జులై 4వ తేదీన యధాలాపముగా టీవీ చూస్తున్న నాకు VM. రంగా 77 జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలు చాలా ఆశ్చర్యం, సంతోషం అనిపించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చిత్తూరు, అనంతపురం, గుడివాడ, కంకిపాడుల్లో ఘనంగా నివాళులు అర్పించటం, అన్నదానాలు. ప్రతిపక్షపార్టీ కూడా పాలకొల్లులో రంగ విగ్రహానికి దండలు వెయ్యటం. బీజేపీ వారు గాజువాకలో రంగా జయంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు చెయ్యటం.
సొంత సామాజికవర్గం విజయవాడలో, గుంటూరుల్లో, శ్రీకాళహస్తిలో, అంగనంపుడి, విశాఖపట్నంలో రంగా విగ్రహాలకు దండలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. హైదరాబాద్ ఎల్లమ్మగూడలో,పాలకొల్లులో,తంబళ్లపల్లెలో రంగా విగ్రహావిష్కరణ, శ్రీకాకుళం, వియజయనగరం జిల్లాలో రంగ విగ్రహాలు ఆవిష్కరించపోతున్నారు, బేతంచెర్లలో ఆసుపత్రిలో రోగులకు పళ్ళ పంపిణి, అదే రోజు సాయంత్రం వందలాది మంది పురుషులు, మహిళలు, చిన్న పిల్లలలో మన సామాజికవర్గం ర్యాలీ కార్యక్రమం. ఇవె కాకుండా ఇంకా ఎన్నో చోట్ల నివాళులు అర్పించి వుండవచ్చు.. నా దృష్టికి వచ్చిన వాటిని మాత్రమే ప్రస్తావించాను.
కూసింత అయినా మంచి చెయ్యక పోతే ఆ పరమ శివుడి దయ ఉండదు అంటారు, అలాంటిది ఎన్నో గొప్ప లక్షణాలు ఉండబట్టే చనిపోయిన 37 ఏళ్ళ తరువాత కూడా ఆంధ్రరాష్ట్ర నలుమూలల ఇంకా ఇంకా స్మరించుకుంటూ, రంగ స్ఫూర్తి విగ్రహాల రూపంలో కనిపిస్తూనే వుంది. అధికార, విపక్షాల కూడా అందరు రంగాని తమవాడిగా భావిస్తూ, కనీసం అలా కనిపిస్తూ ఒక సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకోవాలి అని ఎన్నో దశాబ్దాలగా ప్రయత్నిస్తున్నారు.
అసలు ఎవరీ రంగా? తాను చనిపోయేనాటికి పుట్టని తన సామాజికవర్గం మనుషుల్లో కూడా ఎందుకీ ఆరాధన భావం. తానేమి తరతరాల దళితుల తలరాతని మార్చిన మహనీయుడు శ్రీ Dr బాబా సాహెబ్ అంబెడ్కర్ కాదు, పోనీ తన చరిష్మాతో ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించి, కమ్మ వారిని పూర్తి స్థాయి అధికార కులంగా మార్చిన శ్రీ ఎన్టీఆర్ కాదు, తన సామాజికవర్గంలో వందలమంది లీడర్స్ తయారు చేసి, అధికారం ద్వారా వేలకోట్లు తన సామాజికవర్గానికి పంచిన శ్రీ వైస్సార్ కాదు, వేలాది ఎకరాలు ప్రజలకి దానం చేసి, ప్రజల కోసం ప్రాణాలని గడ్డి పరకల్లా వదిలేసిన పాతతరం రాజకీయ యోధుడు కాదు.
విజయవాడ నగరంలో ప్రజల మనిషిగా, తన పరిధిమేరకు సమధర్మాన్ని, సమన్యాయాన్ని పాటించిన మనిషి. అందరికి అందుబాటులో వుంటూ నాయకత్వ లక్షణాలతో, క్షాత్రంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిన నాయకుడు. ఆ క్రమంలో వర్గవిభేదాలు, ఫ్యాక్షన్ వంటివి చోటు చేసుకున్నాయి. అవతలి వర్గంకి అధికారం తోడు అవ్వటంతో, శ్రీ రంగా కులాన్నీ ఆశ్రయించటం జరిగింది. ఇదంతా రాజకీయపరమైన ఎత్తుగడల్లో భాగంగా జరిగింది. ఇందులో తప్పు ఒప్పులు, మంచి చెడులు, న్యాయ అన్యాయాలు అని ఎవరిని తగ్గించటం, రంధ్రాన్వేషణ చెయ్యటం నా ఉద్దేశం కాదు.
హింస రాజకీయాల్లో అధికారం, సంపద వున్న వైరి వర్గంతో ఎదుర్కొనే ప్రక్రియలో భాగంగా కాపునాడు రూపంలో సమాజంలో అన్యాయంకి గురి అయ్యి అన్ని రకాలుగా వెనుకపడి ఒక్కో ఏరియాలో ఒక్క పేరుతో ఏ మాత్రం వర్గస్పృహ లేని, అత్యధికులు పేదరికంతో వుండే ఒక సమూహంలో ఐక్యత తీసుకు రావటం జరిగింది.
ఇదంతా 1988 లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన పరిణామాం, ప్రతి సంఘటనని తేదీలుతో సహా వివరించగలను కానీ అది అప్రస్తుతం. అధికారపరంగా నిరంతరం ప్రతిపక్షంలో వున్నా కూడా, ఎమ్మెల్యేగా రమారమి 45 నెలలు మాత్రమే ఉన్నప్పటికీ, ఆర్ధికంగా కూడా పరిమితులు ఉన్నప్పటికీ అద్వితీయమైన పోరాటపటిమ చూయించిన మనిషి, దానికి తోడు నిరాయుధుడై, ఆమరణ నిరాహారదీక్షలో వున్నా దారుణమైన హత్యగావించబడటంతో తరువాత జరిగిన హింస, ఆస్తుల ధ్వంసం, దహనకాండ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎప్పటికి మరవని ఒక చేదు జ్ఞాపకం..
ఒక కులాన్ని ఏకం చెయ్యటంలో శ్రీ రంగా గారి పాత్ర ఎప్పిటికి మరవలేనిది, అలాగే ఒకప్పడు ఒక కులానికి మాత్రమే పరిమితమైన శ్రీ రంగాని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీలు దండలు వేసి దండాలు పెట్టటానికి ప్రధాన కారణం ఎన్ని దశాబ్డాలు అయినా ఒక సామాజికవర్గం అచెంచలమైన, చెక్కుచెదరని విశ్వాసంతో శ్రీ వంగవీటి మోహన రంగారావుని తిరుగులేని నాయకుడుగా ప్రేమించటం. ఏ అధికార పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక అందడలు లేకున్నా, ఎలాంటి రాజకీయ పరమైన ప్రయోజనాలు ఆశించకుండా, విగ్రహావిష్కరణతో, అన్నదానాలతో జయంతులు, వర్ధంతులు చేస్తూనే వున్నారు.
ఈ సమాజాకివర్గంలో దశాబ్దాల తరబడి శ్రీ రంగా పట్ల వుండే అంకిత భావం సమాజం లో ఇతర సామాజిక వర్గాలు కూడా గౌరవించేలా చేసింది . శ్రీ బాబా సాహెబ్ అంబెడ్కర్, శ్రీ NTR, శ్రీ వైస్సార్ లకంటే, ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ఎక్కువ విగ్రహాలు పెట్టింది రాష్ట్రవ్యాప్తంగా వున్న, ఉత్తరాంధ్ర కాపులు, మధ్యాంధ్ర తెలగాలు, రాయలసీమ లో బలిజలుగా పిలవబడే ఈ సామాజికవర్గం. అలాగే ఈ సామాజిక వర్గం లో ఎంత వెనుకపాటుతనం వున్నా కూడ రాష్ట్రము నలుమూలల ఎక్కడకి అక్కడ ఐక్యత రావటానికి రంగా గారి ఇమేజ్ ఎంతో ఉపయోగపడింది.
అధికారం ద్వారా ఏమాత్రం మంచి జరిగిన కూడా విశ్వాసంతో వుండే జాతి. బ్యాంకులని వెల కోట్లు దోచేద్దామనో, ఎర్రచందనం రవాణా చేద్దాముఅనో, ఇసుక రీచ్లు పట్టేద్దాము అని, భూములు కబలిద్దామనో, లిక్కర్, గంజాయి లాంటి అక్రమ మార్గాల ద్వారా సంపద పోగెద్దాము అని కలలో కూడా వూహంచని మనుషులు, గొడ్డు కష్టం చేసుకుంటూ తమ పోషణ చేసుకునే మెజారిటీ కులం. వీళ్ళ అవసరాలు, ఆశలు చిన్నవి. కొద్దిపాటి లోన్లు, ట్రాన్స్ఫర్లు, కాలేజీ సీట్లు, రేషన్ కార్డులు, ఇల్ల స్థలాలు, పోలీస్ స్టేషన్లో ఒక మాట, కష్టంలో చిన్న ఊరట ఇలా చేసిన ఏ నాయకుడికి అయినా కాపు కాస్తారు.
వీళ్ళు కూడా పౌర సమాజంలో అంతర్భాగంగా భావించి, శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిత్తసుద్దితో చేయూతనందిస్తే, స్ఫూర్తి వంతమైన నాయకత్వం వహిస్తే, అంతకు పదింతలు తిరిగి ఇచ్ఛే సామాజికవర్గం అనటానికి ఉదాహరణ శ్రీ రంగా పేరుతో పెట్టిన వేల విగ్రహాలు.
Videos
Chittore | Hyderabad yellammaguda | Bethamcharla | Kankipadu | Gazuwaka | Gudiwada | Srikalahasti
by – Chillagattu Sreekanth Kumar
End
శ్రీ వంగవీటి మోహన రంగా – చరిత్ర రాసిన చెక్కు చెదరని సంతకం
శ్రీ వంగవీటి మోహన రంగా – చరిత్ర రాసిన చెక్కు చెదరని సంతకం. రంగ గారి గురించి చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్ గారి మాటల్లో…
Leave a Reply