Cholas Telagas

Cholas Telagas. చోళులు (దుర్జయులు) - తెలగాలు. పిమ్మట ఒక శతాబ్దం పైగా చోడ వంశస్థులైన స్థానిక ప్రభువులు తెలుగు దేశాన్ని పాలించారు.

Jan 18, 2025 - 08:33
Updated: 1 year ago
0 62
Cholas Telagas

చోళులు (దుర్జయులు) - తెలగాలు

ఆంధ్ర సంక్షిప్త చరిత్ర- ఏటుకూరి బలరామూర్తి - పేజి నెం. 91 చోళులు (తెలుగు చోళులు పల్నాటి యుద్ధం) 11వ అధ్యాయం

వేంగి (ప॥గో॥ జిల్లా) చాళుక్య రాజ్యపాలన క్రీ.శ. 1100 సం||తో అంతమయింది. పిమ్మట ఒక శతాబ్దం పైగా చోడ వంశస్థులైన స్థానిక ప్రభువులు తెలుగు దేశాన్ని పాలించారు. వెలనాటిని పాలించిన వారిని వెలనాటి చోళులని, తదితర చోళులను తెలుగు చోళులని చరిత్రకారులు తెలియజేసారు. తాము చతుర్థ వంశస్థులమని దుర్జయ కులోధ్భవులమని వెలనాటి చోళులు చెప్పుకున్నారు. కాని వాస్తవానికి అందరూ ఒకే కుదురు నుండి వచ్చిన చతుర్థ వంశస్థులే తప్ప వేరుకాదు. వీరందరిని బలిజులని కాలక్రమేణా తెలగాలు లేక కాపులని పేరు స్తిరపడింది.

చోళ బలిజ రాజుల మొదటి నివాస స్థలము రాయలసీమ. అచటనుండి తెలంగాణా పిమ్మట సర్కారు జిల్లాలకు వీరు విస్తరించారు. తమ జన్మభూమియైన రాయలసీమతో చాలాకాలంగా సంబంధాలు తెగిపోవుట వలన వెలనాటి చోళులు కరికాళ చోళుని స్మరించక తమ వంశములో మరొక వీరుడైన దుర్జయుని తమ వంశకర్తగా పేర్కొన్నారు. అంతకు మించి వెలనాటి చోళులకు, తెలుగు చోళులకు తేడాలేదు. వెలనాటికి “షట్సహస్ర" దేశమని కూడా పేరుంది. ఆ ప్రాంతములో నివసించిన నియోగులు (బ్రాహ్మణులు) ఆరువేల నియోగులయినారు.

క్రిష్ణ, పెన్నానది మధ్య ప్రాంతమును వెలనాడు అంటారు. దీని రాజధాని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా చందవోలు. ఈ గ్రామానికి ఆనాడు దనదుపురము అనుపేరుండేది. ఆపట్టణము దేవాలయాలతోనూ మేడలతోనూ వస్తు సమృద్ధులైన విపణి వీధులతోను ఆ నగరం కుబేరుని రాజధానివలె ఉండేదని “మంచనకవి” తన కేయూర బాహు చరిత్రలో వర్ణించాడు.

వెలనాటి చోళుల మూలపురుషుడు మల్లవర్మ. ఇతను త్రిలోచన పల్లవుని వద్ద సామంతునిగా ఉండేవారు. క్రీ.శ. 1016-1108 మధ్య పాలించిన మొదటి గొంకరాజు. కంచి పరిపాలకుడైన కుళుత్తోంగ చోళునికి (రాజరాజ నరేంద్రుని కుమారుడు) ఇష్టమైన వాడు అతని సామంతుడు. ఈ గొంకరాజు కుమారుడు మొదట వెలనాటి చోళుడు క్రీ.శ. 1112 ప్రాంతములో కంచి ఆదిపత్యము త్రోచివేసి స్వతంత్రుడైనాడు. వెంటనే కళ్యాణి పట్టణ పాలకులైన పశ్చిమ చాళుక్యులు ఆంద్రదేశంపై దండెత్తి వచ్చారు వెలనాటి చోడుడు. ఈ దండయాత్రను తట్టుకోలేక ఓడిపోయారు. 1135 వ సం॥ వరకు 17 సం||లు ఆంధ్ర దేశం కన్నడ చాళుక్య సామ్రాజ్యములో భాగమయింది. ఆ కాలంలో పలువురు కన్నడోద్యోగులు, సేనానులు, ఆంద్రదేశములో స్థిర నివాసమేర్పరచుకున్నారు.

వెలనాటి చోళుని కుమారుడైన రెండవ గొంకరాజు 1132 సం॥లో అధికారానికి వచ్చి తెలుగు దేశములోని చిన్న, చిన్న రాజ్యాలన్నింటిని ఏకంచేసి 1135 సం॥లో గోదావరీ తీరంలో కళ్యాణి చాళుక్యుల నోడించి తెలుగుదేశ స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించాడు. అపుడు వారిని తెలుగు చోడులు అని సార్థక నామధేయులయినారు. రెండవ గొంకరాజు అనంతరం రెండవ వెలనాటి చోళుడు అధికారంలోకి వచ్చాడు. కన్నడ చాళుక్యులు చేసిన మరొక దండయాత్రలో వారిని ఓడించాడు. ఇతడు మతసామరస్య ధోరణి కలవాడు. కనుకనే వీరశైవ మతాచార్యుడైన మల్లికార్జున పండితారాధ్యుని ఆగ్రహానికి గురయినాడు. అనంతరం వెలనాటి చోళులు రాజ్యం పోగొట్టుకున్నారు. ఈ వంశీయుడు పృధ్వీరాజు క్రీ.శ. 1187 ప్రాంతములో పిఠాపురం ప్రాంతం పరిపాలించి నెల్లూరు తెలుగు చోడబలిజ రాజులతో జరిగిన యుద్ధంలో 1206 లో మరణించాడు. అంతట ఆ వంశం అంతమయింది. దీనిని బట్టి వెలనాటి చోళులు, తెలుగు చోళులు, తమిళ చోళులు, దుర్జయులు, కరికాల చోళుని వంశీయులైన తెలుగు బలిజలు అని, ఈనాటి తెలగాలని తెలుస్తుంది - వీరు తెలుగుదేశాన్ని పాలించారని తెలుస్తుంది.

గండికోటను పాలించిన కాకతీయ సామంతరాజు జుట్ల యల్లయలెంక, గొంకారెడ్డి, రుద్రయలెంక అనువారు తెలగాలు (బలిజలు) - వెలనాటి చోడ రాజ వంశీయులు.

అయ్యరెడ్డి : దాక్షారామ శాసనం, క్రీ.శ. 1061లో గొంకరాజు శెట్టి (వెలనాటి చోడరాజు) వద్ద ముమ్మడి బీమరాజుశెట్టి మరియు అయ్యపురెడ్డి ప్రముఖ బలిజలుగాను, సంపన్న వర్తకులుగాను ఉన్నారు. ఈ అయ్యపరెడ్డి కుమారుడు నూనంరెడ్డి. వీరు వెలనాటి చోళుల బంధువులు అని శాసనాలు స్పష్టం చేస్తుంది. అయ్యపురెడ్డి పేరున తెలంగాణాలోను, అయ్యపురెడ్డి ఇంటిపేరుగలవారు కోనసీమలోను, తెలంగాణాలోను, గుంటూరు, ప్రకాశంలోను బలిజలుగా ఉన్నారు. (ఆధారం పేజి. నెం. 221, రెడ్డి సంచిక).

Cholas Telagas

chola telagas | cholas telagas in telugu | telaga caste | kapu history telugu | kapu community

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User