విజయనగర మహాసామ్రాజ్య బలిజ క్షత్రియులు
BRITISH REPORT
Vide Glossary of caste & e, Page-144, cen- sus of India- 1901-Volume XV. Madras Part I, Report by W. Francis ESQ.IC.S)
Balija (10,08,036) m 10) This is the Chief Telugu Trading Caste and it is seattered through out all the districts of the Presidency it is said to have two main subdivisions Desa (or Kota) and Peta, The first of these includs those whose anee stors are supposed to have been the Balija Nayak Kings of Madhura, Tanjore and Vijayanagar or Provinsial Governors in those King-doms and to the second be long those like the gazulu (bangle sellers) and Perikasi (salt sellers) who live by trade in the Tamil Districts.
Balijas are known as Vadugans (Telugu people) and Kavarais, The descendants of the Nayak or Balija Kings of Madurai and Tanjore claim to be Kshatriyas and of the Kasyapa botra while Vijayanagara Rails say they are lineal descendants of the Baradwaja (Gotra) others trace their ancestry to the ‘Kawrawas’ of the Mahabharata, this Kshatriyas discant is not how ever admitted by other castes.
None of the members of the castes wear the “sacred thread” or follow the Vedicritual (L.R. 1891, Pera-458) Kurnool manuual Page-137, Buchanan’s Mysore & e, volume-P.O, 168170, Madura Manual Part II, Page-88. North arcot Manual – volume. IP.P-202-202
పై ఇంగ్లీషు రిపోర్టుకు అర్థం:
1901 సం॥ చెన్నపురి రాజధాని యందుండిన బలిజవారు 10,08,036. M.10) ఈ బలిజవారు ఈ చెన్నపురి (మద్రాసు) రాజదాని యందు గల అన్ని జిల్లాలలోనున్నారు. వీరిలో దేశ (కోట) బలిజ వారనియు, పేట బలిజ వారనియు ఇరు తెగల వారు ముఖ్యులు. ఈ రెండు తెగల వారిలోనూ, కోట బలిజవారు, మధుర, తంజావూరు, విజయ నగరము నేలిన బలిజ నాయక రాజ సంతతిలో చేరిన వారు, గాజుల బలిజ వారును, ఉప్పు వ్యాపారము చేయు పెరిక బలిజ వారును, పేట బలిజ తెగ వారిలో చేరినవారు.
అఱవ జిల్లాలలో (తమిళనాడు) బలిజ వారిని వడుగర్ (అనగా తెలుగు వారు) అనియును, కౌరవులు అనియును చెప్పెదరు. మధుర, తంజావూరు సంస్థానాధిపతులగు నాయక రాజులు లేక బలిజ రాజుల యొక్క సంతతి క్షత్రియ జాతిలో చేరిన కశ్యప గోత్రస్థులనియు, విజయనగర సింహాసనస్థులయిన “రాయలు వారు, భారద్వాజ గోత్రస్థులనియు చెప్పుచున్నారు. తక్కిన బలిజ వారు మహాభారతములో చెప్పబడిన కౌరవులు సంతతిలో చేరిన వారని చెప్పెదరు. ఇట్లు చెప్పినను ఇతరులు వీరిని క్షత్రియులు కాదని చెప్పెదరు.
ఈ జాతికి (కౌరవులు) చెందిన వారెవరును, ఇప్పుడు యజ్ఞోపవీతధారణము చేయుట లేదని, వేదోక్త కర్మము చేయుట లేదు. చక్కగా తెలియ గోరువారు, 1891 సం॥ జనగణిత రిపోర్టును, కర్నూలు చరిత్రము 137 వ॥ పుట యందును, బుచానన్ వ్రాసిన మైసూరు చరిత్ర-1, వ్యాల్యూం- 168-170, పుటలలోనూ, మధుర చరిత్రము-2వ భాగము 86 పుటలలోనూ, ఉత్తర ఆర్కాటు జిల్లా చరిత్ర 1, వ్యాల్యూం 20-23 పుటలలోనూ చదివి చూడవచ్చును అని వ్రాసియున్నారు.
Manual of the Madhura District
Most commonly manufacturers and sellers of Bangals made of a particular kind of earth found only in one or two parts district. Those engaged in this traffic usually cal themselves chettes merchants when other wise employed as spinners dyers painters and the like they talk the little of Nayakkan it is customary with these as other Nayakans to wear the secred thread.
అర్థం : మధురై జిల్లాలో (తమిళనాడు) గాజుల వ్యాపారము చేయు బలిజ కులస్థులకు, శెట్టి, నాయకన్ (నాయుడు) అను బిరుదులున్నాయి. వారు క్షత్రియ బలిజలు. కావున వారు యజ్ఞోపవీతము (జంధ్యం) ధరిస్తారు.
విజయనగర మహాసామ్రాజ్యము (బలిజకులం) :
విజయనగర మహాసామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని రాజ్యాలుగా విభజించి పరిపాలించేవారు ఈ రాజ్యాలతో మరలా పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న చిన్న ప్రాంతాలుగా విభజించి పరిపాలన చేసేవారు. అటువంటి రాజ్యాలలో తమిళనాడులో మధురై కేంద్రంగా “చోళరాజ్యం, చెంజి కేంద్రంగా తుండీర రాజ్యం ఉండేవి. వీటిపై విజయనగర సామ్రాట్టు నుండి గొప్ప గొప్ప సేనానాయక హెూదాలు పొందిన బలిజ కులస్థులు అధికారాలు చేజిక్కించుకున్నారు. వీటికి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో వారి రాజబంధువులు, సర్వసైన్యాధ్యక్షులు, ఆగర్భ శ్రీమంతుడు గొప్ప వ్యాపార కుటుంబీకుడు బలిజవర్ణం, కాశ్యప గోత్రికుడు అయిన శ్రీశ్రీశ్రీ గరికపాటి నాగమనాయకుడు గారు సొంత సైన్యాలు కలిగి, కప్పాలు వసూలు చేసుకునే అధికారం కలిగి ఉండేవారు. ఇతని కుమారుడు శ్రీశ్రీశ్రీ విశ్వనాథ నాయుడు గారు. పాండ్య, చోళ రాజ్యాలకు రాజుగా సింహాసన మధిష్టించి ఈ రాజ్యాలను చాలా జనరంజకంగా పరిపాలన చేసెను.
మధురై బలిజ నాయకరాజులకు దక్షిణ సింహాసనాధీశులు అని, విజయనగర మహాసామ్రాజ్యంలో చాలా గొప్ప గౌరవమున్నది. ఆరాజ్యంలో ఎన్నో దేవాలయాలు, చెరువులు అభివృద్ధి చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న చిన్న భాగాలుగా రాజ్యాన్ని విభజించెను. ఒక్కొక్క భాగానికి ఒక్కో పాలకుడిని నియమించెను. వాటినే పాళయాలు అనేవారు. వాటి పాలకులను పాలెగార్ అనేవారు. ఈ పాలెగార్లకు, గవర బలిజ (కవరైబలిజ) నాయకర్లు, తొట్టియన్ రాజకంభళ గొల్ల నాయకర్లు, మారవర్ నాయకర్లు, ఏకిలి నాయకర్లు, కమ్మ నాయకర్లు, పల్లి నాయకర్లు వంటి కులాల వారుండేవారు. వీరితో బలిజ రాజవంశకులస్తులకు ఎట్టి వైవాహిక సంబంధాలూ లేవు. బలిజలు వేరే కులాలలో వివాహాలు చేసుకోరు.
ఈ రాచబలిజ కులస్తులకు విజయనగర, మధురై, తంజావూరు, జింజి, ఖండి, చంద్రగిరి, పెనుగొండ, రాయదుర్గం, బేతారు, వ్యాసవారు, బాగలూరు, క్వాలెడి, కిట్టూరు, కోటబలిజ వంశాలతో సంబంధాలుండేవి. ఇతర కులస్థులతో బలిజ వారికి వైవాహిక సంబంధాలుండేవి కావు- బలిజలు రాజులుగా ఉన్నారు. రాజ సంతతివారయిన బలిజ బంధువులలోనే వివాహాలు చేసుకున్నారు. ఒకవేళ చేసుకున్నా వారి సంతతికి రాజ్యార్హత లేదు.. శ్రీలంకరాజు ఒక శూద్రస్త్రీని వివాహమాడిన స్త్రీకి పుట్టిన ఉనాంబవె బండారు నాయకి రాజ్యార్హత లేదు.
బలిజ కులస్తులైన మధుర నాయకరాజుల బంధువులెవరూ పాలెగాళ్లుగా ఉండడానికి ఇష్టత చూపేవాళ్ళు కాదు. ఎందుకంటే విజయనగరంలో వారి సామాజిక హెూదా అంతస్థు చాలా గొప్పగా ఉండేది. చాలామంది ధనికులు, నానా దేశాలలో అంతర్జాతీయ వ్యాపారాలు చేసేవారు. ఒక్కొక్క కుటుంబానికి సొంత సైన్యాలుండేవి, రాజబంధువులుగా హోదాను అనుభవిస్తూండేవారు. రాజ్యాల నుండి కప్పాలను వసూలు చేసుకునే అధికారం కలిగి యుండేవారు. మధురై రాజ్యములో రాజ్యాధీశులైన విశ్వనాథ నాయనింగారి కుటుంబం తర్వాత అంతటి పేరు సంపాదించింది.
వారి బంధువులైన బలిజ కులస్తులు, వడగరై సంస్థానాధీశులు వంశీయులు, శ్రీశ్రీశ్రీ రామభద్ర నాయనింగారి వంశం. వీరు మధుర రాజ్యంలోని 72 పాలెములకు అధికారి, సర్వసైన్యాధ్యక్షులుగా ఉండేవారు రాజ బంధువులయిన మరో బలిజ వంశం. సముఖం. వెంకట క్రిష్ణప్ప నాయనింగారి వంశీయులు, మరో బలిజవంశం, కాండీ రాజ్యాన్ని యేలినవారు, మరో బలిజ వంశం తంజావూరు నేలినవారు. మరో బలిజ వంశం జింజిని పాలించిన వంశం. మరో బలిజ వంశం కృష్ణగిరిని పాలించిన వంశం, వీరు కాకుండా “మాదూరు” ఏరియేడు అని మరో రెండు పాళయాలు బలిజ నాయకుల పాలనలో ఉండేవి మిగతా బలిజ కులస్థులందరూ సైన్యాధిపతులుగా ఉండేవారు. 200 వంశాలుగా ఉన్న కోటబలిజ కులస్తులు అని చెప్పుకునే బలిజ కులస్థులు తప్పితే, మరే కులం వారిని పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది లేదు – 72 పాళెములలో మొదటి నుండి విజయనగర సామ్రాజ్యంలో కొటికం నాగమ నాయకుని తోటి సైన్యములో వున్న కురబ గొల్లలకు, మధురై రాజు విశ్వనాథ నాయకుడు తన 72 పాలెములలో 29 పాలెములకు పాలెగార్లుగా నమ్మకస్థులైన వారిని నియమించాడు.
End
Vijayanagara Empire Balija Kshatriyas
the history of the Vijayanagara Empire and the Balija Kshatriyas, highlighting their role in shaping South India’s culture, politics, and military heritage.
Leave a Reply