రాజకీయ తిరోగమనం లో తెలంగాణ కాపులు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్ల ప్రభావం యధా తధంగా కొనసాగుతూ పూర్తి స్థాయి అధికారం చేజిక్కుంచున్నారు. ఆ ఎన్నికలు కాపుల పాలిట అశనిపాతంగా మారినవి.
ఈ ఎన్నికల్లో ప్రముఖ నాయకులు అంత కూడా B.R.S. పార్టీ లోనే ఉండటం, ఆ పార్టీ కి ఎన్నికల్లో ఎదురు గాలి వేయటం వలన 7 మంది కాపులు ఓటమి చెందటం 2 మాత్రమే ఎన్నిక కావటం, కాంగ్రెస్ పార్టీ నుచి కేవలం 4 మంది మాత్రమే పోటీ చెయ్యటం 2 మాత్రమే ఎన్నిక కావటంతో 4 మ్మెల్యే లకి మాత్రమే పరిమితం అయినారు.
ఇంత తక్కువ సంఖ్యలో 1989 నుంచి ఏ అసెంబ్లీలో కూడా లేరు. 2018 అసెంబ్లీ లో 9 శాసన సభ్యులు వున్నారు.
ఎన్నిక కాబడిన వారు
- శ్రీ దానం నాగేంద్ర – ఖైరతాబాద్ – BRS – 6 వసారి ఎమ్మెల్యే గా గెలిచారు
- శ్రీ గంగుల కమలాకర్ – కరీంనగర్ – BRS – 4 వసారి ఎమ్మెల్యే గా గెలిచారు
- శ్రీ అది శ్రీనివాస్ – వేములవాడ – కాంగ్రెస్ – మొదటసారి ఎమ్మెల్యే గా గెలిచారు
- శ్రీమతి కొండా సురేఖ – ఈస్ట్ వరంగల కాంగ్రెస్ – 5 వసారి ఎమ్మెల్యే గా గెలిచారు
తెలగాణ ప్రాంతంలో కాపుల నుంచి మొదట నుంచి రాశి కంటే వాసి పరంగా నాయకత్వం వుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ లో CM రేస్ లోకి శ్రీ గడ్డం రాజారామ్ గారు, శ్రీ ఉత్పల హనుమంతరావు, శ్రీ ధర్మపురి శ్రీనివాస్ లాంటి కాపు నాయకులని కూడా పరిశీలించారు. PCC ప్రెసిడెంట్స్ గా శ్రీ V.హన్మంతరావు, శ్రీ ధర్మపురి శ్రీనివాస్, శ్రీ కంచర్ల కేశవరావు, శ్రీ పొన్నాల లక్షమయ్య చేసినారు.
శ్రీ పుంజాల శివశంకర్ గారు కేంద్ర కాబినెట్ మంత్రి గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డజన్ల కొద్దీ కాపులకి పెట్రోల్ బంకులు ఇప్పించి ఆర్ధికంగా స్థిరపరిచినారు, శ్రీ వంగవీటి రంగా కి రాజకీయ గురువుగా వుండే వారు.. ఎంతో మంది కాపు రాజకీయ నాయకులకి సహాయ సహకారాలు అందించారు. కోస్తా ప్రాంతం నుంచి పోటీ చేసి MP గా గెలిచినా ఏకైక నాయకుడు.
తెలంగాణ ప్రాంతాల్లో కూడా గోదావరి పరివాహక ప్రాంతాలు అయిన ఆదిలాబాద్, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా ఎక్కువ సంఖ్యలో వున్నారు కానీ రాజకీయంగా నామ మాత్రం ఉనికి మాత్రమే వుంది. ఈ జిల్లాల్లో రైతువారి ప్రధాన కులంగా, విద్య, ఉద్యోగాల్లో కోస్తా ప్రాంత కాపులకంటే ముందు వరుసలో ఉన్నప్పట్టికీ రాజకీయాల్లోకి యువతరం, ఆర్ధికం పరిపుష్టమైన వారు కూడా దూరం అవుతున్నారు.
దశాబ్దాల అనుభవం వున్నా నాయకులు ఎక్కువ మంది BRS లో ఉండటం కూడా మరొక కారణం. BRS ప్రభుత్వం లో గత 10 సంవత్సరాలగా సముచితమైన కాపులకి స్థానం కల్పించారు. శ్రీ K.కేశవరావు పార్టీ లో అగ్రనాయకత్వం లో వున్నారు, మొట్టమొదట కాపునాడు సభని బెజవాడలో జరిపిన వారిలో శ్రీ కంచర్ల కేశవరావు అగ్రగణ్యులు.
- రాజకీయ పరమైన పదవులు
- 9 ఎమ్మెల్యేలు, 1 మంత్రి, 3 ఎమ్మెల్సీలు, 3 కార్పొరేషన్ చైర్స్, 10 సంవత్సరాలుగా హైదరాబాద్ మేయర్లు, 2 రాజ్యసభ ఎంపీలు
- కాపు భవనాలు
- గాజుజాలరామారంలో 3 ఎకరాలు కేటాయించారు. (కొందరు కోర్ట్ స్టే తెచ్చిఆడు తగిలినారు)
- ఖానమెట్ లో 6.8 ఎకరాలు, 5 కోట్లు కేటాయించారు.
- లోయర్ ట్యాంక్ బండ్ లో 1959 నుంచి వున్న కాపు తెలగ బలిజ భవన్ పుననిర్మాణంకి 10 కోట్లు కేటాయించారు.
- కోకా పేటలో 5 ఎకరాలు మరియు 5 కోట్లు కేటాయించారు.
- అనుభవము రీత్యా మరొకరు ముందు వున్నా కూడా శ్రీ KCR ఐచ్చికంగా శ్రీమతి అల్లంశెట్టి శాంతి కుమారి గారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
- BRS ఆంద్ర రాష్ట్ర శాఖకి కి శ్రీ తోట చంద్రశేఖర్ ని నియమించినారు.
BC బంధు పధకంలో మాత్రం కాపులని పూర్తి స్థాయి వ్యవసాయ కులం మరియు ప్రత్యేక చేతివృత్తి కులం కాదు కాబట్టి మినహాయించారు.
రాబోయే కలంలో మరింత ఆర్ధిక పరిపుష్టిని సాధించి, రాజకీయగా చైతన్యంతో ఎక్కువ పదవులు సాధించి ప్రజలకి సేవ చెయ్యాలని అని, కాంగ్రెస్ ప్రభత్వం లో హైదరాబాద్ నగరము లో మనకి కేటాయించిన స్థలాలు వెనక్కు తీసుకోరు అని ఆసిద్దాము.
-by Chillagattu Sreekanth Kumar
End
Telangana kapus in political regression
Telangana kapus in political regression. రాజకీయ తిరోగమనం లో తెలంగాణ కాపులు!
Leave a Reply