Telinga is a Caste

Telinga is a Caste

తెలింగ అనేది కులపదము

త్రిలింగ పదమునుండి తిలింగ, తెలింగ, తెలుంగ, తెలంగాణా, తెలుగ, తెలుగు, తెలగ, తెలగాణ్యులు, తెలిరిగిరి మొదలగు పదాలు ఏర్పడినట్లు తెలుగు పండితులు, చరిత్రకారులు అంగీకరించారు. అలాగే తెలుంగన్, తెలుంగర్, తెలుంగతి పదాలు ఏర్పడ్డాయి. బర్మాలో తైలాంగ్, తలైంగ్ పదాలు ఏర్పడ్డాయి. టాలమి (రచయిత), ట్రెలింగాన్, టివిస్తాన్ అని తెలుగు పదము, తెలుగునాటి బలిజకాపులకు, తెలగాణ్యులు అనే పదము బ్రాహ్మణులకు, తెలగాణ్య నాయక (మెరక వీధి తెలగాలకు) తెలుగులు అంటే తెలుగు ప్రజలందరికి చెందిన జాతి వాచకము.

తెలింగ పదమునుండి ఏర్పడిన తెలుగు పదము బలిజ కాపులకు ఎందుకు వర్తించాలి? అనే సందేహము సహజము. తెలుగు నాట స్థిరపడిన తొలి నాగరికులు కావడం వలన, తొలి వ్యవసాయ నిపుణులు, రాజ్యపాలకులు, వ్యాపారులు కావడం వలన, అధిక జనబాహుళ్యము కలిగియుండుట వలన, తెలుగుదేశాన్ని ‘కాపు’ కాచి తెలగాలుగా పిలువ బడ్డారు.
మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్, బెంగాలి రాష్ట్రాలలో గూడా దేశ పదముతో పిలువబడే మరాఠీలు, ఓండ్రులు, గుజరాతీలు, బెంగాలీలు అనే ప్రత్యేక కులాలున్నాయి. వారు గూడా ఆయా రాష్ట్రములలో ప్రాచీన పాలక కులాలు. తెలింగ పదము ‘తెలగా’ లకు అన్వయించుట సమంజసమే.

  1. బహుజనపల్లి సీతారామచార్యులు “శబ్ద రత్నాకరం” నిఘంటువు పేజి 1195 ప్రకారం – త్రిలింగ పకృతిపదం కాగా, తెలగ వికృతి పదం. పకృతి, వికృతి సమానార్థాలు కావున త్రిలింగ పదములనుండి తెలింగ, తెలగ అను పదాలు పుట్టాయని గ్రహించాలి. తెలింగ రూపాంతరమే “తెలగ”.
  2. ఏటుకూరి బలరామమూర్తి “ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర” పేజి-5 లో ఇలావుంది. తెలుగు ప్రజల నివాస స్థలం మొదట రాయలసీమ, తర్వాత తెలంగాణా. ‘తెనుగు’ క్రమంగా తెలుగయ్యింది అందులోనుండి తెలగాలు, తెలంగాణా, తెలగాణ్యులు, తెలిరిగిరి మొదలగు పేర్లు ఏర్పడ్డాయి. దీనిని బట్టి త్రిలింగ, తెలింగ, తెలగ పదాలు సహ సంబంధం కలిగియున్నాయి.
  3. టి. భాస్కరరావు “తెలుగు భాషా చరిత్ర” పేజి 94 ప్రకారం ఇలా ఉంది. క్రీ.శ. 985 సం॥ రాజరాజు శాసనములో అతనికి “తెలింగ కులకాల” అను బిరుదు వున్నట్లు తెలుస్తుంది. ఇచట తెలింగ అనే పదము కులపరంగా ప్రయోగించారని నిర్ధారణ అయ్యింది ఆ తెలింగ పదము అని గ్రహించాలి. (కాబట్టి రాజరాజ చోళు డు తెలగ కులస్థుడని తెలుస్తుంది).
  4. లకంసాని చక్రధరరావు రచించిన “తెలుగు భాషా చరిత” (తెలుగు – ఎం. ఎ మెటీరియల్) పేజి 26 ప్రకారం త్రిలింగ పదమునుండి తెలుగ, తెలగ, తెలుంగ, తెలుగునాడు మున్నగు పదాలు పుట్టాయని తెలుస్తుంది. దీనిని బట్టి త్రిలింగ పదమునుండి తెలింగ పదం ఏర్పడి “తెలగ” గా రూపాంతరం చెందింది అని గ్రహించాలి. “రేప” లోపించి “ఇ” కారం “ఏ” కారంగా మారిందని కనుక త్రిలింగ తెలింగ అయినదని తెలిపారు.
  5. అంబటి వెంకటప్పయ్య ‘శ్రీకృష్ణ భారతం’ 8వ పేజిలోని పద్యము సంఖ్య-37 ప్రకారము “తుర్వసుని వంశీయులు అన్ని ప్రాంతాలలో వ్యాపించగా తెలుగు ప్రాంతమున నివాసము వున్నవారు మాత్రం ప్రాంతాన్ని బట్టి తెలగాలు అయ్యారని తెలిపారు. ఈ అంశాన్ని ఆ గ్రంథము అభిప్రాయములో కొండవీటి వెంకటకవి గారు అంగీకరించారు.
  6. ఏటుకూరి బలరామ మూర్తి “ఆంద్రుల సంక్షిప్త చరిత్ర” పేజి 91 ప్రకారం “వెలనాటిని పాలించిన వారిని వెలనాటి చోళులని, తదితరులను తెలుగు చోడులని చరిత్రకారులు వ్యవహరిస్తున్నారు. కాని వాస్తవానికి అందరూ ఒకే కుదురు నుండి ప్రారంభమైన చతుర్వర్ణ వంశస్థులే తప్ప వేరుకాదు. వీరందరికీ కాలక్రమేణా తెలగాలు లేక (బలిజ) కాపులు అను పేరు స్థిరపడింది.
  7. జె. దుర్గాప్రసాద్ “ఆంధ్రుల చరిత్ర” ప్రథమ భాగము పేజి 66, ప్రకారం క్రిష్ణానదికి దక్షిణముగా ఉన్న ప్రాంతం వెలనాడు, ఈ వెలనాడును పాలించిన చోడులు తాము ‘దుర్జయ కులజులమని’, చతుర్థాన్వయులమని, చెప్పుకున్నారు. వీరంతా శూద్రులే! కాలక్రమేణా వారంతా కాపు (తెలగ) లయ్యారు. ఇంకా పేజి 69, ప్రకారం తెలుగు భాషకు అధికారిక ప్రతిపత్తిని కల్పించి ప్రోత్సహించినది రేనాటి చోళులే! ఈ రేనాటి చోడ కుటుంబాలలో, పొత్తపికొణి దెన, నెల్లూరు చోళులు ముఖ్యంగా పరిగణించదగిన వారు. తెలుగు చోడులలో నన్నూరు చోడులని మరొక శాఖ కన్పిస్తుంది. (తెలుగు చోడులే తెలగాలు).

దీనినిబట్టి తెలగాలు, స్థానిక ప్రభువులని, తెలగాలు దక్షిణ భారతదేశ క్షత్రియ బలిజలు ఒకే వంశీయులని వీరు తెలుగు భాషా పోషకులని విశదమవుతుంది. కానీ తెలుగు ప్రాంతానికి, తెలగాలకు, తెలుగు భాషకు, ప్రత్యేక సంబంధముంది. వారు తెలుగు భూమిపుత్రులు, తొలి తెలుగు శాసనం “రేనాటి ధనుంజయ చోడునిదే” అని పరిశోదకు లంటారు.

త్రిలింగ పదం నుండి క్రమంగా ‘తిలింగ, తెలింగ, తెలంగ తెలగ రూపాలు ఏర్పడినవని గ్రహించాలి. కాపు, తెలగ, బలిజ, ఒంటరి అనువారు తెలగాలలో వేరు వృత్తులు చేస్తూ వివిధ ప్రాంతాల ఆ నామములతో పిలువబడే ఒకే కులస్థులు. ఆనాడు ఈనాడు వీరిమద్య నాడు నేడు వివాహ బంధుత్వాలున్నాయి అని గ్రహించాలి.

ఆంధ్రజ్యోతి దినపత్రిక – ఆర్.వి.ఆర్. నాయుడుగారు.

జెంటూ :

జెంటూ పదమునకు దేశీయము అనే అర్థమున్నది. పోర్చుగీసువారు ఆడుగు పెట్టినప్పుడు విజయనగర సామ్రాజ్యములో అధికంగా వ్యాప్తిలో ఉన్న తెలుగు భాషను దేశీయ భాషగా భావించి దానికి ‘జెంటూ’ అని వారు పేరుపెట్టి పిలిచారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంనాటి ఎ.పి. కాంపెబెల్ వ్రాసిన తెలుగు వ్యాకరణంలోకూడా “జెంటూ” పదము గూడా వాడబడింది. కాని తర్వాత ఆ పదం వాడుకనుండి తొలగిపోయింది. ప్రాచీన కాలములో ఆంధ్ర దేశానికి, ఆంధ్రపదం, ఆంధ్ర మండలం, ఆంధ్రభూమి, ఆంధ్రావని, త్రిలింగదేశం, తిలింగ, తెలంగాణా అనే పేర్లుండేవి. ఆంధ్ర భాషకు తెలుగు, తెనుగు, జెంటూ, ఆంధ్రం అనే పేర్లుండేవి. తమిళనాడులో బలిజలను ‘జెంటూ’ అని పిలిచేవారు.

డా॥ బి. ఆర్. అంబేద్కర్గారు నిచ్చెనమెట్ట కులవ్యవస్థను అర్థం చేసుకుంటేనే భారతదేశ చరిత్ర అర్థమవుతుంది. కులసంస్కృతులు సంపూర్ణ భారత చరిత్ర అధ్యయానికి రచనకు దారిదీపాలవుతాయి అని చెప్పారు.

తెలగాలు :

1927వ సంవత్సరం జూన్ నెల 16,17,18 తేదీలలో శ్రీముఖ లింగమున జరిపిన “కళింగ వర్థంతి” మహాసభా సమావేశమునకు ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీశ్రీ విక్రమదేవ వర్మ జయపుర మహారాజుగారు తమ ఆహ్వాన సంఘాధ్యక్షోపన్యాసము నిట్లునుడివిరి.

…కళింగరాజయిన చిత్రాంగదుని కూతురును దుర్యోధనుడు పెండ్లాడినట్లు మహాభారతమున శాంతిపర్వమున నున్నను, మీద ను దాహృతమైన “అంగ, వంగ, కళింగేషు” అను శ్లోకమును బట్టి కళింగదేశము పవిత్రమైనదనియు నందున యాదిమ వాసులు పతితులుగను, మ్లేచ్చులుగా నెన్నబడుచుండిరనియు దోపక మానదు. అట్టి యాదిమ వాసులలో “నోండ్రులు” అను నొక తెగ వారిప్పటికిని గలరు. వారు తెలివి గలిగిన కృషికులును, శూరులునై సర్వవిధముల “తెలగాలను” బోలియుందురు…… ఓండ్రులును బట్టి యోండ్ర దేశమేర్పడినట్లే “తెలగాలను” బట్టి తెలగనాడేర్పడినది.

కళింగదేశ చరిత్ర, శ్రీరాళ్లబండి సుబ్బారావుగారు

End

Telinga is a Caste

What is Telinga? How came Telaga caste name? Learn about Trilinga, Tilinga, Telinga, Telanga, Telaga caste names in telugu. అసలు తెలగ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోండి.

telaga caste history | telaga caste name history | telaga history telugu

4 responses to “Telinga is a Caste”

  1. Ukkadam Krishnamurthy Avatar

    సంతోషకరమైన వేదిక ప్రధాన ప్రబోధాత్మక సానుకూల స్పందన అభినందన కిరణాల మందార వికసిత సంపెంగ మాల సామాజిక వర్గాల పురాతన చరిత్ర మహోన్నత పాఠశాల విద్య సాంస్కృతిక తత్వ తర్క ధర్మ మంచినడత ఋషుల జ్ఞాన వేదాంత పండితుల వేదం

  2. Ukkadam Krishnamurthy Avatar

    సనాతన ధర్మ మర్రి మాను మూల స్తంభాల అష్టాదశ సమన్వయ కమిటీల ఆధ్వర్యాన మన బిడ్డ లు వ్యవసాయ ఆధారిత పంటలు గోవమ్మ గౌరమ్మ పరిరక్షణ వేదిక

  3. Ukkadam Krishnamurthy Avatar

    ఆంధ్ర నామసంగ్రహము అమరకోశం తెలగ బలిజ కాపు ఏకరూపత గల అసమసమాజం.పర్యాయపదాలు .వృత్తి ప్రవృత్తి ఆలుమందలు వ్యవస్థ వ్యవసాయ దారుల సమన్వయ సహకార సనాతన ఆహార ధాన్యాల ఫలసాయం .భూమి ఉనికి నైసరిగక భౌగోళిక వాతావరణ పరిస్థితుల వల్ల పంటల పండించే బార్లి వరి గోదుమ నువ్వులు బేడలు పర్యావరణం అనుసరించి ప్రాంతం అవగాహన ఉన్న వేదిక. అందువలన వ్యవసాయ దారుల ఆహార ధాన్యాల సుగంధ వస్తువులు అల్లం బెల్లం పసుపు మార్పిడి విధానాల వల్ల నిత్యావసర సరుకుల మార్పు మారకం ముఖ్యమైన పాత్ర పోషించిన సంస్థ వ్యవస్థ లో మద్య వర్తతుల దలారీల ప్రమేయం లేదు సమ్మతమైన మంచినడత నమ్మిన విశ్వాసం .వాణిజ్యం వ్యవస్థ వ్యాపార వాణిజ్య శాఖ లు లేవు.పైశాచి మూలమైన భాషల బిడ్డలు పాలి పాకృతం సంస్కృతం.వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భాషల పుట్టుక. సరస్వతీ నదిసింధునాగరికత అమ్మ అక్క దేవత పంచభూతాల పకృతి ప్రేమ నమ్మకం ఆప్యాయత వలన కరుణించమని పూజ భక్తి భావన స్పందన అభినందన కిరణాల ఆలంభన నమ్మిన వారి పశుపతి రుద్ర జట్ల నాయకుల మధ్య అవగాహన కల్పించాల్సిన బాధ్యతఎక్కువ ప్రాధాన్యత కలిగిన వ్యవస్థ సనాతన ధర్మ మంచినడత పునాదులు వ్యవస్థ అందరిచేత అనుసరించిన మార్గం .అమ్మ ఆదరణ ఆప్యాయత కరుణ అడవిజంతువుల ప్రకృతి వరదలుభూకంపాలు నుండి తన ప్రాణం అర్పణ చేసి రక్షణ కవచం మాతృ శక్తి దేవతార్చన పశుపతి పశు సంరక్షణ రుద్ర యోధుల మృగాాల సంహారకమైన వీరవ్యవస్థ జట్టు నాయకుల త్యాగం సేవలు గుణం రణం బలంగల శివయ్య (మంచినడత) అరూప రూప విరూప జీవ నిర్జీవ శిల్ప ఆప్యాయత ఆదరణ పొందిన తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ వేదిక ప్రధాన ప్రబోధాత్మక సానుకూల ఉన్నత మానవ దైవమైన ఆది దేవతల ఆది మాతాపితల కల్పన సంకల్పితమైన కుటుంబ సభ్యుల రక్షణ కవచం అత్యంత కీలకమైన ఆదిమానవుడు మంచినడత నడక మడక మెరుగైన మెలకువ మెలిక మొలకల జన్మ భూమి విశాల ప్రాతిపదికన ఏర్పడిన జంభూ ద్వీపం జడభరత అభనాభభరత వర్షం. ఆహారం ప్రాథమిక అవసరమైన మౌలిక భద్రత దేహం లో అగ్ని జఠరాగ్ని ఇంధనం కడుపు నిండిన కైలాసం అగ్ని మూడవ నేత్రం త్రి అంబకం త్రినేత్రం శివ గౌరమ్మ పరిరక్షణ కార్యాచరణ ఆవు గోవమ్మ గౌరమ్మ పొలాల మధ్య శ్రమ వల్ల ఆహార ధాన్యాల అపారమైన సంపద శారీరక మానసిక ప్రశాంతత ఆలోచన తత్వ తర్క భావాలు మూ డు లింగ కళింగ (వరి)త్రికలింగ భావన స్పందనలు బలి యజ్ఞం పరబ్రహ్మం సర్వేస్వర మహేశ్వర ఆరాధ్య పవిత్రత జ్ఞాన జ్యోతి ప్రజ్వలన. సరస్వతీ నది పరివాహక మార్పు వరదలు భూకంపాలు ఎడారి జన్మ ఉత్తర ప్రాంత ప్రజలు మధ్య ఆసియా సిరియా పారశీక ఆపఘన్ కంభోజ దక్షిణ భారత దేశం పయనం ఇరువది పైగా ఉన్న జాతుల సమూహం కదలిక హిరణ్య కశ్యప మహాబలి చక్ర వర్తి కుమార బాణ రాజ్య వ్యవస్థపునాదుల పురాతన చరిత్ర ఉన్న శాసనముల జాతి సంపద విలువ గల విశిష్ట వ్యవస్థ ఉన్న వేదిక తెలగ బలిజ కాపుల సమయపాలన అష్టాదశ సమన్వయ సమయాల పాలన నిర్వహణ బాధ్యత నిర్వహణ జాతి భాష మాతృభాష సమన్వయ కర్త ఏకరూపత కోట సామ్రాజ్య సామర్లకోట ఏకవీర ఓరుగల్లు కోట హంపి ఉదయగిరి గుత్తి పెనుకొండ చంద్రగిరి గురం కొండ వేలూరు తంజావూర్ శ్రీలంక విశాల ప్రాతిపదికన ఏర్పడిన తెలగ బలిజ కాపు ఏకవీర చరిత్ర ఉన్న శాసనములు విదేశాల లో ఉన్న గ్రంథాలయ సాగర వ్యవస్థ సంపద పరిపూర్ణమైన మహా మంచినడత ఋషుల ధర్మ జనరంజక సమ్మతమైన వైదిక పురాణ ఇతిహాస శోధన అభినందన వందనము మహాయ జ్ఞాన యజ్ఞం మహా అశ్వ మేధ మహాబలి చక్ర వర్తి మహా బలేశ్వర యజ్ఞం తెలగ తెలివైన తెలుగు జాతి

  4. Ukkadam Krishnamurthy Avatar

    శాలి వరి చోళ చోళ్ళు రాగులు తెలుగు మాగాణం ఆహార ధాన్యాల సుగంధ సుగంధాల ఆర్థిక వ్యవస్థ తేనియ తేనె అలుగుల ఆ
    అనిమిజం ప్రకృతి అనుసరించిన విధానాల పోషణ గోమిత్ర అమ్మ ప్రేమ అప్ప ఆరాధన?సామగ్రామంప ప్రతిమ ప్రతీక
    SYMBOL ప్రతిమల ప్రతీకాత్మకం…. శివం మంచినడత నిఖిల నిత్య సత్య ధర్మ పరిరక్షణ వేదిక శివ లింగ నిర్ధారణ ముస్లింల?మూడవ నేత్రం ??? త్రి లింగ కళింగ వరి అమ్మ గోవమ్మ గౌరమ్మ మెచ్చిన జట్టు నాయక కోటీ లింగాల చోళ లింగ రాజ వరం తెలుగు శాసనముల తెలింగ సంస్కృత భాష పై తెలింగ జెండా లింగోధభవం పరమ ఆది దేవతల ఆది దంపతుల ఆరాధన లింగారాధన తెలింగ నేల అశ్మక తెలంగాన్యాం తెలుంగు రాయ రాజుల పాలన వల్ల ఏర్పడిన జాతుల సమాహారం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *