తెలింగ అనేది కులపదము
త్రిలింగ పదమునుండి తిలింగ, తెలింగ, తెలుంగ, తెలంగాణా, తెలుగ, తెలుగు, తెలగ, తెలగాణ్యులు, తెలిరిగిరి మొదలగు పదాలు ఏర్పడినట్లు తెలుగు పండితులు, చరిత్రకారులు అంగీకరించారు. అలాగే తెలుంగన్, తెలుంగర్, తెలుంగతి పదాలు ఏర్పడ్డాయి. బర్మాలో తైలాంగ్, తలైంగ్ పదాలు ఏర్పడ్డాయి. టాలమి (రచయిత), ట్రెలింగాన్, టివిస్తాన్ అని తెలుగు పదము, తెలుగునాటి బలిజకాపులకు, తెలగాణ్యులు అనే పదము బ్రాహ్మణులకు, తెలగాణ్య నాయక (మెరక వీధి తెలగాలకు) తెలుగులు అంటే తెలుగు ప్రజలందరికి చెందిన జాతి వాచకము.
తెలింగ పదమునుండి ఏర్పడిన తెలుగు పదము బలిజ కాపులకు ఎందుకు వర్తించాలి? అనే సందేహము సహజము. తెలుగు నాట స్థిరపడిన తొలి నాగరికులు కావడం వలన, తొలి వ్యవసాయ నిపుణులు, రాజ్యపాలకులు, వ్యాపారులు కావడం వలన, అధిక జనబాహుళ్యము కలిగియుండుట వలన, తెలుగుదేశాన్ని ‘కాపు’ కాచి తెలగాలుగా పిలువ బడ్డారు.
మహారాష్ట్ర, ఒరిస్సా, గుజరాత్, బెంగాలి రాష్ట్రాలలో గూడా దేశ పదముతో పిలువబడే మరాఠీలు, ఓండ్రులు, గుజరాతీలు, బెంగాలీలు అనే ప్రత్యేక కులాలున్నాయి. వారు గూడా ఆయా రాష్ట్రములలో ప్రాచీన పాలక కులాలు. తెలింగ పదము ‘తెలగా’ లకు అన్వయించుట సమంజసమే.
- బహుజనపల్లి సీతారామచార్యులు “శబ్ద రత్నాకరం” నిఘంటువు పేజి 1195 ప్రకారం – త్రిలింగ పకృతిపదం కాగా, తెలగ వికృతి పదం. పకృతి, వికృతి సమానార్థాలు కావున త్రిలింగ పదములనుండి తెలింగ, తెలగ అను పదాలు పుట్టాయని గ్రహించాలి. తెలింగ రూపాంతరమే “తెలగ”.
- ఏటుకూరి బలరామమూర్తి “ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర” పేజి-5 లో ఇలావుంది. తెలుగు ప్రజల నివాస స్థలం మొదట రాయలసీమ, తర్వాత తెలంగాణా. ‘తెనుగు’ క్రమంగా తెలుగయ్యింది అందులోనుండి తెలగాలు, తెలంగాణా, తెలగాణ్యులు, తెలిరిగిరి మొదలగు పేర్లు ఏర్పడ్డాయి. దీనిని బట్టి త్రిలింగ, తెలింగ, తెలగ పదాలు సహ సంబంధం కలిగియున్నాయి.
- టి. భాస్కరరావు “తెలుగు భాషా చరిత్ర” పేజి 94 ప్రకారం ఇలా ఉంది. క్రీ.శ. 985 సం॥ రాజరాజు శాసనములో అతనికి “తెలింగ కులకాల” అను బిరుదు వున్నట్లు తెలుస్తుంది. ఇచట తెలింగ అనే పదము కులపరంగా ప్రయోగించారని నిర్ధారణ అయ్యింది ఆ తెలింగ పదము అని గ్రహించాలి. (కాబట్టి రాజరాజ చోళు డు తెలగ కులస్థుడని తెలుస్తుంది).
- లకంసాని చక్రధరరావు రచించిన “తెలుగు భాషా చరిత” (తెలుగు – ఎం. ఎ మెటీరియల్) పేజి 26 ప్రకారం త్రిలింగ పదమునుండి తెలుగ, తెలగ, తెలుంగ, తెలుగునాడు మున్నగు పదాలు పుట్టాయని తెలుస్తుంది. దీనిని బట్టి త్రిలింగ పదమునుండి తెలింగ పదం ఏర్పడి “తెలగ” గా రూపాంతరం చెందింది అని గ్రహించాలి. “రేప” లోపించి “ఇ” కారం “ఏ” కారంగా మారిందని కనుక త్రిలింగ తెలింగ అయినదని తెలిపారు.
- అంబటి వెంకటప్పయ్య ‘శ్రీకృష్ణ భారతం’ 8వ పేజిలోని పద్యము సంఖ్య-37 ప్రకారము “తుర్వసుని వంశీయులు అన్ని ప్రాంతాలలో వ్యాపించగా తెలుగు ప్రాంతమున నివాసము వున్నవారు మాత్రం ప్రాంతాన్ని బట్టి తెలగాలు అయ్యారని తెలిపారు. ఈ అంశాన్ని ఆ గ్రంథము అభిప్రాయములో కొండవీటి వెంకటకవి గారు అంగీకరించారు.
- ఏటుకూరి బలరామ మూర్తి “ఆంద్రుల సంక్షిప్త చరిత్ర” పేజి 91 ప్రకారం “వెలనాటిని పాలించిన వారిని వెలనాటి చోళులని, తదితరులను తెలుగు చోడులని చరిత్రకారులు వ్యవహరిస్తున్నారు. కాని వాస్తవానికి అందరూ ఒకే కుదురు నుండి ప్రారంభమైన చతుర్వర్ణ వంశస్థులే తప్ప వేరుకాదు. వీరందరికీ కాలక్రమేణా తెలగాలు లేక (బలిజ) కాపులు అను పేరు స్థిరపడింది.
- జె. దుర్గాప్రసాద్ “ఆంధ్రుల చరిత్ర” ప్రథమ భాగము పేజి 66, ప్రకారం క్రిష్ణానదికి దక్షిణముగా ఉన్న ప్రాంతం వెలనాడు, ఈ వెలనాడును పాలించిన చోడులు తాము ‘దుర్జయ కులజులమని’, చతుర్థాన్వయులమని, చెప్పుకున్నారు. వీరంతా శూద్రులే! కాలక్రమేణా వారంతా కాపు (తెలగ) లయ్యారు. ఇంకా పేజి 69, ప్రకారం తెలుగు భాషకు అధికారిక ప్రతిపత్తిని కల్పించి ప్రోత్సహించినది రేనాటి చోళులే! ఈ రేనాటి చోడ కుటుంబాలలో, పొత్తపికొణి దెన, నెల్లూరు చోళులు ముఖ్యంగా పరిగణించదగిన వారు. తెలుగు చోడులలో నన్నూరు చోడులని మరొక శాఖ కన్పిస్తుంది. (తెలుగు చోడులే తెలగాలు).
దీనినిబట్టి తెలగాలు, స్థానిక ప్రభువులని, తెలగాలు దక్షిణ భారతదేశ క్షత్రియ బలిజలు ఒకే వంశీయులని వీరు తెలుగు భాషా పోషకులని విశదమవుతుంది. కానీ తెలుగు ప్రాంతానికి, తెలగాలకు, తెలుగు భాషకు, ప్రత్యేక సంబంధముంది. వారు తెలుగు భూమిపుత్రులు, తొలి తెలుగు శాసనం “రేనాటి ధనుంజయ చోడునిదే” అని పరిశోదకు లంటారు.
త్రిలింగ పదం నుండి క్రమంగా ‘తిలింగ, తెలింగ, తెలంగ తెలగ రూపాలు ఏర్పడినవని గ్రహించాలి. కాపు, తెలగ, బలిజ, ఒంటరి అనువారు తెలగాలలో వేరు వృత్తులు చేస్తూ వివిధ ప్రాంతాల ఆ నామములతో పిలువబడే ఒకే కులస్థులు. ఆనాడు ఈనాడు వీరిమద్య నాడు నేడు వివాహ బంధుత్వాలున్నాయి అని గ్రహించాలి.
ఆంధ్రజ్యోతి దినపత్రిక – ఆర్.వి.ఆర్. నాయుడుగారు.
జెంటూ :
జెంటూ పదమునకు దేశీయము అనే అర్థమున్నది. పోర్చుగీసువారు ఆడుగు పెట్టినప్పుడు విజయనగర సామ్రాజ్యములో అధికంగా వ్యాప్తిలో ఉన్న తెలుగు భాషను దేశీయ భాషగా భావించి దానికి ‘జెంటూ’ అని వారు పేరుపెట్టి పిలిచారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంనాటి ఎ.పి. కాంపెబెల్ వ్రాసిన తెలుగు వ్యాకరణంలోకూడా “జెంటూ” పదము గూడా వాడబడింది. కాని తర్వాత ఆ పదం వాడుకనుండి తొలగిపోయింది. ప్రాచీన కాలములో ఆంధ్ర దేశానికి, ఆంధ్రపదం, ఆంధ్ర మండలం, ఆంధ్రభూమి, ఆంధ్రావని, త్రిలింగదేశం, తిలింగ, తెలంగాణా అనే పేర్లుండేవి. ఆంధ్ర భాషకు తెలుగు, తెనుగు, జెంటూ, ఆంధ్రం అనే పేర్లుండేవి. తమిళనాడులో బలిజలను ‘జెంటూ’ అని పిలిచేవారు.
డా॥ బి. ఆర్. అంబేద్కర్గారు నిచ్చెనమెట్ట కులవ్యవస్థను అర్థం చేసుకుంటేనే భారతదేశ చరిత్ర అర్థమవుతుంది. కులసంస్కృతులు సంపూర్ణ భారత చరిత్ర అధ్యయానికి రచనకు దారిదీపాలవుతాయి అని చెప్పారు.
తెలగాలు :
1927వ సంవత్సరం జూన్ నెల 16,17,18 తేదీలలో శ్రీముఖ లింగమున జరిపిన “కళింగ వర్థంతి” మహాసభా సమావేశమునకు ఆహ్వాన సంఘాధ్యక్షులగు శ్రీశ్రీ విక్రమదేవ వర్మ జయపుర మహారాజుగారు తమ ఆహ్వాన సంఘాధ్యక్షోపన్యాసము నిట్లునుడివిరి.
…కళింగరాజయిన చిత్రాంగదుని కూతురును దుర్యోధనుడు పెండ్లాడినట్లు మహాభారతమున శాంతిపర్వమున నున్నను, మీద ను దాహృతమైన “అంగ, వంగ, కళింగేషు” అను శ్లోకమును బట్టి కళింగదేశము పవిత్రమైనదనియు నందున యాదిమ వాసులు పతితులుగను, మ్లేచ్చులుగా నెన్నబడుచుండిరనియు దోపక మానదు. అట్టి యాదిమ వాసులలో “నోండ్రులు” అను నొక తెగ వారిప్పటికిని గలరు. వారు తెలివి గలిగిన కృషికులును, శూరులునై సర్వవిధముల “తెలగాలను” బోలియుందురు…… ఓండ్రులును బట్టి యోండ్ర దేశమేర్పడినట్లే “తెలగాలను” బట్టి తెలగనాడేర్పడినది.
కళింగదేశ చరిత్ర, శ్రీరాళ్లబండి సుబ్బారావుగారు
End
Telinga is a Caste
What is Telinga? How came Telaga caste name? Learn about Trilinga, Tilinga, Telinga, Telanga, Telaga caste names in telugu. అసలు తెలగ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోండి.
telaga caste history | telaga caste name history | telaga history telugu
Leave a Reply