Kapu Kshatriya Penumdhula Musunuri Vamsa Varasulu
Kapu Kshatriya Penumdhula Musunuri Vamsa Varasulu. కాపు క్షత్రియ పెనుందుల ముసునూరి వంశ వారసుల గురించి తెలుసుకోండి.

కాపు క్షత్రియ పెనుందుల ముసునూరి వంశ వారసులు
సూర్యవంశ క్షత్రియ కాపు ముసునూరి నాయకుల చరిత్ర పెనుందుల వంశం
ముసూర్యాయుడైన మచ్చినాయుడు తాను పెసుందుల వంశీయుడినని మనుమకుల పవిత్రుడు అనగా సూర్యవంశీయుడిని జమ్మిపల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో శాసనం వేయించాడు. మునుసూరి వారి మూల వంశం పెనుందుల వంశం. ఈ పెనుందుల వంశీయులు మునుసూరి గ్రామం కాగా వీరు ముసునూరి వంశీయులుగా పిలువ బడ్డారు.
నేటికి ముసునూరు గ్రామంలో పెనుమదులవారు అనే ఇంటిపేరు గల కాపు కులస్తులు నేటికీ తాము ముసునూరి నాయక వంశీయులు గానే నే చెప్పుకుంటారు, మునుసూరివారు అనే వంశం కూడా కాపులలో ఉంది.
ఈ ముసునూరి వంశ మూలపురుశుడు పోతయ నాయడు, ఈయనకు పోదానాయడు, దేవానాయుడు, కామానాయుడు, రాజానాయుడు అను కుమారులు ఉన్నారు. వీరిలో రాజానాయుడు తొయ్యేరు గ్రామమును నాయంకరంగా పోంది సేనాదిపతిగా ఉన్నాడు. ప్రతాపరుద్రుని మరణానంతరం కాకతీయ సామ్రాజ్యం పతనమై, యవనుల చేతికి చిక్కి, అల్లకల్లోలంగా మారిన ఆంధ్ర దేశాన్ని, వారి చేర నుండి విడిపించి ఆంధ్ర దేశాదీశ్వరా అను బిరుదు పొందినవారు ముసునూరి నాయకులు హైందవ ధర్మనిర్మానానికై ఆంధ్రదేశ నాయకులందరిని ఒకటిచేసి, దక్షిణ పదాస తిరుగుబాటు జెండా ఎగురవేసిన సూర్య వంశ వంశీయులు ముసునూరి నాయకులు. వీరు రేకపల్లిని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పాలించారు.
విద్యారణ్య స్వామి ఓరుగల్లులో నివసించేవారు, వారు ముసునూరివారు కట్టుకాపు కులస్తులని తాను రచించిన విద్యారణ్య శిక్ష అనే గ్రందంలో రచించారు. వీరి వియ్యంకులైన కోరుకోండ నాయకుల సంపూర్ణ వంశమును కూడా తెలగ కులంలో చూడవచ్చు.
గండ్రోతు కాపయ్య వంశీయులుగా చెప్పుకునే (ముసినిబండ) ముష్టిబండ గ్రామ పూర్వ పెత్తందార్లకు గ్రంధౌతువారు, తెలగ వంశీయులు నేటికి ముసునూరి వంశీయులుగానే చెప్పుకుంటారు. కావు కులస్తులైన కర్యప గోత్రీకులు రేకపల్లివారు గంధౌతువారు, ముసునూరివారు, పెనుమదుల వారు, తొయ్యేరువారు అను ఇండ్లపేర్లతో మునుసూరి నాయక వంశీయుల సంపూర్ణము కావులలోనే ఉంది.
ముసునూరి నాయకులు తాము మనుమ కులస్తులమని, పెనుందుల వంశీయులమనీ శాసనాలు వేయించారేగాని, తాము కమ్మ కులస్తులమని ఎక్కడా చెప్పుకోలేదు, అలాంటి ఆధారాలు కూడా లేవు, ఆధునిక రచైతలు మునుసూరి అను ఇంటి పేరు కమ్మకులంలో అధికంగా ఉంది కాబట్టి వారు కమ్మకులస్తులై ఉండవచ్చునని అభిప్రాయ పడగా, కొందరు రచైతలు వారు తెలగ కులస్తులనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ మునుసూరి పెనుందులు వంశ సంపూర్ణ వంశ వృక్షము, గోత్రము కాపు తెలగాలలోనే ఉంది.
పెనుందులు పెనుమునోల్ల గోత్రీక కాపులు: తాడికొండవారు, తాడివారు, రామాయనపువారు, బయ్యవరపువారు, పట్టపువారు, ఇల్లవారు
ముసునూరివారి బిరుదులు: ఆంధ్రదేశాధీశ్వర, వరనారీసోడర. అనుమనగంటి పురవరాధీశ్వర, చోడ రాయస్తావనాచార్య, కాంచీ రక్షపాలక, విషమదాడి పాంచాల, ఇరువెత్తుంగండ, గండగోపాల, మూరురాయణగదాళ, నాయనింగారు" మనుమకుల వారి, పెనుందులు వంశోద్భవ, ముసునూరాన్వయ మొదలైనవి.
ముసునూరి నాయక తెలగ క్షత్రియులు పెనుంగుల వంశీయులు
- విద్యారణ్యస్వమి ఓరుగల్లునివాసి మునుసూరి నాయకులు కట్టుకాపు (సైనిక) కులస్తులని విద్యారణ్య శిక్ష అను గ్రంథంలో రాసారు.
- ముసుండూరి ముచ్చినాయకుడు తాను పెనుంగుల వశీయుడినని , మనుమ కులస్తుడినని శాసనం వేయించారు. వీరు రేకపల్లి రాజదానిగా పాలించారు, వీరు కోరుకోండ వారి వియ్యంకులు.
పెనుమందులవారు, మునుసూరివారు, రెకపల్లివారు అను తెలగ కాపు వంశీయులు. నేటికీ మునుసూరీ వంశ వారసులుగా చెప్పుకుంటారు. గండ్రెతు కాపయ వీరిలో ప్రముకులు
పెనుంగుల ,పెనుగునూళ్ళ గోత్ర కాపు తెలగాలు: పెనుమదులవారు, తాటి, తాటికొండ, రామాయనపు, బయ్యవరపు, పట్టపువారు, ఇల్లవారు.
ముసునూరి నాయక వారసులు: ముసునూరివారు, రెకపల్లివారు, పెనుమగులవారు, గండ్రోతువారు, తోయ్యేరువారు.
కోరుకోండ తెలగ కాపులు: కోరుకొండవారు, ముమ్మడివారు, కొమ్మిరెడ్డివారు, కూనపరెడ్డివారు: కేసిరెడ్డి, సింగమరెడ్డివారు, గంగిరెడ్డి, అన్నపురెడ్డి, తెలగరెడ్డి వారు, కాటమరెడ్డి, జంగమరెడ్డి, మారినేనివారు, అన్నరెడ్డి వారు.
ముసునూరు నాయకులు “క్షత్రియ బలిజలు – శాసనము
దక్షిణ భారతదేశ శాసనములు – 138 పేజి, శాసనం నెం : 265 – A.R. No : 188- 1917 సం|| గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా “దుర్గిదేవిపాడు” దగ్గర మాదిపాడు గ్రామము – శక సం॥ 1142 (క్రీ॥శ॥ 1220 సం॥)
ముసుండూరి ముచ్చి నాయకుడు, పెనుమందుల వంశీయుడు. మనుమ కులస్థుడు (వీరబలిజ) జమ్మిపల్లి మల్లికార్జున స్వామి దేవాలయమునకు మెట్టభూములు దానంచేసిన శాసనము.
శాసన పాఠము
- స్వస్తి సదుగద పంచమహాశ్రబ్ధ మహార (వెంగో)
- పురాధీశ్వర బంధు చింతామణి బుధవర సురబిగ — – రద్దీవచోళ
- కులతిలక పరనారీదూర సజ్జన ప్రియ నిజలక్ష్మి మినివాస సహసొత్తు
- డి. గోటర ధీర కోట గెలువ అంకకర భండన పాత ౯ అహవరంగ నాట్యభ
- టక భయంకర కాంచీపుర నిజ్జి ౯ త జయాంగనా వల్లభరా (ల) ముఖదపన్ అ
- మినికంటె భూపాలక పెను (మం) దుల వంసోద్భవ శ్రీకరి కాలచోడ రాజ్యమూ ల
- స్తంభ “మనుమకుల (వార్ధిచంద్ర) (వీర) మాత డపగ మెచ్చుగండ చోడన సింహధర్మ ప్రసంగ (సత్యవతి)
- జ౯య ముసుందూరి అన్వయులైన శ్రీమతు ముచ్చె నాయకుడు తమ తండ్రి
గొం (కనాయక) - కునికి ధము కాపుకా శకవరుషంబు ౧౧v (ఆ) (విష) సంవత్సర కాత్తి క
- మిత్యాత౯ మున జమ్మిపల్లి మల్లికాజు౯ దేవరకు నైవేద్యానకు కుంటి మద్ది తెరువు (పడ)
- మటను దీని దక్షిణాన వెలివుల ముఖ ౧ ఈ దమ౯ము, ఎవ్వరేని విఘ్నము సేసిన గంగకత్త ౯ కవిల
- చి పెద్ద కొడుకు కపాలాన కుడిచిన వారు ! పూవ్వు ల వ్రిత్తి చింతలేటి
తూప్ప ౯న ఖ ౧ వ్రిత్తి - స్వదత్తం, పరదత్తం (వా) ఓహరేతి వసుంధర శష్టివ్వతూప్ప సహస్రాణి
విష్ణాయాం జాయతే | క్రిమిః ॥
పై శాసనమునకు అర్ధము :
ముసుండూరి ముచ్చినాయకుడు తండ్రి గొంకనాయకుడు, వెంగీపురాధీశ్వరుడి బంధువులమని చోళవంశమని, అమని కంటి భూపాలకుడుని పెనుమందుల వంశోద్భవ, శ్రీకరికాలచోళుడు మా మూలపురుషుడని, మాది “మనుమ” కులమని చెప్పుకొని శాసనం వేశాడు.
తెలుగు చోళులే తెలగాలు, వీరబలిజలు వారి శాసనాలలో మేము “మనుమ కులమని, మను వంశోద్భవ, మనుకుల తిలక అని చెప్పుకొని శాసనాలు వేశారు – దీనినిబట్టి ముసునూరి నాయకులు “క్షత్రియ బలిజలని” స్పష్టంగా తెలుస్తుంది.
ఇండ్లపేర్లు: పెనుమదులవారు, ముసూనూరివారు, రేకపల్లివారు కశ్యప గోత్రం, గండ్రెతువారు (గండ్రెతు కాపయ వంశం), తొయ్యేరువారు.
పెనుంగుల వంశీయులను గోత్రీకులను కాపు, కమ్మ, వెళములలోను చూడవచ్చు. కానీ సంపూర్ణ వంశం కాపులలోనే ఉంది. నేటికి మునుసూరి వంశీయులుగానే చెప్పుకుంటారు. తల్లి కులంలో లేని వంశాలు కొత్త కులాలలో ఎలా ఉంటాయి? కాపులే ముసునూరి నాయకులు!
ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే ఇక్కడ నొక్కండి
Kapu Kshatriya Penumdhula Musunuri Vamsa Varasulu
Musunuri Kapaya Nayaka | Warangal Rajulu | Vijayanagara Maha Samrajya Balija Kshatriyalu | Kapu Caste Zamindars | Kapu Community