ్చేవరకు జాట్రాజ కుటుంబాలున్నాయి. వారు వ్యవసాయం - రాజ్యపాలన - వాణిజ్యం వృత్తిగా గలవారు. శివుని జటాఝూటము నుండి ఉద్భవించిన వారమని జాట్ కులస్థులు చరిత్ర చెబుతుంది. దాదాపు కృతయుగ కాలంనాటి కులం.

- భట్టరుశెట్టి పద్మారావు రాయలు

Rani Ambakka

Rani Ambakka భయమంటే ఏమిటో తెలియని గొప్ప వీరనారి, ఈ రాణి గురించి చాలామందికి తెలియదు. రాణి అంబక్క గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

Rani Abbakka Devi | Rani Abakka | Rani Ambakka | Musunuri Kapaya Nayaka | Dwarabandhala Rama Chandrayya Naidu | Thota Narasayya Naidu | Kapu Community

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User