Caste Commitments
Caste Commitments (కుల కట్టుబాట్లు). నాటి ప్రాచీన సమాజంలో “కులకట్టుబాట్లు” చాలా కఠినంగా అమలు జరిగాయి. ఎలానో తెలుసుకోండి.

కుల కట్టుబాట్లు
నాటి ప్రాచీన సమాజంలో “కులకట్టుబాట్లు” చాలా కఠినంగా అమలు జరిగాయి. కులసంకరము కలిగిన వారిని ఆనాటి సమాజము గౌరవించేదికాదు అలాంటి కుటుంబాలను అన్ని రకాలుగా ప్రక్కన పెట్టిన సందర్భాలున్నాయి.
రాజులు ఇతర కులముల వారితో వివాహాలు చాలా సాదారణంగా చేసుకుంటారని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు. కాని ఆ అభిప్రాయము తప్పు రాజుల రాణివాసాలలో ఇతర కులాలకు చెందిన స్త్రీలు అనేక మంది ఉండవచ్చు నేమో! కానీ! వారికి “రాణి” (పట్టమహిషి) హోదా ఉండదు. వివాహాల విషయాలలో రాజులు పట్టుదలతో వారు మరణించడానికైనా సిద్ధమేకాని, ఇతర కులస్థులకు "అమ్మాయీలను ఇచ్చేవారు కాదు”. తమకంటే తక్కువ వంశాలవారు అనే విషయాన్ని గూడా నాటి రాజులు ఒప్పుకునేవారు కాదు. త్రేతాయుగములో సూర్యవంశ హరిశ్చంద్ర మహారాజు భార్య, పిల్లలను అమ్ముకొని తాను కాటికాపరిగా దాస్యం చేశాడే గాని, విశ్వామిత్రుడు చెప్పిన మాతంగ కన్యలను వివాహ మాడుటకు ఇష్టపడలేదు. రాజ్యము కూడా వదులుకున్నాడు. యాదవ బలిజ క్షత్రియుడైన శ్రీకృష్ణుడు ద్వాపర యుగములో రాధాదేవి అనే గొల్ల స్త్రీని ప్రేమించాడే కాని, వివాహమాడలేదు. ఎనిమిది మంది భార్యలు తనకులస్థులనే వివాహమాడాడు. ఉదా : క్రీ॥పూ॥ 6వ శతాబ్దములో మహానాముడికి, అతని దాసికి జన్మించిన వాసభఖత్రియ అను సుందరిని కులగోత్రాలు మరుగుపరిచి కోసలరాజు ప్రసేనజిత్తుకిచ్చి వివాహము చేశారని అది తెలిసిన ప్రసేనజిత్తు భార్య బిడ్డలను అనాదరణకు గురి చేశాడు. ఆ విషయము గౌతమ బుద్ధుడు పరిష్కరించాడని తెలుస్తుంది. అక్బర్ భార్య మానసింగ్ సోదరి రాజపుత్ర స్త్రీ కాని మానసింగ్ను రాజపుత్రులైన రాణాప్రతాప్ సింగ్ వంశీయులు గౌరవించలేదు సరి కదా ఆయన తోటి సహపంక్తి భోజనం చేయుటకు కూడా ఇష్టపడలేదు. శ్రీకృష్ణ దేవరాయలుకు గజపతులు అమ్మాయిని ఇచ్చేటప్పుడు, మధురాజులు, తంజావూరు రాజులు విషయములోనూ శ్రీలంక రాజులు మధురరాజ బంధువులు వీరికి సంతానంలేదు. 4వ భార్యగా ఒక శూద్రస్త్రీని వివాహమాడారు. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు. అయిన ఇతనికి రాజ్యార్హత లేదు. వారి మొదటి భార్య తమ్ముడిని రాజును చేశారు. ఈ విధంగా కులకట్టుబాట్లు ఖచ్చితంగా అమలు జరిగాయి. దేశాయిశెట్టి అన్నీ కులాలకు పెద్దగా ఉండి అమలు జరిపేవారు. ఇది వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో "కులపతులుగా చెప్పబడింది”.
కాకతీయుల శాసనములలో గూడా వర్ణాశ్రమధర్మములు ఖచ్చితంగా అమలు జరిగాయని తెలిపారు. ఇలా వర్ణ సంకరము జరిగిన కుటుంబాలను ప్రజలు రాజులుగానే కాదు కనీసం గ్రామ పాలకులుగా సైతం అంగీకరించేవారు కాదు. కనుకనే కాపు కులము నుండి నేటి కమ్మ, వెలమ కులాలు విడిపోవలసి వచ్చింది. రేచెర్ల గోత్రీకుడైన బ్రహ్మనాయుడు చాపకూటి సిద్ధాంతం ప్రతిపాదించి పూర్వాచార కులాలను దిక్కరించడం కులకట్టుబాట్లను ప్రక్కన పెట్టడం వలననే బలిజ (తెలగ) కులస్థుడైన బ్రహ్మనాయుడిని వెలివేశారు కాబట్టి వెలివేయబడ్డ తెలగాలందరూ వెలమలయ్యారు.
అదేవిధంగా కమ్మకులస్థులు తమిళగ్రంథం కమ్మవారి పురాణము నుండి చంద్రవంశ
యయాతిరాజు సంతతిలోని శశిబిందురాజుకు తుహీనుడనే కొడుకుండేవాడు. వానికి ఒక “చండాల స్త్రీ” యందు నందుడనే కుమారుడు పుడతాడు. అతనిని అందరూ నిందిస్తూంటే ఆ అవమానాన్ని భరించలేక తనదేశాన్ని వదలి దక్షిణాదికి రాగా అతని తోటి అతని బంధువులు కూడా వెంటబడి వస్తారు. అందరూ పెన్నానది దగ్గరకు వస్తారు. అప్పుడు నదీ ప్రవాహము చాలా ఎక్కువగా వుంది. సమీపంలోని జమదగ్ని ఆశ్రమములో ఆయన భార్య రేణుకాదేవి (ఈనాటి జొన్నవాడ క్షేత్రం)కి నందుడు తన చరిత్ర చెప్పి ఆమెను ప్రార్ధించి ఈనది దాటే ఉపాయము చెప్పమంటాడు ఆమె అతనికధ విని జాలిపడి తన చెవులకున్న రెండు కమ్మలు ఇస్తుంది. వాటి మహిమ వలన నదిదాటుతారు అందుకని వీరిని కమ్మవారు అని పిలిచారు అని అందులో వీరి కుల గురువు “బలభద్ర బాస్కరయ్య” గారు చెప్పారు. ఈ కధ "కమ్మవారి పురాణము”లో ఉంది (తమిళగ్రంధం) అని శ్రీతనయ గారు వ్రాశారు. 1891 సం॥ జనాభాలెక్కలలో కూడా ఉంది. మరియు 1891 సం॥ జనాభాలెక్కల ప్రకారం 231 భేదాలుగల కమ్మవారున్నట్లు వారిలో 7 ప్రదానమైన శాఖలని, వారికి ఆనాడు బోజన ప్రతిభోజనాలుండేవి కాని బంధుత్వాలు ఉండేవికావని చెప్పబడింది (బ్రిటీష్ వారి సెన్సెసురిపోర్టు) బలిజవంశ పురాణము.
అదేవిధంగా కమ్మవారు కాకతీయుల కాలములో ప్రధాన కులమైన కాపులనుండి విడిపోయినట్లు తెలుస్తుంది. ధరస్టన్ "క్యాస్టు అండ్ ట్రైబ్సు” అనుగ్రంధములో ఒక వ్యక్తి ప్రతాపరుద్రుని (ల_జకొడకా) తండ్రిలేనివాడని తిట్టడం వలన తమను వెలివేశారని తెలిపినట్లు రచయిత పేర్కొన్నాడు. ఇది నిజముకాదు. ఎందుకంటే ఒక వ్యక్తి చక్రవర్తిని దూషిస్తే కేవలము అతడికి మాత్రమే శిక్ష పడుతుంది తప్ప అతని బంధువులందరికి ఆశిక్ష పడదు. విడిపోయిన కొన్ని కుటుంబాలు కులంకట్టుబాట్లను అతిక్రమించడమో లేదా ధిక్కరించడమో జరిగినందువలననే వారు ప్రధానకులమునుండి విడిపోవాల్సివస్తుంది. (నాటి సమాజాన్ని నేటి ఆధునిక సమాజ దృష్టితో చూడవద్దు)
కీ॥శే॥గౌ॥శ్రీ ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు గారు తను రచించిన "పలనాటి వీరచరిత్ర"లో కమ్మవారికి యాదవులకూ (ఈయన ఉద్దేశ్యంలో యాదవులంటే తెలుగునాట ఉన్న గొల్లకులస్థులు) అనాదిగా కంచం పొత్తూ, మంచం పొత్తూ ఉన్నాయి. ఈ మాటపై ఎవరూ ఆవేశాలకు లోను కావద్దు అని మనవి చేశారు. అది కాదన వీలులేని సత్యమని కూడా స్పష్టం చేశారు అది తెలుసుకోవాలనుకునేవారు వయోవృద్ధులనడిగి చూడాలని గూడా ఆయన సూచించారు. పలనాటి బ్రహ్మనాయుడు కుటుంబం కమ్మ వారని వ్రాశారు. 1330 కాకతీయుల కాలమునాటికీ వారి కులం ప్రత్యేక కులంగాలేనపుడు 1170 పల్నాటియుద్ధంనాటికి వారి కులమెలా ఉంటుంది.
ఇలాంటి కులసంకరాలు బలిజ తెలగ కులాలలో నిషేధింపబడింది ఇలాంటి కుల సంకరము వలననే కమ్మవారు ప్రధాన కులమైన కాపుల నుండి విడిపోయి ఉండవచ్చును గత ఇరవై సంవత్సరాలకు ముందు వీరిని కమ్మకాపులనే పిలిశారని తెలుస్తుంది. పైన చెప్పబడిన అంశాలు స్వయంగా వారే చెప్పుకున్నందున వాటిని కాదనే హక్కేవరికి లేదు. ముస్లీమురాజులు కాలం బ్రిటీష్ వారి కాలములో ఇండియాలో పరిస్థితులు తారుమారయినవి.
కాకతీ వారి శాసనాలలో మేము మనుమ కులపవిత్రులమని, కళంకములేని కులము వారమని, వర్ణాశ్రమ ధర్మాలు సరిగా పాటించినవారమని చెప్పుకున్నారు. కాబట్టి కాకతీయులు కమ్మ కులస్థులు అనేవాదం సరి అయినది కాదు. కాకతీయుల కాలమునకు కమ్మకులము ప్రత్యేక కులముగా ఏర్పడలేదు.
పద్మనాయక చరిత్ర
ఆంధ్రుల చరిత్ర (మధ్యయుగము) వ్రాయబడిన విషయమునే "పద్మనాయక చరిత్ర" ములో ఈ క్రింది పద్యముల వలన రూఢియగుచున్నది (బలిజకుల చరిత్ర - 173 పేజి) (17వ శతాబ్దం)
- ఆ॥ ఊరి వరదనీరు, నురికి సరస్సుజేరి
తీర్థయోగ్యమైన, తెఱుగుగాదె ?
కాలచోదితమున, గాకతీశ్వరులగొల్చి
కాపులెల్ల వెలమ, కమ్మలైరి ॥
తా॥ ఊరిలో కురిసె వరదనీరు నదుల్లో చేరి తీర్థజలాలుగా మారినట్లు కాల
మహిమచేత కాకతీయ రాజుల వద్ద సేవకులుగా ఉన్న కాపులు, వెలమ, కమ్మ కులాలుగా
ఏర్పడినవి. - కం॥ తొలి కాల ముర్వి గొడవల
వెలియై యాలయములందు విహరించుటచే
నిలకాపు జనులు కొందరు
వెలమలనన్ జగతిలోన విశ్రుతులగుటన్ - పద్మనాయక చరిత్ర
తా॥ వెనుకటి కాలములో దేశాలలో జరిగిన కులము కట్టుబాట్లలో వెలివేయబడ్డ వారే దేవాలయములలో మొదలగు చోట్ల తల దాచుకున్న కాపులు. కాలక్రమములో కమ్మ, వెలమ అను ప్రత్యేక కులాలుగా ఏర్పడినది అని తెలుస్తుంది.
Caste Commitments Kula kattubatlu
Caste Commitments (కుల కట్టుబాట్లు). నాటి ప్రాచీన సమాజంలో “కులకట్టుబాట్లు” చాలా కఠినంగా అమలు జరిగాయి. ఎలానో తెలుసుకోండి.
- Bhattarusetty Padmarao Rayalu